పూజా కర్మక్రమం - ఋత్విగ్వరణ విధులు
ఏ పూజకు ఏ పండితుల అవసరం ఉంటుంది ?
| పూజ | ఆచార్య వరణం | బ్రహ్మ వరణం |
ఋత్విక్ ప్రార్థన |
| చిన్న పూజలు (సత్యనారాయణ వ్రతం) |
ఐచ్ఛికం |
అవసరం లేదు |
అవసరం లేదు |
| హోమాలు / యాగాలు |
తప్పనిసరి |
తప్పనిసరి |
తప్పనిసరి |
| నవరాత్రి / ఉత్సవాలు |
తప్పనిసరి |
ఐచ్ఛికం |
తప్పనిసరి |
| దోష నివారణ శాంతులు |
తప్పనిసరి |
ఐచ్ఛికం |
తప్పనిసరి |
| గృహ ప్రవేశం |
తప్పనిసరి |
ఐచ్ఛికం |
తప్పనిసరి |
అథ ఋత్విగ్వరణం:
పూజకు ముందుగా ప్రాణాయామం ఆచరించి, అక్షతలు కుడిచేతిలోకి తీసుకుని, ఈ క్రింది విధంగా ఆయా దేవతలను స్మరిస్తూ మీరు చేస్తున్న పూజ పేరును (ఉదా: శ్రీ దుర్గా నవరాత్రి, కుజ దోష శాంతి, గృహ ప్రవేశం) ఉచ్చరిస్తూ 'సంకల్పం' చెప్పుకోవాలి.
ప్రాథమిక ఋత్విగ్వరణం
వరణ విధులు:
ఈ మంత్రాలూ సర్వ ఋత్విక్ వరణ పూజలకు వర్తిస్తాయి.
ఆచార్య వరణం, బ్రహ్మ వరణం, మరియు ఋత్విక్ వరణం అని మూడు వరణాలు ఉంటాయి. యజమాని చేత ఆయా మంత్రాలూ చెప్పిస్తూ, అక్షతలు, తాంబూలమును (రెండు తమలపాకులు లేదా ఖర్జురా , వక్క, దక్షిణ) , ఈ మూడు వరుణాల వారికి ఇప్పిస్తారు .
అప్పుడు వారు ఈ విధముగా చెపుతారు:
వృతోస్మి - కరిష్యామః యథాజ్ఞానతః ఈ మంత్రార్థం - ఈ మూడు వరణాల వారు తమ జ్ఞానం మేరకు ఈ పూజను సంపూర్ణ బాధ్యతతో నిర్వహిస్తారని దైవ సాక్షిగా అంగీకరించడము.
ఇది యజమాని, ఋత్వికుల మధ్య ఏర్పడే పవిత్రమైన బంధం.
ఆచార్య వరణము - యజమానితో పూజ చేయిస్తాడు:
ఈ మంత్రం చెపుతూ యజమాని ఆచార్యుని వైపు చూస్తూ, అక్షతలు, తాంబూలమును ఇవ్వాలి.
ఆచార్యస్తు యథా స్వర్గాదీనాం బృహస్పతిః ।
తథాత్వం మమ యజ్ఞేఽస్మిన్ ఆచార్యం త్వామహం వృణే ।।
ఆచార్య ప్రతివచనం - ఆచార్యుడు ఇలా చెప్పాలి.
వృతోస్మి - కరిష్యామః యథా జ్ఞానతః
బ్రహ్మ వరణము - పూజను పర్యవేక్షిస్తాడు:
ఈ మంత్రం చెపుతూ యజమాని పండితుడి వైపు చూస్తూ, అక్షతలు, తాంబూలమును ఇవ్వాలి.
యథా చతుర్ముఖో బ్రహ్మా సత్యలోకే పితామహః ।
తథాత్వం మమ యజ్ఞేఽస్మిన్ బ్రహ్మాణం త్వామహం వృణే ।।
బ్రహ్మ ప్రతివచనం - బ్రహ్మ ఇలా చెప్పాలి.
