బిల్వపత్రార్చనమ్‐బిల్వ అష్టోత్తర శతనామ పూజ
శుచిః:
అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం గతోఽపి వా।
యః స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతరః శుచిః।।
(పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః)
(ఆచమన పాత్ర లోని నీటిని ఉద్ధరిణిలో తీసుకొని శిరముపై మూడు మార్లు చల్లుకోవలెను.)
ప్రార్థన:
ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం।
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే।।
అగజానన పద్మార్కం గజాననమహర్నిశం।
అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే।।
గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః।
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః।।
యశ్శివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళా।
తయోః సంస్మరణాన్నిత్యం సర్వదా జయ మంగళం।।
(మీ ముఖానికి కుంకుమ పెట్టుకుని,నమస్కారం చేయండి)
విభూతి ధారణ:
భస్మ జ్యోతిస్వరూపాయ శివాయ పరమాత్మనే।
షట్త్రింశత్తత్త్వరూపాయ నమశ్శాంతాయ తేజసే।।
(కుడిచేతి మధ్య, అనామికా (ఉంగరపు వేలు) వేళ్లతో విభూతిని తీసుకుని నుదుటిపై ఎడమ నుండి కుడికి మూడు అడ్డ రేఖలుగా (త్రిపుండ్రం) ధరించండి.,నమస్కారం చేయండి)
ఆచమ్య‐ప్రాణానాచమ్య‐నేత్రాచమ్య:
(ఇప్పుడు ఆచమన పాత్ర లోని నీటిని ఉంగరం వ్రేలితో కళ్ళకు అద్దుకొని, ఉద్ధరిణిలో తీసుకొని ఒక్కో నామం చెపుతూ మూడు మార్లు తాగవలెను.)
ఓం శివాయ స్వాహా
ఓం మహేశ్వరాయ స్వాహా
ఓం శంభవే స్వాహా
హస్తం ప్రక్షాల్య
(చేయి కడగండి)
దీపారాధనం:
ఓం దీపస్త్వం బ్రహ్మ రూపోసి జ్యోతిషాం ప్రభురవ్యయః।
సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్కామాంశ్చ దేహి మే।।
(దీపమూలే పుష్పాక్షతాన్ నిక్షిప్య, దీపము వద్ద పుష్పాక్షతలను ఉంచవలెను.)
ఘంట:
రక్షార్థం సర్వభూతానాం
ఆదిగురోరాగమనార్థకం।
ఘంటారావం కరోమ్యహం
పరమేశ్వరాహ్వానలాంఛనం।।
(ఘంట మ్రోగించాలి)
భూతోచ్చాటనం:
ఉత్తిష్ఠంతు భూతపిశాచాః య ఏతే భూమి భారకాః।
ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే।
(అక్షతలు వాసనా చూసి మీ ధర్మపత్నికి ఎడమవైపున వేయండి. )
ప్రాణాయామం:
(ఈ మంత్రం చదువుతూ ప్రాణాయామం చేయండి.)
ఓం భూః।ఓం భువః।ఓం సువః।ఓం మహః।
ఓం జనః।ఓం తపః।ఓం సత్యం।
ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్।
ఓమాపో జ్యోతీ రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్।
సంకల్పం:
(ఇప్పుడు కుడిచేతిలో అక్షతలు తీసుకుని ,మీ కుడి కాలితొడపై ఎడమ అరచేతి నుంచి అక్షతలతో ఉన్న కుడిచేతిని పిడికిలిగా మూసి ఆ ఎడమ అరచేతిపైనుంచుతూ ఈ సంకల్పం చెప్పి పిడికిలిలో ఉన్నఅక్షతలను నీటితో అర్ఘ్యపాత్రలో వదలాలి.)
మమోపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే (భారతవర్షే / అమెరికా ఖండే / యూరోపా ఖండే)…… దేశే…… రాష్ట్రే …… నగరే …… ప్రాంతే…… గృహే (స్వగృహే/ నివాసగృహే (అస్మిన్ వర్తమానే వ్యావహారిక చాంద్రమానేన ప్రభావాది షష్ఠి సంవత్సరాణాం శ్రీ …….. (*౧) నామ సంవత్సరే …… అయనే (*౨) …… ఋతౌ (*౩) …… మాసే(*౪) …… పక్షే (*౫) …… తిథౌ (*౬) …… వాసరే (*౭) …… నక్షత్రే (*౮) …… యోగే (*౯) …… కరణ (*౧౦) ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ …… గోత్రః …… నామధేయః ధర్మపత్నీ సమేతః అహంధర్మపత్నీ సమేతోహం శ్రీమతః …… గోత్రస్య …… నామధేయస్య మమ జన్మజన్మాంతర కృత మహా పాతక ఉపపాతక సమస్త పాపక్షయ ద్వారా శ్రీ సాంబసదాశివ ముద్దిశ్య శ్రీ సాంబసదాశివ ప్రీత్యర్థం మహా బిల్వార్చనం కరిష్యే।।
కలశప్రార్థన:
గంగే చ యమునే కృష్ణే గోదావరీ సరస్వతీ।
నర్మదే సింధు కావేరీ జలేఽస్మిన్ సన్నిధిం కురు।।
ఓం కలశదేవతాభ్యో నమః।
(కలశానికి బొట్టు పెట్టి, ఒక పువ్వు వేసి, అక్షతలు వేసి నమస్కారం చేయండి)
వినియోగం:
అస్య శ్రీ బిల్వపత్ర మహామంత్రస్య శ్రీ సాంబసదాశివో దేవతా । వృషభ యోగీశ్వర ఋషిః అనుష్టుప్ ఛందః । ఓం బీజం । నమః శక్తిః । శివాయేతి కీలకం ।।
మంత్రః - 'నమశ్శివాయ' ఇతి జపం కుర్యాత్ ।।
ఇచ్చట ఓం నమః శివాయ మంత్రాన్ని 108 మార్లు జపించాలి.
