DevataMantra DevataMantra DevataMantra DevataMantra
Bala Tripurasundari(shodashi)।Sridevi Khadgamala Stotram।DevataMantra
శ్రీ దేవీ ఖడ్గమాలా స్తోత్రం చూడటానికి క్లిక్ చేయండి (Click to expand)

శ్రీ దేవీ ఖడ్గమాలా స్తోత్రం

వినియోగం: అస్య శ్రీ శుద్ధశక్తి మాలా మహామంత్రస్య ఉపస్థేంద్రియాధిష్ఠాయీ వరుణాదిత్య ఋషిః, దైవీ గాయత్రీ ఛందః శ్రీ బాలా త్రిపురసుందరీ దేవతా, ఐం బీజం క్లీం శక్తిః సౌః కీలకం మమ ఖడ్గ సిద్ధ్యర్థే సర్వాభీష్ట సిద్ధ్యర్థే పారాయణే/జపే/అర్చనే వినియోగః । న్యాస విధి:: తతః మూలమంత్రేణ షడంగన్యాసం కుర్యాత్ ।। కరన్యాసం ఓం ఐం అంగుష్ఠాభ్యాం నమః రెండు బొటనవేళ్లను తాకాలి. ఓం క్లీం తర్జనీభ్యాం నమః చూపుడు వేళ్లను తాకాలి. ఓం సౌః మధ్యమాభ్యాం నమః మధ్య వేళ్లను తాకాలి. ఓం సౌః అనామికాభ్యాం నమః ఉంగరపు వేళ్లను తాకాలి. ఓం క్లీం కనిష్ఠికాభ్యాం నమః చిటికెన వేళ్లను తాకాలి. ఓం ఐం కరతల కరపృష్ఠాభ్యాం నమః అరచేతుల వెనుక భాగం ఒకదానితో ఒకటి తాకాలి. అంగన్యాసం శరీర భాగాలను తాకుతూ ఈ మంత్రాలు చదవాలి. ఓం ఐం హృదయాయ నమః కుడి చేతితో హృదయాన్ని తాకాలి. ఓం క్లీం శిరసే స్వాహా శిరస్సును తాకాలి. ఓం సౌః శిఖాయై వషట్ జుట్టు ముడి/శిఖ భాగాన్ని తాకాలి. ఓం సౌః కవచాయ హుమ్ రెండు భుజాలను మార్చి మార్చి తాకాలి. ఓం క్లీం నేత్రత్రయాయ వౌషట్ రెండు కళ్లు మరియు మధ్యలో మూడవ కన్ను ఉన్న చోట తాకాలి. ఓం ఐం అస్త్రాయ ఫట్ శిరస్సు చుట్టూ చిటికె వేస్తూ కుడిచేతి మధ్య వేలితో ఎడమ అరచేతిపై చప్పట్లు కొట్టాలి. ఓం ఐం క్లీం సౌః భూర్భువస్సువరోం ఇతి దిగ్బంధః ఎడమ చేతి చూపుడు వేలును ఆకాశం వైపు నిలువుగా చుపిస్తూ కుడి చుపుడు వేలితో దిగ్బంధనం చేయాలి. ధ్యానం - స్థాపన ముద్రా నమస్కారం: రెండు చేతులను బోర్లించి (అరచేతులు కిందకు ఉండేలా), రెండు బొటనవేళ్లను లోపలికి మడిచి, మిగిలిన వేళ్లను ఒకదానితో ఒకటి కలిపి ఉంచడాన్ని 'స్థాపన ముద్ర' అంటారు. హ్రీంకారాసన గర్భితానల శిఖాం సౌః క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రిణేత్రోజ్జ్వలామ్ । వందే పుస్తకపాశమంకుశ ధరాం స్రగ్భూషితాముజ్జ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పర కళాం శ్రీచక్రసంచారిణీమ్ ।। తాదృశం ఖడ్గమాప్నోతి యేన హస్తస్థితేన వై । అష్టాదశ మహాద్వీప సమ్రాద్ భోక్తా భవిష్యతి ।। ఆరక్తాభాం త్రినేత్రాం అరుణిమ వసనాం రత్న తాటంక రమ్యాం । హస్తాంభోజైః స పాశాంకుశ మదన ధనుః సాయకైః విస్ఫురంతీమ్ । ఆపీనోత్తుంగ వక్షోరుహ కలశ లుఠతార హారోజ్జ్వలాంగీం ధ్యాయేదంభోరుహస్థాం అరుణిమవసనాం ఈశ్వరీం ఈశ్వరాణాం ।। పంచోపచార పూజా: తతః లామిత్యాది పంచ పూజాం కుర్యాత్ అమ్మవారిని ఉద్దేశించి, కింది మంత్రములను పఠిస్తూ చిటికెన వేలు నుండి బొటన వేలు వరకు ఒక్కో వేలును తాకుతూ ఆయా ఉపచారాలను సమర్పించాలి.
  1. గంధం: ఓం ఐం క్లీం సౌః । లం పృథివీ తత్వాత్మికాయై గంధతన్మాత్ర శ్రీ బాలా త్రిపురసుందరీ మహాదేవ్యై గంధం పరికల్పయామి । సౌః క్లీం ఐం ఓం ।। అమ్మవారికి గంధం సమర్పించాలి.
  2. పుష్పం: ఓం ఐం క్లీం సౌః । హం ఆకాశ తత్వాత్మికాయై శబ్దతన్మాత్ర శ్రీ బాలా త్రిపురసుందరీ మహాదేవ్యై పుష్పం పరికల్పయామి । సౌః క్లీం ఐం ఓం ।। అమ్మవారికి పుష్పములు సమర్పించాలి.
  3. ధూపం: ఓం ఐం క్లీం సౌః । యం వాయు తత్వాత్మికాయై స్పర్శతన్మాత్ర శ్రీ బాలా త్రిపురసుందరీ మహాదేవ్యై ధూపం ఆఘ్రాపయామి ।సౌః క్లీం ఐం ఓం ।। అమ్మవారికి ధూపం చూపించాలి.
