DevataMantra DevataMantra DevataMantra DevataMantra
Punyahavachanam|All Pujas|DevataMantra
పూజా సామాగ్రి
  1. పసుపు
  2. కుంకుమ
  3. గంధం
  4. పసుపు అక్షతలు
  5. మూడు రాగి, ఇత్తడి, లేదా స్టీల్ గ్లాసులు; లేదా ఒక రాగి చెంబు {రెండింటిలోనూ నీళ్ళు నింపుకోండి}
  6. తమలపాకులు ‐ 5
  7. పోకలు - 1
  8. రూపాయి బిళ్ళ -1
  9. కూర్చోవడానికి ఆసనం
ముందుగా పసుపు గణపతి పూజ చేయాలి.
పుణ్యాహవాచనం/స్వస్తి పుణ్యాహవాచనం
ప్రాముఖ్యత: గ్రహశాంతి, నక్షత్ర శాంతి, వివాహం, నామకరణం, గృహప్రవేశం దేవి, గణపతి నవరాత్రులు వంటి ముఖ్య కార్యాల్లో పుణ్యాహవాచనం లేకుండా ఏదీ సంపూర్ణం కాదు. గ్రహ ,నక్షత్ర శాంతి శారీరక, మానసిక పవిత్రత కొరకై, గృహ ప్రవేశ కార్యంలో గృహ శుద్ధికై , దేవి గణపతి నవరాత్రుల సమయంలో స్థల శుద్ధి కై పుణ్యాహవచనం చేస్తారు. విభూతి ధారణ: భస్మ జ్యోతిస్వరూపాయ శివాయ పరమాత్మనే। షట్త్రింశత్తత్త్వరూపాయ నమశ్శాంతాయ తేజసే।। కుడిచేతి మధ్య, అనామికా ఉంగరపు వేలు) వేళ్లతో విభూతిని తీసుకుని నుదుటిపై ఎడమ నుండి కుడికి మూడు అడ్డ రేఖలుగా త్రిపుండ్రం) ధరించండి.,నమస్కారం చేయండి) సంకల్పం: ఇప్పుడు కుడిచేతిలో అక్షతలు తీసుకుని ,మీ కుడి కాలితొడపై ఎడమ అరచేతి నుంచి అక్షతలతో ఉన్న కుడిచేతిని పిడికిలిగా మూసి ఆ ఎడమ అరచేతిపైనుంచుతూ ఈ సంకల్పం చెప్పి పిడికిలిలో ఉన్నఅక్షతలను నీటితో అర్ఘ్యపాత్రలో వదలాలి.) పూర్వోక్త సంకల్పానుసారేణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ, శ్రీమాన్ …… గోత్రః …… నామధేయః ధర్మపత్నీ సమేతోహం, శ్రీమతః …… గోత్రస్య …… నామధేయస్య మమ సహకుటుంబస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం, గృహ-భూ-భాండ-ద్రవ్య-స్థల శుద్ధ్యర్థం, శరీర-మనో-బుద్ధి-చిత్త-ఆత్మ శుద్ధ్యర్థం, గృహ శుద్ధ్యర్థం , గృహోపకరణ శుద్ధ్యర్థం, వృద్ధ్యర్థం, శాంత్యర్థం, అభ్యుదయార్థం చ మహాజనైః సహ స్వస్తి పుణ్యాహవాచనం కరిష్యే।। పుణ్యాహం వాచయేత్ ఓమ్ భూమిం ప్రార్థ్య ఈ మంత్రం చదువుతూ భూమిని ప్రార్థించి, పుణ్యాహవాచనాన్ని ప్రారంభించాలి ఓం మహి ద్యౌః పృథివీచన ఇమం యజ్ఞం మిమిక్షతామ్ । పిపృతాం నో భరీమభిః ।। ఈ మంత్రం చదువుతూ కుడి చేతి