పూజా సామాగ్రి
- పసుపు
- కుంకుమ
- తడిపిన గంధం
- అమ్మవారికి ఎరుపు వర్ణ చీర
- దుర్గా దేవి ప్రతిమ
- పసుపు గణపతి(లేదా
- ఐదు రకముల పుష్పములు
- పసుపు అక్షతలు
- ఆచమన పాత్ర {రెండింటిలోనూ నీళ్ళు నింపుకోండి}
- కలశానికి రాగి చెంబు {రెండింటిలోనూ నీళ్ళు నింపుకోండి}
- అమ్మవారికి ఎరుపు వర్ణ చీర
- కలశ స్థాపనకు రాగి చెంబు
- జాకెట్ బట్టలు - 3
- పాలు
- పెరుగు
- నెయ్యి
- తేనే
- శర్కర
- కొబ్బరికాయ
- అగరవత్తులు
- దీపానికి నూనె
- వత్తివేసిన కుందులు
- అగ్గిపెట్టె
- కర్పూరం
- కూర్చోవడానికి ఆసనం
అమ్మవారిని స్థాపించే ప్రదేశాన్ని పుణ్యాహవాచనం అనే క్రియ ద్వారా జలముతో శుద్ధి చేయాలి.
తరువాత
అక్కడికి వచ్చిన బ్రాహ్మణులకు ఋత్విగ్వరణం ఇవ్వాలి.
పిదప
అఖండ దీపారాధనం చేయాలి.
తదుపరి
కలశమును స్థాపించాలి.
పిదప
అమ్మవారిని ప్రతిష్ఠించిప్రాణప్రతిష్ఠాపనము చేయాలి.
శ్రీదుర్గా (శ్రీదేవీ నవరాత్రి) పూజ
శివాయ గురవే నమః పరమగురవే నమః సద్గురవే నమః శ్రీ మహా గణాధిపతయే నమః శ్రీ బాలాత్రిపురసుందరీ మహాదేవ్యై నమః శ్రీ గురుభ్యో నమః హరిః ఓం । మీ ముఖానికి కుంకుమ పెట్టుకుని,నమస్కారం చేయండి ప్రార్థన: శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం । ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ।। అగజానన పద్మార్కం గజాననమహర్నిశం। అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ।। దేవీం వాచ॑మజనయన్త దేవాస్తాం వి॒శ్వరూపాః ప॒శవో॑ వదన్తి ।। సా నో॑ మన్ద్రేష॒మూర్జ॒o దుహా॑నా ధేనుర్వాగ॒స్మానుప॒ సుష్టుతైతు । యశ్శివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళ। తయోః సంస్మరణాన్నిత్యం సర్వదా జయ మంగళం । తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ। విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేఽంఘ్రియుగం స్మరామి।। గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః। గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః।। లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః। ఏషామిందీవరశ్యామో హృదయస్థో జనార్దనః।। సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే। శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోఽస్తు తే।। [ఇప్పుడు ఎడమచేతిలో అక్షింతలు తీసుకొని కుడి చేతితో మృగముద్రవేసి(బొటనవేలు,మధ్యవేలు, ఉంగరం వేలు కలిపితే అది మృగముద్ర అవుతుంది. ఆ ఎడమ చేతిలోని అక్షింతలు ఒక్కోనామం చదువుతూ గణనాథుడిపై వేస్తూ ఉండాలి.] శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః। ఉమామహేశ్వరాభ్యాం నమః। వాణీహిరణ్యగర్భాభ్యాం నమః। శచీపురందరాభ్యాం నమః। అరుంధతీవసిష్ఠాభ్యాం నమః। శ్రీసీతారామాభ్యాం నమః। మాతాపితృభ్యో నమః। సర్వేభ్యో మహాజనేభ్యో నమః। ఆచమ్య‐ప్రాణానాచమ్య‐నేత్రాచమ్య: ఇప్పుడు ఆచమన పాత్ర లోని నీటిని ఉంగరం వ్రేలితో కళ్ళకు అద్దుకొని, ఉద్ధరిణిలో తీసుకొని ఒక్కో నామం చెపుతూ మూడు మార్లు తాగవలెను. ఓం ఐం ఆత్మతత్త్వం శోధయామి నమః స్వాహా ఓం క్లీం విద్యాతత్త్వం శోధయామి నమః స్వాహా ఓం సౌః శివతత్త్వం శోధయామి నమః స్వాహా ఓం ఐం క్లీం సౌః సర్వతత్వం శోధయామి నమః స్వాహా హస్తం ప్రక్షాల్య చేయి కడగండి భూతోచ్చాటనం(విఘ్నాల తొలగింపు): పూజ చేసే ప్రదేశం పవిత్రం కావడానికి ఈ శ్లోకాలు చదువుతారు. అపసర్పంతు యే భూతా యే భూతా భూమి సంస్థితాః । యే భూతా విఘ్నకర్తారః తే నశ్యంతు శివాజ్ఞయా।। అపక్రామంతు భూతాద్యాః సర్వేతే భూమి భారకాః । సర్వేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే।। ఉత్తిష్ఠంతు భూతపిశాచాః య ఏతే భూమి భారకాః । ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే ।। అక్షతలు వాసనా చూసి మీ ధర్మపత్నికి ఎడమవైపున వేయండి. ప్రాణాయామం: ఈ మంత్రం చదువుతూ ప్రాణాయామం చేయండి. ఓం భూః।ఓం భువః।ఓం సువః।ఓం మహః। ఓం జనః।ఓం తపః।ఓం సత్యం। ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్। ఓమాపో జ్యోతీ రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్। దుర్గా నవరాత్రి - సంకల్పం: ఇప్పుడు కుడిచేతిలో అక్షతలు తీసుకుని ,మీ కుడి కాలితొడపై ఎడమ అరచేతి నుంచి అక్షతలతో ఉన్న కుడిచేతిని పిడికిలిగా మూసి ఆ ఎడమ అరచేతిపైనుంచుతూ ఈ సంకల్పం చెప్పి పిడికిలిలో ఉన్నఅక్షతలను నీటితో అర్ఘ్యపాత్రలో వదలాలి. మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీపరమేశ్వరి ముద్దిశ్య శ్రీ పరమేశ్వరీ ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీమహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య …… ప్రదేశే ……, …… నద్యోః మధ్యప్రదేశే శోభన గృహే (స్వగృహే/దేవాలయే/దేవీ నవరాత్రి మంటప సన్నిధౌ( సమస్త దేవతా బ్రాహ్మణ హరి హర గురు చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమనే వ్యావహరిక చాంద్రమానేన శ్రీ …….. (* నామ సంవత్సరే …… అయనే (* …… ఋతౌ (* …… మాసే(* …… పక్షే (* …… తిథౌ (* …… వాసరే (* …… నక్షత్రే (* …… యోగే (* …… కరణ (* ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీ పరమేశ్వరి ముద్దిశ్య శ్రీ పరమేశ్వరీ ప్రీత్యర్థం శ్రీమాన్ …… గోత్రః …… నామధేయః …… నామ ధర్మపత్నీ సమేతోహం శ్రీమతః …… గోత్రస్య …… నామధేయస్య …… నామ ధర్మపత్నీ సమేతస్య అస్మాకం సహకుటుంబానాం, క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం, ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం, సకల సంపత్ సమృద్ధ్యర్థం, మమ గృహే మహాలక్ష్మీ కటాక్ష ద్వారా మహాదైశ్వర్య విశిష్ట సమస్త భోగానుభవ సిద్ధ్యర్థం, రాజముఖే సభా మధ్యే అకుంఠిత వాగ్వైఖరీ సిద్ధ్యర్థం, సర్వ అపమృత్యు పరిహారార్థం, ధన ధాన్య వస్త్రాభరణ స్వర్ణ రజిత గృహోపకరణ దాన దాసీజన వాహన గో మహిష అశ్వ గజ భాండారాది వృద్ధ్యర్థం, సర్వత్ర జయ సిద్ధ్యర్థం, సర్వాపచ్ఛాంతి ద్వారా దీర్ఘాయుః విపుల ధన పుత్ర పౌత్రాద్యనవచ్ఛిన్న సంతతి స్థిరలక్ష్మీ కీర్తి లాభ శత్రు పరాజయ సర్వాభీష్ట సిద్ధ్యర్థం; శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణీ, స్వర్ణకవచాలంకృత దుర్గాదేవీ, బాలాత్రిపురసుందరీ, గాయత్రీ, అన్నపూర్ణా, లలితా త్రిపురసుందరీ, మహాలక్ష్మీ, సరస్వతీ, దుర్గాష్టమి (దుర్గాదేవీ), మహిషాసుర మర్దినీ, రాజరాజేశ్వరీ దేవతా ప్రీత్యర్థం; తథా నవదుర్గా స్వరూప - శైలపుత్రీ, బ్రహ్మచారిణీ, చంద్రఘంటా, కూష్మాండా, స్కందమాతా, కాత్యాయనీ, కాలరాత్రీ, మహాగౌరీ, సిద్ధిదాత్రీ దేవతా ప్రీత్యర్థం; శ్రీ దుర్గాదేవీ (శ్రీ దేవీ) నవరాత్రోత్సవ కల్పోక్త ప్రకారేణ, సంభవద్భిః ద్రవ్యైః సంభవతా నియమేన, సంభవతా ప్రకారేణ, యథాశక్తి ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థ, పంచమ, షష్ఠీ, సప్తమీ, అష్టమీ, నవమీ దినేషు — దశమ దివసే విజయదశమి పర్వదినే చ — నవరాత్రి దేవతాః ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే । తదంగత్వేన ప్రథమ దివసే నవరాత్రి పర్వదిన సుముహూర్త సమయే కలశ గణాధిపతి, శ్రీచక్ర పీఠ పూజాం చ కరిష్యే, దశమ దివసే విజయోత్సవ పూర్వక సర్వ దేవతా ఉద్వాసన పూజాం చ కరిష్యే ।। ఆదౌ నిర్విఘ్నేన పరిసమా వాప్త్యర్థం శ్రీ కలశ గణాధిపతి పూజాం కరిష్యే. పీఠంపై నుంచిన కలశములో గణపతిని ఆవాహనం చేయాలి. ఈ క్రింద ఇచ్చిన లింక్లో 'ప్రాణప్రతిష్ఠ' అనే శీర్షిక నుండి గణపతి పూజను చేయాలి. తరువాతశ్రీ చక్ర యంత్రాన్ని గాని అమ్మవారి పటమును గాని ఒక పీఠంపై ఈ విధముగా ప్రతిష్ఠించి శ్రీ చక్ర పూజ చేయాలి.