  4. దీపం: ఓం ఐం క్లీం సౌః । రం అగ్ని తత్వాత్మికాయై రూపతన్మాత్ర శ్రీ బాలా త్రిపురసుందరీ మహాదేవ్యై దీపం దర్శయామి । సౌః క్లీం ఐం ఓం ।। అమ్మవారికి దీపం చూపించాలి
  5. నైవేద్యం: ఓం ఐం క్లీం సౌః । వం అమృత తత్వాత్మికాయై రసతన్మాత్ర శ్రీ బాలా త్రిపురసుందరీ మహాదేవ్యై నైవేద్యం నివేదయామి । సౌః క్లీం ఐం ఓం ।। అమ్మవారికి బెల్లమును సమర్పించాలి.
  6. సర్వోపచారము: ఓం ఐం క్లీం సౌః । సం సర్వ తత్వాత్మికాయై సర్వతన్మాత్ర శ్రీ బాలా త్రిపురసుందరీ మహాదేవ్యై తాంబూలాది సర్వోపచారాన్ సమర్పయామి । సౌః క్లీం ఐం ఓం ।। అమ్మవారికి అక్షతలు సమర్పించాలి.
మూల మంత్ర జపం గురు దగ్గర ఈ క్రింది మంత్రాన్ని ఉపదేశం తీసుకొని మీ శక్త్యానుసారం మూల మంత్ర జపమును అమ్మవారిని తలుచుకుంటూ చేయాలి యథాశక్తి మూలమంత్రం జపేత్ । ఓం ఐం క్లీం సౌః శ్రీ బాలా త్రిపురసుందరీ మహాదేవ్యై సౌః క్లీం ఐం ఓం ।। గురు ఉపదేశం లేనివారు ఈ మంత్రాన్ని జపము చేయవచ్చును. ఓం శ్రీ బాలా త్రిపురసుందరీ మహాదేవ్యై నమః ।।

అథ శ్రీ దేవీ ఖడ్గమాలా స్తోత్రం

ఈ ఖడ్గమాలా స్తోత్రముతో శ్రీచక్ర నవవరణ పూజ కుంకుమతో చేయవచ్చును, నిత్య పారాయణము చేయవచ్చును, హవనమూ చేయించుకోవచ్చును. పారాయణ చేస్తున్నప్పుడు మాత్రము నామములు పఠిస్తే సరిపోతుంది. షట్ న్యాసాంగ దేవత: ఈ దేవతలను ఆరాధించడము వలన మన శరీరము మంత్రమయము అవుతుంది. ఓం శ్రీ హృదయదేవ్యై నమః । శివ శక్తి / జ్ఞాన శక్తి. ఓం శ్రీ శిరోదేవ్యై నమః । గౌరీ శక్తి / ఐశ్వర్య శక్తి. ఓం శ్రీ శిఖాదేవ్యై నమః । వైష్ణవీ శక్తి / ధైర్య శక్తి. ఓం శ్రీ కవచ దేవ్యై నమః । బ్రాహ్మీ శక్తి / రక్షణ శక్తి. ఓం శ్రీ నేత్ర దేవ్యై నమః । రౌద్రీ శక్తి / దృష్టి శక్తి. ఓం శ్రీ అస్త్ర దేవ్యై నమః । సమస్త శత్రు వినాశక శక్తి. షోడశ తిథినిత్యా దేవత: వీరు చంద్రుని 15 తిథులు, 16వ దేవత లలితా మహా త్రిపురసుందరి ఆ డిఇ సూక్ష్మముగా ఈ 15 దేవతలలో కొలువైఉంటుంది. వీరిని ఆరాధించడము వలన కాలముపై విజయము, మన శ్వాస ప్రక్రియ పై దుష్ప్రభావం తొలగుతుంది. ఓం శ్రీ కామేశ్వరీ నిత్యాయై నమః । పాడ్యమి. ఓం శ్రీ భగమాలినీ నిత్యాయై నమః । విదియ. ఓం శ్రీ నిత్యక్లిన్నా నిత్యాయై నమః । తదియ. ఓం శ్రీ భేరుండా నిత్యాయై నమః । చవితి. ఓం శ్రీ వహ్నివాసినీ నిత్యాయై నమః । పంచమి. ఓం శ్రీ మహావజ్రేశ్వరీ నిత్యాయై నమః । షష్ఠి. ఓం శ్రీ శివదూతీ నిత్యాయై నమః । సప్తమి. ఓం శ్రీ త్వరితా నిత్యాయై నమః । అష్టమి. ఓం శ్రీ కులసుందరీ నిత్యాయై నమః । నవమి. ఓం శ్రీ నిత్యాయై నమః । దశమి. ఓం శ్రీ నీలపతాకా నిత్యాయై నమః । ఏకాదశి. ఓం శ్రీ విజయా నిత్యాయై నమః । ద్వాదశి. ఓం శ్రీ సర్వమంగళా నిత్యాయై నమః । త్రయోదశి. ఓం శ్రీ జ్వాలామాలినీనిత్యాయై నమః । చతుర్దశి. ఓం శ్రీ చిత్రానిత్యాయై నమః । పౌర్ణమి / అమావాస్య. ఓం శ్రీ మహానిత్యాయై నమః । శ్రీ లలితా మహాత్రిపుర సుందరి. గురుమండలం: అష్ట దివ్యౌఘ గురుమండలం: దివ్యౌఘ గురువుల సంఖ్యా ఎనిమిది(8), వీరు పరమశివుడి నుండి ఉద్భవించిన శక్తులు. శ్రీ చక్రంలోని బిందువుకు పైన మొదటి వరుసలో వీరు కొలువై ఉంటారు. ఓం శ్రీ పరమేశ్వరాయ నమః । ఓం శ్రీ పరమేశ్వర్యై నమః । ఓం శ్రీ మిత్రేశమయ్యై నమః । ఓం శ్రీ షష్ఠీశమయ్యై నమః । ఓం శ్రీ ఉడ్డీశమయ్యై నమః । ఓం శ్రీ చర్యానాథమయ్యై