వేళ్లతో ముందుగా దక్షిణ (కుడి) దిశలో భూమిని స్పృశించాలి; తదుపరి ఉత్తర (ఎడమ) దిశలో భూమిని స్పృశించాలి ఇతి దక్షిణోత్తరతో భూమిం స్పృష్ట్యా।। ధాన్య పీఠం: ఈ మంత్రం చదువుతూ శ్వేత (తెల్లని) వస్త్రం పరిచి దానిపైగాని ఏదైనా తాంబాలంలో గానిబియ్యం (ఒక 1.25 kg) పోసి దానిపై చతురస్త్రం వేయాలి. ఓం ఓషధయః సంవదంతే సోమేన సహ రాజ్ఞా। యస్మై కరోతి బ్రాహ్మణస్తం రాజన్ పారయామసి।। యథాశక్తి ప్రస్థ పరిమిత తండులాన్ నిక్షిప్య । ఈ మంత్రం చదువుతూ మూడు కలశాలకు దారం చుట్టాలి. ఓం అభివస్త్రా సువసనాన్యర్షాభిధేనూః సుదుఘాః పూయమానః।। అభిచంద్రా భర్తవే నో హిరణ్యార్ష్యశ్వాన్ రథినో దేవ సోమ।। ఇతి వస్త్రం అభిమంత్య్ర । కలశ అభిమంత్రణం: ఈ మంత్రం చదువుతూ మూడు కలశాలను చేతితో తాకుతూ పవిత్రం చేయాలి. ఓం ఆకలశేషు ధావతి పవిత్రే పరిషిచ్యతే । ఉక్థైర్యజ్ఞేషు వర్ధతే । ఇతి కలశానాబి మంత్య్ర కలశ అభిమంత్రణం: ఈ మంత్రం చదువుతూ మూడు కలశాలను చేతితో తాకుతూ పవిత్రం చేయాలి. కలశాలలో నీరు నింపడం & నదీ ఆవాహనం: ఈ మంత్రం చదువుతూ మూడు కలశాలలో నీరు నింపాలి: ఆ కలశాల జలంలోకి గంగాది పుణ్య నదులను ఆహ్వానించాలి. ఆదౌ సోదక కలశత్రయం గంధపుష్ప అక్షత ఆమ్రపల్లవకాండాదిభిరలంకృత్య వామదక్షిణభాగేషు ఏకైక కలశం పూర్వత ఏకకలశం సంస్థాప్య ఆపో హిష్ఠా మయో॒భువ॒స్తా న॑ ఊర్జే ద॑ధాతన। మహేరణాయ చక్షసే। యోవః శి॒వత॑మో రసస్తస్య భాజయతే హ నః। ఉశతీరివ మాతరః। తస్మా॒ అరంగమామవో యస్య॒ క్షయాయ జిన్వథ। ఆపో॑జ॒నయథా చ నః।। ఇతి ఉదకమాపూర్య। గంగే చ యమునే చైవ గోదావరీ సరస్వతీ । నర్మదే సింధు కావేరీ జలేఽస్మిన్ సన్నిధిం కురు ।। కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమీ । భాగీరథీతి విఖ్యాతాః పంచగంగాః ప్రకీర్తితాః ।। ఇతి నదీరావాహ్య। గంధం: ఈ మంత్రం చదువుతూ చిటికెడు గంధాన్ని కలశాలలో జలంలో కలపాలి. ఓం గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీమ్।। ఈశ్వరీం సర్వభూతానాం తామిహో పహ్వయే శ్రియమ్।। ఇతి శ్రీ గంధాన్ నిక్షిప్య అక్షతలు: ఈ మంత్రం చదువుతూ అక్షతలను కలశాలలో వేయాలి. ఓం ఆయనేతే పరాయనే దూర్వా రోహంతు పుష్పిణీః । హ్రదాశ్చ పుండరీకాణి సముద్రస్య గృహా ఇమే ।। ఇతి అక్షతాన్ నిక్షిప్య