Nitya Homa Havan vidhi|DevataMantra
సామాగ్రి
  1. పసుపు
  2. కుంకుమ
  3. గంధం
  4. అయిదు రకముల పుష్పములు
  5. పసుపు అక్షతలు
  6. ఆచమన పాత్ర {రెండింటిలోనూ నీళ్ళు నింపుకోండి}.
  7. కలశానికి చిన్న చెంబు {రెండింటిలోనూ నీళ్ళు నింపుకోండి}.
  8. తమలపాకులు ‐ 5
  9. కొబ్బరికాయలు ‐1
  10. అగరవత్తులు
  11. అగ్గిపెట్టె
  12. కర్పూరం
  13. గుమ్మడికాయ ‐1
  14. సమిధలు
  15. ఆజ్య పాత్ర (ఇత్తడి లేదా రాగి )
  16. ఆజ్యము ఆవు నెయ్యి -1kg
  17. స్రుక్కు, స్రువము
  18. కూర్చోవడానికి ఆసనం
నిత్య లఘు హోమ విధి
శివాయ గురవే నమః పరమగురవే నమః సద్గురవే నమః శ్రీ మహా గణాధిపతయే నమః శ్రీ మహా సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః హరిః ఓం । (మీ ముఖానికి కుంకుమ పెట్టుకుని,నమస్కారం చేయండి) ఆచమ్య‐ప్రాణానాచమ్య‐నేత్రాచమ్య: (ఇప్పుడు ఆచమన పాత్ర లోని నీటిని ఉంగరం వ్రేలితో కళ్ళకు అద్దుకొని, ఉద్ధరిణిలో తీసుకొని ఒక్కో నామం చెపుతూ మూడు మార్లు తాగవలెను.) ఓం శివాయ స్వాహా ఓం మహేశ్వరాయ స్వాహా ఓం శంభవే స్వాహా హస్తం ప్రక్షాల్య (చేయి కడగండి) భూతోచ్చాటనం: ఉత్తిష్ఠంతు భూతపిశాచాః య ఏతే భూమి భారకాః। ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే। (అక్షతలు వాసనా చూసి మీ ధర్మపత్నికి ఎడమవైపున వేయండి. ) (ఈ మంత్రం చదువుతూ ప్రాణాయామం చేయండి.) ఓం భూః।ఓం భువః।ఓం సువః।ఓం మహః। ఓం జనః।ఓం తపః।ఓం సత్యం। ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్। ఓమాపో జ్యోతీ రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్। సంకల్పం: (ఇప్పుడు కుడిచేతిలో అక్షతలు తీసుకుని ,మీ కుడి కాలితొడపై ఎడమ అరచేతి నుంచి అక్షతలతో ఉన్న కుడిచేతిని పిడికిలిగా మూసి ఆ ఎడమ అరచేతిపైనుంచుతూ ఈ సంకల్పం చెప్పి పిడికిలిలో ఉన్నఅక్షతలను నీటితో అర్ఘ్యపాత్రలో వదలాలి.) మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీపరమేశ్వరముద్దిశ్య శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీమహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య …… ప్రదేశే ……, …… నద్యోః మధ్యప్రదేశే శోభన గృహే (స్వగృహే) సమస్త దేవతా బ్రాహ్మణ హరి హర గురు చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమనే వ్యావహరిక చాంద్రమానేన శ్రీ …….. (*౧) నామ సంవత్సరే …… అయనే (*౨) …… ఋతౌ (*౩) …… మాసే(*౪) …… పక్షే (*౫) …… తిథౌ (*౬) …… వాసరే (*౭) …… నక్షత్రే (*౮) …… యోగే (*౯) …… కరణ (*౧౦) ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ …… గోత్రః …… నామధేయః ధర్మపత్నీ సమేతోహం శ్రీమతః …… గోత్రస్య …… నామధేయస్య ఆయుష్యాభి వృధ్యర్థం మమధర్మపత్న్యాః ప్రసవంతే గృహ భూ భాండ ఆత్మ ద్రవ్య స్థల శరీర శుధ్యర్థం, వృధ్యర్థం, శాంత్యర్థ మభ్యుదయార్ధంచ మహాజానై అస్మాకం సహకుటుంబస్య క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం సర్వాభీష్ట సిద్ధ్యర్థం (ఇక్కడ మీరు చేయాలనుకుంటున్న హోమం పేరు చెప్పండి - ఉదా: గణపతి, నవగ్రహ, లక్ష్మి గణపతి ) హోమం కరిష్యే ।।
పసుపు గణపతి పూజ కలశారాధనం నుండి చేయాలి.
హవిస్సంస్కారం (శుద్ధి ప్రక్రియ): (ఒక పాత్రలో (ప్రోక్షణీ పాత్ర) నీరు తీసుకుని, అందులో గంధం, పుష్పం, అక్షతలు వేయాలి. ఆ తర్వాత ఆ నీటిని హోమ ద్రవ్యాలపై మరియు మీపై చల్లుకోవాలి (ప్రోక్షణం).) ఓం వరుణాయ నమః । సకలారాధనైః స్వర్ణితం । ప్రోక్షణీ పాత్రే ఉదకం పూరయిత్వా । గంధ పుష్పాక్షతైః అభ్యర్చ్య ।। అగ్ని ప్రతిష్ఠ: ఓం భూర్భువస్సువరోమ్ ఇత్యగ్నిమిధ్వా ‐ ధ్యాత్వా (ఓం భూర్భువస్సువరోమితి అగ్నిం ప్రతిష్టాప్య.) బ్రహ్మ భూర్భువస్సువరోమ్ (అగ్నిని వెలిగించాలి. స్రువములో కర్పూరం తీసుకొని అగర్బత్తీలతో కర్పూరం వెలిగించి హోమ గుండం లో ఉన్న సమిధలపై వెయ్యాలి ) అగ్ని ప్రార్థన: ఏషహి దేవః ప్రదిషోను సర్వాహ పూర్వోహి జాతస్స ఉగర్భే అంతః । సవిజాయమాన స్సజిన్ష్యమాణః ప్రత్యఙ్ముఖా స్తిష్ఠతి విశ్వతోముఖః।। (జలమును, అక్షతలను తీసుకొని క్రింది మంత్రం చెప్పి అగ్నికి తూర్పున జలమును, పడమట అక్షతలను విడువాలి.) అగ్ని ముఖం & ధ్యానం: (ఈ క్రింది మంత్రాలు చదువుతూ రెండు అరచేతులనూ అగ్ని వైపు చూపిస్తూ అగ్నిని మనసులో ధ్యానించాలి.) చత్వారి శృంగా త్రయో అస్య పాదా ద్వే శీర్షే సప్త హస్తాసో అస్య । త్రిధా బద్ధో వృషభో రోరవీతి మహో దేవో మర్త్యాగ్ం ఆవివేశ ।। స్వాహాస్తూ దక్షిణే పార్శ్వే దేవీమ్ వామే స్వధాం తథా । బిభ్రా దక్షిణ హస్తైస్తు శక్తిమన్నం సృచం సృవం ।। తోమరం వ్యజనం వామైర్ ఘృత పాత్రం తు ధారయన్ । మేషారూఢం జటాబద్దం గౌరవర్ణం మహోజసం ।। ధూమద్వజం లోహితాక్షం సప్తార్చిస్సర్వ కామదం । ఆత్మాభిముఖ మాసీనం ఏవం ధ్యాయేత్ హుతాశనం ।। అగ్ని లఘు షోడశోపచార పూజ:: (అగ్నిని సాక్షాత్ పరమేశ్వరుడిగా భావించి ఈ క్రింది ఉపచారాలు చేయాలి.) ఆవాహనం: ఓం వైశ్వానరాయ నమః। ఆవాహయామి।