మన భారతీయ సంప్రదాయంలో గృహప్రవేశమునకు అత్యంత ప్రాముఖ్యత ఉన్నది. శంఖుస్థాపన నుండి గృహములో ప్రవేశించే వరకు ఆ ఆనంద స్థితిని వర్ణిసిన్హాలేము. అయితే మనం గృహ నిర్మాణ సమయములో మన వలన అనేక తప్పులు జరుగుతూ ఉంటాయి: భూమిని తవ్వడం, రాళ్ళూ కొట్టడం, చెట్లను నరకడం వంటి ప్రకృతి నియమాలకు విరుద్ధమైన పనులను ఎన్నో చేస్తుంటాం.
దీనివల్ల భూమాతకు, ఆ భూమిని ఆవరించి ఉండే విశ్వశక్తి అయిన వాస్తుపురుషునికి ఎంతో బాధ, కలిగే అవకాశం ఉంది. సాక్షాత్ విష్ణు స్వరూపుడైన ఆ వాస్తుపురుషుని నివేదనలో దొర్లే ఇటువంటి దోషాల నుండి బయటపడడానికి మన శాస్త్రాలలో నిర్దేశించిన ఒకే ఒక పరమ పవిత్రమైన మార్గం "వాస్తు లక్ష్మి నారాయణ కల్యాణము" (ఇంటి లగ్నం).
నూతన గృహప్రవేశ సమయములో, పురోహితులు నిర్ణయించిన లగ్న ముహూర్త కాలమందు ఈ కల్యాణాన్ని జరిపించడం ద్వారా... గృహ నిర్మాణ దోషాలన్నీ పటాపంచలైపోతాయి. దీని వలన గృహ యజమానికి, ఆయన పరివారానికి సకల అరిష్టాలు తొలగి, నవగ్రహాల అనుగ్రహముతో పాటుగా, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు మరియు నిరంతర మనఃప్రశాంతత లభిస్తాయి. అందుకే మన తెలంగాణ గృహప్రవేశ సంప్రదాయంలో ముహూర్త సమయమందు ఈ వాస్తు కల్యాణాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో విధిగా నిర్వహిస్తారు.
గృహప్రవేశ సమయములో ముందుగా సుముహూర్తమునకు దంపతులు మంగళవాయిద్యాల నడుమ తమ నూతన గృహములోకి ప్రవేశించి, పూజ మందిరములో దీపం వెలిగిస్తారు. పిదప, మండపారాధన (గణపతి పూజ, పుణ్యాహవచనం, నవగ్రహ ఆరాధన, అష్ట దిక్పాలకులు మొదలగు ప్రధాన దేవతలను ఆవహిస్తారు. వాస్తు మండల పూజ, ప్రధాన కలశ పూజ చేస్తారు.) ఈ ప్రధాన పూజా ఘట్టాలన్నీ సంపూర్ణముగా చేసిన తరువాత వాస్తు కళ్యాణం చేస్తారు.
పూజా సామాగ్రి
- పసుపు
- కుంకుమ
- గంధం డబ్బా-1
- పసుపు అక్షతలు
- కుడుకలు/కొబ్బరి కురిడీలు-11
- తెల్ల ధోతి - 1
- తెల్ల వస్త్రములు - 2
- చీర-1
- జాకెట్ బట్టలు - 3
- భాషింగాలు - 1 సెట్టు
- యజ్ఞోపవీతము - 1
- ఆచమన పాత్ర {రెండింటిలోనూ నీళ్ళు నింపుకోండి}
- కలశానికి చిన్న చెంబు {రెండింటిలోనూ నీళ్ళు నింపుకోండి}
- తంబాలము (దేవతా కన్యాదానం కొరకు)
- మధుపర్కం (పాలు, పెరుగు మిశ్రమం)
- జీలకర్ర-50 గ్రా
- బెల్లం-100 గ్రా
- పులా దండ - 2
- మంగళ సూత్రం సెట్ -1
- తలంబ్రాల బియ్యం - 5 కేజీలు
- ముత్యాలు (తలంబ్రాల కోసం),
- తమలపాకులు - 11
- పోకలు - 11
- ఖర్జురా-11
- పసుపు కొమ్ములు-250 గ్రా
- పండ్లు
- కొబ్బరికాయలు - 1
- అగరబత్తులు-5
- అగ్గిపెట్టె - 1
- హారతి కర్పూరం - 5
- మంగళ హారతి సెట్ - 1
- హారతి స్టాండ్ - 1
- ఘంటా - 1
- నైవేద్యం (గృహప్రవేశ సమయములో పాలు పొంగిస్తారు. ఆ పాలతో పరమాన్నం చేసి నివేదించాలి.)
- కూర్చోవడానికి ఆసనం
వాస్తుపురుష కళ్యాణం
చూడటానికి క్లిక్ చేయండి (Click to expand)
వాస్తుపురుష కళ్యాణం
ఆచమ్య‐ప్రాణానాచమ్య‐నేత్రాచమ్య:
ఇప్పుడు ఆచమన పాత్ర లోని నీటిని ఉంగరం వ్రేలితో కళ్ళకు అద్దుకొని ఉద్ధరిణిలో తీసుకొని ఒక్కో నామం చెపుతూ మూడు మార్లు తాగవలెను
ఓం కేశవాయ నమః ।
ఓం నారాయణాయ నమః ।
ఓం మాధవాయ నమః ।
హస్తం ప్రక్షాల్య నీరు చూపించి వదలవలెను
ఓం గోవిందాయ నమః ।
ఓం విష్ణవే నమః ।
ఓం మధుసూధనాయనమః।
ఓం త్రివిక్రమాయ నమః ।
ఓం వామనాయ నమః ।
ఓం శ్రీధరాయ నమః ।
ఓం హృషీకేశాయ నమః ।
ఓం పద్మనాభాయ నమః ।
ఓం దామోదరాయ నమః ।
ఓం సంకర్ణణాయ నమ: ।
ఓం వాసుదేవాయ నమః।
ఓం ప్రద్యుమ్నాయ నమః ।
ఓం అనిరుద్దాయ నమః ।
ఓం పురుషోత్తమాయ నమః
ఓం అధోక్షజాయ నమః ।
ఓం నారసింహాయ నమః ।
ఓం అచ్యుతాయ నమః ।
ఓం జనార్ధనాయ నమః।
ఓం ఉపేంద్రాయ నమః ।
ఓం హరయే నమః ।
ఓం శ్రీకృష్ణాయ నమః ।
ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః ।
సంకల్పం:
ఇప్పుడు కుడిచేతిలో అక్షతలు తీసుకుని మీ కుడి కాలితొడపై ఎడమ అరచేతి నుంచి అక్షతలతో ఉన్న కుడిచేతిని పిడికిలిగా మూసి ఆ ఎడమ అరచేతిపైనుంచుతూ ఈ సంకల్పం చెప్పి పిడికిలిలో ఉన్నఅక్షతలను నీటితో అర్ఘ్యపాత్రలో వదలాలి
పూర్వోక్త సంకల్పానుసారేణ ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాంశుభతిథౌ శ్రీమాన్ గోత్ర:....గోత్రోద్భవస్య (మీ గోత్రం),.... (మీ పేరు) నామధేయస్య శ్రీమతః .....(మీ ధర్మపత్నీపేరు) నామధేయస్య ధర్మపత్నీ సమేతోహం సహకుటుంబస్య అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్యవీర్య విజయ అభయ ఆయురారోగైశ్వర్యాభి వృధ్యర్థం మమ నూతన గృహే సకల వాస్తు దోష పరిహారార్ధం, గృహే ధనధాన్య స్థిరత్వ సిద్ధ్యర్థం, శ్రీమన్నారాయణ స్వరూప వాస్తు పురుష అత్యంత అనుగ్రహ సిద్ధ్యర్థం, వాస్తు కల్యాణ మహోత్సవం కరిష్యే.
