సంక్షిప్త రాశిఫలాలు 2026
2026లో ఉగాది పండుగను మార్చి 19, గురువారం నాడు జరుపుకుంటారు. ఈ ఉగాది నూతన సంవత్సరాన్ని శ్రీ పరాభవ నామ సంవత్సరం అంటారు. ఇది 40 వ తెలుగు సంవత్సరం. ఇది ప్రతీ 60 సంవత్సరాలకొకసారి పునరావృతం అవుతుంది. ఈ పర్వదినాన రాశిఫలాలను మన 'దేవతామంత్ర' పాఠకులకు ఇక్కడ పొందు పరిచాము. అందరికీ 'శ్రీ పరాభవ నామ' సంవత్సర ఉగాది శుభాకాంక్షలు! ధ్యానం - స్థాపన ముద్రా నమస్కారం: రెండు చేతులను బోర్లించి (అరచేతులు కిందకు ఉండేలా), రెండు బొటనవేళ్లను లోపలికి మడిచి, మిగిలిన వేళ్లను ఒకదానితో ఒకటి కలిపి ఉంచడాన్ని 'స్థాపన ముద్ర' అంటారు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ । ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ।। ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ । గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః ।। సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః । సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్భవేత్ ।।సంక్షిప్త రాశిఫలాలు 2026 చూడటానికి క్లిక్ చేయండి (Click to expand)
| రాశి (Rashi) | ఆదాయం (Income) | వ్యయం (Expenses) | రాజపూజ్యం (Respect) | అవమానం (Insult) |
|---|---|---|---|---|
| మేషం | 14 | 14 | 3 | 6 |
| వృషభం | 8 | 8 | 6 | 6 |
| మిథునం | 11 | 5 | 2 | 2 |
| కర్కాటకం | 5 | 5 | 5 | 2 |
| సింహం | 8 | 14 | 1 | 5 |
| కన్య | 11 | 5 | 4 | 5 |
| తుల | 8 | 8 | 7 | 1 |
| వృశ్చికం | 14 | 14 | 3 | 1 |
| ధనుస్సు | 2 | 11 | 6 | 4 |
| మకరం | 5 | 2 | 2 | 7 |
| కుంభం | 5 | 2 | 5 | 7 |
| మీనం | 2 | 11 | 1 | 3 |
- మేషం: మేష రాశి యొక్క అధిపతి కుజుడు. జనవరి నుండి జూన్ వరకు మేష రాశి వారికి గురువు- 3వ ఇంట్లో, శని- 12వ ఇంట్లో, రాహువు - 11వ ఇంట్లో, కేతువు 5వ ఇంట సంచరిస్తాడు. కాబట్టి గురువు వలన చేయబోయే ముఖ్య పనుల్లో అనుకూలత లభించి విజయం సాధిస్తారు. డబ్బు లావాదేవీలు కలిసివస్తాయి. కానీ ఏలినాటి శని ప్రభావం వలన మనోవ్యధ కొంత వరకు ఉంటుంది. జూన్ నుండి డిసెంబర్ వరకు గురువు 4వ ఇంట్లో ఉచ్చ స్థితిలో ఉంటాడు. అప్పుడు ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే యోగం ఉంది. విద్య, వ్యాపారం, ఆర్ధికంగా బావుంటుంది. ఆరోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. ఆదాయం మొత్తం వ్యయం అయ్యి పొదుపు పరంగా ఈ సంవత్సరం కొంచెం బలహీనంగా ఉండవచ్చు. ఈ రాశి వారు శివారాధన, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం మంచిది.
