పూజా సామాగ్రి
  1. పసుపు
  2. కుంకుమ
  3. తడిపిన గంధం
  4. భస్మం
  5. పరమేశ్వరుని ప్రతిమ
  6. పసుపు గణపతి(లేదా)పసుపు గణపతి
  7. Lord Shiva Offerings शिव निवेदनశివ నివేదన
  8. పసుపు అక్షతలు
  9. ఆచమన పాత్ర {రెండింటిలోనూ నీళ్ళు నింపుకోండి}
  10. కలశానికి చిన్న చెంబు {రెండింటిలోనూ నీళ్ళు నింపుకోండి}
  11. పాలు
  12. పెరుగు
  13. నెయ్యి
  14. తేనే
  15. శర్కర
  16. కొబ్బరికాయ
  17. అగరవత్తులు
  18. దీపానికి నూనె
  19. వత్తివేసిన కుందులు
  20. అగ్గిపెట్టె
  21. కర్పూరం
  22. కూర్చోవడానికి ఆసనం
పూజ
పూర్వాంగ పూజ
శివాయ గురవే నమః పరమగురవే నమః సద్గురవే నమః శ్రీ మహా గణాధిపతయే నమః శ్రీ మహా సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః హరిః ఓం । (మీ ముఖానికి కుంకుమ పెట్టుకుని,నమస్కారం చేయండి) విభూతి ధారణ: భస్మ జ్యోతిస్వరూపాయ శివాయ పరమాత్మనే। షట్త్రింశత్తత్త్వరూపాయ నమశ్శాంతాయ తేజసే।। (కుడిచేతి మధ్య, అనామికా (ఉంగరపు వేలు) వేళ్లతో విభూతిని తీసుకుని నుదుటిపై ఎడమ నుండి కుడికి మూడు అడ్డ రేఖలుగా (త్రిపుండ్రం) ధరించండి.,నమస్కారం చేయండి) కంకణ ధారణ: బధ్నామి కంకణం పుణ్యం సర్వపాప వినాశనం। ధర్మకామార్థ సిద్ధ్యర్థం మమ సౌభాగ్య వర్ధనం।। (దంపతులు ఒకరినొకరు కంకణాలు కట్టుకోవాలి.) శుచిః: అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం గతోఽపి వా। యః స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతరః శుచిః।। (పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః) (ఆచమన పాత్ర లోని నీటిని ఉద్ధరిణిలో తీసుకొని శిరముపై మూడు మార్లు చల్లుకోవలెను.) ప్రార్థన: శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం । ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ।। అగజానన పద్మార్కం గజాననమహర్నిశం। అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ।। దే॒వీం వాచ॑మజనయన్త దే॒వాస్తాం వి॒శ్వరూ॑పాః ప॒శవో॑ వదన్తి ।। సా నో॑ మ॒న్ద్రేష॒మూర్జ॒o దుహా॑నా ధే॒నుర్వాగ॒స్మానుప॒ సుష్టు॒తైతు । యశ్శివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళ। తయోః సంస్మరణాన్నిత్యం సర్వదా జయ మంగళం । తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ। విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేఽంఘ్రియుగం స్మరామి।। గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః। గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః।। లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః। ఏషామిందీవరశ్యామో హృదయస్థో జనార్దనః।। సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే। శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోఽస్తు తే।। [ఇప్పుడు ఎడమచేతిలో అక్షింతలు తీసుకొని కుడి చేతితో మృగముద్రవేసి(బొటనవేలు,మధ్యవేలు, ఉంగరం వేలు కలిపితే అది మృగముద్ర అవుతుంది.) ఆ ఎడమ చేతిలోని అక్షింతలు ఒక్కోనామం చదువుతూ గణనాథుడిపై వేస్తూ ఉండాలి.] శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః। ఉమామహేశ్వరాభ్యాం నమః। వాణీహిరణ్యగర్భాభ్యాం నమః। శచీపురందరాభ్యాం నమః। అరుంధతీవసిష్ఠాభ్యాం నమః। శ్రీసీతారామాభ్యాం నమః। మాతాపితృభ్యో నమః। సర్వేభ్యో మహాజనేభ్యో నమః। ఆచమ్య‐ప్రాణానాచమ్య‐నేత్రాచమ్య: (ఇప్పుడు ఆచమన పాత్ర లోని నీటిని ఉంగరం వ్రేలితో కళ్ళకు అద్దుకొని, ఉద్ధరిణిలో తీసుకొని ఒక్కో నామం చెపుతూ మూడు మార్లు తాగవలెను.) ఇప్పుడు ఆచమన పాత్ర లోని నీటిని ఉంగరం వ్రేలితో కళ్ళకు అద్దుకొని, ఉద్ధరిణిలో తీసుకొని ఒక్కో నామం చెపుతూ మూడు మార్లు తాగవలెను.) ఓం శివాయ స్వాహా ఓం