వృతోస్మి - కరిష్యామః యథా జ్ఞానతః
ఋత్విక్ వరణము - ఆచార్యడికి సహకరించే బ్రాహ్మణులు:
ఈ మంత్రం చెపుతూ యజమాని బ్రాహ్మణులందరికీ నమస్కరిస్తూ, వస్త్రాలు, అలంకారాలు ఇవ్వాలి.
సర్వే స్వకర్మ కుశలాః సర్వే హ్యంబా స్వరూపిణః ।
స్వస్వకర్మ వినిర్వర్త్య కృతార్థం కురుతాదరాత్ ।।
విశిష్ఠ ఋత్విగ్వరణం
ఈ మంత్రం చెపుతూ యజమాని ఆయా బ్రాహ్మణుడికి బాధ్యతనిస్తూ అక్షతలు, తాంబూలమును ఇవ్వాలి.
అస్మిన్ [పూజ/కర్మ పేరు] కర్మణి, [బ్రాహ్మణుడి బాధ్యత - ఉదా:చిన్న పట్టిక చుడండి ] కర్తృత్వేన త్వామహం వృణే!
బ్రాహ్మణులు ఇలా
| బ్రాహ్మణుడి బాధ్యత (Duty) |
అనుష్ఠానం (In the blank) |
| పారాయణ |
[పారాయణ పేరు - ఉదా: లలితా సహస్ర నమ పారాయణం]
పారాయణ కర్తృత్వేన |
| ఏదైనా జపం |
[దేవతా పేరు - ఉదా: నవగ్రహ మూలా మంత్రములు] జప కర్తృత్వేన |
| హోమం నిర్వహణ |
[హోమం పేరు - ఉదా: కుజ గ్రహ శాంతి హోమ] హోమ కర్తృత్వేన |
| పూజా నిర్వహణ |
[పూజా పేరు - ఉదా: దుర్గా నవరాత్రీ పూజా ] పూజా నిర్వహణ కర్తృత్వేన |
బ్రాహ్మణ ప్రతివచనం - బ్రాహ్మణుడిలా చెప్పాలి.
వృతోస్మి - కరిష్యామః యథా జ్ఞానతః
ఇక్కడ మీకు ఉదాహరణగా దుర్గా నవరాత్రీ మరియు గ్రహ దోష నివారణా శాంతి ఋత్విగ్వరణములు పొందుపరచడమైనది.
శ్రీ దుర్గా నవరాత్రీ ఋత్విగ్వరణం
చూడటానికి క్లిక్ చేయండి (Click to expand)
ప్రాథమిక ఋత్విగ్వరణం
ఇప్పుడు కుడిచేతిలో అక్షతలు తీసుకుని, అక్షతలను నీటితో అర్ఘ్యపాత్రలో వదలాలి.
పూర్వోక్త సంకల్పానుసారేణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ, మమ ఆత్మనః శ్రుతి-స్మృతి-పురాణోక్త ఫలప్రాప్త్యర్థం, మమ సకుటుంబస్య క్షేమ-స్థైర్య-వీర్య-విజయ-అభయ-ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం, ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం, శ్రీ దేవీ నవరాత్రోత్సవ పుణ్యకాలే, తదంగత్వేన శ్రీ మహాలక్ష్మీ-మహాకాళీ-మహాసరస్వతీ స్వరూపిణీ దుర్గా పరమేశ్వరీ ప్రీత్యర్థం, అన్యోన్య బ్రాహ్మణ సహాయేన -
శ్రీ సూక్త, వేదోక్త - తంత్రోక్త దేవీ సూక్త, మహా మృత్యుంజయ జప, ఆదిత్యాది నవగ్రహ జప, దేవీ మూలమంత్ర జప, రుద్రాభిషేచన, చండీ, మహా మృత్యుంజయ హోమ, లలితా సహస్రనామ పారాయణ, చండీ సప్తశతీ పారాయణ, దేవీ పూజాదీనాం, యథాశక్తి యథాసంభవం ఋత్విజో వృణుయాత్ కర్తుం - ఆచార్యాది ఋత్విగ్వరణం కరిష్యే.