రక్షాబంధనము
ఆదౌ రక్షార్థం రక్షాబంధన ధారణం కరిష్యే రక్షాబంధన దేవతాభ్యోనమః
ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం సమర్పయామి
ఈ మంత్రములు చెపుతూ రక్షాబంధనములు ముందుగా దేవతామూర్తులకు కట్టాలి
రక్షాబంధన మంత్రం - పురుష దేవతా:
విశ్వేత్తాతే సవనేషు ప్రవాచ్చాయాచ కర్ధమఘవ న్నింద్ర ।
సున్వతే పారావతం యత్పురుసం భృదం వస్యపావృణో శ్శరభాయ ఋషిబంధవే ।।
రక్షాబంధన మంత్రం - స్త్రీ దేవతా:
బృహత్సామ క్షత్రభృద్వృద్ధ వృష్ణియం త్రిషభౌజ శ్శభిత ।
ముగ్రవీరం ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యమిదంవాతేన సగరేణ రక్ష ।।
యజ్ఞోపవీత ధారణ
శ్రీ లక్ష్మీనారాయణ స్వరూప వాస్తుపురుష కళ్యాణమంగత్వేన యజ్ఞోపవీతంధారయిష్యే
ఈ మంత్రం చదువుతూ యజ్ఞోపవీతమును స్వామివారికి వేయాలి.
యజ్ఞోపవీత దేవతాభ్యోనమ: యధాశక్తి ధ్యాన ఆవాహనాదిషోడశోపచార పూజాం సమర్పయామి ।
యజ్ఞోపవీతం పరమం పవితం ప్రజాపతే యత్సహజం పురస్తాత్ ।
ఆయుష్యమగ్యం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తుతేజ: ।।
యజ్ఞోపవీతం ధారయిత్వా
పునరాచమ్య:
ఓం కేశవాయ నమః ।
ఓం నారాయణాయ నమః ।
ఓం మాధవాయ నమః ।
హస్తం ప్రక్షాల్య నీరు చూపించి వదలవలెను
మళ్ళీ స్వామివారికి ఆచమనం ఇస్తున్నట్లుగా నీరు మూడుసార్లు చూపించి వదలవలెను)
యజ్ఞోపవీతధారణ మూహూర్త స్సుమూహూర్తమస్తు
పాద ప్రక్షాళన/పాదాలు కడుగుట
ఈ మంత్రములు చెపుతూ స్వామివారి పాదముల మీద పురోహితుడు యజమాని చేత నీళ్ళు చల్లించి పాదాలకు గంధము కుంకుమ పెట్టి అత్తరు లేదా పన్నీరు పాదాలపై చల్లాలి
నారాయణ స్వరూప వాస్తుపురుష వరస్య ఇదమావాహనం ఆసనం ఇదం పాద్యమర్ధ్యం
నమోస్త్వనన్తాయ సహస్రమూర్తయే సహస్ర పాదాక్షిశిరోరు బాహవే ।
సహస్రనామ్నే పురుషాయశాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః ।।
నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయచ ।
జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః ।।
మధుపర్కం
ప్రథమం ప్రాశ్య
ఈ మంత్రములు చెపుతూ పురోహితుడు యజమాని చేత స్వామి వారికి మధుపర్కమును (పాలు, పెరుగు, తేనేల మిశ్రమము) రత్నం లేని ఉంగరముతో మూడు మార్లు తినిపిస్తున్నట్లుగా చేయాలి.
ఓం అయమ్ మధుపర్కో మధుపర్కో మధుపర్కః ప్రతిగృహ్యతామ్ । ప్రథమం ప్రాశ్య ।
ప్రతిగృహ్ణామి (అని యజమాని భగవంతుడి తరపున పలకాలి.)
పురోహితుడు ఈ క్రింది మంత్రం చదువుతున్నపుడు మొదటి సారి మధుపర్కాన్ని యజమాని 'నమోనారాయణ' అని అంటూ చూపించాలి.
ఓం యన్మధునో మధవ్యం పరమం రూపమన్నాద్యమ్ ।
తేనాహం మధునో మధవ్యేన పరమేణ రూపేణాన్నాద్యేన పరమో మధవ్యోఽన్నాదోఽసాని ।।
ద్వితీయం ప్రాశ్య
ఓం అయమ్ మధుపర్కో మధుపర్కో మధుపర్కః ప్రతిగృహ్యతామ్ । ద్వితీయం ప్రాశ్య ।
ప్రతిగృహ్ణామి (అని యజమాని భగవంతుడి తరపున పలకాలి.)
ఓం విరాజో దోహోఽసి విరాజో దోహమశీయ మయి దోహః పద్యాయై విరాజః ।।
పురోహితుడు ఈ క్రింది మంత్రం చదువుతున్నపుడు రెండవ సారి మధుపర్కాన్ని యజమాని 'నమోనారాయణ' అని అంటూ చూపించాలి.
తృతీయం ప్రాశ్య
ఓం అయమ్ మధుపర్కో మధుపర్కో మధుపర్కః ప్రతిగృహ్యతామ్ । తృతీయం ప్రాశ్య ।
ప్రతిగృహ్ణామి (అని యజమాని భగవంతుడి తరపున పలకాలి.)