మహేశ్వరాయ స్వాహా ఓం శంభవే స్వాహా హస్తం ప్రక్షాల్య (చేయి కడగండి) దీపారాధనం: ఓం దీపస్త్వం బ్రహ్మ రూపోసి జ్యోతిషాం ప్రభురవ్యయః। సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్కామాంశ్చ దేహి మే।। (దీపమూలే పుష్పాక్షతాన్ నిక్షిప్య, దీపము వద్ద పుష్పాక్షతలను ఉంచవలెను.) ఘంట: రక్షార్థం సర్వభూతానాం ఆదిగురోరాగమనార్థకం। ఘంటారావం కరోమ్యహం పరమేశ్వరాహ్వానలాంఛనం।। (ఘంట మ్రోగించాలి) భూతోచ్చాటనం(విఘ్నాల తొలగింపు): (పూజ చేసే ప్రదేశం పవిత్రం కావడానికి ఈ శ్లోకాలు చదువుతారు.) అపసర్పంతు యే భూతా యే భూతా భూమి సంస్థితాః । యే భూతా విఘ్నకర్తారః తే నశ్యంతు శివాజ్ఞయా।। అపక్రామంతు భూతాద్యాః సర్వేతే భూమి భారకాః । సర్వేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే।। ఉత్తిష్ఠంతు భూతపిశాచాః య ఏతే భూమి భారకాః । ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే ।। (అక్షతలు వాసనా చూసి మీ ధర్మపత్నికి ఎడమవైపున వేయండి. ) ప్రాణాయామం: (ఈ మంత్రం చదువుతూ ప్రాణాయామం చేయండి.) ఓం భూః।ఓం భువః।ఓం సువః।ఓం మహః। ఓం జనః।ఓం తపః।ఓం సత్యం। ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్। ఓమాపో జ్యోతీ రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్। సంకల్పం: (ఇప్పుడు కుడిచేతిలో అక్షతలు తీసుకుని ,మీ కుడి కాలితొడపై ఎడమ అరచేతి నుంచి అక్షతలతో ఉన్న కుడిచేతిని పిడికిలిగా మూసి ఆ ఎడమ అరచేతిపైనుంచుతూ ఈ సంకల్పం చెప్పి పిడికిలిలో ఉన్నఅక్షతలను నీటితో అర్ఘ్యపాత్రలో వదలాలి.) మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీపరమేశ్వరముద్దిశ్య శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీమహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య …… ప్రదేశే ……, …… నద్యోః మధ్యప్రదేశే శోభన గృహే (స్వగృహే) సమస్త దేవతా బ్రాహ్మణ హరి హర గురు చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమనే వ్యావహరిక చాంద్రమానేన శ్రీ …….. (*) నామ సంవత్సరే …… అయనే (*) …… ఋతౌ (*) …… మాసే(*) …… పక్షే (*) …… తిథౌ (*) …… వాసరే (*) …… నక్షత్రే (*) …… యోగే (*) …… కరణ (*) ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమాన్ …… గోత్రః …… నామధేయః …… నామ ధర్మపత్నీ సమేతోహం శ్రీమతః …… గోత్రస్య …… నామధేయస్య …… నామ ధర్మపత్నీ సమేతస్య మమ సకుటుంబస్య క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం సర్వాభీష్ట సిద్ధ్యర్థం శ్రీ శ్రీ ఉమా పార్థివేశ్వర (శివలింగేశ్వర) (శివలింగేశ్వర) స్వామి దేవతా ముద్ధిశ్య శ్రీ శ్రీ శ్రీ ఉమా పార్థివేశ్వర (శివలింగేశ్వర) (శివలింగేశ్వర) స్వామి దేవతా ముద్ధిశ్య ప్రీత్యర్థం సంభవద్భిః ద్రవ్యైః సంభవద్భిః పదార్థైః సంభవితా నియమేన, సద్యోజాత విధానేన యథాశక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే ।। ఏకవార రుద్రాభిషేకం కరిష్యే ‐ (నమక, చమకములతో అభిషేకము చేయునప్పుడు ఏకవార రుద్రాభిషేకం కరిష్యే అనియూ సంకల్పించుకొనవలెను.) ఆదౌ నిర్విఘ్నేన పరిసమా ప్త్యర్థం శ్రీ మహా గణాధిపతి పూజాం కరిష్యే. తదంగ కలశారాధనం కరిష్యే. కలశారాధనం: కలశే గంధ పుష్పాక్షతైరభ్యర్చ్య। కలశస్యోపరి హస్తం నిధాయ। (కలశానికి బొట్టు పెట్టి, ఒక పువ్వు వేసి, అక్షతలు వేసి కలశం పై కుడి అరచేతిని ఉంచండి.) కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రః సమాశ్రితః। మూలే త్వస్య స్థితో బ్రహ్మా। మధ్యే మాతృగణా స్మృతాః।। కుక్షౌ తు సాగరాసర్వే। సప్తద్వీపా వసుంధరా। ఋగ్వేదోథ యజుర్వేద సామవేదో హ్యథర్వణః।। అంగైశ్చ సహితాసర్వే కలశాంబు సమాశ్రితాః। ఓం ఆకలశేషు ధావతి పవిత్రే పరిషిచ్యతే । ఉక్థైర్యజ్ఞేషు వర్ధతే । ఆపో