అఖండ దీప స్థాపన విధి
సంకల్పం:
ఇప్పుడు కుడిచేతిలో అక్షతలు తీసుకుని, అక్షతలను నీటితో అర్ఘ్యపాత్రలో వదలాలి.
పూర్వోక్త సంకల్పానుసారేణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ, అస్మిన్ {*......
నవరాత్రి పేరు చెప్పుకోవాలి. ఉదా: దుర్గా, గణపతి, మొదలగునవి. నవరాత్రోత్సవ పుణ్యకాలే, శుభకర్మణి, అఖండ దీపస్థాపనం కరిష్యే.}
ఈ మంత్రం చదువుతూ తామ్రం (రాగి) లేదా మృణ్మయం (మట్టి) పాత్రలను సిద్ధం చేసి, రెండు వత్తులు వేసి, ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో నింపాలి.
తామ్ర మృణ్మయంవా పాత్రద్వయం నిక్షిప్య ।
వర్తి ద్వయం నిధాయ । ఆజ్యేన తైలేన వా
పాత్రం పూరయిత్వా ।
అఖండ దీప స్థాపన మంత్రం:
ఈ మంత్రం చదువుతూ అఖండ దీపాన్ని పీఠంపై ఉంచాలి.
ఓం గృహా వై ప్రతిష్ఠా సూక్తం । తత్ప్రతిష్ఠిత తయా వాచం వదేత్ ।
తస్మాద్యద్యపి దూరం ఇవ పశూన్ లభతే ।
గృహానేవై నా నాజిగమిషతి । గృహా వై పశూనాం ప్రతిష్ఠా ప్రతిష్ఠా ।।
ఓం మనోజూతిర్జుషతామాజ్యస్య బృహస్పతిర్యజ్ఞమిమం తనోత్వరిష్టం
యజ్ఞం సమిమం దధాతు ।
విశ్వే దేవా స ఇహ మాదయంతా మ ఓం ప్రతిష్ఠ ।।
ఓం తద్విష్ణోః పరమం పదం సదా పశ్యంతి సూరయః ।
దివీవ చక్షురాతతమ్ ।।
సుప్రతిష్ఠితమస్తు - సుముహూర్తమస్తు!
పై ప్రక్రియ తరువాతమరొక వత్తితో లేదా అగర్బత్తీలతో ఇప్పుడు అఖండ దీపాన్ని వెలిగించాలి.
అన్యవర్తినా అఖండ దీపవర్తిం ప్రజ్వల్యా
అఖండ దీప స్థాపన పూజ:
ఈ మంత్రం చదువుతూ అక్షతలు పుష్పాలు ఈ మంత్రం చదువుతూ దీపం వద్ద ఉంచాలి.
- దుర్గా నవరాత్రి:
ఓం ఐం క్లీం సౌః, రం అగ్నిమండలాయ ధర్మప్రద దశకళాత్మనే జ్యోతిర్దేవతా దీపధారాయ నమః। సౌః క్లీం ఐం ఓం ।
- గణపతి నవరాత్రి:
ఓం గం గణపతయే, రం అగ్నిమండలాయ ధర్మప్రద దశకళాత్మనే జ్యోతిర్దేవతా దీపధారాయ నమః। ఓం గం।
అఖండ దీప ప్రార్థన:
దీపము వెలిగించిన తర్వాత, ఆ జ్యోతిని స్థిరపరుస్తూ ఈ మంత్రాలను పఠించాలి.
ఓం జ్యోతిష్మంతం త్వా సాదయామి ।
ఓం జ్యోతిష్కృతం త్వా సాదయామి ।
ఓం జ్యోతిర్విదం త్వా సాదయామి ।
ఓం భాస్వంతం త్వా సాదయామి ।
ఓం జ్వలంతం త్వా సాదయామి ।
ఓం మల్మలాభవంతం త్వా సాదయామి ।
ఓం దీప్యమానం త్వా సాదయామి ।
ఓం రోచమానం త్వా సాదయామి ।
ఓం అజస్రం త్వా సాదయామి ।
ఓం బృహజ్జ్యోతిషం త్వా సాదయామి ।
ఓం బోధయంతీం త్వా సాదయామి ।
ఓం జాగ్రతీం త్వా సాదయామి ।
పంచోపచార పూజ:
దీపము వెలిగించిన తర్వాత, దీపానికి ఈ క్రింది మంత్రాలతో పూజ చేయాలి.
