శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం పారాయణం
శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం
చూడటానికి క్లిక్ చేయండి (Click to expand)
నామ్నాం సాష్టసహస్రంచ బ్రూహి గార్గ్య మహామతే ।
మహాలక్ష్మ్యా మహాదేవ్యా భుక్తిముక్త్యర్థసిద్ధయే ।। 1 ।।
గార్గ్య ఉవాచ
సనత్కుమారమాసీనం ద్వాదశాదిత్యసన్నిభమ్ ।
అపృచ్ఛన్యోగినో భక్త్యా యోగినామర్థసిద్ధయే ।। 2 ।।
సర్వలౌకికకర్మభ్యో విముక్తానాం హితాయ వై ।
భుక్తిముక్తిప్రదం జప్యమనుబ్రూహి దయానిధే ।। 3 ।।
సనత్కుమార భగవన్సర్వజ్ఞోఽసి విశేషతః ।
ఆస్తిక్యసిద్ధయే నౄణాం క్షిప్రధర్మార్థసాధనమ్ ।। 4 ।।
ఖిద్యంతి మానవాస్సర్వే ధనాభావేన కేవలమ్ ।
సిద్ధ్యంతి ధనినోఽన్యస్య నైవ ధర్మార్థకామనాః ।। 5 ।।
దారిద్ర్యధ్వంసినీ నామ కేన విద్యా ప్రకీర్తితా ।
కేన వా బ్రహ్మవిద్యాఽపి కేన మృత్యువినాశినీ ।। 6 ।।
సర్వాసాం సారభూతైకా విద్యానాం కేన కీర్తితా ।
ప్రత్యక్షసిద్ధిదా బ్రహ్మన్ తామాచక్ష్వ దయానిధే ।। 7 ।।
సనత్కుమార ఉవాచ
సాధు పృష్టం మహాభాగాస్సర్వలోకహితైషిణః ।
మహతామేష ధర్మశ్చ నాన్యేషామితి మే మతిః ।। 8 ।।
బ్రహ్మవిష్ణుమహాదేవమహేంద్రాదిమహాత్మభిః ।
సంప్రోక్తం కథయామ్యద్య లక్ష్మీనామసహస్రకమ్ ।। 9 ।।
యస్యోచ్చారణమాత్రేణ దారిద్ర్యాన్ముచ్యతే నరః ।
కిం పునస్తజ్జపాజ్జాపీ సర్వేష్టార్థానవాప్నుయాత్ ।। 10 ।।
వినియోగం:
అస్య శ్రీలక్ష్మీదివ్యసహస్రనామస్తోత్రమహామంత్రస్య ఆనందకర్దమచిక్లీతేందిరాసుతాదయో మహాత్మానో మహర్షయః అనుష్టుప్ఛందః విష్ణుమాయా శక్తిః మహాలక్ష్మీః పరాదేవతా
శ్రీమహాలక్ష్మీ ప్రసాదద్వారా సర్వేష్టార్థసిద్ధ్యర్థే పారాయణే/అర్చనే/జపే వినియోగః ।
ధ్యానం - స్థాపన ముద్రా నమస్కారం:
రెండు చేతులను బోర్లించి (అరచేతులు కిందకు ఉండేలా), రెండు బొటనవేళ్లను లోపలికి మడిచి, మిగిలిన వేళ్లను ఒకదానితో ఒకటి కలిపి ఉంచడాన్ని 'స్థాపన ముద్ర' అంటారు.
పద్మనాభప్రియాం దేవీం పద్మాక్షీం పద్మవాసినీమ్ ।
పద్మవక్త్రాం పద్మహస్తాం వందే పద్మామహర్నిశమ్ ।। 1 ।।
పూర్ణేందువదనాం దివ్యరత్నాభరణభూషితామ్ ।
వరదాభయహస్తాఢ్యాం ధ్యాయేచ్చంద్రసహోదరీమ్ ।। 2 ।।
ఇచ్ఛారూపాం భగవతస్సచ్చిదానందరూపిణీమ్ ।
సర్వజ్ఞాం సర్వజననీం విష్ణువక్షస్స్థలాలయామ్ ।
దయాలుమనిశం ధ్యాయేత్సుఖసిద్ధిస్వరూపిణీమ్ ।। 3 ।।
అథ శ్రీమహాలక్ష్మీ సహస్రనామ స్తోత్రం
శ్రీ గురుభ్యో నమః హరి ఓం
నిత్యాగతానంతనిత్యా నందినీ జనరంజనీ ।
నిత్యప్రకాశినీ చైవ స్వప్రకాశస్వరూపిణీ ।। 1 ।।
మహాలక్ష్మీర్మహాకాలీ మహాకన్యా సరస్వతీ ।
భోగవైభవసంధాత్రీ భక్తానుగ్రహకారిణీ ।। 2 ।।
ఈశావాస్యా మహామాయా మహాదేవీ మహేశ్వరీ ।
హృల్లేఖా పరమా శక్తిర్మాతృకాబీజరూపిణీ ।। 3 ।।