వా ఇదగ్ం సర్వం విశ్వా భూతాన్యాపః । ప్రాణా వా ఆపః పశవ ఆపోఽన్నమాపోఽమృతమాపః । సమ్రాడాపో విరాడాపః స్వరాడాపశ్ఛందాగ్స్యాపో । జ్యోతీగ్ష్యాపో యజూగ్ష్యాపః సత్యమాపః । సర్వా దేవతా ఆపో భూర్భువః సువరాప ఓమ్ ।। గంగే చ యమునే చైవ గోదావరీ సరస్వతీ । నర్మదే సింధు కావేరీ జలేఽస్మిన్ సన్నిధిం కురు ।। కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమీ । భాగీరథీతి విఖ్యాతాః పంచగంగాః ప్రకీర్తితాః ।। శ్రీ ఉమా పార్థివేశ్వర (శివలింగేశ్వర) స్వామి దేవతా పూజార్ధం, దురితక్షయ కారకాః ఆయాంతు। (ఇప్పుడు ఈ మంత్రం చదువుతూ పూజాద్రవ్యాలపై, ప్రతిమపై, మీపై, మీ పరివారంపై కలశం లోని పుష్యంతో నీరు చల్లాలి.) ఓం కలశోదకేన పూజా ద్రవ్యాణి సంప్రోక్ష్య।।దేవమాత్మానంచసంప్రోక్ష్య।। పంచకలశ స్థాపనం : (5 రాగి చెంబులు తీసుకొని వాటికీ దారం చుట్టి లేదా ఓంకారం రాయాలి. తదుపరి ఆ రాగి చెంబులలో సుగంధద్రవ్యాలు వేసి. నీటితో నింపి, 5 తమపాలపాకులు (చివరలు పైన ఉండేలా) ఒక్కో కలశంలో అమర్చి ఒక్కో కలశంపై కొబ్బరికాయ (జుట్టు పైన ఉండేలా) పెట్టి రవికను గోపురములా తయారు చేసి ఆ కొబ్బరికాయలపై ఉంచాలి.) ఇప్పుడు పసుపు తో స్వస్తిక్ ఆకారములో ముగ్గు వేసి 4 దిక్కుల్లో నమః శివాయ మంత్రం పఠిస్తూ ఒక్కో కలశం పెట్టి చివరి కలశాన్ని ఆ 4 కలశాల మధ్యలో పెట్టాలి. తదుపరి ఈ క్రింది మంత్రాలూ చదువుతూ ఒక్కో కలశంలో ఒక్కో పంచ బ్రహ్మ దేవతను అక్షింతలు పూలువేస్తూ ఆవాహనం చేయాలి.
1. సద్యోజాతం-పశ్చిమ కలశం (West): సద్యో జాతం ప్రపద్యామి సద్యో జాతాయ వై నమో నమః । భవే భవే నాతిభవే భవస్వ మామ్ । భవోద్భవాయ నమః ।। ఓం భూర్భువస్సువరోమ్ । అస్మిన్ పశ్చిమకలశే సద్యోజాతం ధ్యాయామి । ఆవాహయామి ।
2. వామదేవం - ఉత్తర కలశం (North): వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమథనాయ నమః సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః । ఓం భూర్భువస్సువరోమ్ । అస్మిన్ ఉత్తరకలశే వామదేవం ధ్యాయామి । ఆవాహయామి ।
3. అఘోరం - దక్షిణ కలశం (South): అఘోరేభ్యో అథఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః । సర్వేభ్యః సర్వశర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః ।। ఓం భూర్భువస్సువరోమ్ । అస్మిన్ దక్షిణకలశే అఘోరం ధ్యాయామి । ఆవాహయామి ।
4. తత్పురుషం - పూర్వ కలశం (East): తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి । తన్నో రుద్రః ప్రచోదయాత్ ।। ఓం భూర్భువస్సువరోమ్ । అస్మిన్ పూర్వకలశే తత్పురుషం ధ్యాయామి । ఆవాహయామి ।
5. ఈశానం - మధ్యమ కలశం (Center): ఈశానః సర్వవిద్యానామీశ్వరః సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్ బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మా శివో మే అస్తు సదాశివోమ్ ।। ఓం భూర్భువస్సువరోమ్ । అస్మిన్ మధ్యమ కలశే ఈశానం ధ్యాయామి । ఆవాహయామి ।
ఆదౌ గణపతి ప్రార్థనాం కరిష్యే(గణపతి ప్రార్థన) ఓం గ॒ణానాం᳚ త్వా గ॒ణప॑తిగ్ం హవామహే క॒విం క॑వీ॒నాం ఉప॒మశ్ర॑వస్తవమ్। జ్యే॒ష్ఠ॒రాజం॒ బ్రహ్మ॑ణాం బ్రహ్మణస్పత॒ ఆ నః॑ శృ॒ణ్వన్నూ॒తిభి॑స్సీద॒ సాద॑నమ్। వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ। నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా।। పీఠ పూజ (ఆసనం వేయడం): భూమ్యాం షట్కోణం విలిఖ్య, కుశానాస్తీర్య, తదుపరి దేవం సంస్థాప్య। ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనమ్ । ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్।। [భూమి మీద పసుపు లేదా బియ్యపు పిండితో షట్కోణం (ఆరు కోణాల గుర్తు)గీసి, దాని మీద కుశలు (దర్భలు) పరచి, ఆ పైన దేవుడిని ((విగ్రహాన్ని లేదా లింగాన్ని) ప్రతిష్ఠించాలి.]