దుర్గా నవరాత్రి:
ఓం ఐం క్లీం సౌః । లం పృథివీతత్వాత్మికాయై శ్రీ దుర్గా (శ్రీదేవీ) పరదేవతాయై నమః గంధం పరికల్పయామి । సౌః క్లీం ఐం ఓం ।।
అని చదువుతూ దీపానికి గంధం సమర్పించాలి.
ఓం ఐం క్లీం సౌః । హం ఆకాశతత్వాత్మికాయై శ్రీ దుర్గా (శ్రీదేవీ) పరదేవతాయై నమః పుష్పం పరికల్పయామి । సౌః క్లీం ఐం ఓం ।।
అని చదువుతూ దీపానికి పుష్పములను సమర్పించాలి.
ఓం ఐం క్లీం సౌః । యం వాయుతత్వాత్మికాయై శ్రీ దుర్గా (శ్రీదేవీ) పరదేవతాయై నమః ధూపం పరికల్పయామి । సౌః క్లీం ఐం ఓం ।।
అని చదువుతూ ధూపమును చూపించాలి.
ఓం ఐం క్లీం సౌః । రం అగ్నితత్వాత్మికాయై శ్రీ దుర్గా (శ్రీదేవీ) పరదేవతాయై నమః దీపం పరికల్పయామి । సౌః క్లీం ఐం ఓం ।।
అని చదువుతూ దీపమును చూపించాలి.
ఓం ఐం క్లీం సౌః । వం అమృతతత్వాత్మికాయై (లేదా జలతత్వాత్మికాయై) శ్రీ దుర్గా (శ్రీదేవీ) పరదేవతాయై నమః నైవేద్యం పరికల్పయామి । సౌః క్లీం ఐం ఓం ।।
అని చదువుతూ ఏదైనా ఫలమును నివేదించాలి.
ఓం ఐం క్లీం సౌః । సం సర్వతత్వాత్మికాయై శ్రీ దుర్గా (శ్రీ దేవీ)పరదేవతాయై సర్వోపచార పూజాం నమః పరికల్పయామి । సౌః క్లీం ఐం ఓం ।।
పుష్పము అక్షతలు తీసుకొని భౌతికంగా మనం చేయలేని మర్యాదలను చేస్తున్నామన్నాయి భవిస్తూ భక్తితో అమ్మవారి పాదాలపై సమర్పించాలి.
ఐం క్లీం సౌః శ్రీదేవి మహాదేవ్యై సౌః క్లీం ఐం నమః
నమస్కారము చేయాలి.
గణపతి నవరాత్రి:
ఓం గం । లం పృథివీతత్వాత్మనే మహాగణాధిపతయే నమః గంధం పరికల్పయామి । గం ఓం ।।
అని చదువుతూ దీపానికి గంధం సమర్పించాలి.
ఓం గం । హం ఆకాశతత్వాత్మనే మహాగణాధిపతయే నమః పుష్పం పరికల్పయామి । గం ఓం ।।
అని చదువుతూ దీపానికి పుష్పములను సమర్పించాలి.
ఓం గం । యం వాయుతత్వాత్మనే మహాగణాధిపతయే నమః ధూపం పరికల్పయామి । గం ఓం ।।
అని చదువుతూ ధూపమును చూపించాలి.
ఓం గం । రం అగ్నితత్వాత్మనే మహాగణాధిపతయే నమః దీపం పరికల్పయామి । గం ఓం ।।
అని చదువుతూ దీపమును చూపించాలి.
ఓం గం । వం అమృత తత్వాత్మనే మహాగణాధిపతయే నమః నైవేద్యం పరికల్పయామి । గం ఓం ।।
అని చదువుతూ ఏదైనా ఫలమును నివేదించాలి.
ఓం గం । సం సర్వతత్వాత్మనే మహాగణాధిపతయే నమః సర్వోపచార పూజాం పరికల్పయామి । గం ఓం ।।
పుష్పము అక్షతలు తీసుకొని భౌతికంగా మనం చేయలేని మర్యాదలను చేస్తున్నామన్నాయి భవిస్తూ భక్తితో స్వామివారి పాదాలపై సమర్పించాలి.
ఓం గం గణపతయే నమః
నమస్కారము చేయాలి.
ఇతి అథ అఖండ దీపస్థాపనమ్।