భూమి పూజ/శంకుస్థాపన - పూజా సామాగ్రి
- పసుపు
- కుంకుమ
- తడిపిన గంధం
- పసుపు అక్షతలు
- బియ్యం - 10 కిలోలు
- తెల్ల ధోతీ - 1
- జాకెట్ బట్టలు - 3
- తమలపాకులు - 51
- పోకలు - 51
- ఖర్జురా - 51
- కలశ స్థాపనకు రాగి చెంబు - 1
- రూపాయి నాణెములు - 101
- ఐదు రకముల పుష్పములు
- కొబ్బరికాయలు - 9
- పూలదండ - 1
- మంగళహారతి set - 1
- నవరత్నాలు/పంచలోహాలు set - 1
- నవధాన్యములు - 150 గ్రాములు
- వెండి పాము
- రాగి లేదా ఇత్తడి లేదా వెండి గ్లాసులు - 3
- పండ్లు - 5 రకములు
- దారం ఉండ - 1
- పాలు
- పెరుగు
- నెయ్యి
- తేనే
- శర్కర
- కొబ్బరికాయ
- అగరవత్తులు
- దీపానికి నూనె
- వత్తివేసిన కుందులు
- అగ్గిపెట్టె
- కర్పూరం
- ఆచమన పాత్ర {రెండింటిలోనూ నీళ్ళు నింపుకోండి}
- కలశానికి రాగి చెంబు {రెండింటిలోనూ నీళ్ళు నింపుకోండి}
- ఇటుకలు - 9 లేదా నవరంధ్ర శిల (తొమ్మిది రంధ్రాలు ఉన్న రాయి)
- వాస్తు శంకు - 1
- గుణపము - 1
- పారా - 1
- తాపీ - 1
- కూర్చోవడానికి ఆసనం
వాస్తు పురుష మండలం
వాస్తు శాస్త్రం ప్రకారం, గృహ నిర్మాణం అనేది కేవలం ఒక భౌతిక ప్రక్రియ మాత్రమే కాదు, అది భూమిపై ఒక శక్తి క్షేత్రాన్ని (Energy Field) సిద్ధం చేయడం. ఈ శక్తి క్షేత్రానికి మూలమే "ఏకాశీతి పద వాస్తు మండలం".
శాస్త్రోక్తంగా భూమిపూజ లేదా శంకుస్థాపన నిర్వహించేటప్పుడు ఈ 81 గడుల మండలాన్ని స్థాపించడం అత్యంత ఆవశ్యకం. పూర్వము దర్భలతో స్థలము చుట్టూ ఒక మండలము లాగ ఏర్పాటుచేసి భూమి పూజ, శంకుస్థాపన చేసే వారు. కాలానుసారము ఎన్నో మార్పులు వచ్చాయి.
ప్రస్తుతము భూమిపూజ/శంకుస్థాపన పూజలో వాస్తు మండపారాధన అని చేస్తున్నారు. దేనినే 'ఏకాశీతి వాస్తుమండలము' అని అంటారు. ఆ పూజ విధానమునూ ఇక్కడ పొందుపరచడము జరిగింది.
ముందుగా ఒక వస్త్రమును సమచతురస్రములో తూర్పుదిశలో పరిచి దానిపై బియ్యము పోసి 10 రేఖలను నిలువుగా పడమర నుండి తూర్పుకు, మరియు 10 రేఖలు అడ్డముగా దక్షిణము నుండి ఉత్తరమునకు, దర్భతో లేదా బంగారముతో గీసి, ఆ గీతల మధ్య 81 గదులను ఏర్పాటు చేయాలి. వీటిలో 12 అంతర్దేవతలనూ 32 బహిర్దేవతలనూ, చివరిగా మధ్యలో బ్రహ్మస్థాన దేవతలనూ ఆవాహనం చేయాలి. రేఖలు గీయుచున్నప్పుడు ఈ క్రింది శ్లోకములు పఠిస్తూ గీయాలి: దశ పూర్వాయతా రేఖాః దశ చైవోత్తరాయతాః । సర్వా వాస్తువిభాగేషు విజ్ఞేయా నాడికా బుధైః ।। ఏకాశీతి పదం కుర్యాత్ రేఖాభిః కనకేన చ । పశ్చాదిత్యంచ ఆలఖ్య సూత్రేణాలోడ్య సర్వతః ।। శాంతా యశోవతీ కాంతా విశాలా ప్రాణవాహినీ । సతీ చ సుమనా నందా సుభద్రా సుస్థితా తథా ।। హిరణ్యా సువ్రతా లక్ష్మీర్విభూతిర్విమలా ప్రియా । జయా కాలా విశోకా చ తథేంద్రా రశ్మిసంజ్ఞితా ।।
తదుపరి ఆ మండలములో ప్రధాన కలశమును (కలశమునకు కూడా దారం చుట్టి సుగంధ ద్రవ్యాలు, నాణెములు, అందులో వేసి, నీరు నింపి, కలశముపై మామిడి ఆకులు - కొబ్బరికాయ, దానిపై గోపురములా జాకెట్ బట్టను తయారు చేసి, ఆ కొబ్బరికాయను తొడిగి కలశము పై పెట్టి పుష్పముాల నుంచాలి).
హరిద్రా గణపతిని (ఎరుపు రవికను గోపురముల చేసి, ఇంకో రవికపై ఆ రవికను ఉంచి, తమలపాకులు 3 పోకలు, ఖర్జురా, నాణెం ఉంచి, దానిపై ఒక కొబ్బరి కుడుక(కురిడీ)లో పసుపు గణపతిని చేసి,) పఠిస్తూ వాస్తు మండలములో దిగువన స్థాపించాలి.
వేరుగా ఒక తంబాలములో బియ్యం పోసి అందులో మూడు గ్లాసులు (రాగి లేదా వెండి లేదా ఇత్తడి లేదా స్టీల్) ఉంచి పుణ్యాహవచనం చేయాలి.
మండప దేవతలనందరినీ, భూదేవతను, వాస్తుపురుషుడిని కూడా కలశములో ఆవాహనం చేయాలి.
మండపము చుట్టూ అయిదు రకాల పండ్లు పెట్టాలి.
అనంతరం ముఖ్యముగా గర్త భాగము ఈశాన్య భాగములో మూడు అడుగుల లోతు రెండడుగుల వెడల్పు తవ్వాలి. గర్తమునందు 8 ఇటుకల (నవగ్రహాలకి సంకేతము) మధ్యలో కదిర (చండ్ర), చందనం, లేదా మేడి వంటి పవిత్రమైన చెక్కలతో తయారు చేసిన శంకువునుప్రతిష్ఠించి, వాస్తుపురుష షోడశోపచార పూజ చేసి, ఆ శంకువును సిమెంటు,ఇసుక మిశ్రమముతో మూసివేయాలి.
పైన సూచించిన విధముగా పూజ చేయడము వలన మీ గృహానికి సంపూర్ణ వాస్తు బలం చేకూరుతుంది. ఇలా శాస్త్రబద్ధంగా పునాది వేయడం వల్ల ఆ ఇంట్లో నివసించే వారికి సుఖసంతోషాలు కలగడమే కాకుండా, తరతరాల వంశాభివృద్ధి (పుత్ర పౌత్రాభివృద్ధి) నిరంతరాయంగా సాగుతుందని వాస్తు గ్రంథాలు ప్రమాణీకరిస్తున్నాయి.
వాస్తు పూజా విధానం - ప్రారంభ పూజ (click to expand)
పూర్వాంగ పూజ
ఓం శివాయ గురవే నమః పరమగురవే నమః సద్గురవే నమః శ్రీ మహా గణాధిపతయే నమః శ్రీ మహా సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః హరిః ఓం । మీ ముఖానికి కుంకుమ పెట్టుకుని,నమస్కారం చేయండి శుచిః: అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం గతోఽపి వా । యః స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతరః శుచిః ।। (పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః) ప్రార్థన: శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం । ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ।। అగజానన పద్మార్కం గజాననమహర్నిశం । అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ।। సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి । విద్యారంభం కరిష్యామి సిద్ధిద్బవతుమే సదా ।। పద్మపత్ర విశాలాక్షీ పద్మ కేసరవర్ణినీ । నిత్యం పద్మాలయా దేవీ సా మాం పాతు సరస్వతీ ।। గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః । గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః ।। సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే । శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోఽస్తు తే ।। ఇప్పుడు ఎడమచేతిలో అక్షతలును తీసుకొని కుడి చేతితో మృగముద్రవేసి(బొటనవేలు,మధ్యవేలు, ఉంగరం వేలు కలిపితే అది మృగముద్ర అవుతుంది.) ఆ ఎడమ చేతిలోని అక్షతలును ఒక్కోనామం చదువుతూ గణనాథుడిపై వేస్తూ ఉండాలి. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః । ఉమామహేశ్వరాభ్యాం నమః । వాణీహిరణ్యగర్భాభ్యాం నమః । శచీపురందరాభ్యాం నమః । అరుంధతీవసిష్ఠాభ్యాం నమః । శ్రీసీతారామాభ్యాం నమః । మాతాపితృభ్యో నమః । సర్వేభ్యో మహాజనేభ్యో నమః । ఆచమ్య‐ప్రాణానాచమ్య‐నేత్రాచమ్య: ఇప్పుడు ఆచమన పాత్ర లోని నీటిని ఉంగరం వ్రేలితో కళ్ళకు అద్దుకొని, ఉద్ధరిణిలో తీసుకొని ఒక్కో నామం చెపుతూ మూడు మార్లు తాగవలెను. ఓం కేశవాయస్వాహా, ఓం నారాయణాయస్వాహా, ఓం మాధవాయస్వాహా । హస్తం ప్రక్షాల్యచేయి కడగండి ఓం గోవిందాయనమః। విష్ణవేనమః । మధుసూధనాయనమః । త్రివిక్రమాయనమః । వామనాయనమః । శ్రీధరాయనమః। హృషీకేశాయనమః । పద్మనాభాయనమః । దామోదరాయనమః । సంకర్ణణాయనమ: । వాసుదేవాయనమః । ప్రద్యుమ్నాయ నమః । అనిరుద్దాయనమః । పురుషోత్తమాయనమః అధోక్షజాయనమః । నారసింహాయనమః । అచ్యుతాయనమః । జనార్ధనాయనమః । ఉపేంద్రాయనమః । హరయే నమః । శ్రీకృష్ణాయనమః । దీపారాధనం: ఓం దీపస్త్వం బ్రహ్మ రూపోసి జ్యోతిషాం ప్రభురవ్యయః । సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్కామాంశ్చ దేహి మే ।। దీపమూలే పుష్పాక్షతాన్ నిక్షిప్య, దీపము వద్ద పుష్పాక్షతలను ఉంచవలెను. ఘంట: ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రక్షసామ్ । కురుఘంటా రావం తత్ర దేవ తాహ్వాన లాంఛనమ్ ।। ఘంటానాదం కృత్వా । ఘంట మ్రోగించాలి భూతోచ్చాటనం: ఉత్తిష్ఠంతు భూతపిశాచాః య ఏతే భూమి భారకాః । ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే । అక్షతలు వాసనా చూసి మీ ధర్మపత్నికి ఎడమవైపున వేయండి. ఈ మంత్రం చదువుతూ ప్రాణాయామం చేయండి. ఓం భూః ।ఓం భువః ।ఓం సువః ।ఓం మహః । ఓం జనః ।ఓం తపః ।ఓం సత్యం । ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ । ఓమాపో జ్యోతీ రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్ । సంకల్పం:మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణో రాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరాద్దే శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరత వర్షే భరత ఖండే మేరోర్ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయవ్య ప్రదేశే -- నద్యోః మధ్యదేశే శోభన గృహే/దేవాలాయే / స్వగృహే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురు చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణాం మధ్యే (జరుగుచున్న సంవత్సరము, ఆయనము, ఋతువు, నెల, పక్షము, తిథి, వారము చెప్పాలి.) -- సంవత్సరే ---అయనే -- ఋతౌ -- మాసే -- పక్ష -- తిథౌ -- వాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ ( గోత్రములను, పేర్లను చెప్పుకోవాలి. గ్రోతస్య నామధేయస్య - ధర్మపత్నీ సమేతస్య -- (అని పురుషులును మరియు స్త్రీలైనచో) శ్రీమతి -- గోత్రోద్భవాయాః -- నామధేయాయాః -- అని చెప్పుకోవాలి.) అస్మాకం సహకుటుంబానాం క్షేమస్థైర్య విజయ అభయ ఆయురారోగ్యమైశ్వర్యాది సిద్ధ్యర్థం, సమస్త మంగళావాప్యర్ధం సమస్త అభ్యుదయార్ధం ధర్మార్థకామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం శంకుస్థాపన నూతన గృహారంభ సుముహూర్తకాలే ఏతత్ క్షేత్రావచ్ఛిన్న భూమ్యధిష్ఠిత దేవతోపరోధ జనితోపసర్గ నివృత్తి పూర్వక, ప్రాసాదాధిష్ఠిత శ్రీ మహావిష్ణు స్వరూప వాస్తుపురుష దేవతానుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం, శిఖ్యాది ఏకాశీతి వాస్తుమండల దేవతా అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం, ఏతత్ స్థల సర్వ కర్మచారికృత జీవహింసాది జన్య ప్రత్యవాయ పరిహారార్థం, తథా క్రిమి కీటపతంగాది హింసాదోషనివృత్యర్థం వృక్షాషధ్యాది ఛేదన పూర్వక అకృత్య దోష నివృత్యర్థం, ఏతత్ క్షేత్రాన్తర్గత శల్యాది దోష న్యూనాతిరిక్త నిర్గమభేద దోష ప్రాకారలోప దోషహీనలక్షణ వాస్తుదోష నివృత్యర్థం, ప్రాకారాన్తరే బ్రహ్మఘ్నది మహాపతిత జనప్రవేశ నిరసనార్థం, దైవిక రాజ విద్వరేణ సుప్త మూత్ర పురీషోత్సర్జన దోష పరిహారార్థం, శ్వాన కుక్కుట గార్ధభ వరాహ జంబూకాది ప్రవేశ దోష నివారణార్థం, అజ్ఞానతో జ్ఞానతోవా జాతాశౌచ మృతాశౌచ జనప్రవేశ దోష పరిహారార్థం, రజస్వలా స్త్రీ ప్రవేశ దోష నిరసనార్థం, అస్మిన్ కర్మణి సర్వమంగళ సంపత్తిద్వారా, యజమానాభివృద్ధ్యర్థం, శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం, శిఖ్యాది ఏకాశీతి పద వాస్తుమండల దేవతా ప్రీత్యర్థం వాస్తు మండపారాధన, వాస్తు భూమిపూజ, శంకుస్థాపన పూర్వక ముఖ్యాంగ కర్మ కరిష్యే.ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం శ్రీ మహా గణాధిపతి పూజాం కరిష్యే. తదంగ కలశారాధనం కరిష్యే. కలశారాధనం: ఒక రాగి (ఇత్తడి, స్టీల్, వెండి) చెంబులో నీరు తీసుకొని కలశ పూజ చేయాలి. ఈ నీటిని మనం పూజ అయ్యేంత వరకు పవిత్ర జలముగా వాడుకోవాలి. కలశే గంధ పుష్పాక్షతైరభ్యర్చ్య । కలశస్యోపరి హస్తం నిధాయ । కలశానికి బొట్టు పెట్టి, ఒక పువ్వు వేసి, అక్షతలు వేసి కలశం పై కుడి అరచేతిని ఉంచండి. కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రః సమాశ్రితః । మూలే త్వస్య స్థితో బ్రహ్మా । మధ్యే మాతృగణా స్మృతాః ।। కుక్షౌ తు సాగరాసర్వే । సప్తద్వీపా వసుంధరా । ఋగ్వేదోథ యజుర్వేద సామవేదో హ్యథర్వణః ।। అంగైశ్చ సహితాసర్వే కలశాంబు సమాశ్రితాః । ఓం ఆకలశేషు ధావతి పవిత్రే పరిషిచ్యతే । ఉక్థైర్యజ్ఞేషు వర్ధతే । ఆపో వా ఇదగ్ం సర్వం విశ్వా భూతాన్యాపః । ప్రాణా వా ఆపః పశవ ఆపోఽన్నమాపోఽమృతమాపః । సమ్రాడాపో విరాడాపః స్వరాడాపశ్ఛందాగ్స్యాపో । జ్యోతీగ్ష్యాపో యజూగ్ష్యాపః సత్యమాపః । సర్వా దేవతా ఆపో భూర్భువః సువరాప ఓమ్ ।। గంగే చ యమునే చైవ గోదావరీ సరస్వతీ । నర్మదే సింధు కావేరీ జలేఽస్మిన్ సన్నిధిం కురు ।। కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమీ । భాగీరథీతి విఖ్యాతాః పంచగంగాః ప్రకీర్తితాః ।। ఆయాంతు దేవ పూజార్థం మమ దురితక్షయకారకాః । ఇప్పుడు ఈ మంత్రం చదువుతూ పూజాద్రవ్యాలపై, ప్రతిమపై, మీపై, మీ పరివారంపై కలశం లోని పుష్యంతో నీరు చల్లాలి. ఆయాంతు శ్రీమహాగణపతి పూజార్థం దురితక్షయ కారకాః ఓం ఓం ఓం కలశోదకేన పూజా ద్రవ్యాణి సంప్రోక్ష్య ।।దేవమాత్మానంచసంప్రోక్ష్య ।। ఇక్కడ గణపతి పూజ చేయాలి. గణపతి పూజ కొరకు పుర్వాంగ పూజ ప్రక్కన ఉన్న tabని click చేసి చూడండి.