శ్రీ ఉమా పార్థివేశ్వర (శివలింగేశ్వర) స్వామి ప్రాణ ప్రతిష్ఠాపన
పాఠ్యం ఓం పశుపతయే నమః । అస్మిన్ లింగే శ్రీ ఉమా పార్థివేశ్వర(శివలింగేశ్వర(స్వామినం ఆవాహయామి స్థాపయామి । తతః ప్రాణ ప్రతిష్ఠాపనం కరిష్యే ।। ఆదౌ గణపతి ప్రార్థనాం కరిష్యే(గణపతి ప్రార్థన) ప్రాణప్రతిష్ఠా మహామంత్రం: వినియోగం: అస్యశ్రీ ఉమా పార్థివేశ్వర (శివలింగేశ్వర) స్వామి దేవతా ప్రాణ ప్రతిష్ఠాపన మహామంత్రస్య, బ్రహ్మ ఋషిః । ఉమా పార్థివేశ్వర (శివలింగేశ్వర) దేవతా । అనుష్టుప్ ఛందః । మమ శ్రీ ఉమా పార్థివేశ్వర (శివలింగేశ్వర) దేవతా ప్రాణ ప్రతిష్ఠాపన సిద్ధ్యర్థే జపే వినియోగః ।। న్యాస విధి:: కరన్యాసం ఓం హ్రాం శివాయ సర్వజ్ఞ్యాయ అంగుష్ఠాభ్యాం నమః (రెండు బొటనవేళ్లను తాకాలి) ఓం హ్రీం శివాయ సర్వ తృప్తాయ తర్జనీభ్యాం నమః (చూపుడు వేళ్లను తాకాలి) ఓం హ్రూం శివాయ నిత్యమలుప్త శక్తయే మధ్యమాభ్యాం నమః (మధ్య వేళ్లను తాకాలి) ఓం హ్రైం శివాయ సర్వజ్ఞాన శక్తయే అనామికాభ్యాం నమః (ఉంగరపు వేళ్లను తాకాలి) ఓం హ్రౌం శివాయ నిత్యానంద శక్తయే కనిష్ఠికాభ్యాం నమః (చిటికెన వేళ్లను తాకాలి) ఓం హ్రః శివాయ అనంత శక్తి శివాయ కరతల కరపృష్ఠాభ్యాం నమః (అరచేతులు మరియు వెనుక భాగం ఒకదానితో ఒకటి తాకాలి) అంగన్యాసం (శరీర భాగాలను తాకుతూ ఈ మంత్రాలు చదవాలి) ఓం హ్రాం శివాయ సర్వజ్ఞ్యాయ హృదయాయ నమః (కుడి చేతితో హృదయాన్ని తాకాలి) ఓం హ్రీం శివాయ సర్వ తృప్తాయ శిరసే స్వాహా (శిరస్సును తాకాలి) ఓం హ్రూం శివాయ నిత్యమలుప్త శక్తయే శిఖాయై వషట్ (జుట్టు ముడి/శిఖ భాగాన్ని తాకాలి) ఓం హ్రైం శివాయ సర్వజ్ఞాన శక్తయే కవచాయ హుమ్ (రెండు భుజాలను మార్చి మార్చి తాకాలి) ఓం హ్రౌం శివాయ నిత్యానంద శక్తయే నేత్రత్రయాయ వౌషట్ (రెండు కళ్లు మరియు మధ్యలో మూడవ కన్ను ఉన్న చోట తాకాలి) ఓం హ్రః శివాయ అనంత శక్తి శివాయ అస్త్రాయ ఫట్ (కుడిచేతి మధ్య వేలితో ఎడమ అరచేతిపై చప్పట్లు కొడుతూ దిగ్బంధనం చేయాలి) ధ్యానం: కర్పూర గౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్ర హారం। సదా రమంతం హృదయారవిందే భవం భవానీ సహితం నమామి।। వందే మహేశం సురసిద్ధసేవితం దేవాంగనా గీత సునృత్య తుష్టం। పర్యంకగం శైలసుతాసమేతం కల్పద్రుమారణ్యగతం ప్రసన్నమ్।। ధ్యాయేన్నిత్యం మహేశం రజతగిరినిభం చారుచంద్రావతంసం రత్నకల్పోజ్జ్వలాంగం పరశువరమృగాభీతి హస్తం ప్రసన్నమ్। పద్మాసీనం సమంతాత్ స్తుతమమరగణైర్వ్యాఘ్రకృత్తిం వసానం విశ్వాద్యం విశ్వవంద్యం నిఖిల భయహరం పంచవక్త్రం త్రినేత్రమ్।। ఓం ఆం హ్రీం క్రోం, యం రం లం వం శం షం సం హం ళం క్షం। హంసః సోహం శ్రీ ఉమా పార్థివేశ్వర (శివలింగేశ్వర) స్వామినః సర్వేంద్రియాణి వాఙ్మన శ్చక్షు శ్రోత్ర జిహ్వా ఘ్రాణ ప్రాణ రేతో బుద్ధ్యాదీని ఇహైవ ఆగత్య సుఖం చిరం