అగ్ని ప్రతిష్ఠాపనం
అగ్ని ప్రతిష్ఠ:
ఓం భూర్భువస్సువరోమ్ ఇత్యగ్నిమిధ్వా - ధ్యాత్వా (ఓం భూర్భువస్సువరోమితి అగ్నిం ప్రతిష్టాప్య.)
బ్రహ్మ భూర్భువస్సువరోమ్
అగ్నిని వెలిగించాలి. స్రువములో కర్పూరం తీసుకొని అగర్బత్తీలతో కర్పూరం వెలిగించి హోమ గుండం లో ఉన్న సమిధలపై వెయ్యాలి
సమిధాధానము:
ఈ క్రింది మంత్రాలు పఠిస్తూ వరుసగా మూడు సమిధలను హోమ గుండమునందు సమర్పించాలి. ప్రతి మంత్రము చివరన ఉన్న త్యాగము (ఇదన్న మమ) సమిధ సమర్పించిన తదుపరి పలకాలి .
ఓం అయంత ఇధ్మ ఆత్మా జాతవేదస్తేనేధ్యస్వ వర్ధస్వ చ ।
అథాస్మాన్ ప్రజయా పశుభిర్బ్రహ్మవర్చసేనాన్నాద్యేన సమేధయ స్వాహా ।।
త్యాగము
ఇదమగ్నయే జాతవేదసే — ఇదం నమమ।
ఓం సమిధాగ్నిం దువస్యత ఘృతైర్బోధయతాతిథిమ్ ।
ఆస్మిన్ హవ్యా జుహోతన స్వాహా ।।
త్యాగము
ఇదమగ్నయే — ఇదం నమమ।
ఓం సుసమిద్ధాయ శోచిషే ఘృతం తీవ్రం జుహోతన ।
ఆస్మిన్ హవ్యా జుహోతన స్వాహా
త్యాగము
ఇదమగ్నయే — ఇదం నమమ।
అగ్ని ముఖం & ధ్యానం:
ఈ క్రింది మంత్రాలు చదువుతూ రెండు అరచేతులనూ అగ్ని వైపు చూపిస్తూ అగ్నిని మనసులో ధ్యానించాలి.
చత్వారి శృంగా త్రయో అస్య పాదా ద్వే శీర్షే సప్త హస్తాసో అస్య ।
త్రిధా బద్ధో వృషభో రోరవీతి మహో దేవో మర్త్యాగ్ం ఆవివేశ ।।
ఈ క్రింది మంత్రాలు చదువుతూ పుష్పాలను అగ్ని దగ్గర హోమగుండం దగ్గర సమర్పించాలి.
సప్తహస్తశ్చతుఃశృంగః సప్తజిహ్వో ద్విశీర్షకః ।
త్రిపాద ప్రసన్నవదనః సుఖాసీనః శుచిస్మితః ।।
స్వాహాస్తూ దక్షిణే పార్శ్వే దేవీమ్ వామే స్వధాం తథా ।
బిభ్రా దక్షిణ హస్తైస్తు శక్తిమన్నం సృచం సృవం ।।
తోమరం వ్యజనం వామైర్ ఘృత పాత్రం తు ధారయన్ ।
మేషారూఢం జటాబద్దం గౌరవర్ణం మహోజసం ।।
ధూమద్వజం లోహితాక్షం సప్తార్చిస్సర్వ కామదం ।
ఆత్మాభిముఖ మాసీనం ఏవం ధ్యాయేత్ హుతాశనం ।।
నమస్కారం:
అక్షింతలు పుష్పాలు చేతిలో తీసుకొని అగ్నికి నమస్కారం చేయాలి.
నమస్తే మహాతేజసే।
సాక్షాత్ యజ్ఞస్వరూపిణే।
మమ హవనకర్మ స్వీకురుష్వ।
మమ సర్వాభీష్టసిద్ధిం దేహి నమః।।
ఓం వైశ్వానరాయ నమః నమస్కారాన్ సమర్పయామి।।
అగ్ని ప్రార్థన:
ఏషహి దేవః ప్రదిషోను సర్వాహ పూర్వోహి జాతస్స ఉగర్భే అంతః ।
సవిజాయమాన స్సజిన్ష్యమాణః ప్రత్యఙ్ముఖా స్తిష్ఠతి విశ్వతోముఖః।।
జలమును, అక్షతలను తీసుకొని క్రింది మంత్రం చెప్పి అగ్నికి తూర్పున జలమును, పడమట అక్షతలను విడువాలి. అగ్ని అభిముఖీకరణం:
ప్రాఙ్ముఖాగ్నే మమాభిముఖో భవ । సుముఖో భవ । సుప్రసన్నో భవ । వరదో భవ ।
యథోక్త జిహ్వాయ హవిర్ గృహాణ ।ఆభిముఖ్యం సిద్ధిరస్తు ।।
అగ్ని దేవుడు మనకు అనుకూలంగా ఉండాలని కోరుకుంటూ అగ్నిని ప్రార్థించాలి. దోసిలిలా చేతులుంచి అగ్నిని ప్రార్థిస్తూ మన వైపు తిప్పుకోవాలి.
ఈ క్రింది మంత్రం పఠిస్తూ చేతిలో జలమును తీసుకొని అగ్ని చుట్టూ ప్రదక్షిణ క్రమముగా సమర్పించవలయును.
ఓం భూర్భువస్సువః । తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి । ధియో యో నః ప్రచోదయాత్ ।।
సోదకేన పాణినా ప్రదక్షిణ మగ్నిమ్ పరిసమూహ్య ।
అగ్నిమలం కృత్య::
ఒక్కో నామం పఠిస్తూ 8 దిక్కులలో హోమ గుండం పై పుష్పాలతో అలంకరించాలి. హోమ గుండమునకు నాలుగు వైపుల దర్భల యొక్క అగ్రములు (కొనలు) తూర్పు ఉత్తరమున నున్నట్లు ఉంచాలి. ఒక్కో నామం పఠిస్తూ తూర్పు మొదలుకొని క్రమముగా ఎనిమిది (8) దిక్కుల్లో అక్షతలు వేయాలి.
ఓం అగ్నయే నమః ।
హుతవహాయ నమః ।
హుతాశనే నమః ।
కృష్ణవర్త్మనే నమః ।
దేవముఖాయ నమః ।
సప్తజిహ్వాయ నమః ।
వైశ్వానరాయ నమః ।
జాతవేదసే నమః ।
పూర్వ పరిషేచనం (ప్రారంభం):
అదితేఽనుమన్యస్వ ।
దక్షిణము దిక్కున, పడమర నుండి తూర్పునకు కలశం లోని తమలపాకులతో లేదా పుష్పాలతో నీరు సరళ రేఖ (straight line )లో పోయాలి
అనుమతేఽనుమన్యస్వ
పడమర వైపున దక్షిణము నుండి ఉత్తరమునకు, కలశం లోని జలమును తమలపాకులతో లేదా పుష్పాలతో సరళ రేఖ (straight line) లో పోయాలి
సరస్వత్యేఽనుమన్యస్వ ।
ఉత్తరం వైపున పడమర నుండి తూర్పునకు, కలశం లోని జలమును తమలపాకులతో లేదా పుష్పాలతో సరళ రేఖ (straight line )లో పోయాలి.
దేవ సవితః ప్రసువ ।।
ఈశాన్యం నుండి మొదలుకొని ప్రదక్షిణ క్రమముగా మరల ఈశాన్యం వరకు కలశం లోని జలమును తమలపాకులతో లేదా పుష్పాలతో చుట్టూ (పరిషేచనం) తిప్పాలి.
అగ్ని ఆహుతి (ఉత్తరార్ధము):
ఏకం - ద్వే - త్రీణి - చత్వారి ఓం అగ్నయే స్వాహా ।
నాలుగు సార్లు నెయ్యిని స్రుక్కుతో స్రువములో వేసుకొని హోమగుండంలో ఉత్తరం నుండి తూర్పుకు నెయ్యిని అగ్నికి సమర్పించాలి.
తదుపరి
ఉత్తరార్ధ పూర్వార్ధే అగ్నయ ఇదం నమమ।
అని చెప్పాలి.)దీనినే ‘త్యాగము’ అంటారు.
ఇలా ప్రతి ఆహుతికి ఆయా దేవతలా యొక్క ‘త్యాగము’చెప్పవలసి ఉంటుంది.
సోమ ఆహుతి(దక్షిణార్థము):
ఏకం - ద్వే - త్రీణి - చత్వారి - సోమాయ స్వాహా।
నాలుగు సార్లు నెయ్యిని స్రుక్కుతో స్రువములో వేసుకొని హోమగుండంలో దక్షిణం నుండి తూర్పుకు నెయ్యిని అగ్నికి సమర్పించాలి.
త్యాగము
దక్షిణార్థ పూర్వార్ధే సోమాయ ఇదం నమమ ।
వాయువ్యం నుండి ఆగ్నేయం ఆహుతి:
ఏకం - ద్వే - త్రీణి - చత్వారి - వాయవ్యాదాగ్నేయాంతం స్వాహా ।
నాలుగు సార్లు నెయ్యిని స్రుక్కుతో స్రువములో వేసుకొని హోమగుండంలో వాయువ్యం (North-West) దిశ నుండి ఆగ్నేయం (South-East) కోణము ముగిసే వరకు సరళ రేఖ (straight line )లో నెయ్యిని అగ్నికి సమర్పించాలి.
త్యాగము
ఆగ్నేయా ఇదం నమమ ।
నైరుతి నుండి ఈశాన్యం ఆహుతి:
ఏకం - ద్వే - త్రీణి - చత్వారి - నైరృత్యాదీశానాంతం స్వాహా ।
నాలుగు సార్లు నెయ్యిని స్రుక్కుతో స్రువములో వేసుకొని హోమగుండంలో నైరృతి దిశ (South-West) నుండి ఈశాన(North - East) కోణము ముగిసే వరకు సరళ రేఖ (straight line )లో నెయ్యిని అగ్నికి సమర్పించాలి.
త్యాగము
ఈశానాయ ఇదం నమమ।
మధ్య భాగము (అగ్ని):
ఏకం - ద్వే - త్రీణి - చత్వారి - మధ్యే అగ్నయే స్వాహా ।
హోమగుండం మధ్యలో వేయాలి నెయ్యిని అగ్నికి సమర్పించాలి.
త్యాగము
అగ్నయ ఇదం నమమ।
వాస్తు హోమం
హవన ద్రవ్య (చరు) ఆహుతి విధానం:
ముందుగా గణపతి, సరస్వతి, గురువు, నవగ్రహాలు, నక్షత్ర మంత్రము (నక్షత్ర శాంతికి మాత్రమే), వాస్తు పురుష (వాస్తు హోమ సమయములో మాత్రమే) మరియు మహా మృత్యుంజయ దేవతలకు చరు ఆహుతులు ఇలా ఇవ్వాలి.
ఏకం - ద్వే - త్రీణి - చత్వారి
సుస్రువస్తీర్య చరుమధ్యాద్ద్విరవదాయ నాభిః ప్రత్యభిఘారయతి ।
స్రుక్కుతో స్రువములో 4 సార్లు ఆజ్య పాత్ర నుండి నెయ్యి వేసుకొని, బ్రాహ్మణుడు హవిస్సును పాత్రలోని మధ్య భాగములో నుండి స్రుక్కులో రెండు సార్లు వేసుకొని మళ్ళీ స్రువముతో నెయ్యి స్రుక్కులో ఉన్న ద్రవ్యం పై వేసి హోమగుండములో సమర్పించాలి.
