అథ ప్రాణప్రతిష్ఠా
కరన్యాసము:
ఓం ఆం హ్రీం క్రోం । యం రం లం వం శం షం సం హం ళం క్షం । అం కం ఖం గం ఘం జం ఆం । పృథివ్యాపస్తేజోవాయురాకాశాత్మనే ।
అంగుష్ఠాభ్యాం నమః
బొటన వేళ్లను తాకాలి.
ఓం ఆం హ్రీం క్రోం । యం రం లం వం శం షం సం హం ళం క్షం । ఇం చం ఛం జం ఝం ఇం ఈం । శబ్ద స్పర్శ రూప రస గంధాత్మనే ।
తర్జనీభ్యాం నమః
చూపుడు వేళ్లను తాకాలి.
ఓం ఆం హ్రీం క్రోం । యం రం లం వం శం షం సం హం ళం క్షం । ఉం టం ఠం డం ఢం ణం ఊం । శ్రోత్ర త్వక్ చక్షుర్జిహ్వా ఘ్రాణాత్మనే ।
మధ్యమాభ్యాం నమః
మధ్య వేళ్లను తాకాలి.
ఓం ఆం హ్రీం క్రోం । యం రం లం వం శం షం సం హం ళం క్షం । ఏం తం థం దం ధం నం ఐం । వాక్ పాణి పాద పాయూపస్థాత్మనే ।
అనామికాభ్యాం నమః
ఉంగరపు వేళ్లను తాకాలి.
ఓం ఆం హ్రీం క్రోం । యం రం లం వం శం షం సం హం ళం క్షం । ఓం పం ఫం బం భం మం ఔం । బుద్ధి మనో అహంకార చిత్తాత్మనే ।
కనిష్ఠికాభ్యాం నమః
చిటికెన వేళ్లను తాకాలి.
ఓం ఆం హ్రీం క్రోం । యం రం లం వం శం షం సం హం ళం క్షం । అం యం రం లం వం శం షం సం హం ళం క్షం అః । ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానాత్మనే ।
కరతల కరపృష్ఠాభ్యాం నమః
అరచేతులు ముందు, వెనుక తాకించాలి.
అంగన్యాసము:
ఓం ఆం హ్రీం క్రోం । యం రం లం వం శం షం సం హం ళం క్షం । అం కం ఖం గం ఘం జం ఆం । పృథివ్యాపస్తేజోవాయురాకాశాత్మనే ।
హృదయాయ నమః
హృదయాన్ని తాకాలి.
ఓం ఆం హ్రీం క్రోం । యం రం లం వం శం షం సం హం ళం క్షం । ఇం చం ఛం జం ఝం ఇం ఈం । శబ్ద స్పర్శ రూప రస గంధాత్మనే ।
శిరసే స్వాహా
తలను తాకాలి.
ఓం ఆం హ్రీం క్రోం । యం రం లం వం శం షం సం హం ళం క్షం । ఉం టం ఠం డం ఢం ణం ఊం । శ్రోత్ర త్వక్ చక్షుర్జిహ్వా ఘ్రాణాత్మనే ।
శిఖాయై వషట్
శిఖను/జుట్టుముడిని తాకాలి.
ఓం ఆం హ్రీం క్రోం । యం రం లం వం శం షం సం హం ళం క్షం । ఏం తం థం దం ధం నం ఐం । వాక్ పాణి పాద పాయూపస్థాత్మనే ।
కవచాయ హుం
రెండు భుజాలను మార్చి తాకాలి.
ఓం ఆం హ్రీం క్రోం । యం రం లం వం శం షం సం హం ళం క్షం । ఓం పం ఫం బం భం మం ఔం । బుద్ధి మనో అహంకార చిత్తాత్మనే ।
నేత్రత్రయాయ వౌషట్
కళ్లను తాకాలి.
ఓం ఆం హ్రీం క్రోం । యం రం లం వం శం షం సం హం ళం క్షం । అం యం రం లం వం శం షం సం హం ళం క్షం అః । ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానాత్మనే ।
అస్త్రాయ ఫట్
తల చుట్టూ చిటిక వేస్తూ తిప్పాలి.
ఓం ఆం హ్రీం క్రోం । యం రం లం వం శం షం సం హం ళం క్షం । అం యం రం లం వం శం షం సం హం హంసః సోఽహమ్ ।
భూర్భువస్సువరోం ఇతి దిగ్బంధః
రెండు చూపుడు వెళ్ళాను లాక్ చేయాలి.
దేవీ ధ్యానమ్:
అస్యాం ప్రతిమాయామ్
శ్రీ మహాకాళి - మహాలక్ష్మి - మహాసరస్వతీ సమేత,
శ్రీ స్వర్ణకవచాలంకృత దుర్గా దేవి - శ్రీ బాలా త్రిపురసుందరీ దేవి - శ్రీ గాయత్రీ దేవి - శ్రీ అన్నపూర్ణా దేవి - శ్రీ లలితా త్రిపురసుందరీ దేవి, శ్రీ మహాలక్ష్మి దేవి- శ్రీ సరస్వతీ దేవి - శ్రీ దుర్గా దేవి - శ్రీ మహిషాసుర మర్దినీ దేవి - శ్రీ రాజరాజేశ్వరీ దేవి,
ఒకవేళ నవదుర్గాలైతే
శ్రీ మహాకాళి - మహాలక్ష్మి - మహాసరస్వతీ సమేత, శైలపుత్రీ దేవి , బ్రహ్మచారిణీ దేవి, చంద్రఘంటా దేవి, కూష్మాండా దేవి, స్కందమాతా దేవి, కాత్యాయనీ దేవి, కాలరాత్రి దేవి, మహాగౌరీ దేవి, సిద్ధిదాత్రీ దేవి.
సమస్త దేవతా ప్రాణ ఇహ ప్రాణః ।
సమస్త దేవతా జీవ ఇహ స్థితః ।
సమస్త దేవతా సర్వేంద్రియాణి వాఙ్మనశ్చక్షుః శ్రోత్ర జిహ్వా ఘ్రాణ ప్రాణ ఇహైవాగత్య సుఖం చిరం తిష్ఠంతు నమః ।।
అమ్మవారికి నమస్కరించాలి.
దేహ తత్త్వ వివేచన (న్యాస విధి):
పంచ ప్రాణ స్థానములు:
ఈ మంత్రమును చదువుతూ హృదయ, మర్మ, నాభి, కంఠ స్థానములనూ స్పృశించాలి. చివరన శరీరమంతా స్పృశించాలి.
హృది ప్రాణో గుదేఽపానః సమానో నాభిసంస్థితః ।
ఉదానః కంఠదేశస్థో వ్యానః సర్వశరీరగః ।।
సృష్టి క్రమ మంత్రం (పంచభూతములు):
ఈ మంత్రమును చదువుతూ ఆకాశం నుండి భూమి వరకు సృష్టి ఎలా జరిగిందో ఊహించుకోవాలి.
ఓం పృథివ్యాపస్తేజోవాయురాకాశాత్మా । తస్మాద్వా ఏతస్మాదాత్మన ఆకాశః సంభూతః । ఆకాశాద్వాయుః । వాయోరగ్నిః ।
అగ్నేరాపః । అద్భ్యః పృథివీ । పృథివ్యా ఓషధయః । ఓషధీభ్యోఽన్నమ్ । అన్నాత్పురుషః ।।
ఈ మంత్రమును చదువుతూ నీ శరీరమంతా ఒక తేజోమయ కాంతి స్వరూపముల మారుతున్నట్లుగా భావించాలి.
ఏవం పంచమహాభూతేభ్యః సకాశాత్ స్వశరీరం తేజోమయం దేవతారాధన యోగ్యముత్పన్నమితి ధ్యాయేత్ ।।
ఆత్మ సమర్పణ - బ్రహ్మ సమర్పణ మంత్రములు:
ఈ మంత్రములు చదువుతూ హృదయము పై కుడి చేతినుంచి, ఆయా ఇంద్రియాలను ధ్యానించాలి.
మనలోని శక్తి అంతా ఒక ప్రవాహంలా మారి పరమాత్మలో కలిసిపోతున్నట్లు భావించాలి.