తిష్ఠంతు స్వాహా।। (పరమశివుడిని మనసులో ధ్యానించాలి.) ప్రాణప్రతిష్ఠ: ఓం అసునీతే పునరస్మాసు చక్షుః పునః ప్రాణమిహ నో ధేహి భోగమ్। జ్యోక్పశ్యేమ సూర్యముచ్చరంత మనుమతే మృడయా నః స్వస్తి।। అమృతం వై ప్రాణా అమృతమాపః ప్రాణానేవ యథాస్థానముపహ్వయతే।। శ్రీ ఉమా పార్థివేశ్వర (శివలింగేశ్వర) స్వామినే నమః। స్థిరో భవ వరదో భవ। సుముఖో భవ సుప్రసన్నో భవ। మమాభిముఖో భవ మీ చేతులు దోసిలిలా పెట్టి మీ వైపు తిప్పుకోవాలి)స్థిరాసనం కురు। స్వామిన్ సర్వ జగన్నాథ యావత్పూజాఽవసానకమ్। తావత్త్వం ప్రీతి భావేన లిఙ్గేఽస్మిన్ సన్నిధిం కురు।। {రెండు తమపాకులు కుడి చేతితో తల్లక్రిందులుగా శివలింగంపై ఉంచుతూ ఈ మంత్రం చదవాలి.} స్థాపన ముద్ర: త్య్రంబకమితి స్థాపన ముద్రాం దర్శయిత్వా। ఓం త్య్రంబకం యజామహే సుగ॒న్ధిం పుష్టి॒ వర్ధనం। ఉర్వారుకమివ బన్ధనాన్మృత్యోర్ముక్షీయ మాఽమృతాత్।। {రెండు చేతులను బోర్లించి (అరచేతులు కిందకు ఉండేలా), రెండు బొటనవేళ్లను లోపలికి మడిచి, మిగిలిన వేళ్లను ఒకదానితో ఒకటి కలిపి ఉంచడాన్ని 'స్థాపన ముద్ర' అంటారు.} ధ్యానం: కైలాసే కమనీయ రత్న ఖచితే కల్పద్రుమూలే స్థితం కర్పూర స్ఫటికేందు సుందర తనుం కాత్యాయనీ సేవితమ్। గంగోత్తుంగ తరంగ రంజిత జటా భారం కృపాసాగరం కంఠాలంకృత శేషభూషణమహం మృత్యుంజయం భావయే।। ఓం శ్రీ ఉమా పార్థివేశ్వర (శివలింగేశ్వర)స్వామినే నమః ధ్యాయామి। ధ్యానం సమర్పయామి। (పరమశివుడిని మనసులో ధ్యానించాలి.) ఆవాహనం‐(ఓం స॒ద్యోజా॒తం ప్ర॑పద్యా॒మి): ఓంకారాయ నమస్తుభ్యం ఓంకారప్రియ శంకర। ఆవాహనం గృహాణేదం పార్వతీప్రియ వల్లభ।। ఓం శ్రీ ఉమా పార్థివేశ్వర (శివలింగేశ్వర)స్వామినే నమః ఆవాహయామి। ఆవాహనం సమర్పయామి.। (పరమశివుడిని మనసారా ఆహ్వానించాలి.) ఆసనం‐(ఓం స॒ద్యోజా॒తాయ॒వై నమో॒ నమ॑:): నమస్తే గిరిజానాథ కైలాసగిరి మందిర । సింహాసనం మయా దత్తం స్వీకురుష్వ ఉమాపతే ।। శ్రీ ఉమా పార్థివేశ్వర (శివలింగేశ్వర)స్వామినే నమః నవరత్నఖచిత సింహాసనం సమర్పయామి.। (పరమశివుడికి పుష్పాలను సమర్పించాలి.) పాద్యం‐(ఓం భవే భ॑వే॒న): మహాదేవ జగన్నాథ భక్తానామభయప్రద। పాద్యం గృహాణ దేవేశ మమ సౌఖ్యం వివర్ధయ।। శ్రీ ఉమా పార్థివేశ్వర (శివలింగేశ్వర) స్వామినే నమః పాదయోః పాద్యం సమర్పయామి। (శంకరుడి పాదాలు కడగాలి/శివలింగం యొక్క మూలమును కడగాలి) అర్ఘ్యం‐(ఓం అతి॑ భవే భవస్వ॒మాం): శివాప్రియ నమస్తేస్తు పావనం జలపూరితం। అర్ఘ్యం గృహాణ భగవన్ గాంగేయ కలశస్థితం।। శ్రీ ఉమా పార్థివేశ్వర (శివలింగేశ్వర) స్వామినే నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి। (కలశంలో ఉన్న పుష్పంతో కానీ లేదా ఉద్ధరణితో కానీ నీరు తీసుకొని పరమశివుడికి చూపించి అర్ఘ్య పాత్రలో చల్లాలి/వదలాలి.) ఆచమనం (ఓం భ॒వోద్భ॑వాయ॒ నమః): వామాదేవ సురాధీశ వందితాంఘ్రి సరోరుహ। గృహాణాచమనం దేవ కరుణా వరుణాలయ।। శ్రీ ఉమా పార్థివేశ్వర (శివలింగేశ్వర) స్వామినే నమః ముఖే ఆచమనీయం సమర్పయామి। (కలశంలో ఉన్న పుష్పంతో కానీ లేదా ఉద్ధరణితో కానీ నీరు తీసుకొని పరమశివుడికి చూపించి అర్ఘ్య పాత్రలో చల్లాలి/వదలాలి.) మధుపర్కం: యమాంతకాయ ఉగ్రాయ భీమాయ చ నమో నమః। మధుపర్కం ప్రదాస్యామి గృహాణ త్వముమాపతే।। శ్రీ ఉమా పార్థివేశ్వర (శివలింగేశ్వర) స్వామినే నమః మధుపర్కం సమర్పయామి। (పెరుగు, తేనె, నెయ్యి మిశ్రమమును పరమశివుడికి సమర్పించాలి.) పంచామృత స్నానం: click here (పంచామృతాలతో పరమశివుడిని అభిషేకించాలి.) శుద్ధోదకస్నానం‐(ఓం వామదేవాయ నమః) : ఓంకార ప్రీత మనసే నమో బ్రహ్మార్చితాంఘ్రయే। స్నానం స్వీకురు దేవేశ మయానీతం నదీ జలం।। (ఇచ్చట 28 సార్లు నమ॑శ్శ॒oభవే॑ చ మయో॒భవే॑చ॒ నమ॑శ్శంక॒రాయ॑ చ మయస్క॒రాయ॑ చ॒ నమ॑శ్శి॒వాయ॑ చ శి॒వత॑రాయ చ।।అనే మంత్రంతో అభిషేకం చేయాలి. ) (మంత్రాలు రాని వారు, కేవలం "ఓం నమః శివాయ" అనే పంచాక్షరీ మంత్రాన్ని మనసులో స్మరిస్తూ కూడా అభిషేకం చేయవచ్చు. భగవంతుడికి ముఖ్యం భక్తి మాత్రమే.) బ్రాహ్మణుడి చేత పూజ చేయిస్తున్నట్లైతే పఠిస్తూ అయన అభిషేకము చేస్తారు. ఓం శ్రీ ఉమా పార్థివేశ్వర (శివలింగేశ్వర) స్వామినే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి। స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి। వస్త్రం‐(ఓం జ్యేష్ఠాయ నమః): నమో నాగవిభూషాయ నారదాది స్తుతాయ చ। వస్త్రయుగ్మం ప్రదాస్యామి పార్థివేశ్వర (శివలింగేశ్వర) స్వీకురు।। ఓం శ్రీ ఉమా పార్థివేశ్వర (శివలింగేశ్వర) స్వామినే నమః వస్త్రయుగ్మం సమర్పయామి। వస్త్రార్ధం అక్షతాన్ సమర్పయామి। (పవిత్రమైన వస్త్రాన్ని లేదా అక్షింతలు సమర్పించాలి.) యజ్ఞోపవీతం‐(ఓం శ్రేష్ఠాయ నమః): యజ్ఞేశ యజ్ఞ విధ్వంస సర్వదేవ నమస్కృత। యజ్ఞసూత్రం ప్రదాస్యామి శోభనం చోత్తరీయకమ్।। ఓం శ్రీ ఉమా పార్థివేశ్వర (శివలింగేశ్వర) స్వామినే నమః యజ్ఞోపవీతం సమర్పయామి।। యజ్ఞోపవీతార్ధం అక్షతాన్ సమర్పయామి।। (పరమశివుడికి యజ్ఞోపవీతం లేదా అక్షింతలు సమర్పించాలి. ) ఆభరణం‐(ఓం రుద్రాయ నమః): నాగాభరణ విశ్వేశ చంద్రార్ధకృత మస్తక। పార్థివేశ్వర (శివలింగేశ్వర) (శివలింగేశ్వర) మద్దత్తం గృహాణాభరణం విభో।। ఓం శ్రీ ఉమా పార్థివేశ్వర (శివలింగేశ్వర) స్వామినే నమః ఆభరణం సమర్పయామి।। (పరమశివుడికి విభూతి పెట్టాలి.) గంధం‐(ఓం కాలాయ నమ:): శ్రీ గంధం తే ప్రయచ్ఛామి గృహాణ పరమేశ్వర। కస్తూరి కుంకుమోపేతం శివాశ్లిష్ట భుజద్వయ।। ఓం శ్రీ ఉమా పార్థివేశ్వర (శివలింగేశ్వర) స్వామినే నమః శ్రీగంధాది పరిమళ ద్రవ్యం సమర్పయామి। (పరమశివుడికి గంధం మరియు కుంకుమ పెట్టాలి.) అక్షతాన్ ‐ (ఓం కల॑వికరణాయ నమః): అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలి తుండుల మిశ్రితాన్। అక్షతోసి స్వభావేన స్వీకురుష్వ మహేశ్వర।। ఓం శ్రీ ఉమా పార్థివేశ్వర (శివలింగేశ్వర) స్వామినే నమః ధవళాక్షతాన్ సమర్పయామి।। (పరమశివుడికి అక్షతలును సమర్పించాలి.) పుష్పం ‐ (ఓం బల వికరణాయ నమః): సుగంధీని సుపుష్పాణి జాజీబిల్వార్క చంపకైః। నిర్మితం పుష్పమాలంచ నీలకంఠ గృహాణ భో।। ఓం శ్రీ ఉమా పార్థివేశ్వర (శివలింగేశ్వర) స్వామినే నమః పుష్ప బిల్వదళాని సమర్పయామి। సమర్పయామి। (పుష్ప బిల్వదళములు సమర్పించాలి.) అథాంగ పూజా: {ఈ పూజ కేవలం మూర్తి పూజకు మాత్రమే చేయాలి.} [ఎడమచేతిలో అక్షింతలు తీసుకొని కుడి చేతితో మృగముద్రవేసి(బొటనవేలు,మధ్యవేలు, ఉంగరం వేలు కలిపితే అది మృగముద్ర అవుతుంది.) ఆ ఎడమ చేతిలోని అక్షింతలు ఒక్కోనామం చదువుతూ శివునిపై వేస్తూ ఉండాలి.] ఓం మహేశ్వరాయ నమః ‐ పాదౌ పూజయామి। (పాదాలపై సమర్పించాలి.) ఓం ఈశ్వరాయ నమః ‐ జంఘౌ పూజయామి। (పిక్కలపై సమర్పించాలి.) ఓం కామరూపాయ నమః ‐ జానునీ పూజయామి। (మోకాళ్లపై సమర్పించాలి.) ఓం హరాయ నమః నమః ‐ ఊరూ పూజయామి। (తొడలపై సమర్పించాలి.) ఓం త్రిపురాంతకాయ నమః ‐ గుహ్యం పూజయామి। (మర్మస్థానముపై సమర్పించాలి.) ఓం భవాయ నమః ‐ కటిం పూజయామి। (నడుముపై సమర్పించాలి.) ఓం వ్యాఘ్రచర్మాంబరధరాయ నమః ‐ నాభిం పూజయామి। (నాభిపై సమర్పించాలి.) ఓం కుక్షిస్థ బ్రహాండాయ నమః ‐ ఉదరం పూజయామి। (కడుపుపై సమర్పించాలి.) ఓం గౌరీ మనః ప్రియాయ నమః ‐హృదయం పూజయామి। (హృదయంపై భుజాలపై సమర్పించాలి.) ఓం పినాకినే నమః ‐ హస్థౌ పూజయామి। (చేతులపై సమర్పించాలి.) ఓం నాగావృతభుజదండాయ నమః ‐స్కందౌ పూజయామి। (భుజాలపై సమర్పించాలి.) ఓం శ్రీకంఠాయ నమః ‐ కంఠం పూజయామి। (కంఠంపై సమర్పించాలి.) ఓం విరూపాక్షాయ నమః ‐ వక్త్రం పూజయామి। (ముఖముపై సమర్పించాలి.) ఓం త్రినేత్రాయ నమః ‐ నేత్రౌ పూజయామి। (కళ్లపై సమర్పించాలి.) ఓం పరబ్రహ్మణే నమః ‐ కర్ణౌ పూజయామి। (చెవులపై సమర్పించాలి.) ఓం రుద్రాయ నమః ‐ లలాటం పూజయామి। (నుదురుపై సమర్పించాలి.) ఓం శర్వాయ నమః ‐ శిరః పూజయామి। (శిరస్సుపై సమర్పించాలి.) ఓం చంద్రమౌళయే నమః ‐ మౌళిం పూజయామి। (జటాజూటంపై సమర్పించాలి.) ఓం అర్ధనారీశ్వరాయ నమః ‐ తనుం పూజయామి। (దివ్య మంగళశరీరంపై సమర్పించాలి.) ఓం శ్రీ ఉమామహేశ్వరాయ నమః ‐ సర్వాణ్యంగాని పూజయామి। (ఎడమచేతిలో ఉన్న మిగిలిన అక్షింతలను శివునిపై సమర్పించాలి.) అష్టోత్తర శతనామ పూజ: ఇప్పుడు బిల్వ అష్టోత్తర శతనామ స్తోత్ర, శివ అష్టోత్తర శతనామ స్తోత్ర మంత్రాలు పఠిస్తూ శివుడిని మారేడు దళములతో,పుష్పములతో పూజించాలి. పుష్పసమర్పణం: (ఈ మంత్రాలు పఠిస్తూ పరమశివుడికి పూలమాల సమర్పించాలి.) ఓం నిధ॑నపతయే॒ నమః। ఓం నిధ॑నపతాన్తికాయ॒ నమః। ఓం ఊర్ధ్వాయ॒ నమః। ఓం