నిత్యానందా నిత్యబోధా నాదినీ జనమోదినీ ।
సత్యప్రత్యయనీ చైవ స్వప్రకాశాత్మరూపిణీ ।। 4 ।।
త్రిపురా భైరవీ విద్యా హంసా వాగీశ్వరీ శివా ।
వాగ్దేవీ చ మహారాత్రిః కాలరాత్రిస్త్రిలోచనా ।। 5 ।।
భద్రకాళీ కరాళీ చ మహాకాళీ తిలోత్తమా ।
కాళీ కరాళవక్త్రాంతా కామాక్షీ కామదా శుభా ।। 6 ।।
చండికా చండరూపేశా చాముండా చక్రధారిణీ ।
త్రైలోక్యజయినీ దేవీ త్రైలోక్యవిజయోత్తమా ।। 7 ।।
సిద్ధలక్ష్మీః క్రియాలక్ష్మీర్మోక్షలక్ష్మీః ప్రసాదినీ ।
ఉమా భగవతీ దుర్గా చాంద్రీ దాక్షాయణీ శివా ।। 8 ।।
ప్రత్యంగిరా ధరావేలా లోకమాతా హరిప్రియా ।
పార్వతీ పరమా దేవీ బ్రహ్మవిద్యాప్రదాయినీ ।। 9 ।।
అరూపా బహురూపా చ విరూపా విశ్వరూపిణీ ।
పంచభూతాత్మికా వాణీ పంచభూతాత్మికా పరా ।। 10 ।।
కాళీ మా పంచికా వాగ్మీ హవిఃప్రత్యధిదేవతా ।
దేవమాతా సురేశానా దేవగర్భాఽంబికా ధృతిః ।। 11 ।।
సంఖ్యా జాతిః క్రియాశక్తిః ప్రకృతిర్మోహినీ మహీ ।
యజ్ఞవిద్యా మహావిద్యా గుహ్యవిద్యా విభావరీ ।। 12 ।।
జ్యోతిష్మతీ మహామాతా సర్వమంత్రఫలప్రదా ।
దారిద్ర్యధ్వంసినీ దేవీ హృదయగ్రంథిభేదినీ ।। 13 ।।
సహస్రాదిత్యసంకాశా చంద్రికా చంద్రరూపిణీ ।
గాయత్రీ సోమసంభూతిస్సావిత్రీ ప్రణవాత్మికా ।। 14 ।।
శాంకరీ వైష్ణవీ బ్రాహ్మీ సర్వదేవనమస్కృతా ।
సేవ్యదుర్గా కుబేరాక్షీ కరవీరనివాసినీ ।। 15 ।।
జయా చ విజయా చైవ జయంతీ చాఽపరాజితా ।
కుబ్జికా కాలికా శాస్త్రీ వీణాపుస్తకధారిణీ ।। 16 ।।
సర్వజ్ఞశక్తిశ్శ్రీశక్తిర్బ్రహ్మవిష్ణుశివాత్మికా ।
ఇడాపింగలికామధ్యమృణాలీతంతురూపిణీ ।। 17 ।।
యజ్ఞేశానీ ప్రథా దీక్షా దక్షిణా సర్వమోహినీ ।
అష్టాంగయోగినీ దేవీ నిర్బీజధ్యానగోచరా ।। 18 ।।
సర్వతీర్థస్థితా శుద్ధా సర్వపర్వతవాసినీ ।
వేదశాస్త్రప్రభా దేవీ షడంగాదిపదక్రమా ।। 19 ।।
శివా ధాత్రీ శుభానందా యజ్ఞకర్మస్వరూపిణీ ।
వ్రతినీ మేనకా దేవీ బ్రహ్మాణీ బ్రహ్మచారిణీ ।। 20 ।।
ఏకాక్షరపరా తారా భవబంధవినాశినీ ।
విశ్వంభరా ధరాధారా నిరాధారాఽధికస్వరా ।। 21 ।।
రాకా కుహూరమావాస్యా పూర్ణిమాఽనుమతిర్ద్యుతిః ।
సినీవాలీ శివాఽవశ్యా వైశ్వదేవీ పిశంగిలా ।। 22 ।।
పిప్పలా చ విశాలాక్షీ రక్షోఘ్నీ వృష్టికారిణీ ।
దుష్టవిద్రావిణీ దేవీ సర్వోపద్రవనాశినీ ।। 23 ।।
శారదా శరసంధానా సర్వశస్త్రస్వరూపిణీ ।
యుద్ధమధ్యస్థితా దేవీ సర్వభూతప్రభంజనీ ।। 24 ।।
అయుద్ధా యుద్ధరూపా చ శాంతా శాంతిస్వరూపిణీ ।
గంగా సరస్వతీవేణీయమునానర్మదాపగా ।। 25 ।।
సముద్రవసనావాసా బ్రహ్మాండశ్రోణిమేఖలా ।
పంచవక్త్రా దశభుజా శుద్ధస్ఫటికసన్నిభా ।। 26 ।।
రక్తా కృష్ణా సితా పీతా సర్వవర్ణా నిరీశ్వరీ ।
కాళికా చక్రికా దేవీ సత్యా తు వటుకాస్థితా ।। 27 ।।
