| బాలిక వయస్సు |
కుమారి పేరు |
పూజా ఫలము |
| 2 సంవత్సరాలు |
కుమారి |
దారిద్య్ర నాశనం, దీర్ఘాయుర్వృద్ధి |
| 3 సంవత్సరాలు |
త్రిమూర్తి |
ధన ధాన్య సంవృద్ధి |
| 4 సంవత్సరాలు |
కల్యాణి |
సర్వ సౌఖ్యం, విద్య లాభము, సర్వత్రా విజయము |
| 5 సంవత్సరాలు |
రోహిణి |
ఆరోగ్య ప్రాప్తి, రోగ నివారణ |
| 6 సంవత్సరాలు |
కాళిక |
త్రు బాధల నివారణ, కోర్టు కేసులు లేదా పోటీల్లో విజయం. |
| 7 సంవత్సరాలు |
చండిక |
అష్టైశ్వర్య సిద్ధి, దుష్ట పీడా నివారణ |
| 8 సంవత్సరాలు |
శాంభవి |
సకల విఘ్నముల నివారణ |
| 9 సంవత్సరాలు |
దుర్గ |
కష్టాల నుండి విముక్తి |
| 10 సంవత్సరాలు |
సుభద్ర |
కుటుంబ సౌఖ్యం, సర్వ మంగళ ప్రాప్తి. |
సుహాసినీ (కన్యా) పూజ
దుర్గా (దేవీ) నవరాత్రులలో కన్యా పూజకు విశేష ప్రాధాన్యత ఉంది. 2 ఏళ్ల నుండి 10 ఏళ్ల లోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి వారిని పూజిస్తారు.
ఆచమ్య‐ప్రాణానాచమ్య‐నేత్రాచమ్య:
ఇప్పుడు ఆచమన పాత్ర లోని నీటిని ఉంగరం వ్రేలితో కళ్ళకు అద్దుకొని, ఉద్ధరిణిలో తీసుకొని ఒక్కో నామం చెపుతూ మూడు మార్లు తాగవలెను.
ఇప్పుడు ఆచమన పాత్ర లోని నీటిని ఉంగరం వ్రేలితో కళ్ళకు అద్దుకొని, ఉద్ధరిణిలో తీసుకొని ఒక్కో నామం చెపుతూ మూడు మార్లు తాగవలెను.
ఓం ఐం ఆత్మతత్త్వం శోధయామి నమః స్వాహా
ఓం క్లీం విద్యాతత్త్వం శోధయామి నమః స్వాహా
ఓం సౌః శివతత్త్వం శోధయామి నమః స్వాహా
ఓం ఐం క్లీం సౌః సర్వతత్వం శోధయామి నమః స్వాహా
హస్తం ప్రక్షాల్య
చేయి కడగండి
సంకల్పము:
ఇప్పుడు కుడిచేతిలో అక్షతలు తీసుకుని, అక్షతలను నీటితో అర్ఘ్యపాత్రలో వదలాలి.
పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ ।
అస్మాకం సకుటుంబానాం క్షేమ స్థైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ।
శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణీ నవరాత్రీ దేవతాభ్యో నమః ।
శ్రీ దుర్గా నవరాత్ర పూజా సాంగతా సిద్ధ్యర్థం ।
యథాశక్తి కుమారీ (సుహాసినీ, కన్యా) పూజాం కరిష్యే ।।
కన్యా ఉపవేశనం & పాద ప్రక్షాళనం:
కుమారీం పీఠే ఉపవేశ్య - పాదౌ ప్రక్షాళ్య ।
పాదయోః హరిద్రాం విలిప్య ।।
బాలికను (కన్యను) పీఠంపై కూర్చుండబెట్టి, ఆమె పాదాలను నీటితో కడిగి, తుడిచి, ఆ పాదాలకు పసుపు అద్దాలి. ఆపై కుంకుమతో అలంకరించాలి.
కన్యా షోడశోపచార పూజ
శాస్త్ర నియమం ప్రకారం, కన్యా పూజలో బాలిక వయస్సును బట్టి ఆమెను ఆ దేవతా రూపంగా (కుమారి, చండిక మొదలైన పేర్లతో) పిలుస్తూ పూజించాలి. ఒకవేళ విడివిడిగా పేర్లు తెలియకపోతే, ప్రధాన ఆవాహన మంత్రంతో అందరినీ ఆహ్వానించవచ్చు.