- వృషభం: వృషభ రాశి యొక్క అధిపతి శుక్రుడు. జనవరి నుండి జూన్ వరకు వృషభ రాశి వారికి గురువు- 2వ ఇంట్లో, శని- 11వ ఇంట్లో, రాహువు - 10వ ఇంట్లో, కేతువు 4వ ఇంట సంచరిస్తాడు. ఆర్ధిక ఇబ్బందులు తొలగి, కుటుంబంలో సంతోషాలు నెలకొంటాయి. కొన్ని కలహాల, అసౌకర్యాల వలన మనో వ్యాకులత కలగవచ్చు. జూన్ నుండి డిసెంబర్ వరకు గురువు- 3వ ఇంట్లో చలనం మీ జీవితంలో కొత్త మలుపు. మీరు చేసే పని మీకు మంచి గుర్తింపు తెచ్చి పెడుతుంది. విద్యార్థులు, వ్యాపారస్తులు బృహస్పతి ఆశీర్వాదాల నుండి గణనీయంగా ప్రయోజనం పొందే అవకాశం ఉంది. కానీ మెరుగైన ఆరోగ్యం కోసం నిత్యం యోగ, ధ్యానము లాంటివి అలవాటు చేసుకోవడం ఎంతైనా మంచిది.పేదలకు దానం, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం, శుక్రవారం అమ్మవారికి కుంకుమార్చన చేయడం మంచిది.
- మిథునం: మిథున రాశి యొక్క అధిపతి బుధుడు. ఈ రాశి వారికి జనవరి నుండి జూన్ వరకు గురువు- స్వ క్షేత్రంలో, శని- 10వ ఇంట్లో, రాహువు - 9వ ఇంట్లో, కేతువు 3వ ఇంట సంచరిస్తాడు. రాహు చలనం వలన విదేశాలకు వెళ్లే యోగం ఉంది. కష్టపడితే వృత్తి, ఉద్యోగాల్లో గుర్తింపు తప్పకుండా లభిస్తుంది. అనారోగ్య సమస్యలు, శత్రు భయం, కలిగే అవకాశం కనిపిస్తోంది. జూన్ నుండి గురువు - 2వ క్షేత్రంలో చలనం వలన లక్ష్మి కటాక్షం ఉంది. విద్య, వ్యాపారం, వివాహ జీవితంలో మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. ఏది ఏమైనా కార్యాచరణ ముందు నిలకడ అవసరం. విష్ణు ఆరాధన , గణపతి ఆరాధన చేసి పెసరపప్పు దానం చేయడం వలన కొంత ఉపశమనం పొందవచ్చు.
- కర్కాటకం: కర్కాటక రాశి యొక్క అధిపతి చంద్రుడు. ఈ రాశి వారికి జనవరి నుండి జూన్ వరకు గురువు- 12వ ఇంట్లో, శని- 9వ ఇంట్లో, రాహువు - 8వ ఇంట్లో, కేతువు 2వ ఇంట సంచరిస్తాడు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. రావలసిన బాకీలు తీరుతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది.కొన్నిసార్లు మానసిక ఆందోళన, పనుల్లో తరచూ ఆటంకాలు కలిగే అవకాశం ఉంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. జూన్ నుండి గురువు - జన్మ క్షేత్రంలో ఉండి సానుకూల ఫలితాలు ఇస్తాడు. శివారాధన, అభిషేకం, అన్నదానం చేయడం మంచిది.
- సింహం: సింహ రాశి యొక్క అధిపతి సూర్యుడు. ఈ రాశి వారికి జనవరి నుండి జూన్ వరకు గురువు- 11వ ఇంట్లో, శని- 8వ ఇంట్లో, రాహువు-7వ ఇంట్లో, కేతువు జన్మ రాశి లో సంచరిస్తాడు. ఆదాయం బాగుంటుంది. పట్టుదలతో కార్య జయం సాధిస్తారు. దానితో సంతృప్తి లభిస్తుంది. కానీ అష్టమ శని ప్రభావం వలన వృత్తిలో ఇబ్బందులు, కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల అత్యంత జాగ్రత్త అవసరం. జూన్ తరువాత శుభ వ్యయం సూచిస్తోంది. అంటే ఇల్లు కొనడం, విదేశీ ప్రయాణాలు లేదా దైవ కార్యాల కోసం డబ్బు ఖర్చు చేస్తారు.ఆదిత్య హృదయం పఠిస్తూ, శనివారం నాడు నువ్వుల నూనెతో దీపారాధన చేయుట కొంత ఊరటనిస్తుంది.
