- పసుపు
- కుంకుమ
- తడిపిన గంధం
- భస్మం
- శ్రీ చక్ర యంత్రం
- ఎరుపు వర్ణ పుష్పములు
- పసుపు అక్షతలు
- ఆచమన పాత్ర {రెండింటిలోనూ నీళ్ళు నింపుకోండి}
- కలశానికి చిన్న చెంబు {రెండింటిలోనూ నీళ్ళు నింపుకోండి}
- అగరవత్తులు
- దీపానికి నూనె
- వత్తివేసిన కుందులు
- అగ్గిపెట్టె
- కర్పూరం
- కూర్చోవడానికి ఆసనం
నియమం: మీరు శ్రీ చక్ర యంత్రము పెట్టినప్పుడు బిందువు కింద త్రికోణం ఉంటుంది, దాని శీర్ష కోణం (vertex angle) మీ వైపుకు ఉండాలి.
దుర్గ నవరాత్రి సమయములో ఒక చిన్న పీఠం లేదా పూజా వేదికపై ఎరుపు రంగు వస్త్రాన్ని పరిచి, దానిపై బియ్యం పోసి ఒక ప్లేటులో (ఇత్తడి లేదా రాగి) శ్రీ చక్ర యంత్రమును (లేదా) పీఠంపై అమ్మవారి పటమును ఉంచాలి. (తదుపరి) ఈ క్రింది'సంకల్పము' చెప్పుకొని 'శ్రీ చక్ర ప్రాణ ప్రతిష్ఠాపన' అనే శీర్షిక (Heading) నుండి చేయవలెను.
శ్రీ చక్ర నిత్య పూజ చేసేవారు మాత్రం 'శ్రీ చక్ర యంత్ర నిత్య పూజ' అనే శీర్షిక (Heading) నుండి చేయవలసి ఉంటుంది.
శ్రీ దుర్గా నవరాత్రీ శ్రీ చక్ర పూజ సంకల్పం చూడటానికి క్లిక్ చేయండి (Click to expand)
ఇప్పుడు కుడిచేతిలో అక్షతలు తీసుకుని, అక్షతలను నీటితో అర్ఘ్యపాత్రలో వదలాలి.పూర్వోక్త సంకల్పానుసారేణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ, మమ ఆత్మనః శ్రుతి-స్మృతి-పురాణోక్త ఫలప్రాప్త్యర్థం, మమ సకుటుంబస్య క్షేమ-స్థైర్య-వీర్య-విజయ-అభయ-ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం, ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం, శ్రీ దేవీ నవరాత్రోత్సవ పుణ్యకాలే, తదంగత్వేన శ్రీ మహాలక్ష్మీ-మహాకాళీ-మహాసరస్వతీ, శ్రీ చక్రత్రిపురా (శ్రీ బాల త్రిపుర సుందరీ దేవి, శ్రీ శుభంకరి, శ్రీ లలితా త్రిపుర సుందరీ) స్వరూపిణీ దుర్గా పరమేశ్వరీ ప్రీత్యర్థం యథాశక్తి శ్రీ చక్ర పీఠ, శ్రీ చక్ర ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే ।।
నిత్య శ్రీ చక్ర పూజ సంకల్పం చూడటానికి క్లిక్ చేయండి (Click to expand)
ఇప్పుడు కుడిచేతిలో అక్షతలు తీసుకుని ,మీ కుడి కాలితొడపై ఎడమ అరచేతి నుంచి అక్షతలతో ఉన్న కుడిచేతిని పిడికిలిగా మూసి ఆ ఎడమ అరచేతిపైనుంచుతూ ఈ సంకల్పం చెప్పి పిడికిలిలో ఉన్నఅక్షతలను నీటితో అర్ఘ్యపాత్రలో వదలాలి.మమ ఉపాత్త సమస్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం, శ్రీ చక్ర త్రిపురా(శ్రీ బాల త్రిపుర సుందరీ దేవి, శ్రీ శుభంకరి, శ్రీ లలితా త్రిపుర సుందరీ) దేవతా అనుగ్రహ ప్రాప్త్యర్థం, మమ సకలాభీష్ట సిద్ధ్యర్థం, మమ నిత్యానుష్ఠాన యోగ్యతా ఫల సిద్ధ్యర్థం, యథాశక్తి శ్రీ చక్ర పీఠ, శ్రీ చక్ర ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే.