- వాక్కు:
ఓం వాఙ్మే ఆసన్ । అగ్నిర్మే వాచి శ్రితః । వాగ్ధృదయే । హృదయం మయి । అహమమృతే । అమృతం బ్రహ్మణి ।।
వాక్కులో అమ్మవారు కోలోవై ఉన్నట్లుగా భవిస్తూ ఆ అమ్మలా గన్న అమ్మ దుర్గమ్మను ధ్యానించాలి.
- ప్రాణము:
వాయుర్మే ప్రాణే శ్రితః । ప్రాణో హృదయే । హృదయం మయి । అహమమృతే । అమృతం బ్రహ్మణి ।।
శ్వాసలో అమ్మవారు కోలోవై ఉన్నట్లుగా భవిస్తూ ఆ అమ్మలా గన్న అమ్మ దుర్గమ్మను ఈ విధముగా ధ్యానించాలి.
శ్వాసను కుడి ముక్కు ద్వారా తీసుకొని దానిని మీ శక్తి మేరకు హృదయములో బంధించి తిరిగి ఎడమ ముక్కు ద్వారా శ్వాసను వదలాలి.
- నేత్రములు:
సూర్యో మే చక్షుషి శ్రితః । చక్షుర్హృదయే । హృదయం మయి । అహమమృతే । అమృతం బ్రహ్మణి ।।
నేత్రములలో అమ్మవారు కోలోవై ఉన్నట్లుగా భవిస్తూ ఆ అమ్మలా గన్న అమ్మ దుర్గమ్మను ధ్యానించాలి.
- మనస్సు:
చంద్రమా మే మనసి శ్రితః । మనో హృదయే । హృదయం మయి । అహమమృతే । అమృతం బ్రహ్మణి ।।
మనస్సు యందు అమ్మవారిని నిలిపి శరణాగత భావముతో ఆ అమ్మలా గన్న అమ్మ దుర్గమ్మను ధ్యానించాలి .
- చెవులు:
దిశో మే శ్రోత్రే శ్రితాః । శ్రోత్రం హృదయే । హృదయం మయి । అహమమృతే । అమృతం బ్రహ్మణి ।।
నీ చెవుల్లో అమ్మవారి నామము వినిపిస్తున్నట్లుగా భావిస్తూ 'ఓం దుర్గాయై నమః' అను నామమును ఉచ్ఛరిస్తూ
ఆ అమ్మలా గన్న అమ్మ దుర్గమ్మను ధ్యానించాలి.
రేతస్సు:
ఆపో మే రేతసి శ్రితాః । రేతో హృదయే । హృదయం మయి । అహమమృతే । అమృతం బ్రహ్మణి ।।
నీలో ఉన్న సృజనాత్మక జీవశక్తిని (రేతస్సును) ఆమె యొక్క దాన్ని అమ్మవారి ఓజస్సుతో (తేజస్సు) చేర్చి ఆమెతో నీ హృదయములో నీవు మమైకమైనట్లుగా అమ్మను ధ్యానించాలి .
ఆత్మ అనుసంధానము :
ఈ మంత్రములు చదువుతూ హృదయముపై కుడి చేతినుంచి, మన శరీరము, రోమాలు, శక్తి, శిరస్సు, దివ్య ఆవేశము, జీవాత్మ, అన్నీ ఆ జగన్మాతవే అని భావించాలి. ఇది అసలైన ప్రాణప్రతిష్ఠ.
- శరీరము-దేహము :
ఓం పృథివీ మే శరీరే శ్రితా । శరీరం హృదయే । హృదయం మయి । అహమమృతే । అమృతం బ్రహ్మణి ।।
- శరీర రోమాలు:
ఓషధి వనస్పతయో మే రోమసు శ్రితాః । లోమాని హృదయే । హృదయం మయి । అహమమృతే । అమృతం బ్రహ్మణి ।।
- శక్తి:
ఇంద్రో మే బలే శ్రితః । బలం హృదయే । హృదయం మయి । అహమమృతే । అమృతం బ్రహ్మణి ।।
- శిరస్సు:
పర్జన్యో మే మూర్ధ్ని శ్రితః । మూర్ధా హృదయే । హృదయం మయి । అహమమృతే । అమృతం బ్రహ్మణి ।।
- దైవికమైన ఆవేశము:
ఈశానో మే మన్యౌ శ్రితః । మన్యుర్హృదయే । హృదయం మయి । అహమమృతే । అమృతం బ్రహ్మణి ।।
- జీవాత్మ:
ఆత్మా మే ఆత్మని శ్రితః । ఆత్మా హృదయే । హృదయం మయి । అహమమృతే । అమృతం బ్రహ్మణి ।।
ప్రాణ శక్తి పునరుద్ధరణ - (ప్రాణ పునశ్చైతన్యం):
ఓం పునర్మ ఆత్మా పునరాయురాగాత్ ।
రెండు అరచేతులతో మన హృదయాన్ని తాకాలి.