ముందుగా పైన ఇచ్చినట్లుగా ప్రాథమిక ఋత్విగ్వరణ ప్రక్రియను పూర్తీ చేయాలి. (తదుపరి)
విశిష్ట ఋత్విగ్వరణ ప్రక్రియను (అవసరమనుకుంటే) పూర్తి చేయాలి.
శ్రీ దుర్గా నవరాత్రీ విశిష్ఠ ఋత్విగ్వరణం
ఋత్విగ్వరణం - దేవీ పూజా
ఆచార్యుడు యజమాని చేత చెప్పించాలి.
అస్మిన్ శ్రీదేవీ నవరాత్రోత్సవ కర్మణి, దేవీ పూజాదీనాం కర్తృత్వేన త్వామహం వృణే ।
ఋత్వికుడు (బ్రాహ్మణ) ప్రతివచనం - ఋత్వికుడిలా చెప్పాలి.
వృతోస్మి - కరిష్యామః యథా జ్ఞానతః
ఋత్విగ్వరణం - లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం
ఆచార్యుడు యజమాని చేత చెప్పించాలి.
అస్మిన్ శ్రీదేవీ నవరాత్రోత్సవ కర్మణి, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం కర్తృత్వేన త్వామహం వృణే ।
ఋత్వికుడు (బ్రాహ్మణ) ప్రతివచనం - ఋత్వికుడిలా చెప్పాలి.
వృతోస్మి - కరిష్యామః యథా జ్ఞానతః
ఋత్విగ్వరణం - ఆదిత్యాది నవగ్రహ జపం
ఆచార్యుడు యజమాని చేత చెప్పించాలి.
అస్మిన్ శ్రీదేవీ నవరాత్రోత్సవ కర్మణి, ఆదిత్యాది నవగ్రహ జప కర్తృత్వేన త్వామహం వృణే ।

ఋత్విగ్వరణం - చండీ సప్తశతీ పారాయణం
ఆచార్యుడు యజమాని చేత చెప్పించాలి.
అస్మిన్ శ్రీదేవీ నవరాత్రోత్సవ కర్మణి, చండీ సప్తశతీ పారాయణ కర్తృత్వేన త్వామహం వృణే ।
ఋత్వికుడు (బ్రాహ్మణ) ప్రతివచనం - ఋత్వికుడిలా చెప్పాలి.
వృతోస్మి - కరిష్యామః యథా జ్ఞానతః
ఋత్విగ్వరణం - శ్రీ సూక్త పారాయణం
ఆచార్యుడు యజమాని చేత చెప్పించాలి.
అస్మిన్ శ్రీదేవీ నవరాత్రోత్సవ కర్మణి, శ్రీ సూక్త పారాయణ కర్తృత్వేన త్వామహం వృణే ।
ఋత్వికుడు (బ్రాహ్మణ) ప్రతివచనం - ఋత్వికుడిలా చెప్పాలి.
వృతోస్మి - కరిష్యామః యథా జ్ఞానతః
ఋత్విగ్వరణం - వేదోక్త,తంత్రోక్త దేవీసూక్త పారాయణం
ఆచార్యుడు యజమాని చేత చెప్పించాలి.
అస్మిన్ శ్రీదేవీ నవరాత్రోత్సవ కర్మణి, వేదోక్త,తంత్రోక్త దేవీసూక్త పారాయణ కర్తృత్వేన త్వామహం వృణే ।
ఋత్వికుడు (బ్రాహ్మణ) ప్రతివచనం - ఋత్వికుడిలా చెప్పాలి.
వృతోస్మి - కరిష్యామః యథా జ్ఞానతః
ఋత్విగ్వరణం - మహా మృత్యుంజయ జపం
ఆచార్యుడు యజమాని చేత చెప్పించాలి.
అస్మిన్ శ్రీదేవీ నవరాత్రోత్సవ కర్మణి, మహా మృత్యుంజయ జప కర్తృత్వేన త్వామహం వృణే ।
ఋత్వికుడు (బ్రాహ్మణ) ప్రతివచనం - ఋత్వికుడిలా చెప్పాలి.