ఓం గణానాం త్వా గణపతిగ్ం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం ।
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆ నః శృణ్వన్నూతిభిః సీద సాదనం స్వాహా ।।
త్యాగము
శ్రీ మహాగణపతయ ఇదం నమమ।
స్రుక్కుతో స్రువములో 4 సార్లు ఆజ్య పాత్ర నుండి నెయ్యి వేసుకొని, బ్రాహ్మణుడు హవిస్సును పాత్రలోని మధ్య భాగములో నుండి స్రుక్కులో రెండు సార్లు వేసుకొని మళ్ళీ స్రువముతో నెయ్యి స్రుక్కులో ఉన్న ద్రవ్యం పై వేసి హోమగుండములో సమర్పించాలి.
ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతీ ।
ధీనామవిత్ర్యవతు స్వాహా ।।
త్యాగము
శ్రీ మహా సరస్వత్యై ఇదం నమమ।
స్రుక్కుతో స్రువములో 4 సార్లు ఆజ్య పాత్ర నుండి నెయ్యి వేసుకొని, బ్రాహ్మణుడు హవిస్సును పాత్రలోని మధ్య భాగములో నుండి స్రుక్కులో రెండు సార్లు వేసుకొని మళ్ళీ స్రువముతో నెయ్యి స్రుక్కులో ఉన్న ద్రవ్యం పై వేసి హోమగుండములో సమర్పించాలి.
ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః ।
గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః స్వాహా ।।
త్యాగము
శ్రీ గురుదేవాయ ఇదం నమమ।
స్రుక్కుతో స్రువములో 4 సార్లు ఆజ్య పాత్ర నుండి నెయ్యి వేసుకొని, బ్రాహ్మణుడు హవిస్సును పాత్రలోని మధ్య భాగములో నుండి స్రుక్కులో రెండు సార్లు వేసుకొని మళ్ళీ స్రువముతో నెయ్యి స్రుక్కులో ఉన్న ద్రవ్యం పై వేసి హోమగుండములో సమర్పించాలి.
ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ ।
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః స్వాహా ।।
త్యాగము
ఆదిత్యాది నవగ్రహ దేవతా ఇదం నమమ
స్రుక్కుతో స్రువములో 4 సార్లు ఆజ్య పాత్ర నుండి నెయ్యి వేసుకొని, బ్రాహ్మణుడు హవిస్సును పాత్రలోని మధ్య భాగములో నుండి స్రుక్కులో రెండు సార్లు వేసుకొని మళ్ళీ స్రువముతో నెయ్యి స్రుక్కులో ఉన్న ద్రవ్యం పై వేసి హోమగుండములో సమర్పించాలి.
ఓం త్య్రంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనమ్ ।
ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్ స్వాహా ।।
త్యాగము
మహా మృత్యుంజయాయ ఇదం నమమ।
సృవ స్థాపన మంత్రము:
ఈ మంత్రం చదువుతూ స్రువములో నెయ్యి తీసుకొని హోమ ద్రవ్యము అందులో ఉంచి ఉత్తరం వైపు దర్భలపై లేదా సమిధలపై ఉంచాలి. ఇలా చేయడం వల్ల యజ్ఞ ఫలితం యజమానికి ల్కలుగుతుందని శాస్త్రం.
ఓం అపాం పుష్పమసి ।
తస్యతే రూపం పృథివ్యాం లోక ఉత్తరతో నిధాయ ।।
సృవముత్తరతో నిధాయ ।
గమనిక:
స్రువమునందు హవిస్సు తీసుకున్నప్పుడు అది బయటకు ఒలికి నేలపై పడకుండా చూసుకోవాలి;
స్రువమును ఎల్లప్పుడూ హోమ కుండమునకు ఉత్తర దిశలో దర్భల (కుశల) పైన మాత్రమే ఉంచవలెను.
గమనిక:స్వాహా అంటే అగ్ని దేవుని భార్య. ఈమెను స్వాహాదేవి అంటారు. దేవతలు అగ్ని యొక్క వేడిని తట్టుకోలేరు కనుక, ఆయా దేవతలయొక్క ఆహుతులను అగ్నికి సమర్పించినప్పుడు తాను ఆహుతిని తన చేతులతో స్వీకరించి ఆయా దేవతలకు అగ్ని ముఖము ద్వారా ఆహుతులను సురక్షితముగా అందిస్తుంది. ఇది బ్రహ దేవుడు ఆమెకిచ్చిన వరం.
ముందుగా ఈ మంత్రాలతో ఆహుతులివ్వాలి. తదుపరి ప్రధాన హవనం ప్రారంభించాలి. హోత మంత్రము చెప్పి స్వాహా అని పలుకగానే అధ్వర్యుడు స్రుక్కుతో ఆజ్యమును సమర్పించాలి.
ఓం గణానాం త్వా గణపతిగ్ం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం ।
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆ నః శృణ్వన్నూతిభిః సీద సాదనం స్వాహా ।।
త్యాగము
శ్రీ మహాగణపతయ ఇదం నమమ।
3 లేదా 9 సార్లు ఆహుతులివ్వాలి.
ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా స్వాహా ।।
త్యాగము
లక్ష్మీ గణపతయ ఇదం నమమ।
3 లేదా 9 సార్లు ఆహుతులివ్వాలి.
ఏకదంతాయ విద్మహే । వక్రతుండాయ ధీమహి ।
తన్నో దంతి ప్రచోదయాత్ ।।
త్యాగము
గణపతయ ఇదం నమమ।
3 లేదా 9 సార్లు ఆహుతులివ్వాలి.
ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ ।
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః స్వాహా ।।
త్యాగము
ఆదిత్యాది నవగ్రహ దేవతా ఇదం నమమ
వాస్తు హోమం - మంత్రాలు:
ఇప్పుడిక వాస్తు హోమం ప్రారంభించాలి. బ్రాహ్మణుడు మంత్రముతో స్వాహా కారమును చెప్పి స్రువముతో నెయ్యి అగ్నికి సమర్పించిన తదుపరి యజమాని హవిస్సును అగ్నికి సమర్పించాలి.
వాస్తు మండల అష్టాదశ (18) శక్తి దేవతా హవనం
లక్ష్మీ శక్తి
ఓం ఉన్నతో భవతి । సాహస్రీవా ఏషా లక్ష్మీర్యదున్నతో లక్ష్మ్యైవ పశూనా వరున్ధే స్వాహా ।।
లేదా
ఓం లక్ష్మ్యై నమః స్వాహా
త్యాగము
లక్ష్మ్యై ఇదం న మమ।
యశోవతీ శక్తి
ఓం యశోదాంత్వా యశసి తేజోదాంత్వా తేజసి పయోధాంత్వా పయసి వర్చోదాంత్వా వర్చసి ద్రవిణోదాంత్వా ద్రవిణే సాదయామి । తేన ఋషిణా తేన బ్రహ్మణా తయా దేవతయాంగిరస్వద్ధ్రువా సీద స్వాహా ।।।
లేదా
ఓం యశోవత్యై నమః స్వాహా
త్యాగము
యశోవత్యై ఇదం న మమ।
కాంతా శక్తి
ఓం కాంతా కామ్యా కామజాతా యుష్మతీ కామదుఘా । అభిశాస్తా ను మంతానందో మోదః ప్రమోదః స్వాహా ।।
లేదా
ఓం కాంతాయై నమః స్వాహా
త్యాగము
కాంతాయై ఇదం న మమ।
సుప్రియా శక్తి
ఓం ప్రియావో నామ హువే తురాణామ్ । ఆయత్తృపన్మరుతో వావశానా స్వాహా ।।
లేదా
ఓం సుప్రియాయై నమః స్వాహా
త్యాగము
సుప్రియాయై ఇదం న మమ।
సుకలా శక్తి
ఓం యత్త్వా క్రుద్ధః పరోవప మన్యునా యద వర్త్యా। సుకల్మషమగ్నే తత్తవ పునస్త్వోద్దీప పయామసి స్వాహా ।।
లేదా
ఓం సుకలాయై నమః స్వాహా
త్యాగము
సుకలాయై ఇదం న మమ।
శివా శక్తి
ఓం యాతే రుద్ర శివా తనూరఘోరాఽపాపకాశినీ । తయా నస్తనువా శంతమయా గిరిశంత చాకశీహి స్వాహా ।।
లేదా
ఓం శివాయై నమః స్వాహా
త్యాగము
శివాయై ఇదం న మమ।
సుభగా శక్తి
ఓం నివేశనీ సంగమనీ వసూనాం విశ్వా రూపాణి వసూన్యా వేశయంతీ । సహస్రపోషగ్ం సుభగా రరాణాసాన ఆగన్ వర్చసా సంవిదానా స్వాహా ।।
లేదా
ఓం సుభగాయై నమః స్వాహా
త్యాగము
సుభగాయై ఇదం న మమ।
సుముఖీ శక్తి
ఓం గాయత్రీ పురస్తాదుపదధాతి । తేజో వై గాయత్రీ తేజ ఏవ ముఖతో దత్తే స్వాహా ।।
లేదా
ఓం సుముఖ్యై నమః స్వాహా
త్యాగము
సుముఖ్యై ఇదం న మమ।
ఇడా శక్తి
ఓం ఇడామగ్నే పురుదగ్ం సగ్ం సనిం గోః శశ్వత్తమగ్ం హవమానాయా సాధ । స్యాన్నః సూనుస్తనయో విజావాఽగ్నే సా తే సుమతీర్భూత్వస్మే స్వాహా ।।
లేదా