పునః ప్రాణః పునరాకూతమాగాత్ ।
నాసిక (ముక్కు) ద్వారా గాలిని పీలుస్తూ, ఆ ప్రాణవాయువు శరీరమంతా నిండుతున్నట్లు భావించాలి.
వైశ్వానరో రశ్మిభిర్వావృధానః । అంతస్తష్ఠత్వమృతస్య గోపాః ।।
చేతులతో నేత్రాలను (కళ్లను) అద్దుకోవాలి.
ప్రధాన ప్రాణ ప్రతిష్ఠా క్రమము:
ఈ మంత్రాలూ చదువుతూ పూజ కలశంలో (పీఠం పై ఉన్న కలశం కాదు) ఉన్న తమలపాకులతో
కుడి చేతితో తల్లక్రిందులుగా అమ్మవారి శిరస్సును స్పృశిస్తూ ఈ మంత్రం చదవాలి.
ప్రాణ ప్రతిష్ఠా మంత్రం (దేవతా ఆవాహన):
ఓం అసునీతే పునరస్మాసు చక్షుః పునః ప్రాణమిహ నో దేహి భోగమ్ ।
జ్యోక్ పశ్యేమ సూర్యముచ్చరంత మనుమతే మృళయా నః స్వస్తి ।।
అమృతం వై ప్రాణా అమృతమాపః ప్రాణానేవ యథాస్థానముపహ్వయతే ।
ఓం ప్రాణదా అపానదా వ్యానదా వర్చోదా వరివోదాః । అన్యత్రతే అస్మత్తపంతు హేతయః పావకో అస్మభ్యం శివో భవ ।।
ఓం ఆం హ్రీం క్రోం । యం రం లం వం శం షం సం హం ళం క్షం । అం యం రం లం వం శం షం సం హం హంసః సోఽహమ్ ।
శ్రీ మహాకాళి - మహాలక్ష్మి - మహాసరస్వతీ సమేత,
శ్రీ స్వర్ణకవచాలంకృత దుర్గా దేవి - శ్రీ బాలా త్రిపురసుందరీ దేవి - శ్రీ గాయత్రీ దేవి - శ్రీ అన్నపూర్ణా దేవి - శ్రీ లలితా త్రిపురసుందరీ దేవి, శ్రీ మహాలక్ష్మి దేవి- శ్రీ సరస్వతీ దేవి - శ్రీ దుర్గా దేవి - శ్రీ మహిషాసుర మర్దినీ దేవి - శ్రీ రాజరాజేశ్వరీ దేవి,
ఒకవేళ నవదుర్గాలైతే
శ్రీ మహాకాళి - మహాలక్ష్మి - మహాసరస్వతీ సమేత, శ్రీ శైలపుత్రీ దేవి, శ్రీ బ్రహ్మచారిణీ దేవి, శ్రీ చంద్రఘంటా దేవి, శ్రీ కూష్మాండా దేవి, శ్రీ స్కందమాతా దేవి, శ్రీ కాత్యాయనీ దేవి, శ్రీ కాలరాత్రి దేవి, శ్రీ మహాగౌరీ దేవి, శ్రీ సిద్ధిదాత్రీ దేవి.
సమస్త దేవతా ప్రాణ ఇహ ప్రాణః । దేవ్యాః జీవ ఇహ స్థితః । దేవ్యాః సర్వేంద్రియాణి వాఙ్మనశ్చక్షుః శ్రోత్ర జిహ్వా ఘ్రాణ ప్రాణ ఇహైవాగత్య సుఖం చిరం తిష్ఠంతు స్వాహా ।।
ప్రాణశక్తి ధ్యాన శ్లోకమ్:
ఈ మంత్రమును చదువుతూ త్రినేత్రి స్వరూపిణీ అయినా ఆ తల్లిని మన హృదయములో ధ్యానిస్తూ అక్షతలు అమ్మవారి విగ్రహంపై వేయాలి .