ఓం మయి వసు మయి ధనమ్ మయి సర్వం మయి శ్రియమ్ ।।
పురోహితుడు ఈ క్రింది మంత్రం చదువుతున్నపుడు మూడవ సారి మధుపర్కాన్ని యజమాని 'నమోనారాయణ' అని అంటూ చూపించాలి.
హస్తౌ ప్రక్షాళ్య
ఓం హస్తౌ ప్రక్షాళ్య
భగవంతుడి చేతులు పెదవులు కడుతున్నట్లుగా భవిస్తూ నీటిని సమర్పించి తంబాలములో వదలాలి.
కల్యాణ సుముహూర్తము
చూడటానికి క్లిక్ చేయండి (Click to expand)
జిలకర - బెల్లం
సుముహూర్తకాలే లగ్నాష్టక మంగళాష్టక చూర్ణికాంచ పఠిత్వా
పురోహితుడు జీలకర్ర బెల్లము తమ కుడిచేతులలో పట్టుకొని సుముహూర్తమునకు ముందుగా లగ్నాష్టక మంగళాష్టక చూర్థికలను శుభకరమైన వేదానువాకములను పఠించాలి
చూర్ణిక
- స్వస్త్యష్ణా శీతి సహస్రాణాం ద్విజగురుదైవత్యానాం
- సమస్త జగదాధార మహామండూక కూర్మయజ్ఞ వరాహ శేష పృథివీనాం
- పురందర పావక యమ నిర్ఋతి వరుణ వాయు కుబేర ఈశాన్యాది అష్టదిక్పాలకానాం
- జలధి భవహరిహర ముఖ్య దేవగణానాం
- నారద విశ్వామిత్ర పరాశరాత్రి వాల్మీకి గౌతమ భృగు వ్యాసాది మహర్షిణాం
- సీతా అరుందతీ అహల్య ద్రౌపదీ తారా మండోదరి పాంచాలి దమయంత్యాది మహాపతివ్రతానాం
- హరిశ్చంద్ర నల కార్తవీర్య విక్రమార్క భోజరాజాది పుణ్యపురుషాణం
- గంగా నర్మదా తుంగభద్రా మలాపహారిణీ శ్రీకృష్ణవేణి గోదావరి భీమరధ్యాది మహానదీనాం
- జంబూనింభ కదంబ చూత క్రముక నారికేళ ఖర్జూర దాత్రీ దాడిమ్యాది ఫలవృక్షాణాం
- పున్నాగ జాజి వకుళ కేతకీ చంపక మల్లికా మాధవీ మాలత్యాది వివిధ కుసుమానాం
- కస్తూరి కుంకుమ అగరు గోరోచనాది సుగంధానాం
- అపరిమిత కనక కలశ కన్యక గృహమేధిక విశ్వవీణాధి వాద్య మేఘ ధ్వనీనాం
- అయోధ్యా కాశీపురుషోత్తమ రామేశ్వరాది పుణ్యనగరీణాం
- శ్రీశైల వింద్య హేమాచల గోవర్ధన కైలాసాది మహాశైలానాం
- తర్కమీమాంస న్యాయ వైశేషిక భాట్ట ప్రాభాకర వ్యాకరణాది షట్ శాస్త్రాణాం
- ఋగ్యజు స్సామాధర్వణ వేదానాం
- లగ్న హెూరా ద్రేక్కాణ నవాంశ ద్వాదశాంశ త్రిశాంశ త్రింశదంశకానాం
నిరంతర అనుకూలా శుభశోభనా: అస్యసుముహూర్తస్య సుతిధి సువారం సునక్షత్రాం సుయోగం సుకరణం సుచంద్రం తారాబలం అనుకూల శుభా శోభనా । సర్వేగ్రహా సునక్షత్ర శుభైకాదశ స్థాన ఫలదా వరదా సుప్రీత సుముహూర్తా । సుప్రసన్నా వరదా భవంతు।
శ్రీ లక్ష్మీనారాయణ వివాహ లగ్నాష్టకాః
ఈ మంత్రాలూ చదువుతూ స్వామివారిపై అమ్మవారిపై అక్షతలు వేస్తూండాలి
- తదేవ లగ్నం సుదినంతదేవ తారాబలం చంద్రబలంతదేవ ।
విద్యాబలం దైవ బలంతదేవ లక్ష్మీపతే తేంఘ్రియుగంస్మరామి ।।
సావధాన - సుముహూర్తా - సావధాన - శుభలగ్నే సావధాన
శ్రీ లక్ష్మీనారాయణ చింతన సావధాన
- లక్ష్మీశో భువన త్రయే నివసతో దేవాన్ మనుష్యో రగాన్ ।
సంస్థాతుం కరుణానిధిః కరుణయా మార్తాండ వంశేయయౌ ।।
కౌసల్యా నిజగర్భ సంభవ భృతే జన్మన్య సాధారణే ।
జాతే శ్రీ రఘు నాయకస్య జననం దేయా దిదం మంగళం ।।
సావధాన - సుముహూర్తా - సావధాన - శుభలగ్నే సావధాన
శ్రీ లక్ష్మీనారాయణ చింతన సావధాన
- వైదేహీ వదనాభి లాషణ యుతం కామం సకామం కృతం ।
విఖ్యాతం భువన త్రయం హర ధనుర్బగ్నీ కృతంలీలయా ।।
విశ్వామిత్ర పరాశరాది మునిభిస్తత్సన్నిధానాంచితం ।
శ్రీలక్ష్మీనారాయణోయోర్వివాహ సమయేదేయా దిదం మంగళం ।।
సావధాన - సుముహూర్తా - సావధాన - శుభలగ్నే సావధాన
శ్రీ లక్ష్మీనారాయణ చింతన సావధాన
- ఉత్పల్లా మలనీలవారి జదళశ్యా మోన్నతం కోమలం ।
పార్వత్యాచ మహేశ్వరేణచ శిర శ్లాఘీ కృతం సర్వదా ।।
శాపా ర్వర గౌతమస్య వనితా శైలా సుశీలాకృతా ।
దంపత్యోరిహ వామభాగ జనితం దేయాదిదం మంగళం ।।
సావధాన - సుముహూర్తా - సావధాన - శుభలగ్నే సావధాన
శ్రీ లక్ష్మీనారాయణ చింతన సావధాన
- శ్రీరామం జనకాత్మ జాసురగురుం ప్రత్యఙ్ముఖం ప్రాఙ్ముఖం ।
దోర్భ్యామం జలి మంచితైశ్చ వనితా మా పూర్య ముక్తా ఫలైః ।
నానారత్న విరాజ మాన కలశై రానీయతం సాగరాత్ ।।
శ్రీలక్ష్మీనారాయణోయో ర్వివాహ సమయే యాదిదం మంగళం ।।
సావధాన - సుముహూర్తా - సావధాన - శుభలగ్నే సావధాన
శ్రీ లక్ష్మీనారాయణ చింతన సావధాన
