పూర్వాంగ పూజ

శివాయ గురవే నమః పరమగురవే నమః సద్గురవే నమః శ్రీ మహా గణాధిపతయే నమః శ్రీ మహా సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః హరిః ఓం । మీ ముఖానికి కుంకుమ పెట్టుకుని,నమస్కారం చేయండి కంకణ ధారణ: బధ్నామి కంకణం పుణ్యం సర్వపాప వినాశనం । ధర్మకామార్థ సిద్ధ్యర్థం మమ సౌభాగ్య వర్ధనం ।। దంపతులు ఒకరినొకరు కంకణాలు కట్టుకోవాలి. శుచిః: అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం గతోఽపి వా । యః స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతరః శుచిః ।। (పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః) ఆచమన పాత్ర లోని నీటిని ఉద్ధరిణిలో తీసుకొని శిరముపై మూడు మార్లు చల్లుకోవలెను. ప్రార్థన: శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం । ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ।। అగజానన పద్మార్కం గజాననమహర్నిశం । అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ।। దేవీం వాచ॑మజనయన్త దేవాస్తాం వి॒శ్వరూపాః పశవో॑ వదన్తి ।। సా నో॑ మన్ద్రేషమూర్జ॒o దుహా॑నా ధే॒నుర్వాగస్మానుప సుష్టు॒తైతు । యశ్శివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళ । తయోః సంస్మరణాన్నిత్యం సర్వదా జయ మంగళం । తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ । విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేఽంఘ్రియుగం స్మరామి ।। గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః । గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః ।। లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః । ఏషామిందీవరశ్యామో హృదయస్థో జనార్దనః ।। సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే । శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోఽస్తు తే ।। [ఇప్పుడు ఎడమచేతిలో అక్షింతలు తీసుకొని కుడి చేతితో మృగముద్రవేసి(బొటనవేలు,మధ్యవేలు, ఉంగరం వేలు కలిపితే అది మృగముద్ర అవుతుంది.) ఆ ఎడమ చేతిలోని అక్షింతలు ఒక్కోనామం చదువుతూ గణనాథుడిపై వేస్తూ ఉండాలి.] శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః । ఉమామహేశ్వరాభ్యాం నమః । వాణీహిరణ్యగర్భాభ్యాం నమః । శచీపురందరాభ్యాం నమః । అరుంధతీవసిష్ఠాభ్యాం నమః । శ్రీసీతారామాభ్యాం నమః । మాతాపితృభ్యో నమః । సర్వేభ్యో మహాజనేభ్యో నమః । ఆచమ్య‐ప్రాణానాచమ్య‐నేత్రాచమ్య: ఇప్పుడు ఆచమన పాత్ర లోని నీటిని ఉంగరం వ్రేలితో కళ్ళకు అద్దుకొని, ఉద్ధరిణిలో తీసుకొని ఒక్కో నామం చెపుతూ మూడు మార్లు తాగవలెను. ఓం శివాయ స్వాహా ఓం మహేశ్వరాయ స్వాహా ఓం శంభవే స్వాహా (ఓం కేశవాయస్వాహా, ఓం నారాయణాయస్వాహా, ఓం మాధవాయస్వాహా । ఓం గోవిందాయనమః విష్ణవేనమః, మధుసూధనాయనమః। త్రివిక్రమాయనమః । వామనాయనమః శ్రీధరాయనమః హృషీకేశాయనమః పద్మనాభాయనమః దామోదరాయనమః, సంకర్ణణాయనమ: వాసుదేవాయనమః ప్రద్యుమ్నాయ నమః । అనిరుద్దాయనమః । పురుషోత్తమాయనమః అధోక్షజాయనమః । నారసింహాయనమః । అచ్యుతాయనమః జనార్ధనాయనమః ఉపేంద్రాయనమః । హరయే నమః శ్రీకృష్ణాయనమః) హస్తం ప్రక్షాల్యచేయి కడగండి దీపారాధనం: ఓం దీపస్త్వం బ్రహ్మ రూపోసి జ్యోతిషాం ప్రభురవ్యయః । సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్కామాంశ్చ దేహి మే ।। దీపమూలే పుష్పాక్షతాన్ నిక్షిప్య, దీపము వద్ద పుష్పాక్షతలను ఉంచవలెను. నవరాత్రి చేస్తున్నట్లైతే అఖండ దీపారాధనం చేయాలి. ఘంట: ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రక్షసామ్ । కురుఘంటా రావం తత్ర దేవ తాహ్వాన లాంఛనమ్ ।। ఘంటానాదం కృత్వా । ఘంట మ్రోగించాలి భూతోచ్చాటనం: ఉత్తిష్ఠంతు భూతపిశాచాః య ఏతే భూమి భారకాః । ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే । అక్షతలు వాసనా చూసి మీ ధర్మపత్నికి ఎడమవైపున వేయండి. ఈ మంత్రం చదువుతూ ప్రాణాయామం చేయండి. ఓం భూః ।ఓం భువః ।ఓం సువః ।ఓం మహః । ఓం జనః ।ఓం తపః ।ఓం సత్యం । ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ । ఓమాపో జ్యోతీ రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్ । సంకల్పం: ఇప్పుడు కుడిచేతిలో అక్షతలు తీసుకుని ,మీ కుడి కాలితొడపై ఎడమ అరచేతి నుంచి అక్షతలతో ఉన్న కుడిచేతిని పిడికిలిగా మూసి ఆ ఎడమ అరచేతిపైనుంచుతూ ఈ సంకల్పం చెప్పి పిడికిలిలో ఉన్నఅక్షతలను నీటితో అర్ఘ్యపాత్రలో వదలాలి. మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీపరమేశ్వరముద్దిశ్య శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీమహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య …… ప్రదేశే ……, …… నద్యోః మధ్యప్రదేశే శోభన గృహే (స్వగృహే) సమస్త దేవతా బ్రాహ్మణ హరి హర గురు చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమనే వ్యావహరిక చాంద్రమానేన శ్రీ …….. (*) నామ సంవత్సరే …… అయనే (*) …… ఋతౌ (*) …… మాసే(*) …… పక్షే (*) …… తిథౌ (*) …… వాసరే (*) …… నక్షత్రే (*) …… యోగే (*) …… కరణ (*) ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ …… గోత్రః …… నామధేయః ధర్మపత్నీ సమేతోహం శ్రీమతః …… గోత్రస్య …… నామధేయస్య ఆయుష్యాభి వృధ్యర్థం మమధర్మపత్న్యాః ప్రసవంతే గృహ భూ భాండ ఆత్మ ద్రవ్య స్థల శరీర శుధ్యర్థం, వృధ్యర్థం, శాంత్యర్థ మభ్యుదయార్ధంచ మహాజానై స్వస్తి పుణ్యాహ వాచనం కరిష్యే అస్మాకం సహకుటుంబస్య క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం సర్వాభీష్ట సిద్ధ్యర్థం శ్రీ ………. (పూజ చేసే దేవత పేరు: పరమేశ్వర పరమేశ్వరి మొ।।)ఉద్దిశ్య శ్రీ ……….(పూజ చేసే దేవత పేరు: పరమేశ్వర పరమేశ్వరి ప్రీత్యర్థం మొ।।) సంభవద్భిః ద్రవ్యైః సంభవద్భిః ఉపచారైశ్చ సంభవతా నియమేన సంభవితా ప్రకారేణ యావచ్ఛక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం (హవానాఖ్యం కర్మ) కరిష్యే ।। ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం శ్రీ మహా గణాధిపతి పూజాం కరిష్యే. తదంగ కలశారాధనం కరిష్యే. కలశారాధనం: కలశే గంధ పుష్పాక్షతైరభ్యర్చ్య । కలశస్యోపరి హస్తం నిధాయ । కలశానికి బొట్టు పెట్టి, ఒక పువ్వు వేసి, అక్షతలు వేసి కలశం పై కుడి అరచేతిని ఉంచండి. కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రః సమాశ్రితః । మూలే త్వస్య స్థితో బ్రహ్మా । మధ్యే మాతృగణా స్మృతాః ।। కుక్షౌ తు సాగరాసర్వే । సప్తద్వీపా వసుంధరా । ఋగ్వేదోథ యజుర్వేద సామవేదో హ్యథర్వణః ।। అంగైశ్చ సహితాసర్వే కలశాంబు సమాశ్రితాః । ఓం ఆకలశేషు ధావతి పవిత్రే పరిషిచ్యతే । ఉక్థైర్యజ్ఞేషు వర్ధతే । ఆపో వా ఇదగ్ం సర్వం విశ్వా భూతాన్యాపః । ప్రాణా వా ఆపః పశవ ఆపోఽన్నమాపోఽమృతమాపః । సమ్రాడాపో విరాడాపః స్వరాడాపశ్ఛందాగ్స్యాపో । జ్యోతీగ్ష్యాపో యజూగ్ష్యాపః సత్యమాపః । సర్వా దేవతా ఆపో భూర్భువః సువరాప ఓమ్ ।। గంగే చ యమునే చైవ గోదావరీ సరస్వతీ । నర్మదే సింధు కావేరీ జలేఽస్మిన్ సన్నిధిం కురు ।। కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమీ । భాగీరథీతి విఖ్యాతాః పంచగంగాః ప్రకీర్తితాః ।। ఆయాంతు దేవ పూజార్థం మమ దురితక్షయకారకాః । ఇప్పుడు ఈ మంత్రం చదువుతూ పూజాద్రవ్యాలపై, ప్రతిమపై, మీపై, మీ పరివారంపై కలశం లోని పుష్యంతో నీరు చల్లాలి. ఓం ఓం ఓం కలశోదకేన పూజా ద్రవ్యాణి సంప్రోక్ష్య ।।దేవమాత్మానంచసంప్రోక్ష్య ।। పూర్వాంగ పూజ పూర్తైన పిదప ఇతర పూజలు ( గణపతి పూజ , శివ పూజా ...) ప్రారంభం చేసుకోవచ్చును.