ఆవాహనం సమర్పయామి। (అగ్నిని మనసారా ఆహ్వానించాలి.) ఆసనం: ఓం వైశ్వానరాయ నమః । నవరత్నఖచిత సింహాసనం సమర్పయామి.। (అగ్నికి అక్షతలను సమర్పించాలి.) పాద్యం: ఓం వైశ్వానరాయ నమః । పాదయోః పాద్యం సమర్పయామి। (కలశంలో ఉన్న పుష్పంతో కానీ లేదా ఉద్ధరణితో కానీ నీరు తీసుకొని అగ్నికి చూపించి అర్ఘ్య పాత్రలో చల్లాలి/వదలాలి.) అర్ఘ్యం: ఓం వైశ్వానరాయ నమః । హస్తయోరర్ఘ్యం సమర్పయామి। (కలశంలో ఉన్న పుష్పంతో కానీ లేదా ఉద్ధరణితో కానీ నీరు తీసుకొని అగ్నికి చూపించి అర్ఘ్య పాత్రలో చల్లాలి/వదలాలి.) ఆచమనం: ఓం వైశ్వానరాయ నమః । ముఖే ఆచమనీయం సమర్పయామి। (కలశంలో ఉన్న పుష్పంతో కానీ లేదా ఉద్ధరణితో కానీ నీరు తీసుకొని అగ్నికి చూపించి అర్ఘ్య పాత్రలో చల్లాలి/వదలాలి.) శుద్ధోదకస్నానం: సర్వనదీ శుద్ధజల సంయుతం కలశేస్మిన్ సన్నిధౌ భవ। స్నానం కురుష్వ లాలీల కర్మదగ్ధాయా నమోఽస్తు తే ।। ఓం వైశ్వానరాయ నమః । శుద్ధోదక స్నానం సమర్పయామి। స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి। (కలశంలో ఉన్న పుష్పంతో కానీ ఉద్ధరణితో కానీ తమలపాకులతో కానీ నీరు తీసుకొని అగ్నిపై చల్లాలి.) వస్త్రం: ఓం వైశ్వానరాయ నమః । వస్త్రయుగ్మం సమర్పయామి। వస్త్రార్ధం అక్షతాన్ సమర్పయామి। (అక్షింతలు సమర్పించాలి.) యజ్ఞోపవీతం: ఓం వైశ్వానరాయ నమః । యజ్ఞోపవీతం సమర్పయామి।। యజ్ఞోపవీతార్ధం అక్షతాన్ సమర్పయామి.।। (అగ్నికి యజ్ఞోపవీతం లేదా అక్షింతలు సమర్పించాలి.) చందనం: ఓం వైశ్వానరాయ నమః । శ్రీ గంధాన్ ధారయామి। (అగ్నిపై గంధం చల్లాలి.) అక్షతలు: ఓం వైశ్వానరాయ నమః । అక్షతాన్ సమర్పయామి।। (అగ్నికి అక్షతలును సమర్పించాలి.) హరిద్రాచూర్ణం (పసుపు): ఓం వైశ్వానరాయ నమః । హరిద్రా చూర్ణం సమర్పయామి।। (అగ్నికి పసుపును సమర్పించాలి.) కుంకుమ: ఓం వైశ్వానరాయ నమః । కుంకుమ విలేపనం సమర్పయామి।। (అగ్నికి కుంకుమను సమర్పించాలి.) సుగంధ పరిమళ ద్రవ్యము : ఓం వైశ్వానరాయ నమః । సుగంధ పరిమళ ద్రవ్యాణిం సమర్పయామి ।। (అగ్నికి అక్షతలను సమర్పించాలి.) పుష్పసమర్పణం: ఓం వైశ్వానరాయ నమః । నానావిధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి।। (అగ్నికి పుష్పములు సమర్పించాలి.) ధూపం: ఓం వైశ్వానరాయ నమః। ధూపమాఘ్రాపయామి।। (అగరుబత్తులు వెలిగించి ఘంటా మోగిస్తూ అగ్నికి చూపించాలి) దీపం: ఓం వైశ్వానరాయ నమః।ప్రత్యక్ష దీపం దర్శయామి।। ధుపా దీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి।। (దీపానికి నమస్కారం చేయాలి) నైవేద్యం: (అగ్నికి బెల్లం సమర్పించాలి.) ఓం భూర్భువ॒స్సువ: । తత్స॑వి॒తుర్వరేణ్య॒o భర్గో॑ దే॒వస్య॑ ధీమహి । ధియో॒ యో న॑: ప్రచో॒దయాత్ ।। సత్యం త్వా ఋతేన పరిషించామి । (సాయంకాలం ‐ ఋతం త్వా సత్యేన పరిషించామి అని చెప్పాలి.) అమృతమస్తు । అ॒మృ॒తో॒ ప॒స్తర॑ణమసి । ఓం ప్రా॒ణాయ॒ స్వాహా” । ఓం అ॒పా॒నాయ॒ స్వాహా” । ఓం వ్యా॒నాయ॒ స్వాహా” । ఓం ఉ॒దా॒నాయ॒ స్వాహా” । ఓం స॒మా॒నాయ॒ స్వాహా” । మధ్యే మధ్యే పానీయం సమర్పయామి । అ॒మృ॒తా॒పి॒ధా॒నమ॑సి । ఉత్తరాపోశనం సమర్పయామి । హస్తౌ ప్రక్షాళయామి । పాదౌ ప్రక్షాళయామి । శుద్ధ ఆచమనీయం సమర్పయామి । ఓం వైశ్వానరాయ నమః। గుడోపహారం (బెల్లం ముక్క) నైవేద్యం సమర్పయామి।। తాంబూలం: ఓం వైశ్వానరాయ నమః। తాంబూలం సమర్పయామి ।। (అగ్నికి రెండు తమలపాకులు తొనలు ఆకుల కొసలు ఉత్తరం వైపు ఉన్నట్లుగా పెట్టి అందులో వక్కలు వేసి దైవానికి సమర్పించాలి.) నీరాజనం: ఓం వైశ్వానరాయ నమః। కర్పూరనీరాజనం సమర్పయామి।। (అగ్నికి కర్పూర హారతి ఇవ్వాలి.) మంత్రపుష్పం: ఓం వైశ్వానరాయ విద్మహే లాలీలాయ ధీమహి। తన్నో అగ్నిః ప్రచోదయాత్।। ఓం వైశ్వానరాయ నమః। పాదారవిందయోః సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి। (అగ్నికి పుష్పాలను సమర్పించాలి.) నమస్కారం: (అక్షింతలు పుష్పాలు చేతిలో తీసుకొని అగ్నికి నమస్కారం చేయాలి.) నమస్తే మహాతేజసే। సాక్షాత్ యజ్ఞస్వరూపిణే। మమ హవనకర్మ స్వీకురుష్వ। మమ సర్వాభీష్టసిద్ధిం దేహి నమః।। ఓం వైశ్వానరాయ నమః నమస్కారాన్ సమర్పయామి।। అగ్ని అభిముఖీకరణం: ప్రాఙ్ముఖాగ్నే మమాభిముఖో భవ । సుముఖో భవ । సుప్రసన్నో భవ । వరదో భవ । యథోక్త జిహ్వాయ హవిర్ గృహాణ ।