పుష్పము: ఈ మంత్రం చదువుతూ పుష్పము కలశాలలో వేయాలి. ఓం యోపాం పుష్పం వేద । పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి । చంద్రమా వా అపాం పుష్పమ్। పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి। య ఏవం వేద । యోపామాయతనం వేద । ఆయతనవాన్ భవతి ।। ఇతి పుష్పాన్నిక్షిప్య పల్లవ సమర్పణ ఓం ఆమ్ర పల్లవాన్ నిక్షిప్య. [ఫల సమర్పణ: ఈ మంత్రం చదువుతూ కొబ్బరికాయ కలశంపై నుంచాలి యాః ఫ॒లినీర్యా అఫ॒లా అపు॒ష్పాయాశ్చ పు॒ష్పిణీః। బృహ॒స్పతి ప్రసూతా॒స్తానో॑ ముంచంత్వగ్ం హ॑సః ।।] హిరణ్యం: ఈ మంత్రం చదువుతూ బంగారం లేదా వెండి లేదా రాగి లేదా రూపాయి నాణేన్ని కలశాలలో వేయాలి. ఓం హిరణ్యగర్భ గర్భస్థం హేమబీజం విభా వసోః । అనంత పుణ్య ఫలదమ్ అతశ్శాంతిం ప్రయచ్ఛ మే ।। ఇతి హిరణ్యం నిక్షిప్య ।। వరుణ ఆవాహనం: ఈ మంత్రం చదువుతూ కలశాలలో ఆయా దేవతలను ఆవాహనం వేయాలి. ప్రాక్కలశే (తూర్పు కలశం): ఇమంమే వరుణశృధీ హవామధ్యాచమృడయ త్వామవస్యురాచకే ప్రాక్ కలశే ఓం భూ: వరుణ మావాహయామి, ఓం భువ: వరుణమావాహయామి - ఓగ్ం సువ: వరుణ మావాహయామి ఓం భూర్భువస్సువః వరుణమావాహయామి ఈ మంత్రం చదువుతూ తూర్పు కలశంలో వరుణ దేవుడిని ఆవాహనం వేయాలి. దక్షిణ కలశే (దక్షిణ కలశం): వాస్తోప్పతే ప్రతిజాని హ్యస్మాన్ త్వావేశోఅనమీవో భవాన: యత్వేమహే ప్రతి తన్నో జుషస్వ శన్న ఏదిద్విపదే శంచతుష్పదే ఇతి దక్షణ కలశే ఓం భూః: వాస్తు పురుషమావాహయామి - ఓం భువ: వాస్తు పురుషమావాహయామి ఓగ్ం సువః వాస్తు పురుషమావహాయామి ఓం భూర్భువస్సువః వాస్తు పురుషమావాహయామి ఈ మంత్రం చదువుతూ దక్షిణ కలశంలో వాస్తు పురుషుడిని ఆవాహనం వేయాలి. ఉత్తర కలశే (ఉత్తర కలశం): బ్రహ్మజజ్ఞానం ప్రధమం పురస్తాద్విసిమత స్సురుచో వేన ఆవః సబుర్నియా ఉపమా అస్యవిష్ఠా సతశ్చయోని మసతశ్చవివ: ఇతి ఉత్తర కలశే ఓం భూః బ్రహ్మాణ మావాహయామి ఓం భువ: బ్రహ్మాణమావాహయామి ఓం సువ బ్రహ్మాణమావాహయామి ఓం భూర్భువస్సువః బ్రహ్మాణ మావాహయామి ఈ మంత్రం చదువుతూ ఉత్తర కలశంలో బ్రహ్మా పురుషుడిని ఆవాహనం వేయాలి. దేవతా వందనం: తదుపరి ఒక్కో శ్లోకాన్ని పఠిస్తూ ఆయా దేవతలను ప్రార్థిస్తూ అక్షతలు కలశాలపై వేస్తుండాలి
  1. శ్రీ లక్ష్మీ నారాయణ ప్రార్థన:

    నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే । శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే ।।

    శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం । విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగమ్ ।।

    శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః ।।
  2. శ్రీ ఉమామహేశ్వర ప్రార్థన:

    సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే । శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే ।।

    శుద్ధస్ఫటిక సంకాశం త్రిలోచనం వృషభధ్వజమ్ । వ్యాఘ్రచర్మాంబరధరం గౌరీపతిం నమోస్తుతే ।।

    శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః ।।
  3. శ్రీ వాణీ హిరణ్యగర్భ ప్రార్థన:

    ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతీ । ధీనామవిత్ర్యవతు ।।

    ఓం హిరణ్యగర్భః సమవర్తతాగ్రే భూతస్య జాతః పతిరేక ఆసీత్ । స దాధార పృథివీం ద్యాముతేమాం కస్మై దేవాయ హవిషా విధేమ ।।

    శ్రీ వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః ।।
  4. శ్రీ శచీ పురందర ప్రార్థన:

    దేవేంద్రాణి నమస్తుభ్యం దేవేంద్ర ప్రియభామిని । ఆయురారోగ్యమైశ్వర్యం పుత్రలాభం చ దేహి మే ।।

    శ్రీ శచీపురందరాభ్యాం నమః ।।
  5. శ్రీ అరుంధతీ వశిష్ట ప్రార్థన:

    శ్రీమాన్ సర్వమునిశ్రేష్ఠః సర్వమంగళకారకః । అరుంధతీవశిష్టాభ్యాం మమ సౌభాగ్యం దేహి మే ।।

    శ్రీ అరుంధతీవశిష్టాభ్యాం నమః ।।
  6. శ్రీ సీతారామ ప్రార్థన:

    శ్యామం నీలోత్పల శ్యామం పీతాంబరధరం విభుమ్ । శ్రీవత్సవక్షసం దేవం వందేహం రఘునాయకమ్ ।।

    శ్రీ సీతారామాభ్యాం నమః ।।
  7. మాతాపితృ వందనం:

    వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే । జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ।।

    మాతాపితృ సమం దైవం న దైవం పితృమర్చయేత్ । సర్వతీర్థఫలం తేషాం మాతాపితృభ్యో నమో నమః ।।

    శ్రీ మాతాపితృభ్యో నమః ।।
  8. శ్రీ గురు వందనం:

    గురు బ్రహ్మ గురు విష్ణుః గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః।।

    శ్రీ గురుభ్యో నమః ।।
  9. బ్రాహ్మణ వందనం:

    వేదాధ్యయన విద్వద్భిః దేవతార్చన హోమతః । షట్కర్మాభిరతైః నిత్యం బ్రాహ్మణైః పూజితం సదా ।