తత్తత్ వయోధిక కన్యా మంత్రోక్త నామ్నా షోడశోపచార పూజాం కుర్యాత్ ।।
నావానాం కన్యా నామావాహన మంత్రః ।।
అనే నైన మంత్రేణ పూర్వక సర్వకన్యా నామావాహనమ్।।
కన్యా పూజ ప్రారంభించే ముందు, బాలికను పీఠంపై కూర్చుండబెట్టి ఈ మంత్రంతో అమ్మవారిని ఆమెలోకి ఆహ్వానించాలి.
కన్యా ఆవాహన మంత్రం:
అమ్మవారిని ధ్యానిస్తూ కన్యపై అక్షతలు చల్లాలి.
మంత్రాక్షరమయీం లక్ష్మీం మాతృకావర్ణ రూపిణీమ్ ।
నవదుర్గాత్మికాం సాక్షాత్ కన్యామావాహయామ్యహమ్ ।।
మంత్రాక్షర స్వరూపిణి, వర్ణమాలలోని అక్షరాల రూపంలో ఉండే లక్ష్మి, నవదుర్గల స్వరూపమైన ఈ కన్యను నేను ఆవాహన చేస్తున్నాను.
ద్వివర్షా (2 ఏళ్ల బాలిక) - "కుమారీ" పూజ:
ద్వివర్షా (కుమారీ నామ్నీ) తస్యా మంత్రః
కుమారస్య చ తత్వాని యా సృజత్యపి లీలియా ।
శక్రాదీంశ్చ దేవాంస్తాన్ కుమారీం పూజయామ్యహమ్ ।।
ఈ మంత్రం చదువుతూ కన్య పాదాలకు గంధం, కుంకుమ సమర్పించాలి.
త్రివర్షా (3 ఏళ్ల బాలిక) - "త్రిమూర్తి" పూజ:
త్రివార్షికా (త్రిమూర్తి నామ్నీ) తస్యాః మంత్రః
సత్వాదిభిస్త్రి మూర్తిర్యా దేవీ నానా రూపధరా తథా ।
త్రికాలవ్యాపినీ శక్తిః స్త్రీ మూర్తిం పూజయామ్యహమ్ ।।
ఈ మంత్రం చదువుతూ సత్త్వ, రజ, తమో గుణాల స్వరూపిణి అయి, త్రికాలాలను (భూత, వర్తమాన, భవిష్యత్) శాసించే శక్తి స్వరూపిణి అయిన త్రిమూర్తిని నేను పూజిస్తున్నాను అని భవిస్తూ
కన్యకు పుష్పాలు, అక్షతలు సమర్పించి నమస్కరించాలి.
చతుర్వర్షా (4 ఏళ్ల బాలిక) - "కల్యాణీ" పూజ:
చతుర్వర్ణా (కల్యాణి నామ్నీ) తస్యా, మంత్రః.
కల్యాణకారిణీం నిత్యం భక్తైః సంపూజితామ్ అనిశమ్ ।
పూజయామి చ తాం భక్త్యా కల్యాణీం సర్వకామదామ్ ।।
ఈ మంత్రం చదువుతూ సకల కార్యాలలో విజయాన్ని ప్రసాదించే శక్తి స్వరూపిణి అయిన ఈ 'కల్యాణి' అనే కన్యను నేను భక్తితో పూజిస్తున్నాను అని భవిస్తూ
4 ఏళ్ల బాలికకు గంధం, పుష్పాలు సమర్పించి, నూతన వస్త్రాలు లేదా గాజులు కానుకగా ఇవ్వాలి.
పంచవర్షా (5 ఏళ్ల బాలిక) - "రోహిణీ" పూజ:
పంచవర్షా (రోహిణీ నామ్నీ) తస్యాః మంత్రః
రోహయంతి చ బీజాని ప్రాగ్జన్మ సంచితానివై।
యా దేవీ సర్వభూతానాం రోహిణీం పూజయామ్యహమ్ ।।
ఈ మంత్రం చదువుతూ సమస్త ప్రాణకోటికి పూర్వజన్మ పుణ్యం కొలదీ శుభ ఫలములనిస్తూ వారికీ వృద్ధిని,
సంవృద్ధిని కలిగించే శక్తి స్వరూపిణి అయిన 'రోహిణి'ని నేను పూజిస్తున్నాను అనే భావన చేస్తూ గంధం పుష్పాలు సమర్పించి పండ్లు, ధన్యములు ఇవ్వాలి.