కరన్యాసం
ఓం సదాశివాయ అంగుష్ఠాభ్యాం నమః (రెండు బొటనవేళ్లను తాకాలి)
నం గంగాధరాయ తర్జనీభ్యాం నమః (చూపుడు వేళ్లను తాకాలి)
మం మృత్యుంజయాయ మధ్యమాభ్యాం నమః (మధ్య వేళ్లను తాకాలి)
శిం శూలపాణయే అనామికాభ్యాం నమః (ఉంగరపు వేళ్లను తాకాలి)
వాం పినాకినే కనిష్ఠికాభ్యాం నమః (చిటికెన వేళ్లను తాకాలి)
యం ఉమాపతయే కరతల కరపృష్ఠాభ్యాం నమః (అరచేతులు మరియు వెనుక భాగం ఒకదానితో ఒకటి తాకాలి)
అంగన్యాసం
(శరీర భాగాలను తాకుతూ ఈ మంత్రాలు చదవాలి)
ఓం సదాశివాయ హృదయాయ నమః (కుడి చేతితో హృదయాన్ని తాకాలి)
నం గంగాధరాయ శిరసే స్వాహా (శిరస్సును తాకాలి)
మం మృత్యుంజయాయ శిఖాయై వషట్ (జుట్టు ముడి/శిఖ భాగాన్ని తాకాలి)
శిం శూలపాణయే కవచాయ హుమ్ (రెండు భుజాలను మార్చి మార్చి తాకాలి)
వాం పినాకినే నేత్రత్రయాయ వౌషట్ (రెండు కళ్లు మరియు మధ్యలో మూడవ కన్ను ఉన్న చోట తాకాలి)
యం ఉమాపతయే అస్త్రాయ ఫట్ (కుడిచేతి మధ్య వేలితో ఎడమ అరచేతిపై చప్పట్లు కొడుతూ దిగ్బంధనం చేయాలి)
ధ్యానం:
శాంతం పద్మాసనస్థం శశిధర మకుటం పంచవక్త్రం త్రినేత్రం ।
శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం
నాగం పాశం చ ఘంటాం ప్రళయ హుతవహం సాంకుశం వామభాగే
నానాలంకార యుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి ।।
త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం ।
(పరమశివుడిని మనసులో ధ్యానించాలి.)
ఆవాహనం:
ఓం నమః శివాయ శంభో మహాదేవ।
(పరమశివుడిని మనసారా ఆహ్వానించాలి.)
ఆసనం:
ఓం నమః శివాయ శంభో మహాదేవ।
(పరమశివుడికి పుష్పాలను సమర్పించాలి.)
పాద్యం:
ఓం నమః శివాయ శంభో మహాదేవ।
(శంకరుడి పాదాలు కడగాలి/శివలింగం యొక్క మూలమును కడగాలి)
అర్ఘ్యం:
ఓం నమః శివాయ శంభో మహాదేవ।
(కలశంలో ఉన్న పుష్పంతో కానీ లేదా ఉద్ధరణితో కానీ నీరు తీసుకొని పరమశివుడికి చూపించి అర్ఘ్య పాత్రలో చల్లాలి/వదలాలి.)
ఆచమనం:
ఓం నమః శివాయ శంభో మహాదేవ।
(కలశంలో ఉన్న పుష్పంతో కానీ లేదా ఉద్ధరణితో కానీ నీరు తీసుకొని పరమశివుడికి చూపించి అర్ఘ్య పాత్రలో చల్లాలి/వదలాలి.)
పంచామృత స్నానం:
ఓం నమః శివాయ శంభో మహాదేవ।
(పంచామృతాలతో పరమశివుడిని అభిషేకించాలి .)
శుద్ధోదకస్నానం:
ఓం నమః శివాయ శంభో మహాదేవ।
(శుద్ధజలంతో పరమశివుడిని అభిషేకించాలి.)