ఆభిముఖ్యం సిద్ధిరస్తు ।। (అగ్ని దేవుడు మనకు అనుకూలంగా ఉండాలని కోరుకుంటూ అగ్నిని ప్రార్థించాలి. దోసిలిలా చేతులుంచి అగ్నిని ప్రార్థిస్తూ మన వైపు తిప్పుకోవాలి.) (ఈ మంత్రం పఠిస్తూ చేతిలో జలమును తీసుకొని అగ్ని చుట్టూ ప్రదక్షిణ క్రమముగా సమర్పించవలయును.) ఓం భూర్భువస్సువః । తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి । ధియో యో నః ప్రచోదయాత్ ।। సోదకేన పాణినా ప్రదక్షిణ మగ్నిమ్ పరిసమూహ్య । అగ్నిమలం కృత్య:: ((ఒక్కో నామం పఠిస్తూ 8 దిక్కులలో హోమ గుండం పై పుష్పాలతో అలంకరించాలి. హోమ గుండమునకు నాలుగు వైపుల దర్భల యొక్క అగ్రములు (కొనలు) తూర్పు ఉత్తరమున నున్నట్లు ఉంచాలి. ఒక్కో నామం పఠిస్తూ తూర్పు మొదలుకొని క్రమముగా ఎనిమిది (8) దిక్కుల్లో అక్షతలు వేయాలి.)) ఓం అగ్నయే నమః । హుతవహాయ నమః । హుతాశనే నమః । కృష్ణవర్త్మనే నమః । దేవముఖాయ నమః । సప్తజిహ్వాయ నమః । వైశ్వానరాయ నమః । జాతవేదసే నమః । పూర్వ పరిషేచనం (ప్రారంభం): అదితేఽనుమన్యస్వ । (దక్షిణము దిక్కున, పడమర నుండి తూర్పునకు కలశం లోని తమలపాకులతో లేదా పుష్పాలతో నీరు సరళ రేఖ (straight line )లో పోయాలి ) అనుమతేఽనుమన్యస్వ (పడమర వైపున దక్షిణము నుండి ఉత్తరమునకు, కలశం లోని జలమును తమలపాకులతో లేదా పుష్పాలతో సరళ రేఖ (straight line) లో పోయాలి) సరస్వత్యేఽనుమన్యస్వ । (ఉత్తరం వైపున పడమర నుండి తూర్పునకు, కలశం లోని జలమును తమలపాకులతో లేదా పుష్పాలతో సరళ రేఖ (straight line )లో పోయాలి.) దేవ సవితః ప్రసువ ।। (ఈశాన్యం నుండి మొదలుకొని ప్రదక్షిణ క్రమముగా మరల ఈశాన్యం వరకు కలశం లోని జలమును తమలపాకులతో లేదా పుష్పాలతో చుట్టూ (పరిషేచనం) తిప్పాలి.) అగ్ని ఆహుతి (ఉత్తరార్ధము): ఏకం - ద్వే - త్రీణి - చత్వారి ఓం అగ్నయే స్వాహా । (నాలుగు సార్లు నెయ్యిని స్రుక్కుతో స్రువములో వేసుకొని హోమగుండంలో ఉత్తరం నుండి తూర్పుకు నెయ్యిని అగ్నికి సమర్పించాలి.) (తదుపరి) ఉత్తరార్ధ పూర్వార్ధే అగ్నయ ఇదం నమమ। (అని చెప్పాలి.)దీనినే ‘త్యాగము’ అంటారు.) ఇలా ప్రతి ఆహుతికి ఆయా దేవతలా యొక్క ‘త్యాగము’చెప్పవలసి ఉంటుంది. సోమ ఆహుతి(దక్షిణార్థము): ఏకం - ద్వే - త్రీణి - చత్వారి - సోమాయ స్వాహా। (నాలుగు సార్లు నెయ్యిని స్రుక్కుతో స్రువములో వేసుకొని హోమగుండంలో దక్షిణం నుండి తూర్పుకు నెయ్యిని అగ్నికి సమర్పించాలి.) (త్యాగము) దక్షిణార్థ పూర్వార్ధే సోమాయ ఇదం నమమ । వాయువ్యం నుండి ఆగ్నేయం ఆహుతి: ఏకం - ద్వే - త్రీణి - చత్వారి - వాయవ్యాదాగ్నేయాంతం స్వాహా । (నాలుగు సార్లు నెయ్యిని స్రుక్కుతో స్రువములో వేసుకొని హోమగుండంలో వాయువ్యం (North-West) దిశ నుండి ఆగ్నేయం (South-East) కోణము ముగిసే వరకు సరళ రేఖ (straight line )లో నెయ్యిని అగ్నికి సమర్పించాలి.) (త్యాగము) ఆగ్నేయా ఇదం నమమ । నైరుతి నుండి ఈశాన్యం ఆహుతి: ఏకం - ద్వే - త్రీణి - చత్వారి - నైరృత్యాదీశానాంతం స్వాహా । (నాలుగు సార్లు నెయ్యిని స్రుక్కుతో స్రువములో వేసుకొని హోమగుండంలో నైరృతి దిశ (South-West) నుండి ఈశాన(North - East) కోణము ముగిసే వరకు సరళ రేఖ (straight line )లో నెయ్యిని అగ్నికి సమర్పించాలి.) (త్యాగము) ఈశానాయ ఇదం నమమ। మధ్య భాగము (అగ్ని): ఏకం - ద్వే - త్రీణి - చత్వారి - మధ్యే అగ్నయే స్వాహా । (హోమగుండం మధ్యలో వేయాలి నెయ్యిని అగ్నికి సమర్పించాలి.) (త్యాగము) అగ్నయ ఇదం నమమ। ప్రధాన హవనం: (ప్రతి మంత్రం చివర‘స్వాహా’ అంటూ నెయ్యి సమర్పించాలి.) ప్రధాన దేవతా మంత్రాలు: (ముందుగా ప్రధాన దేవతా మంత్రాలైన గణపతి, సరస్వతి,గురువుకు మరియు మహా మృత్యుంజయ ఆహుతులు ఇవ్వాలి.) ఓం గణానాం త్వా గణపతిగ్ం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం । జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆ నః శృణ్వన్నూతిభిః సీద సాదనం స్వాహా ।। (త్యాగము) శ్రీ మహాగణపతయ ఇదం నమమ। ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతీ । ధీనామవిత్ర్యవతు స్వాహా ।। (త్యాగము) మహా సరస్వత్యై ఇదం నమమ। ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః । గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః స్వాహా ।। (త్యాగము) గురుదేవాయ ఇదం నమమ। ఓం త్య్రంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనమ్ । ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్ స్వాహా ।। (త్యాగము) మహా మృత్యుంజయాయ ఇదం నమమ। సృవ స్థాపన మంత్రము:: (ఈ మంత్రం చదువుతూ స్రువములో నెయ్యి తీసుకొని హోమ ద్రవ్యము అందులో ఉంచి ఉత్తరం వైపు దర్భలపై లేదా సమిధలపై ఉంచాలి. ఇలా చేయడం వల్ల యజ్ఞ ఫలితం యజమానికి ల్కలుగుతుందని శాస్త్రం.) ఓం అపాం పుష్పమసి । తస్యతే రూపం పృథివ్యాం లోక ఉత్తరతో నిధాయ ।। సృవముత్తరతో నిధాయ । గమనిక: స్రువమునందు హవిస్సు తీసుకున్నప్పుడు అది బయటకు ఒలికి నేలపై పడకుండా చూసుకోవాలి; స్రువమును ఎల్లప్పుడూ హోమ కుండమునకు ఉత్తర దిశలో దర్భల (కుశల) పైన మాత్రమే ఉంచవలెను. ప్రధాన హోమ దేవతా మంత్రాలు: (ఇప్పుడిక ప్రధాన దేవతా హవనము ప్రారంభించాలి. ఉదాహరణ : నవగ్రహ, మృత్యంజయ, గణపతి, దేవీ, రుద్ర, శ్రీరామ మొదలగు హవనములు చేయవచ్చును.) ముందుగా ఈ మంత్రాల తో ఆహుతులివ్వాలి. తదుపరి ప్రధాన హవనం ప్రారంభించాలి. ఓం గణానాం త్వా గణపతిగ్ం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం । జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆ నః శృణ్వన్నూతిభిః సీద సాదనం స్వాహా ।। (త్యాగము) శ్రీ మహాగణపతయ ఇదం నమమ। 3 లేదా 9 సార్లు ఆహుతులివ్వాలి ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా స్వాహా ।। (త్యాగము) లక్ష్మీ గణపతయ ఇదం నమమ। 3 లేదా 9 సార్లు ఆహుతులివ్వాలి దిక్పాలక ఆహుతులు:: తూర్పు - ఇంద్రుడు (East) : ఇంద్రం వో విశ్వత స్పర్తిహ వామహే జనేభ్యః అస్మాకమస్తు కేవల స్స్వాహా।। లేదా ఓం ఇంద్రాయ నమః స్వాహా। (త్యాగము) ఇంద్రాయ ఇదం నమమ। ఆగ్నేయం - అగ్ని (South East) : అగ్నిం దూతం వృణీ మహేహోతారం విశ్వవేదసమ్। అస్య యజ్ఞస్య సుక్రతగ్గ్॒ స్వాహా।। లేదా ఓం అగ్నయే నమః స్వాహా। (త్యాగము) అగ్నయ ఇదం నమమ।। దక్షిణం - యముడు (South) : యమాయ సోమగ్ం సునుత యమాయ జుహుతా హవిః। యమగ్ం హ యజ్ఞో గచ్ఛత్యగ్ని దూతో అరంకృత స్వాహా। ।। లేదా ఓం యమాయ నమః స్వాహా। (త్యాగము) యమాయ ఇదం నమమ। నైరుతి - నిరృతి (South West): మొషుణః పరాపరా నిర్ ఋతి ర్దృహణావధీత్। పతీష్ట తృష్ణ యా సహ స్వాహా।। లేదా ఓం నిరృతయే నమః స్వాహా।। (త్యాగము) నిరృతయే ఇదం నమమ। పశ్చిమం - వరుణుడు (West): ఇమంమే వరుణః శ్రుధీహవ మద్యాచమృడయ। త్వా మ వస్యురాచకే స్వాహా।। లేదా ఓం వరుణాయ నమః స్వాహా। (త్యాగము) వరుణాయ ఇదం నమమ। వాయువ్యం - వాయువు (North West): తవవాయ వృతస్పతే త్వష్టుర్జామాత రద్భుత। ఆవాంస్యా వృణీ మహే స్వాహా।। లేదా ఓం వాయవే నమః స్వాహా। (త్యాగము) వాయవే ఇదం నమమ। ఉత్తరం - కుబేరుడు (North): సోమే ధేనుగ్ం సోమో అర్వంత మాశుగ్ం సోమో వీరం కర్మణ్యం దదాతు। సాదన్యం విదధ్స్వగ్ం సభేయం పితుశ్రవణం యో దదాశ దస్మై స్వాహా।। లేదా ఓం కుబేరాయ నమః స్వాహా। (త్యాగము) కుబేరాయ ఇదం నమమ। ఈశాన్యం - ఈశానుడు (North East) : ఓం ఈశానః సర్వవిద్యానామీశ్వరః సర్వభూతానాం। బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మా శివో మే అస్తు సదాశివోమ్ స్వాహా ।। లేదా ఓం ఈశానాయ నమః స్వాహా। (త్యాగము) ఈశానాయ ఇదం నమమ। ఊర్ధ్వ దిశ (పైకి) - ఊర్ధ్వ పురుషుడు : ఊర్ధ్వ ఊషుణ ఊతయే తిష్టా దేవో న సవితా। ఊర్ధ్వో వాజస్య సవితా యదం జిభీ ర్వాషు ద్బీర్విహ్వయామహే స్వాహా।। లేదా ఓం ఊర్ధ్వ పురుషాయ బ్రహ్మణే నమః స్వాహా। (త్యాగము) ఊర్ధ్వ పురుషాయ ఇదం నమమ। అధో దిశ (కిందకి) - పృథివీ: స్యోనా పృథి భవానృక్షరాని వేశనీ। యచ్చాన శ్శర్మ సప్రథా స్వాహా।। లేదా ఓం పృథివ్యై అనంతాయా నమః స్వాహా । (త్యాగము) పృథ్వి ఇదం నమమ। ఉపదేవతా మంత్ర హవనం: దుర్గా: ఓం జాతవేదసే సునవామ సోమమరాతీయతో నిదహాతి వేదః । సనః పర్షదతి దుర్గాణి విశ్వా నావేవ సింధుం దురితాత్యగ్ని స్వాహా ।। లేదా ఓం దుర్గాయై నమః స్వాహా। (త్యాగము) దుర్గాయై ఇదం నమమ। గణపతి: ఓం గణానాం త్వా గణపతిగ్ం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం । జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆ నః శృణ్వన్నూతిభిః సీద సాదనగ్గ్ స్వాహా ।। లేదా ఓం గం గణపతయే నమః స్వాహా। (త్యాగము) గణపతయ ఇదం నమమ। క్షేత్రపాలకుడు: ఓం క్షేత్రస్య పతినా వయగ్ం హితేనేేవ జయామసి। గామశ్వం పోషయిత్న్వా సనో మృడాతీదృశే స్వాహా।। లేదా ఓం క్షేత్రపాలకాయ నమః స్వాహా। (త్యాగము) క్షేత్రపాలకాయ ఇదం నమమ। అభయంకరుడు: యత ఇంద్ర భయామహే తతో నో అభయం కృధి ।। మఘవన్ ఛగ్దితవతన్న ఊతయే విద్విషో