మన భారతీయ జ్యోతిష్య శాస్త్రం మరియు పురాణం ఆగమాల ప్రకారం, మానవ జీవితంలోని సుఖ-దుఃఖాలు, లాభ-నష్టాలూ జయాపజయాలు గ్రహాల స్థితిగతులపై ఆధారపడి ఉంటాయి. ఈ 'నవగ్రహ సంపూర్ణ మార్గదర్శిని' లో మన దేవతా మంత్ర పాఠకుల కొరకు ప్రతి గ్రహానికి సంబంధించిన ఖచ్చితమైన వివరాలను ఇక్కడ పొందుపరచడమైనది.
ఇందులో గ్రహాల సంచార సమయం, గ్రహాల శుభ-అశుభ స్థానాలు, వాటికి ప్రీతికరమైన వస్త్రం, ధాన్యం, మరియు హోమ సమిధల వివరాలను పొందుపరిచాము. అంతేకాకుండా, గ్రహ దోష నివారణకు అత్యంత ఆవశ్యకమైన మూల, బీజ, గాయత్రీ మరియు వేద మంత్రాలనూ, వాటి జప-హోమ సంఖ్యలతో శాస్త్రోక్తముగా వివరించడమైనది.
ప్రతి గ్రహానికి అధిపతిగా ఉండే అధిదేవత, ప్రత్యధి దేవతల ఆరాధన మంత్రములూ వాటి క్రమముతో పాటు, ఆయా గ్రహములు ఇచ్చే విశేష ఫలితాలను తెలుసుకోవడం ద్వారా మీరు మీ జీవితంలో గ్రహాల అనుకూలతకు సంబంధించిన అనుష్ఠానం చేసి శుభ ఫలితాలను పొందవచ్చును.
సూర్యుడు
గ్రహ సంచారం: 30 రోజులు
గ్రహ సంచారం: 30 రోజులు
శుభ స్థానములు: 3,6,10,11
అశుభ స్థానములు: 1,2,4,5,7,8,9,12
ఆసనము: వర్తులము/వృత్తము
Click For More >>
దిశ: మధ్యలో
వాహనం: ఏడు గుర్రాల రథం
రాశ్యాధిపత్యం: సింహం
నక్షత్రాధిపత్యం: కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ
వస్త్రం: ఎరుపు
ధాన్యం: గోధుమలు
రత్నం: కెంపు
లోహం: బంగారం / రాగి
వేలు: ఉంగరపు వేలు
మూల మంత్రం: ఓం (హ్రీం) సూర్యాయ నమః
బీజ మంత్రం: ఓం హ్రాం హ్రీం హ్రౌం సః సూర్యాయ నమః
శ్లోకం: జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిమ్ । తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరమ్ ।।
సూర్య గాయత్రీ మంత్రం: ఓం భాస్కరాయ విద్మహే మహాద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్ ।।
వేద మంత్రం: ఆకృష్ణేన రజసా వర్తమానో నివేశయన్నమృతం మర్త్యంచ । హిరణ్యయేన సవితా రథేనా దేవో యాతి భువనాని పశ్యన్ ।।
అధిదేవత (అగ్ని): అగ్నిందూతం వృణీమహే హోతారం విశ్వవేదసమ్ । అస్య యజ్ఞస్య సుక్రతుమ్ ।।
ప్రత్యధి దేవత (రుద్రుడు): కద్రుద్రాయ ప్రచేతసే మీఢుష్టమాయ తవ్యసే । వోచేమ శంతమగ్ం హృదే ।।
జప సంఖ్య: 6000
హోమ సమిధ: జిల్లేడు
హోమ సంఖ్య: 600
విశేషం: ఆత్మవిశ్వాసం, మంచి ఆరోగ్యం, తండ్రి ఆస్తి, ప్రభుత్వ ఉద్యోగం, కీర్తి ప్రతిష్ఠలు, నాయకత్వ లక్షణాలను ప్రసాదిస్తాడు.