షడ్వర్షా (6 ఏళ్ల బాలిక) - "కాళికా" పూజ:
షడ్వర్షా (కాళికా నామ్నీ) తస్యాః మంత్రః
కాళయతి చ సర్వం వై బ్రహ్మాండం సచరాచరమ్ ।
కల్పాంత సమయే యా తాం కాళికాం పూజయామ్యహమ్ ।।
ఈ మంత్రం చదువుతూ ప్రళయ కాలంలో (కల్పాంత సమయే) ఈ చరాచర బ్రహ్మాండాన్నంతటినీ తనలో లీనం చేసుకునే మహాశక్తి స్వరూపిణి అయిన 'కాళికా' దేవిని ఈ బాలికా రూపంలో నేను పూజిస్తున్నాను
అనే భావన చేస్తూ ఎరుపువర్ణ పుష్పాలను (ముఖ్యంగా మందార పూలు) సమర్పించాలి. ఈమెకు ఎరుపు రంగు వస్త్రం లేదా గాజులను కానుకగా ఇవ్వాలి.
సప్తవర్షా (7 ఏళ్ల బాలిక) - "చండికా" పూజ:
సప్తవర్షా (చండికా నామ్నీ) తస్యాః మంత్రః
చండముండహరాం దేవీం చండపాపవినాశినీమ్ ।
చండికాం చండరూపాం చ చండికాం పూజయామ్యహమ్ ।।
ఈ మంత్రం చదువుతూ చండముండులనే రాక్షసులను సంహరించినది, భయంకరమైన పాపాలను సైతం నశింపజేసేది మరియు ఉగ్రమైన శక్తి స్వరూపం కలిగిన ఆ చండికా దేవిని ఈ బాలికా రూపంలో నేను పూజిస్తున్నాను
అనే భావన చేస్తూ గంధం, పుష్పాలు సమర్పించి, పండ్లు లేదా మిఠాయిలు కానుకగా ఇవ్వాలి.
అష్టవర్షా (8 ఏళ్ల బాలిక) - "శాంభవీ" పూజ:
అష్టవర్షా (శాంభవీ నామ్నీ) తస్యాః మంత్రః
అకారణాత్ సముత్పత్తిః యస్యాశ్చైవ ప్రకీర్తితా ।
యస్యాస్తాం సుఖదాం దేవీం శాంభవీం పూజయామ్యహమ్ ।।
ఈమె సాక్షాత్తు శంభుని (శివుని) శక్తి. ఈ మంత్రం చదువుతూ ఎటువంటి కారణం లేకుండానే (స్వయంభువుగా) ఉద్భవించినదిగా కీర్తింపబడేది, భక్తులకు సుఖాన్ని ప్రసాదించే శక్తి స్వరూపిణి అయిన 'శాంభవి'ని నేను పూజిస్తున్నాను
అనే భావన చేస్తూ గంధం, పుష్పాలు సమర్పించి, నూతన వస్త్రాలు (బట్టలు) సమర్పించాలి. కానుకగా ఇవ్వాలి.
అష్టవర్షా (8 ఏళ్ల బాలిక) - "శాంభవీ" పూజ:
అష్టవర్షా (శాంభవీ నామ్నీ) తస్యాః మంత్రః
అకారణాత్ సముత్పత్తిః యస్యాశ్చైవ ప్రకీర్తితా ।
యస్యాస్తాం సుఖదాం దేవీం శాంభవీం పూజయామ్యహమ్ ।।
ఈమె సాక్షాత్తు శంభుని (శివుని) శక్తి. ఈ మంత్రం చదువుతూ ఎటువంటి కారణం లేకుండానే (స్వయంభువుగా) ఉద్భవించినదిగా కీర్తింపబడేది, భక్తులకు సుఖాన్ని ప్రసాదించే శక్తి స్వరూపిణి అయిన 'శాంభవి'ని నేను పూజిస్తున్నాను
అనే భావన చేస్తూ గంధం, పుష్పాలు సమర్పించి, నూతన వస్త్రాలు (బట్టలు) సమర్పించాలి. కానుకగా ఇవ్వాలి.