ఓం ఇడాయై నమః స్వాహా
త్యాగము
ఇడాయై ఇదం న మమ।
ధాన్యా శక్తి
ఓం దేవస్య త్వా సవితుః ప్రసవేఽశ్వినోర్బాహుభ్యాం పూష్ణో హస్తాభ్యామధివపామి ధాన్యమసి ధినుహి దేవాతాత్ స్వాహా ।।
లేదా
ఓం ధాన్యాయై నమః స్వాహా
త్యాగము
ధాన్యాయై ఇదం న మమ।
ప్రాణా శక్తి
ఓం ప్రాణాయ త్వా అపానాయ త్వా వ్యానాయ త్వా దీర్ఘా మను ప్రసీతిమాయుషేధామ్ స్వాహా ।।
లేదా
ఓం ప్రాణాయై నమః స్వాహా
త్యాగము
ప్రాణాయై ఇదం న మమ।
విశాలా శక్తి
ఓం విశాలో భవతి । వ్యవసాయ యత్యై వైనం ప్రాజాపత్యం కృష్ణమాలభేత వృష్టికామః స్వాహా ।।
లేదా
ఓం విశాలాయై నమః స్వాహా
త్యాగము
విశాలాయై ఇదం న మమ।
స్థిరా శక్తి
ఓం పరిణో రుద్రస్య హేతిర్వృణక్తు పరి త్వేషస్య దుర్మతిరఘాయోః । అవ స్థిరా మఘవద్భ్యస్తనుష్వ మీఢ్వస్తోకాయ తనయాయ మృడయ స్వాహా ।।
లేదా
ఓం స్థిరాయై నమః స్వాహా
త్యాగము
స్థిరాయై ఇదం న మమ।
భద్రా శక్తి
ఓం ఆపో భద్రా ఘృతమిదాప ఆసురగ్నీషోమౌ బిభ్రత్యాప ఇత్తాః । తీవ్రో రసో మధుపృచామరంగమ ఆ మా ప్రాణేన సహ వర్చసాగ న్థ్స్వాహా ।।
లేదా
ఓం భద్రాయై నమః స్వాహా
త్యాగము
భద్రాయై ఇదం న మమ।
జయా శక్తి
ఓం అషాఢం యుత్సు పృతనాసు పప్రిమ్ । సువర్షా మప్స్వామ్ వృజనస్య గోపామ్ । భరేషు జాగ్ం సుక్షితిగ్ం సుశ్రవసం । జయన్తన్త్వా మను మదేమ సోమ స్వాహా ।।
లేదా
ఓం జయాయై నమః స్వాహా
త్యాగము
జయాయై ఇదం న మమ।
నిశా శక్తి
ఓం నిశితాయాన్నిర్వపేన్నిశితా యాగ్ం హిరక్షాగ్ంసి ప్రేరతే । సంప్రేర్ణాన్యేవైనా నిహన్తి పరిశ్రితే యాజయే ద్రక్షసా మనన్వవ చారాయ రక్షోఘ్ని యాజ్యానువాక్యేభవతో రాక్షసాగ్ సృత్యై స్వాహా ।।
లేదా
ఓం నిశాయై నమః స్వాహా
త్యాగము
నిశాయై ఇదం న మమ।
విరజా శక్తి
ఓం ఉత్తిష్ఠ పురుష హరిత పింగల లోహితాక్షి దేహి దేహి దదాపయితా మే శుధ్యంతామ్ । జ్యోతిరహం విరజా విపాప్మా భూయాసం స్వాహా ।।
లేదా
ఓం విరజాయై నమః స్వాహా
త్యాగము
విరజాయై ఇదం న మమ।
విభవా శక్తి
ఓం విభూరసి ప్రవాహణో రౌద్రేణానీకేన పాహి మాఽగ్నే పిపృహి మామా మాహిగ్ంసీ స్వాహా ।।
లేదా
ఓం విభవాయై నమః స్వాహా
త్యాగము
విభవాయై ఇదం న మమ।
శిఖీ
ఓం నమశ్శంభవే చ మయోభవే చ నమశ్శంకరాయ చ మయస్కరాయ చ నమశ్శివాయ చ శివతరాయ చ స్వాహా ।
లేదా
ఓం శిఖినే నమః స్వాహా
త్యాగము
శిఖిన ఇదం న మమ।
పర్జన్యః
ఓం ని కామెనీ కామెనః పర్జన్యో వర్షతు ఫలిన్యో న ఓషధయః పచ్యంతాం యోగక్షేమో నః కల్పతాం నమః స్వాహా ।।
లేదా
ఓం పర్జన్యాయ నమః స్వాహా
త్యాగము
పర్జన్యాయ ఇదం న మమ।
జయంతః
ఓం మర్మాణి తే వర్మభిశ్ఛాదయామి సోమస్త్వా రాజామృతేనాభివస్తామ్ । ఉరోర్వరీయో వరివస్తే అస్తు జయంతంత్వా మనుమదంతు దేవాః స్వాహా ।।
లేదా
ఓం జయంతాయ నమః స్వాహా
త్యాగము
జయంతాయ ఇదం న మమ।
కులిశాయుధః / ఇంద్రః
ఓం ఇంద్రస్య వజ్రో మరుతామనీకం మిత్రస్య గర్భో వరుణస్య నాభిః । సేమాం నో హవ్యదాతిం జుషాణో దేవరథ ప్రతిహవ్యా గృభాయ స్వాహా ।।
లేదా
ఓం కులిశాయుధాయ నమః స్వాహా
త్యాగము
కులిశాయుధాయేదం న మమ।
సూర్యః
ఓం తరణిర్విశ్వదర్శతో జ్యోతిష్కృదసి సూర్య । విశ్వమాభాసి రోచనమ్ స్వాహా ।।
లేదా
ఓం సూర్యాయ నమః స్వాహా
త్యాగము
సూర్యాయేదం న మమ।
సత్యః
ఓం ఋతగ్ం సత్యం పరం బ్రహ్మ పురుషం కృష్ణపింగళమ్ । ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమో నమః స్వాహా ।।
లేదా
ఓం సత్యాయ నమః స్వాహా
త్యాగము
సత్యాయేదం న మమ।
భృశః
ఓం ఆ త్వాహార్షమంతర భూః ధృవస్తిష్ఠా విచాచలిః । విశస్త్వా సర్వా వాంఛంతు మా త్వ ద్రాష్ట మధి భ్రశత్ స్వాహా ।।
లేదా
ఓం భృశాయ నమః స్వాహా
త్యాగము
భృశాయేదం న మమ।
ఆకాశః
ఓం ఉద్వూర్ధ్వస్తిష్ఠా ఊతయేఽవ నో దేవా సవితా । ఊర్ధ్వో వాజస్య సనితా యదంజిభిర్వాఘద్భిర్విహ్వయామహే స్వాహా ।।
లేదా
ఓం ఆకాశాయ నమః స్వాహా
త్యాగము
ఆకాశాయేదం న మమ।
అనిలః / వాయుః
ఓం ఉపశ్రేష్ఠాన ఆశిషోదేవయోర్ధర్మే అస్థిరన్ । స్తౌమి వాయుగ్ం సవితారం నాథితో జోహవీమి తా నో ముంచత మాగసః స్వాహా ।।
లేదా
ఓం వాయవే నమః స్వాహా
త్యాగము
వాయవ ఇదం న మమ।
పుషాణ
ఓం సూర్య రశ్మిర్ హరికేశః పురస్తాథ్సవితా జ్యోతిరుదయాగ్ం అజస్రమ్ । తస్య పూషా ప్రసవం యాతి దేవ సంపశ్యన్విశ్వా భువనాని గోపాః స్వాహా ।।
లేదా
ఓం పూష్ణే నమః స్వాహా
త్యాగము
పూష్ణ ఇదం న మమ।
వితథః
ఓం ఉద్వయం తమసస్పరి పశ్యంతో జ్యోతిరుత్తరమ్ । దేవం దేవత్రా సూర్యమగన్మ జ్యోతిరుత్తమమ్ స్వాహా ।।
లేదా
ఓం వితథాయ నమః స్వాహా
త్యాగము
వితథాయేదం న మమ।
గృహక్షతః
ఓం సవితా త్వా ప్రసవానాగ్ం సువతామగ్నిర్ గృహపతీనాగ్ం । సోమో వనస్పతీనాగ్ం రుద్రః పశూనామ్ స్వాహా ।।
లేదా
ఓం గృహక్షతాయ నమః స్వాహా
త్యాగము
గృహక్షతాయేదం న మమ।
యమః
ఓం యమాయ సోమగ్ం సునుత యమాయ జుహుతా హవిః । యమగ్ం హ యజ్ఞో గచ్ఛత్యగ్నిదూతో అరంకృతః స్వాహా ।।
లేదా
ఓం యమాయ నమః స్వాహా
త్యాగము
యమాయేదం ఇదం న మమ।
గంధర్వః
ఓం గంధర్వోఽసి విశ్వావసుర్విశ్వస్మాదీషతో యజమానస్య పరిధిరీడ ఈడితః స్వాహా ।।
లేదా
ఓం గంధర్వాయ నమః స్వాహా
త్యాగము
గంధర్వాయేదం న మమ।
భృంగరాజః
ఓం సుపర్ణః పార్జన్యో హగ్ం సో వృకో వృషదగ్ం శస్త ఐంద్రాః । ఆపాముద్రోర్ యమ్ణే లోపా శస్సిగ్ం హోనకులో వ్యాఘ్రస్తే మహేంద్రాయ కామాయ పరస్వాంతః స్వాహా ।।
లేదా
ఓం భృంగరాజాయ నమః స్వాహా
త్యాగము
భృంగరాజాయేదం న మమ।
మృగః
ఓం ప్రతద్విష్ణుస్తవతే వీర్యాయ మృగో న భీమః కుచరో గిరిష్ఠాః । యస్యోరుషు త్రిషు విక్రమణేష్వధిక్షియంతి భువనాని విశ్వా స్వాహా ।।
లేదా
ఓం మృగాయ నమః స్వాహా
త్యాగము
మృగాయేదం న మమ।
పితరః
ఓం ఉశంతస్త్వా హవామహ ఉశంతస్సమిధీమహి । ఉశన్నుశత ఆ వహ పితౄన్ హవిషే అత్తవే స్వాహా ।।
లేదా
ఓం పితృభ్యః నమః స్వాహా
త్యాగము
పితృభ్య ఇదం న మమ।
దౌవారికః
ఓం ద్వారో దేవీరస్వస్య విశ్వే వ్రతా దదంతే అగ్నేః । ఉరువ్యచసో ధామ్నా పత్యమానాః స్వాహా ।।
లేదా
ఓం దౌవారికాయ నమః స్వాహా
త్యాగము
దౌవారికాయేదం న మమ।
సుగ్రీవః
ఓం నీలగ్రీవాః శితికంఠాః శర్వా అధః క్షమాచరాః । నీలగ్రీవాః శితికంఠా దివం రుద్రా ఉపశ్రితాః ।
యే వృక్షేషు సస్పింజరా నీలగ్రీవా విలోహితాః । యే భూతానామధిపతయో విశిఖాసః కపర్దినః ।
యే అన్నేషు వివిధ్యంతి పాత్రేషు పిబతో జనాన్ । యే పథాం పథిరక్షయ ఐలబృదా యవ్యుధః ।
యే తీర్థాని ప్రచరంతి సృకావంతో నిషంగిణః । య ఏతావంతశ్చ భూయాంసశ్చ దిశో రుద్రా వితస్థిరే ।