చంద్రుడు
గ్రహ సంచారం: 2.5 రోజులు
శుభ స్థానములు: 1,3,6,7,10,11
అశుభ స్థానములు: 2,4,5,8,9,12
ఆసనము: సమ చతురస్త్రము
Click For More >>
దిశ: సూర్యుడికి ఆగ్నేయంలో
వాహనం: ముత్యపు వర్ణ గుర్రాలు/జింక
రాశ్యాధిపత్యం: కర్కాటకం
నక్షత్రాధిపత్యం: రోహిణి, హస్త, శ్రవణం
వస్త్రం: తెల్లని వస్త్రం
ధాన్యం: బియ్యం (వడ్లు)
రత్నం: ముత్యం
లోహం: వెండి
వేలు: చిటికెన వేలు
మూల మంత్రం: ఓం శ్రాం శ్రీం శ్రౌం సః చంద్రాయ నమః
బీజ మంత్రం: ఓం హ్రాం హ్రీం హ్రౌం సః సూర్యాయ నమః
శ్లోకం: దధిశంఖ తుషారాభం క్షీరోదార్ణవ సంభవమ్ । నమామి శశినం సోమం శంభోర్మకుట భూషణమ్ ।।
చంద్ర గాయత్రీ మంత్రం: ఓం క్షీరపుత్రాయ విద్మహే అమృత తత్త్వాయ ధీమహి తన్నో చంద్రః ప్రచోదయాత్ ।।
వేద మంత్రం: ఆప్యాయస్వ సమేతు తే విశ్వత సోమ వృష్టియమ్ । భవా వాజస్య సంగథే ।।
అధిదేవత (అపః - జలం): అప్సుమే సోమో అబ్రవీదంతర్విశ్వాని భేషజా । అగ్నించ విశ్వశంభువ మాపశ్చ విశ్వభేషజీః ।।
ప్రత్యధి దేవత (గౌరి): గౌరీ మిమాయ సలిలాని తక్షత్యేకపదీ ద్విపదీ సా చతుష్పదీ । అష్టాపదీ నవపదీ బభూవుషీ సహస్రాక్షరా పరమే వ్యోమన్ ।।
జప సంఖ్య: 10,000
హోమ సమిధ: మోదుగ
హోమ సంఖ్య: 1000
విశేషం: మానసిక ధైర్యం, నిలకడగా ఉండే తత్త్వం, సున్నిత స్వభావం, తల్లి ప్రేమ, సృజనాత్మక శక్తిని ప్రసాదిస్తాడు.
కుజుడు
గ్రహ సంచారం: 45 రోజులు
శుభ స్థానములు: 3,6,10,11
అశుభ స్థానములు: 1,2,4,7,8,12
ఆసనము: త్రికోణం
Click For More >>
దిశ: సూర్యుడికి దక్షిణంలో
వాహనం: పొట్టేలు
రాశ్యాధిపత్యం: మేషం, వృశ్చికం
నక్షత్రాధిపత్యం: మృగశిర, చిత్త, ధనిష్ఠ
వస్త్రం: ఎరుపు రంగు వస్త్రం
ధాన్యం: కందులు
రత్నం: పగడం
లోహం: బంగారం / రాగి
వేలు: ఉంగరపు వేలు
మూల మంత్రం: ఓం (అం) అంగారకాయ నమః
బీజ మంత్రం: ఓం క్రాం క్రీం క్రౌం సః భౌమాయ నమః
కుజ గాయత్రీ మంత్రం : ఓం తత్పురుషాయ విద్మహే । అంగారకాయ ధీమహి తన్నో భౌమ ప్రచోదయాత్ ।।
శ్లోకం: ధరణీగర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభమ్ । కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహమ్ ।।
వేద మంత్రం: అగ్నిర్మూర్ధా దివః కకుత్పతిః పృథివ్యా అయమ్ । అపాగ్ రేతాగ్ం సి జిన్వతి ।।
అధిదేవత (భూమి): స్యోనా పృథివి భవాన్ ఒకృక్షరా నివేశనీ । యచ్ఛానః శర్మ సప్రథాః ।।
ప్రత్యధి దేవత (క్షేత్రపాలకుడు): క్షేత్రస్య పతినా వయగ్ం హితేనేవ జయామసి । గామశ్వం పోషయిత్న్వా స నో మృడాతీదృశే ।।
జప సంఖ్య: 7,000
హోమ సమిధ: చండ్ర
హోమ సంఖ్య: 700
విశేషం: శరీర దృఢత్వం, ధైర్యం, భూమికి సంబంధించిన ఆస్తులు, సోదరుల సహకారం, పట్టుదలను ప్రసాదిస్తాడు.
