సామాగ్రి
  1. పసుపు
  2. కుంకుమ
  3. గంధం
  4. అయిదు రకముల పుష్పములు
  5. పసుపు అక్షతలు
  6. ఆచమన పాత్ర {రెండింటిలోనూ నీళ్ళు నింపుకోండి}.
  7. కలశానికి చిన్న చెంబు {రెండింటిలోనూ నీళ్ళు నింపుకోండి}.
  8. తమలపాకులు ‐ 5
  9. కొబ్బరికాయలు ‐1
  10. అగరవత్తులు
  11. అగ్గిపెట్టె
  12. కర్పూరం
  13. గుమ్మడికాయ ‐1
  14. సమిధలు (జిల్లేడు (అర్క), మోదుగ (పలాశ))
  15. ఆజ్య పాత్ర (ఇత్తడి లేదా రాగి )
  16. ఆజ్యము ఆవు నెయ్యి -1kg
  17. స్రుక్కు, స్రువము
  18. కూర్చోవడానికి ఆసనం
పూజ
ముఖ్య గమనిక
  1. ముందుగా నిత్య లఘు హోమ విధి ప్రకారం సంకల్పం వరకు నిర్వహించాలి. అయితే, సంకల్పంలో మాత్రం ఈ క్రింది చంద్ర గ్రహణ సంకల్పమును చెప్పుకోవాలి.
  2. తదుపరి నిత్య లఘు హోమ విధి ప్రధాన హోమ దేవతా మంత్రాల ముందు వరకు చేయాలి.
  3. పిదప చంద్ర గ్రహణ (ప్రధాన హోమ దేవతా) మంత్ర ఆహుతులు ఇవ్వాలి.
  4. తరువాత నిత్య లఘు హోమ విధి లోని తర్వాత ప్రక్రియను చివరివరకు యథావిధిగా అనుసరించాలి.
సంకల్పం: మమ ఉపాత్త సమస్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం, శుభే శోభనే ముహూర్తే, రం కేతుగ్రస్త సోమగ్రహోపరాగ ప్రయుక్త గ్రహణ దోష నివారణార్థం, సోమగ్రహ శాంతి హోమమ్ కరిష్యే. ప్రార్థనా మంత్రం: యోఽసౌ వజ్రధరో దేవః ఆదిత్యానాం ప్రభుర్మతః । చంద్రగ్రహోపరాగోత్థ గ్రహపీడాం వ్యపోహతు ।। చంద్ర గ్రహణ ప్రధాన హోమ మంత్రాలు: చంద్ర గ్రహ మంత్రం: ఆప్యాయస్వ సమేతుతే విశ్వతస్సోమ వృష్ణీయమ్ । భవా వాజస్య సంగథే స్వాహా ।। (త్యాగము) సోమాయ ఇదం న మమ। కనీసం 28 లేదా వీలైతే 108 సార్లు ఆహుతులు ఇవ్వడం శ్రేష్ఠము. చంద్ర గ్రహణ హోమ మంత్రాలు: సంతే పయాగ్ంసీ సముయంతు వాజా స్సం వృష్ణియాణ్యభిమాతిషాహః। ఆప్యాయమానో ఆమృతాయ సోమ దివిశ్రవాగ్ న్యుత్తమాని ధిష్వ స్వాహా ।। (త్యాగము) సోమాయ ఇదం న మమ ।। కనీసం 21 లేదా వీలైతే 54 సార్లు ఆహుతులు ఇవ్వడం శ్రేష్ఠము. యాతే ధామాని దివి యా పృథివ్యాం యా పర్వతే షోషధీ ష్వప్సు । తేభిర్నో విశ్వైస్సుమానా అహేడన్ రాజన్ త్సోమ ప్రతిహవ్యా గృభాయ స్వాహా ।। (త్యాగము) సోమాయ ఇదం న మమ ।। కనీసం 21 లేదా వీలైతే 54 సార్లు ఆహుతులు ఇవ్వడం శ్రేష్ఠము. చంద్ర గ్రహ అధిదేవత (అపః) మంత్రం: ఓం అప్సుమే సోమో అబ్రవీత్ అంతర్విశ్వాని భేషజా । అగ్నించ విశ్వశంభువమ్ ఆపశ్చ విశ్వభేషజీః ।। కనీసం 11 లేదా వీలైతే 21 సార్లు ఆహుతులు ఇవ్వడం శ్రేష్ఠము. చంద్ర గ్రహ ప్రత్యధిదేవత (గౌరీ) మంత్రం: గౌరీ మీమాయ సలిలాని తక్షత్యేక పదీ ద్విపదీ సా చతుష్పదీ । అష్టాపదీ నవపదీ బభూవుషీ సహస్రాక్షరా పరమే వ్యోమన్ స్వాహా ।। కనీసం 11 లేదా వీలైతే 21 సార్లు ఆహుతులు ఇవ్వడం శ్రేష్ఠము. చంద్ర గాయత్రి: ఓం క్షీర పుత్రాయ విద్మహే అమృత తత్వాయ ధీమహి । తన్నశ్చన్ద్రః ప్రచోదయాత్ స్వాహా ।। (త్యాగము) సోమాయ ఇదం నమమ। కనీసం 11 లేదా వీలైతే 21 సార్లు ఆహుతులు ఇవ్వడం శ్రేష్ఠము.