తేషాగ్ం సహస్రయోజనేఽవధన్వాని తన్మసి స్వాహా ।।
లేదా
ఓం సుగ్రీవాయ నమః స్వాహా
త్యాగము
సుగ్రీవాయేదం న మమ।
పుష్పదంతః
ఓం గణానాం త్వా గణపతిగ్ం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమమ్ । జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆ నః శృణ్వన్నూతిభిస్సీద సాదనమ్ స్వాహా ।।
లేదా
ఓం పుష్పదంతాయ నమః స్వాహా
త్యాగము
పుష్పదంతాయేదం న మమ।
వరుణః
ఓం ఇమం మే వరుణ శ్రుధీ హవమద్యా చ మృడయ । త్వామవస్యురా చకే స్వాహా ।।
లేదా
ఓం వరుణాయ నమః స్వాహా
త్యాగము
వరుణాయేదం న మమ।
అసురః
ఓం అసురా వై అస్మిన్ లోకే నిరమ్యంత దేవాః ప్రాజాపత్యేనాపఘ్నన్ బాహుమాత్రాన్ అవవిందన్ తస్మాద్ బాహుమాత్రాః ఖాయంతే స్వాహా ।।
లేదా
ఓం అసురాయ నమః స్వాహా
త్యాగము
అసురాయేదం న మమ।
శేషః
ఓం యా ఇషవో యాతుధానానాం యేవా వనస్పతీగ్ం రను । యేవా వటేషు శేరతే తేభ్యః సర్వేభ్యో నమః స్వాహా ।।
లేదా
ఓం శేషాయ నమః స్వాహా
త్యాగము
శేషాయేదం న మమ।
పాపయక్ష్మా
ఓం పాపవస్య సంవా ఏతత్క్రియతే యాచ్చ్రేయ సా చ పాపాపీయసాచసమానం కర్మ కృణ్వన్తి పాపీయాన్ పశ్చాదన్వేతి స్వాహా ।।
లేదా
ఓం పాపాయ నమః స్వాహా
త్యాగము
పాపాయేదం న మమ।
రోగః
ఓం రోగాయ నమః స్వాహా
త్యాగము
రోగాయేదం న మమ।
అహిర్బుధ్న్యః / రుద్రః
ఓం అహిరివ భోగైః పర్యేతి బాహుం జ్యాయా హేతిం పరిబాధమానః । హస్తఘ్నో విశ్వా వయునాని విద్వాన్ పుమాన్ పుమాగ్ం సం పరిపాతు విశ్వతః స్వాహా ।।
లేదా
ఓం అహిర్బుధ్న్యాయ నమః స్వాహా
త్యాగము
అహిర్బుధ్న్యాయేదం న మమ।
ముఖ్యః
ఓం యస్య ముఖ్యవతీ పురస్తా దుపధీయంతే ముఖ్య ఏవభవత్యాస్య ముఖ్యో జాయతే స్వాహా ।।
లేదా
ఓం ముఖ్యాయ నమః స్వాహా
త్యాగము
ముఖ్యాయేదం న మమ।
భల్లాటః
ఇమాగ్ం రుద్రాయ॑ తవసే॑ కపర్దినే క్షయద్వీరాయ ప్రభ॑రామహే మతిమ్ ।యథా న: శమస॑ద్ద్వి॒పదే చతుష్పదే విశ్వం పుష్టం గ్రామే అస్మిన్ననాతురమ్ స్వాహా ।।
లేదా
ఓం భల్లాటాయ నమః స్వాహా
త్యాగము
భల్లాటాయేదం న మమ।
సోమః
ఓం త్వగ్ం సోమ ప్రచికితో మనీషా త్వగ్ం రాజిష్ఠమనునేషి పంథామ్ । తవ ప్రణీతీ పితరో న ఇన్దో దేవేషు రత్నమభజంత ధీరాః స్వాహా ।।
లేదా
ఓం సోమాయ నమః స్వాహా
త్యాగము
సోమాయేదం న మమ।
భుజగ
ఓం నమోఽస్తు సర్పేభ్యో యే కే చ పృథివీమను । యే అంతరిక్షే యే దివి తేభ్యః సర్పేభ్యో నమః స్వాహా ।।
లేదా
ఓం భుజగాయ నమః స్వాహా
త్యాగము
భుజగాయేదం న మమ।
నాగః
ఓం ఇదగ్ం సర్పేభ్యో॑ హవిర॑స్తు జుష్టమ్ । ఆశ్రేషా యేషా॑మనుయన్తి చేత॑: ।
యే అంతరి॑క్షం పృథివీం క్షియన్తి॑ । తే న॑స్సర్పాసో హవమాగ॑మిష్ఠాః ।
యే రో॑చనే సూర్యస్యాపి॑ సర్పాః । యే దివం దేవీమను॑సన్చర॑న్తి ।
యేషా॑మాశ్రేషా అ॑నుయన్తి కామమ్ ।
తేభ్య॑స్సర్పేభ్యో మధు॑మజ్జుహోమి స్వాహా ।।
లేదా
ఓం నాగాయ నమః స్వాహా
త్యాగము
నరాయేదం న మమ।
అదితిః
ఓం అదితిర్న ఉరుష్యత్వదితిః శర్మ యచ్ఛతు । అదితిః పాత్వగ్ం హసః స్వాహా ।।
లేదా
ఓం అదిత్యై నమః స్వాహా
త్యాగము
అదిత్యాయై ఇదం న మమ।
దితిః
ఓం మహీమూషు మాతరగ్ం సువ్రతానామృతస్య పత్నీమవసే హువేమ । తువిక్షత్రామజరంతీమురూచీగ్ం సుశర్మాణమదితిగ్ం సుప్రణీతిగ్ం స్వాహా ।।
లేదా
ఓం దిత్యై నమః స్వాహా
త్యాగము
దిత్యై ఇదం న మమ।
ఆపః
ఓం ఆపో అస్మాన్మాతర శ్శుద్ధంతు ఘృతేన నో ఘృత పువః పునంతు విశ్వమస్మత్ప్రవ హస్తురి ప్రముదాభ్య శుచిరాపూత ఏమి స్వాహా ।।
లేదా
ఓం అద్భ్యః నమః స్వాహా
త్యాగము
అద్భ్య ఇదం న మమ।
ఆపవత్సః
ఓం సధమా దోద్యుమ్ని నీరూర్జ ఏతా అని భృష్టా అపస్యువో వసానః । పస్త్యాసు చక్రే వరుణ స్సధస్థమ పాగ్ం శిశర్మాతృత మాస్త్వన్త స్వాహా ।।
లేదా
ఓం ఆపవత్సాయ నమః స్వాహా
త్యాగము
ఆపవత్సాయేదం న మమ।
ఆర్యమా
ఓం ఆర్యమాయాతి వృషభస్తువిష్మాన్ దాతా వసూనాం పురుహూతో అర్ హన్ । సహస్రాక్షో గోత్రభిద్వజ్ర బాహురస్మా సుదేవో ద్రవిణం దధాతు స్వాహా ।।
లేదా
ఓం ఆర్యమ్ణే నమః స్వాహా
త్యాగము
ఆర్యమ్ణ ఇదం న మమ।
సావిత్రః
ఓం హస్త ఆధాయ సవితా బిభ్రద్ధరణ్యయాముత । జ్యోతిరజస్రమిదమగ్నిం ఖాత్వేన ఆభరానుష్టుభేన ఛందసాఽంగిరస్వత్ స్వాహా ।।
లేదా
ఓం సావిత్రాయ నమః స్వాహా
త్యాగము
సావిత్రాయేదం న మమ।
సవితా
ఓం విశ్వాని దేవ సవితర్దురితాని పరాసువ । యద్భద్రం తన్న ఆసువ స్వాహా ।।
లేదా
ఓం సవిత్రే నమః స్వాహా
త్యాగము
సవిత్ర ఇదం న మమ।
వివస్వాన్
ఓం వివస్వ ఆదిత్యైషతే సోమపీథస్తేన మందస్వతన తృప్యతృప్యాస్మ తేవయంతర్పయితారో యాదివ్యావృష్టిస్తయాత్వా శ్రీణామి స్వాహా ।।
లేదా
ఓం వివస్వతే నమః స్వాహా
త్యాగము
వివస్వత ఇదం న మమ।
విబుధాధిపః / ఇంద్రః
ఓం స బోధి సూరిర్మఘవా వసుదావా వసుపతిః । యుయోధ్యస్మద్వేషాగ్ంసి స్వాహా ।।
లేదా
ఓం విబుధాధిపాయ నమః స్వాహా
త్యాగము
విబుధాధిపాయేదం న మమ।
జయంతః
ఓం అషాఢం యుధ్సు పృతనాసు పప్రీమ్। సువర్ షా మప్స్వామ్ వృజనస్య గోపామ్ । భరేషుజాగ్ం సుక్షితగ్ం సుశ్రవసం। జయంతత్వా మనుమదేమ సోమ స్వాహా ।।
లేదా
ఓం జయంతాయ నమః స్వాహా
త్యాగము
జయంతాయేదం న మమ।
మిత్రః
ఓం మిత్రోన ఏహి సుమిత్రధా ఇంద్రస్యోరుమావిశ దక్షిణ ముశన్నుశస్తగ్గ్ స్యోన స్యోనగ్గ్ స్వాన భ్రాజం ఘారే భంబారే హస్త సుహస్త కృశానవే తేవ సోమక్రయణాస్తాన్ రక్షధ్వం మా వో దభన్ స్వాహా ।।
లేదా
ఓం మిత్రాయ నమః స్వాహా
త్యాగము
మిత్రాయేదం న మమ।
రాజయక్ష్మా/ రుద్రదాస
ఓం ఐత్తం యక్ష్మ ఆర్చద్రాజానం యక్ష్మ ఆరదితి తద్రాజ
యక్ష్మస్య జన్మ యత్సాపీయాన భవత్తత్పాప యక్ష్మస్య యజ్ఞయాభ్యో విందత్త
జ్జాయేన్యస్యయ ఏవమేతేషాం యక్ష్మాణాం జన్మ వేదనైన మేతే యక్ష్మా విందంతి స్వాహా ।।
లేదా
ఓం రాజయక్ష్మణే నమః స్వాహా
త్యాగము
రాజయక్ష్మణ ఇదం న మమ।
రుద్రః
ఓం అవాంబ రుద్ర మహ్యవ దేవం త్య్రంబకం । యథా నః శ్రేయసః కరద్యథా నో వస్యసః కరద్యథా నః పశుమతః కరద్యథా నో వ్యవసాయయాత్ స్వాహా ।।
లేదా
ఓం రుద్రాయ నమః స్వాహా
త్యాగము
రుద్రాయేదం న మమ।
పృథ్వీధరః
ఓం స్యోనా పృథివి భవానృక్షరా నివేశినీ । యచ్ఛా నః శర్మ సప్రథాః స్వాహా ।।
లేదా
ఓం పృథ్వీధరాయ నమః స్వాహా
త్యాగము
పృథ్వీధరాయేదం న మమ।
బ్రహ్మా
ఓం బ్రహ్మ జజ్ఞానం ప్రథమం పురస్తాద్వి సీమతస్సురుచో వేన ఆవః । స బుధ్నియా ఉపమా అస్య విష్ఠాస్సతశ్చ యోనిమసతశ్చ వివః స్వాహా ।।
లేదా
ఓం బ్రహ్మణే నమః స్వాహా
త్యాగము
బ్రహ్మణ ఇదం న మమ।
9 సార్లు పై మంత్రం చదువుతూ ఆహుతులు ఇవ్వాలి.
