మార్చి 3, 2026 చంద్ర గ్రహణం

ఈ చంద్ర గ్రహణం పుబ్బ లేదా పూర్వ ఫల్గుణి నక్షత్రం, సింహ రాశిలో సంభవిస్తుంది.

  1. సర్వకాలం:

    మధ్యాహ్నం 3:19 నిమిషాలకు ప్రారంభం.

  2. గ్రహణ సమయం:

    సాయంత్రం 4:33 నిమిషాల నుండి రాత్రి 6:46 నిమిషాల వరకు.

  3. గ్రహణ వీక్షణ సమయం:

    59 నిమిషాలు

గ్రహణ సమయంలో పాటించాల్సిన నియమాలు / దానాలు
అంశం నియమాలు / దానాలు
ఆహార నియమాలు గ్రహణానికి ముందే, అంటే ఆ రోజు మధ్యాహ్నం ఒంటి గంట లోపే భోజనం పూర్తి చేయాలి. గ్రహణం పూర్తయ్యాక స్నానం ఆచరించిన తర్వాతే అల్పాహారం తినాలి.
గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు నిద్రించకూడదు. బయట ఎక్కడికీ తిరగకుండా జాగ్రత్త వహించాలి.
జపము/ప్రార్థన గ్రహణ సమయంలో దైవ చింతన, ఇష్ట దైవ స్మరణ, స్తోత్రాలు, శ్లోకాలు పఠించాలి. ఆ సమయంలో చేసే అనుష్ఠానం మంచి ఫలితాలను ఇస్తుంది.
దానాలు (పుబ్బ నక్షత్రం & సింహ రాశి) సాధారణంగా గ్రహణ సమయం తరువాత సింహ రాశి వారు బియ్యం, తెల్లటి వస్త్రాలు, గోధుమలు, వెండి లేదా నెయ్యి వంటివి దానం చేయాలి.
దేవాలయ దర్శనం గ్రహణ సమయం తర్వాత ఆలయ సంప్రోక్షణ జరిగాక దర్శనం చేసుకోవచ్చు.
రాశి వారీగా గ్రహణ ఫలితాలు & పరిహారాలు
రాశిగ్రహణ ఫలితంపరిహారాలు / దానాలు
మేషంమాన (self-respect, dignity) నాశనంరాశ్యాధిపతి కుజుడు కావునా సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి, సుబ్రహ్మణ్యాష్టకం పఠించాలి. వీలైతే తెల్లని వస్త్రం దానం చేయాలి.
వృషభంసుఖంవృషభ రాశికి అధిపతి శుక్రుడు కావున అయన అధిష్ఠాన దేవత అయిన మహాలక్ష్మిని ఆరాధించాలి. శుభ ఫలములు కలుగుతాయి.
మిథునంలాభంమిథున రాశ్యాధిపతి బుధ గ్రహము. ఆ గ్రహానికి అధిష్టాన దేవత మహావిష్ణువు కాబట్టి ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రం జపము గ్రహణ సమయములో చేస్తే శుభ ఫలములు కలుగుతాయి. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము చేయాలి.
కర్కాటకంవ్యయంకర్కాటక రాశ్యాధిపతి చంద్ర గ్రహము. ఆ గ్రహానికి అధిష్టాన దేవత గౌరీ దేవి. ఓం గౌర్యై నమః అని గ్రహణ సమయంలో మీ శక్తి కొలది జపము చేయాలి. బియ్యం లేదా పాలు దానం చేయాలి.
సింహంఘాతం (చూడరాదు)సింహ రాశ్యాధిపతి సూర్యుడు గ్రహ తీక్షణత వీరికి ఎక్కువగా ఉంటుంది. కావున గ్రహణం పూర్తయ్యాక గోధుమలు దానం చేయాలి. ఓం నమః శివాయ లేదా ఓం సూర్యాయ నమః మంత్రాలను గ్రహణ సమయములో జపించవచ్చును.
కన్యహానికన్య రాశ్యాధిపతి బుధ గ్రహము. ఆ గ్రహానికి అధిష్టాన దేవత మహావిష్ణువు కాబట్టి ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రం జపము గ్రహణ సమయములో చేస్తే శుభ ఫలములు కలుగుతాయి. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము చేయాలి. పెసలు దానం చేయాలి.
తులఐశ్వర్య లాభంతుల రాశ్యాధిపతి శుక్రుడు కావున అయన అధిష్ఠాన దేవత అయిన మహాలక్ష్మిని ఆరాధించాలి. మహాలక్ష్యష్టకం పఠించాలి. వృషభ రాశికి అధిపతి శుక్రుడు కావున అయన అధిష్ఠాన దేవత అయిన మహాలక్ష్మిని ఆరాధించాలి.
వృశ్చికంవ్యధవృశ్చిక రాశ్యాధిపతి కుజుడు కావునా సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి, సుబ్రహ్మణ్యాష్టకం పఠించాలి. ఎర్రటి కందిపప్పు దానం ఇవ్వాలి.
ధనుస్సువ్యాకులతధనుస్సు రాశ్యాధిపతి గురు (బృహస్పతి) గ్రహము. దక్షిణామూర్తిని లేదా శిరిడీ సాయిబాబాను ఆరాధించాలి. శనగలు దానం ఇవ్వాలి.
మకరంసౌఖ్యంమకర రాశ్యాధిపతి శని కావునా శివారాధన చేయాలి లేదా ఆరాధించాలి. ఓం నమః శివాయ లేదా ఓం హనుమతే నమః జపము గ్రహణ సమయములో చేయాలి.
కుంభంస్త్రీ వలన కష్టంకుంభ రాశ్యాధిపతి శని కావునా ఓం నమః శివాయ లేదా ఓం హనుమతే నమః జపము గ్రహణ సమయములో చేయాలి. నువ్వులు దానం చేయాలి.
మీనంతీవ్ర కష్టాలుమీన రాశ్యాధిపతి గురు (బృహస్పతి) గ్రహము. దక్షిణామూర్తిని లేదా శిరిడీ సాయిబాబాను ఆరాధించాలి రుద్రాభిషేకం చేయాలి.
* గమనిక: పైన సమాచారం భక్తుల అవగాహన కోసం శాస్త్రం ప్రకారం కూర్చబడింది.