విమృదో జహి ।। స్వస్తిదా విశప్పతీ ర్వృత్రహా విమృధో వశీ వృషేంద్రః పుర ఏతు నస్స్వస్తిదా అభయంకర స్వాహా ।। లేదా ఓం అభయంకరాయ నమః స్వాహా। (త్యాగము) అభయంకరాయ ఇదం నమ। వాస్తుపురుషుడు: ఓం వాస్తుష్పతే ప్రతిజానీహ్యస్మాన్ థ్స్వావేశో అనమీవో భవానః। యత్త్వేమహే ప్రతితన్నో జుషస్వ శంన ఏథి ద్విపదే శం చతుష్పదే స్వాహా।। లేదా ఓం వాస్తువురుషాయ నమః స్వాహా। (త్యాగము) వాస్తువురుషాయ ఇదం నమమ। తూర్పు - ఇంద్రుడు : ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతీ । ధీనామవిత్ర్యవతు స్వాహా।। లేదా ఓం సరస్వత్యై నమః స్వాహా। (త్యాగము) సరస్వత్యై ఇదం నమమ।। బ్రహ్మ: బ్రహ్మాదేవానాం పదవిః క నాం ఋషి ర్విప్రాణాం మహిషో మృగాణామ్ । శ్వేనో గృధ్రాణాగ్ం స్వధితి ర్వనానాగ్ం సోమః పవిత్రమత్యేతి రేభన్ స్వాహా ।। లేదా ఓం బ్రహ్మణే నమః స్వాహా। (త్యాగము) బ్రహ్మణే ఇదం నమమ। లక్ష్మీ: మహా దేవ్యైచ విద్మహే విష్ణుపత్యై చ ధీమహి । తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ స్వాహా ।। లేదా ఓం లక్ష్మై నమః స్వాహా। (త్యాగము) లక్ష్మై ఇదం నమమ। విష్ణువు: ఓం ఇదం విష్ణుర్వి చక్రమే త్రేధా నిదధే పదమ్। సమూఢమస్య పాగ్ం సురే స్వాహా ।। లేదా ఓం విష్ణవే నమః స్వాహా। (త్యాగము) విష్ణవే ఇదం నమమ।। గౌరీ : గౌరీ మీమాయ సలిలాని తక్షత్యేక వది ద్విపదీ సా చతుష్పదీ । అష్టాపదీ నవపదీ బభూవుషీ సహస్రాక్షరా పరమే వ్యోమన్ స్వాహా ।। లేదా ఓం గౌర్యై నమః స్వాహా। (త్యాగము) గౌర్యై ఇదం నమమ। రుద్రుడు : కద్రుద్రాయ ప్రచేతసే మీఢుష్టమాయ తవ్యసే । వోచేమ శంతమగ్ం హృదే స్వాహా ।। లేదా ఓం రుద్రాయ నమః స్వాహా। (త్యాగము) రుద్రాయ ఇదం నమమ। మహా మృత్యుంజయ : ఓం త్య్రంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనమ్ । ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్ స్వాహా ।। (త్యాగము) మహా మృత్యుంజయాయ ఇదం నమమ। 3 లేదా 5 సార్లు ఆహుతులివ్వాలి దేవతా గాయత్రీ మంత్ర ఆహుతులు : రుద్రుడు : ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి । తన్నో రుద్రః ప్రచోదయాత్ స్వాహా ।। (త్యాగము) రుద్రాయ ఇదం నమమ। దంతి: ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి । తన్నో దంతిః ప్రచోదయాత్ స్వాహా ।। (త్యాగము) దంతినే ఇదం నమమ। నంది: ఓం తత్పురుషాయ విద్మహే చక్రతుండాయ ధీమహి । తన్నో నన్దిహ్ ప్రచోదయాత్ స్వాహా ।। (త్యాగము) నందినే ఇదం నమమ। గరుడ: తత్పురుషాయ విద్మహే సువర్ణ పక్షాయ ధీమహి । తన్నో గరుడః ప్రచోదయాత్ స్వాహా ।। (త్యాగము) గరుడాయ ఇదం నమమ। బ్రహ్మ: వేదాత్మ నాయ విద్మహే హిరణ్య గర్భాయ ధీమహి । తన్నో బ్రహ్మ ప్రచోదయాత్ స్వాహా।। (త్యాగము) బ్రహ్మణే ఇదం నమమ । విష్ణువు : నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి । తన్నో విష్ణుః ప్రవోదయాత్ స్వాహా।। (త్యాగము) విష్ణవే ఇదం నమమ। నరసింహ స్వామి: వజ్రనఖాయ విద్మహే తీక్ష్ణదగ్గ్ ష్ట్రాయ ధీమహి । తన్నో నారసింహ ప్రచోదయాత్ స్వాహా ।। (త్యాగము) నారసింహాయ ఇదం నమమ। ఆదిత్యుడు: భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య: ప్రచోదయాత్ స్వాహా।। (త్యాగము) ఆదిత్యాయ ఇదం నమమ। అగ్ని: వైశ్వానరాయ విద్మహే లాలీలాయధీమహి । తన్నో అగ్నిః ప్రచోదయాత్ స్వాహా ।। (త్యాగము) అగ్నయే ఇదం నమమ। దుర్గ: కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి । తన్నో దుర్గః ప్రచోదయాత్ స్వాహా ।। (త్యాగము) దుర్గాయై ఇదం నమమ। వెంకటేశ్వర స్వామి: శేషాచలాయ విద్మహే శ్రీనివాసాయ ధీమహి । తన్నో శ్రీ వేంకటేశ ప్రచోదయాత్ స్వాహా ।। (త్యాగము) అలివేలు మంగా సహిత వేంకటేశాయ ఇదం నమమ। కృష్ణుడు: ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి । తన్నః కృష్ణః ప్రచోదయాత్ స్వాహా ।। (త్యాగము) కృష్ణాయ ఇదం నమమ। గురువు: ఓం గురుదేవాయ విద్మహే పరబ్రహ్మణే ధీమహి । తన్నో గురుః ప్రచోదయాత్ స్వాహా। ।। (త్యాగము) గురుదేవాయ ఇదం నమమ। శిరిడీ సాయిబాబా: తత్పురుషాయ విద్మహే స్థిత ప్రజ్ఞాయ ధీమహి । తన్నో శ్రీ సాయినాథ పరమగురు ప్రచోదయాత్ స్వాహా ।। (త్యాగము) సాయినాథాయ ఇదం నమమ। హనుమంతుడు: ఓం ఆంజనేయాయ విద్మహే వాయు పుత్రాయ ధీమహి । తన్నో హనుమాన్ ప్రచోదయాత్ స్వాహా ।। (త్యాగము) హనుమతే ఇదం నమమ। రామచంద్రుడు: ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి । తన్నో రామః ప్రద్రోదయాత్ స్వాహా ।। (త్యాగము) రామాయ ఇదం నమమ। గోపాలుడు: ఓం గోపాలాయ విద్మహే గోపీ జనవల్లభాయ ధీమహి । తన్నో గోపాలః ప్రచోదయాత్ స్వాహా ।। (త్యాగము) గోపాలాయ ఇదం నమమ। గౌరీ: ఓం సుభగాయ చ విద్మహే కామమాలాయ ధీమహి ।। తన్నో గౌరీ ప్రచోదయాత్ స్వాహా । (త్యాగము) గౌర్యై ఇదం నమమ। చంద్రుడు: ఓం క్షీర పుత్రాయ విద్మహే అమృత తత్వాయ ధీమహి । తన్నశ్చన్ద్రః ప్రచోదయాత్ స్వాహా ।। (త్యాగము) చంద్రాయ ఇదం నమమ। హంస: ఓం పరమహంసాయ విద్మహే మహాతత్త్వాయ ధీమహి । తన్నో హంసః ప్రచోదయాత్ స్వాహా ।। (త్యాగము) హంసాయ ఇదం నమమ । కులదేవతా: ఓం శ్రీ కులదేవతాభ్యో నమః స్వాహా ।। (త్యాగము) కులదేవతాభ్యః ఇదం నమమ। గ్రామదేవతా: ఓం శ్రీ గ్రామదేవతాభ్యో నమః స్వాహా ।। (త్యాగము) గ్రామదేవతాభ్యః ఇదం నమమ। ఇష్టదేవతా: ఓం శ్రీ ఇష్టదేవతాభ్యో నమః స్వాహా ।। (త్యాగము) ఇష్టదేవతాభ్యః ఇదం నమమ। జయాది హోమము: (ఆహుతులు సమర్పించాలి ) ఓం చిత్తంచ స్వాహా। (త్యాగము) చిత్తాయ ఇదం నమమ। ఓం చిత్తిశ్చ స్వాహా। (త్యాగము) చిత్యా ఇదం నమమ। ఓం ఆకూతంచ స్వాహా। (త్యాగము) ఆకూతాయేదం నమమ। ఓం ఆకూతిశ్చ స్వాహా। (త్యాగము) ఆకూత్యా ఇదం నమమ। ఓం విజ్ఞాతంచ స్వాహా। (త్యాగము) విజ్ఞతాయేదం నమమ। ఓం విజ్ఞానంచ స్వాహా। (త్యాగము) విజ్ఞానాయేదం నమమ। ఓం మనశ్చ స్వాహా। (త్యాగము) మనస ఇదం నమమ। ఓం శక్వరీశ్చ స్వాహా। (త్యాగము) శశ్వర్యా ఇదం నమమ। ఓం దర్శశ్చ స్వాహా। (త్యాగము) దర్శాయ ఇదం నమమ। ఓం బృహచ్చ స్వాహా। (త్యాగము) బృహత ఇదం నమమ। ఓం రథంతరంచ స్వాహా। (త్యాగము) రథంతరాయ ఇదం నమమ। వ్యాహృతి హోమము: ఓం భూస్స్వాహా। (త్యాగము) అగ్నయ ఇదం నమమ ఓం భువ స్వాహా। (త్యాగము) వాయవ ఇదం నమమ ఓం సువ స్వాహా (త్యాగము) సూర్యా యేదం నమమ ఓం భూర్భువస్సు వస్స్వాహా। (త్యాగము) ప్రజాపతయ ఇదం నమమ సర్వప్రాయశ్చిత్త హోమము: ( ఉత్తరం మావైపు పెట్టిన స్రువమును తీసుకొని ఈ మంత్రం చదువుతూ అగ్నికి స్రువములో ఉన్న ద్రవ్యాన్ని సమర్పించాలి.) ముఖ్య గమనిక: శిష్టకృత్ ఆహుతి వేయకుండా పూర్ణాహుతి చేయకూడదు. ఓం యదస్య కర్మణోఽత్యరీరిచం యద్వాన్యూనమిహాకరమ్ । అగ్నిస్తత్స్విష్టకృద్విద్వాన్ సర్వం స్విష్టం సుహుతం కరోతు మే ।। అగ్నయే స్విష్టకృతే సుహుతహుతే సర్వప్రాయశ్చిత్తాహుతీనాం కామానాం సమర్థయిత్ర్యై సర్వం స్విష్టం సుహుతం కరోతు మే స్వాహా ।। (త్యాగము) అగ్నయే స్విష్టకృతే ఇదం నమః ఉత్తర పరిషేచనం: (అగ్ని చుట్టూ కుడి వైపు నుండి (Clockwise) జలాన్ని చల్లుతూ ఈ క్రింది మంత్రాలను పఠించాలి) అగ్ని ఉత్తర దిశలో (పై నుండి కిందకు): అదితేఽన్వమగ్గ్ స్థాః। అగ్ని పశ్చిమ దిశలో (ఎడమ నుండి కుడికి): అనుమతేఽన్వమగ్గ్ స్థాః। అగ్ని దక్షిణ దిశలో (కింద నుండి పైకి): సరస్వతేఽన్వమగ్గ్ స్థాః। అగ్ని చుట్టూ (ప్రదక్షిణగా): దేవ సవితః ప్రాసావీః।
పూర్ణాహుతి
(పూర్ణాహుతి ద్రవ్యం ప్యాకెట్ పూజ స్టోర్స్ లో దొరుకుతోంది. ఒక జాకెట్ బట్టలో అది అంతా వేసి దానిని కట్టి ఒక పాత్రలో పెట్టుకోవాలి. కట్టిన ఆ వస్త్రం పై నీరు చల్లి, నెయ్యి, పసుపు, కుంకుమ, అక్షతలు, గంధం, పుష్పములతో పూజించాలి.) సంకల్పం: (ఈ సంకల్పం చెప్పుకున్న పిదప కలశములో ఉన్న జలమును స్పృశించాలి..) ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం మమ సర్వకార్య సిద్ధ్యర్థం ఆయుష్యాభి వృధ్యర్థం (మీరు చేస్తున్నహోమము పేరు చెప్పుకుంటూ) హోమ సంపూర్ణతా సిద్ధ్యర్థం పూర్ణాహుతి హోమం కరిష్యే । ఆజ్యధార (నెయ్యి సమర్పణ): ఏకమ్। ద్వే। త్రీణి। చత్వారి। పంచ। షట్। సప్త। అష్టౌ। నవ। దశ। ఏకాదశ। ద్వాదశ। (పై వాక్యములు చెప్పుచు 12 సార్లు నెయ్యిను ద్రవ్యములపై లేదా స్రుక్కులో స్రువముతో నెయ్యి 12 మార్లు వేయవచ్చును. (ఆలా చేస్తే పూర్ణాహుతి ద్రవ్యం పై నెయ్యి వేయాలి.) ఆలా చేసాక పైకి లేచి...) పూర్ణాహుతి ప్రధాన మంత్రం: (క్రింది మంత్రం చదువుతూ ద్రవ్యములను అగ్నిలో సమర్పించాలి) సప్తతే అగ్నే సమిధః సప్తజిహ్వాః సప్తర్షయస్సప్త ధామప్రియాణి । సప్త హోత్రా సప్తధా త్వా యజంతి సప్త యోనీరాపృణస్వా ఘృతేన స్వాహా । (త్యాగము) అగ్నయే సప్తవత ఇదం న మమ వసోర్ధార: (ద్రవ్యములు వేసిన తర్వాత నెయ్యిని ధారగా పోస్తూ ఈ క్రింది మంత్రం పఠించాలి) పూర్ణాహుతి ముత్తమాం జుహోతి । సర్వం వై పూర్ణాహుతిః । సర్వమేవాప్నోతి । అథో ఇయం వై పూర్ణాహుతిః । అస్యామేవ ప్రతితిష్ఠతి । వసోర్ధారాం జుహోతి । వసోర్మే ధారాసదితి వా ఏషా హూయతే । ఘృతస్య వా ఏనమేషా ధారాఽముష్మిన్ లోకే పిన్వమానోప తిష్ఠతే । ఆజ్యేన జుహోతి తేజో వా ఆజ్యం తేజో వసోర్ధారా తేజసైవాస్మై తేజోఽవరుంధే తో । కామా వై వసోర్ధారా కామానేవావరుంధే ।। ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే । పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా వశిష్యతే ।। స్వాహా। ముహూర్త ఆశీర్వచనం:: (హోమం పూర్తయ్యాక అక్షతలు తలపై వేసుకుంటూ) పూర్ణాహుతి ముహూర్తస్సుముహూర్తోస్తు। తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ । విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రియుగం స్మరామి ।। యజ్ఞ పురుష షోడశోపచార పూజ: (పూర్ణాహుతి తర్వాత హోమగుండంలోని అగ్నిని సాక్షాత్తు విష్ణువుగా భావించి చేసే పూజ) (అగ్నిని సాక్షాత్ పరమేశ్వరుడిగా భావించి ఈ క్రింది ఉపచారాలు చేయాలి.) ఆవాహనం: ఓం యజ్ఞపురుషాయ నమః। ఆవాహయామి।ఆవాహనం సమర్పయామి। (అగ్నిని మనసారా ఆహ్వానించాలి.) ఆసనం: ఓం యజ్ఞపురుషాయ నమః । నవరత్నఖచిత సింహాసనం సమర్పయామి.। (అగ్నికి అక్షతలను సమర్పించాలి.) పాద్యం: ఓం యజ్ఞపురుషాయ నమః । పాదయోః పాద్యం సమర్పయామి। (కలశంలో ఉన్న పుష్పంతో కానీ లేదా ఉద్ధరణితో కానీ నీరు తీసుకొని అగ్నికి చూపించి అర్ఘ్య పాత్రలో చల్లాలి/వదలాలి.) అర్ఘ్యం: ఓం యజ్ఞపురుషాయ నమః । హస్తయోరర్ఘ్యం సమర్పయామి। (కలశంలో ఉన్న పుష్పంతో కానీ లేదా ఉద్ధరణితో కానీ నీరు తీసుకొని అగ్నికి చూపించి అర్ఘ్య పాత్రలో చల్లాలి/వదలాలి.) ఆచమనం: ఓం యజ్ఞపురుషాయ నమః । ముఖే ఆచమనీయం సమర్పయామి। (కలశంలో ఉన్న పుష్పంతో కానీ లేదా ఉద్ధరణితో కానీ నీరు తీసుకొని అగ్నికి చూపించి అర్ఘ్య పాత్రలో చల్లాలి/వదలాలి.) శుద్ధోదకస్నానం: సర్వనదీ శుద్ధజల సంయుతం కలశేస్మిన్ సన్నిధౌ భవ। స్నానం కురుష్వ లాలీల కర్మదగ్ధాయా నమోఽస్తు తే ।। ఓం యజ్ఞపురుషాయ నమః । శుద్ధోదక స్నానం సమర్పయామి। స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి। (కలశంలో ఉన్న పుష్పంతో కానీ ఉద్ధరణితో కానీ తమలపాకులతో కానీ నీరు తీసుకొని అగ్నిపై చల్లాలి.) వస్త్రం: ఓం యజ్ఞపురుషాయ నమః । వస్త్రయుగ్మం సమర్పయామి। వస్త్రార్ధం అక్షతాన్ సమర్పయామి। (అక్షింతలు సమర్పించాలి.) యజ్ఞోపవీతం: ఓం యజ్ఞపురుషాయ నమః । యజ్ఞోపవీతం సమర్పయామి।। యజ్ఞోపవీతార్ధం అక్షతాన్ సమర్పయామి.।। (అగ్నికి యజ్ఞోపవీతం లేదా అక్షింతలు సమర్పించాలి.) చందనం: ఓం యజ్ఞపురుషాయ నమః । శ్రీ గంధాన్ ధారయామి। (అగ్నిపై గంధం చల్లాలి.) అక్షతలు: ఓం యజ్ఞపురుషాయ నమః । అక్షతాన్ సమర్పయామి।। (అగ్నికి అక్షతలును సమర్పించాలి.) హరిద్రాచూర్ణం (పసుపు): ఓం యజ్ఞపురుషాయ నమః । హరిద్రా చూర్ణం సమర్పయామి।। (అగ్నికి పసుపును సమర్పించాలి.) కుంకుమ: ఓం యజ్ఞపురుషాయ నమః । కుంకుమ విలేపనం సమర్పయామి।। (అగ్నికి కుంకుమను సమర్పించాలి.) సుగంధ పరిమళ ద్రవ్యము : ఓం యజ్ఞపురుషాయ నమః । సుగంధ పరిమళ ద్రవ్యాణిం సమర్పయామి ।। (అగ్నికి అక్షతలను సమర్పించాలి.) పుష్పసమర్పణం: ఓం యజ్ఞపురుషాయ నమః । నానావిధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి।। (అగ్నికి పుష్పములు సమర్పించాలి.) ధూపం: ఓం యజ్ఞపురుషాయ నమః। ధూపమాఘ్రాపయామి।। (అగరుబత్తులు వెలిగించి ఘంటా మోగిస్తూ అగ్నికి చూపించాలి) ఫలదానం: (కొబ్బరి చిప్పలో నెయ్యి పోసి, ఈ మంత్రంతో అగ్నిలో సమర్పించాలి.) ముర్ధానం దివో అరతిం పృథివ్యా వైశ్వానరమృత ఆజాతమగ్నిమ్ । కవిం సామ్రాజమతిథిం జనానామాసన్నః పాత్రం జనయంత దేవాః ।। ఓం మధు మనిష్యే మధు జనిష్యే మధు వక్ష్యామి మధు వదిష్యామి మధుమతీం దేవేభ్యో వాచముద్యాసం శుశ్రూషేణ్యాం మనుష్యేభ్యః తం మా దేవా అవంతు శోభాయై పితరోఽనుమదన్తు।। దీపం: ఓం యజ్ఞపురుషాయ నమః।ప్రత్యక్ష దీపం దర్శయామి।। ధుపా దీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి।। (దీపానికి నమస్కారం చేయాలి) నైవేద్యం: (అగ్నికి బెల్లం సమర్పించాలి.) ఓం భూర్భువ॒స్సువ: । తత్స॑వి॒తుర్వరేణ్య॒o భర్గో॑ దే॒వస్య॑ ధీమహి । ధియో॒ యో న॑: ప్రచో॒దయాత్ ।। సత్యం త్వా ఋతేన పరిషించామి । (సాయంకాలం ‐ ఋతం త్వా సత్యేన పరిషించామి అని చెప్పాలి.) అమృతమస్తు । అ॒మృ॒తో॒ ప॒స్తర॑ణమసి । ఓం ప్రా॒ణాయ॒ స్వాహా” । ఓం అ॒పా॒నాయ॒ స్వాహా” । ఓం వ్యా॒నాయ॒ స్వాహా” । ఓం ఉ॒దా॒నాయ॒ స్వాహా” । ఓం స॒మా॒నాయ॒ స్వాహా” । మధ్యే మధ్యే పానీయం సమర్పయామి । అ॒మృ॒తా॒పి॒ధా॒నమ॑సి । ఉత్తరాపోశనం సమర్పయామి । హస్తౌ ప్రక్షాళయామి । పాదౌ ప్రక్షాళయామి । శుద్ధ ఆచమనీయం సమర్పయామి । ఓం యజ్ఞపురుషాయ నమః। గుడోపహారం (బెల్లం ముక్క) నైవేద్యం సమర్పయామి।। తాంబూలం: ఓం యజ్ఞపురుషాయ నమః। తాంబూలం