నవవర్షా (9 ఏళ్ల బాలిక) - "దుర్గా" పూజ:
నవవర్షా (దుర్గానామ్నీ) తస్యాః మంత్రః
దుర్గమాత్ త్రాయతే భక్తాన్ సదా దుర్గతి నాశినీ ।
దుర్లభా సర్వదేవానాం తాం దుర్గాం పూజయామ్యహమ్ ।।
కష్టాల నుండి భక్తులను రక్షించేది, దుర్గతులను (చెడు స్థితిని) నాశనం చేసేది మరియు దేవతలకు సైతం లభించని (దుర్లభమైన) పరాశక్తి స్వరూపిణి అయిన 'దుర్గ'ను నేను పూజిస్తున్నాను
అనే భావన చేస్తూ గంధం, పుష్పాలు సమర్పించి, భోజనము మరియు పిండివంటలు (ముఖ్యంగా గారెలు లేదా పరమాన్నం) తృప్తిగా పెట్టాలి,పండ్లు ప్రసాదంగా ఇవ్వాలి.
దశవర్షా (10 ఏళ్ల బాలిక) - "సుభద్రా" పూజ:
ధశవర్షా (సుభద్రా నామ్నీ) తస్యాః మంత్రః
సుభద్రాణి చ భక్తానాం కురుతే పూజితా సదా ।
అభద్రనాశినీం దేవీం సుభద్రాం పూజయామ్యహమ్ ।।
అమంగళాలను మంగళాలుగా చేసి శుభమును ప్రసాదించే ఆ సుభద్రను నేను పూజిస్తున్నాను
అనే భావన చేస్తూ గంధం, పుష్పాలు సమర్పించి, తాంబూలము (ఆకు, వక్క), దక్షిణ (డబ్బులు) ఇచ్చి నమస్కరించాలి.
ఈమె ఆశీర్వాదం తీసుకోవడం వల్ల కుటుంబంలో అశుభాలు తొలగి, సర్వ మంగళాలు సిద్ధిస్తాయి.
ఏకవర్షా కన్యా పూజానిషేధమ్ (శ్రీదేవీభాగవతే):
ఏకవర్షా కన్యా పూజానిషేధమ్ (శ్రీవ్యాస ఉవాచ)
ఏకవర్షా న కర్తవ్యా కన్యా పూజా విధౌ నృప ।
అస్వాద్యా హి భోగానాం గంధాదీనాం చ బాలికా ।।
ఓ రాజా! కన్యా పూజ చేసేటప్పుడు ఒక సంవత్సరం వయసున్న చిన్నారిని పూజకు ఎంపిక చేయకూడదు.
ఎందుకంటే, ఆ వయసున్న పాపకు మనం సమర్పించే గంధం, పూలు, అలంకారాలు, నైవేద్యాల యొక్క విశిష్టత గానీ, వాటి సువాసన/రుచిని ఆస్వాదించే గ్రహణ శక్తి గానీ ఉండదు.
పుష్పసమర్పణం:
ఈ మంత్రాలు పఠిస్తూ ఆయా కన్యలకు పూలమాల లేదా ఎరుపు రంగు పుష్పములు సమర్పించాలి.