- బిందువు: మధ్యలో ఒక చుక్క పెట్టాలి.
- త్రికోణం: ఆ చుక్క చుట్టూ ఒక త్రికోణం (Triangle) గీయాలి.
- వృత్తం: దాని చుట్టూ ఒక సున్నా (Circle) గీయాలి.
- చతురశ్రం: దాని పైన చివరన నాలుగు ద్వారాలు ఉన్న చతురస్రాన్ని (భూపురం) గీయాలి.
- ఆధార శక్తి పూజ: ఓం ఐం క్లీం సౌః కాలాగ్నిరుద్రాయ నమః ఓం ఐం క్లీం సౌః మండూకాయ నమః ఓం ఐం క్లీం సౌః ఆధారశక్త్యై నమః ఓం ఐం క్లీం సౌః అనంతాయ నమః ఓం ఐం క్లీం సౌః కూర్మాయ నమః ఓం ఐం క్లీం సౌః వరాయ నమః ఓం ఐం క్లీం సౌః దిగ్గజేభ్యో నమః ఓం ఐం క్లీం సౌః పృథివ్యై నమః ఓం ఐం క్లీం సౌః అమృతసింధవే నమః ఓం ఐం క్లీం సౌః రత్నద్వీపాయ నమః ఓం ఐం క్లీం సౌః మహోధ్యానాయ నమః
- వాటికా పూజ (శుద్ధ వనములు): ఓం ఐం క్లీం సౌః సంతానవాటికాయై నమః ఓం ఐం క్లీం సౌః హరిచందనవాటికాయై నమః ఓం ఐం క్లీం సౌః మందారవాటికాయై నమః ఓం ఐం క్లీం సౌః పారిజాతవాటికాయై నమః ఓం ఐం క్లీం సౌః కదంబవాటికాయై నమః ఓం ఐం క్లీం సౌః బిల్వవాటికాయై నమః
- రత్న ప్రాకార పూజ: ఓం ఐం క్లీం సౌః పుష్యరాగరత్న ప్రాకారాయ నమః ఓం ఐం క్లీం సౌః పద్మరాగరత్న ప్రాకారాయ నమః ఓం ఐం క్లీం సౌః గోమేధికరత్న ప్రాకారాయ నమః ఓం ఐం క్లీం సౌః వజ్రరత్న ప్రాకారాయ నమః ఓం ఐం క్లీం సౌః వైడూర్యరత్న ప్రాకారాయ నమః ఓం ఐం క్లీం సౌః ఇంద్రనీలరత్న ప్రాకారాయ నమః ఓం ఐం క్లీం సౌః ముక్తాఫలరత్న ప్రాకారాయ నమః ఓం ఐం క్లీం సౌః మరకతరత్న ప్రాకారాయ నమః ఓం ఐం క్లీం సౌః విద్రుమరత్న ప్రాకారాయ నమః ఓం ఐం క్లీం సౌః మాణిక్యమంటపాయ నమః ఓం ఐం క్లీం సౌః సహస్ర స్తంభ మంటపాయ నమః
- కక్ష్యా, పరిఖ పూజ: ఓం ఐం క్లీం సౌః అమృతవాటికాయై నమః ఓం ఐం క్లీం సౌః ఆనందవాటికాయై నమః ఓం ఐం క్లీం సౌః విమర్శవాటికాయై నమః ఓం ఐం క్లీం సౌః బాలాతపకక్ష్యాయై నమః ఓం ఐం క్లీం సౌః చంద్రికాకక్ష్యాయై నమః ఓం ఐం క్లీం సౌః మహాశృంగారపరిఖాయై నమః ఓం ఐం క్లీం సౌః మహాపద్మాటవ్యై నమః ఓం ఐం క్లీం సౌః చింతామణిగృహరాజాయ నమః