వస్త్రం:
ఓం నమః శివాయ శంభో మహాదేవ।
ఓం శ్రీ సాంబ సదాశివాయ నమః నమః వస్త్రయుగ్మం సమర్పయామి। వస్త్రార్ధం అక్షతాన్ సమర్పయామి।
(పవిత్రమైన వస్త్రాన్ని లేదా అక్షింతలు సమర్పించాలి.)
యజ్ఞోపవీతం:
ఓం నమః శివాయ శంభో మహాదేవ।
ఓం శ్రీ సాంబ సదాశివాయ నమః నమః యజ్ఞోపవీతం సమర్పయామి।। యజ్ఞోపవీతార్ధం అక్షతాన్ సమర్పయామి।।
(పరమశివుడికి యజ్ఞోపవీతం లేదా అక్షింతలు సమర్పించాలి. )
విభూతి:
ఓం నమః శివాయ శంభో మహాదేవ।
(పరమశివుడికి విభూతి పెట్టాలి.)
చందనం:
ఓం నమః శివాయ శంభో మహాదేవ।
ఓం శ్రీ సాంబ సదాశివాయ నమః నమః శ్రీ గంధాన్ ధారయామి।
(పరమశివుడికి గంధం మరియు కుంకుమ పెట్టాలి.)
అక్షతలు:
ఓం నమః శివాయ శంభో మహాదేవ।
ఓం శ్రీ సాంబ సదాశివాయ నమః నమః అక్షతాన్ సమర్పయామి।।
(పరమశివుడికి అక్షతలును సమర్పించాలి.)
పుష్పసమర్పణం:
అష్టౌ పుష్పాణి సమర్ప్య
అష్టసాత్త్వికభావతః।
శ్రీ సాంబ సదాశివ పాదపద్మే
భక్తిభావాన్ న్యస్యామ్యహం।। అహింస ప్రథమం పుష్పం! పుష్పం ఇంద్రియ నిగ్రహః।। సర్వ భూత దయా పుష్పం। క్షమా పుష్పం విశేషతః।। జ్ఞాన పుష్పం తప: పుష్పం। శాంతి పుష్పం తథైవ చ।।! సత్యం అష్ట విధం పుష్పో:। శ్రీ శ్రీ సాంబ సదాశివాయ ప్రీతి కరం భవేత్।। ఓం శ్రీ సాంబ సదాశివాయ నమః అష్ట బిల్వ పుష్పాణి సమర్పయామి। (అష్ట బిల్వములు సమర్పించాలి.) బిల్వ అష్టోత్తర శతనామ స్తోత్ర మంత్రాలు పఠిస్తూ శివుడిని మారేడు దళములతో పూజించాలి. బిల్వ అష్టోత్తర శతనామ స్తోత్రం: త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం। త్రిజన్మ పాపసంహారం ఏకబిల్వం శివార్పణం ।। 1 ।। త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రైః కోమలైః శుభైః । తవ పూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం ।। 2 ।। సర్వత్రైలోక్యకర్తారం సర్వత్రైలోక్యపాలనం । సర్వత్రైలోక్యహర్తారం ఏకబిల్వం శివార్పణం ।। 3 ।। నాగాధిరాజవలయం నాగహారేణ భూషి తం । నాగకుండలసంయుక్తం ఏకబిల్వం శివార్పణం ।। 4 ।। అక్షమాలాధరం రుద్రం పార్వతీప్రియవల్ల భం । చంద్రశేఖరమీశానం ఏకబిల్వం శివార్పణం ।। 5 ।। త్రిలోచనం దశభుజం దుర్గాదేహార్ధధారిణం । విభూత్యభ్యర్చితం దేవం ఏకబిల్వం శివార్పణం ।। 6 ।। త్రిశూలధారిణం దేవం నాగాభరణసుందరం । చంద్రశేఖరమీశానం ఏకబిల్వం శివార్పణం ।। 7 ।। గంగాధరాంబికానాథం ఫణికుండలమండితం । కాలకాలం గిరీశం చ ఏకబిల్వం శివార్పణం ।। 8 ।। శుద్ధస్ఫటిక సంకాశం శితికంఠం కృపానిధిం । సర్వేశ్వరం సదాశాంతం ఏకబిల్వం శివార్పణం ।। 9 ।। సచ్చిదానందరూపం చ పరానందమయం శివం । వాగీశ్వరం చిదాకాశం ఏకబిల్వం శివార్పణం ।। 10 ।। శిపివిష్టం సహస్రాక్షం కైలాసాచలవాసినం । హిరణ్యబాహుం సేనాన్యం ఏకబిల్వం శివార్పణం ।। 11 ।। అరుణం వామనం తారం వాస్తవ్యం చైవ వాస్తవం । జ్యేష్టం కనిష్ఠం గౌరీశం ఏకబిల్వం శివార్పణం ।। 