- కల్యాణం కమనీయ కోమల కరై రార్ద్రక్షతారోపణం
కన్యాదాన పురస్పరం సురగురో ర్విప్రాశిషానుగ్రహం ।।
బాహ్వాః కంకణ బంధనం దశగుణం మాంగళ్యసూత్రాన్వితం ।
శ్రీలక్ష్మీనారాయణో యోర్వివాహ సమయే దేయాదిదం మంగళమ్ ।।
సావధాన - సుముహూర్తా - సావధాన - శుభలగ్నే సావధాన
శ్రీ లక్ష్మీనారాయణ చింతన సావధాన
- జానక్యాః కమలామలాం జలిపుటేయాఃపద్మ రాగాయితాః ।
వ్యస్తా రాఘవ మస్తకేచవిలసత్కుం దప్రసూనాయితాః ।।
స్రస్తాశ్యామలకాయకాంతి కలితా యా ఇంద్ర నీలాయితాః ।
ముక్తాస్తా శ్ముభదా భవంతు భవతాం శ్రీరామవైవాహికాః ।।
సావధాన - సుముహూర్తా - సావధాన - శుభలగ్నే సావధాన
శ్రీ లక్ష్మీనారాయణ చింతన సావధాన
- శ్రీరామ పత్నీ జనకస్య పుత్రీ సీతాంగనా సుందర కోమలాంగీ ।
శ్రీ విష్ణుపత్నీభువ నైకమా తా వధూ వరాభ్యాం వరదా భవంతు ।।
సావధాన - సుముహూర్తా - సావధాన - శుభలగ్నే సావధాన
శ్రీ లక్ష్మీనారాయణ చింతన సావధాన
సుముహూర్తము
ఈ మంత్రం చదువుతూ జీలకర్ర బెల్లము స్వామివారికి చూపించి అమ్మవారికి. అమ్మవారికి చూపించి స్వామివారికి పెట్టాలి
ధ్రువంతేరాజా వరుణో ధ్రువందేవో బృహస్పతి:
ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం
ధ్రువం ధ్రువేణ హవిషా తస్మైదేవా అధిబ్రవన్
అయంచ బ్రహ్మణస్పతి:
ధ్రువాద్యా: ధ్రువాపృధివీ
ధ్రువం విశ్వమిదం జగత్
ధ్రువాహ పర్వతా ఇమే
ధ్రువోరాజా విశామయం
ఇహైవైధి మావ్యదిష్టా:
పర్వతఇవా విచాచలి:
ఇంద్ర ఇవేహ ధ్రువస్తిష్ఠ
ఇహ రాష్ట్ర ముధారయ అభితిష్ట
పృతన్యత: అధరే సంతుశత్రవ:
ఇంద్ర ఇవ వృత్ర హాతిష్ట అప:
క్షేత్రాణిసంజయన్
ఇంద్రవీణ మధీధరత్
ధ్రువం ధ్రువేణ హవిషా తస్మైదేవా
అధిబ్రవన్ అయంచ బ్రహ్మణస్పతి:
అయంముహూర్త సుమూహూర్తమస్తు
పూలదండలు
ఈ మంత్రం చెబుతూ యజమాని అమ్మవారికి చూపిస్తూ స్వామి వారికీ వేయాలి; యజమానిధర్మపత్ని స్వామివారికి చూపిస్తూ అమ్మవారికి వెయ్యాలి.
ఓం మాల్యాతీని సుగంధీని, మాలత్యాదీని వై ప్రభో ।
మయాహృతాని పూజార్థం, పుష్పమాలాః ప్రగృహ్యతామ్ ।।
కన్యాదానం - మహాసంకల్పం
చూడటానికి క్లిక్ చేయండి (Click to expand)
కన్యాదానం - మహాసంకల్పం
తంబాలములో కొబ్బరికాయ లేదా లేదా కొబ్బరి బొండము 2 కుడుకలు/కొబ్బరి కురిడీలు పెట్టి యజమానితో పురోహితుడు కన్యాదానం చేయించాలి. ఒక చెంబులో నీరు తీసుకొని అందులో మామిడాకులు తల్లక్రిందులుగా వేసి ఆ కొబ్బరికయ లేదా కొబ్బరి బొండముపై లేదా కుడుకలలో/కొబ్బరి కురిడీలలో నీరు ఆకుల నుండి ధారగా యజమాని ధర్మపత్ని చేత పోయిస్తూ ఉండాలి
త్రిరాచమ్య
స్వామివారికి ఆచమనం ఇస్తున్నట్లుగా నీరు మూడుసార్లు చూపించి వదలవలెను
ఓం శివాయ స్వాహా
ఓం మహేశ్వరాయ స్వాహా
ఓం శంభవే స్వాహా
హస్తం ప్రక్షాల్య నీరు చూపించి వదలవలెను
ఏవంప్రీత్యర్థం మమ ఆచంద్రార్కమనేక వైశేషిక సౌభాగ్య సౌమనస్య నిత్య నిరతిశయానంద బ్రహ్మలోకావాప్త్యర్థం సాలంకృత సహిరజ్యోదక కన్యాదాన మహం కరిష్యే కన్యాదాన సమయే మహాసంకల్ప మంత్రం పఠనం కరిష్యే
అక్షతల నీళ్లు వదలాలి
అస్యశ్రీమద్భగవతో మహాపురుషన్య శ్రీమదాది నారాయణన్య అచింత్యాపరిమిత శక్త్యా భ్రియ మాణస్య మహా జలౌఘస్యమధ్యే
పరిభ్రమ మాణానా మనేక కోటి బ్రహ్మాండానామేక తమే
వ్యక్తావ్యక్త ప్రకృతి మహదహంకార పృథివ్యాపస్తేజో వాయురాకాశాద్యావరణై రావృతేస్మిన్ మహతి బ్రహ్మాండఖండయోర్మధ్యే
సకలాధిష్ఠాన వరాహదంష్ట్రాంకుర మృణాళస్య జగన్మూల ఆధార శక్తి శ్రీ కూర్మ వరాహ ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకా ఖ్యాష్ట దిగ్గజోపరి ప్రతిష్ఠితస్య
అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తపాతాళానాముపరి తలే
భూలోక భువర్లోకసువర్లోక మహల్లోక జనోలోక తపోలోక సత్యలోకానా మధోభాగే
చక్రవాళశైల మధ్యగత మహాసుమేరో సహస్ర శిఖరానువర్తిని మధ్యేవర్తిన్యాం మహానాళాయ మాణ ఫణిరాజ శేషస్య సహస్ర ఫణాఫణి మండల మండితే
ఇంద్రాగ్ని యమ నిరృతి వరుణవాయు కుబే రేశాన్యాది అష్టదిక్పాలక పాలితే
వలయాకార లవణేక్షు సురా సర్పిర ధిక్షీర జలార్థవైర్విరాజితేస్మిన్