ఓం ఐం క్లీం సౌః శ్రీ లలితా త్రిపురసుందరీ దేవ్యై నమః
నానా విధ పరిమళ పత్ర పుష్పాక్షతాన్ సమర్పయామి।
ధూపం:
ఓం ఐం క్లీం సౌః శ్రీ లలితా త్రిపురసుందరీ స్వరూపిణి శ్రీ దశ కన్యా దేవతాయై నమః ।।
ఓం ఐం క్లీం సౌః శ్రీ లలితా త్రిపురసుందరీ స్వరూపిణి శ్రీ దశ కన్యా దేవతాయై నమః ।। ధూపమాఘ్రాపయామి।।
అగరుబత్తులు వెలిగించి ఘంటా మోగిస్తూ ఆయా కన్యలకు చూపించాలి
దీపం:
ఓం ఐం క్లీం సౌః శ్రీ లలితా త్రిపురసుందరీ స్వరూపిణి శ్రీ దశ కన్యా దేవతాయై నమః ।।
ఓం ఐం క్లీం సౌః శ్రీ లలితా త్రిపురసుందరీ స్వరూపిణి శ్రీ దశ కన్యా దేవతాయై నమః ।। దీపం దర్శయామి।।
ధుపా దీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి।।
దీపానికి నమస్కారం చేయాలి
నైవేద్యం:
నైవేద్యం షడ్రసోపేతం ఘృత భక్ష్య సమన్వితం।
భక్త్యా తే సంప్రదాస్యామి గృహాణ పరమేశ్వర।।
ఓం భూర్భువస్సువః । తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ।
ధియో యో నః ప్రచోదయాత్ । దేవ సవితః ప్రసువః ।
సత్యం త్వర్తేన పరిషించామి ।
(సాయంకాలం అయితే ‐ఋతం త్వా సత్యేన పరిషించామి)
అమృతం అస్తు । అమృతోపస్తరణమసి ।
ఓం ప్రాణాయ స్వాహా । ఓం అపానాయ స్వాహా ।
ఓం వ్యానాయ స్వాహా । ఓం ఉదానాయ స్వాహా ।
ఓం సమానాయ స్వాహా । ఓం బ్రహ్మణే స్వాహా ।
మధు వాతా ఋతాయతే మధు క్షరంతి సింధవః ।
మాధ్వీర్నః సంత్వోషధీః ।
మధు నక్త ముతోషసి మధుమత్ పార్థివగ్ం రజః ।
మధు ద్యౌరస్తు నః పితా ।
మధుమాన్నో వనస్పతిర్ మధుమాగ్ం అస్తు సూర్యః ।
మాధ్వీర్గావో భవంతు నః ।। మధు మధు మధు ।।
ఆవాహితాభ్యః సర్వాభ్యో దేవతాభ్యో నమః ।
ఓం ఐం క్లీం సౌః శ్రీ లలితా త్రిపురసుందరీ స్వరూపిణి శ్రీ దశ కన్యా దేవతాయై నమః ।। మహానైవేద్యం నివేదయామి ।।
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి ।
అమృతాపిధానమసి । ఉత్తరాపోశనం సమర్పయామి ।
హస్తౌ ప్రక్షాళయామి । పాదౌ ప్రక్షాళయామి ।
శుద్ధాచమనీయం సమర్పయామి ।।
ఆయా కన్యలకు ప్రీతికరమైన ఆహారం, పండ్లు లేదా ప్రసాదం సమర్పించాలి.
కరోద్వర్తనం:
ఓం ఐం క్లీం సౌః శ్రీ లలితా త్రిపురసుందరీ స్వరూపిణి శ్రీ దశ కన్యా దేవతాయై నమః ।।
ఓం ఐం క్లీం సౌః శ్రీ లలితా త్రిపురసుందరీ స్వరూపిణి శ్రీ దశ కన్యా దేవతాయై నమః ।।
కరోద్వర్తనం సమర్పయామి ।
కలశములోని పుష్పముతో నీరు చల్లాలి.
తాంబూలం:
ఓం ఐం క్లీం సౌః శ్రీ లలితా త్రిపురసుందరీ స్వరూపిణి శ్రీ దశ కన్యా దేవతాయై నమః ।।
ఓం ఐం క్లీం సౌః శ్రీ లలితా త్రిపురసుందరీ స్వరూపిణి శ్రీ దశ కన్యా దేవతాయై నమః ।। తాంబూలం సమర్పయామి ।।
తాంబూల చర్వణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి।
ఆయా కన్యలకు రెండు తమలపాకులు తొనలు ఆకుల కొసలు ఉత్తరం వైపు ఉన్నట్లుగా పెట్టి అందులో వక్కలు వేసి దైవానికి సమర్పించాలి.
నీరాజనం:
ఓం ఐం క్లీం సౌః శ్రీ లలితా త్రిపురసుందరీ స్వరూపిణి శ్రీ దశ కన్యా దేవతాయై నమః ।।
ఓం ఐం క్లీం సౌః శ్రీ లలితా త్రిపురసుందరీ స్వరూపిణి శ్రీ దశ కన్యా దేవతాయై నమః ।। కర్పూర నీరాజనం సమర్పయామి ।।
నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి
ఆయా కన్యలకు కర్పూర హారతి ఇవ్వాలి.