- ఆమ్నాయ ద్వార పూజ: ఈ మంత్రాలు చదువుతూ పీఠం (లేదా శ్రీ చక్రానికి) నాలుగు దిక్కులా అక్షతలు సమర్పిస్తూ ఉండాలి. ఓం ఐం క్లీం సౌః పూర్వామ్నాయమయ పూర్వద్వారాయ నమః (తూర్పు) ఓం ఐం క్లీం సౌః దక్షిణామ్నాయమయ దక్షిణద్వారాయ నమః (దక్షిణం) ఓం ఐం క్లీం సౌః పశ్చిమామ్నాయమయ పశ్చిమద్వారాయ నమః (పశ్చిమం) ఓం ఐం క్లీం సౌః ఉత్తరామ్నాయమయ ఉత్తరద్వారాయ నమః (ఉత్తరం)
- సింహాసన పూజ: ఓం ఐం క్లీం సౌః మహామణివేదికాయై నమః ఓం ఐం క్లీం సౌః మహాప్రదీపవలయాయ నమః ఓం ఐం క్లీం సౌః హంసతూలికాయై నమః ఓం ఐం క్లీం సౌః మహోపధానాయ నమః ఓం ఐం క్లీం సౌః కౌసుంభాస్తరణాయ నమః ఓం ఐం క్లీం సౌః మహాసింహాసనాయ నమః
- పంచ దేవతాసన పూజ: ఓం ఐం క్లీం సౌః బ్రహ్మమయ మంచపాదాయ నమః ఓం ఐం క్లీం సౌః విష్ణుమయ మంచపాదాయ నమః ఓం ఐం క్లీం సౌః రుద్రమయ మంచపాదాయ నమః ఓం ఐం క్లీం సౌః మహేశ్వర మయ మంచపాదాయ నమః ఓం ఐం క్లీం సౌః సదాశివమయ మహాఫలకాయ నమః
- నవ పీఠాశక్తి ఆసన పూజ: ఈ మంత్రాలు చదువుతూ పీఠం యొక్క అష్ట దిక్కులలో అక్షతలు సమర్పిస్తూ ఉండాలి. ఓం ఐం క్లీం సౌః కీర్త్యై నమః (తూర్పు) ఓం ఐం క్లీం సౌః విభూత్యై నమః (ఆగ్నేయం) ఓం ఐం క్లీం సౌః సన్నత్యై నమః (దక్షిణం) ఓం ఐం క్లీం సౌః కాంత్యై నమః (నైరుతి) ఓం ఐం క్లీం సౌః వ్యుష్ట్యై నమః (పశ్చిమం) ఓం ఐం క్లీం సౌః హృష్ట్యై నమః (వాయవ్యం) ఓం ఐం క్లీం సౌః ఉత్కృష్ట్యై నమః (ఉత్తరం) ఓం ఐం క్లీం సౌః ఋద్ధ్యై నమః (మధ్య భాగము)
- తూర్పు: ఓం ఐం క్లీం సౌః ఓడ్యాణ పీఠం పూజయామి । ఓం ఐం క్లీం సౌః ఓడ్యాణేశ్వర నాథం పూజయామి । ఓం ఐం క్లీం సౌః ఓడ్యాణేశ్వరీంబా పాదుకాం పూజయామి । నమః
- ఆగ్నేయం: ఓం ఐం క్లీం సౌః మాతృకా పీఠం పూజయామి । ఓం ఐం క్లీం సౌః మాతృకేశ్వర నాథం పూజయామి । ఓం ఐం క్లీం సౌః మాతృకాంబికా పాదుకాం పూజయామి । నమః
- దక్షిణం: ఓం ఐం క్లీం సౌః జాలంధర పీఠం పూజయామి । ఓం ఐం క్లీం సౌః జాలంధరేశ్వర నాథం పూజయామి । ఓం ఐం క్లీం సౌః జాలంధరాంబా పాదుకాం పూజయామి । నమః
- నైరుతి: ఓం ఐం క్లీం సౌః కొల్లాపుర పీఠం పూజయామి । ఓం ఐం క్లీం సౌః కొల్లాపురేశ్వర నాథం పూజయామి । ఓం ఐం క్లీం సౌః కొల్లాపుర్యంబా పాదుకాం పూజయామి । నమః