సమర్పయామి ।। (అగ్నికి రెండు తమలపాకులు తొనలు ఆకుల కొసలు ఉత్తరం వైపు ఉన్నట్లుగా పెట్టి అందులో వక్కలు వేసి దైవానికి సమర్పించాలి.) నీరాజనం: ఓం యజ్ఞపురుషాయ నమః। కర్పూరనీరాజనం సమర్పయామి।। (అగ్నికి కర్పూర హారతి ఇవ్వాలి.) మంత్రపుష్పం: ఓం యజ్ఞపురుషాయ విద్మహే లాలీలాయ ధీమహి। తన్నో అగ్నిః ప్రచోదయాత్।। ఓం యజ్ఞపురుషాయ నమః। పాదారవిందయోః సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి। (అగ్నికి పుష్పాలను సమర్పించాలి.) నమస్కారం: (అక్షింతలు పుష్పాలు చేతిలో తీసుకొని అగ్నికి నమస్కారం చేయాలి.) నమస్తే మహాతేజసే। సాక్షాత్ యజ్ఞస్వరూపిణే। మమ హవనకర్మ స్వీకురుష్వ। మమ సర్వాభీష్టసిద్ధిం దేహి నమః।। ఓం యజ్ఞపురుషాయ నమః నమస్కారాన్ సమర్పయామి।। యజ్ఞ పురుష పంచోపచార పూజ: (షోడశోపచార పూజ చేయలేని వారు ఈ పంచోపచారా పూజ చేయవచ్చును ) గంధం: ఓం లం యజ్ఞపురుషాయ నమః ‐ గంధం సమర్పయామి పుష్పం: ఓం హం యజ్ఞపురుషాయ నమః ‐ పుష్పం సమర్పయామి ధూపం: ఓం యం యజ్ఞపురుషాయ నమః ‐ ధూపం ఆఘ్రాపయామి దీపం: ఓం రం యజ్ఞపురుషాయ నమః ‐దీపం దర్శయామి నైవేద్యం: ఓం వం యజ్ఞపురుషాయ నమః ‐ నైవేద్యం సమర్పయామి సర్వోపచారము : ఓం సం యజ్ఞపురుషాయ నమః ‐ సర్వోపచారాన్ సమర్పయామి బలిదానం: (గుమ్మడికాయ కుష్మాండం/కొబ్బరికాయ): ఓం భూతప్రేత పిశాచాద్యాః యే వసంత్యత్ర భూతలే। తే గచ్ఛంతు విముక్తాస్తే పూజాం గృహీత్వా యథావిధి।। (గుమ్మడికాయ లేదా కొబ్బరికాయను చేతిలో పట్టుకుని అగ్ని చుట్టూ లేదా హోమకర్త చుట్టు మూడుసార్లు దిష్టి తీసినట్లుగా తిప్పి, బయట కొడుతూ ఇలా చెప్పాలి :) సమస్త విఘ్న నివారణార్థం, సర్వ దిష్టి దోష పరిహారార్థం, యజ్ఞ రక్షణార్థం కుష్మాండ (గుమ్మడికాయ) / నారికేళ (కొబ్బరికాయ) బలిం సమర్పయామి ప్రదక్షిణ & నమస్కార మంత్రం: (హోమ గుండం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ చదవాల్సిన విశేష మంత్రం) నమస్తే గార్హపత్యాయ నమస్తే దక్షిణాగ్రయే । నమ ఆహవనీయాయ మహావేద్యై నమో నమః ।। కాండద్వయోపపాద్యాయ కర్మబ్రహ్మ స్వరూపిణే । స్వర్గాపవర్గ రూపాయ యజేశాయ నమో నమః యజేశాచ్యుత గోవింద మాధవానంత కేశవ । కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే ।। యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ । తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే ।। పాపోఽహం పాపకర్మాఽహం పాపాత్మా పాపసంభవః । త్రాహి మాం కృపయా దేవ శరణాగత వత్సల ।। అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ । తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష పరమేశ్వర ।। అగ్ని దేవుని ప్రార్థన : (అగ్నికి దగ్గరగా నిలబడి చేతులను దోసిలిలా పెట్టి ఇలా చెప్పాలి ) స్వస్తి। శ్రద్ధాం మేధాం యశః ప్రజ్ఞాం విద్యాం బుద్ధిం శ్రియం బలం । ఆయుష్యం తేజః ఆరోగ్యం దేహిమే। హవ్యవాహనః శ్రియం దేహిమే। హవ్యవాహనః ఓం నమ ఇతి। ముగింపు: ఓం సర్వేషాం స్వస్తిర్భవతు । ఓం సర్వేషాం శాంతిర్భవతు । ఓం సర్వేషాం పూర్ణం భవతు । ఓం లోకాస్సమస్తా స్సుఖినోభవంతు । పునః పూజ: పసుపు కుంకుమ అక్షతలు సమర్పించాలి. ఛత్రమాచ్చాదయామి । చామరం వీజయామి । నృత్యం దర్శయామి । గీతం శ్రావయామి । ఆందోళికానారోహయామి । అశ్వానారోహయామి । గజానరోహయామి । సమస్త రాజోపచార, దేవోపచార, భక్తోపచార, శక్త్యోపచార పూజాం సమర్పయామి. యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః హోమా క్రియాదిషు । న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే గజాననం ।। మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం హుతాశన । యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు తే ।। అనయా (హోమం పేరు చెప్పుకోవాలి) హావనేన భగవాన్ సర్వాత్మకః శ్రీ యజేశ్వర స్వామి సుప్రీతః సుప్రసన్నః వరదో భవతు। (అని చెబుతూ చేతిలోని పుష్పాక్షతలను, జలమును పళ్ళెములో విడిచిపెట్టవలెను.) ఓం తత్సత్ పరమేశ్వరార్పణమస్తు! ఓం శాంతిశ్శాంతిశ్శాంతిః ।। ఫలశ్రుతి & భస్మధారణ: ఓం అగ్నిరితి భస్మ । వాయురితి భస్మ । జలమితి భస్మ । స్థలమితి భస్మ । వ్యోమేతి భస్మ । సర్వగ్ం హవా ఇదం భస్మ । మన ఇతి భస్మ । చక్షూంషి భస్మ । శ్రీకరం చ పవిత్రం చ సర్వవ్యాధి నివారణం । లోకవశీకరం పుణ్యం భస్మం త్రైలోక్య పావనం ।। త్రయాయుషం జమదగ్నేః ఇతి లలాటే । కశ్యపస్య త్రయాయుషం ఇతి గ్రీవాయాం । యద్దేవేషు త్రయాయుషం ఇతి దక్షిణే బాహుమూలే । తన్నో అస్తు త్రయాయుషం ఇతి హృదయే ।।