12 ।। హరికేశం సనందీశం ఉచ్చైర్ఘోషం సనాతనం । అఘోరరూపకం కుంభం ఏకబిల్వం శివార్పణం ।। 13 ।। పూర్వజావరజం యామ్యం సూక్ష్మం తస్కరనాయకం । నీలకంఠం జఘన్యం చ ఏకబిల్వం శివార్పణం ।। 14।। సురాశ్రయం విషహరం వర్మిణం చ వరూధినం మహాసేనం మహావీరం ఏకబిల్వం శివార్పణం ।। 15 ।। కుమారం కుశలం కూప్యం వదాన్యం చ మహారథం । తౌర్యాతౌర్యం చ దేవ్యం చ ఏకబిల్వం శివార్పణం ।। 16 ।। దశకర్ణం లలాటాక్షం పంచవక్త్రం సదాశివం । అశేషపాపసంహారం ఏకబిల్వం శివార్పణం ।। 17 ।। నీలకంఠం జగద్వంద్యం దీననాథం మహేశ్వరం । మహాపాపసంహారం ఏకబిల్వం శివార్పణం ।। 18 ।। చూడామణీకృతవిభుం వలయీకృతవాసుకిం । కైలాసవాసినం భీమం ఏకబిల్వం శివార్పణం ।। 19 ।। కర్పూరకుందధవళం నరకార్ణవతారకం । కరుణామృతసింధుం చ ఏకబిల్వం శివార్పణం ।। 20 ।। మహాదేవం మహాత్మానం భుజంగాధిపకంకణం । మహాపాపహరం దేవం ఏకబిల్వం శివార్పణం ।। 21 ।। భూతేశం ఖండపరశుం వామదేవం పినాకినం । వామే శక్తిధరం శ్రేష్ఠం ఏకబిల్వం శివార్పణం ।। 22 ।। ఫాలేక్షణం విరూపాక్షం శ్రీకంఠం భక్తవత్సలం । నీలలోహితఖట్వాంగం ఏకబిల్వం శివార్పణం ।। 23 ।। కైలాసవాసినం భీమం కఠోరం త్రిపురాంతకం । వృషాంకం వృషభారూఢం ఏకబిల్వం శివార్పణం ।। 24 ।। సామప్రియం సర్వమయం భస్మోద్ధూళితవిగ్రహం । మృత్యుంజయం లోకనాథం ఏకబిల్వం శివార్పణం ।। 25 ।। దారిద్ర్యదుఃఖహరణం రవిచంద్రానలేక్షణం । మృగపాణిం చంద్రమౌళిం ఏకబిల్వం శివార్పణం ।। 26 ।। సర్వలోకభయాకారం సర్వలోకైకసాక్షిణం । నిర్మలం నిర్గుణాకారం ఏకబిల్వం శివార్పణం ।। 27 ।। సర్వతత్త్వాత్మకం సాంబం సర్వతత్త్వవిదూరకం । సర్వతత్త్వస్వరూపం చ ఏకబిల్వం శివార్పణం ।। 28 ।। సర్వలోకగురుం స్థాణుం సర్వలోకవరప్రదం । సర్వలోకైకనేత్రం చ ఏకబిల్వం శివార్పణం ।। 29 ।। మన్మథోద్ధరణం శైవం భవభర్గం పరాత్మకం । కమలాప్రియపూజ్యం చ ఏకబిల్వం శివార్పణం ।। 30 ।। తేజోమయం మహాభీమం ఉమేశం భస్మలేపనం । భవరోగవినాశం చ ఏకబిల్వం శివార్పణం ।। 31 ।। స్వర్గాపవర్గఫలదం రఘునాథవరప్రదం । నగరాజసుతాకాంతం ఏకబిల్వం శివార్పణం ।। 32 ।। మంజీరపాదయుగళం శుభలక్షణలక్షితం । ఫణిరాజవిరాజం చ ఏకబిల్వం శివార్పణం ।। 33 ।। నిరామయం నిరాధారం నిస్సంగం నిష్ప్రపంచకం । తేజోరూపం మహారౌద్రం ఏకబిల్వం శివార్పణం ।। 34 ।। సర్వలోకైకపితరం సర్వలోకైకమాతరం । సర్వలోకైకనాథం చ ఏకబిల్వం శివార్పణం ।। 35 ।। చిత్రాంబరం నిరాభాసం వృషభేశ్వరవాహనం । నీలగ్రీవం చతుర్వక్త్రం ఏకబిల్వం శివార్పణం ।। 36 ।। రత్నకంచుకరత్నేశం రత్నకుండలమండితం । నవరత్నకిరీటం చ ఏకబిల్వం శివార్పణం ।। 37 ।। దివ్యరత్నాంగుళీస్వర్ణం కంఠాభరణభూషితం । నానారత్నమణిమయం ఏకబిల్వం శివార్పణం ।। 38 ।। రత్నాంగుళీయవిలసత్కరశాఖానఖప్రభం । భక్తమానసగేహం చ ఏకబిల్వం శివార్పణం ।। 39 ।। వామాంగభాగవిలసదంబికావీక్షణప్రియం । పుండరీకనిభాక్షం చ ఏకబిల్వం శివార్పణం ।। 