జంబూప్లక్ష శాల్మలి కుశ క్రౌంచశాక పుష్కరాఖ్య సప్తభిర్ద్వీపై ర్టీపితే
మహాసరోరుహాకార పంచశత్కోటి విస్తీర్ణ భూమండలమధ్యే
మేరోర్దక్షిణపార్శ్వే మలయాదుత్తరే కర్మభూమౌ భారత కింపురుషేలావృత కురు భద్రాశ్మకరమణక మందహాస జిహ్వదాఖ్య ఇతి నవఖండమండితే
ప్రత్యేకం నవ సహస్ర యోజన విస్తృతే దండక చంపక వింధ్యమిశ నైమిశ కదరిక
బదరిక నహుష గుహ దేవదారు కారణ్యాది ఏకాదశారణ్యాయుతే
అంగ వంగ కళింగ కాశ్మీర కాంభోజ సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధ మాళవ నేపాళ కేరళ చోళ పాంచాల గౌళ మళయాళ సింహళ ద్రవిడ ద్రావిడ కర్ణాట నాట పానాట పాండ్యపుళిందాంధ్ర కుక్కురు కురు గాంధార విదర్భ విదేహ బాహ్లిక బర్బర కేకయ కోసల కుంతల టెంకణ కొంకణ మగధ మద్రఘార్జర యవన జాలాంధక సాల్వచేది సింధువత్యాద్యనేక దేశ భాషా భూమి పాల విచిత్రితే
సామ్యవంతి గంగా గోదావరీ భీమరథీ తుంగభద్రా కృష్ణవేణీ కావేరీ చంద్రభాగా పంపాయనా సరస్వతీ నర్మదా కుముద్వతీ రేణుకా వంజులాది మహానదీ విలసితే
అయోధ్యా మధుర మాయ కాశీ కాంచీ అవంతికా పురీద్వారావత్యాది పుణ్యపురీవిరాజితే
శ్రీశైలస్య వాయవ్య (ఐశాన్య) ప్రదేశే దేవ తిర్యఙమనుష్య సకల జగత్రష్టుః పరార్ధ ద్వైజీవినో బ్రహ్మణః ప్రథమ పరార్థే పంచాశదతీతే ద్వితీయ పరార్థే పంచాశద్దివ్య వర్షాత్మకే
ప్రథమ మాసే ప్రథమ పక్షే అహని ద్వితీయ యామే తృతీయముహూర్తే త్రయోదశ ఘటికాయాం ద్విచత్వారింశ ద్విఘటికాసు గతాసు పార్థివకల్ప అనంతకల్ప కూర్మ కల్ప బ్రహ్మకల్ప వరాహకల్ప శ్వేతవరాహకల్ప ప్రళయకల్ప సావిత్రి కల్పానాం మధ్యేశ్వేత వరాహకల్పే స్వాయంభువ స్వారోచిషోత్తమ తామస రైవత చాక్షుష వైవస్వత సూర్యాగ్ని బ్రహ్మరుద్ర దక్షరౌచ్య భౌచ్య చతుర్దశమన్వంతరాణాం మధ్యే సప్తమే వైవస్వత మన్వంతరే
ఇదానీం అష్టావింశన్మహాయుగే యుధిష్ఠిర విక్రమార్క శాలివాహన విజయాభినందన నాగార్జున షట్ఛకానాం మధ్యే తృతీయే శాలివాహన శకే అష్టావింశతి సహస్రాన్విత సప్తదశ లక్షాట్టే కృతయుగే యాతే
షణ్ణవతి సహస్రాన్విత ద్వాదశలక్షాబ్ద త్రేతాయుగేయాతే
చతుషష్టి సహస్రాన్విత అష్ట లక్షాభై ద్వాపర యుగే యాతే
ద్వాత్రింశత్సహస్రాన్విత చతుర్లక్షా కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారత వర్షా భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయవ్య (ఈశాన్య) ప్రదేశే కృష్ణాగోదావర్యోర్మధ్యదేశే కల్యాణమంటపే సమస్తదేవతా బ్రాహ్మణ హరిహర గురు చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన
నామసంవత్సరే ఆయణే ఋతౌ మాసే క్లపక్షే తిధౌ వాసరే నక్షత్రే శుభయోగ శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టా యాం శుభతిధౌ అనాది అవిద్యావాసనయా
అస్మిన్ సంసార చక్రే విచిత్రాభిః విచిత్రా సుయోనిషు పునః పునః అనే కధా జనిత్వా కేనవా కర్మవిశేషేణ ఇదానీం
అస్మిన్ వంశే జాతస్య గోత్రస్య నామధేయస్య ధర్మపత్నీ సమేతస్య మమ జన్మాభ్యాసాత్ జన్మ ప్రభృతి ఏతక్షణ పర్యంతం మధ్యే వర్తిని కాలే
సంభావితానాం పాపానాం వాక్పాణిపాద పాయూవస్థానాం పంచానాం కర్మేంద్రియాణాం త్వక్చక్షుశ్రోత్ర జిహ్వాఘ్రాణానాం పంచానాం జ్ఞానేంద్రియాణం ఏతేషాం ప్రేరకస్య అంతః కరణస్య గోచరస్య సంబంధే సతి సకల పాప నివృత్తిద్వారా పితృణాం శాశ్వత బ్రహ్మలోకే నిత్యనివాస సిధ్యర్థం
తిలై స్పూర్యమండల పర్యంతం కృత రాశే ర్వర్ష సహస్రావసాన ఏకైక తిలాప కర్ష క్రమేణ సర్వరాశ్యప కర్షిత సమ్మితకాలే బ్రహ్మలోకే నిత్యనివాస సిధ్యర్థం
యవైశ్చంద్రమండల పర్యంతం కృత రాశీర్వర్ష సహస్రావ సాన ఏకైక యవాపకర్ష క్రమేణ సర్వరాశ్యప కర్షిత సమ్మిత కాలే బ్రహ్మలోకే నిత్యనివాస సిధ్యర్థం
మాషైర్ధృవ మండల పర్యంతం కృతరాశేర్వర్ష సహస్రావసాన ఏకైక మాషాపకర్ష క్రమేణ సర్వరాశ్యప కర్షిత సమ్మిత కాలే బ్రహ్మలోకే నిత్యనివాస సిధ్యర్థం
గోలోమభిర్నక్షత్ర మండల పర్యంతం కృతరాశేర్వర్ష సహస్రావసాన ఏకైక లోమాపకర్ష క్రమేణ సర్వరాశ్యప కర్షిత సమ్మిత కాలే బ్రహ్మలోకే నిత్యనివాస సిధ్యర్థం