రక్షక దేవతా హవనం
చరకీ (ఈశాన్య బాహ్య రక్షక శక్తి)
ఓం యత్తే దేవి నిర్ఋతి రాబబంథదామా గ్రీవా స్వవిచర్త్యమ్ । ఇదంతే తద్విష్యామ్యాయుషో న మధ్యాదథా జీవః పితూమద్ధి ప్రముక్తః స్వాహా ।।
లేదా
ఓం చరక్యై నమః స్వాహా
త్యాగము
చరక్యా ఇదం న మమ।
విదారీ (ఆగ్నేయ బాహ్య రక్షక శక్తి)
ఓం అక్షరాజాయ కితవమ్ । కృతాయ సభా వినమ్ । త్రేతాయై ఆదినవదర్శమ్ । ద్వాపరాయ బహిస్సదమ్ । కలయే సభాస్థాణుమ్ । దుష్కృతాయ చరకాచార్యమ్ । అధ్వనే బ్రహ్మచారిణమ్ స్వాహా ।।
లేదా
ఓం విదార్యై నమః స్వాహా
త్యాగము
విదార్యా ఇదం న మమ।
పూతనా (నైరుతి బాహ్య రక్షక శక్తి)
ఓం ఇంద్రస్య క్రోడోఽదిత్యై పాజస్యం దిశాం జత్రవో జీమూతాన్ హృదయేన । పశాభ్య మంతరిక్షం పురితతా నభ దర్యేనేఁద్రాణీమ్ ప్లీహ్నా వల్మీకాన్ క్లోమ్నా గిరీన్ ప్లాశిభిస్సముద్ర ముదరేణ వైశ్వానరం భస్మనా స్వాహా ।।
లేదా
ఓం పూతనాయై నమః స్వాహా
త్యాగము
పూతనాయా ఇదం న మమ।
పాపరాక్షసి (వాయువ్య బాహ్య రక్షక శక్తి)
ఓం యస్యాస్తే అస్యాః క్రూర ఆసన్ జుహోమ్యే షాం బంథానామవసర్జనాయ । భూమిరితి త్వా జనా విదుర్నిర్ఋతిరితి త్వాహం పరివేద విశ్వతః స్వాహా ।।
లేదా
ఓం పాపరాక్షస్యై నమః స్వాహా
త్యాగము
పాపరాక్షస్యా ఇదం న మమ।
స్కందః
ఓం యత్ర బాణాః సంపతంతి కుమారా విశిఖా ఇవ । ఇంద్రో నస్తత్ర వృత్రహా విశ్వాహా శర్మ యచ్ఛతు స్వాహా ।।
లేదా
ఓం స్కందాయ నమః స్వాహా
త్యాగము
స్కందాయేదం న మమ।
అర్యమా (దక్షిణ- బ్రహ్మస్థాన సమీప దేవత)
ఓం ఆర్యమాయాతి వృషభస్తువిష్మాన్ దాతా వసూనాం పురుహూతో అర్ హన్ । సహస్రాక్షో గోత్రభిద్వజ్ర బాహురస్మా సుదేవో ద్రవిణం దధాతు స్వాహా ।।
లేదా
ఓం అర్యమ్ణే నమః స్వాహా
త్యాగము
అర్యమ ఇదం న మమ।
జృంభకః (పశ్చిమ బాహ్య రక్షక శక్తి)
దంష్ట్రాభ్యాం మలిమ్లూం జంభ్యైస్తస్కరాంగ్ం ఉత । హనూభ్యాగ్ం స్తేనాన్ భగవస్తాగ్ స్త్వంఖాద సుఖాదితాన్ స్వాహా ।।
లేదా
ఓం జృంభకాయ నమః స్వాహా
త్యాగము
జృంభకాయేదం న మమ।
పిలిపిచ్ఛః / విదారి పుత్రః (దక్షిణ బాహ్య రక్షక శక్తి)
ఓం కిగ్స్విదాసీత్పూర్వచిత్తిః కిగ్స్విదాసీద్బృహద్వయః । కిగ్స్విదాసీత్పిశంగిలా కిగ్స్విదాసీత్పిలిప్పిలా స్వాహా ।।
లేదా
ఓం పిలిపిచ్ఛాయ నమః స్వాహా
త్యాగము
పిలిపిచ్ఛాయేదం న మమ।
అష్టదిక్పాలక దేవతా హవనం:
తూర్పు - ఇంద్రః (East):
ఓం ఇంద్రం వో విశ్వత స్పర్తిహ వామహే జనేభ్యః అస్మాకమస్తు కేవల స్స్వాహా।।
లేదా
ఓం ఇంద్రాయ నమః స్వాహా।
త్యాగము
ఇంద్రాయ ఇదం నమమ।
ఆగ్నేయం - అగ్నిః (South East):
ఓం అగ్నిం దూతం వృణీ మహేహోతారం విశ్వవేదసమ్।
అస్య యజ్ఞస్య సుక్రతగ్గ్॒ స్వాహా।।
లేదా
ఓం అగ్నయే నమః స్వాహా।
త్యాగము
అగ్నయ ఇదం నమమ।।
దక్షిణం - యమః (South):
యమాయ సోమగ్ం సునుత యమాయ జుహుతా హవిః।
యమగ్ం హ యజ్ఞో గచ్ఛత్యగ్ని దూతో అరంకృత స్వాహా। ।।
లేదా
ఓం యమాయ నమః స్వాహా।
త్యాగము
యమాయ ఇదం నమమ।
నైరుతి - నిర్ఋతిః (South West):
మొషుణః పరాపరా నిర్ ఋతి ర్దృహణావధీత్।
పతీష్ట తృష్ణ యా సహ స్వాహా।।
లేదా
ఓం నిరృతయే నమః స్వాహా।।
త్యాగము
నిరృతయే ఇదం నమమ।
పశ్చిమం - వరుణః (West):
ఇమంమే వరుణః శ్రుధీహవ మద్యాచమృడయ।
త్వా మ వస్యురాచకే స్వాహా।।
లేదా
ఓం వరుణాయ నమః స్వాహా।
త్యాగము
వరుణాయ ఇదం నమమ।
వాయువ్యం - వాయుః (North West):
తవవాయ వృతస్పతే త్వష్టుర్జామాత రద్భుత।
ఆవాంస్యా వృణీ మహే స్వాహా।।
లేదా
ఓం వాయవే నమః స్వాహా।
త్యాగము
వాయవే ఇదం నమమ।
ఉత్తరం - కుబేరః (North):
సోమే ధేనుగ్ం సోమో అర్వంత మాశుగ్ం సోమో వీరం కర్మణ్యం దదాతు।
సాదన్యం విదధ్స్వగ్ం సభేయం పితుశ్రవణం యో దదాశ దస్మై స్వాహా।।
లేదా
ఓం కుబేరాయ నమః స్వాహా।
త్యాగము
కుబేరాయ ఇదం నమమ।
ఈశాన్యం - ఈశానః (North East):
ఓం ఈశానః సర్వవిద్యానామీశ్వరః సర్వభూతానాం।
బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మా శివో మే అస్తు సదాశివోమ్ స్వాహా ।।
లేదా
ఓం ఈశానాయ నమః స్వాహా।
త్యాగము
ఈశానాయ ఇదం నమమ।
ఊర్ధ్వ దిశ (పైకి) - ఊర్ధ్వ పురుషుడు:
ఊర్ధ్వ ఊషుణ ఊతయే తిష్టా దేవో న సవితా।
ఊర్ధ్వో వాజస్య సవితా యదం జిభీ ర్వాషు ద్బీర్విహ్వయామహే స్వాహా।।
లేదా
ఓం ఊర్ధ్వ పురుషాయ బ్రహ్మణే నమః స్వాహా।
త్యాగము
ఊర్ధ్వ పురుషాయ ఇదం నమమ।
అధో దిశ (కిందకి) - పృథివీ:
స్యోనా పృథి భవానృక్షరాని వేశనీ।
యచ్చాన శ్శర్మ సప్రథా స్వాహా।।
లేదా
ఓం పృథివ్యై అనంతాయా నమః స్వాహా ।
త్యాగము
పృథివ్యై ఇదం నమమ।
వాస్తుపురుష ప్రధాన హవనం
21 సార్లు ఈ క్రింది మంత్రం చదువుతూ ఆహుతులు ఇవ్వాలి. బ్రాహ్మణుడు ఆజ్యం వేయగానే యజమాని సమిధలు వెయ్యాలి. మిగితావారు హవిస్సును వేస్తూ ఉండాలి.
ఓం వాస్తోష్పతే ప్రతి జానీహ్యస్మాన్ త్స్వావేశో అనమీవో భవా నః । యత్ త్వేమహే ప్రతి తన్నో జుషస్వ శం న ఏధి ద్విపదే శం చతుష్పదే స్వాహా ।।
లేదా
ఓం శ్రీ మహావిష్ణు స్వరూప వాస్తుపురుషాయ నమః స్వాహా
త్యాగము
వాస్తుపురుషాయేదం న మమ।
తదుపరి ఈ క్రింది మంత్రాలు చదువుతూ ఒక్కో ఆహుతి ఇవ్వాలి.