గణపతి ఆరాధన
గణపతి స్థాపన మంత్రం: శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం । ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ।। శ్రీ మహాగణాధిపతిం సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్నీ పుత్ర పరివార సమేతం అస్మిన్ బింబే శ్రీ మహాగణాధిపతిమావాహయామి। స్థాపయామి పూజయామి। ప్రాణప్రతిష్ఠ: ఓం అసునీతే పునరస్మాసు చక్షుః పునః ప్రాణమిహ నో ధేహి భోగమ్। జ్యోక్పశ్యేమ సూర్యముచ్చరంత మనుమతే మృడయా నః స్వస్తి।। అమృతం వై ప్రాణా అమృతమాపః ప్రాణానేవ యథాస్థానముపహ్వయతే।।ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం। ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే।। శ్రీ మహాగణపతయే నమః। స్థిరో భవ వరదో భవ। సుముఖో భవ సుప్రసన్నో భవ। మమాభిముఖో భవ। మీ చేతులు దోసిలిలా పెట్టి మీ వైపు తిప్పుకోవాలి స్థిరాసనం కురు। రెండు తమపాకులు కుడి చేతితో తల్లక్రిందులుగా గణపతి శిరస్సుపై ఉంచుతూ ఈ మంత్రం చదవాలి. (హరిద్రా గణపతి అయితే పైదిశ లో పెట్టాలి). ధ్యానం: వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ। నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా।। శ్రీ మహాగణాధిపతయే నమః। ధ్యాయామి।ధ్యానం సమర్పయామి। గణనాథుడిని మనసులో ధ్యానించాలి. ఆవాహనం: శ్రీ మహాగణాధిపతయే నమః। ఆవాహయామి।స్థాపయామి పూజయామి। గణనాథుడిని మనసారా ఆహ్వానించాలి. ఆసనం: శ్రీ మహాగణాధిపతయే నమః। నవరత్నఖచిత సింహాసనం సమర్పయామి.। పుష్పాలను సమర్పించాలి. పాద్యం: శ్రీ మహాగణాధిపతయే నమః। పాదయోః పాద్యం సమర్పయామి। గణనాథుడి పాదాలు కడగాలి. అర్ఘ్యం: శ్రీ మహాగణాధిపతయే నమః। హస్తయోరర్ఘ్యం సమర్పయామి। కలశంలో ఉన్న పుష్పంతో కానీ లేదా ఉద్ధరణితో కానీ నీరు తీసుకొని చూపించి అర్ఘ్య పాత్రలో చల్లాలి/వదలాలి. ఆచమనం: శ్రీ మహాగణాధిపతయే నమః। ముఖే ఆచమనీయం సమర్పయామి। కలశంలో ఉన్న పుష్పంతో కానీ లేదా ఉద్ధరణితో కానీ నీరు తీసుకొని హరిద్రా గణపతికి చూపించి అర్ఘ్య పాత్రలో చల్లాలి/వదలాలి. శుద్ధోదకస్నానం: సర్వనదీ శుద్ధజల సంయుతం కలశేస్మిన్ సన్నిధౌ భవ। స్నానం కురుష్వ గణనాథా అగ్రపూజ్యాయా నమోఽస్తు తే ।। శ్రీ మహాగణాధిపతయే నమః। శుద్ధోదక స్నానం సమర్పయామి। స్నానానంతరం ముఖేశుద్దాచమనీయం సమర్పయామి। తమలపాకులతో జలమును చల్లాలి. వస్త్రం: శ్రీ మహాగణాధిపతయే నమః। వస్త్రయుగ్మం సమర్పయామి। వస్త్రార్ధం అక్షతాన్ సమర్పయామి। అక్షతలును సమర్పించాలి. యజ్ఞోపవీతం: శ్రీ మహాగణాధిపతయే నమః। యజ్ఞోపవీతం సమర్పయామి।। యజ్ఞోపవీతార్ధం అక్షతాన్ సమర్పయామి.।। అక్షతలును సమర్పించాలి. చందనం: శ్రీ మహాగణాధిపతయే నమః। శ్రీ గంధాన్ ధారయామి। గంధం మరియు కుంకుమ పెట్టాలి. అక్షతలు: శ్రీ మహాగణాధిపతయే నమః। అక్షతాన్ సమర్పయామి।। అక్షతలును సమర్పించాలి. హరిద్రాచూర్ణం (పసుపు): శ్రీ మహాగణాధిపతయే నమః। హరిద్రా చూర్ణం సమర్పయామి।। పసుపును సమర్పించాలి. కుంకుమ: శ్రీ మహాగణాధిపతయే నమః। కుంకుమ విలేపనం సమర్పయామి।। కుంకుమను సమర్పించాలి. సుగంధ పరిమళ ద్రవ్యము : శ్రీ మహాగణాధిపతయే నమః। సుగంధ పరిమళ ద్రవ్యాణిం సమర్పయామి ।। అక్షతలను సమర్పించాలి. పుష్పైః పూజయామి: ఒక్కో నామము చదువుతూ విడిపూలు (ఎర్రని రంగు పుష్పముులు ఉంటె మంచిది). గణనాథునిపై వేస్తూ ఉండాలి. ఓం సుముఖాయ నమః। ఓం ఏకదంతాయ నమః। ఓం కపిలాయనమః। ఓం గజకర్ణకాయ నమః। ఓం లంబోదరాయనమః। ఓం వికటాయ నమః। ఓం విఘ్నరాజాయ నమః। ఓం ధూమకేతవే నమః। ఓం గణాధిపాయనమః। ఓం గణాధ్యక్షాయ నమః। ఓం ఫాలచంద్రాయ నమః। ఓం గజాననాయ నమః। ఓం వక్రతుండాయ నమః। ఓం శూర్పకర్ణాయ నమః। ఓం హేరంబాయ నమః। ఓం స్కందపూర్వజాయ నమః। ఓం సర్వసిద్ధిప్రదాయ నమః। శ్రీ మహాగణాధిపతయే నమః। నానావిధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి।। ధూపం: శ్రీ మహాగణాధిపతయే నమః।।ధూపమాఘ్రాపయామి।। అగరుబత్తులు వెలిగించి ఘంటా మోగిస్తూ చూపించాలి దీపం: శ్రీ మహాగణాధిపతయే నమః।ప్రత్యక్ష దీపం దర్శయామి।। ధుపా దీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి।। దీపానికి నమస్కారం చేయాలి నైవేద్యం: ఓం భూర్భువ॒స్సువ॑: । తత్స॑వి॒తుర్వరేణ్య॒o భర్గో॑ దే॒వస్య॑ ధీమహి । ధియో॒ యో న॑: ప్రచో॒దయాత్ ।। సత్యం త్వా ఋతేన పరిషించామి । సాయంకాలం ‐ ఋతం త్వా సత్యేన పరిషించామి అని చెప్పాలి. అమృతమస్తు । అమృ॒తో ప॒స్తర॑ణమసి । శ్రీ మహాగణాధిపతయే నమః అవసరార్థం మహానివేదనం సమర్పయామి । ఓం ప్రాణాయ స్వాహా । ఓం అపానాయ స్వాహా । ఓం వ్యా॒నాయ స్వాహా । ఓం ఉదానాయ స్వాహా । ఓం సమానాయ స్వాహా । మధ్యే మధ్యే పానీయం సమర్పయామి । అమృ॒తాపిధానమ॑సి । ఉత్తరాపోశనం సమర్పయామి । హస్తౌ ప్రక్షాళయామి । పాదౌ ప్రక్షాళయామి । శుద్ధ ఆచమనీయం సమర్పయామి । శ్రీ మహాగణాధిపతయే నమః। నైవేద్యం సమర్పయామి।। పండ్లు సమర్పించాలి. తాంబూలం: శ్రీ మహాగణాధిపతయే నమః। తాంబూలం సమర్పయామి ।। రెండు తమలపాకులు తొనలు ఆకుల కొసలు ఉత్తరం వైపు ఉన్నట్లుగా పెట్టి అందులో వక్కలు వేసి దైవానికి సమర్పించాలి. నీరాజనం: శ్రీ మహాగణాధిపతయే నమః। కర్పూరనీరాజనం సమర్పయామి।। కర్పూర హారతి ఇవ్వాలి. మంత్రపుష్పం: సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః । ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః వక్రతుండశ్శూర్పకర్ణో హేరంబస్స్కందపూర్వజః । షోడశైతాని నామాని యః పఠేచ్ఛృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే । ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి। తన్నో దంతిః ప్రచోదయాత్।। శ్రీ మహాగణాధిపతయే నమః। పాదారవిందయోః సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి। అక్షతలు, పుష్పాలను సమర్పించాలి. ఆత్మప్రదక్షిణ నమస్కారం: అక్షతలును పుష్పాలు చేతిలో తీసుకొని తమ కుడివైపుకు 3 లేదా 5 మార్లు తిరుగుతూ ఆత్మప్రదక్షిణ చేయాలి. తదుపరి అక్షత పుష్పాలను సమర్పించాలి. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోఽహం పాపకర్మాఽహం పాపాత్మా పాపసంభవః త్రాహి మాం కృపయా సాయి శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్కారుణ్య భావేన రక్ష రక్ష శ్రీసాయినాథ ప్రభో ఓం మహాగణాధిపతయే నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి।। ఉపచార పూజా: సిద్ధి బుద్ధి సామెత శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః ఛత్రమాచ్ఛాదయామి । చామరైర్వీజయామి । నృత్యం దర్శయామి । గీతం శ్రావయామి । వాద్యం ఘోషయామి । ఆందోళికానారోహయామి । అశ్వానారోహయామి । గజానారోహయామి । సమస్త రాజోపచార దేవోపచార భక్త్యుపచార శక్త్యుపచార మంత్రోపచార పూజాన్ సమర్పయామి ।। అక్షతలు, పసుపు, కుంకుమ సమర్పిచాలి. సమర్పణం: యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు। న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే గజాననం।। మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప। యత్పూజితం మయా దేవా పరిపూర్ణం తదస్తు తే। ఓం వక్రతుండ మహాకాయ సూర్య కోటి సమప్రభ। నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా।। అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మకః శ్రీ మహాగణాధిపతి సుప్రీతో సుప్రసన్నో వరదో భవంతు।। ఉత్తరే శుభకర్మణ్యవిఘ్నమస్తు ఇతి భవంతో బ్రువంతు। ఉత్తరే శుభకర్మణి అవిఘ్నమస్తు।। ఏతత్ ఫలం, శ్రీ మహాగణాధిపతి చరణారవిందార్పణమస్తు। అక్షతలును కుడిచేతిలో తీసుకొని కలశములోని నీటితో క్రింద అర్ఘ్య పాత్రలో వదలాలి. పుష్ప ధారణ: సహస్రపరమా దేవీ శతమూలా శతాంకురా । సర్వం హరతు మే పాపం దూర్వా దుస్స్వప్ననాశినీ ।। పూజా సమయాన గణపతి వద్ద పుష్పముును ధరించడం కేవలం ఆచారం మాత్రమే కాదు, అది సాక్షాత్తు గణపతి అనుగ్రహాన్ని, ఆయురారోగ్యాలను పొందే ఒక పవిత్ర ప్రక్రియ. ధ్యానం: కంకణ ధారణ: బధ్నామి కంకణం పుణ్యం సర్వపాప వినాశనం । ధర్మకామార్థ సిద్ధ్యర్థం మమ సౌభాగ్య వర్ధనం ।। దంపతులు ఒకరినొకరు కంకణాలు కట్టుకోవాలి.పుణ్యాహవాచనం/స్వస్తి పుణ్యాహవాచనం