- కన్య: కన్య రాశి యొక్క అధిపతి బుధుడు. ఈ రాశి వారికి జనవరి నుండి జూన్ వరకు గురువు- 10వ ఇంట్లో, శని- 7వ ఇంట్లో, రాహువు - 6వ ఇంట్లో, కేతువు 12వ ఇంట్లో సంచరిస్తాడు. విద్యార్థులకు అన్ని విధాలా అనుకూల సమయం. సంతానం కోరుకునే వారికి అదృష్ట సమయం. సృజనాత్మక రంగాల్లో ఉన్నవారికి గుర్తింపు లభించే సూచన. కొన్నిసార్లు శారీరక శ్రమ, ఆస్తి తగాదాలు, ఆటంకాలు కలిగే అవకాశం ఉంది. కేతువు ఉండటం వల్ల ఆధ్యాత్మిక యాత్రలు సఫలం అవుతాయి. జూన్ తరువాత ఆర్థికంగా పెద్ద ఎత్తున లాభాలు వస్తాయి. పాత పెట్టుబడుల నుండి ఆదాయం అందుతుంది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి, అవివాహితులకు వివాహ యోగం ఉంటుంది. గణపతి పూజ, విష్ణు సహస్రనామ పారాయణ చేయుట శ్రేష్ఠం.
- తుల: తులా రాశి యొక్క అధిపతి శుక్రుడు. ఈ రాశి వారికి జనవరి నుండి జూన్ వరకు గురువు- 9వ ఇంట్లో, శని- 6వ ఇంట్లో, రాహువు - 5వ ఇంట్లో, కేతువు 11వ ఇంట్లో సంచరిస్తాడు. ఇల్లు, వాహనం కొనుగోలు చేయడానికి మంచి సమయం. వ్యాపారస్తులకు చక్కటి లాభాలు వస్తాయి. భాగస్వాములతో అనుకోని గొడవలు, వాటి వలన శారీరక అలసట, శత్రువుల నుండి పీడ సూచిస్తున్నాయి. జూన్ తరువాత ఉద్యోగంలో ఊహించని అధికార యోగం. ఆరోగ్య , ఆహార విషయంలో జాగ్రత్త అవసరం. నిత్య దీపారాధన, అమ్మవారి ఆరాధన చేయడం వలన మనశ్శాంతి లభిస్తుంది.
- వృశ్చికం: వృశ్చిక రాశి యొక్క అధిపతి కుజుడు. ఈ రాశి వారికి జనవరి నుండి జూన్ వరకు గురువు- 8వ ఇంట్లో, శని- 5వ ఇంట్లో, రాహువు - 4వ ఇంట్లో, కేతువు 10వ ఇంట్లో సంచరిస్తాడు. ఆరోగ్యం సమస్యలు తగ్గుతాయి. పూర్తి కావలసిన పనులు మళ్లీ వేగం పుంజుకుంటాయి. సోదరుల, మిత్రుల నుండి సహకారం లభిస్తుంది. కొన్నిసార్లు అశాంతి, కోపం వల్ల నష్టాలు కలిగే అవకాశం ఉంది. జూన్ తరువాత అదృష్టం, సర్వకార్య సిద్ధి. ఆంజనేయ స్వామి ఆరాధన, ఎరుపు రంగు వస్త్రాల దానం సూచించడమైనది.
- ధనుస్సు: ధనుస్సు రాశి యొక్క అధిపతి బృహస్పతి. ఈ రాశి వారికి జనవరి నుండి జూన్ వరకు గురువు- 7వ ఇంట్లో, శని- 4వ ఇంట్లో, రాహువు - 3వ ఇంట్లో, కేతువు 9వ ఇంట్లో సంచరిస్తాడు. గురువు మీ రాశిని నేరుగా వీక్షిస్తాడు. కావున అన్ని శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలిగి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. శని ప్రభావం వల్ల కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. జూన్ తరువాత ఆకస్మిక ధనం, లోతైన చింతన కనిపిస్తోంది. ఓర్పు వహిస్తూ శనివారం నువ్వుల నూనెతో దీపం వెలిగించి యధావిధి దక్షిణామూర్తి ఆరాధన చేయాలి.
- మకరం: మకర రాశి యొక్క అధిపతి శని. ఈ రాశి వారికి జనవరి నుండి జూన్ వరకు గురువు- 6వ ఇంట్లో, శని- 3వ ఇంట్లో, రాహువు - 2వ ఇంట్లో, కేతువు 8వ ఇంట్లో సంచరిస్తాడు. మకర రాశి వారికి ఏలినాటి శని ముగిసింది. రాజకీయ రంగాల్లో ఉన్నవారికి విజయం. కోర్టు సమస్యలు, ఇతర చిన్న సమస్యలు పరిష్కారమవుతాయి. జూన్ తరువాత అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది. కావున ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది. పేదలకు అన్నదానం చేయడం మంచిది.
- కుంభం: కుంభ రాశి యొక్క అధిపతి శని. ఈ రాశి వారికి జనవరి నుండి జూన్ వరకు గురువు- 5వ ఇంట్లో, శని- 2వ ఇంట్లో, రాహువు - జన్మ రాశి లో, కేతువు 7వ ఇంట్లో సంచరిస్తాడు. సంతాన ప్రాప్తి, సంతానం వల్ల పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. దాన ధర్మాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆస్తి సమస్యలు తొలగి అన్నీ కలిసి వచ్చే అనుకూలత ఉంది. ఏలినాటి శని చివరి దశ ప్రభావం వల్ల కొన్ని పనులు ఆలస్యం కావచ్చు. జూన్ తరువాత నిలకడైన ఆదాయం, ఉద్యోగ నిర్ణయాలు ఫలిస్తాయి. విష్ణు సహస్రనామ పారాయణ శుభకరం.
- మీనం: మీన రాశి యొక్క అధిపతి బృహస్పతి. ఈ రాశి వారికి జనవరి నుండి జూన్ వరకు గురువు- 4వ ఇంట్లో, శని- జన్మ రాశి లో, రాహువు - 12వ ఇంట్లో , కేతువు 6వ ఇంట్లో సంచరిస్తాడు. ఏలినాటి శని మధ్య దశ. ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. పెళ్లి కావాల్సిన వారికి అనుకూల సమయం. ఆస్తి సంబంధిత తగాదాలు వచ్చే అవకాశం ఉంది. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్య , ఆహార విషయంలో జాగ్రత్త అవసరం. జూన్ తరువాత అదృష్ట కాలం. కావున ఓర్పు వహిస్తూ శనివారం నాడు హనుమాన్ చాలీసా పఠించడం లేదా పేదలకు అన్నదానం చేయడం మంచిది.
గమనిక:
- జ్యోతిష్యం అనేది ఖచ్చితమైన తీర్పు కాదు, కేవలం ఒక అంచనా మాత్రమే.
- గ్రహాలు కేవలం మనిషిపై కొంత ప్రభావాన్ని చూపిస్తాయి. కానీ మనం నేర్చుకున్న చదువు, సంస్కారం, జీవన విధానం మనల్ని ఎక్కువగా ప్రభావితం చేస్తాయి.
- కష్టం వస్తుందని తెలిసినప్పుడు మనసును సిద్ధం చేసుకోవడంలో తప్పు లేదు. అందుకు జ్యోతిష్యం ఉపయోగపడుతుంది.
- జ్యోతిష్యం అనేది హెచ్చరిక లేదా ప్రథమ సూచనగా తీసుకుని దానిపై పూర్తిగా ఆధారపడకుండా అప్రమత్తంగా ఉంటూ మనోవిజ్ఞత కలిగి ఉంటె మానవుడికి దేనిలో అయినా విజయ తథ్యం.