పంచామృత స్నాన మంత్రాలు
క్షీరం (పాలు): ఆప్యా॑యస్వ॒ సమే॑తు తే వి॒శ్వత॑స్సోమ॒ వృష్ణి॑యమ్। భవా॒ వాజ॑స్య సంగ॒థే।। శ్రీ …….…….…….(*౧) దేవతాభ్యో నమః క్షీరేణ స్నపయామి। (దైవాన్ని హృదయపూర్వకంగా పాలతో అభిషేకించాలి.) దధిపెరుగు): ద॒ధి॒క్రావ్ణ్ణో॑ అకారిషం జి॒ష్ణోరశ్వ॑స్య వా॒జినః॑ । సు॒రభి నో॒ ముఖా॑ కర॒త్ప్రణ॒ ఆయూగ్ం॑షి తారిషత్ ।। శ్రీ …….…….…….(*౧) దేవతాభ్యో నమః దధ్నా స్నపయామి । (దైవాన్ని హృదయపూర్వకంగా పెరుగుతో అభిషేకించాలి.) ఆజ్యంనెయ్యి): శు॒క్రమ॑సి॒ జ్యోతి॑రసి॒ తేజో॑సి దే॒వోవ॑స్సవి॒తోత్పు॑నా॒ త్వచ్ఛి॑ద్రేణ ప॒విత్రే॑ణ॒ వసో॒స్సూర్య॑స్య ర॒శ్మిభిః॑ । శ్రీ …….…….…….(*౧) దేవతాభ్యో నమః ఆజ్యేన స్నపయామి । (దైవాన్ని హృదయపూర్వకంగా నెయ్యితో అభిషేకించాలి.) మధుతేనే): మధు॒వాతా॑ ఋతాయ॒తే మధు॑క్షరంతి॒ సింధ॑వః । మాధ్వీ᳚ర్నః సం॒త్వోష॑ధీః । మధు॒ నక్త॑ము॒తోష॑సి॒ మధు॑మ॒త్పార్థి॑వ॒గ్ం॒ రజః॑ । మధు॒ద్యౌర॑స్తు నః పి॒తా । మధు॑మాన్నో॒ వన॒స్పతి॒ర్మధు॑మాగ్‍ం అస్తు॒ సూర్యః॑ । మాధ్వీ॒ర్గావో॑ భవంతు నః ।। శ్రీ …….…….…….(*౧) దేవతాభ్యో నమః మధునా స్నపయామి। (దైవాన్ని హృదయపూర్వకంగా తేనెతో అభిషేకించాలి.) శర్కర (శర్కర): స్వా॒దుః ప॑వస్వ ది॒వ్యాయ॒ జన్మ॑నే । స్వా॒దురింద్రా॑య సు॒హవీ॑తు॒ నామ్నే᳚ । స్వా॒దుర్మి॒త్రాయ॒ వరు॑ణాయ వా॒యవే॒ । బృహ॒స్పత॑యే॒ మధు॑మా॒గ్ం అదా᳚భ్యః ।। శ్రీ …….…….…….(*౧) దేవతాభ్యో నమః శర్కరయా స్నపయామి । (దైవాన్ని హృదయపూర్వకంగా శర్కరతో అభిషేకించాలి.) ఫలోదకం (కొబ్బరికాయ): యాః ఫ॒లినీ॒ర్యా అ॑ఫ॒లా అ॑పు॒ష్పాయాశ్చ॑ పు॒ష్పిణీః᳚ । బృహ॒స్పతి॑ ప్రసూతా॒స్తానో॑ ముంచం॒త్వగ్ం హ॑సః ।। శ్రీ …….…….…….(*౧) దేవతాభ్యో నమః ఫలోదకేన స్నపయామి । (దైవాన్ని హృదయపూర్వకంగా కొబ్బరి నీరుతో అభిషేకించాలి.) శుద్ధోదకస్నానం (కలశ జలము): ఆపో॒ హిష్ఠా మ॑యో॒భువ॒స్తా న॑ ఊ॒ర్జే ద॑ధాతన। మ॒హేరణా॑య॒ చక్ష॑సే। యోవః॑ శి॒వత॑మో రస॒స్తస్య॑ భాజయతే॒ హ నః॑। ఉ॒శ॒తీరి॑వ మా॒త॑రః। తస్మా॒ అరం॑గమామవో॒ యస్య॒ క్షయా॑య॒ జిన్వ॑థ। ఆపో॑జ॒నయ॑థా చ నః।। శ్రీ …….…….…….(*౧) దేవతాభ్యో నమః శుద్ధోదక స్నానం సమర్పయామి। స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి।। (దైవాన్ని హృదయపూర్వకంగా కలశ జలముతో అభిషేకించాలి.)