దుర్గా నవరాత్రి - షోడశోపచార పూజ చూడటానికి క్లిక్ చేయండి (Click to expand)
ఓమ్ శ్రీమాత్రే నమః । ఓం హ్రీం దుం దుర్గాయై నమః । ధ్యానం: మన హృదయంలో ఉన్న అమ్మవారి ప్రాణశక్తిని, ఈ మంత్రాల ద్వారా జాగృతము చేస్తూ ఆ తల్లిని మనసులో స్మరించాలి. శ్రీ మహాకాళీ (10 చేతులు) ధ్యాయేత్ కాళీం మహామాయాం త్రినేత్రాం బహురూపిణీమ్ । చతుర్భుజాం లలజ్జిహ్వాం పూర్ణచంద్ర నిభాననామ్ ।। నీలోత్పల దళ ప్రఖ్యాం శత్రు సంఘ విదారిణీమ్ । నరముండం తథా ఖడ్గం కమలం వరదం తథా ।। బిభ్రాణాం రక్తవదనాం దంష్ట్రాలీం ఘోర రూపిణీమ్ । అట్టాట్టహాస నిరతాం దేవీం ముండమాలా విభూషితామ్ ।। ఏషా సా వైష్ణవీ మాయా మహాకాళీ దురత్యయా । ఆరాధితా వశీకుర్యాత్ పూజాకర్తుశ్చరాచరమ్ ।। శ్రీ మహాకాళ్యై నమః - ధ్యానం సమర్పయామి । శ్రీ మహాలక్ష్మీ (18 చేతులు) అక్షస్రక్పరశూ గదేషుకులిశం పద్మం ధనుః కుండికాం దండం శక్తిమసిం చ చర్మ జలజం ఘంటాం సురాభాజనమ్ । శూలం పాశసుదర్శనే చ దధతీం హస్తైః ప్రసన్నాననాం సేవే సైరిభమర్దినీమిహ మహాలక్ష్మీం సరోజస్థితామ్ ।। సర్వదేవమయీమీశాం మహాలక్ష్మీమిమాం స్మరేత్ । పూజయేత్సర్వలోకానాం స దేవానాం ప్రభుర్భవేత్ ।। శ్రీ మహాలక్ష్మ్యై నమః - ధ్యానం సమర్పయామి। శ్రీ మహాసరస్వతీ (8 చేతులు) ఘంటాశూలహలాని శంఖముసలే చక్రం ధనుః సాయకం హస్తాబ్జైర్దధతీం ఘనాంతవిలసచ్ఛీతాంశుతుల్యప్రభామ్ । గౌరీదేహసముద్భవాం త్రిజగతామాధారభూతాం మహా- పూర్వామత్ర సరస్వతీమనుభజే శుంభాదిదైత్యార్దినీమ్ ।। ఏషా సంపూజితా భక్త్యా సర్వజ్ఞత్వం ప్రయచ్ఛతి । నిశుంభమర్దినీ దేవీ శుంభాసురనిబర్హిణీ ।। శ్రీ మహాసరస్వత్యై నమః - ధ్యానం సమర్పయామి. సుప్రభాత సేవ: శంఖ చక్ర గదాహస్తే సువర్ణాభే సుశోభనే । మమ దేవి వరందేహి సర్వసిద్ధి ప్రదాయిని ।। నానావరప్రదాం దేవీం సమారాధనసువ్రతామ్ । పీతాంబరధరాం దేవీం సర్వక్షోభ వివర్జితామ్ ।। ఉషసి మాగధ మంగళగాయనైః షడితి జాగృహి జాగృహి జాగృహి । అతికృపాకటాక్ష నిరీక్షణైః జగదిదం జగదంబ! సుఖీకురు! సుఖీకురు! ఆవాహనం: *రెండు చేతులతో పుష్పాలు, అక్షతలు మరియు కొద్దిగా గంధం కలిపి దోసిట్లోకి తీసుకోని, *ముక్కు దగ్గరగా ఉంచుకుని ఈ మంత్రుములు చదువుతూ అమ్మవారిని ధ్యానించి, *"ఆవాహయామి" అని పలికినపుడు, ఆ పుష్పాక్షతలను అమ్మవారి పాదాల వద్ద సమర్పించాలి. మూలమంత్రం సముచ్చార్య స్వహృదయస్థితామ్ । చిచ్చైతన్యస్వరూపాం దేవీం పుష్పాంజలవాగతామ్ ।। విభావ్య మూర్ధ్నీం పరిసంయోజయేత్ । ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజామ్ । చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ ।। శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణీ నవరాత్రీ దేవతాభ్యో నమః । ఆవాహయామి - స్థాపయామి - సన్నిధాపయామి - సన్నిరోధయామి - కుంభముద్రయా స్థిరీకరోమి । ఆవాహనం సమర్పయామి । మంటప సమర్పణమ్: చతుర్భుజాం త్రినేత్రాం చ వరదాభయదాయినిమ్ । సింహారూఢాం మహాదేవీం సర్వైశ్వర్యప్రదాయినీమ్ ।। కనకమయవితర్దిశోభమానం దిశిదిశి పూర్ణ సువర్ణ సువర్ణకుంభయుక్తమ్ । మణిమయమంటపమధ్యమేహి మాతర్మయి కృపయా కురు అర్చనం గృహీతుమ్ ।। శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణీ నవరాత్రీ దేవతాభ్యో నమః । దివ్య మణిమయ మంటపం సమర్పయామి ।। అక్షతలు అమ్మవారి పాదాల వద్ద సమర్పించాలి మణిమయ మందిర సమర్పణమ్: కనకకలశశోభమానశీర్షం జలధరచుంబి సముల్లసత్పతాకమ్ । భగవతి తవ సన్నివాసహేతోర్మణి మయమందిరమేతదర్పయామి ।। శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణీ నవరాత్రీ దేవతాభ్యో నమః । మణిమయ దివ్య మందిరం సమర్పయామి ।। అమ్మవారికి అక్షతలు సమర్పిస్తూ ఆ తల్లి ఒక అద్భుతమైన దేవాలయంలోకి ప్రవేశిస్తున్నట్లు ఊహించుకోవాలి. పల్లకి సమర్పణమ్: తపనీయమయీ సుతూలికా కమనీయా మృదులోత్తరచ్ఛదా । నవరత్న విభూషితా మయా శిబికేయం జగదంబ తేర్పితా ।। శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణీ నవరాత్రీ దేవతాభ్యో నమః । ఆందోళికాం సమర్పయామి ।। రెండు చేతులతో పల్లకిని మోస్తున్నట్లుగా శిబికా ముద్ర వేస్తూ అమ్మవారిని పల్లకిలో ఉరేగిస్తున్నట్లు భావించాలి. పిదప అక్షతలు సమర్పించాలి. శిబికా ముద్ర: రెండు చేతుల వేళ్లను ఒకదానికొకటి లోపలికి తీసుకొని గట్టిగా ముడి వేయాలి.(Interlocking the fingers). ఇప్పుడు చూపుడు వేళ్లను (Index fingers),బొటన వేళ్లను (Thumb fingers) పైకి నిటారుగా ఉంచాలి. రత్న సింహాసన సమర్పణమ్: కనకమయవితర్దిస్థాపితే తూలికాఢ్యే కనకకుసుమకీర్ణే కోటిబాలార్కవర్ణే । భగవతి రమణీయే రత్నసింహాసనేఽస్మిన్ ఉపవిశ పదయుగ్మం హేమపీఠే నిధాయ ।। ఓం తాం మ ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీమ్ । యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహమ్ ।। శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణీ నవరాత్రీ దేవతాభ్యో నమః । రత్న సింహాసనం సమర్పయామి ।। సింహాసన ముద్ర వేస్తూ అమ్మవారిని సింహాసనం పైకి ఆహ్వానిస్తున్నట్లు భావించాలి. అమ్మవారు సింహాసనంపై కూర్చుని, తన పాదాలను బంగారు పీఠంపై ఉంచినట్లు భావిస్తూ అక్షతలు సమర్పించాలి. సింహాసన ముద్ర: రెండు అరచేతులను పైకి చూస్తున్నట్లుగా ఉండాలి. చిటికెన వేళ్లను ఒకదానికొకటి తాకిస్తూ, మిగిలిన వేళ్లను సింహాసనం' ఆకారంలో కనిపించేలా వెడల్పుగా చేయాలి. వితాన (పైకప్పు/చాందిని) సమర్పణమ్: మణిభిర్నిర్మితం మహంతం కనకస్తంభ చతుష్టయేన యుక్తమ్ । కమనీయతమం భవాని తుభ్యం నవముల్లాభమహం సమర్పయామి ।। శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణీ నవరాత్రీ దేవతాభ్యో నమః । వితానం సమర్పయామి ।। ఈ మంత్రం చదువుతూ వితాన ముద్ర వేయాలి. అమ్మవారి పైన ఒక దివ్యమైన పందిరిని ఏర్పాటు చేస్తున్నట్లు భావిస్తూ అక్షతలు సమర్పించాలి. వితాన ముద్ర: అరచేతులను వెడల్పుగా చేసి, వేళ్లను పైకి ఉంచి, దేవుని శిరస్సుపై కప్పుగా ఉన్నట్లు చూపాలి. పాద్యం: తప్తకాంచనసంకాశాం కమలే కమలాలయామ్ । కన్యామింద్రాదిమార్తాండైః శ్రీ దేవిం ప్రణమామ్యహమ్ ।। దూర్వాయాసకసంయుక్తం విష్ణుక్రాంత సమన్వితమ్ । కుసుమార్ఘ్యం పద్మయుగ్మసదృశే పదయుగే పాద్యమేతదురరీకురు మాతః ।। ఓం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాదప్రబోధినీమ్ । శ్రియందేవీముపహ్వయే శ్రీర్మా దేవీ జుషతామ్ ।। శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణీ నవరాత్రీ దేవతాభ్యో నమః । పాదయోః పాద్యం సమర్పయామి ।। కలశంలో ఉన్న పుష్పంతో కానీ లేదా ఉద్ధరణితో కానీ నీరు తీసుకొని అమ్మవారికి చూపించి అర్ఘ్య పాత్రలో వదలాలి. అర్ఘ్యం: జగద్వంద్యాం మహాలక్ష్మీం ప్రకృతిం విష్ణువల్లభామ్ । రత్నసింహాసనస్థాంచ వందితాం పరమేశ్వరీమ్ ।। గంధపుష్ప యవసర్షప దూర్వా సంయుతం తిలకుశాక్షతమిశ్రమ్ । హేమపాత్రనిహితం సహరత్నై రర్ఘ్యమేత దురరీకురు మాతః ।। ఓం కాం సోస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీమ్ । పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియమ్ ।। శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణీ నవరాత్రీ దేవతాభ్యో నమః । హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ।। అర్ఘ్య ముద్ర వేయాలి. కలశంలో ఉన్న పుష్పంతో కానీ లేదా ఉద్ధరణితో కానీ నీరు తీసుకొని గంధం, పుష్పాలు, యవలు, తెల్ల ఆవాలు (సర్షప), గరిక (దూర్వా), నువ్వులు (తిల), దర్భలు (కుశ) మరియు అక్షతలు కలపాలి. అమ్మవారికి చూపించి అర్ఘ్య పాత్రలో వదలాలి. అర్ఘ్య ముద్ర: అరచేతులను దగ్గరకు చేర్చి, వ్రేళ్ళను కొద్దిగా వంచి దోసిలిలా పాత్ర ఆకారము లో పెట్టాలి. వేళ్లు నిటారుగా ఉండి, ఒకదానికొకటి తాకుతూ, రెండు బొటనవేళ్లను పక్కకు జరిపి దోసిలి అంచున ఉంచాలి. ఆచమనం: విద్యాధరాం మహాదేవీం పద్మాక్షీం లోకమాతరమ్ । సర్వైశ్వర్యప్రదాం దేవీం ఆచమ్యాది ప్రపూజయేత్ ।। జలజద్యుతినా కరేణ జాతీ ఫలతక్కోలలవంగగంధయుక్తైః । అమృతై రమృతై రివాతిశీతైర్ భగవత్యా చమనం విధీయతామ్ ।। ఓం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారామ్ । తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యేఽలక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే ।। శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణీ నవరాత్రీ దేవతాభ్యో నమః । ముఖే ఆచమనీయం సమర్పయామి ।। ఆచమనీయ ముద్ర వేయాలి. జాజికాయ(జాతీఫల), తక్కోల, లవంగాలు మరియు గంధం కలిపిన నీరుని ఉద్ధరణితో తీసుకొని అమ్మవారి ముఖం దగ్గర చూపిస్తూ అర్ఘ్య పాత్రలో వదలాలి. ఆచమనీయ ముద్ర: కుడిచేతి బొటనవేలు, మధ్యవేలు మరియు ఉంగరపు వేలు చివరలను కలిపి, చూపుడు వేలు మరియు చిటికెన వేలును కొద్దిగా పైకి ఉంచాలి. మధుపర్కం: పంచామృతా మనంత రేవా మంత్రైర్ వేదోక్తకైరపి మధ్యేమధ్యే ప్రపూజాంచ మధు పర్క పురస్సరం కనకస్య సంపుటే నిహితమ్ । విహితం రత్నవిధానకేన యత్ తదిదం జగదంబ తేర్పితమ్ ।। మధుపర్కం జనని! ప్రతిగృహ్యతామ్ । శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణీ నవరాత్రీ దేవతాభ్యో నమః । మధుపర్కం సమర్పయామి ।। పెరుగు, తేనె, నెయ్యి మిశ్రమమును అమ్మవారికి సమర్పించాలి.మధుపర్క ముద్ర వేయాలి మధుపర్క ముద్ర: కుడిచేతి వేళ్లను నైవేద్యం పెడుతున్నట్లుగా ముడుచుకుని అమ్మవారి ముఖం వైపు చూపాలి. అభ్యంగన స్నానం: ఏతచ్చంపక తైలమంబ విలసత్ పుష్పైర్ముహుర్వాసితం । న్యస్తం రత్నమయే సువర్ణచషకే భృంగైర్భ్రమభిర్వృతం ।। సానందం సురసుందరీభిరభితో హస్తైర్ధృతం తే మయా । కేశేషు భ్రమరభ్రమేషు సకలేష్వంగేషు చాలభ్యతే ।। శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణీ నవరాత్రీ దేవతాభ్యో నమః । అభ్యంగన స్నానం సమర్పయామి ।। సుగంధ తైలమును (గంధం నూనె లేదా అత్తరు కలిపిన నూనె) తీసుకుని, దర్భతో లేదా పువ్వుతో తాకినట్లు చేస్తూ అమ్మవారికి అద్దాలి. అభ్యంగన ముద్ర వేయాలి. అభ్యంగన ముద్ర: చేతులతో అమ్మవారి శరీరానికి నూనె రాస్తున్నట్లుగా చూపాలి. ఉద్వర్తన స్నానం: మాతః కుంకుమపంక నిర్మితమిదం దేహే తవోద్వర్తనం । భక్త్యాహం కలయామి హేమరజసా సమ్మిశ్రితైః కేసరైః ।। కేశానామలకైర్విశోధ్య విశదం కస్తూరికాద్యన్వితైః । స్నానం తే నవరత్న కుంభసహితైః సంవాసితోదైః కురు ।। శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణీ నవరాత్రీ దేవతాభ్యో నమః । సుగంధామలక ఉద్వర్తనం (సుగంధ చూర్ణ స్నానం) సమర్పయామి ।। గంధం పొడి లేదా సున్నిపిండిని తీసుకుని అమ్మవారికి అద్దాలి. ఆ తర్వాత శుద్ధ జలంతో అభిషేకం చేయాలి. ఉద్వర్తన ముద్ర వేయాలి. ఉద్వర్తన ముద్ర: అమ్మవారి శరీరానికి గంధం పొడిని లేదా సున్నిపిండిని రాస్తున్నట్లుగా చూపాలి. పంచామృత స్నానం: దధిక్షీరఘృతైర్యుక్తం శర్కరామధుసంయుతమ్ । పంచామృతేన చ స్నానం గృహ్యతాం పరమేశ్వరి ।। దధిదుగ్ధఘృతైర్మధ్వక్షితయా శర్కరయా సమన్వితైః । స్నపయామి తవాంగమాదరాజ్జనని త్వాం పునరుష్ణవారిభిః ।। ఆప్యాయ స్వేత్వాది పంచభిర్మంత్రైః అమ్మవారిని పంచామృతాలతో అభిషేకించాలి. శుద్ధోదక స్నానం: నదీనాం చైవ సర్వాసాం మయానీతం జలం శుభమ్ । అనేన స్నానమంత్రైశ్చ మంత్రైర్వారుణసంభవైః ।। ఏలోశీరసువాసితైః సకుసుమైర్గంగాదితీర్థోదకైః । మాణిక్యామలమౌక్తికామలయుతైః సిద్ధైః సువర్ణోదకైః ।। మంత్రాన్ వైదికతాంత్రికాన్ పరిపఠన్ సానందమత్యాదరాత్ । స్నానంతే పరికల్పయామి జనని స్నానం త్వమంగీకురు ।। ఓం ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోఽథ బిల్వః । తస్య ఫలాని తపసా నుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీః ।। మంత్రాలు రాని వారు, కేవలం "ఓం హ్రీం దుం దుర్గాయై నమః" అనే నావక్షరీ మంత్రాన్ని మనసులో స్మరిస్తూ కూడా అభిషేకం చేయవచ్చు. భగవంతుడికి ముఖ్యం భక్తి మాత్రమే. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణీ నవరాత్రీ దేవతాభ్యో నమః । శుద్ధోదక స్నానం సమర్పయామి ।। స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి ।। కలశంలోని శుద్ధ జలంతో అమ్మవారికి అభిషేకం చేయాలి. స్నానం పూర్తయ్యాక, విగ్రహాన్ని తడి లేకుండా తుడిచి, నీటిని వదలాలి. వస్త్రం-కంచుక (చీర రవిక) సమర్పణమ్: జగద్వంద్యాం మహాలక్ష్మీం తాం దేవీం విష్ణువల్లభామ్ । నానావిధైః శుభైర్వస్త్రైః పూజయేద్ధరివల్లభామ్ ।। బాలార్కద్యుతి దాడిమీ కుసుమప్రస్పర్థి సర్వోత్తమం । మాతస్త్వం పరిధేహి దివ్యవసనం భక్త్యా మయా కల్పితమ్ ।। ముక్తాభిర్ఘటితం చ కంచుకమిదం స్వీకృత్య విద్యుత్ప్రభం । తత్ స్వర్ణసమానవర్ణమతులం ప్రావరణమంగీకురు ।। ఓం ఉపైతు మాం దేవసఖః కీర్తిశ్చ మణినా సహ । ప్రాదుర్భూతోఽస్మి రాష్ట్రేఽస్మిన్ కీర్తిమృద్ధిం దదాతు మే ।। శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణీ నవరాత్రీ దేవతాభ్యో నమః । వస్త్రయుగ్మం సమర్పయామి । కంచుకం సమర్పయామి । ప్రావరణం సమర్పయామి ।। అమ్మవారికి రెండు వస్త్రా లను (ఒకటి కట్టుకోవడానికి, ఒకటి పైన వేయడానికి) సమర్పించాలి. వస్త్రాలు అలంకరించడం సాధ్యం కాకపోతే, రెండు అక్షతలు లేదా పత్తితో చేసిన వస్త్రమును (గెజ్జెల వస్త్రమును) సమర్పించవచ్చును. సోత్తరీయ ఉపవస్త్ర సమర్పణమ్: సర్వసిద్ధిప్రదాం దేవీం సర్వలోకమహేశ్వరీమ్ । నానారత్నధరాం దేవీం నానాగుణవిధాయినీమ్ ।। ఓం క్షుత్పిపాసామలాం జ్యేష్ఠామలక్ష్మీం నాశయామ్యహమ్ । అభూతిమసమృద్ధించ సర్వాం నిర్ణుద మే గృహాత్ ।। శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణీ నవరాత్రీ దేవతాభ్యో నమః । సోత్తరీయ ఉపవస్త్రార్ధం సమర్పయామి ।। అమ్మవారికి అక్షతలు లేదా పత్తి వస్త్రాన్ని సమర్పించాలి. దివ్య పాదుకా సమర్పణమ్: నవరత్నమయే మయార్పితే కమనీయే తపనీయ పాదుకే । సవిలాసమిదం పదద్వయం కృపయా దేహి సమర్చనం గృహీతుమ్ ।। శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణీ నవరాత్రీ దేవతాభ్యో నమః । దివ్య పాదుకాం సమర్పయామి ।। పాదుకా ముద్ర వేయాలి. ఈ మంత్రాన్ని చదువుతూ అమ్మవారి పాదాల వద్ద వెండి లేదా బంగారు పాదుకలు ఉంటే వాటిని విగ్రహం ముందు ఉంచాలి, లేదా పుష్పాక్షతలు సమర్పించాలి. పాదుకా ముద్ర: రెండు చేతుల వేళ్లను లోపలికి సగం వరకు ముడిచి, బొటనవేళ్లను మాత్రం పైకి ఉంచితే అది పాదుకల ఆకారంగా అవుతుంది. ఆ ఆకారాన్ని అమ్మవారికి చూపాలి. కేశపాశ బంధనమ్ (Hair Styling): బహుభిరగురుధూపై స్సా దరం ధూపయిత్వా భగవతి! తవ కేశాన్ కంకతైర్మార్జయిత్వా । సురభిభిర రవిందైశ్చంపకై శ్చార్చయిత్వా ఝడితి కనకసూత్రైర్జుటముద్వేష్టయామి ।। శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణీ నవరాత్రీ దేవతాభ్యో నమః । కేశపాశ బంధనం సమర్పయామి ।। ధూపము(బొగ్గు, వేపాకు, సామ్రాణి పొడి) వేసి అమ్మవారి కేశాల వద్ద ఆ ధూపమును చూపించి, పుష్పాక్షతలను సమర్పించాలి. సౌవీరాంజనమ్-కాటుక (Eye Liner/Kajal): సౌవీరాంజన మిదమంబ చక్షుషోస్తే విన్యస్తం కనకశలాకయా మయా యత్ । తన్నూనం మలినమపి త్వదంగ సంగాద్ బ్రహ్మేంద్రా ద్యభిలషణీయతామియాయ ।। శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణీ నవరాత్రీ దేవతాభ్యో నమః । నేత్రయోః సౌవీరాంజనం సమర్పయామి ।। కాటుకను కళ్లకు కాటుకను అద్దాలి లేదా అక్షతలు సమర్పించాలి. సర్వాభరణ సమర్పణమ్: మాణిక్యముక్తావలివిద్రుమైశ్చ గారుత్మతైశ్చాథ చ పుష్యరాగైః । గోమేధికైర్వైడూర్యకృతైశ్చ హారాన్ మంజీరమేతచ్చ గృహాణ దేవి ।। మంజీరౌ పదయోర్నిధాయ రుచిరాం విన్యస్య కాంచీం కటౌ । ముక్తాహారమురోజయోరనుపమం నక్షత్రమాలాం గళే ।। కేయూరాణి భుజేషు రత్నవలయశ్రేణిం కరేషు క్రమాత్ । తాటంకే తవ కర్ణయోర్వినిదధే శీర్షే చ చూడామణిమ్ ।। ధమ్మిల్లే తవ దేవి హేమకుసుమాన్యాధాయ ఫాలస్థలే । ముక్తాహారవిరాజి హేమతిలకం నాసాపుటే మౌక్తికమ్ ।। మాతర్మౌక్తిక జాలికాంచ కుచయోః సర్వాంగుళీషూర్మికాః । కట్యాం కాంచన కింకిణీర్వినిదధే రత్నావతం సేశ్రుతౌ।। ఓం హిరణ్యగర్భ గర్భస్థం హేమబీజం విభావసోః । అనంత పుణ్య ఫలదమతః శాంతిం ప్రయచ్ఛ మే ।। శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణీ నవరాత్రీ దేవతాభ్యో నమః । నవరత్నఖచిత సర్వాభరణాని సమర్పయామి ।। అమ్మవారికి ఆభరణాలు అలంకరిస్తున్నట్లు భావిస్తూ అక్షతలు సమర్పించాలి. యక్షకర్దమం: చందనాగురుకస్తూరీరోచనం కుంకుమం తథా । కస్తూర్యాది సుగంధాడ్యైః సర్వాంగేషు విలేపయే ।। మాతః ఫాలతలే తవాలివిమలే కాశ్మీరకస్తూరికా । కర్పూరాగురుభిః కరోమి తిలకం దేహంగరాగం తతః ।। వక్షోజాదిషు యక్షకర్దమరసైః సిక్త్వా చ పుష్పద్రవైః । పాదౌ చందనలేపనాదిభిరహం సంపూజయామి క్రమాత్ ।। ఓం గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీమ్ । ఈశ్వరీగ్ం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియమ్ ।। శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణీ నవరాత్రీ దేవతాభ్యో నమః । శ్రీగంధం సమర్పయామి । కస్తూరికా తిలకం సమర్పయామి ।। గంధం, కస్తూరి లేదా కుంకుమ, పచ్చకర్పూరం, కుంకుమపువ్వు కలిపినా మిశ్రమాన్ని 'యక్షకర్దమం' అంటారు. ఇది అమ్మవారికి అత్యంత ప్రీతికరము.