- పశ్చిమము: ఓం ఐం క్లీం సౌః పూర్ణగిరి పీఠం పూజయామి । ఓం ఐం క్లీం సౌః పూర్ణగిరేశ్వర నాథం పూజయామి । ఓం ఐం క్లీం సౌః పూర్ణగిర్యంబా పాదుకాం పూజయామి । నమః
- వాయువ్యం: ఓం ఐం క్లీం సౌః చౌహార పీఠం పూజయామి । ఓం ఐం క్లీం సౌః చౌహారేశ్వర నాథం పూజయామి । ఓం ఐం క్లీం సౌః చౌహారాంబా పాదుకాం పూజయామి । నమః
- ఉత్తరం: ఓం ఐం క్లీం సౌః కైలాసగిరి పీఠం పూజయామి । ఓం ఐం క్లీం సౌః కైలాసగిరేశ్వర నాథం పూజయామి । ఓం ఐం క్లీం సౌః కైలాసగిర్యంబా పాదుకాం పూజయామి । నమః
- ఈశాన్యం: ఓం ఐం క్లీం సౌః కామరూప పీఠం పూజయామి । ఓం ఐం క్లీం సౌః కామరూపేశ్వర నాథం పూజయామి । ఓం ఐం క్లీం సౌః కామరూపాంబా పాదుకాం పూజయామి । నమః
శ్రీ చక్ర అంతర్గత పీఠ పూజ
భేతాళ పూజ: శ్రీ చక్రములోని మొదటి చతురస్రం యొక్క నాలుగు కోణాలకు అక్షతలను సమర్పించాలి. వీరిని క్షేత్రపాలకులు అంటారు. అథ చతురస్ర చతుష్కోణేషు భేతాళ పూజయేత్- ఆగ్నేయం: ఆగ్నేయే, ఓం ఐం క్లీం సౌః అగ్నిముఖ భేతాళం పూజయామి ।
- నైరుతి: నైఋతౌ, ఓం ఐం క్లీం సౌః ప్రేతవాహన భేతాళం పూజయామి ।
- వాయువ్యం: వాయువ్యే, ఓం ఐం క్లీం సౌః జ్వాలాముఖ భేతాళం పూజయామి ।
- ఈశాన్యం: ఈశాన్యే, ఓం ఐం క్లీం సౌః ధూమ్రాక్ష భేతాళం పూజయామి ।
- తూర్పు: ఓం ఐం క్లీం సౌః లం ఇంద్రాయ నమః పూజయామి ।
- ఆగ్నేయం: ఓం ఐం క్లీం సౌః రం అగ్నయే నమః (అగ్నిం) పూజయామి ।
- దక్షిణం: ఓం ఐం క్లీం సౌః హం యమాయ నమః (యమం) పూజయామి ।
- నైరుతి: ఓం ఐం క్లీం సౌః క్షం నిరృతయే నమః (నైరుతిం) పూజయామి ।
- పశ్చిమము: ఓం ఐం క్లీం సౌః వం వరుణాయ నమః (వరుణం) పూజయామి ।
- వాయువ్యం: ఓం ఐం క్లీం సౌః యం వాయవే నమః (వాయుం)పూజయామి ।
- ఉత్తరం: ఓం ఐం క్లీం సౌః సం కుబేరాయ నమః (కుబేరం) పూజయామి ।
- ఈశాన్యం: ఓం ఐం క్లీం సౌః శం ఈశానాయ నమః (ఈశానం) పూజయామి ।
- తూర్పు: ఓం ఐం క్లీం సౌః బ్రాహ్మీ మాతృకాం పూజయామి । ఓం ఐం క్లీం సౌః అసితాంగ భైరవం పూజయామి ।
- ఆగ్నేయం: ఓం ఐం క్లీం సౌః మాహేశ్వరీ మాతృకాం పూజయామి । ఓం ఐం క్లీం సౌః రురు భైరవం పూజయామి ।
- దక్షిణం: ఓం ఐం క్లీం సౌః కౌమారీ మాతృకాం పూజయామి । ఓం ఐం క్లీం సౌః చండ భైరవం పూజయామి ।