గంగావాలుకాభి సప్తఋషి మండల పర్యంతం కృతరాశేర్వర్ష సహస్రావసాన ఏకైక వాలుకాపకర్షక్రమేణ
సర్వరాశ్యప కర్షిత సమ్మిత కాలే బ్రహ్మలోకే నిత్యనివాస సిధ్యర్థం
మయాసహ దశ పూర్వేషాం దశా పరేషాం మంద్వంశ్యానాం సర్వేషాం పితృణాం నరకా దుత్తీర్య శాశ్వత
బ్రహ్మలోకే నిత్యనివాస సిధ్యర్థం
త్రిగుణీకృత అగ్నిష్టోష్టమ అతిరాత్ర ఆప్తోర్యామ సాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాది శత క్రతు సంపూర్ణ సకలపుణ్యఫలావాప్యర్థం
స్వగృహ్యాక్త ప్రకారేణ సాలంకృత సహిరజ్యోదక కన్యాదానం కరిష్యే
మయాసహ దశపూర్వేషాం దశాపరేషాం మద్వంశానాం మాతృవంశానాం సర్వేషాం పితృణాం నరకాదుతీర్య శాశ్వత బ్రహ్మలోక నిత్యనివాస సిద్ధ్యర్థ్యం
శ్రీలక్ష్మీనారాయణ దేవతా ప్రీత్యర్థ్యం శ్రీ వాస్తుదోష నివారణార్థం మమ గృహే అష్టైశ్వర్య స్థిరత్వ సిద్ధ్యర్థం సాలంకృత సహిరజ్యోదక కన్యాదానం కరిష్యే
స్వగృహ్యాక్త ప్రకారేణ సాలంకృత సహిరజ్యోదక కన్యాదానం కరిష్యే
కన్యాం కనకసంపన్నాం కనకా భరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం । బ్రహ్మలోక జిగీషియా ।।
కన్యమమాగ్రతో భూయా కన్యేమే దేవి పారయో: కన్యేను సర్వతో భూయా సద్ధానా మోక్షసూప్ను యాం ।।
కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుధీమతే ప్రయతోహం ప్రయచ్చామి ధర్మకామర్ధసిద్ధయే ।।
విశ్వంభరా స్పర్వభూతా స్పాక్షిణ్య సర్వదేవతా: ఇమాం కన్యాం ప్రదస్వామి । పితృణాం తారణాయవై ।।
శ్రీరూ పైషామయ కన్యాతుభ్యం శ్రీధర రూపిణి సాలంకృత సహిరజ్యోదక కన్యాదానం నారాయణ స్వరూప వాస్తుపురుష ప్రీత్యర్థ్యం తుభ్యమహం । సంప్రదదే నమమ।।
ప్రవర:
శ్రీనారాయణ ప్రవర
యజమానితో ప్రవర చెప్పించాలి
చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యశ్శుభంభవతు అనంత వేదాధ్యాయినే అచ్యుత పరబ్రహ్మణే ఆదినారాయణాయ
నిరాకార సాకార పరవ్యూహ విభావాంతర్యాయ అర్చావతారా పంచార్షేయ ప్రవరాన్విత
అచ్యుత గోత్రోద్భవస్య పరబ్రహ్మ శర్మణో నప్త్రే.
వ్యూహనారాయణ శర్మణః పౌత్రాయ.
విభవ వాసుదేవ శర్మణః పుత్రాయ.
అచ్యుత గోత్రోద్భవాయ శ్రీవేంకటేశ్వర స్వామినే సాక్షాత్ అదినారాయణ స్వరూపాయ వరాయ.
శ్రీలక్ష్మీ ప్రవర:
చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యశ్శుభంభవతు చతుర్వేదాధ్యాయినీం సౌభాగ్య విశ్వంభరీం నిరాకార సాకార
చిరచిత్ప్రకృతి స్వరూప త్రయార్షేయ ప్రవరాన్విత
సౌభాగ్య గోత్రోద్భవస్య విశ్వంభర శర్మణో నప్త్రీం.
రత్నాకర శర్మణః పౌత్రీం.
క్షీరార్ణవ శర్మణః పుత్రీం.
సౌభాగ్య గోత్రోద్భవాం శ్రీ శ్రీదేవీ నామ్నీం సాక్షాత్ లక్ష్మీ స్వరూపిణీం కన్యాం.
తుభ్యం యజమాన పరివార కర్మభ్యః ప్రతిపాదయామి కన్యాముదక పూర్వం స్వస్తిహి
పురోహితుడు 'స్వస్తి' అని పలికి ఈ క్రింది మంత్రములను చెప్పాలి
స్వస్తితి ప్రతివచనమ్।। వర:స్వస్తి ।
కన్యాదానం తుభ్యమహం సంప్రదదే
తదుపరి ఈ క్రింది వాక్యము పలికి కన్యాదాన సద్గుణాల కొరకు తనశక్త్యానుసారముగా స్వామివారికి దక్షిణను సమర్పించాలి
కన్యాదాన సాద్గుణ్యార్థం దక్షిణాంతుభ్య మహం సంప్రదదేనమమ
ఈ క్రింది వచనమును స్వామివారిని ఉద్దేశించి చెప్పాలి
ధర్మేచ అర్ధేచ కామేచ త్వయైషా నాతిచరితవ్యా ।
స్వామివారి నిమిత్తం ఈ క్రింది ప్రతి వచనమును పలకాలి
నాతిచరామి
మాంగళ్యధారణ
త్రిరాచమ్య
స్వామివారికి ఆచమనం ఇస్తున్నట్లుగా నీరు మూడుసార్లు చూపించి వదలవలెను
ఓం శివాయ స్వాహా
ఓం మహేశ్వరాయ స్వాహా
ఓం శంభవే స్వాహా
హస్తం ప్రక్షాల్య నీరు చూపించి వదలవలెను
సంకల్పం
శ్రీలక్ష్మీనారాయణ దేవతా ప్రీత్యర్థ్యం శ్రీ వాస్తుదోష నివారణార్థం మమ గృహే అష్టైశ్వర్య స్థిరత్వ సిద్ధ్యర్థం వాస్తుకళ్యాణోత్సవ సమయే - మాంగళ్య ధారణం కరిష్యే
తదంగ మాంగళ్య పూజాం కరిష్యే మాంగళ్యదేవతాభ్యోనమ: ధ్యాన ఆవావాహనాది షోడశోపచార పూజాం సమర్పయామి
మాంగళ్యానికి పసుపు, కుంకుమ, అక్షతలు, పుష్పములు, ధూపము, దీపము, ఫలములు సమర్పించాలి. మంగళహారతి ఇవ్వాలి.