    సర్వేభ్యో మహాజనేభ్యో నమః ।।
శ్రీ పుణ్యాహవాచన ఆశీర్వచన పాఠము: ఓం మాతృదేవోభవ । పితృదేవోభవ । ఆచార్యదేవోభవ । అతిథిదేవోభవ । అవనీకృత జానుమండలః కమలముకుళ సదృశమంజలిం శిరస్యాదాయ । దక్షిణేన పాణినా సువర్ణ పూర్ణ కలశం ధారయిత్వా । దీర్ఘా నాగర్యో గిరయః । త్రీణి విష్ణోః పదాని చ । తేన ఆయుః ప్రమాణేన పుణ్యం ఈ మంత్రం చదువుతూ యజమాని తన శిరస్సుపై చేయినుంచాలి. ఓం పుణ్యాహం దీర్ఘమాయురస్తు । శిరస్యాభిమంత్య్ర । ఈ మంత్రం చదువుతూ యజమాని తన కుడిచేతిని ఎడమ చేతిపై నుంచి అరచేతులతో కలశాలను స్పృశించాలి. శివా ఆపస్సంతు । కలశేష్వభిమంత్య్ర ఈ మంత్రం చదువుతూ యజమాని తన హృదయాన్ని తాకాలి. సౌమనస్యమస్తు హృదయమభీమంత్య్ర ఈ మంత్రం చదువుతూ బ్రాహ్మణుడు తన కుడి చేతిలోని అక్షతలను యజమాని శిరస్సుపై (తలపై) చల్లాలి. అక్షతంచారిష్టంచాస్తు ఇలా ఈ ప్రక్రియను మూడు మార్లు చేయాలి. ఏవం త్రిః ఈ మంత్రాలు చదువుతూ గంధం, పువ్వులు, అక్షతలను, రూపాయి నాణాన్ని, పోకను, యజమాని కలశాలలో వేయాలి. గంధాః పాంతు - సుమంగళ్యాస్తూ । పుష్పాణి పాంతు - సౌమంగళ్యన్ చాస్తూ । అక్షతాః పాంతు - ఆయుష్యమస్తు । తాంబూలాని పాంతు - ఐశ్వర్యమస్తు । దక్షిణాః పాంతు - బహుదేయంచాస్తు । యజమాని కుడిచేత్తో కలశాలను పట్టుకుని, అక్షతలు కలశాల వద్ద వదులుతూ, అక్కడ ఉన్న బ్రాహ్మణులను "పుణ్యాహం అని పలకండి" (అనుజ్ఞ) అని కోరాలి. స్వశ్రేయమస్తు । ప్రజాపతిః ప్రియతామ్ । శాంతిరస్తు । పుష్టిరస్తు । తుష్టిరస్తు । యం కృత్వా సర్వ వేద యజ్ఞ క్రియాకరణ కర్మా రంభః శుభాః ప్రవర్తంతే । తమహమోంకారమాదిం కృత్వా పుణ్యాహం వాచయిష్యే ।। యజమాని ఆలా పలుకగానే, ప్రధాన పురోహితుడు మరియు బ్రాహ్మణులు ఇలా పలకాలి. ప్రధాన పురోహితుడు: ఓం పుణ్యం పుణ్యాహం వాచయిష్యే । బ్రాహ్మణులు: ఓం వాచ్యతామ్ । శ్రీ పుణ్యాహవాచన శాంతి మంత్రపాఠము: ఈ మంత్రాలు చదువుతున్నపుడు యజమానిని శ్రద్ధగా వినమని చెప్పాలి. ఓం భద్రం కర్ణేభిః శ్రుణుయామ దేవాః । భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః । స్థిరైరంగైస్తుష్టువాగ్ం సస్తనూభిః । వ్యశేమ దేవహితం యదాయుః । ద్రవిణోదా ద్రవిణసశ్చుతస్య ద్రవిణోదా రాసతే మఘోనామ్ । ద్రవిణోదా వీరవతీమిషంనో ద్రవిణోదా రాసతే దీర్ఘమాయుః ।। సవితా పశ్చాత్తాత్ సవితా పురస్తాత్ సవితోత్తరాత్తాత్ సవితాధరాత్తాత్ । సవితా నస్సువతు సర్వతాతిం సవితా నో రాసతాం దీర్ఘమాయుః ।। ఓం నవో నవో భవతి జాయమానోఽహ్నాం కేతురుషసామేత్యగ్రే । భాగం దేవేభ్యో విదధాత్యాయన్ ప్రచంద్రమస్తిరతి దీర్ఘమాయుః ।। ఈ మంత్రాలు చదువుతున్నపుడు కలశాలలోని నీటిని యజమాని దోసిలిలో పోయాలి, వారు ఆ నీటిని తలపై