వృతోస్మి - కరిష్యామః యథా జ్ఞానతః
ఋత్విగ్వరణం - దేవీ మూలమంత్ర జపం
ఆచార్యుడు యజమాని చేత చెప్పించాలి.
అస్మిన్ శ్రీదేవీ నవరాత్రోత్సవ కర్మణి, దేవీ మూలమంత్ర జప కర్తృత్వేన త్వామహం వృణే ।
ఋత్వికుడు (బ్రాహ్మణ) ప్రతివచనం - ఋత్వికుడిలా చెప్పాలి.
వృతోస్మి - కరిష్యామః యథా జ్ఞానతః
గమనిక: గురు ఉపదేశంఉన్నవారు మాత్రమే మూలా మంత్ర జపం చేయాలి.
ఋత్విగ్వరణం - చండీ, మహా మృత్యుంజయ హోమం
ఆచార్యుడు యజమాని చేత చెప్పించాలి.
అస్మిన్ శ్రీదేవీ నవరాత్రోత్సవ కర్మణి, చండీ, మహా మృత్యుంజయ హోమ కర్తృత్వేన త్వామహం వృణే ।
ఋత్వికుడు (బ్రాహ్మణ) ప్రతివచనం - ఋత్వికుడిలా చెప్పాలి.
వృతోస్మి - కరిష్యామః యథా జ్ఞానతః
వేద ఆశీర్వచనం
తదుపరి ఈ ఈ మంత్రం చెపుతూ యజమానికి ఆశీర్వచనం ఇవ్వాలి.
తాంబూలముతో తీసుకున్న అక్షతలను యజమాని పై వెయ్యాలి.
ఓం పర్యాప్త్యా అనంతరాయాయ సర్వస్తోమోఽతి రాత్ర ఉత్తమ మహర్భవతి
సర్వస్యాప్త్యై సర్వస్య జిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి ।
శతమానం భవతి శతాయుః పురుషః శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి ।
దుర్గా నవరాత్రీ చివరి రోజున ఋత్వికులు తమ బాధ్యత పూర్తి చేసిన తదుపరి
ఈ క్రింద విధముగా ఆ పుణ్య ఫలమును యజమానికి అప్పగించవలెను.
గ్రహ దోష నివారణా శాంతి ఋత్విగ్వరణం
చూడటానికి క్లిక్ చేయండి (Click to expand)
ఇప్పుడు కుడిచేతిలో అక్షతలు తీసుకుని, అక్షతలను నీటితో అర్ఘ్యపాత్రలో వదలాలి.
పూర్వోక్త సంకల్పానుసారేణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ, మమ ఆత్మనః శ్రుతి-స్మృతి-పురాణోక్త ఫలప్రాప్త్యర్థం, మమ సకుటుంబస్య క్షేమ-స్థైర్య-వీర్య-విజయ-అభయ-ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం, ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం, శ్రీ దేవీ నవరాత్రోత్సవ పుణ్యకాలే, తదంగత్వేన శ్రీ మహాలక్ష్మీ-మహాకాళీ-మహాసరస్వతీ స్వరూపిణీ దుర్గా పరమేశ్వరీ ప్రీత్యర్థం, అన్యోన్య బ్రాహ్మణ సహాయేన -
శ్రీ సూక్త, వేదోక్త - తంత్రోక్త దేవీ సూక్త, మహా మృత్యుంజయ జప, ఆదిత్యాది నవగ్రహ జప, దేవీ మూలమంత్ర జప, రుద్రాభిషేచన, చండీ, మహా మృత్యుంజయ హోమ, లలితా సహస్రనామ పారాయణ, చండీ సప్తశతీ పారాయణ, దేవీ పూజాదీనాం, యథాశక్తి యథాసంభవం ఋత్విజో వృణుయాత్ కర్తుం - ఆచార్యాది ఋత్విగ్వరణం కరిష్యే.