తరుణీ వారుణీ నారీ జ్యేష్ఠాదేవీ సురేశ్వరీ ।
విశ్వంభరాధరా కర్త్రీ గళార్గళవిభంజనీ ।। 28 ।।
సంధ్యారాత్రిర్దివాజ్యోత్స్నా కలాకాష్ఠా నిమేషికా ।
ఉర్వీ కాత్యాయనీ శుభ్రా సంసారార్ణవతారిణీ ।। 29 ।।
కపిలా కీలికాఽశోకా మల్లికానవమల్లికా ।
దేవికా నందికా శాంతా భంజికా భయభంజికా ।। 30 ।।
కౌశికీ వైదికీ దేవీ సౌరీ రూపాధికాఽతిభా ।
దిగ్వస్త్రా నవవస్త్రా చ కన్యకా కమలోద్భవా ।। 31 ।।
శ్రీస్సౌమ్యలక్షణాఽతీతదుర్గా సూత్రప్రబోధికా ।
శ్రద్ధా మేధా కృతిః ప్రజ్ఞా ధారణా కాంతిరేవ చ ।। 32 ।।
శ్రుతిః స్మృతిర్ధృతిర్ధన్యా భూతిరిష్టిర్మనీషిణీ ।
విరక్తిర్వ్యాపినీ మాయా సర్వమాయాప్రభంజనీ ।। 33 ।।
మాహేంద్రీ మంత్రిణీ సింహీ చేంద్రజాలస్వరూపిణీ ।
అవస్థాత్రయనిర్ముక్తా గుణత్రయవివర్జితా ।। 34 ।।
ఈషణాత్రయనిర్ముక్తా సర్వరోగవివర్జితా ।
యోగిధ్యానాంతగమ్యా చ యోగధ్యానపరాయణా ।। 35 ।।
త్రయీశిఖా విశేషజ్ఞా వేదాంతజ్ఞానరూపిణీ ।
భారతీ కమలా భాషా పద్మా పద్మవతీ కృతిః ।। 36 ।।
గౌతమీ గోమతీ గౌరీ ఈశానా హంసవాహినీ ।
నారాయణీ ప్రభాధారా జాహ్నవీ శంకరాత్మజా ।। 37 ।।
చిత్రఘంటా సునందా శ్రీర్మానవీ మనుసంభవా ।
స్తంభినీ క్షోభిణీ మారీ భ్రామిణీ శత్రుమారిణీ ।। 38 ।।
మోహినీ ద్వేషిణీ వీరా అఘోరా రుద్రరూపిణీ ।
రుద్రైకాదశినీ పుణ్యా కల్యాణీ లాభకారిణీ ।। 39 ।।
దేవదుర్గా మహాదుర్గా స్వప్నదుర్గాఽష్టభైరవీ ।
సూర్యచంద్రాగ్నిరూపా చ గ్రహనక్షత్రరూపిణీ ।। 40 ।।
బిందునాదకళాతీతా బిందునాదకళాత్మికా ।
దశవాయుజయాకారా కళాషోడశసంయుతా ।। 41 ।।
కాశ్యపీ కమలాదేవీ నాదచక్రనివాసినీ ।
మృడాధారా స్థిరా గుహ్యా దేవికా చక్రరూపిణీ ।। 42 ।।
అవిద్యా శార్వరీ భుంజా జంభాసురనిబర్హిణీ ।
శ్రీకాయా శ్రీకలా శుభ్రా కర్మనిర్మూలకారిణీ ।। 43 ।।
ఆదిలక్ష్మీర్గుణాధారా పంచబ్రహ్మాత్మికా పరా ।
శ్రుతిర్బ్రహ్మముఖావాసా సర్వసంపత్తిరూపిణీ ।। 44 ।।
మృతసంజీవనీ మైత్రీ కామినీ కామవర్జితా ।
నిర్వాణమార్గదా దేవీ హంసినీ కాశికా క్షమా ।। 45 ।।
సపర్యా గుణినీ భిన్నా నిర్గుణా ఖండితాశుభా ।
స్వామినీ వేదినీ శక్యా శాంబరీ చక్రధారిణీ ।। 46 ।।
దండినీ ముండినీ వ్యాఘ్రీ శిఖినీ సోమసంహతిః ।
చింతామణిశ్చిదానందా పంచబాణప్రబోధినీ ।। 47 ।।
బాణశ్రేణిస్సహస్రాక్షీ సహస్రభుజపాదుకా ।
సంధ్యావలిస్త్రిసంధ్యాఖ్యా బ్రహ్మాండమణిభూషణా ।। 48 ।।
వాసవీ వారుణీసేనా కుళికా మంత్రరంజనీ ।
జితప్రాణస్వరూపా చ కాంతా కామ్యవరప్రదా ।। 49 ।।
మంత్రబ్రాహ్మణవిద్యార్థా నాదరూపా హవిష్మతీ ।
ఆథర్వణిః శ్రుతిః శూన్యా కల్పనావర్జితా సతీ ।। 50 ।।
సత్తాజాతిః ప్రమాఽమేయాఽప్రమితిః ప్రాణదా గతిః ।
అవర్ణా పంచవర్ణా చ సర్వదా భువనేశ్వరీ ।। 51 ।।
త్రైలోక్యమోహినీ విద్యా సర్వభర్త్రీ క్షరాఽక్షరా ।
హిరణ్యవర్ణా హరిణీ సర్వోపద్రవనాశినీ ।। 52 ।।
కైవల్యపదవీరేఖా సూర్యమండలసంస్థితా ।
సోమమండలమధ్యస్థా వహ్నిమండలసంస్థితా ।। 53 ।।
వాయుమండలమధ్యస్థా వ్యోమమండలసంస్థితా ।
చక్రికా చక్రమధ్యస్థా చక్రమార్గప్రవర్తినీ ।। 54 ।।
కోకిలాకులచక్రేశా పక్షతిః పంక్తిపావనీ ।
సర్వసిద్ధాంతమార్గస్థా షడ్వర్ణావరవర్జితా ।। 55 ।।
శరరుద్రహరా హంత్రీ సర్వసంహారకారిణీ ।
పురుషా పౌరుషీ తుష్టిస్సర్వతంత్రప్రసూతికా ।। 56 ।।
అర్ధనారీశ్వరీ దేవీ సర్వవిద్యాప్రదాయినీ ।
భార్గవీ యాజుషీవిద్యా సర్వోపనిషదాస్థితా ।। 57 ।।
వ్యోమకేశాఖిలప్రాణా పంచకోశవిలక్షణా ।
పంచకోశాత్మికా ప్రత్యక్పంచబ్రహ్మాత్మికా శివా ।। 58 ।।
జగజ్జరాజనిత్రీ చ పంచకర్మప్రసూతికా ।
వాగ్దేవ్యాభరణాకారా సర్వకామ్యస్థితాస్థితిః ।। 59 ।।
అష్టాదశచతుష్షష్ఠిపీఠికా విద్యయా యుతా ।
కాళికాకర్షణశ్యామా యక్షిణీ కిన్నరేశ్వరీ ।। 60 ।।
కేతకీ మల్లికాఽశోకా వారాహీ ధరణీ ధ్రువా ।
నారసింహీ మహోగ్రాస్యా భక్తానామార్తినాశినీ ।। 61 ।।
అంతర్బలా స్థిరా లక్ష్మీర్జరామరణనాశినీ ।
శ్రీరంజితా మహాకాయా సోమసూర్యాగ్నిలోచనా ।। 62 ।।
అదితిర్దేవమాతా చ అష్టపుత్రాఽష్టయోగినీ ।
అష్టప్రకృతిరష్టాష్టవిభ్రాజద్వికృతాకృతిః ।। 63 ।।
దుర్భిక్షధ్వంసినీ దేవీ సీతా సత్యా చ రుక్మిణీ ।
ఖ్యాతిజా భార్గవీ దేవీ దేవయోనిస్తపస్వినీ ।। 64 ।।
శాకంభరీ మహాశోణా గరుడోపరిసంస్థితా ।
సింహగా వ్యాఘ్రగా దేవీ వాయుగా చ మహాద్రిగా ।। 65 ।।
అకారాదిక్షకారాంతా సర్వవిద్యాధిదేవతా ।
మంత్రవ్యాఖ్యాననిపుణా జ్యోతిశ్శాస్త్రైకలోచనా ।। 66 ।।
ఇడాపింగళికామధ్యాసుషుమ్నా గ్రంథిభేదినీ ।
కాలచక్రాశ్రయోపేతా కాలచక్రస్వరూపిణీ ।। 67 ।।
వైశారదీ మతిశ్శ్రేష్ఠా వరిష్ఠా సర్వదీపికా ।
వైనాయకీ వరారోహా శ్రోణివేలా బహిర్వలిః ।। 68 ।।
జంభినీ జృంభిణీ జంభకారిణీ గణకారికా ।
శరణీ చక్రికాఽనంతా సర్వవ్యాధిచికిత్సకీ ।। 69 ।।
దేవకీ దేవసంకాశా వారిధిః కరుణాకరా ।
శర్వరీ సర్వసంపన్నా సర్వపాపప్రభంజనీ ।। 70 ।।
ఏకమాత్రా ద్విమాత్రా చ త్రిమాత్రా చ తథాఽపరా ।
అర్ధమాత్రా పరా సూక్ష్మా సూక్ష్మార్థాఽర్థపరాఽపరా ।। 71 ।।
ఏకవీరా విశేషాఖ్యా షష్ఠీదేవీ మనస్వినీ ।
నైష్కర్మ్యా నిష్కలాలోకా జ్ఞానకర్మాధికా గుణా ।। 72 ।।
సబంధ్వానందసందోహా వ్యోమాకారాఽనిరూపితా ।
గద్యపద్యాత్మికా వాణీ సర్వాలంకారసంయుతా ।। 73 ।।
సాధుబంధపదన్యాసా సర్వౌకో ఘటికావలిః ।
షట్కర్మా కర్కశాకారా సర్వకర్మవివర్జితా ।। 74 ।।
ఆదిత్యవర్ణా చాపర్ణా కామినీ వరరూపిణీ ।
బ్రహ్మాణీ బ్రహ్మసంతానా వేదవాగీశ్వరీ శివా ।। 75 ।।
పురాణన్యాయమీమాంసాధర్మశాస్త్రాగమశ్రుతా ।