సంకల్పం: ఇప్పుడు కుడిచేతిలో అక్షతలు తీసుకుని ,మీ కుడి కాలితొడపై ఎడమ అరచేతి నుంచి అక్షతలతో ఉన్న కుడిచేతిని పిడికిలిగా మూసి ఆ ఎడమ అరచేతిపైనుంచుతూ ఈ సంకల్పం చెప్పి పిడికిలిలో ఉన్నఅక్షతలను నీటితో అర్ఘ్యపాత్రలో వదలాలి.) పూర్వోక్త సంకల్పానుసారేణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ, శ్రీమాన్ …… గోత్రః …… నామధేయః ధర్మపత్నీ సమేతోహం, శ్రీమతః …… గోత్రస్య …… నామధేయస్య మమ సహకుటుంబస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం, గృహ-భూ-భాండ-ద్రవ్య-స్థల శుద్ధ్యర్థం, శరీర-మనో-బుద్ధి-చిత్త-ఆత్మ శుద్ధ్యర్థం, గృహ శుద్ధ్యర్థం , గృహోపకరణ శుద్ధ్యర్థం, వృద్ధ్యర్థం, శాంత్యర్థం, అభ్యుదయార్థం చ మహాజనైః సహ స్వస్తి పుణ్యాహవాచనం కరిష్యే।। పుణ్యాహం వాచయేత్ ఓమ్ భూమిం ప్రార్థ్య ఈ మంత్రం చదువుతూ భూమిని ప్రార్థించి, పుణ్యాహవాచనాన్ని ప్రారంభించాలి. ఓం మహి ద్యౌః పృథివీచన ఇమం యజ్ఞం మిమిక్షతామ్ । పిపృతాం నో భరీమభిః ।। కలశ అభిమంత్రణం: ఈ మంత్రం చదువుతూ మూడు కలశాలను చేతితో తాకుతూ పవిత్రం చేయాలి. ఓం ఆకలశేషు ధావతి పవిత్రే పరిషిచ్యతే । ఉక్థైర్యజ్ఞేషు వర్ధతే । ఇతి కలశానాబి మంత్య్ర కలశ అభిమంత్రణం: ఈ మంత్రం చదువుతూ మూడు కలశాలను చేతితో తాకుతూ పవిత్రం చేయాలి. కలశాలలో నీరు నింపడం & నదీ ఆవాహనం: ఈ మంత్రం చదువుతూ మూడు కలశాలలో నీరు నింపాలి: ఆ కలశాల జలంలోకి గంగాది పుణ్య నదులను ఆహ్వానించాలి. ఆదౌ సోదక కలశత్రయం గంధపుష్ప అక్షత ఆమ్రపల్లవకాండాదిభిరలంకృత్య వామదక్షిణభాగేషు ఏకైక కలశం పూర్వత ఏకకలశం సంస్థాప్య ఆపో హిష్ఠా మయోభువ॒స్తా న॑ ఊర్జే ద॑ధాతన। మహేరణాయ చక్షసే। యోవః శివత॑మో రసస్తస్య భాజయతే హ నః। ఉశతీరివ మాతరః। తస్మా॒ అరంగమామవో యస్య॒ క్షయాయ జిన్వథ। ఆపో॑జ॒నయథా చ నః।। ఇతి ఉదకమాపూర్య। గంగే చ యమునే చైవ గోదావరీ సరస్వతీ । నర్మదే సింధు కావేరీ జలేఽస్మిన్ సన్నిధిం కురు ।। కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమీ । భాగీరథీతి విఖ్యాతాః పంచగంగాః ప్రకీర్తితాః ।। ఇతి నదీరావాహ్య। వరుణ ఆవాహనం: ఈ మంత్రం చదువుతూ కలశాలలో ఆయా దేవతలను ఆవాహనం వేయాలి. ప్రాక్కలశే (తూర్పు కలశం): ఈ మంత్రం చదువుతూ తూర్పు కలశంలో వరుణ దేవుడిని ఆవాహనం వేయాలి. ఇమంమే వరుణశృధీ హవామధ్యాచమృడయ త్వామవస్యురాచకే ప్రాక్ కలశే ఓం భూ: వరుణ మావాహయామి, ఓం భువ: వరుణమావాహయామి - ఓగ్ం సువ: వరుణ మావాహయామి ఓం భూర్భువస్సువః వరుణమావాహయామి దక్షిణ కలశే (దక్షిణ కలశం): ఈ మంత్రం చదువుతూ దక్షిణ కలశంలో వాస్తు పురుషుడిని ఆవాహనం వేయాలి. వాస్తోప్పతే ప్రతిజాని హ్యస్మాన్ త్వావేశోఅనమీవో భవాన: యత్వేమహే ప్రతి తన్నో జుషస్వ శన్న ఏదిద్విపదే శంచతుష్పదే ఇతి దక్షణ కలశే ఓం భూః: వాస్తు పురుషమావాహయామి - ఓం భువ: వాస్తు పురుషమావాహయామి ఓగ్ం సువః వాస్తు పురుషమావహాయామి ఓం భూర్భువస్సువః వాస్తు పురుషమావాహయామి ఉత్తర కలశే (ఉత్తర కలశం): ఈ మంత్రం చదువుతూ ఉత్తర కలశంలో బ్రహ్మా పురుషుడిని ఆవాహనం వేయాలి. బ్రహ్మజజ్ఞానం ప్రధమం పురస్తాద్విసిమత స్సురుచో వేన ఆవః సబుర్నియా ఉపమా అస్యవిష్ఠా సతశ్చయోని మసతశ్చవివ: ఇతి ఉత్తర కలశే ఓం భూః బ్రహ్మాణ మావాహయామి ఓం భువ: బ్రహ్మాణమావాహయామి ఓం సువ బ్రహ్మాణమావాహయామి ఓం భూర్భువస్సువః బ్రహ్మాణ మావాహయామి ఈ మంత్రం చదువుతూ యజమాని తన శిరస్సుపై చేయినుంచాలి. ఓం పుణ్యాహం దీర్ఘమాయురస్తు । శిరస్యాభిమంత్య్ర । ఈ మంత్రం చదువుతూ యజమాని తన కుడిచేతిని ఎడమ చేతిపై నుంచి అరచేతులతో కలశాలను స్పృశించాలి. శివా ఆపస్సంతు । కలశేష్వభిమంత్య్ర ఈ మంత్రం చదువుతూ యజమాని తన హృదయాన్ని తాకాలి. సౌమనస్యమస్తు హృదయమభీమంత్య్ర ఈ మంత్రం చదువుతూ బ్రాహ్మణుడు తన కుడి చేతిలోని అక్షతలను యజమాని శిరస్సుపై (తలపై) చల్లాలి. అక్షతంచారిష్టంచాస్తు ఇలా ఈ ప్రక్రియను మూడు మార్లు చేయాలి. ఏవం త్రిః ఈ మంత్రాలు చదువుతూ గంధం, పువ్వులు, అక్షతలను, రూపాయి నాణాన్ని, పోకను, యజమాని కలశాలలో వేయాలి. గంధాః పాంతు - సుమంగళ్యాస్తూ । పుష్పాణి పాంతు - సౌమంగళ్యన్ చాస్తూ । అక్షతాః పాంతు - ఆయుష్యమస్తు । తాంబూలాని పాంతు - ఐశ్వర్యమస్తు । దక్షిణాః పాంతు - బహుదేయంచాస్తు । యజమాని కుడిచేత్తో కలశాలను పట్టుకుని, అక్షతలు కలశాల వద్ద వదులుతూ, అక్కడ ఉన్న బ్రాహ్మణులను "పుణ్యాహం అని పలకండి" (అనుజ్ఞ) అని కోరాలి. స్వశ్రేయమస్తు । ప్రజాపతిః ప్రియతామ్ । శాంతిరస్తు । పుష్టిరస్తు । తుష్టిరస్తు । యం కృత్వా సర్వ వేద యజ్ఞ క్రియాకరణ కర్మా రంభః శుభాః ప్రవర్తంతే । తమహమోంకారమాదిం కృత్వా పుణ్యాహం వాచయిష్యే ।। యజమాని ఆలా పలుకగానే, ప్రధాన పురోహితుడు మరియు బ్రాహ్మణులు ఇలా పలకాలి. ప్రధాన పురోహితుడు: ఓం పుణ్యం పుణ్యాహం వాచయిష్యే । బ్రాహ్మణులు: ఓం వాచ్యతామ్ । శ్రీ పుణ్యాహవాచన శాంతి మంత్రపాఠము: ఈ మంత్రాలు చదువుతున్నపుడు యజమానిని శ్రద్ధగా వినమని చెప్పాలి. ఓం భద్రం కర్ణేభిః శ్రుణుయామ దేవాః । భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః । స్థిరైరంగైస్తుష్టువాగ్ం సస్తనూభిః । వ్యశేమ దేవహితం యదాయుః । ద్రవిణోదా ద్రవిణసశ్చుతస్య ద్రవిణోదా రాసతే మఘోనామ్ । ద్రవిణోదా వీరవతీమిషంనో ద్రవిణోదా రాసతే దీర్ఘమాయుః ।। సవితా పశ్చాత్తాత్ సవితా పురస్తాత్ సవితోత్తరాత్తాత్ సవితాధరాత్తాత్ । సవితా నస్సువతు సర్వతాతిం సవితా నో రాసతాం దీర్ఘమాయుః ।। ఓం నవో నవో భవతి జాయమానోఽహ్నాం కేతురుషసామేత్యగ్రే । భాగం దేవేభ్యో విదధాత్యాయన్ ప్రచంద్రమస్తిరతి దీర్ఘమాయుః ।। ఈ మంత్రాలు చదువుతున్నపుడు కలశాలలోని నీటిని యజమాని దోసిలిలో పోయాలి, వారు ఆ నీటిని తలపై చల్లుకోవాలి. ఓం ఆప ఉందంతు జీవసే దీర్ఘాయుత్వాయ వర్చసే ।। యస్వా హృదా కీరిణా మన్యమానో మర్త్యం మత్యోజోహవీమి । జాతవేదో యశో అస్మాసు దేహి ప్రజాభిరగ్నే అమృతత్వమశ్యామ్ ।। యస్మై త్వగ్ం సుకృతే జాతవేద ఉలోకమగ్నే కృణవస్యోనమ్ । అశ్వినం స పుత్రిణం వీరవంతం గోమంతగ్ం రయిం నశతే స్వస్తి ।। ఓం సం త్వా సించామి యజుషా ప్రజామాయుర్ధనం చ ।। పై ప్రక్రియ తరువాత, ప్రధాన పురోహితుడు మరియు బ్రాహ్మణులు ఇలా పలకాలి. ప్రధాన పురోహితుడు: మనస్సమాధీయతామ్ । బ్రాహ్మణులు: సమాహిత మనసస్స్మః । ప్రధాన పురోహితుడు: ప్రసీదంతు భవంతః । బ్రాహ్మణులు: ప్రసన్నాస్స్మః । ఓం శాంతిరస్తు । పుష్టిరస్తు । తుష్టిరస్తు । వృద్ధిరస్తు । అవిఘ్నమస్తు । ఆయుష్యమస్తు । ఆరోగ్యమస్తు । స్వస్తి శివం కర్మాస్తు । కర్మ సమృద్ధిరస్తు । పుత్ర సమృద్ధిరస్తు । వేద సమృద్ధిరస్తు । శాస్త్ర సమృద్ధిరస్తు । ధనధాన్య సమృద్ధిరస్తు । ఇష్ట సంపదస్తు । ఈ మంత్రం చదువుతూ కలశ జలమును ఈశాన్య దిశలో చల్లవలెను ఈశాన్యాం బహిర్దేశే అరిష్ట నిరసనమస్తు ।। కలశయోర్ ఈశాన్యదేశే ఉదకంసించేత్ యత్పాపం తత్ప్రతిహతమస్తు । యచ్ఛ్రేయస్తదస్తు । శుక్రాంగారక బుధ బృహస్పతి శనైశ్చర రాహు కేతు సోమ సహితాదిత్య పురోగాః సర్వే గ్రహాః ప్రియంతామ్ । తిథి కరణ ముహూర్త జన్మనక్షత్ర దిగ్దేవతాః ప్రియంతామ్ ।। నైరుత్యాం దిశి కలశ జలమును నైరుతి దిశలో నీటిని చల్లవలెను. ఇప్పుడు ఈ క్రింది మంత్రాలను చదువుతూ దక్షిణ, ఉత్తరకలశాలలో ఉన్న నీటిని తూర్పు కలశంలో పోసి ఆ కలశ జలాన్ని తమలపాకులతో స్పృశిస్తూ ఉండాలి. శామ్యంతు ఘోరాణి । శామ్యంతు పాపాని । శామ్యంతు ఈతయః । ప్రథమ (ప్రాక్కలశే) కలశే శుభాని వర్ధంతామ్ । శివా ఋతవస్సంతు । శివా ఓషధయస్సంతు । శివా వనస్పతయస్సంతు । అహోరాత్రే శివే స్యాతామ్ ।। ఉత్తరే శుభకర్మణ్యవిఘ్నమస్తు । ఉత్తరోత్తర మహాభివృద్ధిరస్తు । ఉత్తరోత్తరాః శుభాః క్రియాః సంపద్యంతామ్ । అగ్నిపురోగా విశ్వే దేవాశ్చ ప్రియంతామ్ । మాహేశ్వరీ పురోగాః మాతరః ప్రియంతామ్ । ఇంద్రపురోగా మరుద్గణాః ప్రియంతామ్ ।। వశిష్ఠ పురోగా ఋషిగణాః ప్రియంతామ్ । శ్రీ విష్ణు పురోగాః సర్వే దేవాః ప్రియంతామ్ । ఆదిత్య పురోగాః సర్వే గ్రహా శ్చ ప్రియంతామ్ । ఋషయశ్ఛందా గ్ స్యాచార్యా వేదా యజ్ఞా దక్షిణాశ్చ ప్రియంతామ్ । బ్రహ్మా చ బ్రాహ్మణాశ్చ ప్రియంతామ్ । బ్రహ్మ విష్ణు మహేశ్వరాశ్చ ప్రియంతామ్ । శ్రద్ధా మేధే ప్రియేతామ్ । ప్రియతాం భగవాన్ నారాయణః । ప్రియతాం భగవాన్ స్వామీ మహాసేనః । ప్రియతాం భగవాన్ పితామహః । ప్రియతాం భగవాన్ పితామహః ।। ఓం సత్య ఏతా ఆశిషః సంతు । పుణ్యాహకాలా వాచ్యంతామ్ ।। నక్షత్ర శుద్ధి మంత్రము: ఈ మంత్రం చదువుతూ బ్రాహ్మణుడు యజమానిని మనసులో తన నక్షత్రాన్ని తలచుకోమని చెప్పాలి ఓం పుణ్యం నక్షత్రం తద్వట్కుర్వీతోపవ్యుషమ్ । యదా వై సూర్య ఉదేతి । అథ నక్షత్రం నైతి । యావతి తత్ర సూర్యో గచ్చేత్ । యత్ర జఘన్యం పశ్యేత్ । తావత్ కుర్వీత యత్కారీ స్యాత్ ।। ఓం తాని వా ఏతాని యమ నక్షత్రాణి । యాన్యేవ దేవ నక్షత్రాణి । తేషు కుర్వీత యత్కారీ స్యాత్ ।। యజమాని మూడు సార్లు చెప్పాలి పుణ్యాహ ఏవ కురుతే । ఓం పుణ్యాహం భవంతో బ్రువంతు । ఓం పుణ్యాహమ్ । ఏవం త్రిః ఈ మంత్రం చదువుతూ కలశాన్ని తాకుతూ ఉండి, మంత్రం ముగిశాక యజమాని అక్షతలను మూడు మార్లు కలశం వద్ద వదలాలి ఓం స్వస్తయే వాయుముపబ్రువామహై సోమం స్వస్తి భువనస్య యస్పతిః । బృహస్పతిం సర్వగణం స్వస్తయే స్వస్తయ ఆదిత్యాసో భవంతు నః ।। ఆదిత్య ఉదయనీయః స్వస్త్యా ప్రియంతే పథ్యం