బుధుడు
గ్రహ సంచారం: 30 రోజులు
శుభ స్థానములు: 2,4,6,8,10,11
అశుభ స్థానములు: 1,3,5,7,9,12
ఆసనము: బాణము
Click For More >>
దిశ: సూర్యుడికి ఈశాన్యంలో
వాహనం: సింహం/గుర్రం
రాశ్యాధిపత్యం: మిథునం, కన్య
నక్షత్రాధిపత్యం: ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి
వస్త్రం: ఆకుపచ్చ
ధాన్యం: పెసలు
రత్నం: పచ్చ
లోహం: బంగారం
వేలు: చిటికెన వేలు
మూల మంత్రం: ఓం (బుం) బుధాయ నమః
బీజ మంత్రం: ఓం బ్రాం బ్రీం బ్రౌం సః బుధాయ నమః
బుధ గాయత్రీ మంత్రం: ఓం సోమ పుత్రాయ విద్మహే । బుద్ధి ప్రదాయ ధీమహి తన్నో సౌమ్య ప్రచోదయాత్ ।।
శ్లోకం: ప్రియంగు కలికాశ్యామం రూపేణాప్రతిమం బుధమ్ । సౌమ్యం సౌమ్యగుణోపేతం తం బుధం ప్రణమామ్యహమ్ ।।
వేద మంత్రం: ఉద్బుధ్యస్వాగ్నే ప్రతి జాగృహి త్వమిష్టాపూర్తే సగ్ం సృజేథామయం చ । పునఃకృ॒ణ్వగ్గ్‍స్త్వా పితరం యువానమన్వాతాగ్ం సీత్వయితంతు మేతమ్! ।।
అధిదేవత (విష్ణువు): ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిదధే పదమ్ । సమూఢమస్యపాగ్ం సురే ।।
ప్రత్యధి దేవత (నారాయణుడు): సహస్రశీర్షా పురుషః సహస్రాక్షః సహస్రపాత్ । స భూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ఠద్దశాంగులమ్ ।।
జప సంఖ్య: 17,000
హోమ సమిధ: ఉత్తరేణి
హోమ సంఖ్య: 1700
విశేషం: అద్భుతమైన తెలివితేటలు, హాస్య ప్రవృత్తి, వ్యాపారలో అదృష్టం, గణితం, చక్కటి భావవ్యక్తీకరణ ఇస్తాడు.
గురుడు-బృహస్పతి
>గ్రహ సంచారం: ఒక సంవత్సరం
శుభ స్థానములు: 2,5,7,9,11
అశుభ స్థానములు: 1,3,4,6,8,10,12
ఆసనము: దీర్ఘ చతురస్రం
Click For More >>
దిశ: సూర్యుడికి ఉత్తరంలో
వాహనం: ఏనుగు
రాశ్యాధిపత్యం: ధనుస్సు, మీనం
నక్షత్రాధిపత్యం: పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర
వస్త్రం: పసుపు రంగు వస్త్రం
ధాన్యం: శనగలు
రత్నం: కనక పుష్యరాగం
లోహం: బంగారం
వేలు: చూపుడు వేలు
మూల మంత్రం: ఓం( బృం) బృహస్పతయే నమః
బీజ మంత్రం: ఓం గ్రాం గ్రీం గ్రౌం సః గురవే నమః / ఓం హ్రాం హ్రీం హ్రౌం సః బృహస్పతయే నమః
బృహస్పతి గాయత్రీ మంత్రం: ఓం ఆచార్యాయ విద్మహే । సర్వజ్ఞాయ ధీమహి తన్నో బృహస్పతి ప్రచోదయాత్ ।।
శ్లోకం: దేవానాంచ మునీనాంచ గురుం కాంచన సన్నిభమ్ । బుద్ధిభూతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిమ్ ।।
వేద మంత్రం: బృహస్పతే అతి యదర్యో అర్హాద్ద్యుమద్విభాతి క్రతుమజ్జనేషు । యద్దీదయచ్ఛవస సర్తప్రజాత తదస్మాసు ద్రవిణం ధేహి చిత్రమ్ ।।
అధిదేవత (బ్రహ్మాణం): బ్రహ్మ జజ్ఞానం ప్రథమం పురస్తాద్వి సీమతస్సురుచో వేన ఆవః । స బుధ్నియా ఉపమా అస్య విష్ఠాస్సతశ్చ యోనిమసతశ్చ వివః ।।
ప్రత్యధి దేవత (ఇంద్రుడు): ఇంద్రం వో విశ్వత స్పరిహవామహే జనేభ్యః అస్మాక మస్తు కేవలః ।।
జప సంఖ్య: 16,000
హోమ సమిధ: రావి
హోమ సంఖ్య: 1600
విశేషం: అదృష్టం, ఉన్నత విద్య, మంచి సంతానం, ధన లాభం, గౌరవం, ఆధ్యాత్మికత, వివాహ భాగ్యం ఇస్తాడు.
శుక్రుడు
గ్రహ సంచారం: 30 రోజులు
శుభ స్థానములు: 1,2,3,4,5,8,9,11
అశుభ స్థానములు: 6,7,10,12
ఆసనము: పంచకోణం
Click For More >>
దిశ: సూర్యుడికి తూర్పు దిశలో
వాహనం: తెల్ల గుర్రం
రాశ్యాధిపత్యం: వృషభం, తుల
నక్షత్రాధిపత్యం: భరణి, పుబ్బ, పూర్వాషాఢ
వస్త్రం: తెల్లని వస్త్రం
ధాన్యం: బొబ్బర్లు
రత్నం: వజ్రం
లోహం: వెండి / ప్లాటినం
వేలు: మధ్య వేలు / చిటికెన వేలు
మూల మంత్రం: ఓం (శుం) శుక్రాయ నమః
బీజ మంత్రం: ఓం ద్రాం ద్రీం ద్రౌం సః శుక్రాయ నమః
శుక్ర గాయత్రీ మంత్రం: ఓం అసురాచార్యాయ విద్మహే । సౌఖ్య ప్రదాయ ధీమహి తన్నో శుక్ర ప్రచోదయాత్ ।।
శ్లోకం: హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురుమ్ । సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహమ్ ।।
వేద మంత్రం: శుక్రం తే అన్యద్యజ తంతే అన్యద్విషురూపే అహనీ ద్యౌరి వాసి। విశ్వాహి మాయా అవసి స్వథావో భద్రా తే పూషన్నిహ రాతి రస్తు ।।
అధిదేవత (ఇంద్రాణి): ఇంద్రాణీమాసు నారిషు సుపత్నీ మహమశ్రవమ్ । న హ్యస్యా అపరంచన జరసా మరతే పతిః ।।
ప్రత్యధి దేవత (ఇంద్ర మరుత్వంతం): ఇంద్రమరుత్వ ఇహ పాహి సోమం యథా శార్యాతే అపిబః సుతస్య । తవ ప్రణీతీ తవ శూరశర్మన్నావివాసంతి కవయః సుయజ్ఞాః ।।
జప సంఖ్య: 20000
హోమ సమిధ: మేడి
హోమ సంఖ్య: 2000
విశేషం: ప్రేమ బంధం, అందం, వాహనాలు, ఇల్లు, కళలపై ఆసక్తి, విలాస జీవితం, వైవాహిక సుఖం ఇస్తాడు.