ముందుగా పైన ఇచ్చినట్లుగా ప్రాథమిక ఋత్విగ్వరణ ప్రక్రియను పూర్తీ చేయాలి. (తదుపరి)
విశిష్ట ఋత్విగ్వరణ ప్రక్రియను (అవసరమనుకుంటే) పూర్తి చేయాలి.
గ్రహ దోష నివారణా విశిష్ఠ ఋత్విగ్వరణం
గ్రహ దోష నివారణా - శాంతి
ఆచార్యుడు యజమాని చేత చెప్పించాలి.
అస్మిన్ శాంతి కర్మణి, (*.....*) నక్షత్ర పూర్వకాదిత్యాది నవగ్రహ శాంతి మహత్కర్మణి ఆచార్యం త్వామహం వృణే ।
ఆచార్య ప్రతివచనం - ఆచార్యుడు ఇలా చెప్పాలి.
వృతోస్మి - కరిష్యామః యథా జ్ఞానతః
నవగ్రహ శాంతి
ఆచార్యుడు యజమాని చేత చెప్పించాలి.
అస్మిన్ శాంతి కర్మణి, (*.....*) నక్షత్ర పూర్వకాదిత్యాది నవగ్రహ శాంతి మహత్కర్మణి బ్రహ్మాణం త్వామహం వృణే ।
బ్రహ్మ ప్రతివచనం - బ్రహ్మా ఇలా చెప్పాలి.
వృతోస్మి - కరిష్యామః యథా జ్ఞానతః
ఋత్విగ్వరణం - ఆదిత్యాది నవగ్రహ జపం
ఆచార్యుడు యజమాని చేత చెప్పించాలి.
అస్మిన్ శాంతి కర్మణి, (*.....*) నక్షత్ర పూర్వకాదిత్యాది నవగ్రహ జప కర్తృత్వేన త్వామహం వృణే ।
బ్రహ్మ ప్రతివచనం - ఋత్వికుడిలా చెప్పాలి.
వృతోస్మి - కరిష్యామః యథా జ్ఞానతః
ఋత్విగ్వరణం - అధిదేవతా ప్రత్యధిదేవతా జపం
ఆచార్యుడు యజమాని చేత చెప్పించాలి.
అస్మిన్ శాంతి కర్మణి, అధిదేవతా ప్రత్యధిదేవతా సహిత (*.....*) నక్షత్ర జప కర్తృత్వేన త్వామహం వృణే ।
ఋత్వికుడు (బ్రాహ్మణ) ప్రతివచనం - ఋత్వికుడిలా చెప్పాలి.
వృతోస్మి - కరిష్యామః యథా జ్ఞానతః
ఋత్విగ్వరణం - హనుమాన్ సింధూర లేపనం -పూజ
ఆచార్యుడు యజమాని చేత చెప్పించాలి.
అస్మిన్ శ్రీదేవీ నవరాత్రోత్సవ కర్మణి, హనుమాన్ సింధూర లేపనం, హనుమాన్ పూజాదీనాం కర్తృత్వేన త్వామహం వృణే ।
ఋత్వికుడు (బ్రాహ్మణ) ప్రతివచనం - ఋత్వికుడిలా చెప్పాలి.
వృతోస్మి - కరిష్యామః యథా జ్ఞానతః
ఋత్విగ్వరణం - రుద్రాభిషేకం
ఆచార్యుడు యజమాని చేత చెప్పించాలి.
అస్మిన్ శాంతి కర్మణి, మమ సకుటుంబస్య సర్వాపమృత్యు పీడా పరిహారార్థం, విఘ్నేశ్వర్యాదిత్య గణపత్యంబికా సహిత ఉమా మహేశ్వర దేవతా ప్రీత్యర్థం, రుద్ర అభిషేచన (మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రా వారా) కర్తృత్వేన త్వామహం వృణే ।
ఋత్వికుడు (బ్రాహ్మణ) ప్రతివచనం - ఋత్వికుడిలా చెప్పాలి.
వృతోస్మి - కరిష్యామః యథా జ్ఞానతః
ఋత్విగ్వరణం - వేదోక్త,తంత్రోక్త దేవీసూక్త పారాయణం
ఆచార్యుడు యజమాని చేత చెప్పించాలి.