- నైరుతి: ఓం ఐం క్లీం సౌః వైష్ణవీ మాతృకాం పూజయామి । ఓం ఐం క్లీం సౌః క్రోధ భైరవం పూజయామి ।
- పశ్చిమము: ఓం ఐం క్లీం సౌః వారాహీ మాతృకాం పూజయామి । ఓం ఐం క్లీం సౌః ఉన్మత్త భైరవం పూజయామి ।
- వాయువ్యం: ఓం ఐం క్లీం సౌః ఇంద్రాణీ మాతృకాం పూజయామి । ఓం ఐం క్లీం సౌః కపాల భైరవం పూజయామి ।
- ఉత్తరం: ఓం ఐం క్లీం సౌః చాముండా మాతృకాం పూజయామి । ఓం ఐం క్లీం సౌః భీషణ భైరవం పూజయామి ।
- ఈశాన్యం: ఓం ఐం క్లీం సౌః మహాలక్ష్మీ మాతృకాం పూజయామి । ఓం ఐం క్లీం సౌః సంహార భైరవం పూజయామి ।
- లివింగ్ గురువు: ఓం ఐం క్లీం సౌః శ్రీ గురుం పూజయామి ।
- పరమగురువు (లివింగ్ గురువుకి గురువు): ఓం ఐం క్లీం సౌః పరమగురుం పూజయామి ।
- పరమగురువుకి గురువు: ఆ గురువు ఎవరో తెలియకపోతే శ్రీ బాల త్రిపురసుందరీ దేవిని పూజించవచ్చును. ఓం ఐం క్లీం సౌః పరమేష్ఠి గురుం పూజయామి ।
- ఆది గురువు - పరమేశ్వరుడు: ఓం ఐం క్లీం సౌః పరాత్పర గురుం పూజయామి ।
- దక్షిణ (కుడి భాగము): లం పూజయామి । ఓం ఐం క్లీం సౌః దక్షిణేవ పురతః స్వధర్మం పూజయామి । అమ్మవారికి కుడివైపున (దక్షిణ భాగంలో) 'స్వధర్మం' (సాధకుడి ధర్మం/కర్తవ్యం) అనే శక్తికి మరియు 'ఆదిదేవునికి' (పరమ శివుడు) అక్షతలు సమర్పించాలి.
- వామ (ఎడమ భాగము): ఓం ఐం క్లీం సౌః త్రికోణాద్బహిర్వామభాగే మృత్యుం పూజయామి । మాహిషం పూజయామి । త్రికోణానికి వెలుపల ఎడమ భాగంలో కాల శక్తిని, దానికి వాహనమైన మహిషానికి (ఎద్దు) అక్షతలు సమర్పించాలి.
- త్రికోణ మధ్య భాగము: త్రిభుజం మధ్యలో అక్షతలు సమర్పించాలి అథ త్రికోణ మధ్యే - ఓం ఐం క్లీం సౌః మహాకాళీం పూజయామి ।
- దక్షిణ (కుడి భాగము): అథ దక్షిణభాగే ఓం ఐం క్లీం సౌః ఆదిదేవం పరమశివేన పూజయామి । త్రికోణానికి కుడి వైపున అక్షతలు సమర్పించాలి.
- వామ (ఎడమ భాగము): అథ వామభాగే ఓం ఐం క్లీం సౌః మహాలక్ష్మీం పూజయామి । త్రికోణానికి ఎడమవైపున అక్షతలు సమర్పించాలి.
- కేంద్ర బిందువు: ఆనయోర్మధ్యే ఓం ఐం క్లీం సౌః మహాసరస్వతీం (మహా త్రిపుర సుందరీం) పూజయామి । మహాకాళీ, మహాలక్ష్మీ మధ్యలో (బిందువు) అక్షతలు సమర్పించాలి.
ఇతి శ్రీ చక్ర పీఠ పూజ.