స్వస్తి మభ్యుద్యన్తి స్వస్త్యై వేదప్రియంతి స్వస్త్యుద్యంతి స్వస్త్యుద్యంతి ।। ఓం స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తినః పూషా విశ్వవేదాః । స్వస్తినస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తినో బృహస్పతిర్దధాతు ।। ఆక్షౌ దేవావసవ స్పోమ్యాసః చతస్రోదేవి రజరాశ్రవిష్టా । తే యజ్ఞం పాంతు రజసః పరస్తాత్। సంవత్సరిణ మమృతగ్ స్వస్తి ।। మహ్యం సహ కుటుంబాయ। శుద్ధివృద్ధ్యభ్యుదయ కర్మణే మహాజనాన్నమస్కుర్వాణాయ ఆశీర్వచనమపేక్షమాణాయ। ఆయుష్మతే స్వస్తిం భవంతో బృవంతు । బ్రాహ్మణులు మూడు సార్లు చెప్పాలి బ్రాహ్మణులు: ఆయుష్మతే స్వస్తి । ఓం స్వస్తి భవంతో బ్రువంతు - ఓం స్వస్తి - ఏవం త్రిః ఓం బుధ్యామ స్తోమం ననుయామవాచమనో మంత్రం సరదేహోవయాతమ్ । యశోను వక్తవ్యం మధుగోష్వంతరాభూతాంశో అశ్వినోః కామమప్రాః ।। సర్వామృద్ధిమృధ్నుయామితితం వై తేజసై వ పురస్తాత్పర్యభవచ్ఛం దోభిర్మధ్యతోక్షరై రుపరిష్టాద్గాయత్య్ర। సర్వతో ద్వాదశాహం పరిభూయా త్పర్వామృద్ధిమార్నోత్సర్వా మృద్ధిమృధోతి య ఏవం వేద ।। ద్వయ కలశ గ్రహణం: ఈ మంత్రాలు చదువుతూ రెండు కలశాలను (దక్షిణ కలశం మరియు ఉత్తర కలశం) కుడి, ఎడమ చేతులతో పట్టుకుని బ్రాహ్మణుడు తన ముఖాన్ని కొంచెం పైకి ఎత్తి కలశాల వైపు లేదా ఆకాశం వైపు చూస్తూ యజమానిని దీవించాలి. ఓం బుద్యాస్మ హవ్యైర్నమసో పసద్య మిత్రం దేవం మిత్రధేయంనో ఆస్తు । అనూరాధాన్ హవిషా వర్ధయంతః శతం జీవేమ శరదస్సవీరాః ।। త్రీణి త్రీణి వై దేవానామృద్ధాని । త్రీణి ఛందాంసి త్రీణి సవనాని । త్రయ ఇమే లోకాః । బుద్ధ్యామేవ తద్వీర్యేషు లోకేషు ప్రతితిష్ఠతి ।। వామదక్షిణ హస్తాభ్యాం దక్షిణోత్తరకలశా యుగ పద్గృహీత్వా । ప్రధాన పురోహితుడు మరియు బ్రాహ్మణులు ఇలా పలకాలి. ప్రధాన పురోహితుడు: ఋద్ధ్యం భవంతో బ్రువంతు । బ్రాహ్మణులు: ఋధ్యతామ్ । ఋద్ధిః సమృద్ధిః । ఈ మంత్రాలూ చదువుతూ యజమాని తన గోత్రం పేరు వంశం పేరు చెప్పుకోమనాలి లేదా ప్రధాన పురోహితుడు చెప్పాలి. స్వస్తి పుణ్యాహ సమృద్ధిరస్తు । వర్షశత సంపూర్ణమస్తు । ------గోత్రాభివృద్ధిరస్తు (గోత్రం పేరు చెప్పాలి) -----వంశాభివృద్ధిరస్తు(వంశం పేరు చెప్పాలి) । శాంతిః పుష్టిః తుష్టిశ్చాస్తు । శుభం శుభమస్తు ।। పావమాన శుద్ధి (మార్జనం): ఇత్యుదకం నిషిచ్య - నీటిని ప్రోక్షిస్తూ ఈ మంత్రాలు చదువుతూ, తూర్పు కలశంలోని పవిత్ర జలాన్ని దర్భలతో లేదా తమలపాకులతో లేదా మామిడాకులతో గానీ ముంచి యజమానిపై, పూజా ద్రవ్యాలపై మరియు ఇంటి పరిసరాలపై చల్లాలి. యేన దేవాః పవిత్రేణ ఆత్మానం పునతే సదా । తేన సహస్రధారేణ పావమాన్యః పునంతు మా ।। ప్రాజాపత్యం పవిత్రమ్ । శతోద్యామగ్ం హిరణ్మయమ్ । తేన బ్రహ్మవిదో వయమ్ । పూతం బ్రహ్మ పునీమహే ।। ఇంద్రస్సునీతీ సహ మా పునాతు। సోమస్స్వస్త్యా వరుణస్సమీచ్యా । యమో రాజా ప్రమృణాభిః పునాతు మా జాతవేదా మోర్జయంతీ పునాతు ।। ఇతి మార్జనం కృత్వా ।। దిశ మార్జనం: ఈ మంత్రాలు చదువుతూ, తూర్పు కలశంలోని పవిత్ర జలాన్ని దర్భలతో లేదా తమలపాకులతో లేదా మామిడాకులతో గానీ అన్ని దిశల్లో ప్రోక్షించాలి (చల్లాలి). ప్రాచ్యాం (తూర్పు) దిశి దేవా ఋత్విజో మార్జయంతాం । దక్షిణాయాం(దక్షిణ) దిశి మాసాః పితరో మార్జయంతాం । ప్రతీచ్యాం(పడమర) దిశి గృహాః పశవో మార్జయంతాం । ఉదీచ్యాం(ఉత్తరం) దిశి ఆప ఓషధయో వనస్పతయో మార్జయంతాం । ఊర్ధ్వాయాం(పైకి) దిశి యజ్ఞః సంవత్సరః యజ్ఞపతిర్మారజయం తామ్ ।। ఏతేభ్యో బ్రాహ్మణేభ్యః నానా గోత్రేభ్యః నానా నామభ్యః । శ్రీ లక్ష్మీనారాయణ ఉమామహేశ్వర ఆదిత్యాది నవగ్రహ ప్రీత్యర్థం స్వస్తి పుణ్యాహవాచన మంత్రజప దక్షిణాం మనసోత్సాహ పరిమిత హిరణ్యం తుభ్యమహం సంప్రదదే నమమ ।। ఈ మంత్రాలు చదువుతూ ఇంటి దైవాన్ని తలుచుకుంటూ బెల్లం నివేదన చేయాలి. వాస్తోష్పతే ప్రతిజానీహ్యస్మాన్ త్స్వావేశో అనమీవో భవానః । యత్వేమహే ప్రతి తన్నో జుషస్వ శన్నో భవ ద్విపదే శం చతుష్పదే ।। వాస్తోష్పతే శగ్మయా సంసదా తే సక్షీమహి రణ్వయా గాతుమత్యా । ఆవహక్షేమ ఉత యోగే వరం నో యూయం పాత స్వస్తిభిస్సదా నః ।। అమీవహా వాస్తోష్పతే విశ్వా రూపాణ్యావిశన్। సఖా సుశేవ ఏధి నః ।। శుభగ్ం శుభమ్ ।। స్వస్త్యయనం తార్క్ష్యమరిష్టనేమి। మహద్భూతం వాయసం దేవతానామ్ । అసురఘ్నమింద్ర సఖం సమత్సు। బృహద్వ శోనామమివా రుహేమ ।। అగ్ం హోముచ మాంగిరసం గయంచ స్వస్త్యాత్రేయం మనసా చ తార్క్ష్యమ్ । ప్రయతపాణిః శరణం ప్రపద్యే స్వస్తి సంబాధేష్వభయం నో అస్తు ।। శుభగ్ం శుభమ్ ఇతి పుణ్యాహవాచనం।। ఓం శాంతిః శాంతిః శాంతిః।।వాస్తు మండలం - షోడశోపచారపూజ (click to expand)
ప్రధాన కలశ పూజ
దంపతులిరువురూ అక్షతలను కలశముపై సమర్పించాలి. ఆవాహనం: అస్మిన్ కలశే ఓం భూర్భువస్సువః మహా గణపతి మావాహయామి । ఓం భూర్భువస్సువః వరుణ మావాహయామి । ఓం భూర్భువస్సువః ఇంద్రాద్యష్టదిక్పాలకాన్ మావాహయామి । ఓం భూర్భువస్సువః ఆదిత్యాది నవగ్రహ దేవతా మావాహయామి ఓం భూర్భువస్సువః వాణీ హిరణ్య గర్భాభ్యాం మావాహయామి । ఓం భూర్భువస్సువః లక్ష్మీనారాయణమావాహయామి । ఓం భూర్భువస్సువః గౌరీశంకరమావాహయామి । ఓం భూర్భువస్సువః త్య్రంబకమావాహయామి । ఓం భూర్భువస్సువః అపమృత్యు దేవతా ఆవాహయామి । ఓం భూర్భువస్సువః మన్యు మావాహయామి । ఓం భూర్భువస్సువః ధన్వంతరి మావాహయామి । ఓం భూర్భువస్సువః భూదేవతా మావాహయామి ఓం భూర్భువస్సువః వాస్తు పురుషమావాహయామి। ఓం భూర్భువస్సువః వాస్తు అంతర్మండల బహిర్మండల దేవతామావాహయామి ఓం భూర్భువస్సువః ఈశానమావాహయామి । ఓం భూర్భువస్సువః సర్వాన్ దేవానావాహయామిః । ఓం భూర్భువస్సువః కుల దేవతా ఆవాహయామి । ఓం భూర్భువస్సువః గ్రామా దేవత మావాహయామి । ఓం భూర్భువస్సువః సర్వాన్ దేవాన్ ఆవాహయామి । దర్భలు లేదా తమలపాకులు కలశముపై నుంచి ఈ క్రింది మంత్రం చెప్పాలి ఓం ఆకలశేషు ధావతి పవిత్రే పరిషిచ్యతే। ఉక్థైర్యజ్ఞేషు వర్ధతే। ఆపో వా ఇదగ్ం సర్వం విశ్వా భూతాన్యాపః। ప్రాణా వా ఆపః పశవ ఆపోఽన్నమాపోఽమృతమాపః। సమ్రాడాపో విరాడాపః స్వరాడాపశ్ఛందాగ్స్యాపో। జ్యోతీగ్ష్యాపో యజూగ్ష్యాపః సత్యమాపః। సర్వా దేవతా ఆపో భూర్భువః సువరాప ఓమ్।। గంగే చ యమునే చైవ గోదావరీ సరస్వతీ। నర్మదే సింధు కావేరీ జలేఽస్మిన్ సన్నిధిం కురు।। కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమీ। భాగీరథీతి విఖ్యాతాః పంచగంగాః ప్రకీర్తితాః।। 3 సార్లు ఓంకారమును ఉచ్చరించి దర్భలను కలశానికి కుడివైపుగానుంచాలి ఈ మంత్రం చదువుతూ సర్వదేవతలనూ ఆవాహనం చేసి షోడశోపచార పూజా చేయాలి హ్రీంకారాసన గర్భితానల శిఖాం సౌః క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రిణేత్రోజ్జ్వలామ్ । వందే పుస్తకపాశమంకుశ ధరాం స్రగ్భూషితాముజ్జ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పర కళాం శ్రీచక్రసంచారిణీమ్ ।। ఓం భూర్భువస్సువః ఆవాహితేభ్యః సర్వేభ్యో దేవేభ్యః । ధ్యాయామి ధ్యానం సమర్పయామి। దేవతలను మనసులో ధ్యానించాలి ఆవాహయామి స్థాపయామి పూజయామి। దేవతలను కలశములోకి మనసారా ఆహ్వానించాలి రత్న సింహాసనార్డే అక్షతాన్ సమర్పయామి । కలశానికి అక్షతలు సమర్పించాలి పాద్యం సమర్పయామి ఆర్ఘ్యం సమర్పయామిః । పుష్పంతో కానీ లేదా ఉద్ధరణితో కానీ నీరు తీసుకొని కలశానికి చూపించి అర్ఘ్య పాత్రలో చల్లాలి/వదలాలి స్నానం సమర్పయామి । కలశంపై తమలపాకులతో జలమును చల్లాలి వస్త్రం యజ్ఞోపవీతార్థాన్ అక్షతాన్ సమర్పయామి । కలశంపై అక్షతలు సమర్పించాలి శ్రీగంధం ధారయామి । పుష్పంతో గంధం కలశానికి సమర్పించాలి కుంకుమం సమర్పయామి । కలశానికి కుంకుమ సమర్పించాలి పుష్పముాలాం సమర్పయామిః । కలశంపై పుష్పముాలా వేయాలి పరిమళ ద్రవ్యం సమర్పయామి। కలశంపై పన్నీరు చల్లాలి పుష్పైః పూజాయామి ఒక్కో నామము చదువుతూ విడిపూలు కలశముపై వేస్తూ ఉండాలి ఓం కేశవాయ నమః । ఓం నారాయణాయ నమః । ఓం మాధవాయ నమః । ఓం గోవిందాయ నమః । ఓం విష్ణవే నమః । ఓం మధుసూధనాయనమః। ఓం త్రివిక్రమాయ నమః । ఓం వామనాయ నమః । ఓం శ్రీధరాయ నమః । ఓం హృషీకేశాయ నమః । ఓం పద్మనాభాయ నమః । ఓం దామోదరాయ నమః । ఓం సంకర్ణణాయ నమ: । ఓం వాసుదేవాయ నమః। ఓం ప్రద్యుమ్నాయ నమః । ఓం అనిరుద్దాయ నమః । ఓం పురుషోత్తమాయ నమః ఓం అధోక్షజాయ నమః । ఓం నారసింహాయ నమః । ఓం అచ్యుతాయ నమః । ఓం జనార్ధనాయ నమః। ఓం ఉపేంద్రాయ నమః । ఓం హరయే నమః । ఓం శ్రీకృష్ణాయ నమః । ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః । ఆవాహితేభ్యః సర్వేభ్యో దేవేభ్యః నానావిధ పరిమళ పుష్పాక్షతాంజలిం సమర్పయామి। కలశానికి అక్షతలు సమర్పించాలి ధూపమాఘ్రాపయామి । కలశానికి ధూపం సమర్పించాలి దీపం దర్శయామిః కలశానికి దీపం చూపించాలి ధూప దీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి । పుష్పముుతో నీటిని ధూపము దీపం చుట్టూ త్రిప్పాలి నైవేద్యం నివేదయామి । కలశానికి నైవేద్యం సమర్పించాలి నీరాజనమ్ దర్శయామి కలశానికి నీరాజనమ్ ఇవ్వాలి సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి । కలశానికి పుష్పం సమర్పించాలి కలశే ఆవాహితేభ్యః సర్వేభ్యో దేవేభ్యో నమః । కలశానికి అక్షతలు సమర్పించాలి సర్వోపచార పూజాం సమర్పయామి కలశానికి నమస్కారం చేయాలివాస్తు మండల దేవతా పూజ