నమః । ఓం శ్రీ లోపాముద్రామయ్యై నమః । ఓం శ్రీ అగస్త్యమయ్యై నమః । చతుర్ సిద్ధౌఘ గురుమండలం: సిద్ధౌఘ గురువులు నలుగురు, వీరు ఘోర తపస్సు ద్వారా సిద్ధిని పొందిన మహర్షులు. వీరు జ్ఞాన ప్రభోధకులు. శ్రీ చక్రంలో దివ్యౌఘ గురువుల వెనుక లేదా ప్రక్కన రెండవ వరుసలో వీరు కొలువై ఉంటారు./i> ఓం శ్రీ కాలతాపసమయ్యై నమః । ఓం శ్రీ ధర్మాచార్యమయ్యై నమః । ఓం శ్రీ ముక్తకేశీశ్వరమయ్యై నమః । ఓం శ్రీ దీపకళానాథమయ్యై నమః । అష్ట మానవౌఘ గురుమండలం: మానవౌఘ గురువుల సంఖ్య కూడా ఎనిమిది, వీరు ఈ భూమిపై గురు-శిష్య పరంపరను, వారి సంబంధమును దృఢం చేస్తూ లోకాన్ని నడిపించే మహా జ్ఞానులు. శ్రీ చక్రంలోని దివ్యౌఘ గురువులు, సిద్ధౌఘ గురువుల తరువాత మూడవ వరుసలో కొలువై ఉంటారు. ఓం శ్రీ విష్ణు దేవమయ్యై నమః । ఓం శ్రీ ప్రభాకర దేవమయ్యై నమః । ఓం శ్రీ తేజో దేవమయ్యై నమః । ఓం శ్రీ మనోజ దేవమయ్యై నమః । ఓం శ్రీ కళ్యాణ దేవమయ్యైనమః । ఓం శ్రీ వాసుదేవమయ్యై నమః । ఓం శ్రీ రత్న దేవమయ్యై నమః । ఓం శ్రీ రామానందమయ్యై నమః । ప్రథమావరణం - త్రైలోక్య మోహన చక్రము ఈ చక్రమును త్రైలోక్య మోహన చక్రము, భూపురము అంటారు, 3 చతురస్రములతో కూడిన ఈ ప్రథమావరణ వెలుపలి వరుస (Outer Line) లో దశ (10) మహాసిద్ధాది దేవతలు, మధ్య వరుస (Middle Line) లో అష్ట మాతృకా దేవతలు, మరియు లోపలి వరుస (Inner Line) లో దశముద్రా శక్తి దేవతలు కోలువైవుంటారు. వీరినే ప్రకట యోగినీ దేవతలు అని కూడా అంటారు. దశ మహాసిద్ధాది దేవతలు ఓం శ్రీ అణిమా సిద్ధయే నమః । అత్యంత సూక్ష్మ రూపమును దాల్చే శక్తిని ప్రసాదిస్తుంది. ఓం శ్రీ లఘిమా సిద్ధయే నమః । గాలిలా తేలికయ్యే శక్తిని ప్రసాదిస్తుంది. ఓం శ్రీ గరిమా సిద్ధయే నమః । మానసిక స్థిరత్వాన్ని, ఎవరు కదిలించలేని శక్తిని ప్రసాదిస్తుంది ఓం శ్రీ మహిమా సిద్ధయే నమః । అనంతమైన రూపమును దాల్చే శక్తిని ప్రసాదిస్తుంది. ఓం శ్రీ ఈశిత్వ సిద్ధయే నమః । సకల సృష్టిపై అధికారమును పొందే సిద్ధిని ప్రసాదిస్తుంది. ఓం శ్రీ వశిత్వ సిద్ధయే నమః । అందరినీ వశం చేసుకునే శక్తిని ప్రసాదిస్తుంది. ఓం శ్రీ ప్రాకామ్య సిద్ధయే నమః । కోరినది వెంటనే పొందే శక్తిని ప్రసాదిస్తుంది. ఓం శ్రీ ఇచ్చా సిద్ధయే నమః । అజేయమైన సంకల్ప బలమును ప్రసాదిస్తుంది ఓం శ్రీ ప్రాప్తి సిద్ధయే నమః । ఏదైనా పొందగలిగే శక్తిని ప్రసాదిస్తుంది. ఓం శ్రీ సర్వకామ సిద్ధయే నమః । సమస్త కోరికలను నెరవేర్చుకునే శక్తిని ప్రసాదిస్తుంది. అష్ట మాతృకా దేవతలు ఓం శ్రీ బ్రాహ్మ్యై నమః । కామమును (కోరికలను) నియంత్రించే శక్తిని ప్రసాదిస్తుంది. ఓం శ్రీ మాహేశ్వర్యై నమః । క్రోధమును (కోపమును) జయించే శక్తిని ప్రసాదిస్తుంది. ఓం శ్రీ కౌమార్యై నమః । లోభమును (పిసినారితనాన్ని) పోగొట్టే శక్తిని ప్రసాదిస్తుంది. ఓం శ్రీ వైష్ణవ్యై నమః । మోహమును (వ్యామోహాన్ని) తొలగించే శక్తిని ప్రసాదిస్తుంది. ఓం శ్రీ వారాహ్యై నమః । మదమును (గర్వాన్ని) అణచివేసే శక్తిని ప్రసాదిస్తుంది. ఓం శ్రీ ఇంద్రాణ్యై నమః । మాత్సర్యమును (అసూయను) నిర్మూలించే శక్తిని ప్రసాదిస్తుంది. ఓం శ్రీ చాముండాయై నమః ।