దేవీ ఆవాహన: ఈ క్రింది మంత్రాన్ని పఠించి శ్రీ చక్రానికి (లేదా అమ్మవారి ఫోటో వద్ద) అక్షతలు సమర్పించాలి. ఓం ఐం క్లీం సౌః శ్రీ పంచబ్రహ్మాసనోపరి సదాశివమయ మహాఫలకే అనేకశక్తి సంవృతాయై శ్రీ మహాకాళీ, మహాలక్ష్మీ, మహాసరస్వతీ, శ్రీ చక్ర త్రిపురా స్వరూపిణీ (శ్రీ బాల త్రిపుర సుందరీ దేవి, శ్రీ శుభంకరి, శ్రీ లలితా త్రిపుర సుందరీ) (దేవినరాత్రి అయితే నవరాత్రీ దేవతాయై) దేవతాయై నమః । పాఠ్యం ఓం శ్రీ చక్ర త్రిపురాయై నమః । అస్మిన్ యంత్రే శ్రీ చక్ర త్రిపురా దేవతా సహిత సర్వ ఆవహిత దేవతా నవ చక్ర దేవతాః ఆవాహయామి స్థాపయామి పూజయామి । తతః ప్రాణ ప్రతిష్ఠాపనం కరిష్యే ।। ప్రాణప్రతిష్ఠా మహామంత్రం: శ్రీ చక్రమును మనసులో ధ్యానించాలి. ప్రాణప్రతిష్ఠ: ఓం అసునీతే పునరస్మాసు చక్షుః పునః ప్రాణమిహ నో ధేహి భోగమ్। జ్యోక్పశ్యేమ సూర్యముచ్చరంత మనుమతే మృడయా నః స్వస్తి।। అమృతం వై ప్రాణా అమృతమాపః ప్రాణానేవ యథాస్థానముపహ్వయతే।। శ్రీ చక్ర త్రిపురా దేవతా సహిత నవ చక్ర దేవతాః। స్థాపితాః భవంతు । ఆవాహితాః భవంతు। సుముఖాః భవంతు సుప్రసన్నాః భవంతు। మమాభిముఖాః భవంతు మీ చేతులు దోసిలిలా పెట్టి మీ వైపు తిప్పుకోవాలి స్థిరాసనం కురుత। స్వామిన్ సర్వ జగన్నాథ యావత్పూజాఽవసానకమ్। తావత్త్వం ప్రీతి భావేన యంత్రేఽస్మిన్ సన్నిధిం కురుత।। రెండు తమపాకులు కుడి చేతితో తల్లక్రిందులుగా శ్రీ చక్ర యంత్రంపై ఉంచుతూ ఈ మంత్రం చదవాలి. ధ్యానం - స్థాపన ముద్రా నమస్కారం: రెండు చేతులను బోర్లించి (అరచేతులు కిందకు ఉండేలా), రెండు బొటనవేళ్లను లోపలికి మడిచి, మిగిలిన వేళ్లను ఒకదానితో ఒకటి కలిపి ఉంచడాన్ని 'స్థాపన ముద్ర' అంటారు. ఓం ఐం క్లీం సౌః శ్రీ లలితా త్రిపురసుందరీ దేవ్యై నమః సౌః క్లీం ఐం ఓం।। ఓం శ్రీ చక్ర త్రిపురా యై నమః అమ్మవారికి స్థాపన ముద్ర వేస్తూ నమస్కారం చేయాలి. ఓం శ్రీ చక్ర త్రిపురాయై నమః । ధ్యాయామి। ధ్యానం సమర్పయామి। అమ్మవారిని మనసులో ధ్యానించాలి. ఆవాహనం: ఓం ఐం క్లీం సౌః శ్రీ లలితా త్రిపురసుందరీ దేవ్యై నమః ।। ఓం శ్రీ చక్ర త్రిపురాయై నమః । ఆవాహయామి। ఆవాహనం సమర్పయామి। అమ్మవారిని మనసారా ఆహ్వానించాలి. ఆసనం: ఓం ఐం క్లీం సౌః శ్రీ లలితా త్రిపురసుందరీ దేవ్యై నమః ।। ఓం శ్రీ చక్ర త్రిపురాయై నమః । నవరత్నఖచిత సింహాసనం సమర్పయామి। అమ్మవారికి పుష్పాలను సమర్పించాలి. పాద్యం: ఓం ఐం క్లీం సౌః శ్రీ లలితా త్రిపురసుందరీ దేవ్యై నమః ।। ఓం శ్రీ చక్ర త్రిపురాయై నమః । పాదయోః పాద్యం సమర్పయామి। అమ్మవారి పాదాలు (శ్రీ చక్ర చతురస్ర భాగమును) కడగాలి. అర్ఘ్యం: ఓం ఐం క్లీం సౌః శ్రీ లలితా త్రిపురసుందరీ దేవ్యై నమః ।। ఓం శ్రీ చక్ర త్రిపురాయై నమః । హస్తయోః అర్ఘ్యం సమర్పయామి। కలశంలో ఉన్న పుష్పంతో కానీ లేదా ఉద్ధరణితో కానీ నీరు తీసుకొని అమ్మవారికి చూపించి అర్ఘ్య పాత్రలో చల్లాలి/వదలాలి. ఆచమనం: ఓం ఐం క్లీం సౌః శ్రీ లలితా త్రిపురసుందరీ దేవ్యై నమః ।। ఓం శ్రీ చక్ర త్రిపురాయై నమః ।। ముఖే ఆచమనీయం సమర్పయామి। కలశంలో ఉన్న పుష్పంతో కానీ లేదా ఉద్ధరణితో కానీ నీరు తీసుకొని అమ్మవారికి చూపించి అర్ఘ్య పాత్రలో చల్లాలి/వదలాలి. పంచామృత స్నానం: జననీ! స్నానం త్వమంగీకురు | click here పంచామృతాలతో అమ్మవారిని అభిషేకించాలి. శుద్ధోదకస్నానం: ఓం ఐం క్లీం సౌః శ్రీ లలితా త్రిపురసుందరీ దేవ్యై నమః ।। కలశంలో ఉన్న పుష్పంతో కానీ లేదా ఉద్ధరణితో కానీ నీరు తీసుకొని అమ్మవారికి అభిషేకం చేయాలి. ఓం శ్రీ చక్ర త్రిపురాయై నమః । శుద్ధోదక స్నానం సమర్పయామి। స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి। వస్త్రం: ఓం ఐం క్లీం సౌః శ్రీ లలితా త్రిపురసుందరీ దేవ్యై నమః ।। ఓం శ్రీ చక్ర త్రిపురాయై నమః । వస్త్రయుగ్మం సమర్పయామి। వస్త్రార్ధం అక్షతాన్ సమర్పయామి। పవిత్రమైన వస్త్రాన్ని లేదా అక్షింతలు సమర్పించాలి. ఆభరణం: ఓం ఐం క్లీం సౌః శ్రీ లలితా త్రిపురసుందరీ దేవ్యై నమః ।। ఓం శ్రీ చక్ర త్రిపురాయై నమః । దివ్యాభరణాని సమర్పయామి । ఆభరణార్థం అక్షతాన్ సమర్పయామి । అమ్మవారికి యజ్ఞోపవీతం లేదా అక్షింతలు సమర్పించాలి. గంధం: ఓం ఐం క్లీం సౌః శ్రీ లలితా త్రిపురసుందరీ దేవ్యై నమః ।। ఓం శ్రీ చక్ర త్రిపురాయై నమః । శ్రీ గంధాది పరిమళ ద్రవ్యం సమర్పయామి। అమ్మవారికి గంధం మరియు కుంకుమ పెట్టాలి. లఘు నవావరణ పూజ (కుంకుమార్చన): శ్రీచక్రంలోని 9 ఆవరణల వద్ద కుంకుమ సమర్పించాలి.ఆవరణము తెలియడానికి టేబుల్ చుడండి| ఆవరణ | ఆవరణ నామము | స్వరూపము |