హృదయపూర్వకంగా భూమాతను నమస్కరించాలి. భూదేవి ధ్యానం స్యోనా పృథివి భవానృక్షరాని వేశనీ । యచ్ఛాన శ్శర్మ స ప్రథాః ।। ధ్యాయామి ధ్యానం సమర్పయామి । హృదయపూర్వకంగా భూమాతను నమస్కరించాలి. వాస్తుపురుష ధ్యానం ఓం మానదండం కరాబ్జేన వహంతం భూమి శోధకం । వందేహం వాస్తుపురుషం శయానం శయనే శుభే ।। ఓం వాస్తు పురుష నమస్తేస్తు భూశయ్యాది గత ప్రభో । మద్గృహే ధనధాన్యాది సమృద్ధిం కురుమే ప్రభో ।। పంచవక్త్రం జటాజూటం పంచదశ విలోచనం । సద్యోజాతానాంచ శ్వేతం వామదేవంతు కృష్ణకం ।। అఘోరం రక్తవర్ణంచ శరీరం హేమవర్ణకం । మహాబాహుం మహాకాయం కర్ణకుండల మండితం ।। పీతాంబరం పుష్పమాలా నాగయజ్ఞోపవీతినం । రుద్రాక్షమాలాభరణం వ్యాఘ్రచర్మోత్తరీయకం ।। అక్షమాలాంచ పద్మంచ నాగశూల పినాకినాం । డమరం వీణబాణంచ శంఖచక్ర కరాన్వితం ।। కోటిసూర్య ప్రతీకాశం సర్వజీవ దయాపరం । దేవదేవం మహాదేవం విశ్వకర్మన్ జగద్గురో ।। ఓం వాస్తుమూర్తిః పరంజ్యోతిర్వాస్తు దేవః పరశ్శివః । వాస్తుదేవాస్తు సర్వేషాం వాస్తుదేవం నమామ్యహం ।। ఏకాశీతి దేవతా ఆవాహనం ఇప్పుడు అక్షతలు పుష్పములతో యీ క్రింది విధముగా 81 దేవతలను ఆవాహనం చేయాలి ఇప్పుడు ఈ మంత్రములతో ఈశాన్యం నుండి మొదలొకొని క్రమముగా గదులలో కొలువైన దేవతలను అనగా శిఖీ దేవత నుండి పృథ్వీ దేవత వరకు ఆవాహనం చేయాలి. పుష్పాక్షతలను సమర్పించి నమస్కరించాలి. శిఖీ (ఈశాన్య మూల దేవత) ఓం నమశ్శంభవే చ మయోభవే చ నమశ్శంకరాయ చ మయస్కరాయ చ నమశ్శివాయ చ శివతరాయ చ ।। ఓం శిఖినే నమః ఆవాహయామి స్థాపయామి పూజయామి। పర్జన్యః (తూర్పు దిశ రెండో గది) ఓం ని కామెనీ కామెనః పర్జన్యో వర్షతు ఫలిన్యో న ఓషధయః పచ్యంతాం యోగక్షేమో నః కల్పతాం నమః ।। ఓం పర్జన్యాయ నమః ఆవాహయామి స్థాపయామి పూజయామి। జయంతః (తూర్పు దిశ మూడో గది) ఓం మర్మాణి తే వర్మభిశ్ఛాదయామి సోమస్త్వా రాజామృతేనాభివస్తామ్ । ఉరోర్వరీయో వరివస్తే అస్తు జయంతంత్వా మనుమదంతు దేవాః ।। ఓం జయంతాయ నమః ఆవాహయామి స్థాపయామి పూజయామి। కులిశాయుధః / ఇంద్రః (తూర్పు దిశ నాల్గో గది) ఓం ఇంద్రస్య వజ్రో మరుతామనీకం మిత్రస్య గర్భో వరుణస్య నాభిః । సేమాం నో హవ్యదాతిం జుషాణో దేవరథ ప్రతిహవ్యా గృభాయ ।। ఓం కులిశాయుధాయ నమః ఆవాహయామి స్థాపయామి పూజయామి। సూర్యః (తూర్పు దిశ ఐదో గది - ప్రధాన స్థానం) ఓం తరణిర్విశ్వదర్శతో జ్యోతిష్కృదసి సూర్య । విశ్వమాభాసి రోచనమ్ । ఓం సూర్యాయ నమః ఆవాహయామి స్థాపయామి పూజయామి। సత్యః (తూర్పు దిశ ఆరో గది) ఓం ఋతగ్ం సత్యం పరం బ్రహ్మ పురుషం కృష్ణపింగళమ్ । ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమో నమః ।। ఓం సత్యాయ నమః ఆవాహయామి స్థాపయామి పూజయామి। భృశః (తూర్పు దిశ ఏడో గది) ఓం ఆ త్వాహార్షమంతర భూః ధృవస్తిష్ఠా విచాచలిః । విశస్త్వా సర్వా వాంఛంతు మా త్వ ద్రాష్ట మధి భ్రశత్ ।। ఓం భృశాయ నమః ఆవాహయామి స్థాపయామి పూజయామి। ఆకాశః (తూర్పు దిశ ఎనిమిదో గది) ఊర్ధ్వ ఊషుణ ఊతయే తిష్టా దేవోన సవితా । ఉర్ధ్వో వాజస్య సవితాయ దంజిభి ర్వాఘద్భి ర్విహ్వయామహే ।। ఓం ఊర్ధ్వ పురుషాయ నమః ఆవాహయామి స్థాపయామి పూజయామి। అనిలః / వాయుః (ఆగ్నేయ మూల దేవత) ఓం ఉపశ్రేష్ఠాన ఆశిషోదేవయోర్ధర్మే అస్థిరన్ । స్తౌమి వాయుగ్ం సవితారం నాథితో జోహవీమి తా నో ముంచత మాగసః ।। ఓం వాయవే నమః ఆవాహయామి స్థాపయామి పూజయామి। పుషాణ (దక్షిణ దిశ మొదటి గది) ఓం సూర్య రశ్మిర్ హరికే శః పురస్తాథ్సవితా జ్యోతిరుదయాగ్ం అజస్రమ్ । తస్య పూషా ప్రసవం యాతి దేవ సంపశ్యన్విశ్వా భువనాని గోపాః ।। ఓం పూష్ణే నమః ఆవాహయామి స్థాపయామి పూజయామి। వితథః (దక్షిణ దిశ రెండో గది) ఓం ఉద్వయం తమసస్పరి పశ్యంతో జ్యోతిరుత్తరమ్ । దేవం దేవత్రా సూర్యమగన్మ జ్యోతిరుత్తమమ్ ।। ఓం వితథాయ నమః ఆవాహయామి స్థాపయామి పూజయామి। గృహక్షతః (దక్షిణ దిశ మూడో గది) ఓం సవితా త్వా ప్రసవానాగ్ం సువతామగ్నిర్ గృహపతీనాగ్ం । సోమో వనస్పతీనాగ్ం రుద్రః పశూనామ్ ।। ఓం గృహక్షతాయ నమః ఆవాహయామి స్థాపయామి పూజయామి। యమః (దక్షిణ దిశ నాల్గో గది - ప్రధాన స్థానం) ఓం యమాయ సోమగ్ం సునుత యమాయ జుహుతా హవిః । యమగ్ం హ యజ్ఞో గచ్ఛత్యగ్నిదూతో అరంకృతః ।। యమాయ నమః ఆవాహయామి స్థాపయామి పూజయామి। గంధర్వః (దక్షిణ దిశ ఐదో గది) ఓం గంధర్వోఽసి విశ్వావసుర్విశ్వస్మాదీషతో యజమానస్య పరిధిరీడ ఈడితః ।। ఓం గంధర్వాయ నమః ఆవాహయామి స్థాపయామి పూజయామి। భృంగరాజః (దక్షిణ దిశ ఆరో గది) ఓం సుపర్ణః పార్జన్యో హగ్ం సో వృకో వృషదగ్ం శస్త ఐంద్రాః । ఆపాముద్రోర్ యమ్ణే లోపా శస్సిగ్ం హోనకులో వ్యాఘ్రస్తే మహేంద్రాయ కామాయ పరస్వాంతః ।। ఓం భృంగరాజాయ నమః ఆవాహయామి స్థాపయామి పూజయామి। మృగః (దక్షిణ దిశ ఏడో గది) ఓం ప్ర తద్విష్ణుస్తవతే వీర్యాయ మృగో న భీమః కుచరో గిరిష్ఠాః । యస్యోరుషు త్రిషు విక్రమణేష్వధిక్షియంతి భువనాని విశ్వా ।। మృగాయ నమః ఆవాహయామి స్థాపయామి పూజయామి। పితరః (నైరుతి మూల దేవత) ఓం ఉశంతస్త్వా హవామహ ఉశంతస్సమిధీమహి । ఉశన్నుశత ఆ వహ పితౄన్ హవిషే అత్తవే ।। ఓం పితృభ్యః నమః ఆవాహయామి స్థాపయామి పూజయామి। దౌవారికః (పడమర దిశ మొదటి గది) ఓం ద్వారో దేవీరస్వస్య విశ్వే వ్రతా దదంతే అగ్నేః । ఉరువ్యచసో ధామ్నా పత్యమానాః ఓం దౌవారికాయ నమః ఆవాహయామి స్థాపయామి పూజయామి। సుగ్రీవః (పడమర దిశ రెండో గది) ఓం నీలగ్రీవాః శితికంఠాః శర్వా అధః క్షమాచరాః । నీలగ్రీవాః శితికంఠా దివం రుద్రా ఉపశ్రితాః । యే వృక్షేషు సస్పింజరా నీలగ్రీవా విలోహితాః । యే భూతానామధిపతయో విశిఖాసః కపర్దినః । యే అన్నేషు వివిధ్యంతి పాత్రేషు పిబతో జనాన్ । యే పథాం పథిరక్షయ ఐలబృదా యవ్యుధః । యే తీర్థాని ప్రచరంతి సృకావంతో నిషంగిణః । య ఏతావంతశ్చ భూయాంసశ్చ దిశో రుద్రా వితస్థిరే । తేషాగ్ం సహస్రయోజనేఽవధన్వాని తన్మసి ।। ఓం సుగ్రీవాయ నమః ఆవాహయామి స్థాపయామి పూజయామి। పుష్పదంతః (పడమర దిశ మూడో గది) ఓం గణానాం త్వా గణపతిగ్ం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమమ్ । జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆ నః శృణ్వన్నూతిభిస్సీద సాదనమ్ ఓం పుష్పదంతాయ నమః ఆవాహయామి స్థాపయామి పూజయామి। వరుణః (పడమర దిశ నాల్గో గది - ప్రధాన స్థానం) ఓం ఇమంమే వరుణ శ్రుధీహవ మద్యాచ మృడయ । త్వాం అవస్యురాచకే ।। ఓం వరుణాయ నమః ఆవాహయామి స్థాపయామి పూజయామి। అసురః (పడమర దిశ ఐదో గది) ఓం అసురావై నిర్యంతో దేవానామ్ ప్రాణేషు వలగాణ్యతనంతాన్ బాహుమాత్రేణ విందన్తస్మాత్ బాహు మాత్రాః ఖాయంతే ।। ఓం అసురాయ నమః ఆవాహయామి స్థాపయామి పూజయామి। శోషః (పడమర దిశ ఆరో గది) ఓం యా ఇషవో యాతుధానానాం యేవా వనస్పతీగ్ం రను । యేవా వటేషు శేరతే తేభ్యః సర్వేభ్యో నమః ।। ఓం శోషాయ నమః ఆవాహయామి స్థాపయామి పూజయామి। పాపయక్ష్మా (పడమర దిశ ఏడో గది) ఓం పాపవస్య సంవా ఏతత్క్రియతే యాచ్చ్రేయ సాచ పాపాపీయసాచ సమానం కర్మ కృణ్వన్తి పాపీయాన్ పశ్చాదన్వేతి।। ఓం పాపాయ నమః ఆవాహయామి స్థాపయామి పూజయామి। రోగః (వాయువ్య మూల దేవత) ఓం రోగాయ నమః ఆవాహయామి స్థాపయామి పూజయామి। నాగః (ఉత్తర దిశ మొదటి గది) ఓం ఇదగ్ం సర్పేభ్యో॑ హవిర॑స్తు॒ జుష్టమ్ । ఆశ్రేషా యేషా॑మనుయన్తి చేత॑: । యే అంతరి॑క్షం పృథివీం క్షియన్తి॑ । తే న॑స్సర్పాసో హవమాగ॑మిష్ఠాః । యే రో॑చనే సూర్యస్యాపి॑ సర్పాః । యే దివం దేవీమను॑సన్చర॑న్తి । యేషా॑మాశ్రేషా అ॑నుయన్తి కామమ్ । తేభ్య॑స్సర్పేభ్యో మధు॑మజ్జుహోమి ।। ఓం నాగాయ నమః ఆవాహయామి స్థాపయామి పూజయామి। ముఖ్యః (ఉత్తర దిశ రెండో గది) ఓం యస్య ముఖ్యవతీ పురస్తా దుపధీయంతే ముఖ్య ఏవభవత్యాస్య ముఖ్యో జాయతే ।। ఓం ముఖ్యాయ నమః ఆవాహయామి స్థాపయామి పూజయామి। భల్లాటః (ఉత్తర దిశ మూడో గది) ఓం ఇమాగ్ం రుద్రాయ తవసే కపర్దినే క్షయద్వీరాయ ప్రభరామహే మతిమ్ । యథా న: శమసద్ద్వి॒పదే చతుష్పదే విశ్వం పుష్టం గ్రామే అస్మిన్ననాతురమ్ । ఓం భల్లాటాయ నమః ఆవాహయామి స్థాపయామి పూజయామి। సోమః (ఉత్తర దిశ నాల్గో గది - ప్రధాన స్థానం) ఓం త్వగ్ం సోమ ప్రచికితో మనీషా త్వగ్ం రాజిష్ఠమనునేషి పంథామ్ । తవ ప్రణీతీ పితరో న ఇన్దో దేవేషు రత్నమభజంత ధీరాః ।। ఓం సోమాయ నమః ఆవాహయామి స్థాపయామి పూజయామి। భుజగ (ఉత్తర దిశ ఐదో గది) ఓం నమోఽస్తు సర్పేభ్యో యే కే చ పృథివీమను । యే అంతరిక్షే యే దివి తేభ్యః సర్పేభ్యో నమః ।। భుజగాయ నమః ఆవాహయామి స్థాపయామి పూజయామి। అదితిః (ఉత్తర దిశ ఆరో గది) ఓం అదితిర్న ఉరుష్యత్వదితిః శర్మ యచ్ఛతు । అదితిః పాత్వగ్ం హసః ।। ఓం అదిత్యై నమః ఆవాహయామి స్థాపయామి పూజయామి। దితిః (ఉత్తర దిశ ఏడో గది) ఓం మహీమూషు మాతరగ్ం సువ్రతానామృతస్య పత్నీమవసే హువేమ । తువిక్షత్రామజరంతీమురూచీగ్ం సుశర్మాణమదితిగ్ం సుప్రణీతిగ్ం ఓం దిత్యై నమః ఆవాహయామి స్థాపయామి పూజయామి। ఇప్పుడు వాస్తు మండలంలోని రెండవ వరుసలో అంతర్ గదులలో ఈశాన్య మూల నుండి ప్రారంభించి, ఆపవత్స దేవత మొదలుకొని అదితి దేవత వరకు వరుసగా పూజించాలి. ఆపః (ఈశాన్య మూల మొదటి అంతర దేవత) ఓం ఆపో అస్మాన్మాతర శ్శుద్ధంతు ఘృతేన నో ఘృత పువః । పునంతు విశ్వమస్మత్ప్రవ హస్తురి ప్రముదాభ్య శుచిరాపూత ఏమి ।। ఓం అద్భ్యః నమః ఆవాహయామి స్థాపయామి పూజయామి। ఆపవత్సః (ఈశాన్య అంతర గది) ఓం సధమా దోద్యుమ్ని నీరూర్జ ఏతా అని భృష్టా అపస్యువో వసానః । పస్త్యాసు చక్రే వరుణ స్సధస్థమ పాగ్ం శిశర్మాతృత మాస్త్వన్త ।। ఓం ఆపవత్సాయ నమః ఆవాహయామి స్థాపయామి పూజయామి। ఆర్యమా (తూర్పు అంతర గది - బ్రహ్మస్థానానికి ఆనుకుని ఉంటుంది) ఓం ఆర్యమాయాతి వృషభస్తువిష్మాన్ దాతా వసూనాం పురుహూతో అర్ హన్ । సహస్రాక్షో గోత్రభిద్వజ్ర బాహురస్మా సుదేవో ద్రవిణం దధాతు ।। ఓం ఆర్యమ్ణే నమః ఆవాహయామి స్థాపయామి పూజయామి। సవితా (ఆగ్నేయ అంతర గది - సావిత్ర పక్కన) ఓం విశ్వాని దేవ సవితర్దురితాని పరాసువ । యద్భద్రం తన్న ఆసువ ।। ఓం సవిత్రే నమః ఆవాహయామి స్థాపయామి పూజయామి। సావిత్రః (ఆగ్నేయ అంతర గది-బ్రహ్మస్థానానికి ఆనుకుని ఉంటుంది) ఓం హస్త ఆధాయ సవితాబిభ్రదభ్రిగ్ం హిరణ్యయీమ్ । తయా జ్యోతి రజస్ర మిదగ్నిం ఖాత్వీన ఆభరానుష్టుభేనత్వా ఛస్థసాద దేంగిరస్వ ।। ఓం సావిత్రాయ నమః ఆవాహయామి స్థాపయామి పూజయామి। వివస్వత/వివస్వాన్ (దక్షిణ అంతర గది - బ్రహ్మస్థానానికి ఆనుకుని ఉంటుంది) ఓం వివస్వ ఆదిత్యైషతే సోమపీథస్తేన మందస్వతేన తృప్యతృప్యాస్మ తేవయంతర్పయితారో యాదివ్యావృష్టిస్తయాత్వా శ్రీణామి ।। ఓం వివస్వతే నమః ఆవాహయామి స్థాపయామి పూజయామి। విబుధాధిపః/ఇంద్రః (నైరుతి అంతర గది-బ్రహ్మస్థానానికి ఆనుకుని ఉంటుంది) ఓం స బోధి సూరిర్మఘవా వసుదావా వసుపతిః । యుయోధ్యస్మద్వేషాగ్ంసి ।। ఓం విబుధాధిపాయ నమః ఆవాహయామి స్థాపయామి పూజయామి। జయ (నైరుతి అంతర గది - విబుధాధిప స్థానానికి ఆనుకుని ఉంటుంది) ఓం అషాఢం యుధ్సు పృతనాసు పప్రీమ్। సువర్ షా మప్స్వామ్ వృజనస్య గోపామ్ । భరేషుజాగ్ం సుక్షితగ్ం సుశ్రవసం। జయంతత్వా మనుమదేమ సోమ స్వాహా ।। ఓం జయంతాయ నమః ఆవాహయామి స్థాపయామి పూజయామి। మిత్రః (పడమర అంతర గది - బ్రహ్మస్థానానికి ఆనుకుని ఉంటుంది) ఓం మిత్రోన ఏహి సుమిత్రధా ఇంద్రస్యోరుమావిశ దక్షిణ ముశన్ను । శస్తగ్గ్ స్యోన స్యోనగ్గ్ స్వాన భ్రాజం ఘారే భంబారే హస్త సుహస్త కృశానవే తేవ సోమక్రయణాస్తాన్ రక్షధ్వం మా వో దభన్ ।। ఓం మిత్రాయ నమః ఆవాహయామి స్థాపయామి పూజయామి। రాజయక్ష్మా/ రుద్రదాస (ఉత్తర వాయువ్య అంతర గది) ఓం ఐత్తం యక్ష్మ ఆర్చద్రాజానం । యక్ష్మ ఆరదితి తద్రాజ। యక్ష్మస్య జన్మ యత్సాపీయాన । భవత్తత్పాప యక్ష్మస్య యజ్ఞయాభ్యో విందత్త। జ్జాయేన్యస్యయ ఏవమేతేషాం యక్ష్మాణాం । జన్మ వేదనైన మేతే యక్ష్మా విందంతి ।। ఓం రాజయక్ష్మణే నమః / రుద్రదాసాయ నమః ఆవాహయామి స్థాపయామి పూజయామి। రుద్రః (ఉత్తర అంతర గది - బ్రహ్మస్థానానికి ఆనుకుని ఉంటుంది) ఓం అవాంబ రుద్ర మహ్యవ దేవం త్య్రంబకం । యథా నః శ్రేయసః కరద్యథా నో వస్యసః కరద్యథా నః పశుమతః కరద్యథా నో వ్యవసాయయాత్ ।। ఓం రుద్రాయ నమః ఆవాహయామి స్థాపయామి పూజయామి। పృథ్వీధరః (ఉత్తర ఈశాన్య అంతర గది) ఓం స్యోనా పృథివి భవానృక్షరా నివేశినీ । యచ్ఛా నః శర్మ సప్రథాః ।। ఓం పృథ్వీధరాయ నమః ఆవాహయామి స్థాపయామి పూజయామి। మధ్యలో ఉన్న తొమ్మిది గదులు బ్రహ్మ స్థానమునకు సంబంధించింది కనుక ఇక్కడ బ్రహ్మను, సకల దేవతాస్వరూపుడైన వాస్తుపురుషుడిని ఆవాహనం చేయాలి. బ్రహ్మా (మధ్య తొమ్మిది గదులు - బ్రహ్మస్థాన దేవత) ఓం బ్రహ్మ జజ్ఞానం ప్రథమం పురస్తాద్వి సీమతస్సురుచో వేన ఆవః । స బుధ్నియా ఉపమా అస్య విష్ఠాస్సతశ్చ యోనిమసతశ్చ వివః ।। ఓం బ్రహ్మాణ మావాహయామి స్థాపయామి పూజయామి। వాస్తుపురుష ఆవాహనం ఓం వాస్తోష్పతే ప్రతి జానీహ్యస్మాన్ త్స్వావేశో అనమీవో భవా నః । యత్ త్వేమహే ప్రతి తన్నో జుషస్వ శం న ఏధి ద్విపదే శం చతుష్పదే ।। ఓం వాస్తోష్పతే శగ్మయా సంసదా తే సక్షీమహి రణ్వయా గాతుమత్యా। ఆవః క్షేమ ఉత యోగే వరంనోయూయం పాత స్వస్తిభిః సదా నః ।। ఓం అమీవహా వాస్తోష్పతే విశ్వా రూపాణ్యావిశన్ । సఖా సుశేవ ఏధి నః ।। ఓం వాస్తోష్పతే ప్రతరణో న ఏధి గోభిరశ్వేభిరిందో । అజరాసస్తే సఖ్యే శ్యామ పితేవ పుత్రాన్ప్రతినో జుషస్వ ।। ఓం వాస్తోష్పతే ధ్రువా స్థూణాం సత్రం సోమ్యానామ్ । ద్రప్సో భేత్తా పురాం శాశ్వతీనామింద్రో మునీనాం సఖా ।। ఓం బ్రహ్మరూపాయ, ధరాధరాయ, సకలభూపాలకాయ, వాస్తుపురుషాయ ఆవాహయామి స్థాపయామి పూజయామి। తతో మండలస్యైవ ఈశానాది కోణేషు క్రమేణ చరకీం, విదారీం, పూతనాం, పాపరాక్షసీం చ ఇత్యాది బాహ్య రక్షక దేవతాః పూజయేత్ ।। ఇక్కడ బాహ్య రక్షక దేవతలను ఆవాహనం చేయాలి. చరకీ (ఈశాన్య బాహ్య రక్షక శక్తి) ఓం యత్తే దేవి నిర్ఋతి రాబబంథదామా గ్రీవా స్వవిచర్త్యమ్ । ఇదంతే తద్విష్యామ్యాయుషో న మధ్యాదథా జీవః పితూమద్ధి ప్రముక్తః ।। ఓం చరక్యై నమః ఆవాహయామి స్థాపయామి పూజయామి। విదారీ (ఆగ్నేయ బాహ్య రక్షక శక్తి) ఓం అక్షరాజాయ కితవమ్ । కృతాయ సభా వినమ్ । త్రేతాయ ఆదినవదర్శమ్ । ద్వాపరాయ బహిస్సదమ్ । కలయే సభాస్థాణుమ్ । దుష్కృతాయ చరకాచార్యమ్ । అధ్వనే బ్రహ్మచారిణమ్ ।। ఓం విదార్యై నమః ఆవాహయామి స్థాపయామి పూజయామి। పూతనా (నైరుతి బాహ్య రక్షక శక్తి) ఓం ఇంద్రస్య క్రోడోఽదిత్యై పాజస్యం దిశాం జత్రవో జీమూతాన్ హృదయేన । పశాభ్య మంతరిక్షం పురితతా నభ దర్యేనేఁద్రాణీమ్ ప్లీహ్నా వల్మీకాన్ క్లోమ్నా గిరీన్ ప్లాశిభిస్సముద్ర ముదరేణ వైశ్వానరం భస్మనా ।। ఓం పూతనాయై నమః ఆవాహయామి స్థాపయామి పూజయామి। పాపరాక్షసి (వాయువ్య బాహ్య రక్షక శక్తి) ఓం యస్యాస్తే అస్యాః క్రూర ఆసన్ జుహోమ్యే షాం బంథానామవసర్జనాయ । భూమిరితి త్వా జనా విదుర్నిర్ఋతిరితి త్వాహం పరివేద విశ్వతః ।। ఓం పాపరాక్షస్యై నమః ఆవాహయామి స్థాపయామి పూజయామి। స్కందః (ఉత్తర బాహ్య రక్షక శక్తి) ఓం యత్ర బాణాః సంపతంతి కుమారా విశిఖా ఇవ । ఇంద్రో నస్తత్ర వృత్రహా విశ్వాహా శర్మ యచ్ఛతు ।। స్కందాయ నమః ఆవాహయామి స్థాపయామి పూజయామి। అర్యమా (దక్షిణ బాహ్య రక్షక శక్తి) ఓం ఆర్యమాయాతి వృషభస్తువిష్మాన్ దాతా వసూనాం పురుహూతో అర్ హన్ । సహస్రాక్షో గోత్రభిద్వజ్ర బాహురస్మా సుదేవో ద్రవిణం దధాతు ।। ఓం అర్యమ్ణే నమః ఆవాహయామి స్థాపయామి పూజయామి। జృంభకః (పశ్చిమ బాహ్య రక్షక శక్తి) దంష్ట్రాభ్యాం మలిమ్లూం జంభ్యైస్తస్కరాంగ్ం ఉత । హనూభ్యాగ్ం స్తేనాన్ భగవస్తాగ్ స్త్వంఖాద సుఖాదితాన్ ।। ఓం జృంభకాయ నమః ఆవాహయామి స్థాపయామి పూజయామి। పిలిపిచ్ఛః / విదారి పుత్రః (దక్షిణ బాహ్య రక్షక శక్తి) ఓం కిగ్స్విదాసీత్పూర్వచిత్తిః కిగ్స్విదాసీద్బృహద్వయః । కిగ్స్విదాసీత్పిశంగిలా కిగ్స్విదాసీత్పిలిప్పిలా ।। పిలిపిచ్ఛాయ నమః ఆవాహయామి స్థాపయామి పూజయామి। ఆసనం ఓం బ్రహ్మరూపాయ, ధరాధరాయ, సకలభూపాలకాయ, అంతర్మండల బహిర్మండల దేవతాస్వరూప వాస్తుపురుషాయ నమః ।। రత్న సింహాసనార్డే అక్షతాన్ సమర్పయామి । మండల దేవతలందరికీ పుష్పాక్షతలను సమర్పించాలి. పాద్యం/ఆర్ఘ్యం/ఆచమనీయం ఓం బ్రహ్మరూపాయ, ధరాధరాయ, సకలభూపాలకాయ, అంతర్మండల బహిర్మండల దేవతాస్వరూప వాస్తుపురుషాయ నమః ।। పాదయోః పాద్యం సమర్పయామి హస్తయోః ఆర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి । పుష్పంతో కానీ లేదా ఉద్ధరణితో కానీ నీరు తీసుకొని కలశానికి చూపించి అర్ఘ్య పాత్రలో చల్లాలి/వదలాలి స్నానం ఓం బ్రహ్మరూపాయ, ధరాధరాయ, సకలభూపాలకాయ, అంతర్మండల బహిర్మండల దేవతాస్వరూప వాస్తుపురుషాయ నమః ।। స్నానం సమర్పయామి । మండల దేవతలందరి పై తమలపాకులతో జలమును చల్లాలి. వస్త్రం/యజ్ఞోపవీతం ఓం బ్రహ్మరూపాయ, ధరాధరాయ, సకలభూపాలకాయ, అంతర్మండల బహిర్మండల దేవతాస్వరూప వాస్తుపురుషాయ నమః ।। వస్త్రం యజ్ఞోపవీతార్థాన్ అక్షతాన్ సమర్పయామి । మండల దేవతలందరిపై అక్షతలు సమర్పించాలి. గంధం ఓం బ్రహ్మరూపాయ, ధరాధరాయ, సకలభూపాలకాయ, అంతర్మండల బహిర్మండల దేవతాస్వరూప వాస్తుపురుషాయ నమః ।। శ్రీగంధం ధారయామి । పుష్పంతో