పాపములను నశింపజేసి పుణ్యాన్నిచ్చే శక్తిని ప్రసాదిస్తుంది. ఓం శ్రీ మహాలక్ష్మై నమః । దారిద్య్రమును పోగొట్టి అష్టైశ్వర్యాలనిచ్చే శక్తిని ప్రసాదిస్తుంది. దశ ముద్రాశక్తి దేవతలు ఓం శ్రీ సర్వ సంక్షోభిణ్యై నమః । అజ్ఞానమును పోగొట్టి జ్ఞానోదయం కలిగేలా చేస్తుంది. ఓం శ్రీ సర్వవిద్రావిణ్యై నమః ।భయాలను, అడ్డంకులను పారద్రోలే శక్తిని ప్రసాదిస్తుంది. ఓం శ్రీ సర్వాకర్షిణ్యై నమః । దైవత్వమును మనవైపునకు ఆకర్షించుకునే శక్తిని ప్రసాదిస్తుంది. ఓం శ్రీ సర్వ వశంకర్యై నమః । సకల శక్తులను మన వశం చేసుకునే శక్తిని ప్రసాదిస్తుంది. ఓం శ్రీ సర్వోన్మాдиన్యై నమః । దైవ చింతనలో మునిగేలా చేస్తుంది. ఓం శ్రీ సర్వమహాంకుశాయై నమః । మనస్సును అదుపులో ఉంచే (అంకుశం వంటి) శక్తిని ప్రసాదిస్తుంది. ఓం శ్రీ సర్వఖేచర్యై నమః । శూన్యంలో (ఆధ్యాత్మికంగా) విహరించే శక్తిని ప్రసాదిస్తుంది. ఓం శ్రీ సర్వబీజాయై నమః । సకల మంత్రాలకు మూలమైన శక్తిని ప్రసాదిస్తుంది. ఓం శ్రీ సర్వయోన్యై నమః । సృష్టికి మూలమైన పరాశక్తి యొక్క అనుగ్రహము దర్శనమును ప్రసాదిస్తుంది. ఓం శ్రీ సర్వత్రిఖండాయై నమః । ముల్లోకాలను, ముప్పొద్దులను ఏకం చేసే మహోన్నత శక్తిని ప్రసాదిస్తుంది. ప్రథమావరణ చక్రేశ్వరి - అధిష్ఠాన దేవత ఓం శ్రీ త్రైలోక్య మోహన చక్రేశ్వరి త్రిపురా మహాదేవ్యై నమః । ప్రథమావరణ దేవతల అనుగ్రహముతో పాటుగా సర్వాన్నీ ఆకర్షించే శక్తి ని మరియు కార్యములో ప్రథమంగా వచ్చే అవరోధాలను తొలగిస్తుంది. ఓం శ్రీ ప్రకట యోగిన్యై నమః । ముఖ్య గమనిక:శ్రీ చక్రములో ప్రథమవరణము పైనున్న త్రీ(3)వృత్తములు సత్వ రజో తమో గుణములను సూచిస్తాయి. భక్తులు ఇవి అమ్మవారికి సమర్పిస్తూ ద్వితియావరణములోకి ప్రవేశించాలి. ద్వితీయావరణం - సర్వాశా పరిపూరక చక్రము ఈ చక్రమును సర్వాశా పరిపూరక చక్రము,షోడశదళ పద్మము అని అంటారు. ఈ చక్రములో షోడశ (16) గుప్తయోగినీ దేవతలు కొలువై ఉంటారు. గుప్తయోగినీ దేవతలు ఓం శ్రీ కామాకర్షిణ్యై నమః । కోరికలను (Desires) నియంత్రించే శక్తిని ప్రసాదిస్తుంది. ఓం శ్రీ బుద్ధ్యాకర్షిణ్యై నమః । సుబుద్ధిని పొందే యోగ్యతను ప్రసాదిస్తుంది. ఓం శ్రీ అహంకారాకర్షిణ్యై నమః । అహంకారాన్ని శుద్ధి చేసే శక్తిని ప్రసాదిస్తుంది. ఓం శ్రీ శబ్దాకర్షిణ్యై నమః । వినికిడి శక్తిని ప్రసాదిస్తుంది. ఓం శ్రీ స్పర్శాకర్షిణ్యై నమః । స్పర్శ జ్ఞానాన్ని పొందే శక్తిని ప్రసాదిస్తుంది. ఓం శ్రీ రూపాకర్షిణ్యై నమః । పవిత్రమైన దృష్టిని పొందే శక్తిని ప్రసాదిస్తుంది. ఓం శ్రీ రసాకర్షిణ్యై నమః । రుచిని నియంత్రించే శక్తిని ప్రసాదిస్తుంది. ఓం శ్రీ గంధాకర్షిణ్యై నమః । ఘ్రాణ (వాసన చూసే)శక్తిని ప్రసాదిస్తుంది. ఓం శ్రీ చిత్తాకర్షిణ్యై నమః । చిత్తాన్ని స్థిరపరుచుకునే శక్తిని ప్రసాదిస్తుంది. ఓం శ్రీ ధైర్యాకర్షిణ్యై నమః । అపారమైన ధైర్యాన్ని పొందే యోగ్యతను ప్రసాదిస్తుంది. ఓం శ్రీ స్మృత్యాకర్షిణ్యై నమః । జ్ఞాపకశక్తిని పెంచుకునే శక్తిని ప్రసాదిస్తుంది. ఓం శ్రీ నామాకర్షిణ్యై నమః । కీర్తి ప్రతిష్ఠలను పొందే శక్తిని ప్రసాదిస్తుంది. ఓం శ్రీ బీజాకర్షిణ్యై నమః । బీజ మంత్ర శక్తిని ప్రసాదిస్తుంది. ఓం శ్రీ ఆత్మాకర్షిణ్యై నమః । ఆత్మజ్ఞానాన్ని పొందే యోగ్యతను శక్తిని ప్రసాదిస్తుంది ఓం శ్రీ అమృతాకర్షిణ్యై నమః । మోక్షం, అమరత్వాన్ని పొందే యోగ్యతా శక్తిని ప్రసాదిస్తుంది. ఓం శ్రీ శరీరాకర్షిణ్యై నమః । శరీరాన్ని బలిష్ఠము చేస్తుంది. ద్వితీయావరణ చక్రేశ్వరి - అధిష్ఠాన దేవత ఓం శ్రీ సర్వాశా పరిపూరక చక్రేశ్వరి త్రిపురేశీ మహాదేవ్యై నమః । ద్వితీయావరణ దేవతల అనుగ్రహముతో పాటుగా మనసులోని ధర్మబద్ధమైన కోరికలన్నీ నెరవేర్చుకునే యోగ్యతను ప్రసాదిస్తుంది . ఓం శ్రీ గుప్త యోగిన్యై నమః । తృతీయావరణం - సర్వసంక్షోభణ చక్రము ఈ చక్రమును సర్వసంక్షోభణ చక్రము,అష్టదళ పద్మము అని అంటారు. ఈ చక్రములో అష్ట (8) గుప్తతరయోగినీ దేవతలు కొలువై ఉంటారు. గుప్తతరయోగినీ దేవతలు ఓం శ్రీ అనంగ కుసుమాయై నమః । వాక్చాతుర్యమును ప్రసాదిస్తుంది. ఓం శ్రీ అనంగ మేఖలాయై నమః । కార్యసిద్ధిని ప్రసాదిస్తుంది. ఓం శ్రీ అనంగ మదనాయై నమః । ప్రయాణాలలో రక్షణను, ప్రగతిని ప్రసాదిస్తుంది. ఓం శ్రీ అనంగ మదనాతురాయై నమః । శరీరంలోని మలినములను తొలగింపస్తుంది ఓం శ్రీ అనంగ రేఖాయై నమః । మానసిక ఉల్లాసమును ప్రసాదిస్తుంది. ఓం శ్రీ అనంగ వేగిన్యై నమః । వైరాగ్యమును, చిత్తశుద్ధిని ప్రసాదిస్తుంది. ఓం శ్రీ అనంగాంకుశాయై నమః । ఏకాగ్రతా శక్తిని ప్రసాదిస్తుంది. ఓం శ్రీ అనంగ మాలిన్యై నమః । సమస్థితిని కలిగిస్తుంది. తృతీయావరణ చక్రేశ్వరి - అధిష్ఠాన దేవత ఓం శ్రీ సర్వసంక్షోభణ చక్రేశ్వరి త్రిపుర సుందరీ మహాదేవ్యై నమః । తృతీయావరణ దేవతల అనుగ్రహముతో పాటుగా మనసులోని ధర్మబద్ధమైన కోరికలన్నీ నెరవేర్చుకునే యోగ్యతను ప్రసాదిస్తుంది . ఓం శ్రీ గుప్తతర యోగిన్యై నమః । చతుర్థావరణం - సర్వ సౌభాగ్యదాయక చక్రము ఈ చక్రమును సర్వ సౌభాగ్యదాయక చక్రము అని అంటారు. ఈ చక్రములో చతుర్దశ (14) సంప్రదాయ యోగినీ దేవతలు కొలువై ఉంటారు. సంప్రదాయ యోగినీ దేవతలు ఓం శ్రీ సర్వ సంక్షోభిణ్యై నమః । అజ్ఞానాన్ని తొలగిస్తుంది. ఓం శ్రీ సర్వవిద్రావిణ్యై నమః । అడ్డంకులను పారద్రోలుతుంది. ఓం శ్రీ సర్వాకర్షిణ్యై నమః । సర్వాన్ని ఆకర్షించే శక్తిని ప్రసాదిస్తుంది. ఓం శ్రీ సర్వాహ్లాదిన్యై నమః । మనసుకి ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఓం శ్రీ సర్వసమ్మోహిన్యై నమః । సమ్మోహన శక్తిని ప్రసాదిస్తుంది. ఓం శ్రీ సర్వస్తంభిన్యై నమః । ఏకాగ్రతను స్థిరపరుస్తుంది. ఓం శ్రీ సర్వ జృంభిణ్యై నమః । శక్తులను మేల్కొల్పుతుంది. ఓం శ్రీ సర్వవశంకర్యై నమః । సర్వ జనులను వశం చేసుకునే శక్తిని ప్రసాదిస్తుంది. ఓం శ్రీ సర్వరంజన్యై నమః । ఆనందాన్ని ప్రసాదిస్తుంది. ఓం శ్రీ సర్వోన్మాదిన్యై నమః । దైవ చింతనలో మునిగే శక్తిని ప్రసాదిస్తుంది. ఓం శ్రీ సర్వార్థసాధికాయై నమః । సర్వ కార్యములను సఫలీకృతం అయ్యేలా చేస్తుంది. ఓం శ్రీ సర్వసంపత్తిపూరణ్యై నమః । సంపదలను సమకూరుస్తుంది. ఓం శ్రీ సర్వ మంత్రమయ్యై నమః । మంత్ర సిద్ధిని పొందే శక్తిని ప్రసాదిస్తుంది. ఓం శ్రీ సర్వ ద్వంద్వక్షయంకర్యై నమః । ద్వంద్వ వైఖరిని తొలగిస్తుంది. చతుర్థావరణ చక్రేశ్వరి - అధిష్ఠాన దేవత ఓం శ్రీ సర్వ సౌభాగ్య దాయక చక్రేశ్వరి త్రిపురవాసినీ మహాదేవ్యై నమః ।