మాంగళ్యధారణ శ్లోకం
పురోహితుడు అందరికి అక్షతలను ఇవ్వాలి. పిదప పురోహితుడు మాంగళ్యమును యజమాని మేనమామ కానీ లేదా బావమరిది కానీ ఇచ్చి గృహములో ఉన్న అతిధులందిరి చేత ముట్టించమని చెప్పాలి. తదనంతరం యజమాని స్వామివారి హస్తాలకు తాకించి అమ్మవారి మెడలో వేయాలి.
మాంగళ్యం తంతునానేన గృహజీవన హేతునా ।
కంఠే భధ్నామి శుభగే త్వంజీవ శరదశ్శతం ।।
మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తో అస్తు ।।
తలంబ్రాలు
కపిలాగ్ స్మారయస్తు! బహుధేయంచాస్తు పుణ్యం వర్ధతాగ్ శాంతిరస్తు ।
పుష్ఠిరస్తు తుష్టిరస్తు వృద్ధిరస్తు అవిఘ్నమస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు స్వస్తిశివంకర్మాస్తు కర్మసమృద్ధిరస్తు
దంపత్యో స్పగ్రహే సనక్షేత్రే సహసోమేన క్రియేతాగ్ శాంతిరస్తు ।
ప్రజాపతి స్త్రీయాం యశ: ముష్కయో రదధాత్సపమ్ ।
కామస్య తృప్తిమానందం। తస్యాగ్నే భాజయేహమా ।
మోధః ప్రమోదానంద: ముష్కయోర్ని హితస్సప:
సృత్వేవ కామస్య తృప్యాణి దక్షిణానాం ప్రతిగ్రహే మనసశ్చిత్త మాకూతిం వాచసత్యమశీమహి
పశూనాం రూపమన్నస్య యశశ్రీ శ్రయతాం మయి ।
యధాహమస్య అతృపగ్గ్ ప్రియైపుమాన్ యథా
తృప్యతిపుంగ్ సి ప్రియేప్రియా ఏవం భగస్య తృప్యాణి యజ్ఞస్య కామ్య
ప్రియ: దదామీత్యగ్నిర్ వదతి తధేతి వాయురాహతత్ హంతేతి సత్యం
చంద్రమాః ।
ఆదిత్యస్సత్యమోమితి ఆపస్తథ్యత్య మాభరన్ యశోయజ్ఞస్య
దక్షిణాం - భక్తా ప్రజామేకామ స్సమృధ్యతామ్। పశవోమేకామ సమృధ్యతామ్। యజ్ఞోమే కామ సమృధ్యతామ్। శ్రియోమేకామ స్సమృధ్యతామ్।
తలంబ్రాల వేడుక చేయాలి. పురోహితుడు యజమాని మరియు ధర్మపత్ని దోసిలిలో తలంబ్రాల బియ్యం పోయాలి. మొదటిసారి యజమాని అమ్మవారికి చూపించి స్వామివారిపై పోయాలి. అయన ధర్మపత్ని స్వామివారికి చూపించి అమ్మవారికి పోయాలి. రెండవసారి యజమాని అమ్మవారికి, ధర్మపత్ని స్వామివారికి పోయాలి. మూడవసారి ఇద్దరూ కొంచెం స్వామివారిపై కొంచెం అమ్మవారిపై పోయాలి.
బ్రహ్మ ముడి
కంద మూల ఫలైర్యుక్తం క్రముకైః దక్షిణస్తదా ।
వధూవరేషు వర్ధ్యంతాం బ్రహ్మ గ్రంథిం శుభావహం ।।
బ్రహ్మగ్రంధి ముహూర్త సుముహూర్తాస్తు ।
బ్రహ్మముడి వేయాలి. నల్లపూసలు - మెట్టెలు - వడిబియ్యము (అయిదుగురు ముత్తైదువులు చేయాలి.) కార్యములు విధిగా నిర్వర్తించాలి.
ధూపం:
దశాంగం గగ్గులోపేతం
సుగంధం సుమనోహరం।
గృహాణ సర్వదేవేశ
శ్రీలక్ష్మీనారాయణా నమోఽస్తుతే।।
శ్రీలక్ష్మీనారాయణాయ నమః । ధూపమాఘ్రాపయామి।
అగరుబత్తులు వెలిగించి ఘంటా మోగిస్తూ గణనాథుడికి చూపించాలి
దీపం:
సాజ్యమేకార్తి సంయుక్తం వహ్నినా యొజితం ప్రియం
గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహ।
భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే
త్రాహిమాంనర కాద్ఘోరా ద్దివ్య జ్యోతి ర్నమోస్తు తే।।
శ్రీలక్ష్మీనారాయణాయ నమః । ప్రత్యక్ష దీపం దర్శయామి ।
ధుపా దీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి ।
దీపానికి నమస్కారం చేయాలి
కొబ్బరికాయ
యాః ఫలినీర్యా అఫలా అపు॒ష్పాయాశ్చ పు॒ష్పిణీః ।
బృహస్పతి ప్రసూతాస్తానో॑ ముంచంత్వగ్ం హసః ।।
కొబ్బరికాయ కొట్టాలి. (కన్యాదాన సమయములో కొబ్బరికాయ వాడితే అదే కొట్టాలి.)