గంధము మండల దేవతలందరిపై సమర్పించాలి. కుంకుమ ఓం బ్రహ్మరూపాయ, ధరాధరాయ, సకలభూపాలకాయ, అంతర్మండల బహిర్మండల దేవతాస్వరూప వాస్తుపురుషాయ నమః ।। కుంకుమం సమర్పయామి । మండల దేవతలందరిపై కుంకుమ సమర్పించాలి. పుష్పం ఓం బ్రహ్మరూపాయ, ధరాధరాయ, సకలభూపాలకాయ, అంతర్మండల బహిర్మండల దేవతాస్వరూప వాస్తుపురుషాయ నమః ।। పుష్పైః పూజాయామి । అలంకరణార్ధే అక్షతాన్ సమర్పయామి । నానావిధ పరిమళ పుష్పాక్షతాంజలిం సమర్పయామి। మండల దేవతలందరిపై అక్షతలు వేయాలి. ధూపం: ఓం బ్రహ్మరూపాయ, ధరాధరాయ, సకలభూపాలకాయ, అంతర్మండల బహిర్మండల దేవతాస్వరూప వాస్తుపురుషాయ నమః ।। ధూపమాఘ్రాపయామి । మండల దేవతలందరికీ ధూపం సమర్పించాలి. ధూపం: ఓం బ్రహ్మరూపాయ, ధరాధరాయ, సకలభూపాలకాయ, అంతర్మండల బహిర్మండల దేవతాస్వరూప వాస్తుపురుషాయ నమః ।। దీపం దర్శయామిః మండల దేవతలందరికీ దీపం చూపించాలి. ధూప దీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి । పుష్పముుతో నీటిని ధూపము దీపం చుట్టూ త్రిప్పాలి. ధూపం: ఓం బ్రహ్మరూపాయ, ధరాధరాయ, సకలభూపాలకాయ, అంతర్మండల బహిర్మండల దేవతాస్వరూప వాస్తుపురుషాయ నమః ।। యథాశక్తి (నారికేళ, కదళీ, ఖర్జూర, జంబూఫల, ద్రాక్ష, పనస, కపి, వివిధ ఫల శర్కరాన్, గుడఖండ - షడ్రసోపేత) నైవేద్యం సమర్పయామి। మధ్యేమధ్యేపానీయం సమర్పయామి। ఉత్తరాపోశనం సమర్పయామిః హస్తా ప్రక్షాళయామి। పాదౌ ప్రక్షాళయామి। శుద్ధాచమనీయం సమర్పయామి। (మహా) మీ శక్తికొలది నైవేద్యం నివేదయామి ।। మండల దేవతలందరికీ నైవేద్యం సమర్పించాలి తాంబూలం: ఓం బ్రహ్మరూపాయ, ధరాధరాయ, సకలభూపాలకాయ, అంతర్మండల బహిర్మండల దేవతాస్వరూప వాస్తుపురుషాయ నమః ।। తాంబూలం సమర్పయామి। మండల దేవతలందరికీ తాంబూలం సమర్పించాలి నీరాజనమ్: ఓం బ్రహ్మరూపాయ, ధరాధరాయ, సకలభూపాలకాయ, అంతర్మండల బహిర్మండల దేవతాస్వరూప వాస్తుపురుషాయ నమః ।। నీరాజనమ్ దర్శయామి। నీరాజనానంతరం శుద్దాచమనీయం సమర్పయామి। మండల దేవతలందరికీ హారతిని వెలిగించి చూపించాలి. పుష్పముుతో నీటిని హారతి చుట్టూ త్రిప్పాలి. తదుపరి హారతిని స్వీకరించాలి. మంత్రపుష్పం: మంత్రం చదువుతూ పుష్పమును సమర్పించాలి. ఓం వాస్తుపురుషాయ విద్మహే భూమిపాలాయ ధీమహి । తన్నో వాస్తుః ప్రచోదయాత్ ।। ఓం బ్రహ్మరూపాయ, ధరాధరాయ, సకలభూపాలకాయ, అంతర్మండల బహిర్మండల దేవతాస్వరూప వాస్తుపురుషాయ నమః ।।సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి । ఆత్మప్రదక్షిణ నమస్కారం: యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే । పాపోఽహం పాపకర్మాఽహం పాపాత్మా పాపసంభవః త్రాహి మాం కృపయా సాయి శరణాగతవత్సల । అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ । తస్మాత్కారుణ్య భావేన రక్ష రక్ష గ్రహనాయక ।। ఓం బ్రహ్మరూపాయ, ధరాధరాయ, సకలభూపాలకాయ, అంతర్మండల బహిర్మండల దేవతాస్వరూప వాస్తుపురుషాయ నమః ।।ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి । మండల దేవతలందరిపై అక్షతలు సమర్పించాలి. ఉపచార పూజ: ఓం బ్రహ్మరూపాయ, ధరాధరాయ, సకలభూపాలకాయ, అంతర్మండల బహిర్మండల దేవతాస్వరూప వాస్తుపురుషాయ నమః ।। ఛత్రమాచ్ఛాదయామి । చామరైర్వీజయామి । నృత్యం దర్శయామి । గీతం శ్రావయామి । వాద్యం ఘోషయామి । ఆందోళికానారోహయామి । అశ్వానారోహయామి । గజానారోహయామి । సమస్త రాజోపచార దేవోపచార భక్త్యుపచార శక్త్యుపచార మంత్రోపచార పూజాః సమర్పయామి ।। తొమ్మిది ప్రదక్షిణలు చేసి మండల దేవతలందరికీ అక్షతలు సమర్పించాలి. సమర్పణం: యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు। న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతం।। మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గ్రహనాయక। యత్పూజితం మయా దేవా పరిపూర్ణం తదస్తు తే। అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా భగవంతః సర్వత్మకాః వాస్తుపురుష దేవతా సుప్రీతాః సప్రసన్నాః వరదో భవంతు ।। ఉత్తరే శుభకర్మణ్యవిఘ్నమస్తు ఇతి భవంతో బ్రువంతు। ఉత్తరే శుభకర్మణి అవిఘ్నమస్తు।। ఏతత్ ఫలం శ్రీ వాస్తుపురుష దేవతా చరణారవిందార్పణమస్తు అక్షతలును,పుష్పాలు,జలం కుడిచేతిలో తీసుకొని పాత్రలో వదలాలి.భూమి పూజ / శంకుస్థాపన పూజ (click to expand)
గర్త పూజ/శంకుస్థాపన-భూమిపూజ
శుచిః: అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం గతోఽపి వా। యః స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతరః శుచిః।। (పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః) భూమి పూజ కలశములోని నీటితో మూడు సార్లు గర్త [పునాది-ఈశాన్యములో తీసిన గుంత]లో చల్లాలి. ఈ క్రింది మంత్రాలూ పఠిస్తూ శంకువును మధ్యస్థానములో స్థాపించాలి. ధ్యానం వాస్తుపురుష నమస్తేఽస్తు భూశయ్యాభిరత ప్రభో । మద్గృహం ధనధాన్యాది సమృద్ధం కురు సర్వదా ।। శంకుస్థాపనే యా పూజా త్వయి దేవ నిరూపితా । తయా త్వం పరితుష్టస్సన్ ఆయురారోగ్యదా భవ ।। శాంతిం కురు తుష్టిం కురు పుష్టిం కురు సదా వై । పాపాత్ నః రక్ష రక్ష స్వగృహే మంగళం కురు ।। సర్వవిఘ్నహరో భవ సర్వకల్యాణదాయకః । స్థిరో భవ గృహే చాస్మిన్ వాస్తుదేవ నమోఽస్తు తే ।। ఓం పృథ్వీధరాయ వాస్తుపురుషాయ నమః । ధ్యాయామి ధ్యానం సమర్పయామి। వాస్తుపురుషునికి నమస్కరించాలి. ఆవాహనం ఓం పృథ్వీధరాయ వాస్తుపురుషాయ నమః । ఆవాహయామి స్థాపయామి పూజయామి। గర్తమునందు (పునాది గోతిలో) పుష్పాక్షతలను సమర్పించి నమస్కరించాలి. ఆసనం ఓం పృథ్వీధరాయ వాస్తుపురుషాయ నమః । రత్న సింహాసనార్డే అక్షతాన్ సమర్పయామి । గర్తమునందు (పునాది గోతిలో) పుష్పాక్షతలను సమర్పించాలి. పాద్యం/ఆర్ఘ్యం/ఆచమనీయం ఓం పృథ్వీధరాయ వాస్తుపురుషాయ నమః । పాదయోః పాద్యం సమర్పయామి హస్తయోః ఆర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి । పుష్పంతో కానీ లేదా ఉద్ధరణితో కానీ నీరు తీసుకొని కలశానికి చూపించి అర్ఘ్య పాత్రలో చల్లాలి/వదలాలి స్నానం ఓం ఆపో హి ష్ఠా మయోభువః । తా న ఊర్జే దధాతన । మహే రణాయ చక్షసే ।। యో వశ్శివతమో రసః । తస్య భాజయతేహ నః । ఉశతీరివ మాతరః ।। తస్మా అరజ్గమామ వః । యస్య క్షయాయ జిన్వథ । ఆపో జనయథా చ నః ।। ఓం పృథ్వీధరాయ వాస్తుపురుషాయ నమః । శుద్ధోదక స్నానం సమర్పయామి । గర్తమునందు (పునాది గోతిలో) తమలపాకులతో జలమును చల్లాలి. వస్త్రం: అభి వస్త్రా సువసనాన్యర్షాభి ధేనూ సుదుఘాః పూయమానః। అభిచంద్రా భ॑ర్తవే నో॑ హిరణ్యా భ్యశ్వాన్రథినో దేవసోమ।। ఓం పృథ్వీధరాయ వాస్తుపురుషాయ నమః । వస్త్రయుగ్మం సమర్పయామి। వస్త్రార్ధం అక్షతాన్ సమర్పయామి। గర్తమునందు (పునాది గోతిలో) అక్షతలును సమర్పించాలి. యజ్ఞోపవీతం: ఓం యజ్ఞోపవీతం పరమo పవిత్రం ప్రజాపతేర్యత్సహజo పురస్తాత్। ఆయుష్యమగ్ర్య॒o ప్రతి ముoచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ:।। ఓం పృథ్వీధరాయ వాస్తుపురుషాయ నమః । యజ్ఞోపవీతం సమర్పయామి।। యజ్ఞోపవీతార్ధం అక్షతాన్ సమర్పయామి.।। గర్తమునందు (పునాది గోతిలో) అక్షతలును సమర్పించాలి. చందనం: ఓం గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీమ్।। ఈశ్వరీం సర్వభూతానాం తామిహో పహ్వయే శ్రియమ్।। ఓం పృథ్వీధరాయ వాస్తుపురుషాయ నమః । శ్రీ గంధాన్ ధారయామి। గర్తమునందు (పునాది గోతిలో) గంధం మరియు కుంకుమ సమర్పించాలి. అక్షతలు: ఆయనేతే పరాయణే దూర్వారోహంతు పుష్పిణీః। హ్రదాశ్చ పుండరీకాణి సముద్రస్య గృహా ఇమే।। ఓం పృథ్వీధరాయ వాస్తుపురుషాయ నమః । అక్షతాన్ సమర్పయామి।। గర్తమునందు (పునాది గోతిలో) అక్షతలును సమర్పించాలి. హరిద్రాచూర్ణం (పసుపు): ఓం అహిరివ భోగైః పర్యేతి బాహుం జ్యాయా హేతిం పరిబాధమానః। హస్తఘ్నో విశ్వా వయునాని విద్వాన్ పుమాన్ పుమాంసం పరిపాతు విశ్వతః।। ఓం పృథ్వీధరాయ వాస్తుపురుషాయ నమః । హరిద్రా చూర్ణం సమర్పయామి।। గర్తమునందు (పునాది గోతిలో) పసుపును సమర్పించాలి. కుంకుమ: ఓం యాగ్ం గోర్యా సినీవాలీ యా రాకా యా సరస్వతీ। ఇంద్రాణీమహ్వ ఊతయే వరుణానీం స్వస్తయే।। ఓం పృథ్వీధరాయ వాస్తుపురుషాయ నమః । కుంకుమ విలేపనం సమర్పయామి।। గర్తమునందు (పునాది గోతిలో) కుంకుమను సమర్పించాలి. ఇప్పుడు గర్తమునందు (పునాది గోతిలో) తొమ్మిది రంధ్రాలు గల ఒక ప్రత్యేకమైన రాతి లేదా లోహపు శిలను లేదా తొమ్మిది ఇటుకలను క్రమ పద్ధతిలో ఉంచి, వాటిపై నవగ్రహ దేవతలను ఆవాహన చేసి పూజించవలెను. పూజ చేయునప్పుడు పుష్పములతో పాటు ఆయా గ్రహములకు సూచించిన ధాన్యములను (నవధాన్యాలు) ప్రత్యేకముగా సమర్పించవలెను.- ఓం సూర్యాయ నమః - అధిదేవత ప్రత్యధిదేవత సహిత సూర్యగ్రహ మావాహయామి ।। గర్తమునందు (పునాది గోతిలో) మధ్య ఇటుకపై అక్షతలు, ఎరుపు వర్ణ పుష్పములు , గోధుమలు సమర్పించాలి.