40 ।। సంపూర్ణకామదం సౌఖ్యం భక్తేష్టఫలకారణం । సౌభాగ్యదం హితకరం ఏకబిల్వం శివార్పణం ।। 41 ।। నానాశాస్త్రగుణోపేతం స్ఫురన్మంగళ విగ్రహం । విద్యావిభేదరహితం ఏకబిల్వం శివార్పణం ।। 42 ।। అప్రమేయగుణాధారం వేదకృద్రూపవిగ్రహం । ధర్మాధర్మప్రవృత్తం చ ఏకబిల్వం శివార్పణం ।। 43 ।। గౌరీవిలాససదనం జీవజీవపితామహం । కల్పాంతభైరవం శుభ్రం ఏకబిల్వం శివార్పణం ।। 44 ।। సుఖదం సుఖనాశం చ దుఃఖదం దుఃఖనాశనం । దుఃఖావతారం భద్రం చ ఏకబిల్వం శివార్పణం ।। 45 ।। సుఖరూపం రూపనాశం సర్వధర్మఫలప్రదం । అతీంద్రియం మహామాయం ఏకబిల్వం శివార్పణం ।। 46 ।। సర్వపక్షిమృగాకారం సర్వపక్షిమృగాధిపం । సర్వపక్షిమృగాధారం ఏకబిల్వం శివార్పణం ।। 47 ।। జీవాధ్యక్షం జీవవంద్యం జీవం జీవనరక్షకం । జీవకృజ్జీవహరణం ఏకబిల్వం శివార్పణం ।। 48 ।। విశ్వాత్మానం విశ్వవంద్యం వజ్రాత్మా వజ్రహస్తకం । వజ్రేశం వజ్రభూషం చ ఏకబిల్వం శివార్పణం ।। 49 ।। గణాధిపం గణాధ్యక్షం ప్రళయానలనాశకం । జితేంద్రియం వీరభద్రం ఏకబిల్వం శివార్పణం ।। 50 ।। త్ర్యంబకం మృడం శూరం అరిషడ్వర్గనాశకం । దిగంబరం క్షోభనాశం ఏకబిల్వం శివార్పణం ।। 51 ।। కుందేందుశంఖధవళం భగనేత్రభిదుజ్జ్వలం । కాలాగ్నిరుద్రం సర్వజ్ఞం ఏకబిల్వం శివార్పణం ।। 52 ।। కంబుగ్రీవం కంబుకంఠం ధైర్యదం ధైర్యవర్ధకం । శార్దూలచర్మవసనం ఏకబిల్వం శివార్పణం ।। 53 ।। జగదుత్పత్తిహేతుం చ జగత్ప్రళయకారణం । పూర్ణానందస్వరూపం చ ఏకబిల్వం శివార్పణం ।। 54 ।। సర్గకేశం మహత్తేజం పుణ్యశ్రవణకీర్తనం । బ్రహ్మాండనాయకం తారం ఏకబిల్వం శివార్పణం ।। 55 ।। మందారమూలనిలయం మందారకుసుమప్రియం । బృందారకప్రియతరం ఏకబిల్వం శివార్పణం ।। 56 ।। మహేంద్రియం మహాబాహుం విశ్వాసపరిపూరకం । సులభాసులభం లభ్యం ఏకబిల్వం శివార్పణం ।। 57 ।। బీజాధారం బీజరూపం నిర్బీజం బీజవృద్ధిదం । పరేశం బీజనాశం చ ఏకబిల్వం శివార్పణం ।। 58 ।। యుగాకారం యుగాధీశం యుగకృద్యుగనాశకం । పరేశం బీజనాశం చ ఏకబిల్వం శివార్పణం ।। 59 ।। ధూర్జటిం పింగళజటం జటామండలమండితం । కర్పూరగౌరం గౌరీశం ఏకబిల్వం శివార్పణం ।। 60 ।। సురావాసం జనావాసం యోగీశం యోగిపుంగవం । యోగదం యోగినాం సింహం ఏకబిల్వం శివార్పణం ।। 61 ।। ఉత్తమానుత్తమం తత్త్వం అంధకాసురసూదనం । భక్తకల్పద్రుమస్తోమం ఏకబిల్వం శివార్పణం ।। 62 ।। విచిత్రమాల్యవసనం దివ్యచందనచర్చితం । విష్ణుబ్రహ్మాది వంద్యం చ ఏకబిల్వం శివార్పణం ।। 63 ।। కుమారం పితరం దేవం శ్రితచంద్రకళానిధిం । బ్రహ్మశత్రుం జగన్మిత్రం ఏకబిల్వం శివార్పణం ।। 64 ।। లావణ్యమధురాకారం కరుణారసవారధిం । భ్రువోర్మధ్యే సహస్రార్చిం ఏకబిల్వం శివార్పణం ।। 65 ।। జటాధరం పావకాక్షం వృక్షేశం భూమినాయకం । కామదం సర్వదాగమ్యం ఏకబిల్వం శివార్పణం ।। 66 ।। శివం శాంతం ఉమానాథం మహాధ్యానపరాయణం । జ్ఞానప్రదం కృత్తివాసం ఏకబిల్వం శివార్పణం ।। 