సద్యోవేదవతీ సర్వా హంసీ విద్యాధిదేవతా ।। 76 ।।
విశ్వేశ్వరీ జగద్ధాత్రీ విశ్వనిర్మాణకారిణీ ।
వైదికీ వేదరూపా చ కాలికా కాలరూపిణీ ।। 77 ।।
నారాయణీ మహాదేవీ సర్వతత్త్వప్రవర్తినీ ।
హిరణ్యవర్ణరూపా చ హిరణ్యపదసంభవా ।। 78 ।।
కైవల్యపదవీ పుణ్యా కైవల్యజ్ఞానలక్షితా ।
బ్రహ్మసంపత్తిరూపా చ బ్రహ్మసంపత్తికారిణీ ।। 79 ।।
వారుణీ వారుణారాధ్యా సర్వకర్మప్రవర్తినీ ।
ఏకాక్షరపరాఽఽయుక్తా సర్వదారిద్ర్యభంజినీ ।। 80 ।।
పాశాంకుశాన్వితా దివ్యా వీణావ్యాఖ్యాక్షసూత్రభృత్ ।
ఏకమూర్తిస్త్రయీమూర్తిర్మధుకైటభభంజినీ ।। 81 ।।
సాంఖ్యా సాంఖ్యవతీ జ్వాలా జ్వలంతీ కామరూపిణీ ।
జాగ్రతీ సర్వసంపత్తిస్సుషుప్తా స్వేష్టదాయినీ ।। 82 ।।
కపాలినీ మహాదంష్ట్రా భ్రుకుటీ కుటిలాననా ।
సర్వావాసా సువాసా చ బృహత్యష్టిశ్చ శక్వరీ ।। 83 ।।
ఛందోగణప్రతిష్ఠా చ కల్మాషీ కరుణాత్మికా ।
చక్షుష్మతీ మహాఘోషా ఖడ్గచర్మధరాఽశనిః ।। 84 ।।
శిల్పవైచిత్ర్యవిద్యోతా సర్వతోభద్రవాసినీ ।
అచింత్యలక్షణాకారా సూత్రభాష్యనిబంధనా ।। 85 ।।
సర్వవేదార్థసంపత్తిస్సర్వశాస్త్రార్థమాతృకా ।
అకారాదిక్షకారాంతసర్వవర్ణకృతస్థలా ।। 86 ।।
సర్వలక్ష్మీస్సదానందా సారవిద్యా సదాశివా ।
సర్వజ్ఞా సర్వశక్తిశ్చ ఖేచరీరూపగోచ్ఛ్రితా ।। 87 ।।
అణిమాదిగుణోపేతా పరా కాష్ఠా పరా గతిః ।
హంసయుక్తవిమానస్థా హంసారూఢా శశిప్రభా ।। 88 ।।
భవానీ వాసనాశక్తిరాకృతిస్థాఖిలాఽఖిలా ।
తంత్రహేతుర్విచిత్రాంగీ వ్యోమగంగావినోదినీ ।। 89 ।।
వర్షా చ వార్షికా చైవ ఋగ్యజుస్సామరూపిణీ ।
మహానదీనదీపుణ్యాఽగణ్యపుణ్యగుణక్రియా ।। 90 ।।
సమాధిగతలభ్యార్థా శ్రోతవ్యా స్వప్రియా ఘృణా ।
నామాక్షరపరా దేవీ ఉపసర్గనఖాంచితా ।। 91 ।।
నిపాతోరుద్వయీజంఘా మాతృకా మంత్రరూపిణీ ।
ఆసీనా చ శయానా చ తిష్ఠంతీ ధావనాధికా ।। 92 ।।
లక్ష్యలక్షణయోగాఢ్యా తాద్రూప్యగణనాకృతిః ।
సైకరూపా నైకరూపా సేందురూపా తదాకృతిః ।। 93 ।।
సమాసతద్ధితాకారా విభక్తివచనాత్మికా ।
స్వాహాకారా స్వధాకారా శ్రీపత్యర్ధాంగనందినీ ।। 94 ।।
గంభీరా గహనా గుహ్యా యోనిలింగార్ధధారిణీ ।
శేషవాసుకిసంసేవ్యా చపలా వరవర్ణినీ ।। 95 ।।
కారుణ్యాకారసంపత్తిః కీలకృన్మంత్రకీలికా ।
శక్తిబీజాత్మికా సర్వమంత్రేష్టాక్షయకామనా ।। 96 ।।
ఆగ్నేయీ పార్థివా ఆప్యా వాయవ్యా వ్యోమకేతనా ।
సత్యజ్ఞానాత్మికాఽఽనందా బ్రాహ్మీ బ్రహ్మ సనాతనీ ।। 97 ।।
అవిద్యావాసనా మాయాప్రకృతిస్సర్వమోహినీ ।
శక్తిర్ధారణశక్తిశ్చ చిదచిచ్ఛక్తియోగినీ ।। 98 ।।
వక్త్రారుణా మహామాయా మరీచిర్మదమర్దినీ ।
విరాట్ స్వాహా స్వధా శుద్ధా నీరూపాస్తిస్సుభక్తిగా ।। 99 ।।
నిరూపితాద్వయీవిద్యా నిత్యానిత్యస్వరూపిణీ ।
వైరాజమార్గసంచారా సర్వసత్పథదర్శినీ ।। 100 ।।