- ఓం సోమాయ (చంద్రాయ) నమః - అధిదేవత ప్రత్యధిదేవత సహిత సోమగ్రహ మావాహయామి ।। గర్తమునందు (పునాది గోతిలో) ఆగ్నేయ ఇటుకపై అక్షతలు, తెలుపు వర్ణ పుష్పములు, బియ్యము లేదా వడ్లు సమర్పించాలి.
- ఓం అంగారకాయ (కుజాయ) నమః - అధిదేవత, ప్రత్యధిదేవత సహిత అంగారకగ్రహ మావాహయామి ।। గర్తమునందు (పునాది గోతిలో) దక్షిణ ఇటుకపై అక్షతలు, ఎరుపు వర్ణ పుష్పములు, కందులు సమర్పించాలి.
- ఓం బుధాయ నమః - అధిదేవత, ప్రత్యధిదేవత సహిత బుధగ్రహ మావాహయామి ।। ఈశాన్య ఇటుకపై అక్షతలు, పసుపు వర్ణ పుష్పములు, పెసలు సమర్పించాలి.
- ఓం బృహస్పతయే నమః - అధిదేవత, ప్రత్యధిదేవత సహిత బృహస్పతిగ్రహ మావాహయామి ।। గర్తమునందు (పునాది గోతిలో) ఉత్తర ఇటుకపై అక్షతలు, బంగారు వర్ణ పుష్పములు, శనగలు సమర్పించాలి.
- ఓం శుక్రాయ నమః - అధిదేవత, ప్రత్యధిదేవత సహిత శుక్రగ్రహ మావాహయామి ।। గర్తమునందు (పునాది గోతిలో) తూర్పు ఇటుకపై అక్షతలు, తెలుపు వర్ణ పుష్పములు, బొబ్బర్లు సమర్పించాలి.
- ఓం శనైశ్చరాయ నమః - అధిదేవత, ప్రత్యధిదేవత సహిత శనైశ్చరగ్రహ మావాహయామి ।। గర్తమునందు (పునాది గోతిలో) పడమర ఇటుకపై అక్షతలు, నీల వర్ణ పుష్పములు, నల్ల నువ్వులు సమర్పించాలి.
- ఓం రాహవే నమః - అధిదేవత, ప్రత్యధిదేవత సహిత రాహుగ్రహ మావాహయామి ।। గర్తమునందు (పునాది గోతిలో) నైరుతి ఇటుకపై అక్షతలు, ధూమ్ర లేదా పసుపు వర్ణ పుష్పములు, మినుములు సమర్పించాలి.
- ఓం కేతవే నమః - అధిదేవత, ప్రత్యధిదేవత సహిత కేతుగణ మావాహయామి ।। గర్తమునందు (పునాది గోతిలో) వాయువ్య ఇటుకపై అక్షతలు లేదా చిత్ర వర్ణ పుష్పములు (ఎరుపు తప్ప ఏదేని వర్ణ) పుష్పములు సమర్పించాలి.
నవగ్రహాలు - దిక్కుల అమరిక
పంచభూతాలు - స్థానాలు
ఇప్పుడు ఈ క్రింది మంత్రం పఠిస్తూ శంకువును గర్తమునందు (పునాదిగోతిలో) మధ్యలో స్థాపించాలి. శంకువును స్థిరముగా నిలబెట్టి, అక్షతలు, పుష్పములు సమర్పించి నమస్కరించాలి. ఓం నమో భగవతే వాస్తుపురుషాయ కపిలాయ చ । పృథ్వీధరాయ దేవాయ ప్రధానపురుషాయ చ ।। మమ గృహారంభ కాలే సర్వసిద్ధిప్రదాయక । సిద్ధదేవ మనుష్యైశ్చ పూజ్య మానో దివానిశమ్ ।। గృహస్థానే ప్రజాపతి క్షేత్రేఽస్మిన్ తిష్ఠ సాంప్రతయే । ఇహాగచ్ఛ ఇమాం పూజాం గృహాణ వరదో భవ ।। గృహధారావాస్తు మయీ వాస్తుదీపేన సంయుతా । త్వామృతే నాస్తి జగతా మాధారశ్చ జగత్ప్రియే ।। ఓం పృథ్వీధరాయ వాస్తుపురుషాయ నమః । శంకుమ్ స్థాపయామి । ఓషధులు/నవధాన్యములు ఈ మంత్రం చదువుతూ శంకువులోని రంధ్రములో ముత్యము పగడము, జటామాంసి, శొంఠి మొదలగు ఓషధములతో పాటుగా నవధాన్యములు వేసి నమస్కరించాలి. పూలమాల ఉంటే పూలమాల వేయాలి. ఓం ఓషధయస్సంవదంతే సోమేన సహ రాజ్ఞా । యస్మై కృణోతి బ్రాహ్మణస్తం రాజన్పారయామసి ।। హ్రిహయః శాల్యో ముద్గా గోధూమాస్సర్షపాస్తిలాః । చణకా మాషమాషాశ్చ సర్వధాన్యాని సర్వదా ।। ఓం పృథ్వీధరాయ వాస్తుపురుషాయ నమః । యవౌశ్చదయః నవధాన్యాని సమర్పయామి । ధూపం: ఓం పృథ్వీధరాయ వాస్తుపురుషాయ నమః । ధూపమాఘ్రాపయామి । వాస్తుపురుషునికి (శంకువుకు) ధూపం సమర్పించాలి. దీపం: ఓం పృథ్వీధరాయ వాస్తుపురుషాయ నమః । మంగళ నీరాజన దీపం దర్శయామిః । వాస్తుపురుషునికి (శంకువుకు) మంగళ నీరాజన దీపం చూపించాలి. ధూప దీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి । పుష్పముుతో నీటిని ధూపము దీపం చుట్టూ త్రిప్పాలి. కొబ్బరికాయ యాః ఫ॒లినీ॒ర్యా అ॑ఫ॒లా అ॑పు॒ష్పాయాశ్చ॑ పు॒ష్పిణీః᳚ । బృహ॒స్పతి॑ ప్రసూతా॒స్తానో॑ ముంచం॒త్వగ్ం హ॑సః । ఓం పృథ్వీధరాయ వాస్తుపురుషాయ నమః । నారికేళం సమర్పయామి । వాస్తుపురుషునికి (శంకువుకు) నారికేళం సమర్పించాలి. నైవేద్యం: ఓం పృథ్వీధరాయ వాస్తుపురుషాయ నమః । యథాశక్తి (నారికేళ, కదళీ, ఖర్జూర, జంబూఫల, ద్రాక్ష, పనస, కపి, వివిధ ఫల శర్కరాన్, గుడఖండ - షడ్రసోపేత) నైవేద్యం సమర్పయామి। మధ్యేమధ్యేపానీయం సమర్పయామి। ఉత్తరాపోశనం సమర్పయామిః హస్తా ప్రక్షాళయామి। పాదౌ ప్రక్షాళయామి। శుద్ధాచమనీయం సమర్పయామి। (మహా) మీ శక్తికొలది నైవేద్యం నివేదయామి ।। వాస్తుపురుషునికి (శంకువుకు) నైవేద్యం సమర్పించాలి తాంబూలం: ఓం పృథ్వీధరాయ వాస్తుపురుషాయ నమః । తాంబూలం సమర్పయామి। వాస్తుపురుషునికి (శంకువుకు) తాంబూలం సమర్పించాలి కర్పూర మంగళ నీరాజనమ్: ఓం పృథ్వీధరాయ వాస్తుపురుషాయ నమః । కర్పూర మంగళ నీరాజనమ్ దర్శయామి। నీరాజనానంతరం శుద్దాచమనీయం సమర్పయామి। వాస్తుపురుషునికి (శంకువుకు) హారతిని వెలిగించి చూపించాలి. పుష్పముుతో నీటిని హారతి చుట్టూ త్రిప్పాలి.తదుపరి హారతిని స్వీకరించాలి. మంత్రపుష్పం: ఒక్కో మంత్రం చదువుతూ ఆయా నవగ్రహానికి, శంకువుకు పుష్పమును సమర్పించాలి. సూర్యుడు: ఓం భాస్కరాయ విద్మహే మహాద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్ ।। చంద్రుడు: ఓం క్షీరపుత్రాయ విద్మహే అమృత తత్త్వాయ ధీమహి తన్నో చంద్రః ప్రచోదయాత్ ।। కుజుడు: ఓం తత్పురుషాయ విద్మహే అంగారకాయ ధీమహి తన్నో భౌమ ప్రచోదయాత్ ।। బుధుడు: ఓం సోమ పుత్రాయ విద్మహే బుద్ధి ప్రదాయ ధీమహి తన్నో సౌమ్య ప్రచోదయాత్ ।। గురువు: ఓం ఆచార్యాయ విద్మహే సర్వజ్ఞాయ ధీమహి తన్నో బృహస్పతి ప్రచోదయాత్ ।। శుక్రుడు: ఓం అసురాచార్యాయ విద్మహే సౌఖ్య ప్రదాయ ధీమహి తన్నో శుక్ర ప్రచోదయాత్ ।। శని: ఓం నీలాంబరాయ విద్మహే సూర్య పుత్రాయ ధీమహి తన్నో సౌరి ప్రచోదయాత్ ।। రాహువు: ఓం సింహికా పుత్రాయ విద్మహే సర్ప రూపాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్ ।। కేతువు: ఓం ఛాయాగ్రహాయ విద్మహే సింహికా పుత్రాయ ధీమహి తన్నో కేతు ప్రచోదయాత్ ।। కేతువు: ఓం ఛాయాగ్రహాయ విద్మహే సింహికా పుత్రాయ ధీమహి తన్నో కేతు ప్రచోదయాత్ ।। వాస్తుపురుష నమస్తేఽస్తు భూశయ్యాభిరత ప్రభో । మద్గృహం ధనధాన్యాది సమృద్ధం కురు సర్వదా ।। శంకుస్థాపనే యా పూజా త్వయి దేవ నిరూపితా । తయా త్వం పరితుష్టస్సన్ ఆయురారోగ్యదా భవ ।। ఓం హిరణ్యగర్భాయ విద్మహే । పృథ్వీధరాయ ధీమహి । తన్నో వాస్తుపురుషః ప్రచోదయాత్ ।। ఓం పృథ్వీధరాయ వాస్తుపురుషాయ నమః । ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమః । సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి । ఆత్మప్రదక్షిణ నమస్కారం: యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే । పాపోఽహం పాపకర్మాఽహం పాపాత్మా పాపసంభవః త్రాహి మాం కృపయా సాయి శరణాగతవత్సల । అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ । తస్మాత్కారుణ్య భావేన రక్ష రక్ష గ్రహనాయక ।। ఓం బ్రహ్మరూపాయ, ధరాధరాయ, సకలభూపాలకాయ, అంతర్మండల బహిర్మండల దేవతాస్వరూప వాస్తుపురుషాయ నమః ।।ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి । వాస్తుపురుషునికి (శంకువుకు) అక్షతలు సమర్పించాలి. ఉపచార పూజ: ఓం బ్రహ్మరూపాయ, ధరాధరాయ, సకలభూపాలకాయ, అంతర్మండల బహిర్మండల దేవతాస్వరూప వాస్తుపురుషాయ నమః ।।ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి । ఛత్రమాచ్ఛాదయామి । చామరైర్వీజయామి । నృత్యం దర్శయామి । గీతం శ్రావయామి । వాద్యం ఘోషయామి । ఆందోళికానారోహయామి । అశ్వానారోహయామి । గజానారోహయామి । సమస్త రాజోపచార దేవోపచార భక్త్యుపచార శక్త్యుపచార మంత్రోపచార పూజాః సమర్పయామి ।। వాస్తుపురుషునికి (శంకువుకు) అక్షతలు సమర్పించాలి. అక్షతలును,పుష్పాలు,జలం కుడిచేతిలో తీసుకొని పాత్రలో వదలాలి. సమర్పణం: యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు। న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతం।। మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గ్రహనాయక । యత్పూజితం మయా దేవా పరిపూర్ణం తదస్తు తే । అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా భగవంతః సర్వత్మకాః వాస్తుపురుష దేవతా సుప్రీతాః సప్రసన్నాః వరదో భవంతు ।। ఉత్తరే శుభకర్మణ్యవిఘ్నమస్తు ఇతి భవంతో బ్రువంతు । ఉత్తరే శుభకర్మణి అవిఘ్నమస్తు।। ఏతత్ ఫలం శ్రీ వాస్తుపురుష దేవతా చరణారవిందార్పణమస్తు అక్షతలును,పుష్పాలు,జలం కుడిచేతిలో తీసుకొని పాత్రలో వదలాలి. ఇప్పుడు యజమాని 'ఓం వాస్తుపురుషాయ నమః' అంటూ ఇసుక సిమెంట్ కలిపిన మిశ్రమమును తాపితో మూడు మార్లు గర్తలో వేయాలి. తరువాత అయన పరివారము వేయవచ్చును. అనంతరం దానిని మేస్త్రితో (masion) చెప్పి మూసివేయమనాలి. తీర్థప్రసాద గ్రహణం: అకాలమృత్యహరణం సర్వవ్యాధినివారణం।। సమస్తపాపక్షయకరం శ్రీ వాస్తుపురుష దేవతా పాదోదకం పావనం శుభమ్।। శ్రీ వాస్తుపురుష దేవతా ప్రసాదం శీరసా గృహ్ణామి। ఉద్వాసనం: ఓం య॒జ్ఞేన॑ య॒జ్ఞమ॑యజన్త దే॒వాః తాని॒ ధర్మా॑ణి ప్రథ॒మాన్యా॑సన్। తే హ॒ నాక॑o మహి॒మాన॑స్సచన్తే యత్ర॒ పూర్వే॑ సా॒ధ్యాస్సన్తి॑ దే॒వాః।। ఓం పృథ్వీధరాయ వాస్తుపురుషాయ నమః యథాస్థానం ఉద్వాసయామి।। శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ। వాస్తు మండలములోని కలశమును , ఆయా మండపస్థిత దేవతలకు 'ఓం ఓం ఓం' ఉద్వాసనము చేయాలి. ఓం ఓం ఓం మంగళం మహత్ ।