లేదాఅమ్మవారికి కుడిచేతి ఉంగరపు వేలితో గంధం మరియు కుంకుమ పెట్టాలి. అక్షతాన్: రత్నాక్షతైస్త్వాం పరిపూజయామి ముక్తాఫలైర్వా రుచిరారవిందైః । అఖండతైర్దేవి యవాదిభిర్వా కాశ్మీరపంకాంకిత తండులైర్వా ।। శ్వేతవర్ణానమలజాన్ కుంకుమోక్షాంశ్చ తండులాన్ । అక్షతాన్ అర్పయిష్యామి లలాటఫలకే శుచౌ ।। ఓం మనసః కామమాకూతిం వాచస్సత్యమశీమహి । పశూనాగ్ం రూపమన్నస్య మయి శ్రీః శ్రయతాం యశః ।। శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణీ నవరాత్రీ దేవతాభ్యో నమః । లలాట ఫలకే రత్నాక్షతాన్ సమర్పయామి ।। ఈ మంత్రం చదువుతూ అమ్మవారి నుదుట (లలాట ఫలకే) మరియు శిరస్సుపై అక్షతలను సమర్పించాలి. అఖండమైన సౌభాగ్యానికి సంకేతమైన అక్షతలను అమ్మ నుదుటికి అద్దడం ఐశ్వర్యదాయకం మరియు జాతక దోష నివారణం. హరిద్రాచూర్ణ సమర్పణమ్: హరస్యార్థ శరీరాంగి హంసరూపే యతీశ్వరి । హస్తముద్రాంకుశధరే హరిద్రాం మాతృకేర్చయే ।। అహరివభోగై పర్యేతిభాగం ధ్యాయాయేతిం పరిబాధమానః అస్త్వఘ్నో విశ్వా వయనాని విద్వాన్ పుమాన్ పుమాగ్ంసి పరిపాతు విశ్వతః శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణీ నవరాత్రీ దేవతాభ్యో నమః । హరిద్రా చూర్ణం (పసుపు) సమర్పయామి ।। అమ్మవారికి పసుపు సమర్పించడం వల్ల జాతకంలోని కుజ మరియు గురు దోషాలు తొలగి, వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యంగా నవరాత్రి పూజలో హరిద్రా సమర్పణ ద్వారా గృహము మంగళమయముగా మారుతుంది. కుంకుమ విలేపనమ్: కైలాసవాసినీ దేవి కస్తూరీతిలకాధరే। కాళినీ గిరిజే గౌరి కుంకుమాం మాతృ కేర్చయే।। ఓం యాగ్ం గూర్వాసి నీవాలి యారాకాయ సరస్వతీ । ఇంద్రాణి మహ్వాభూతయే వరుణానీం స్వస్తయే ।। శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణీ నవరాత్రీ దేవతాభ్యో నమః । కుంకుమ విలేపనం సమర్పయామి ।। ఈ మంత్రం చదువుతూ అమ్మవారి నుదుట మరియు పాదాల వద్ద కుంకుమను సమర్పించాలి. సుగంధ పరిమళ ద్రవ్య (అత్తరు) సమర్పణమ్: జనని చంపకతైలమిదం పురో మృగమదోపయితం పటవాసకమ్ । సురభిగంధమిదంచ చతుస్సమం సపది సర్వమిదం పరిగృహ్యతామ్ ।। ఓం సుమంగలీరియం వధూరిమాగ్ం సమేత పశ్యత । సౌభాగ్యమస్యై దత్త్వాయాథాస్త్వం విపరేతన ।। శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణీ నవరాత్రీ దేవతాభ్యో నమః । సుగంధ పరిమళ ద్రవ్యాణి సమర్పయామి ।। ఈ మంత్రం చదువుతూ ఒక పువ్వుతో లేదా దూదితో సుగంధ ద్రవ్యాన్ని (అత్తరు) తీసుకుని అమ్మవారికి అద్దాలి. సింధూర సమర్పణమ్: సీమంతేతి భగవతి మయా సాదరం న్యస్తమేతత్ । సింధూరం మే హృదయకమలే హర్షవర్షం తనోతి ।। బాలాదిత్య ద్యుతిరివ సదా లోహితా యస్య కాంతిః । అంతర్ధ్వాంతం హరతి సకలం చేతసా చింతయైవ ।। శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణీ నవరాత్రీ దేవతాభ్యో నమః । సిందూర తిలకం సమర్పయామి ।। ఈ మంత్రం చదువుతూ అమ్మవారి పాపిట భాగంలో సిందూరాన్ని అద్దాలి. పుష్పం: మందార పారిజాతాద్యైః కేతకీ పాటలైః శుభైః । మాలతీ మరువపుష్పైః సర్వపుష్పైః ప్రపూజయే ।। మందార కుంద కరవీర రసాలపుష్పైః । త్వాం దేవి సంతతమహం పరిపూజయామి ।। జాతీ జపా వకుళ చంపక కేతకాది । నానావిధాని కుసుమాని చ తేఽర్పయామి ।। మాలతీ వకుళ హేమపుష్పికా । కాంచనార కరవీర కేతకైః । కర్ణికార గిరికర్ణికాదిభిః । పూజయామి జగదంబ తే వపుః ।। పారిజాత శతపత్ర పాటలైః । మల్లికా వకుళ చంపకాదిభిః । అంబుజైశ్చ కమలైశ్చ సాదరం । పూజయామి జగదంబ తే వపుః ।। ఓం కర్దమేన ప్రజా భూతా మయి సంభవ కర్దమ । శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీమ్ ।। శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణీ నవరాత్రీ దేవతాభ్యో నమః । నానావిధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి ।। వివిధ రకాల పుష్పములు (మల్లె, సంపంగి, గులాబీ, తామర, మందార మొదలైనవి) మరియు పత్రి (మరువం, దవనం) తో అమ్మవారిని అభిషేకించినట్లుగా సమర్పించాలి.అథాంగ పూజా:
ఒక పుష్పము లేదా ఎడమచేతిలో అక్షతలను తీసుకొని కుడి చేతితో మృగముద్రవేసి బొటనవేలు,మధ్యవేలు, ఉంగరం వేలు కలిపితే అది మృగముద్ర అవుతుంది. ఆ పుష్పము లేదా ఎడమ చేతిలోని అక్షింతలు కుడి చేతితో ఒక్కోనామం చదువుతూ అమ్మవారి అవయవాల వద్ద సమర్పించాలి. ఓం మహాకాళ్యై నమః ‐ పాదౌ పూజయామి। పాదాలపై సమర్పించాలి. ఓం సర్వదేవస్తుతాయై నమః ‐ గుల్ఫౌ పూజయామి మడిమలపై సమర్పించాలి. ఓం వారాహ్యై నమః ‐ జంఘౌ పూజయామి। పిక్కలపై సమర్పించాలి. ఓం జ్యోత్స్నాయై నమః ‐ జానునీ పూజయామి। మోకాళ్లపై సమర్పించాలి. ఓం బ్రాహ్మణ్యై నమః ‐ ఊరూ పూజయామి। తొడలపై సమర్పించాలి. ఓం విశ్వగర్భిణ్యై నమః ‐ గుహ్యం పూజయామి। మర్మస్థానముపై సమర్పించాలి. ఓం మహామాయాయై నమః ‐ కటిం పూజయామి। నడుముపై సమర్పించాలి. ఓం జీవచైతన్యాయై నమః ‐ నాభిం పూజయామి। నాభిపై సమర్పించాలి. ఓం అన్నపూర్ణేశ్వర్యై నమః ‐ ఉదరం పూజయామి। కడుపుపై సమర్పించాలి. ఓం శివాయై నమః ‐హృదయం పూజయామి। హృదయంపై భుజాలపై సమర్పించాలి. ఓం సతీదేవ్యై నమః ‐ హస్థౌ పూజయామి। చేతులపై సమర్పించాలి. ఓం పార్వత్యై నమః ‐బాహూన్ పూజయామి। భుజాలపై సమర్పించాలి. ఓం మహాసరస్వత్యై నమః ‐ కంఠం పూజయామి। కంఠంపై సమర్పించాలి. ఓం మహాలక్ష్మ్యై నమః ‐ ముఖం పూజయామి। ముఖముపై సమర్పించాలి. ఓం త్రినేత్రిణ్యై నమః ‐ నేత్రాణి పూజయామి। కళ్లపై సమర్పించాలి. ఓం శ్రుతిరూపిణ్యై నమః ‐ కర్ణౌ పూజయామి। చెవులపై సమర్పించాలి. ఓం లలితాయై నమః ‐ లలాటం పూజయామి। నుదురుపై సమర్పించాలి. ఓం శివశక్త్యైక్య రూపిణ్యై నమః ‐ శిరః పూజయామి। శిరస్సుపై సమర్పించాలి. ఓం అర్ధనారీశ్వర్యై నమః ‐ తనుం పూజయామి। దివ్య మంగళశరీరంపై సమర్పించాలి. ఓం శ్రీ మహా త్రిపురసుందర్యై నమః ‐ సర్వాణ్యంగాని పూజయామి। ఎడమచేతిలో ఉన్న మిగిలిన అక్షింతలను అమ్మవారిపై సమర్పించాలి.కళాన్యాసం - దైవీకరణ ప్రక్రియ:
గమనిక:ఇది అర్చకుడు మాత్రమే చేయాలి. అతను కూడా గురు ముఖతః నేర్చుకొని చేయడం అత్యుత్తమం.అమ్మవారి శక్తి కళలను ఆవాహన చేయడం వల్ల, అర్చకుడికి ఆత్మజ్ఞాన స్థితి కలుగుతుంది. కళాన్యాసం అంటే అమ్మవారి దివ్య శక్తిని మన షట్చక్రాల ద్వారా శరీర అవయవాలలో నిక్షిప్తం చేయడం. ఇది కేవలం బాహ్య పూజ కాదు, ఒక అంతర్గత యోగ ప్రక్రియ.| క్రమ సంఖ్య | చక్రము / స్థానము | బీజయుత మంత్రం | అర్థం |
|---|---|---|---|
| 1 | మూలాధారం (వెన్నెముక చివర) | ఓం ఐం క్లీం సౌః నివృత్తి కళాయై నమః | మనల్ని కట్టిపడేసే ప్రాపంచిక బంధాలు, భయాలు మరియు అజ్ఞానం నుండి "నివృత్తి" (విముక్తి) కలిగించే శక్తి. |
| 2 | స్వాధిష్ఠానం (నాభి కింద) | ఓం ఐం క్లీం సౌః ప్రతిష్ఠా కళాయై నమః | మనలోని ప్రాణ శక్తిని, సంకల్ప బలాన్ని ఒక ఉన్నతమైన లక్ష్యం వైపు "ప్రతిష్ఠా" (స్థిరపరచే) చేసే శక్తి. |
| 3 | మణిపూరకం (నాభి వద్ద) | ఓం ఐం క్లీం సౌః విద్యా కళాయై నమః | పుస్తక జ్ఞానం తో పాటుగా ఆత్మ "విద్యా" (జ్ఞానం) ప్రసాదించే శక్తి. |
| 4 | అనాహతం (హృదయం) | ఓం ఐం క్లీం సౌః శాంతి కళాయై నమః | రాగద్వేషాల వల్ల కలిగే అలజడిని పోగొట్టి, హృదయంలో అలౌకికమైన "శాంతి"ని నింపే శక్తి. |
| 5 | విశుద్ధం (కంఠం) | ఓం ఐం క్లీం సౌః సువిద్యా కళాయై నమః | మన వాక్కులో పవిత్రతను, మధురమైన సంభాషణను పలికించే "సువిద్యా" (శ్రేష్ఠమైన విద్య) శక్తి. |
| 6 | ఆజ్ఞా చక్రం (నుదురు) | ఓం ఐం క్లీం సౌః సర్వతేజోమయ కళాయై నమః | సమస్త కాంతులకు మూలమైనది, మన బుద్ధిని ప్రకాశింపజేసే "సర్వతేజోమయ" (అనంతమైన వెలుగు) శక్తి. |
| 7 | సహస్రారం (శిరస్సు) | ఓం ఐం క్లీం సౌః జ్ఞాన ప్రకాశిక కళాయై నమః | శివునితో ఆ తల్లి మమేకమై మోక్ష ప్రసాదించే "ఆత్మ జ్ఞాన ప్రకాశికా" శక్తి. |