చతుర్థావరణ దేవతల అనుగ్రహముతో పాటుగా అఖండ ఐశ్వర్యము మరియు కుటుంబ సౌఖ్యములను ప్రసాదిస్తుంది. ఓం శ్రీ సంప్రదాయ యోగిన్యై నమః । పంచమావరణం - సర్వార్థ సాధక చక్రము ఈ చక్రమును సర్వ సాధక చక్రము, బహిర్దశారము అని అంటారు. ఈ చక్రములో దశ (10) కులోత్తీర్ణ యోగినీ దేవతలు కొలువై ఉంటారు. కులోత్తీర్ణ యోగినీ దేవతలు ఓం శ్రీ సర్వ సిద్ధిప్రదాయై నమః । సకల కార్యాలలో విజయాన్ని పొందే సిద్ధిని ప్రసాదిస్తుంది. ఓం శ్రీ సర్వసంపత్ప్రదాయై నమః । అపారమైన ఐశ్వర్యాన్ని, సంపదను ఇస్తుంది. ఓం శ్రీ సర్వప్రియంకర్యై నమః । అందరికీ ప్రియమైన వ్యక్తివి అయ్యేలాగా మారుస్తుంది. ఓం శ్రీ సర్వమంగళకారిణ్యై నమః । ఎల్లప్పుడూ శుభాలను (మంగళమును) కలిగిస్తుంది. ఓం శ్రీ సర్వకామప్రదాయై నమః । కోరిన ధర్మబద్ధమైన కోరికలను నెరవేరుస్తుంది. ఓం శ్రీ సర్వ దుఃఖవిమోచన్యై నమః । మానసిక, శారీరక దుఃఖాల నుండి విముక్తిని ప్రసాదిస్తుంది. ఓం శ్రీ సర్వ మృత్యుప్రశమన్యై నమః । అపమృత్యు భయాలను తొలగించి దీర్ఘాయువును ప్రసాదిస్తుంది. ఓం శ్రీ సర్వ విఘ్న నివారిణ్యై నమః । చేపట్టిన పనులలో వచ్చే విఘ్నములను తొలగిస్తుంది. ఓం శ్రీ సర్వాంగ సుందర్యై నమః । శరీరానికి దివ్యమైన కాంతిని, సౌందర్యాన్ని ఇస్తుంది. ఓం శ్రీ సర్వ సౌభాగ్యదాయిన్యై నమః । అచంచలమైన అదృష్టమును, సౌభాగ్యమును ప్రసాదిస్తుంది. పంచమావరణ చక్రేశ్వరి - అధిష్ఠాన దేవత ఓం శ్రీ సర్వార్థ సాధక చక్రేశ్వరి త్రిపురాశ్రీ మహాదేవ్యై నమః । పంచమావరణ దేవతల అనుగ్రహముతో పాటుగా చేపట్టిన పనులన్నీ ఏ విఘ్నం లేకుండా సఫలీకృతం అయ్యేలా చేస్తుంది. ఓం శ్రీ కులోత్తీర్ణ యోగిన్యై నమః । షష్ఠమావరణం - సర్వ రక్షాకర చక్రము ఈ చక్రమును సర్వ రక్షాకర చక్రము, అంతర్దశారము అని అంటారు. ఈ చక్రములో దశ (10) నిగర్భయోగినీ దేవతలు కొలువై ఉంటారు. నిగర్భయోగినీ దేవతలు ఓం శ్రీ సర్వజ్ఞాయై నమః । ఎవరి మనసులో ఏముందో తెలుసుకొనే శక్తిని ప్రసాదిస్తుంది. ఓం శ్రీ సర్వశక్యై నమః । మానసిక, శారీరక బలహీనతలు తొలగి అపారమైన శక్తి లభిస్తుంది. ఓం శ్రీ సర్వైశ్వర్యప్రదాయిన్యై నమః । సర్వ ఐశ్వర్యములను సంపదలను ప్రసాదిస్తుంది. ఓం శ్రీ సర్వ జ్ఞానమయ్యై నమః । ఆధ్యాత్మిక రహస్యాలను అవగతము చేసుకొనేలా పరిపూర్ణ జ్ఞానాశక్తిని ప్రసాదిస్తుంది. ఓం శ్రీ సర్వాధార స్వరూపాయై నమః । జీవితంలో ఒంటరితనం తొలగి, గొప్ప ఆధారం లభిస్తుంది. ఓం శ్రీ సర్వ వ్యాధి వినాశిన్యై నమః । దీర్ఘకాలిక అనారోగ్యాలను తొలగించి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఓం శ్రీ సర్వ పాప హరాయై నమః । తెలిసి తెలియక చేసిన పాపకృత్యాల నుండి విముక్తిని ప్రసాదిస్తుంది. ఓం శ్రీ సర్వానందమయ్యై నమః । ఎల్లప్పుడూ ఆనందంగా, ఉత్సాహంగా ఉండే స్థితిని ప్రసాదిస్తుంది. ఓం శ్రీ సర్వరక్షా స్వరూపిణ్యై నమః । దుష్ట శక్తులు, ప్రమాదాల నుండి కవచంలా రక్షణ కల్పిస్తుంది. ఓం శ్రీ సర్వేప్సిత ఫలప్రదాయై నమః । మనసులో కోరుకున్న దాన్ని నెరవేరుస్తుంది. షష్ఠమావరణ చక్రేశ్వరి - అధిష్ఠాన దేవత ఓం శ్రీ సర్వ రక్షాకర చక్రేశ్వరి త్రిపురమాలినీ మహాదేవ్యై నమః । షష్ఠమావరణ దేవతల అనుగ్రహముతో పాటుగా సకల గ్రహ దోషాల నుండి, దుష్ట శక్తుల నుండి రక్షణనిస్తుంది . ఓం శ్రీ నిగర్భ యోగిన్యై నమః సప్తమావరణం - సర్వ రోగహర చక్రము ఈ చక్రమును సర్వ రక్షాకర చక్రము అని అంటారు. ఈ చక్రములో అష్ట (8) రహస్య యోగినీ దేవతలు కొలువై ఉంటారు. రహస్య యోగినీ దేవతలు ఓం శ్రీ వశిన్యై నమః । వశీకరణ శక్తిని ప్రసాదిస్తుంది. ఓం శ్రీ కామేశ్వర్యై నమః । ఇచ్చా శక్తిని ప్రసాదిస్తుంది. ఓం శ్రీ మోదిన్యై నమః । సంతోషాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఓం శ్రీ విమలాయై నమః । మనో నిర్మలత్వమును కలిగిస్తుంది. ఓం శ్రీ అరుణాయై నమః । జీవితములోని చీకటిని తొలగించి వెలుగును ప్రసాదిస్తుంది. ఓం శ్రీ జయిన్యై నమః । విజయాలను, కీర్తిని ప్రసాదిస్తుంది. ఓం శ్రీ సర్వేశ్వర్యై నమః । సర్వ శక్తులపై ఆధిపత్యాన్నిస్తుంది. ఓం శ్రీ కౌళిన్యై నమః । సర్వ రోగాలను నాశనం చేసి దేహానికి ఉపశమనాన్నిస్తుంది. సప్తమావరణ చక్రేశ్వరి - అధిష్ఠాన దేవత ఓం శ్రీ సర్వ రోగహర చక్రేశ్వరి త్రిపుర సిద్ధాంబా మహాదేవ్యై నమః । సప్తమావరణ దేవతల అనుగ్రహముతో పాటుగా శారీరక వ్యాధులు మరియు మానసిక రోగాల నుండి విముక్తిని ప్రసాదిస్తుంది. ఓం శ్రీ రహస్య యోగిన్యై నమః । అష్టమావరణం - సర్వ సిద్ధిప్రద చక్రము ఈ చక్రమును సర్వ సిద్ధిప్రద చక్రము అని అంటారు. ఈ చక్రములో సప్త (7) అతిరహస్య యోగినీ దేవతలు కొలువై ఉంటారు. అతిరహస్య యోగినీ దేవతలు ఓం శ్రీ బాణిన్యై నమః । ఇంద్రియ నిగ్రహమునిస్తుంది. ఓం శ్రీ చాపిన్యై నమః । మనస్సుపై పూర్తి నియంత్రణను కలిగిస్తుంది. ఓం శ్రీ పాశిన్యై నమః । అవాంఛిత బంధనాల నుండి విముక్తిని కలిగిస్తుంది. ఓం శ్రీ అంకుశిన్యై నమః । కోపాన్ని నియంత్రించే శక్తిని ప్రసాదిస్తుంది. ఓం శ్రీ మహా కామేశ్వర్యై నమః । ఇచ్చా శక్తిని ప్రసాదిస్తుంది., సంకల్పబలాన్నిస్తుంది. ఓం శ్రీ మహా వజ్రేశ్వర్యై నమః । జ్ఞాన శక్తిని ప్రసాదిస్తుంది ఓం శ్రీ మహా భగమాలిన్యై నమః । క్రియా శక్తిని ప్రసాదిస్తుంది. అష్టమావరణ చక్రేశ్వరి - అధిష్ఠాన దేవత ఓం శ్రీ సర్వ సిద్ధిప్రద చక్రేశ్వరి త్రిపురాంబా మహాదేవ్యై నమః । అష్టమావరణ దేవతల అనుగ్రహముతో పాటుగా అష్ట సిద్ధులను మరియు ఆధ్యాత్మిక ఉన్నతిని ప్రసాదిస్తుంది. ఓం శ్రీ అతిరహస్య యోగిన్యై నమః । నవావరణం - సర్వానందమయ చక్రము ఈ చక్రమును సర్వానందమయ చక్రము అని అంటారు. ఈ చక్రములో పరాపర రహస్య యోగినీ దేవత కొలువై ఉంటారు. పరాపర రహస్య యోగినీ దేవత ఓం శ్రీ శ్రీ మహా భట్టారికాయై నమః నవావరణ చక్రేశ్వరి - అధిష్ఠాన దేవత ఓం శ్రీ సర్వానందమయ చక్రేశ్వరి లలితా మహాత్రిపురసుందరీ మహాదేవ్యై నమః । ఎనిమిది ఆవరణలలోని శక్తులన్నీ ఇక్కడ ఏకమై, సాధకుడిని సంపూర్ణ సిద్ధుడిని చేస్తాయి. దీనితో నేనే 'పరమాత్మను' అనే స్థితికి సాధకుడు చేరుకుంటాడు. జనన మరణ చక్రం నుండి సాధకుడు మోక్షం పొందుతాడు. శ్రీచక్ర నగర సామ్రాజ్ఞి - నవాక్షరీ నమస్కార మంత్రములు ఈ మంత్రాలను పఠించడం వల్ల వాక్శుద్ధి, మానసిక ఏకాగ్రత లభిస్తాయి. అమ్మవారికి పంచోపచారా పూజ చేసి కుంకుమతో ఈ తొమ్మిది నామాలను చదువుతూ అర్చన చేయడం వల్ల మహాలక్ష్మీ కటాక్షం లభిస్తుంది. గృహములో ప్రశాంతత కలుగుతుంది. విశేష పర్వదినాల్లో ఈ నవాక్షరీ మంత్రాలతో ఆజ్యము లేదా తామర పుష్పాలతో హోమం చేయడం వల్ల సమస్త దోషాలు తొలగి, రాజయోగం సిద్ధిస్తుంది. ఓం శ్రీ మహా మహేశ్వర్యై నమః । సమాజంలో గౌరవం, ఉన్నత పదవులు మరియు ఇతరులను నడిపించే నాయకత్వ లక్షణములను ప్రసాదిస్తుంది. ఓం శ్రీ మహా మహారాక్ష్యై నమః । జీవితంలో ఎటువంటి లోటు లేని భోగభాగ్యాలు కలిగి మరియు మహారాజయోగం సిద్ధిస్తుంది. ఓం శ్రీ మహా మహాశక్త్యా నమః । శారీరక, మానసిక బలహీనతలు తొలగి, కార్యసాధనకు కావలసిన గొప్ప శక్తి లభిస్తుంది. ఓం శ్రీ మహా మహాగుప్యై నమః । రహస్య శత్రువుల