67 ।। వాసుక్యురగహారం చ లోకానుగ్రహకారణం । జ్ఞానప్రదం కృత్తివాసం ఏకబిల్వం శివార్పణం ।। 68 ।। శశాంకధారిణం భర్గం సర్వలోకైకశంకరం । శుద్ధం చ శాశ్వతం నిత్యం ఏకబిల్వం శివార్పణం ।। 69 ।। శరణాగతదీనార్తపరిత్రాణపరాయణం । గంభీరం చ వషట్కారం ఏకబిల్వం శివార్పణం ।। 70 ।। భోక్తారం భోజనం భోజ్యం జేతారం జితమాననం । కరణం కారణం జిష్ణుం ఏకబిల్వం శివార్పణం ।। 71 ।। క్షేత్రజ్ఞం క్షేత్రపాలం చ పరార్ధైకప్రయోజనం । వ్యోమకేశం భీమవేషం ఏకబిల్వం శివార్పణం ।। 72।। భవఘ్నం తరుణోపేతం క్షోదిష్టం యమనాశకం । హిరణ్యగర్భం హేమాంగం ఏకబిల్వం శివార్పణం ।। 73 ।। దక్షం చాముండజనకం మోక్షదం మోక్షకారణం । హిరణ్యదం హేమరూపం ఏకబిల్వం శివార్పణం ।। 74 ।। మహాశ్మశాననిలయం ప్రచ్ఛన్నస్ఫటికప్రభం । వేదాస్యం వేదరూపం చ ఏకబిల్వం శివార్పణం ।। 75 ।। స్థిరం ధర్మం ఉమానాథం బ్రహ్మణ్యం చాశ్రయం విభుం । జగన్నివాసం ప్రథమం ఏకబిల్వం శివార్పణం ।। 76 ।। రుద్రాక్షమాలాభరణం రుద్రాక్షప్రియవత్సలం । రుద్రాక్షభక్తసంస్తోమం ఏకబిల్వం శివార్పణం ।। 77 ।। ఫణీంద్రవిలసత్కంఠం భుజంగాభరణప్రియం । దక్షాధ్వరవినాశం చ ఏకబిల్వం శివార్పణం ।। 78 ।। నాగేంద్రవిలసత్కర్ణం మహీంద్రవలయావృతం । మునివంద్యం మునిశ్రేష్ఠం ఏకబిల్వం శివార్పణం ।। 79 ।। మృగేంద్రచర్మవసనం మునీనామేకజీవనం । సర్వదేవాదిపూజ్యం చ ఏకబిల్వం శివార్పణం ।। 80 ।। నిధనేశం ధనాధీశం అపమృత్యువినాశనం । లింగమూర్తిమలింగాత్మం ఏకబిల్వం శివార్పణం ।। 81 ।। భక్తకళ్యాణదం వ్యస్తం వేదవేదాంతసంస్తుతం । కల్పకృత్కల్పనాశం చ ఏకబిల్వం శివార్పణం ।। 82।। ఘోరపాతకదావాగ్నిం జన్మకర్మవివర్జితం । కపాలమాలాభరణం ఏకబిల్వం శివార్పణం ।। 83 ।। మాతంగచర్మవసనం విరాడ్రూపవిదారకం । విష్ణుక్రాంతమనంతం చ ఏకబిల్వం శివార్పణం ।। 84 ।। యజ్ఞకర్మఫలాధ్యక్షం యజ్ఞవిఘ్నవినాశకం । యజ్ఞేశం యజ్ఞభోక్తారం ఏకబిల్వం శివార్పణం ।। 85 ।। కాలాధీశం త్రికాలజ్ఞం దుష్టనిగ్రహకారకం । యోగిమానసపూజ్యం చ ఏకబిల్వం శివార్పణం ।। 86 ।। మహోన్నతమహాకాయం మహోదరమహాభుజం । మహావక్త్రం మహావృద్ధం ఏకబిల్వం శివార్పణం ।। 87 ।। సునేత్రం సులలాటం చ సర్వభీమపరాక్రమం । మహేశ్వరం శివతరం ఏకబిల్వం శివార్పణం ।। 88 ।। సమస్తజగదాధారం సమస్తగుణసాగరం । సత్యం సత్యగుణోపేతం ఏకబిల్వం శివార్పణం ।। 89 ।। మాఘకృష్ణచతుర్దశ్యాం పూజార్థం చ జగద్గురోః । దుర్లభం సర్వదేవానాం ఏకబిల్వం శివార్పణం ।। 90 ।। తత్రాపి దుర్లభం మన్యేత్ నభోమాసేందువాసరే । ప్రదోషకాలే పూజాయాం ఏకబిల్వం శివార్పణం ।। 91 ।। తటాకం ధననిక్షేపం బ్రహ్మస్థాప్యం శివాలయం । కోటికన్యామహాదానం ఏకబిల్వం శివార్పణం ।। 92 ।। దర్శనం బిల్వవృక్షస్య స్పర్శనం పాపనాశనం । అఘోరపాపసంహారం ఏకబిల్వం శివార్పణం ।। 93 ।। తులసీ బిల్వ నిర్గుండీ జంబీరామలకం తథా । పంచబిల్వమితి ఖ్యాతం ఏకబిల్వం శివార్పణం ।। 