ఓం వాస్తోష్పతే శగ్మయా సగ్ం సదా తే సక్షీమహి రణ్వయా గాతుమత్యా। ఆవః క్షేమ ఉత యోగే వరంనోయూయం పాత స్వస్తిభిః సదా నః స్వాహా ।।
లేదా
ఓం వాస్తుపురుషాయ నమః స్వాహా
త్యాగము
వాస్తుపురుషాయేదం న మమ।
ఓం అమీవహా వాస్తోష్పతే విశ్వా రూపాణ్యావిశన్ । సఖా సుశేవ ఏధి నః స్వాహా ।।
లేదా
ఓం వాస్తుపురుషాయ నమః స్వాహా
త్యాగము
వాస్తుపురుషాయేదం న మమ।
ఓం వాస్తోష్పతే ప్రతరణో న ఏధి గోభిరశ్వేభిరిందో । అజరాసస్తే సఖ్యే శ్యామ పితేవ పుత్రాన్ప్రతినో జుషస్వ స్వాహా ।।
లేదా
ఓం వాస్తుపురుషాయ నమః స్వాహా
త్యాగము
వాస్తుపురుషాయేదం న మమ।
ఓం వాస్తోష్పతే ధ్రువా స్థూణాం సత్రం సోమ్యానామ్ । ద్రప్సో భేత్తా పురాం శాశ్వతీనామింద్రో మునీనాం సఖా స్వాహా ।।
లేదా
ఓం వాస్తుపురుషాయ నమః స్వాహా
త్యాగము
వాస్తుపురుషాయేదం న మమ।
ఉపదేవతా హవనం:
దుర్గా:
ఓం జాతవేదసే సునవామ సోమమరాతీయతో నిదహాతి వేదః ।
సనః పర్షదతి దుర్గాణి విశ్వా నావేవ సింధుం దురితాత్యగ్ని స్వాహా ।।
లేదా
ఓం దుర్గాయై నమః స్వాహా।
త్యాగము
దుర్గాయై ఇదం నమమ।
గణపతి:
ఓం గణానాం త్వా గణపతిగ్ం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం ।
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆ నః శృణ్వన్నూతిభిః సీద సాదనగ్గ్ స్వాహా ।।
లేదా
ఓం గం గణపతయే నమః స్వాహా।
త్యాగము
గణపతయ ఇదం నమమ।
క్షేత్రపాలకుడు:
ఓం క్షేత్రస్య పతినా వయగ్ం హితేనేేవ జయామసి।
గామశ్వం పోషయిత్న్వా సనో మృడాతీదృశే స్వాహా।।
లేదా
ఓం క్షేత్రపాలకాయ నమః స్వాహా।
త్యాగము
క్షేత్రపాలకాయ ఇదం నమమ।
అభయంకరుడు:
యత ఇంద్ర భయామహే తతో నో అభయం కృధి ।।
మఘవన్ ఛగ్దితవతన్న ఊతయే విద్విషో విమృదో జహి ।।
స్వస్తిదా విశప్పతీ ర్వృత్రహా విమృధో వశీ వృషేంద్రః పుర ఏతు నస్స్వస్తిదా
అభయంకర స్వాహా ।।
లేదా
ఓం అభయంకరాయ నమః స్వాహా।
త్యాగము
అభయంకరాయ ఇదం నమ।
వాస్తుపురుషుడు:
ఓం వాస్తుష్పతే ప్రతిజానీహ్యస్మాన్ థ్స్వావేశో అనమీవో భవానః।
యత్త్వేమహే ప్రతితన్నో జుషస్వ శంన ఏథి ద్విపదే శం చతుష్పదే స్వాహా।।
లేదా
ఓం వాస్తువురుషాయ నమః స్వాహా।
త్యాగము
వాస్తువురుషాయ ఇదం నమమ।
సరస్వతి
ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతీ ।
ధీనామవిత్ర్యవతు స్వాహా।।
బ్రహ్మ:
బ్రహ్మాదేవానాం పదవిః క నాం ఋషి ర్విప్రాణాం మహిషో మృగాణామ్ ।
శ్వేనో గృధ్రాణాగ్ం స్వధితి ర్వనానాగ్ం సోమః పవిత్రమత్యేతి రేభన్ స్వాహా ।।
లేదా
ఓం వాణి హిరణ్యగర్భాయ నమః స్వాహా।
త్యాగము
వాణి హిరణ్యగర్భాయ ఇదం నమమ।
లక్ష్మీ:
మహా దేవ్యైచ విద్మహే విష్ణుపత్యై చ ధీమహి ।
తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ స్వాహా ।।
విష్ణువు:
ఓం ఇదం విష్ణుర్వి చక్రమే త్రేధా నిదధే పదమ్।
సమూఢమస్య పాగ్ం సురే స్వాహా ।।
లేదా
ఓం లక్ష్మీనారాయణాయ నమః స్వాహా।
త్యాగము
లక్ష్మీనారాయణాయ ఇదం నమమ।।
గౌరీ:
గౌరీ మీమాయ సలిలాని తక్షత్యేక వది ద్విపదీ సా చతుష్పదీ ।
అష్టాపదీ నవపదీ బభూవుషీ సహస్రాక్షరా పరమే వ్యోమన్ స్వాహా ।।
రుద్రుడు:
కద్రుద్రాయ ప్రచేతసే మీఢుష్టమాయ తవ్యసే ।
వోచేమ శంతమగ్ం హృదే స్వాహా ।।
లేదా
ఓం గౌరి సహిత రుద్రాయ నమః స్వాహా।
త్యాగము
గౌరి సహిత రుద్రాయ ఇదం నమమ।
దేవతా గాయత్రీ మంత్ర ఆహుతులు:
రుద్రుడు:
ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి ।
తన్నో రుద్రః ప్రచోదయాత్ స్వాహా ।।
త్యాగము
రుద్రాయ ఇదం నమమ।
దంతి:
ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి ।
తన్నో దంతిః ప్రచోదయాత్ స్వాహా ।।
త్యాగము
దంతినే ఇదం నమమ।
నంది:
ఓం తత్పురుషాయ విద్మహే చక్రతుండాయ ధీమహి ।
తన్నో నన్దిహ్ ప్రచోదయాత్ స్వాహా ।।
త్యాగము
నందినే ఇదం నమమ।
గరుడ:
తత్పురుషాయ విద్మహే సువర్ణ పక్షాయ ధీమహి ।
తన్నో గరుడః ప్రచోదయాత్ స్వాహా ।।
త్యాగము
గరుడాయ ఇదం నమమ।
బ్రహ్మ:
వేదాత్మ నాయ విద్మహే హిరణ్య గర్భాయ ధీమహి ।
తన్నో బ్రహ్మ ప్రచోదయాత్ స్వాహా।।
త్యాగము
బ్రహ్మణే ఇదం నమమ ।
విష్ణువు:
నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి ।
తన్నో విష్ణుః ప్రవోదయాత్ స్వాహా।।
త్యాగము
విష్ణవే ఇదం నమమ।
నరసింహ స్వామి:
వజ్రనఖాయ విద్మహే తీక్ష్ణదగ్గ్ ష్ట్రాయ ధీమహి ।
తన్నో నారసింహ ప్రచోదయాత్ స్వాహా ।।
త్యాగము
నారసింహాయ ఇదం నమమ।
ఆదిత్యుడు:
భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి
తన్నో ఆదిత్య: ప్రచోదయాత్ స్వాహా।।
త్యాగము
ఆదిత్యాయ ఇదం నమమ।
అగ్ని:
వైశ్వానరాయ విద్మహే లాలీలాయధీమహి ।
తన్నో అగ్నిః ప్రచోదయాత్ స్వాహా ।।
త్యాగము
అగ్నయే ఇదం నమమ।
దుర్గ:
కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి ।
తన్నో దుర్గః ప్రచోదయాత్ స్వాహా ।।
త్యాగము
దుర్గాయై ఇదం నమమ।
వెంకటేశ్వర స్వామి:
శేషాచలాయ విద్మహే శ్రీనివాసాయ ధీమహి ।
తన్నో శ్రీ వేంకటేశ ప్రచోదయాత్ స్వాహా ।।
త్యాగము
అలివేలు మంగా సహిత వేంకటేశాయ ఇదం నమమ।
కృష్ణుడు:
ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి ।
తన్నః కృష్ణః ప్రచోదయాత్ స్వాహా ।।
త్యాగము
కృష్ణాయ ఇదం నమమ।
గురువు:
ఓం గురుదేవాయ విద్మహే పరబ్రహ్మణే ధీమహి ।
తన్నో గురుః ప్రచోదయాత్ స్వాహా। ।।
త్యాగము
గురుదేవాయ ఇదం నమమ।
శిరిడీ సాయిబాబా:
తత్పురుషాయ విద్మహే స్థిత ప్రజ్ఞాయ ధీమహి ।
తన్నో పరమగురు శ్రీ సాయినాథ ప్రచోదయాత్ స్వాహా ।।
త్యాగము
సాయినాథాయ ఇదం నమమ।
హనుమంతుడు:
ఓం ఆంజనేయాయ విద్మహే వాయు పుత్రాయ ధీమహి ।
తన్నో హనుమాన్ ప్రచోదయాత్ స్వాహా ।।
త్యాగము
హనుమతే ఇదం నమమ।
రామచంద్రుడు:
ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి ।
తన్నో రామః ప్రద్రోదయాత్ స్వాహా ।।
త్యాగము
రామాయ ఇదం నమమ।
గోపాలుడు:
ఓం గోపాలాయ విద్మహే గోపీ జనవల్లభాయ ధీమహి ।
తన్నో గోపాలః ప్రచోదయాత్ స్వాహా ।।
త్యాగము
గోపాలాయ ఇదం నమమ।
గౌరీ:
ఓం సుభగాయ చ విద్మహే కామమాలాయ ధీమహి ।।
తన్నో గౌరీ ప్రచోదయాత్ స్వాహా ।
త్యాగము
గౌర్యై ఇదం నమమ।
గ్రహనాయకః
భాస్కరాయ విద్మహే మహాద్యుతికరాయ ధీమహి ।
తన్నో ఆదిత్య ప్రచోదయాత్ స్వాహా ।।
త్యాగము
గ్రహనాయకాయ ఇదం నమమ।
హంస:
ఓం పరమహంసాయ విద్మహే మహాతత్త్వాయ ధీమహి ।
తన్నో హంసః ప్రచోదయాత్ స్వాహా ।।
త్యాగము
హంసాయ ఇదం నమమ ।
కులదేవతా:
ఓం శ్రీ కులదేవతాభ్యో నమః స్వాహా ।।
త్యాగము
కులదేవతాభ్యః ఇదం నమమ।
గ్రామదేవతా:
ఓం శ్రీ గ్రామదేవతాభ్యో నమః స్వాహా ।।
త్యాగము
గ్రామదేవతాభ్యః ఇదం నమమ।
ఇష్టదేవతా:
ఓం శ్రీ ఇష్టదేవతాభ్యో నమః స్వాహా ।।
త్యాగము
ఇష్టదేవతాభ్యః ఇదం నమమ।
శాంతి ఆహుతులు
బ్రాహ్మణుడు (హోత), ఈ క్రింది మంత్రము చదువుతాడు బ్రాహ్మణుడు (అధ్వర్యుడు) ఆయా వ్యక్తులకు సమిధలను ఇస్తాడు. అధ్వర్యుడు నెయ్యి సమర్పించిన తర్వాత ఆయా వ్యక్తులు సమిధలను సమర్పించవలసి ఉంటుంది.
ఓం త్య్రంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఓం హౌం జుం సః .....(యజమాని నక్షత్రం)నక్షత్రే, ....... (యజమాని రాశి) రాశౌ, ........(యజమాని వ్యవహార నామము) నామధేయస్య సహాకుటుంబం మృత్యోర్ పాలయ పాలయ రోగాం మోచాయ మోచాయ ఆయుర్ వర్ధయ వర్ధయ అపమృత్యు భయం నాశాయ నాశాయ సర్వాన్ రోగాన్ నాశాయ నాశాయ దీర్ఘాయుష్మంతం కురు కురు సహజంభో ఉర్వారుక మివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్ స్వాహా ।।
త్యాగము
మహా మృత్యుంజయాయ ఇదం నమమ।
ఓం త్య్రంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఓం హౌం జుం సః .....(యజమాని ధర్మపత్నినక్షత్రం)నక్షత్రే, ....... (యజమాని ధర్మపత్ని రాశి) రాశౌ, ........(యజమాని ధర్మపత్ని వ్యవహార నామము) నామధేయవతి సహాకుటుంబం మృత్యోర్ పాలయ పాలయ రోగాం మోచాయ మోచాయ ఆయుర్ వర్ధయ వర్ధయ అపమృత్యు భయం నాశాయ నాశాయ సర్వాన్ రోగాన్ నాశాయ నాశాయ దీర్గాయుష్మతీమ్ కురు కురు సహజంభో ఉర్వారుక మివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్ స్వాహా ।।
త్యాగము
మహా మృత్యుంజయాయ ఇదం నమమ।
ఓం త్య్రంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఓం హౌం జుం సః .....(యజమాని సంతానము - నక్షత్రం)నక్షత్రే, ....... (యజమాని సంతానము - రాశి) రాశౌ, ........(యజమాని సంతానము - వ్యవహార నామము) నామధేయవతి సహాకుటుంబం మృత్యోర్ పాలయ పాలయ రోగాం మోచాయ మోచాయ ఆయుర్ వర్ధయ వర్ధయ అపమృత్యు భయం నాశాయ నాశాయ సర్వాన్ రోగాన్ నాశాయ నాశాయ దీర్ఘాయుష్మంతం/దీర్గాయుష్మతీమ్ కురు కురు సహజంభో ఉర్వారుక మివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్ స్వాహా ।।
త్యాగము
మహా మృత్యుంజయాయ ఇదం నమమ।
ఇలా ఎంత మంది హవనం యజమానితో పాటు చేస్తున్నారో అంతమంది నామములు చదివి ఆహుతులు సమర్పించాలి.
మహా మృత్యుంజయ:
ఓం త్య్రంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనమ్ ।
ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్ స్వాహా ।।
త్యాగము
మహా మృత్యుంజయాయ ఇదం నమమ।
3 లేదా 5 సార్లు ఆహుతులివ్వాలి
జయాది హోమము
ఆహుతులు సమర్పించాలి
ఓం చిత్తంచ స్వాహా।
త్యాగము
చిత్తాయ ఇదం నమమ।
ఓం చిత్తిశ్చ స్వాహా।
త్యాగము
చిత్యా ఇదం నమమ।
ఓం ఆకూతంచ స్వాహా।
త్యాగము
ఆకూతాయేదం నమమ।
ఓం ఆకూతిశ్చ స్వాహా।
త్యాగము
ఆకూత్యా ఇదం నమమ।
ఓం విజ్ఞాతంచ స్వాహా।
త్యాగము
విజ్ఞతాయేదం నమమ।
ఓం విజ్ఞానంచ స్వాహా।
త్యాగము
విజ్ఞానాయేదం నమమ।
ఓం మనశ్చ స్వాహా।
త్యాగము
మనస ఇదం నమమ।
ఓం శక్వరీశ్చ స్వాహా।
త్యాగము
శశ్వర్యా ఇదం నమమ।
ఓం దర్శశ్చ స్వాహా।
త్యాగము
దర్శాయ ఇదం నమమ।
ఓం బృహచ్చ స్వాహా।
త్యాగము
బృహత ఇదం నమమ।
ఓం రథంతరంచ స్వాహా।
త్యాగము
రథంతరాయ ఇదం నమమ।
వ్యాహృతి హోమము
ఓం భూస్స్వాహా।
త్యాగము
అగ్నయ ఇదం నమమ
ఓం భువ స్వాహా।
త్యాగము
వాయవ ఇదం నమమ
ఓం సువ స్వాహా
త్యాగము
సూర్యా యేదం నమమ
ఓం భూర్భువస్సు వస్స్వాహా।
త్యాగము
ప్రజాపతయ ఇదం నమమ
సర్వప్రాయశ్చిత్త హోమము
ఉత్తరం మావైపు పెట్టిన స్రువమును తీసుకొని ఈ మంత్రం చదువుతూ అగ్నికి స్రువములో ఉన్న ద్రవ్యాన్ని సమర్పించాలి.
ముఖ్య గమనిక:స్విష్టకృత్ ఆహుతి వేయకుండా పూర్ణాహుతి చేయకూడదు.
ఓం యదస్య కర్మణోఽత్యరీరిచం యద్వాన్యూనమిహాకరమ్ ।
అగ్నిస్తత్స్విష్టకృద్విద్వాన్ సర్వం స్విష్టం సుహుతం కరోతు మే ।।
అగ్నయే స్విష్టకృతే సుహుతహుతే సర్వప్రాయశ్చిత్తాహుతీనాం కామానాం
సమర్థయిత్ర్యై సర్వం స్విష్టం సుహుతం కరోతు మే స్వాహా ।।
త్యాగము
అగ్నయే స్విష్టకృతే ఇదం నమః
ఉత్తర పరిషేచనం
అగ్ని చుట్టూ కుడి వైపు నుండి (Clockwise) జలాన్ని చల్లుతూ ఈ క్రింది మంత్రాలను పఠించాలి
అగ్ని ఉత్తర దిశలో (పై నుండి కిందకు)
అదితేఽన్వమగ్గ్ స్థాః।
అగ్ని పశ్చిమ దిశలో (ఎడమ నుండి కుడికి)
అనుమతేఽన్వమగ్గ్ స్థాః।
అగ్ని దక్షిణ దిశలో (కింద నుండి పైకి)
సరస్వతేఽన్వమగ్గ్ స్థాః।
అగ్ని చుట్టూ (ప్రదక్షిణగా)
దేవ సవితః ప్రాసావీః।
పూర్ణాహుతి
సంకల్పం:
పూర్ణాహుతి ద్రవ్యం ప్యాకెట్ పూజ స్టోర్స్ లో దొరుకుతోంది. ఒక జాకెట్ బట్టలో అది అంతా వేసి దానిని కట్టి ఒక పాత్రలో పెట్టుకోవాలి. కట్టిన ఆ వస్త్రం పై నీరు చల్లి, నెయ్యి, పసుపు, కుంకుమ, అక్షతలు, గంధం, పుష్పములతో పూజించాలి.
సంకల్పం:
ఈ సంకల్పం చెప్పుకున్న పిదప కలశములో ఉన్న జలమును స్పృశించాలి..
ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం మమ సర్వకార్య సిద్ధ్యర్థం ఆయుష్యాభి వృధ్యర్థం వాస్తు హోమ సంపూర్ణతా సిద్ధ్యర్థం పూర్ణాహుతి హోమం కరిష్యే ।
ఆజ్యధార (నెయ్యి సమర్పణ):
ఏకమ్। ద్వే। త్రీణి। చత్వారి। పంచ। షట్। సప్త। అష్టౌ। నవ। దశ। ఏకాదశ। ద్వాదశ।
పై వాక్యములు చెప్పుచు 12 సార్లు నెయ్యిను ద్రవ్యములపై లేదా స్రుక్కులో స్రువముతో నెయ్యి 12 మార్లు వేయవచ్చును. (ఆలా చేస్తే పూర్ణాహుతి ద్రవ్యం పై నెయ్యి వేయాలి.) ఆలా చేసాక పైకి లేచి...
పూర్ణాహుతి ప్రధాన మంత్రం:
క్రింది మంత్రం చదువుతూ ద్రవ్యములను అగ్నిలో సమర్పించాలి
సప్తతే అగ్నే సమిధః సప్తజిహ్వాః సప్తర్షయస్సప్త ధామప్రియాణి ।
సప్త హోత్రా సప్తధా త్వా యజంతి సప్త యోనీరాపృణస్వా ఘృతేన స్వాహా ।
త్యాగము
అగ్నయే సప్తవత ఇదం న మమ
వసోర్ధార:
ద్రవ్యములు వేసిన తర్వాత నెయ్యిని ధారగా పోస్తూ ఈ క్రింది మంత్రం పఠించాలి
పూర్ణాహుతి ముత్తమాం జుహోతి । సర్వం వై పూర్ణాహుతిః । సర్వమేవాప్నోతి ।
అథో ఇయం వై పూర్ణాహుతిః । అస్యామేవ ప్రతితిష్ఠతి ।
వసోర్ధారాం జుహోతి । వసోర్మే ధారాసదితి వా ఏషా హూయతే ।
ఘృతస్య వా ఏనమేషా ధారాఽముష్మిన్ లోకే పిన్వమానోప తిష్ఠతే ।
ఆజ్యేన జుహోతి తేజో వా ఆజ్యం తేజో వసోర్ధారా తేజసైవాస్మై తేజోఽవరుంధే తో ।
కామా వై వసోర్ధారా కామానేవావరుంధే ।।
ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే ।
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా వశిష్యతే ।। స్వాహా।
ముహూర్త ఆశీర్వచనం::
హోమం పూర్తయ్యాక అక్షతలు తలపై వేసుకుంటూ
పూర్ణాహుతి ముహూర్తస్సుముహూర్తోస్తు।
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ ।
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రియుగం స్మరామి ।।
యజ్ఞ పురుష షోడశోపచార పూజ:
పూర్ణాహుతి తర్వాత హోమగుండంలోని అగ్నిని సాక్షాత్తు విష్ణువుగా భావించి చేసే పూజ
అగ్నిని సాక్షాత్ పరమేశ్వరుడిగా భావించి ఈ క్రింది ఉపచారాలు చేయాలి.
ఆవాహనం:
ఓం యజ్ఞపురుషాయ నమః।
ఆవాహయామి।ఆవాహనం సమర్పయామి।
అగ్నిని మనసారా ఆహ్వానించాలి.
ఆసనం:
ఓం యజ్ఞపురుషాయ నమః ।
నవరత్నఖచిత సింహాసనం సమర్పయామి.।
అగ్నికి అక్షతలను సమర్పించాలి.
పాద్యం:
ఓం యజ్ఞపురుషాయ నమః ।
పాదయోః పాద్యం సమర్పయామి।
కలశంలో ఉన్న పుష్పంతో కానీ లేదా ఉద్ధరణితో కానీ నీరు తీసుకొని అగ్నికి చూపించి అర్ఘ్య పాత్రలో చల్లాలి/వదలాలి.
అర్ఘ్యం:
ఓం యజ్ఞపురుషాయ నమః ।
హస్తయోరర్ఘ్యం సమర్పయామి।
కలశంలో ఉన్న పుష్పంతో కానీ లేదా ఉద్ధరణితో కానీ నీరు తీసుకొని అగ్నికి చూపించి అర్ఘ్య పాత్రలో చల్లాలి/వదలాలి.
ఆచమనం:
ఓం యజ్ఞపురుషాయ నమః ।
ముఖే ఆచమనీయం సమర్పయామి।
కలశంలో ఉన్న పుష్పంతో కానీ లేదా ఉద్ధరణితో కానీ నీరు తీసుకొని అగ్నికి చూపించి అర్ఘ్య పాత్రలో చల్లాలి/వదలాలి.
శుద్ధోదకస్నానం:
సర్వనదీ శుద్ధజల సంయుతం
కలశేస్మిన్ సన్నిధౌ భవ।
స్నానం కురుష్వ లాలీల
కర్మదగ్ధాయా నమోఽస్తు తే ।।
ఓం యజ్ఞపురుషాయ నమః ।
శుద్ధోదక స్నానం సమర్పయామి।
స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి।
కలశంలో ఉన్న పుష్పంతో కానీ ఉద్ధరణితో కానీ తమలపాకులతో కానీ నీరు తీసుకొని అగ్నిపై చల్లాలి.
వస్త్రం:
ఓం యజ్ఞపురుషాయ నమః ।
వస్త్రయుగ్మం సమర్పయామి। వస్త్రార్ధం అక్షతాన్ సమర్పయామి।
అక్షింతలు సమర్పించాలి.
యజ్ఞోపవీతం:
ఓం యజ్ఞపురుషాయ నమః ।
యజ్ఞోపవీతం సమర్పయామి।। యజ్ఞోపవీతార్ధం అక్షతాన్ సమర్పయామి.।।
అగ్నికి యజ్ఞోపవీతం లేదా అక్షింతలు సమర్పించాలి.
చందనం:
ఓం యజ్ఞపురుషాయ నమః ।
శ్రీ గంధాన్ ధారయామి।
అగ్నిపై గంధం చల్లాలి.
అక్షతలు:
ఓం యజ్ఞపురుషాయ నమః ।
అక్షతాన్ సమర్పయామి।।
అగ్నికి అక్షతలును సమర్పించాలి.
హరిద్రాచూర్ణం (పసుపు):
ఓం యజ్ఞపురుషాయ నమః ।
హరిద్రా చూర్ణం సమర్పయామి।।
అగ్నికి పసుపును సమర్పించాలి.
కుంకుమ:
ఓం యజ్ఞపురుషాయ నమః ।
కుంకుమ విలేపనం సమర్పయామి।।
అగ్నికి కుంకుమను సమర్పించాలి.
సుగంధ పరిమళ ద్రవ్యము :
ఓం యజ్ఞపురుషాయ నమః ।
సుగంధ పరిమళ ద్రవ్యాణిం సమర్పయామి ।।
అగ్నికి అక్షతలను సమర్పించాలి.
పుష్పసమర్పణం:
ఓం యజ్ఞపురుషాయ నమః ।
నానావిధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి।।
అగ్నికి పుష్పములు సమర్పించాలి.