శని
గ్రహ సంచారం: 2.5 సంవత్సరాలు
శుభ స్థానములు: 3,6,11
అశుభ స్థానములు: 1,2,4,5,7,8,9,10,12
ఆసనము: ధనుస్సు
Click For More >>
దిశ: సూర్యుడికి పశ్చిమ దిశలో
వాహనం: కాకి
రాశ్యాధిపత్యం: మకరం, కుంభం
నక్షత్రాధిపత్యం: పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర
వస్త్రం: నలుపు/నీలం వస్త్రం
ధాన్యం: నల్ల నువ్వులు
రత్నం: నీలం
లోహం: పంచలోహాలు / ఇనుము
వేలు: మధ్య వేలు
మూల మంత్రం: ఓం (శం) శనైశ్చరాయ నమః /ఓం (శం) శనయే నమః
బీజ మంత్రం: ఓం ఖ్రాం ఖ్రీం ఖ్రౌం సః శనైశ్చరాయ (శనయే) నమః
శని గాయత్రీ మంత్రం: ఓం నీలాంబరాయ విద్మహే । సూర్య పుత్రాయ ధీమహి తన్నో సౌరి ప్రచోదయాత్ ।।
శ్లోకం: నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజమ్ । ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరమ్ ।।
వేద మంత్రం: శమగ్నిరగ్నిభిస్కర శ్చన్నస్తపతు సూర్యః । శం వాతో వాత్యరపా అప స్రిధః ।।
అధిదేవత (యముడు): యమాయ సోమగ్ం సునుత యమాయ జుహుతా హవిః । యమగ్ం హ యజ్ఞో గచ్ఛత్యగ్నిదూతో అరకృతః ।।
ప్రత్యధి దేవత (ప్రజాపతి): ప్రజాపతే న త్వదేతాన్యో విశ్వా జాతాని పరితా బభూవ । యత్కామాస్తే జుహుమస్తన్నో అస్తు వయగ్ం స్యామ పతయో రయీణామ్ ।।
జప సంఖ్య: 19000
హోమ సమిధ: జమ్మి
హోమ సంఖ్య: 1900
విశేషం: ఆయుష్షు, ఉద్యోగం, తప్పులకు శిక్షించుట, ఓపిక, లోతైన జ్ఞానం, కష్టపడే తత్వం ఇస్తాడు.
రాహు
గ్రహ సంచారం: 18 నెలలు (వక్ర గతి)
శుభ స్థానములు: 3,6,10,11
అశుభ స్థానములు:
1,2,4,5,7,8,9,12
ఆసనము: శుర్ప
Click For More >>
దిశ: సూర్యుడికి నైరుతి దిశలో
వాహనం: సింహం
నక్షత్రాధిపత్యం: ఆర్ద్ర, స్వాతి, శతభిషం
వస్త్రం: మసి/పొగ రంగు(ash grey) వస్త్రం
ధాన్యం: మినుములు
రత్నం: గోమేధికం
లోహం: వెండి / పంచలోహాలు
వేలు: మధ్య వేలు
మూల మంత్రం: ఓం (రాం) రాహవే నమః
బీజ మంత్రం: ఓం భ్రాం భ్రీం భ్రౌం సః రాహవే నమః
రాహు గాయత్రీ మంత్రం: ఓం సింహికా పుత్రాయ విద్మహే । సర్ప రూపాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్ ।।
శ్లోకం: అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనమ్ । సింహికాగర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహమ్ ।।
వేద మంత్రం: కయా నశ్చిత్ర ఆభువదూతీ సదావృధః సఖా । కయా శచిష్ఠయా వృతా ।।
అధిదేవత (అంగా): ఆయంగౌః పృశ్నిరక్రమీదసనన్ మాతరం పునః । పితరంచ ప్రయన్ త్సువః ।।
ప్రత్యధి దేవత (సర్పములు): నమో అస్తు సర్పేభ్యో యే కే చ పృథివీమను । యే అంతరిక్షే యే దివి తేభ్యః సర్పేభ్యో నమః ।।
జప సంఖ్య: 18,000
హోమ సమిధ: గరిక
హోమ సంఖ్య: 1800
విశేషం: ఆకస్మిక ధనలాభం, విదేశీయానం, రాజకీయాల్లో విజయం, సాంకేతిక పరిజ్ఞానం ఇస్తాడు.