94 ।। అఖండబిల్వపత్రైశ్చ పూజయేన్నందికేశ్వరం । ముచ్యతే సర్వపాపేభ్యః ఏకబిల్వం శివార్పణం ।। 95 ।। సాలంకృతా శతావృత్తా కన్యాకోటిసహస్రకం । సామ్రాజ్యపృథ్వీదానం చ ఏకబిల్వం శివార్పణం ।। 96 ।। దంత్యశ్వకోటిదానాని అశ్వమేధసహస్రకం । సవత్సధేనుదానాని ఏకబిల్వం శివార్పణం ।। 97 ।। చతుర్వేదసహస్రాణి భారతాదిపురాణకం । సామ్రాజ్యపృథ్వీదానం చ ఏకబిల్వం శివార్పణం ।। 98 ।। సర్వరత్నమయం మేరుం కాంచనం దివ్యవస్త్రకం । తులాభాగం శతావర్తం ఏకబిల్వం శివార్పణం ।। 99 ।। అష్టోత్తరశ్శతం బిల్వం యోఽర్చయేల్లింగమస్తకే । అథర్వోక్తం వదేద్యస్తు ఏకబిల్వం శివార్పణం ।। 100 ।। కాశీక్షేత్రనివాసం చ కాలభైరవదర్శనం । అఘోరపాపసంహారం ఏకబిల్వం శివార్పణం ।। 101 ।। అష్టోత్తరశతశ్లోకైః స్తోత్రాద్యైః పూజయేద్యథా । త్రిసంధ్యం మోక్షమాప్నోతి ఏకబిల్వం శివార్పణం ।। 102 ।। దంతికోటిసహస్రాణాం భూః హిరణ్యసహస్రకం । సర్వక్రతుమయం పుణ్యం ఏకబిల్వం శివార్పణం ।। 103 ।। పుత్రపౌత్రాదికం భోగం భుక్త్వా చాత్ర యథేప్సితం । అంతే చ శివసాయుజ్యం ఏకబిల్వం శివార్పణం ।। 104 ।। విప్రకోటిసహస్రాణాం విత్తదానాశ్చ యత్ఫలం । తత్ఫలం ప్రాప్నుయాత్సత్యం ఏకబిల్వం శివార్పణం ।। 105 ।। త్వన్నామకీర్తనం తత్త్వం తవపాదాంబు యః పిబేత్ । జీవన్ముక్తోభవేన్నిత్యం ఏకబిల్వం శివార్పణం ।। 106 ।। అనేకదానఫలదం అనంతసుకృతాదికం । తీర్థయాత్రాఖిలం పుణ్యం ఏకబిల్వం శివార్పణం ।। 107 ।। త్వం మాం పాలయ సర్వత్ర పదధ్యానకృతం తవ । భవనం శాంకరం నిత్యం ఏకబిల్వం శివార్పణం ।। 108 ।। ఫలశ్రుతిః ఏకకాలే పఠేన్నిత్యం సర్వశత్రునివారణం । ద్వికాలే చ పఠేన్నిత్యం మనోరథఫలప్రదం । త్రికాలే చ పఠేన్నిత్యం ఆయుర్వర్ధ్యో ధనప్రదం । అచిరాత్కార్యసిద్ధిం చ లభతే నాత్ర సంశయః । ఏకకాలం ద్వికాలం వా త్రికాలం యః పఠేన్నరః । లక్ష్మీప్రాప్తిశ్శివావాసః శివేన సహ మోదతే । కోటిజన్మకృతం పాపం అర్చనేన వినశ్యతి । సప్తజన్మకృతం పాపం శ్రవణేన వినశ్యతి । జన్మాంతరకృతం పాపం పఠనేన వినశ్యతి । దివారాత్రకృతం పాపం దర్శనేన వినశ్యతి । క్షణేక్షణేకృతం పాపం స్మరణేన వినశ్యతి । పుస్తకం ధారయేద్దేహీ ఆరోగ్యం భయనాశనం ।। ఇతి బిల్వాష్టోత్తరశతనామస్తోత్రం సంపూర్ణం ।। ఓం శ్రీ సాంబ సదాశివాయ నమః నమః బిల్వ అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి।। మహా బిల్వార్చన పూజాం సమర్పయామి।। (పరమశివుడికి అక్షింతలు సమర్పించాలి.) ధూపం: ఓం నమః శివాయ శంభో మహాదేవ। ఓం శ్రీ సాంబ సదాశివాయ నమః। ధూపమాఘ్రాపయామి।। (అగరుబత్తులు వెలిగించి ఘంటా మోగిస్తూ పరమశివుడికి చూపించాలి) దీపం: ఓం నమః శివాయ శంభో మహాదేవ। ఓం శ్రీ సాంబ సదాశివాయ నమః దీపం దర్శయామి।। ధుపా దీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి।। (దీపానికి నమస్కారం చేయాలి) నైవేద్యం: ఓం