చల్లుకోవాలి. ఓం ఆప ఉందంతు జీవసే దీర్ఘాయుత్వాయ వర్చసే ।। యస్వా హృదా కీరిణా మన్యమానో మర్త్యం మత్యోజోహవీమి । జాతవేదో యశో అస్మాసు దేహి ప్రజాభిరగ్నే అమృతత్వమశ్యామ్ ।। యస్మై త్వగ్ం సుకృతే జాతవేద ఉలోకమగ్నే కృణవస్యోనమ్ । అశ్వినం స పుత్రిణం వీరవంతం గోమంతగ్ం రయిం నశతే స్వస్తి ।। ఓం సం త్వా సించామి యజుషా ప్రజామాయుర్ధనం చ ।। పై ప్రక్రియ తరువాత, ప్రధాన పురోహితుడు మరియు బ్రాహ్మణులు ఇలా పలకాలి. ప్రధాన పురోహితుడు: మనస్సమాధీయతామ్ । బ్రాహ్మణులు: సమాహిత మనసస్స్మః । ప్రధాన పురోహితుడు: ప్రసీదంతు భవంతః । బ్రాహ్మణులు: ప్రసన్నాస్స్మః । ఓం శాంతిరస్తు । పుష్టిరస్తు । తుష్టిరస్తు । వృద్ధిరస్తు । అవిఘ్నమస్తు । ఆయుష్యమస్తు । ఆరోగ్యమస్తు । స్వస్తి శివం కర్మాస్తు । కర్మ సమృద్ధిరస్తు । పుత్ర సమృద్ధిరస్తు । వేద సమృద్ధిరస్తు । శాస్త్ర సమృద్ధిరస్తు । ధనధాన్య సమృద్ధిరస్తు । ఇష్ట సంపదస్తు । ఈ మంత్రం చదువుతూ కలశ జలమును ఈశాన్య భాగములో చల్లవలెను ఈశాన్యాం బహిర్దేశే అరిష్ట నిరసనమస్తు ।। కలశయోర్ ఈశాన్యదేశే ఉదకంసించేత్ యత్పాపం తత్ప్రతిహతమస్తు । యచ్ఛ్రేయస్తదస్తు । శుక్రాంగారక బుధ బృహస్పతి శనైశ్చర రాహు కేతు సోమ సహితాదిత్య పురోగాః సర్వే గ్రహాః ప్రియంతామ్ । తిథి కరణ ముహూర్త జన్మనక్షత్ర దిగ్దేవతాః ప్రియంతామ్ ।। నైరుత్యాం దిశి కలశ జలమును నైరుతి దిశలో నీటిని చల్లవలెను. ఇప్పుడు ఈ క్రింది మంత్రాలను చదువుతూ దక్షిణ, ఉత్తరకలశాలలో ఉన్న నీటిని తూర్పు కలశంలో పోసి ఆ కలశ జలాన్ని తమలపాకులతో స్పృశిస్తూ ఉండాలి. శామ్యంతు ఘోరాణి । శామ్యంతు పాపాని । శామ్యంతు ఈతయః । ప్రథమ (ప్రాక్కలశే) కలశే శుభాని వర్ధంతామ్ । శివా ఋతవస్సంతు । శివా ఓషధయస్సంతు । శివా వనస్పతయస్సంతు । అహోరాత్రే శివే స్యాతామ్ ।। ఉత్తరే శుభకర్మణ్యవిఘ్నమస్తు । ఉత్తరోత్తర మహాభివృద్ధిరస్తు । ఉత్తరోత్తరాః శుభాః క్రియాః సంపద్యంతామ్ । అగ్నిపురోగా విశ్వే దేవాశ్చ ప్రియంతామ్ । మాహేశ్వరీ పురోగాః మాతరః ప్రియంతామ్ । ఇంద్రపురోగా మరుద్గణాః ప్రియంతామ్ ।। వశిష్ఠ పురోగా ఋషిగణాః ప్రియంతామ్ । శ్రీ విష్ణు పురోగాః సర్వే దేవాః ప్రియంతామ్ । ఆదిత్య పురోగాః సర్వే గ్రహా శ్చ ప్రియంతామ్ । ఋషయశ్ఛందా గ్ స్యాచార్యా వేదా యజ్ఞా దక్షిణాశ్చ ప్రియంతామ్ । బ్రహ్మా చ బ్రాహ్మణాశ్చ ప్రియంతామ్ । బ్రహ్మ విష్ణు మహేశ్వరాశ్చ ప్రియంతామ్ । శ్రద్ధా మేధే ప్రియేతామ్ । ప్రియతాం భగవాన్ నారాయణః । ప్రియతాం భగవాన్ స్వామీ మహాసేనః । ప్రియతాం భగవాన్ పితామహః । ప్రియతాం భగవాన్ పితామహః ।। ఓం సత్య ఏతా ఆశిషః సంతు । పుణ్యాహకాలా వాచ్యంతామ్ ।। నక్షత్ర శుద్ధి మంత్రము: ఈ మంత్రం చదువుతూ బ్రాహ్మణుడు యజమానిని మనసులో తన నక్షత్రాన్ని తలచుకోమని చెప్పాలి ఓం పుణ్యం నక్షత్రం తద్వట్కుర్వీతోపవ్యుషమ్ । యదా వై సూర్య ఉదేతి । అథ నక్షత్రం నైతి । యావతి తత్ర సూర్యో గచ్చేత్ । యత్ర జఘన్యం పశ్యేత్ । తావత్ కుర్వీత యత్కారీ స్యాత్ ।। ఓం తాని వా ఏతాని యమ నక్షత్రాణి । యాన్యేవ దేవ నక్షత్రాణి । తేషు కుర్వీత యత్కారీ స్యాత్ ।। యజమాని మూడు సార్లు చెప్పాలి పుణ్యాహ ఏవ కురుతే । ఓం పుణ్యాహం భవంతో బ్రువంతు । ఓం పుణ్యాహమ్ । ఏవం త్రిః ఈ మంత్రం చదువుతూ కలశాన్ని తాకుతూ ఉండి, మంత్రం ముగిశాక యజమాని అక్షతలను మూడు మార్లు కలశం వద్ద వదలాలి ఓం స్వస్తయే వాయుముపబ్రువామహై సోమం స్వస్తి భువనస్య యస్పతిః । బృహస్పతిం సర్వగణం స్వస్తయే స్వస్తయ ఆదిత్యాసో భవంతు నః ।। ఆదిత్య ఉదయనీయః స్వస్త్యా ప్రియంతే పథ్యం స్వస్తి మభ్యుద్యన్తి స్వస్త్యై వేదప్రియంతి స్వస్త్యుద్యంతి స్వస్త్యుద్యంతి ।। ఓం స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తినః పూషా విశ్వవేదాః । స్వస్తినస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తినో బృహస్పతిర్దధాతు ।। ఆక్షౌ దేవావసవ స్పోమ్యాసః చతస్రోదేవి రజరాశ్రవిష్టా । తే యజ్ఞం పాంతు రజసః పరస్తాత్। సంవత్సరిణ మమృతగ్ స్వస్తి ।। మహ్యం సహ కుటుంబాయ। శుద్ధివృద్ధ్యభ్యుదయ కర్మణే మహాజనాన్నమస్కుర్వాణాయ ఆశీర్వచనమపేక్షమాణాయ। ఆయుష్మతే స్వస్తిం భవంతో బృవంతు । బ్రాహ్మణులు మూడు సార్లు చెప్పాలి బ్రాహ్మణులు: ఆయుష్మతే స్వస్తి । ఓం స్వస్తి భవంతో బ్రువంతు - ఓం స్వస్తి - ఏవం త్రిః ఓం బుధ్యామ స్తోమం ననుయామవాచమనో మంత్రం సరదేహోవయాతమ్ । యశోను వక్తవ్యం మధుగోష్వంతరాభూతాంశో అశ్వినోః కామమప్రాః ।। సర్వామృద్ధిమృధ్నుయామితితం వై తేజసై వ పురస్తాత్పర్యభవచ్ఛం దోభిర్మధ్యతోక్షరై రుపరిష్టాద్గాయత్య్ర। సర్వతో ద్వాదశాహం పరిభూయా త్పర్వామృద్ధిమార్నోత్సర్వా మృద్ధిమృధోతి య ఏవం వేద ।। ద్వయ కలశ గ్రహణం: ఈ మంత్రాలు చదువుతూ రెండు కలశాలను (దక్షిణ కలశం మరియు ఉత్తర కలశం) కుడి, ఎడమ చేతులతో పట్టుకుని బ్రాహ్మణుడు తన ముఖాన్ని కొంచెం పైకి ఎత్తి కలశాల వైపు లేదా ఆకాశం వైపు చూస్తూ యజమానిని దీవించాలి. ఓం బుద్యాస్మ హవ్యైర్నమసో పసద్య మిత్రం దేవం మిత్రధేయంనో ఆస్తు । అనూరాధాన్ హవిషా వర్ధయంతః శతం జీవేమ శరదస్సవీరాః ।। త్రీణి త్రీణి వై దేవానామృద్ధాని । త్రీణి ఛందాంసి త్రీణి సవనాని । త్రయ ఇమే లోకాః । బుద్ధ్యామేవ తద్వీర్యేషు లోకేషు ప్రతితిష్ఠతి ।। వామదక్షిణ హస్తాభ్యాం దక్షిణోత్తరకలశా యుగ పద్గృహీత్వా । ప్రధాన పురోహితుడు మరియు బ్రాహ్మణులు ఇలా పలకాలి. ప్రధాన పురోహితుడు: ఋద్ధ్యం భవంతో