శ్రీ సాయిబాబాకు ప్రీతికరమైన పదార్థాలు: {ఈ క్రింది పదార్థనలను శ్రీ సాయిబాబా వారికి ప్రీతికరమైనవి.
సాయిబాబాను ప్రత్యయాక్షముగా సేవించిన భక్తులు ఆయనకు నివేదించినవి.}
  1. రొట్టె‐బెల్లం: {తాత్యా అనే భక్తుడు సమర్పించేవారు.}
  2. సంగటి ముద్ద‐పాలు: {తాత్యా అనే భక్తుడు సమర్పించేవారు.}
  3. సేమియా పాయసం: {లక్ష్మీబాయి షిండే అనే భక్తురాలు సమర్పించేవారు.}
  4. రొట్టె‐ఉల్లిపచ్చడి: {బాబా దాసగణు అనే భక్తుడి చేత చేయించుకొని తిన్నారు. చంద్రబాయి బోర్కర్ అనే భక్తురాలు రొట్టె ‐ఉల్లిపచ్చడి సమర్పించేవారు.}
  5. బెండకాయ కూర: { నాచ్నే అనే భక్తుడి జీవితం ద్వారా ఇది అవగతమవుతుంది }
  6. పోళీలు‐భక్ష్యాలు: {నానా చాందోర్కర్ అనే భక్తుడి చేత బాబావారు స్వయముగా చేయించుకొని నివేదించమన్నారు}
  7. కిచిడి అన్నం: { బుర్హాంపురకు చెందిన శ్రీమతి మెహతా అనే భక్తురాలు బాబా వారికి సమర్పించారు.}
  8. మాంసం పలావ్,చెక్కర పొంగలి, పరమాన్నం: {బాబావారే స్వయముగా ఇవన్నీ వండి భక్తులకు పెట్టేవారు.}
  9. కిళ్ళీలు: {బాబా వారికి చాల ఇష్టమైన కిళ్లీలను తాత్యా అనే భక్తుడు సమర్పించేవారు. }
  10. కాఫీ: {స్వామి శరణానంద ద్వారా ఈ విషయం అవగతమవుతుంది. }
  11. ఉల్లి ఆకుల కూర: {స్వామి శరణానంద అనే భక్తుడి ద్వారా ఈ విషయం అవగతమవుతుంది. }
  12. వంకాయ కూర: {పురంధరే దంపతుల ద్వారా ఈ విషయం అవగతమవుతుంది. }
  13. పులుసు‐ గోధుమ పిండి బిళ్ళలు‐ గోధుమ రొట్టెలు ‐ మిరియాల పొడి మిశ్రమం.
  14. జొన్నపిండి‐అంబలి‐మజ్జిగ మిశ్రమం
  15. రవ్వకేసరి, పాలకోవా కూడా సమర్పించవచ్చును.
  16. జామ పండు: {లాలాజీ అనే భక్తుడి ద్వారా ఈ విషయం అవగతమవుతుంది.}
  17. రేగు పండ్లు: {లాలాజీ అనే భక్తుడి ద్వారా ఈ విషయం తెలిసింది.}
  18. ఆవకాయ, మామిడి పండ్లు, ద్రాక్ష పండ్లు: {బానుతాయి అనే భక్తురాలు ఇవి బాబా వారికి samarpinchindi }