నమః శివాయ శంభో మహాదేవ। ఓం శ్రీ సాంబ సదాశివాయ నమః నైవేద్యం సమర్పయామి।। (పరమశివుడికి ప్రీతికరమైన ఆహారం, పండ్లు లేదా ప్రసాదం సమర్పించాలి.) తాంబూలం: ఓం నమః శివాయ శంభో మహాదేవ। ఓం శ్రీ సాంబ సదాశివాయ నమః తాంబూలం సమర్పయామి ।। (పరమశివుడికి రెండు తమలపాకులు తొనలు ఆకుల కొసలు ఉత్తరం వైపు ఉన్నట్లుగా పెట్టి అందులో వక్కలు వేసి దైవానికి సమర్పించాలి.) నీరాజనం: ఓం నమః శివాయ శంభో మహాదేవ। ఓం శ్రీ సాంబ సదాశివాయ నమః కర్పూరనీరాజనం సమర్పయామి।। (పరమశివుడికి కర్పూర హారతి ఇవ్వాలి.) మంత్రపుష్పం: ఓం నమః శివాయ శంభో మహాదేవ। ఓం శ్రీ సాంబ సదాశివాయ నమః పాదారవిందయోః సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి। (పరమశివుడికి పుష్పాలను సమర్పించాలి.) ఆత్మప్రదక్షిణ నమస్కారం: (అక్షింతలు పుష్పాలు చేతిలో తీసుకొని తమ కుడివైపుకు 3 లేదా 5 మార్లు తిరుగుతూ ఆత్మప్రదక్షిణ చేయాలి. తదుపరి అక్షత పుష్పాలను సమర్పించాలి.) యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోఽహం పాపకర్మాఽహం పాపాత్మా పాపసంభవః త్రాహి మాం కృపయా సాయి శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్కారుణ్య భావేన రక్ష రక్ష శ్రీసాయినాథ ప్రభో ఓం శ్రీ సాంబ సదాశివాయ నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి।। సాష్టాంగ నమస్కారం: ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా। పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగముచ్యతే।। ఓం శ్రీ సాంబ సదాశివాయ నమః సాష్టాంగ నమస్కారాం సమర్పయామి । ప్రార్థన: వందే శంభు ముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగ భూషణం మృగధరం వందే పశూనాం పతిమ్। వందే సూర్య శశాంక వహ్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్ ।। (పరమశివుడికి నమస్కారం చేయాలి.) క్షమాప్రార్థనా: అపరాధసహస్రాణి క్రియన్తేऽహర్నిశం మయా। దాసోఽయమితి మాం మత్వా క్షమస్వ పరమేశ్వర।। (పరమశివుడికి నమస్కారం చేయాలి.) సమర్పణం: మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం కృపానిధే। యత్పూజితం మయా శివ పరిపూర్ణం తదస్తు తే। అనయా మయా కృత ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మకః శ్రీ సాంబ సదాశివ సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు।। (అక్షింతలు,పుష్పాలు,జలం కుడిచేతిలో తీసుకొని పరమశివుడి పాదాల ముందు వదలాలి.) హరనమః పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర।। హర హర హర।। ఓం నమః శివాయ।। ఓం నమః శివాయ।। ఓం నమః శివాయ।। భోళా శంకర భగవాన్ కీ జై ।। తీర్థప్రసాద గ్రహణం: అకాలమృత్యహరణం సర్వవ్యాధినివారణం।। సమస్తపాపక్షయకరం శ్రీ సాంబ సదాశివ పాదోదకం పావనం శుభమ్।। ఓం శ్రీ సాంబ సదాశివాయ నమః ప్రసాదం శీరసా గృహ్ణామి। ఓం శాంతిః శాంతిః శాంతిః।।