నైవేద్యం:
ఓం భూర్భువస్సువ: । తత్సవితుర్వరేణ్య॒o భర్గో॑ దేవస్య ధీమహి ।
ధియో యో న॑: ప్రచోదయాత్ ।।
సత్యం త్వా ఋతేన పరిషించామి ।
సాయంకాలం ‐ ఋతం త్వా సత్యేన పరిషించామి అని చెప్పాలి.
అమృతమస్తు । అమృ॒తో ప॒స్తరణమసి ।
శ్రీలక్ష్మీనారాయణాయ నమః మహానివేదనం సమర్పయామి ।
ఓం ప్రాణాయ స్వాహా । ఓం అపానాయ స్వాహా ।
ఓం వ్యా॒నాయ స్వాహా । ఓం ఉదానాయ స్వాహా ।
ఓం సమానాయ స్వాహా ।
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి ।
అమృ॒తాపి॒ధానమసి । ఉత్తరాపోశనం సమర్పయామి ।
హస్తౌ ప్రక్షాళయామి । పాదౌ ప్రక్షాళయామి ।
శుద్ధ ఆచమనీయం సమర్పయామి ।
శ్రీలక్ష్మీనారాయణాయ నమః। నైవేద్యం సమర్పయామి।।
పరమాన్నమును నివేదించాలి, సమర్పించాలి.
తాంబూలం:
పూగీఫలైశ్చ కర్పూరైర్నాగవల్లీ దళైర్యుతం।
ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం।।
శ్రీలక్ష్మీనారాయణాయ నమః। తాంబూలం సమర్పయామి ।।
రెండు తమలపాకులు తొనలు ఆకుల కొసలు ఉత్తరం వైపు ఉన్నట్లుగా పెట్టి అందులో వక్కలు వేసి దైవానికి సమర్పించాలి.
కర్పూర మంగళ నీరాజనం:
హిరణ్య పత్రం మధూః పూర్ణం దదాతి । మాదవ్యోసనితి । ఏకాద బ్రాహ్మణ ఉపహారతి । ఏకదైవ యజమాన ఆయుస్తేజో దదాతి ।।
మంగళహారతి ఇవ్వాలి. కర్పూర హారతి ఇవ్వాలి.
శ్రీలక్ష్మీనారాయణాయ నమః
కర్పూర మంగళ నీరాజనం దర్శయామి నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి రక్షామ్ధారయామి నమస్కరోమి ।।
హారతి తీసుకోవాలి.
మంత్రపుష్పము
ఓంయోఁపాంపుష్పం వేద । పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి । చంద్రమా వా అపాంపుష్పం ।
పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి ।
య ఏవం వేద । యోఁపామాయతనం వేద ।
ఆయతనవాన్ భవతి ।।
ఓం వాస్తునాథాయ విద్మహే ।
చతుర్భుజాయ ధీమహి ।
తన్నో వాస్తుః ప్రచోదయాత్।
ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి ।
తన్నో విష్ణుః ప్రచోదయాత్ ।।
ఓం మహాలక్ష్మ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి ।
తన్నో లక్ష్మీః ప్రచోదయాత్ ।।
పుష్పములు సమర్పించాలి.
ఆత్మ ప్రదక్షిణం
అక్షతలు, పుష్పాలు చేతిలో తీసుకొని తమ కుడివైపుకు 9 మార్లు తిరుగుతూ ఆత్మప్రదక్షిణ చేయాలి. తదుపరి అక్షత పుష్పాలను సమర్పించాలి.
యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే
పాపోఽహం పాపకర్మాఽహం పాపాత్మా పాపసంభవః
త్రాహి మాం కృపయా సాయి శరణాగతవత్సల
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ
తస్మాత్కారుణ్య భావేన రక్ష రక్ష గణనాయక
శ్రీలక్ష్మీనారాయణాయ నమః। ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి ।
ఉపచారపూజాః:
పునః పూజాం కరిష్యే । ఛత్రమాచ్ఛాదయామి ।
చామరైర్వీజయామి । నృత్యం దర్శయామి ।
గీతం శ్రావయామి । ఆందోళికానారోహయామి ।
అశ్వానారోహయామి । గజానారోహయామి ।
సమస్త రాజోపచార దేవోపచార భక్త్యుపచార శక్త్యుపచార మంత్రోపచార పూజాస్సమర్పయామి ।
శ్రీలక్ష్మీనారాయణులకి అక్షతలు, పుష్పములు సమర్పించాలి.
సాష్టాంగ నమస్కారం:
ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా।
పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగముచ్యతే।
శ్రీలక్ష్మీనారాయణాయ నమః । సాష్టాంగ నమస్కారాం సమర్పయామి ।
క్షమాప్రార్థనా:
అపరాధసహస్రాణి క్రియన్తేऽహర్నిశం మయా।
దాసోఽయమితి మాం మత్వా క్షమస్వ జనార్దనా।
శ్రీలక్ష్మీనారాయణులకి నమస్కారం చేయాలి
సమర్పణం:
యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు ।
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యోవందే తమచ్యుతం ।
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దనా ।
యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు తే ।
అనయా వాస్తుకళ్యాణేన భగవాన్ సర్వాత్మకః
శ్రీలక్ష్మీనారాయణ వాస్తుపురుష దేవతా సుప్రీతః సుప్రసన్నో వరదో భవతు ।
ఏతత్ఫలం పరమేశ్వరార్పణమస్తు ।
అక్షింతలు పుష్పాలుజలం కుడిచేతిలో తీసుకొని శ్రీలక్ష్మీనారాయణ పాదాల ముందు వదలాలి.
వాస్తుపురుష భగవాన్ కీ జై ।
తీర్థప్రసాద గ్రహణం:
అకాలమృత్యహరణం సర్వవ్యాధినివారణం।
సమస్తపాపక్షయకరం శ్రీ లక్ష్మీనారాయణ పాదోదకం పావనం శుభమ్।
శ్రీలక్ష్మీనారాయణాయ నమః । ప్రసాదం శీరసా గృహ్ణామి।
ఉద్వాసనం:
ఓం యజ్ఞేన య॒జ్ఞమయజన్త దేవాః
తాని ధర్మాణి ప్రథమాన్యాసన్।
తే హ నాకo మహిమాన॑స్సచన్తే
యత్ర పూర్వే సాధ్యాస్సన్తి॑ దేవాః।।
శ్రీలక్ష్మీనారాయణాయ నమః। యథాస్థానం ఉద్వాసయామి।।
శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ।
స్వామి, అమ్మవార్లను ఉత్తరం దిశగా లేదా తూర్పు దిశగా కదిలించాలి
ఓం శాంతిః శాంతిః శాంతిః।