జాలంధరీ మృడానీ చ భవానీ భవభంజనీ ।
త్రైకాలికజ్ఞానతంతుస్త్రికాలజ్ఞానదాయినీ ।। 101 ।।
నాదాతీతా స్మృతిః ప్రజ్ఞా ధాత్రీరూపా త్రిపుష్కరా ।
పరాజితావిధానజ్ఞా విశేషితగుణాత్మికా ।। 102 ।।
హిరణ్యకేశినీ హేమబ్రహ్మసూత్రవిచక్షణా ।
అసంఖ్యేయపరార్ధాంతస్వరవ్యంజనవైఖరీ ।। 103 ।।
మధుజిహ్వా మధుమతీ మధుమాసోదయా మధుః ।
మాధవీ చ మహాభాగా మేఘగంభీరనిస్వనా ।। 104 ।।
బ్రహ్మవిష్ణుమహేశాదిజ్ఞాతవ్యార్థవిశేషగా ।
నాభౌ వహ్నిశిఖాకారా లలాటే చంద్రసన్నిభా ।। 105 ।।
భ్రూమధ్యే భాస్కరాకారా సర్వతారాకృతిర్హృది ।
కృత్తికాదిభరణ్యంతనక్షత్రేష్ట్యార్చితోదయా ।। 106 ।।
గ్రహవిద్యాత్మికా జ్యోతిర్జ్యోతిర్విన్మతిజీవికా ।
బ్రహ్మాండగర్భిణీ బాలా సప్తావరణదేవతా ।। 107 ।।
వైరాజోత్తమసామ్రాజ్యా కుమారకుశలోదయా ।
బగళా భ్రమరాంబా చ శివదూతీ శివాత్మికా ।। 108 ।।
మేరువింధ్యాదిసంస్థానా కాశ్మీరపురవాసినీ ।
యోగనిద్రా మహానిద్రా వినిద్రా రాక్షసాశ్రితా ।। 109 ।।
సువర్ణదా మహాగంగా పంచాఖ్యా పంచసంహతిః ।
సుప్రజాతా సువీరా చ సుపోషా సుపతిశ్శివా ।। 110 ।।
సుగృహా రక్తబీజాంతా హతకందర్పజీవికా ।
సముద్రవ్యోమమధ్యస్థా సమబిందుసమాశ్రయా ।। 111 ।।
సౌభాగ్యరసజీవాతుస్సారాసారవివేకదృక్ ।
త్రివల్యాదిసుపుష్టాంగా భారతీ భరతాశ్రితా ।। 112 ।।
నాదబ్రహ్మమయీవిద్యా జ్ఞానబ్రహ్మమయీపరా ।
బ్రహ్మనాడీ నిరుక్తిశ్చ బ్రహ్మకైవల్యసాధనమ్ ।। 113 ।।
కాలికేయమహోదారవీర్యవిక్రమరూపిణీ ।
వడవాగ్నిశిఖావక్త్రా మహాకవలతర్పణా ।। 114 ।।
మహాభూతా మహాదర్పా మహాసారా మహాక్రతుః ।
పంజభూతమహాగ్రాసా పంచభూతాధిదేవతా ।। 115 ।।
సర్వప్రమాణా సంపత్తిస్సర్వరోగప్రతిక్రియా ।
బ్రహ్మాండాంతర్బహిర్వ్యాప్తా విష్ణువక్షోవిభూషిణీ ।। 116 ।।
శాంకరీ విధివక్త్రస్థా ప్రవరా వరహేతుకీ ।
హేమమాలా శిఖామాలా త్రిశిఖా పంచలోచనా ।। 117 ।।
సర్వాగమసదాచారమర్యాదా యాతుభంజనీ ।
పుణ్యశ్లోకప్రబంధాఢ్యా సర్వాంతర్యామిరూపిణీ ।। 118 ।।
సామగానసమారాధ్యా శ్రోత్రకర్ణరసాయనమ్ ।
జీవలోకైకజీవాతుర్భద్రోదారవిలోకనా ।। 119 ।।
తటిత్కోటిలసత్కాంతిస్తరుణీ హరిసుందరీ ।
మీననేత్రా చ సేంద్రాక్షీ విశాలాక్షీ సుమంగళా ।। 120 ।।
సర్వమంగళసంపన్నా సాక్షాన్మంగళదేవతా ।
దేహహృద్దీపికా దీప్తిర్జిహ్వపాపప్రణాశినీ ।। 121 ।।
అర్ధచంద్రోల్లసద్దంష్ట్రా యజ్ఞవాటీవిలాసినీ ।
మహాదుర్గా మహోత్సాహా మహాదేవబలోదయా ।। 122 ।।
డాకినీడ్యా శాకినీడ్యా సాకినీడ్యా సమస్తజుట్ ।
నిరంకుశా నాకివంద్యా షడాధారాధిదేవతా ।। 123 ।।
భువనజ్ఞానినిశ్శ్రేణీ భువనాకారవల్లరీ ।
శాశ్వతీ శాశ్వతాకారా లోకానుగ్రహకారిణీ ।। 124 ।।
సారసీ మానసీ హంసీ హంసలోకప్రదాయినీ ।
చిన్ముద్రాలంకృతకరా కోటిసూర్యసమప్రభా ।। 125 ।।