అస్మిన్ శాంతి కర్మణి, వేదోక్త,తంత్రోక్త దేవీసూక్త పారాయణ కర్తృత్వేన త్వామహం వృణే ।
ఋత్వికుడు (బ్రాహ్మణ) ప్రతివచనం - ఋత్వికుడిలా చెప్పాలి.
వృతోస్మి - కరిష్యామః యథా జ్ఞానతః
ఋత్విగ్వరణం - మహా మృత్యుంజయ జపం
ఆచార్యుడు యజమాని చేత చెప్పించాలి.
అస్మిన్ శాంతి కర్మణి, మమ (ఎవరి పేరుపై శాంతి చేస్తున్నారో వారి పేరు చెప్పుకోవాలి) సర్వాపమృత్యు పీడా పరిహారార్థం, మహామృత్యుంజయ జప, కర్తృత్వేన త్వామహం వృణే ।
ఋత్వికుడు (బ్రాహ్మణ) ప్రతివచనం - ఋత్వికుడిలా చెప్పాలి.
వృతోస్మి - కరిష్యామః యథా జ్ఞానతః
ఋత్విగ్వరణం - దేవీ మూలమంత్ర జపం
ఆచార్యుడు యజమాని చేత చెప్పించాలి.
అస్మిన్ శాంతి కర్మణి, దేవీ మూలమంత్ర జప కర్తృత్వేన త్వామహం వృణే ।
ఋత్వికుడు (బ్రాహ్మణ) ప్రతివచనం - ఋత్వికుడిలా చెప్పాలి.
వృతోస్మి - కరిష్యామః యథా జ్ఞానతః
గమనిక: గురు ఉపదేశంఉన్నవారు మాత్రమే మూలా మంత్ర జపం చేయాలి.
గ్రహ దోష నక్షత్ర దోష నివారణా శాంతి హోమం
ఆచార్యుడు యజమాని చేత చెప్పించాలి.
అస్మిన్ శాంతి కర్మణి, ఆదిత్యాది నవగ్రహ నక్షత్ర శాంతి హోమ కర్తృత్వేన త్వామహం వృణే ।
ఋత్వికుడు (బ్రాహ్మణ) ప్రతివచనం - ఋత్వికుడిలా చెప్పాలి.
వృతోస్మి - కరిష్యామః యథా జ్ఞానతః
వేద ఆశీర్వచనం
తదుపరి ఈ ఈ మంత్రం చెపుతూ యజమానికి ఆశీర్వచనం ఇవ్వాలి.
తాంబూలముతో తీసుకున్న అక్షతలను యజమాని పై వెయ్యాలి.
ఓం పర్యాప్త్యా అనంతరాయాయ సర్వస్తోమోఽతి రాత్ర ఉత్తమ మహర్భవతి
సర్వస్యాప్త్యై సర్వస్య జిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి ।
శతమానం భవతి శతాయుః పురుషః శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి ।
ఋత్వికులు తమ బాధ్యత పూర్తి చేసిన తదుపరి
ఈ క్రింద విధముగా ఆ పుణ్య ఫలమును యజమానికి అప్పగించవలెను.
ఋత్విక్ కర్మ సమర్పణ - పుణ్యఫల సమర్పణం:
ఋత్విగులు తమ బాధ్యత శక్తి మేరకు పూర్తీ చేసిన తర్వాత ఆ పుణ్య ఫలమును యజమానికి అప్పచెప్పాలి. ఆచార్యుడు ఈ మంత్రం చెప్పాలి.
యథాశక్తి కృతం (పూజానం, జపం, పారాయణం, హోమం), యజ్ఞకర్మ చ తవ హస్తే సమర్పయామి. తత్ఫలం భవాన్ ప్రాప్నోతు!
ఋత్విగ్ ప్రతివచనం - ఋత్విగులు ఇలా చెప్పాలి.
"పుణ్యవాన్ భవ!"
ఇతి ఋత్విగ్వరణం।