బ్రువంతు । బ్రాహ్మణులు: ఋధ్యతామ్ । ఋద్ధిః సమృద్ధిః । ఈ మంత్రాలూ చదువుతూ యజమాని తన గోత్రం పేరు వంశం పేరు చెప్పుకోమనాలి లేదా ప్రధాన పురోహితుడు చెప్పాలి. స్వస్తి పుణ్యాహ సమృద్ధిరస్తు । వర్షశత సంపూర్ణమస్తు । ------గోత్రాభివృద్ధిరస్తు (గోత్రం పేరు చెప్పాలి) -----వంశాభివృద్ధిరస్తు(వంశం పేరు చెప్పాలి) । శాంతిః పుష్టిః తుష్టిశ్చాస్తు । శుభం శుభమస్తు ।। పావమాన శుద్ధి (మార్జనం): ఇత్యుదకం నిషిచ్య - నీటిని ప్రోక్షిస్తూ ఈ మంత్రాలు చదువుతూ, తూర్పు కలశంలోని పవిత్ర జలాన్ని దర్భలతో లేదా తమలపాకులతో లేదా మామిడాకులతో గానీ ముంచి యజమానిపై, పూజా ద్రవ్యాలపై మరియు ఇంటి పరిసరాలపై చల్లాలి. యేన దేవాః పవిత్రేణ ఆత్మానం పునతే సదా । తేన సహస్రధారేణ పావమాన్యః పునంతు మా ।। ప్రాజాపత్యం పవిత్రమ్ । శతోద్యామగ్ం హిరణ్మయమ్ । తేన బ్రహ్మవిదో వయమ్ । పూతం బ్రహ్మ పునీమహే ।। ఇంద్రస్సునీతీ సహ మా పునాతు। సోమస్స్వస్త్యా వరుణస్సమీచ్యా । యమో రాజా ప్రమృణాభిః పునాతు మా జాతవేదా మోర్జయంతీ పునాతు ।। ఇతి మార్జనం కృత్వా ।। దిశ మార్జనం: ఈ మంత్రాలు చదువుతూ, తూర్పు కలశంలోని పవిత్ర జలాన్ని దర్భలతో లేదా తమలపాకులతో లేదా మామిడాకులతో గానీ అన్ని దిశల్లో ప్రోక్షించాలి (చల్లాలి). ప్రాచ్యాం (తూర్పు) దిశి దేవా ఋత్విజో మార్జయంతాం । దక్షిణాయాం(దక్షిణ) దిశి మాసాః పితరో మార్జయంతాం । ప్రతీచ్యాం(పడమర) దిశి గృహాః పశవో మార్జయంతాం । ఉదీచ్యాం(ఉత్తరం) దిశి ఆప ఓషధయో వనస్పతయో మార్జయంతాం । ఊర్ధ్వాయాం(పైకి) దిశి యజ్ఞః సంవత్సరః యజ్ఞపతిర్మారజయం తామ్ ।। ఏతేభ్యో బ్రాహ్మణేభ్యః నానా గోత్రేభ్యః నానా నామభ్యః । శ్రీ లక్ష్మీనారాయణ ఉమామహేశ్వర ఆదిత్యాది నవగ్రహ ప్రీత్యర్థం స్వస్తి పుణ్యాహవాచన మంత్రజప దక్షిణాం మనసోత్సాహ పరిమిత హిరణ్యం తుభ్యమహం సంప్రదదే నమమ ।। ఈ మంత్రాలు చదువుతూ ఇంటి దైవాన్ని తలుచుకుంటూ బెల్లం నివేదన చేయాలి. వాస్తోష్పతే ప్రతిజానీహ్యస్మాన్ త్స్వావేశో అనమీవో భవానః । యత్వేమహే ప్రతి తన్నో జుషస్వ శన్నో భవ ద్విపదే శం చతుష్పదే ।। వాస్తోష్పతే శగ్మయా సంసదా తే సక్షీమహి రణ్వయా గాతుమత్యా । ఆవహక్షేమ ఉత యోగే వరం నో యూయం పాత స్వస్తిభిస్సదా నః ।। అమీవహా వాస్తోష్పతే విశ్వా రూపాణ్యావిశన్। సఖా సుశేవ ఏధి నః ।। శుభగ్ం శుభమ్ ।। స్వస్త్యయనం తార్క్ష్యమరిష్టనేమి। మహద్భూతం వాయసం దేవతానామ్ । అసురఘ్నమింద్ర సఖం సమత్సు। బృహద్వ శోనామమివా రుహేమ ।। అగ్ం హోముచ మాంగిరసం గయంచ స్వస్త్యాత్రేయం మనసా చ తార్క్ష్యమ్ । ప్రయతపాణిః శరణం ప్రపద్యే స్వస్తి సంబాధేష్వభయం నో అస్తు ।। శుభగ్ం శుభమ్ ఇతి పుణ్యాహవాచనం।। ఓం శాంతిః శాంతిః శాంతిః।।