సుఖప్రాణిశిరోరేఖా సదదృష్టప్రదాయినీ ।
సర్వసాంకర్యదోషఘ్నీ గ్రహోపద్రవనాశినీ ।। 126 ।।
క్షుద్రజంతుభయఘ్నీ చ విషరోగాదిభంజనీ ।
సదాశాంతా సదాశుద్ధా గృహచ్ఛిద్రనివారిణీ ।। 127 ।।
కలిదోషప్రశమనీ కోలాహలపురస్థితా ।
గౌరీ లాక్షణికీ ముఖ్యా జఘన్యాకృతివర్జితా ।। 128 ।।
మాయా విద్యా మూలభూతా వాసవీ విష్ణుచేతనా ।
వాదినీ వసురూపా చ వసురత్నపరిచ్ఛదా ।। 129 ।।
ఛాందసీ చంద్రహృదయా మంత్రస్వచ్ఛందభైరవీ ।
వనమాలా వైజయంతీ పంచదివ్యాయుధాత్మికా ।। 130 ।।
పీతాంబరమయీ చంచత్కౌస్తుభా హరికామినీ ।
నిత్యా తథ్యా రమా రామా రమణీ మృత్యుభంజనీ ।। 131 ।।
జ్యేష్ఠా కాష్ఠా ధనిష్ఠాంతా శరాంగీ నిర్గుణప్రియా ।
మైత్రేయా మిత్రవిందా చ శేష్యశేషకలాశయా ।। 132 ।।
వారాణసీవాసరతా చార్యావర్తజనస్తుతా ।
జగదుత్పత్తిసంస్థానసంహారత్రయకారణమ్ ।। 133 ।।
త్వమంబ విష్ణుసర్వస్వం నమస్తేఽస్తు మహేశ్వరి ।
నమస్తే సర్వలోకానాం జనన్యై పుణ్యమూర్తయే ।। 134 ।।
సిద్ధలక్ష్మీర్మహాకాళి మహలక్ష్మి నమోఽస్తు తే ।
సద్యోజాతాదిపంచాగ్నిరూపా పంచకపంచకమ్ ।। 135 ।।
యంత్రలక్ష్మీర్భవత్యాదిరాద్యాద్యే తే నమో నమః ।
సృష్ట్యాదికారణాకారవితతే దోషవర్జితే ।। 136 ।।
జగల్లక్ష్మీర్జగన్మాతర్విష్ణుపత్ని నమోఽస్తు తే ।
నవకోటిమహాశక్తిసముపాస్యపదాంబుజే ।। 137 ।।
కనత్సౌవర్ణరత్నాఢ్య సర్వాభరణభూషితే ।
అనంతానిత్యమహిషీప్రపంచేశ్వరనాయకి ।। 138 ।।
అత్యుచ్ఛ్రితపదాంతస్థే పరమవ్యోమనాయకి ।
నాకపృష్ఠగతారాధ్యే విష్ణులోకవిలాసిని ।। 139 ।।
వైకుంఠరాజమహిషి శ్రీరంగనగరాశ్రితే ।
రంగనాయకి భూపుత్రి కృష్ణే వరదవల్లభే ।। 140 ।।
కోటిబ్రహ్మాదిసంసేవ్యే కోటిరుద్రాదికీర్తితే ।
మాతులుంగమయం ఖేటం సౌవర్ణచషకం తథా ।। 141 ।।
పద్మద్వయం పూర్ణకుంభం కీరంచ వరదాభయే ।
పాశమంకుశకం శంఖం చక్రం శూలం కృపాణికామ్ ।। 142 ।।
ధనుర్బాణౌ చాక్షమాలాం చిన్ముద్రామపి బిభ్రతీ ।
అష్టాదశభుజే లక్ష్మీర్మహాష్టాదశపీఠగే ।। 143 ।।
భూమినీలాదిసంసేవ్యే స్వామిచిత్తానువర్తిని ।
పద్మే పద్మాలయే పద్మి పూర్ణకుంభాభిషేచితే ।। 144 ।।
ఇందిరేందిందిరాభాక్షి క్షీరసాగరకన్యకే ।
భార్గవి త్వం స్వతంత్రేచ్ఛా వశీకృతజగత్పతిః ।। 145 ।।
మంగళం మంగళానాం త్వం దేవతానాం చ దేవతా ।
త్వముత్తమోత్తమానాం చ త్వం శ్రేయః పరమామృతమ్ ।। 146 ।।
ధనధాన్యాభివృద్ధిశ్చ సార్వభౌమసుఖోచ్ఛ్రయా ।
ఆందోళికాదిసౌభాగ్యం మత్తేభాదిమహోదయః ।। 147 ।।
పుత్రపౌత్రాభివృద్ధిశ్చ విద్యాభోగబలాదికమ్ ।
ఆయురారోగ్యసంపత్తిరష్టైశ్వర్యం త్వమేవ హి ।। 148 ।।
పరమేశవిభూతిశ్చ సూక్ష్మాత్సూక్ష్మతరాగతిః ।
సదయాపాంగసందత్తబ్రహ్మేంద్రాదిపదస్థితిః ।। 149 ।।
అవ్యాహతమహాభాగ్యం త్వమేవాక్షోభ్యవిక్రమః ।