ఏవం దేహమయీం ధ్యాత్వా దేవీం ప్రాణప్రదాం శివామ్ ।
నవయౌవన గర్వాడ్యాం వరదాం సర్వమంగళామ్ ।।
పాశం చాపం సృక్కపాలే సృణిం శూలం చ హస్తకైః ।
బిభ్రాణాం రక్తవర్ణాంచ రక్తమాలా విభూషితామ్ ।
దేవీం ధ్యాయేత్ ప్రాణశక్తిం త్రినేత్రాం చతుర్భుజామ్ ।।
అథ లమిత్యాది పంచోపచార పూజా:
అమ్మవారిని ఉద్దేశించి, కింది మంత్రములను పఠిస్తూ చిటికెన వ్రేళ్ళ నుండి బొటన వ్రేళ్ళ వరకు ఒక్కో వేలును తాకుతూ ఆయా ఉపచారాలను సమర్పించాలి.
- గంధం:
ఓం ఐం క్లీం సౌః । లం పృథివీతత్త్వాత్మకాయ గంధతన్మాత్ర శివశక్త్యాత్మికానందాత్మికాయై గంధం పరికల్పయామి । సౌః క్లీం ఐం ఓం ।।
చిటికెన వ్రేళ్ళు తాకాలి లేదా అమ్మవారికి గంధం సమర్పించాలి.
- పుష్పం:
ఓం ఐం క్లీం సౌః । హం ఆకాశతత్త్వాత్మకాయ శబ్దతన్మాత్ర శివశక్త్యాత్మికానందాత్మికాయై పుష్పం పరికల్పయామి । సౌః క్లీం ఐం ఓం ।।
చూపుడు వ్రేళ్ళు తాకాలి లేదా అమ్మవారికి పుష్పములు సమర్పించాలి.
- ధూపం:
ఓం ఐం క్లీం సౌః । యం వాయుతత్త్వాత్మకాయ స్పర్శతన్మాత్ర శివశక్త్యాత్మికానందాత్మికాయై ధూపం ఆఘ్రాపయామి । సౌః క్లీం ఐం ఓం ।।
మధ్య వ్రేళ్ళు తాకాలి లేదా అమ్మవారికి ధూపం చూపించాలి.
- దీపం:
ఓం ఐం క్లీం సౌః । రం అగ్నితత్త్వాత్మకాయ రూపతన్మాత్ర శివశక్త్యాత్మికానందాత్మికాయై దీపం దర్శయామి । సౌః క్లీం ఐం ఓం ।।
ఉంగరపు వ్రేళ్ళు తాకాలి లేదా అమ్మవారికి దీపం చూపించాలి
- నైవేద్యం:
ఓం ఐం క్లీం సౌః । వం అమృతతత్త్వాత్మకాయ రసతన్మాత్ర శివశక్త్యాత్మికానందాత్మికాయై నైవేద్యం నివేదయామి । సౌః క్లీం ఐం ఓం ।।
బొటన వ్రేళ్ళు తాకాలి లేదా పువ్వులు సమర్పించాలి లేదా అమ్మవారికి బెల్లమును సమర్పించాలి.
సర్వోపచారము:
ఓం ఐం క్లీం సౌః । సం సర్వతత్త్వాత్మకాయ సర్వతన్మాత్ర శివశక్త్యాత్మికానందాత్మికాయై తాంబూలాది సర్వోపచారాన్ సమర్పయామి । సౌః క్లీం ఐం ఓం ।।
ఈ క్రియతో అది నమస్కార ముద్ర అవుతుంది. ఆలా నమస్కరిస్తూ, ఈ క్రింది శ్లోకాన్ని చదువుతూ అమ్మవారికి అక్షతలు సమర్పించాలి.
నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః |
నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాః స్మతామ్ ||
ఇతి దుర్గ నవరాత్రీ ప్రాణప్రతిష్ఠాపనం।