|---|---|---|
| 1 | త్రైలోక్య మోహన చక్రమ్ | 3 చతురస్రాలు, వృత్తము |
| 2 | సర్వాశా పరిపూరక చక్రమ్ | షోడశ (16) దళాల పద్మం |
| 3 | సర్వ సంక్షోభణ చక్రమ్ | అష్ట (8) దళాల పద్మం |
| 4 | సర్వ సౌభాగ్యదాయక చక్రమ్ | చతుర్దశ (14) త్రికోణాలు |
| 5 | సర్వార్థ సాధక చక్రమ్ | దశ (10) త్రికోణాలు |
| 6 | సర్వ రక్షాకర చక్రమ్ | దశ (10) త్రికోణాలు |
| 7 | సర్వ రోగహర చక్రమ్ | అష్ట (8) త్రికోణాలు |
| 8 | సర్వ సిద్ధిప్రద చక్రమ్ | త్రికోణం |
| 9 | సర్వానందమయ చక్రమ్ | బిందువు |
- ప్రథమ ఆవరణం: ఓం ఐం క్లీం సౌః శ్రీ త్రైలోక్య మోహన చక్రేశ్వరి త్రిపురా మహాదేవ్యై నమః ।। ఓం ఐం క్లీం సౌః శ్రీ ప్రకట యోగిన్యై నమః ।।
- ద్వితీయ ఆవరణం: ఓం ఐం క్లీం సౌః శ్రీ సర్వాశా పరిపూరక చక్రేశ్వరి త్రిపురేశీ మహాదేవ్యై నమః ।। ఓం ఐం క్లీం సౌః శ్రీ గుప్త యోగిన్యై నమః ।।
- తృతీయ ఆవరణం: ఓం ఐం క్లీం సౌః శ్రీ సర్వసంక్షోభణ చక్రేశ్వరి త్రిపుర సుందరీ మహాదేవ్యై నమః ।। ఓం ఐం క్లీం సౌః శ్రీ గుప్తతర యోగిన్యై నమః ।।
- చతుర్థ ఆవరణం: ఓం ఐం క్లీం సౌః శ్రీ సర్వ సౌభాగ్య దాయక చక్రేశ్వరి త్రిపురవాసినీ మహాదేవ్యై నమః ।। ఓం ఐం క్లీం సౌః శ్రీ సంప్రదాయ యోగిన్యై నమః ।।
- పంచమ ఆవరణం: ఓం ఐం క్లీం సౌః శ్రీ సర్వార్థ సాధక చక్రేశ్వరి త్రిపురాశ్రీ మహాదేవ్యై నమః ।। ఓం ఐం క్లీం సౌః శ్రీ కులోత్తీర్ణ యోగిన్యై నమః ।।
- షష్టమ ఆవరణం: ఓం ఐం క్లీం సౌః శ్రీ సర్వ రక్షాకర చక్రేశ్వరి త్రిపురమాలినీ మహాదేవ్యై నమః ।। ఓం ఐం క్లీం సౌః శ్రీ నిగర్భ యోగిన్యై నమః ।।
- సప్తమ ఆవరణం: ఓం ఐం క్లీం సౌః శ్రీ సర్వ రోగహర చక్రేశ్వరి త్రిపురా సిద్ధాంబా మహాదేవ్యై నమః ।। ఓం ఐం క్లీం సౌః శ్రీ రహస్య యోగిన్యై నమః ।।
- అష్టమ ఆవరణం: ఓం ఐం క్లీం సౌః శ్రీ సర్వ సిద్ధిప్రద చక్రేశ్వరి త్రిపురాంబా మహాదేవ్యై నమః ।। ఓం ఐం క్లీం సౌః శ్రీ అతిరహస్య యోగిన్యై నమః।। ।।
- నవమ ఆవరణం: ఓం ఐం క్లీం సౌః శ్రీ శ్రీ మహా భట్టారికాయై నమః ।। ఓం ఐం క్లీం సౌః శ్రీ సర్వానందమయ చక్రేశ్వరి మహాత్రిపురసుందరీ మహాదేవ్యై నమః ।। ఓం ఐం క్లీం సౌః శ్రీ పరాపర రహస్య యోగిన్యై నమః ।।