సమన్వయశ్చ వేదానామవిరోధస్త్వమేవ హి ।। 150 ।।
నిఃశ్రేయసపదప్రాప్తిసాధనం ఫలమేవ చ ।
శ్రీమంత్రరాజరాజ్ఞీ చ శ్రీవిద్యా క్షేమకారిణీ ।। 151 ।।
శ్రీంబీజజపసంతుష్టా ఐం హ్రీం శ్రీం బీజపాలికా ।
ప్రపత్తిమార్గసులభా విష్ణుప్రథమకింకరీ ।। 152 ।।
క్లీంకారార్థసవిత్రీ చ సౌమంగళ్యాధిదేవతా ।
శ్రీషోడశాక్షరీవిద్యా శ్రీయంత్రపురవాసినీ ।। 153 ।।
సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే ।
శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోఽస్తు తే ।। 154 ।।
పునః పునర్నమస్తేఽస్తు సాష్టాంగమయుతం పునః ।
సనత్కుమార ఉవాచ
ఏవం స్తుతా మహాలక్ష్మీర్బ్రహ్మరుద్రాదిభిస్సురైః ।
నమద్భిరార్తైర్దీనైశ్చ నిస్స్వత్వైర్భోగవర్జితైః ।। 1 ।।
జ్యేష్ఠా జుష్టైశ్చ నిశ్శ్రీకైస్సంసారాత్స్వపరాయణైః ।
విష్ణుపత్నీ దదౌ తేషాం దర్శనం దృష్టితర్పణమ్ ।। 2 ।।
శరత్పూర్ణేందుకోట్యాభధవళాపాంగవీక్షణైః ।
సర్వాన్సత్త్వసమావిష్టాన్ చక్రే హృష్టా వరం దదౌ ।। 3 ।।
మహాలక్ష్మీరువాచ
నామ్నాం సాష్టసహస్రం మే ప్రమాదాద్వాపి యస్సకృత్ ।
కీర్తయేత్తత్కులే సత్యం వసామ్యాచంద్రతారకమ్ ।। 4 ।।
కిం పునర్నియమాజ్జప్తుర్మదేకశరణస్య చ ।
మాతృవత్సానుకంపాహం పోషకీ స్యామహర్నిశమ్ ।। 5 ।।
మన్నామ స్తవతాం లోకే దుర్లభం నాస్తి చింతితమ్ ।
మత్ప్రసాదేన సర్వేఽపి స్వస్వేష్టార్థమవాప్స్యథ ।। 6 ।।
లుప్తవైష్ణవధర్మస్య మద్వ్రతేష్వవకీర్ణినః ।
భక్తిప్రపత్తిహీనస్య వంద్యో నామ్నాం స్తవోఽపి మే ।। 7 ।।
తస్మాదవశ్యం తైర్దోషైర్విహీనః పాపవర్జితః ।
జపేత్సాష్టసహస్రం మే నామ్నాం ప్రత్యహమాదరాత్ ।। 8 ।।
సాక్షాదలక్ష్మీపుత్రోఽపి దుర్భాగ్యోఽప్యలసోఽపి వా ।
అప్రయత్నోఽపి మూఢోఽపి వికలః పతితోఽపి చ ।। 9 ।।
అవశ్యం ప్రాప్నుయాద్భాగ్యం మత్ప్రసాదేన కేవలమ్ ।
స్పృహేయమచిరాద్దేవా వరదానాయ జాపినః ।
దదామి సర్వమిష్టార్థం లక్ష్మీతి స్మరతాం ధ్రువమ్ ।। 10 ।।
సనత్కుమార ఉవాచ
ఇత్యుక్త్వాఽంతర్దధే లక్ష్మీర్వైష్ణవీ భగవత్కలా ।
ఇష్టాపూర్తం చ సుకృతం భాగధేయం చ చింతితమ్ ।। 11 ।।
స్వం స్వం స్థానం చ భోగం చ విజయం లేభిరే సురాః ।
తదేతత్ ప్రవదామ్యద్య లక్ష్మీనామసహస్రకమ్ ।
యోగినః పఠత క్షిప్రం చింతితార్థానవాప్స్యథ ।। 12 ।।
గార్గ్య ఉవాచ
సనత్కుమారోయోగీంద్ర ఇత్యుక్త్వా స దయానిధిః ।
అనుగృహ్య యయౌ క్షిప్రం తాంశ్చ ద్వాదశయోగినః ।। 13 ।।
తస్మాదేతద్రహస్యం చ గోప్యం జప్యం ప్రయత్నతః ।
అష్టమ్యాం చ చతుర్దశ్యాం నవమ్యాం భృగువాసరే ।। 14 ।।
పౌర్ణమాస్యామమాయాం చ పర్వకాలే విశేషతః ।
జపేద్వా నిత్యకార్యేషు సర్వాన్కామానవాప్నుయాత్ ।। 15 ।।
ఇతి శ్రీస్కందపురాణే సనత్కుమారసంహితాయాం లక్ష్మీసహస్రనామస్తోత్రం।