నుండి, దుష్ట శక్తుల నుండి దివ్యమైన రక్షణ లభిస్తుంది. ఓం శ్రీ మహా మహాజ్ఞప్తాయై నమః । అపారమైన తెలివితేటలు, చదువులో రాణింపు మరియు లోతైన ఆధ్యాత్మిక జ్ఞానం లభిస్తుంది. ఓం శ్రీ మహా మహానందాయై నమః । మనశ్శాంతి లభిస్తుంది. ఒత్తిడి, ఆందోళనలు తొలగి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండే స్థితి కలుగుతుంది. ఓం శ్రీ మహా మహాస్కంధాయై నమః । జీవితంలో వచ్చే ఆపదలలో ఒక గొప్ప ఆధారం (Support) లభిస్తుంది. అపజయాలు మన దరికి రాకుండా చేస్తుంది. ఓం శ్రీ మహా మహాశయాయై నమః । భయాందోళనలు తొలగి, పరమాత్మ పాదాల చెంత అత్యంత సురక్షితంగా ఉన్నామనే భావన కలుగుతుంది. భద్రత లభిస్తుంది ఓం శ్రీ మహా మహా శ్రీచక్ర నగర సామ్రాజ్ఞి నమస్తే నమస్తే నమస్తే నమస్తే నమః । పైన పేర్కొన్న ఎనిమిది శక్తులను ఆరాధించడము వలన అవి మన శరీరం, వాక్కు, మనస్సు అమ్మవారికి శరణాగతి చేసేలా చేసి మనల్ని మోక్షం వైపు నడిచేలా చేసి పూర్ణత్వమును పొందేలా చేస్తుంది. ఫలశ్రుతిః : ఏషా విద్యా మహాసిద్ధి దాయినీ స్మృతిమాత్రతః । అగ్ని వాత మహాక్షోభే రాజా రాష్ట్రస్య విప్లవే ।। లుంఠనే తస్కరభయే సంగ్రామే సలిలప్లవే । సముద్రయాన విక్షోభే భూతప్రేతాదికే భయే ।। అపస్మార జ్వర వ్యాధి మృత్యుక్షామాదిజే భయే శాకినీ పూతనాయక్ష రక్షః కూష్మాండజే భయే ।। మిత్రభేదే గ్రహభయే వ్యసనేష్వాభిచారికే అన్యేష్వపి చ దోషేషు మాలామంత్రం స్మరేన్నరః ।। సర్వోపద్రవ నిర్ముక్తః సాక్షాత్ శివ మయో భవేత్ । ఆపత్కాలే నిత్యపూజాం విస్తారాత్ కర్తుమారభేత్ ।। ఏకవారం జపధ్యానం సర్వ పూజాఫలం లభేత్ । నవావరణ దేవీనాం శ్రీబాలాయా మహౌజసః ।। ఏకత్ర గణనా రూపో వేదవేదాంగ గోచరః । సర్వాగమ రహస్యార్థః స్మరణాత్ పాపనాశినీ ।। శ్రీబాలాయా మహేశాన్యా మాలా విద్యా మహీయసీ । నరవశ్యం నరేంద్రాణాం వశ్యం నారీ వశంకరమ్ ।। అణిమాది గుణైశ్వర్యం రంజనం పాపభంజనమ్ । తత్తాదావరణస్థాయి దేవతా బృంద మంత్రకమ్ । మాలామంత్రం పరంగుహ్యం పరంధామ ప్రకీర్తితమ్ ।। శక్తి మాలా పంచధాస్యాత్ శివమాలా చ తాదృశీ । తస్మాత్ గోప్యతరాత్ గోప్యం రహస్యం భుక్తిముక్తిదమ్ ।। కరన్యాసం ఓం ఐం అంగుష్ఠాభ్యాం నమః రెండు బొటనవేళ్లను తాకాలి. ఓం క్లీం తర్జనీభ్యాం నమః చూపుడు వేళ్లను తాకాలి. ఓం సౌః మధ్యమాభ్యాం నమః మధ్య వేళ్లను తాకాలి. ఓం సౌః అనామికాభ్యాం నమః ఉంగరపు వేళ్లను తాకాలి. ఓం క్లీం కనిష్ఠికాభ్యాం నమః చిటికెన వేళ్లను తాకాలి. ఓం ఐం కరతల కరపృష్ఠాభ్యాం నమః అరచేతుల వెనుక భాగం ఒకదానితో ఒకటి తాకాలి. అంగన్యాసం శరీర భాగాలను తాకుతూ ఈ మంత్రాలు చదవాలి. ఓం ఐం హృదయాయ నమః కుడి చేతితో హృదయాన్ని తాకాలి. ఓం క్లీం శిరసే స్వాహా శిరస్సును తాకాలి. ఓం సౌః శిఖాయై వషట్ జుట్టు ముడి/శిఖ భాగాన్ని తాకాలి. ఓం సౌః కవచాయ హుమ్ రెండు భుజాలను మార్చి మార్చి తాకాలి. ఓం క్లీం నేత్రత్రయాయ వౌషట్ రెండు కళ్లు మరియు మధ్యలో మూడవ కన్ను ఉన్న చోట తాకాలి. ఓం ఐం అస్త్రాయ ఫట్ శిరస్సు చుట్టూ చిటికె వేస్తూ కుడిచేతి మధ్య వేలితో ఎడమ అరచేతిపై చప్పట్లు కొట్టాలి. ఓం ఐం క్లీం సౌః భూర్భువస్సువరోం ఇతి దిగ్విమోకః ఎడమ చేతి చూపుడు వేలును ఆకాశం వైపు నిలువుగా చుపిస్తూ కుడి చుపుడు వేలితో దిగ్భందనం తీసేయాలి. ఇతి శ్రీ వామకేశ్వర తంత్రే ఉమామహేశ్వర సంవాదే శ్రీ దేవీ ఖడ్గమాలా స్తోత్రం