మంత్రపుష్పం:
ఓం వాగీశ్వర్యై చ విద్మహే కామేశ్వర్యై చ ధీమహి ।
తన్నో దేవీ ప్రచోదయాత్ ।।
ఓం కాత్యా॒య॒నాయ వి॒ద్మహే కన్యకు॒మారి॑ ధీమహి।
తన్నో దుర్గిః ప్రచో॒దయాత్।।
ఓం ఐం క్లీం సౌః శ్రీ లలితా త్రిపురసుందరీ స్వరూపిణి శ్రీ దశ కన్యా దేవతాయై నమః ।। పాదారవిందయోః సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి ।
ఆయా కన్యలకు పుష్పాలను సమర్పించాలి.
ఆత్మప్రదక్షిణ నమస్కారం:
అక్షింతలు పుష్పాలు చేతిలో తీసుకొని తమ కుడివైపుకు 3 లేదా 5 మార్లు తిరుగుతూ ఆత్మప్రదక్షిణ చేయాలి. తదుపరి అక్షత పుష్పాలను సమర్పించాలి.
ఓం ఐం క్లీం సౌః శ్రీ లలితా త్రిపురసుందరీ స్వరూపిణి శ్రీ దశ కన్యా దేవతాయై నమః ।।
ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి ।।
ఉపచారపూజాః:
పునః పూజాం కరిష్యే । ఛత్రమాచ్ఛాదయామి ।
చామరైర్వీజయామి । నృత్యం దర్శయామి ।
గీతం శ్రావయామి । ఆందోళికానారోహయామి ।
అశ్వానారోహయామి । గజానారోహయామి ।
సమస్త రాజోపచార దేవోపచార భక్త్యుపచార శక్త్యుపచార మంత్రోపచార పూజాస్సమర్పయామి ।।
ఆయా కన్యలకు అక్షతలు, పుష్పములు సమర్పించాలి.
సాష్టాంగ నమస్కారం:
ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా।
పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగముచ్యతే।।
ఓం ఐం క్లీం సౌః శ్రీ లలితా త్రిపురసుందరీ స్వరూపిణి శ్రీ దశ కన్యా దేవతాయై నమః ।। సాష్టాంగ నమస్కారాం సమర్పయామి ।
క్షమాప్రార్థనా:
అపరాధసహస్రాణి క్రియన్తేऽహర్నిశం మయా।
దాసోఽయమితి మాం మత్వా క్షమస్వ పరమేశ్వరీ।।
ఆయా కన్యలకు నమస్కారం చేయాలి.
సమర్పణం:
యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు ।
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యోవందే మహేశ్వరీమ్ ।।
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వరీ ।
యత్పూజితం మయా దేవీ పరిపూర్ణం తదస్తు తే ।।
అనయా శ్రీ దుర్గ నవరాత్రోత్సవ సమయే దశ కన్యా దేవతా పూజనేన భగవతీ సర్వాత్మికా ।
శ్రీ దశ కన్యా దేవతాః సుప్రీతాః సుప్రసన్నాః వరదాః భవంతు ।
ఏతత్ఫలం శ్రీ పరమేశ్వర్యర్పణమస్తు ।।
అక్షింతలు,పుష్పాలు,జలం కుడిచేతిలో తీసుకొని అమ్మవారి పాదాల ముందు వదలాలి.
ప్రార్థన:
మాతః సముత్థిష్ఠ జగద్ధితాయ
లోకస్య శ్రేయః కురు కరుణయా ।
త్వత్పాదపద్మే ప్రణమామి నిత్యం
త్వమేవ రక్షా జగదేక మాతః ।।
ఆయా కన్యలకు నమస్కారం చేయాలి./em>
తీర్థప్రసాద గ్రహణం:
అకాలమృత్యహరణం సర్వవ్యాధినివారణం।।
సమస్తపాపక్షయకరం శ్రీ పరమేశ్వర్యంబా పాదోదకం పావనం శుభమ్।।
ఓం ఐం క్లీం సౌః శ్రీ లలితా త్రిపురసుందరీ దేవతాయై నమః ।। ప్రసాదం శీరసా గృహ్ణామి।
ఈ విధంగా (తీర్థాన్ని) మూడు సార్లు తాగిన తర్వాత, శ్రీ చక్రంపై ఉన్న పూజించిన పుష్పమును శిరస్సున ధరించాలి.
మొగవారు పూజ చేసియుంటే తమ అర్ధాంగికి ఇచ్చి శిరస్సున ధరించమని చెప్పాలి.
ఇతి శ్రీ దేవీభాగవతే మహాపురాణే నవమస్కంధే కుమారీపూజావిధిః నామ అధ్యాయః