ధూపం:
ఓం యజ్ఞపురుషాయ నమః। ధూపమాఘ్రాపయామి।।
అగరుబత్తులు వెలిగించి ఘంటా మోగిస్తూ అగ్నికి చూపించాలి
ఫలదానం:
కొబ్బరి చిప్పలో నెయ్యి పోసి, ఈ మంత్రంతో అగ్నిలో సమర్పించాలి.
ముర్ధానం దివో అరతిం పృథివ్యా వైశ్వానరమృత ఆజాతమగ్నిమ్ ।
కవిం సామ్రాజమతిథిం జనానామాసన్నః పాత్రం జనయంత దేవాః ।।
ఓం మధు మనిష్యే మధు జనిష్యే మధు వక్ష్యామి మధు వదిష్యామి
మధుమతీం దేవేభ్యో వాచముద్యాసం శుశ్రూషేణ్యాం మనుష్యేభ్యః
తం మా దేవా అవంతు శోభాయై పితరోఽనుమదన్తు।।
దీపం:
ఓం యజ్ఞపురుషాయ నమః।ప్రత్యక్ష దీపం దర్శయామి।।
ధుపా దీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి।।
దీపానికి నమస్కారం చేయాలి
నైవేద్యం:
అగ్నికి బెల్లం సమర్పించాలి.
ఓం భూర్భువ॒స్సువ: । తత్స॑వి॒తుర్వరేణ్య॒o భర్గో॑ దే॒వస్య॑ ధీమహి ।
ధియో॒ యో న॑: ప్రచో॒దయాత్ ।।
సత్యం త్వా ఋతేన పరిషించామి ।
సాయంకాలం - ఋతం త్వా సత్యేన పరిషించామి అని చెప్పాలి.
అమృతమస్తు । అ॒మృ॒తో ప॒స్తర॑ణమసి ।
ఓం ప్రాణాయ స్వాహా । ఓం అపానాయ స్వాహా ।
ఓం వ్యా॒నాయ స్వాహా” । ఓం ఉదానాయ స్వాహా ।
ఓం సమానాయ స్వాహా” ।
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి ।
అ॒మృ॒తాపిధానమ॑సి । ఉత్తరాపోశనం సమర్పయామి ।
హస్తౌ ప్రక్షాళయామి । పాదౌ ప్రక్షాళయామి ।
శుద్ధ ఆచమనీయం సమర్పయామి ।
ఓం యజ్ఞపురుషాయ నమః। గుడోపహారం (బెల్లం ముక్క) నైవేద్యం సమర్పయామి।।
తాంబూలం:
ఓం యజ్ఞపురుషాయ నమః। తాంబూలం సమర్పయామి ।।
అగ్నికి రెండు తమలపాకులు తొనలు ఆకుల కొసలు ఉత్తరం వైపు ఉన్నట్లుగా పెట్టి అందులో వక్కలు వేసి దైవానికి సమర్పించాలి.
నీరాజనం:
ఓం యజ్ఞపురుషాయ నమః। కర్పూరనీరాజనం సమర్పయామి ।।
అగ్నికి కర్పూర హారతి ఇవ్వాలి.
మంత్రపుష్పం:
ఓం యజ్ఞపురుషాయ విద్మహే లాలీలాయ ధీమహి।
తన్నో అగ్నిః ప్రచోదయాత్।।
ఓం యజ్ఞపురుషాయ నమః। పాదారవిందయోః సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి।
అగ్నికి పుష్పాలను సమర్పించాలి.
నమస్కారం:
అక్షింతలు పుష్పాలు చేతిలో తీసుకొని అగ్నికి నమస్కారం చేయాలి.
నమస్తే మహాతేజసే ।
సాక్షాత్ యజ్ఞస్వరూపిణే ।
మమ హవనకర్మ స్వీకురుష్వ ।
మమ సర్వాభీష్టసిద్ధిం దేహి నమః ।।
ఓం యజ్ఞపురుషాయ నమః నమస్కారాన్ సమర్పయామి ।।
యజ్ఞ పురుష పంచోపచార పూజ:
షోడశోపచార పూజ చేయలేని వారు ఈ పంచోపచారా పూజ చేయవచ్చును
గంధం:
ఓం లం యజ్ఞపురుషాయ నమః - గంధం సమర్పయామి
పుష్పం:
ఓం హం యజ్ఞపురుషాయ నమః - పుష్పం సమర్పయామి
ధూపం:
ఓం యం యజ్ఞపురుషాయ నమః - ధూపం ఆఘ్రాపయామి
దీపం:
ఓం రం యజ్ఞపురుషాయ నమః -దీపం దర్శయామి
నైవేద్యం:
ఓం వం యజ్ఞపురుషాయ నమః - నైవేద్యం సమర్పయామి
సర్వోపచారము :
ఓం సం యజ్ఞపురుషాయ నమః - సర్వోపచారాన్ సమర్పయామి
బలిదానం: (గుమ్మడికాయ కుష్మాండం/కొబ్బరికాయ):
ఓం భూతప్రేత పిశాచాద్యాః యే వసంత్యత్ర భూతలే।
తే గచ్ఛంతు విముక్తాస్తే పూజాం గృహీత్వా యథావిధి।।
హే కూష్మాండ దేవతా! ఇమం గృహే శాకిన్యాది దేవాః,
పరయంత్ర పరతంత్రాది సర్వదోషాన్ నివర్తయ నివృత్తయ ।
సింహ ద్వారే సర్వకార్యాణి రక్ష రక్ష హూం ఫట్ స్వాహా
గుమ్మడికాయ పైన కర్పూరం పెట్టి, కాయపై పసుపు, కుంకుమ వేసి, కర్పూరం వెలిగించి మూడు మార్లు సవ్యదిశలో రెండుసార్లు అపసవ్య దిశలో త్రిప్పి గుమ్మడికాయను కొట్టాలి. తదుపరి ఎడమచేతిలోని భాగమును కుడి వైపు ద్వార గడపకు, కుడిచేతిలో భాగమును ఎడమవైపు ద్వార గడపకు పెట్టి పసుపు, కుంకుమ , నవధాన్యములు, గుమ్మడికాయ భాగములలో వేయాలి.
సమస్త విఘ్న నివారణార్థం, సర్వ దిష్టి దోష పరిహారార్థం, యజ్ఞ రక్షణార్థం కుష్మాండ (గుమ్మడికాయ) బలిం సమర్పయామి
ప్రదక్షిణ & నమస్కార మంత్రం:
హోమ గుండం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ చదవాల్సిన విశేష మంత్రం
నమస్తే గార్హపత్యాయ నమస్తే దక్షిణాగ్రయే ।
నమ ఆహవనీయాయ మహావేద్యై నమో నమః ।।
కాండద్వయోపపాద్యాయ కర్మబ్రహ్మ స్వరూపిణే ।
స్వర్గాపవర్గ రూపాయ యజేశాయ నమో నమః
యజేశాచ్యుత గోవింద మాధవానంత కేశవ ।
కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే ।।
యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ ।
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే ।।
పాపోఽహం పాపకర్మాఽహం పాపాత్మా పాపసంభవః ।
త్రాహి మాం కృపయా దేవ శరణాగత వత్సల ।।
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ ।
తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష పరమేశ్వర ।।
అగ్ని దేవుని ప్రార్థన :
అగ్నికి దగ్గరగా నిలబడి చేతులను దోసిలిలా పెట్టి ఇలా చెప్పాలి. 'దేహిమే' అన్నప్పుడు దోసిలిలా పెట్టిన మన చేతులను మనవైపు త్రిప్పుకోవాలి. తదుపరి పురుషులు తమ కుడి చేయితో ఎడమ చెవిని ఎడమచేతితో కుడి చెవిని మూసి గోత్ర నామాలు చెప్పుకోవాలి. స్త్రీలు మాత్రం నమస్కార ముద్రలో ఉండాలి.
స్వస్తి। శ్రద్ధాం మేధాం యశః
ప్రజ్ఞాం విద్యాం బుద్ధిం శ్రియం బలం ।
ఆయుష్యం తేజః ఆరోగ్యం దేహిమే।
హవ్యవాహనః శ్రియం దేహిమే।
హవ్యవాహనః ఓం నమ ఇతి।
ముగింపు:
ఓం సర్వేషాం స్వస్తిర్భవతు ।
ఓం సర్వేషాం శాంతిర్భవతు ।
ఓం సర్వేషాం పూర్ణం భవతు ।
ఓం లోకాస్సమస్తా స్సుఖినోభవంతు ।
పునః పూజ:
పసుపు కుంకుమ అక్షతలు సమర్పించాలి.
ఛత్రమాచ్చాదయామి ।
చామరం వీజయామి ।
నృత్యం దర్శయామి ।
గీతం శ్రావయామి ।
ఆందోళికానారోహయామి ।
అశ్వానారోహయామి ।
గజానరోహయామి ।
సమస్త రాజోపచార, దేవోపచార, భక్తోపచార, శక్త్యోపచార పూజాం సమర్పయామి.
యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః హోమా క్రియాదిషు ।
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే గజాననం ।।
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం హుతాశన ।
యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు తే ।।
అనయా వాస్తు హావనేన భగవాన్ సర్వాత్మకః శ్రీ యజేశ్వర స్వామి సుప్రీతః సుప్రసన్నః వరదో భవతు।
అని చెబుతూ చేతిలోని పుష్పాక్షతలను, జలమును పళ్ళెములో విడిచిపెట్టవలెను.
ఓం తత్సత్ పరమేశ్వరార్పణమస్తు!
వేద ఆశీర్వచనం:
ఈ మంత్రాన్ని పఠిస్తూ యజమాని శిరస్సుపై అక్షింతలను వేసి ఆశీర్వదించాలి. ఇది హవనంలో ఏమైనా దోషాలు చేసి ఉంటె అవి తొలగించి యజమానికి మనో శాంతి , ఆయురారోగ్యాలను ఇస్తుంది .
ఓం సర్వాభ్యో వై సర్వాభ్యోఽంత రాయాయ సర్వస్తోమోఽతి రాత్ర ఉత్తమ మహర్భవతి
సర్వస్యాప్త్యై సర్వస్య జిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి ।
శతమానం భవతి శతాయుః పురుషః శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి ।।
ఓం శాంతిశ్శాంతిశ్శాంతిః ।।
ఫలశ్రుతి & రక్షధారణ:
ఓం అగ్నిరితి భస్మ । వాయురితి భస్మ । జలమితి భస్మ । స్థలమితి భస్మ ।
వ్యోమేతి భస్మ । సర్వగ్ం హవా ఇదం భస్మ । మన ఇతి భస్మ । చక్షూంషి భస్మ ।
శ్రీకరం చ పవిత్రం చ సర్వవ్యాధి నివారణం ।
లోకవశీకరం పుణ్యం భస్మం త్రైలోక్య పావనం ।।
త్రయాయుషం జమదగ్నేః ఇతి లలాటే ।
కశ్యపస్య త్రయాయుషం ఇతి గ్రీవాయాం ।
యద్దేవేషు త్రయాయుషం ఇతి దక్షిణే బాహుమూలే ।
తన్నో అస్తు త్రయాయుషం ఇతి హృదయే ।।