కేతు
గ్రహ సంచారం: 18 నెలలు (వక్ర గతి)
శుభ స్థానములు: 3,6,10,11
అశుభ స్థానములు:
1,2,4,5,7,8,9,12
ఆసనము: ధ్వజ
Click For More >>
దిశ: సూర్యుడికి వాయువ్య దిశలో
వాహనం: గద్ద
నక్షత్రాధిపత్యం: అశ్విని, మఖ, మూల
వస్త్రం: చిత్రవర్ణ (మల్టీ కలర్) వస్త్రం
ధాన్యం: ఉలవలు
రత్నం: వైడూర్యం
లోహం: వెండి
వేలు: మధ్య వేలు
మూల మంత్రం: ఓం కేతవే నమః/ ఓం ఐం హ్రీం కేతవే నమః
బీజ మంత్రం: ఓం ప్రాం ప్రీం ప్రౌం సః కేతవే నమః
కేతు గాయత్రీ మంత్రం: ఓం ఛాయాగ్రహాయ విద్మహే। సింహికా పుత్రాయ ధీమహి తన్నో కేతు ప్రచోదయాత్ ।।
వేద మంత్రం: కేతుం కృణ్వన్న కేతవే పేశో మర్యా అపేశసే । సముషద్భిరజాయథాః ।।
అధిదేవత (చిత్రగుప్తుడు): సచిత్ర చిత్రమ్ చితయంతమస్మే చిత్రక్షత్ర చిత్రతమం వయోధామ్ । చంద్రం రయిం పురువీరం బృహంతం చంద్ర చంద్రాభిర్గృణతే యువస్వ ।।
ప్రత్యధి దేవత (బ్రహ్మాణం): బ్రహ్మా దేవానాం పదవీః కవీనామృషిర్విప్రాణాం మహిషో మృగాణామ్ । శ్యేనో గృధ్రాణాగ్ స్వధితిర్వనానాగ్ సోమః పవిత్రమత్యేతి రేభన్ ।।
జప సంఖ్య: 7,000
హోమ సమిధ: దర్భ
హోమ సంఖ్య: 700
విశేషం: ఆధ్యాత్మిక చింతన, వైరాగ్యం, జ్ఞానం, మంత్ర సాధన,మోక్షం, వైద్య శాస్త్ర ప్రజ్ఞ.
ఓం ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో॒ నమ: ।।
ఆదిత్యాది నవగ్రహ దేవతా ప్రసాదేన, జాతక చక్ర అరిష్ట స్థానేషు అత్యంతానుకూల్యతా ఫల సిద్ధిరస్తు ।।
ఓం శాంతిః శాంతిః శాంతిః ।।
గమనిక:
ఈ పట్టిక పంచాంగము ఆధారముగా రూపొందించబడినది. వ్యక్తిగత జాతకం, తారా, చంద్ర, గురు బలములు, గ్రహ దోషాలు వంటివి పరిగణనలోకి తీసుకోని నిర్ణయించడము మంచిది.