ఊర్ధ్వలింగాయ నమః। ఓం హిరణ్యాయ॒ నమః। ఓం హిరణ్యలింగాయ నమః। ఓం సువర్ణాయ॒ నమః। ఓం సువర్ణలింగాయ నమః। ఓం దివ్యాయ॒ నమః। ఓం దివ్యలింగాయ నమః। ఓం భవాయ॒ నమః। ఓం భవలింగాయ నమః। ఓం శర్వాయ॒ నమః। ఓం శర్వలింగాయ నమః। ఓం శివాయ॒ నమః। ఓం శివలింగాయ నమః। ఓం జ్వలాయ॒ నమః। ఓం జ్వలలింగాయ నమః। ఓం ఆత్మాయ॒ నమః। ఓం ఆత్మలింగాయ నమః। ఓం పరమాయ॒ నమః। ఓం పరమలింగాయ నమః। ఓం భ॒వాయ దే॒వాయ నమః ‐ ఓం భ॒వస్య దేవస్య॒ పత్న్యై॒ నమ:। ఓం శర్వాయ దే॒వాయ॒ నమః ‐ ఓం శ॒ర్వస్య దేవస్య॒ పత్న్యై॒ నమ:। ఓం ఈశానాయ దే॒వాయ నమః ‐ ఓం ఈశానస్య దేవస్య॒ పత్న్యై॒ నమ:। ఓం పశుపత॑యే దే॒వాయ నమః ‐ ఓం పశు॒పతేర్దే॒వస్య పత్న్యై॒ నమ:। ఓం రుద్రాయ॑ దే॒వాయ నమః ‐ ఓం రు॒ద్రస్య దేవస్య॒ పత్న్యై॒ నమ:। ఓం ఉగ్రాయ దే॒వాయ॒ నమః ‐ ఓం ఉ॒గ్రస్య దేవస్య॒ పత్న్యై॒ నమ:। ఓం భీమాయ॑ దే॒వాయ॒ నమః ‐ ఓం భీ॒మస్య దేవస్య॒ పత్న్యై॒ నమ:। ఓం మహతే దే॒వాయ॒ నమః ‐ ఓం మహతో దేవస్య॒ పత్న్యై॒ నమ:। ఓం శ్రీ ఉమా పార్థివేశ్వర (శివలింగేశ్వర) స్వామినే నమః నానా విధ పరిమళ పత్ర పుష్పాక్షతాన్ సమర్పయామి। ధూపం ‐ (ఓం బలా॑య నమః): దశాంగం ధూపముఖ్యం చ హ్యంగార వినివేశితమ్। ధూపం సుగంధైరుత్పన్నం త్వాం ప్రీణయతు శంకర।। ఓం శ్రీ ఉమా పార్థివేశ్వర (శివలింగేశ్వర) స్వామినే నమః। ధూపమాఘ్రాపయామి।। (అగరుబత్తులు వెలిగించి ఘంటా మోగిస్తూ పరమశివుడికి చూపించాలి) దీపం ‐ (ఓం బల॑ ప్రమథనాయ నమః): యోగినాం హృదయేష్వేవ జ్ఞాన దీపాంకురోహ్యసి। బాహ్య దీపో మయాదత్తః గృహ్యతాం భక్త గౌరవాత్।। ఓం శ్రీ ఉమా పార్థివేశ్వర (శివలింగేశ్వర) స్వామినే నమః దీపం దర్శయామి।। ధుపా దీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి।। (దీపానికి నమస్కారం చేయాలి) నైవేద్యం ‐ (ఓం సర్వ॑ భూత దమనాయ నమః): నైవేద్యం షడ్రసోపేతం ఘృత భక్ష్య సమన్వితం। భక్త్యా తే సంప్రదాస్యామి గృహాణ పరమేశ్వర।। ఓం భూర్భువస్సువః । తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి । ధియో యో నః ప్రచోదయాత్ । దేవ సవితః ప్రసువః । సత్యం త్వర్తేన పరిషించామి । (సాయంకాలం అయితే ‐ఋతం త్వా సత్యేన పరిషించామి) అమృతం అస్తు । అమృతోపస్తరణమసి । ఓం ప్రాణాయ స్వాహా । ఓం అపానాయ స్వాహా । ఓం వ్యానాయ స్వాహా । ఓం ఉదానాయ స్వాహా । ఓం సమానాయ స్వాహా । ఓం బ్రహ్మణే స్వాహా । మధు వాతా ఋతాయతే మధు క్షరంతి సింధవః । మాధ్వీర్నః సంత్వోషధీః । మధు నక్త ముతోషసి మధుమత్ పార్థివగ్ం రజః । మధు ద్యౌరస్తు నః పితా । మధుమాన్నో వనస్పతిర్ మధుమాగ్ం అస్తు సూర్యః । మాధ్వీర్గావో భవంతు నః ।। మధు మధు మధు ।। ఆవాహితాభ్యః సర్వాభ్యో దేవతాభ్యో నమః । ఓం శ్రీ ఉమా పార్థివేశ్వర (శివలింగేశ్వర) స్వామినే నమః మహానైవేద్యం నివేదయామి ।। మధ్యే మధ్యే పానీయం సమర్పయామి । అమృతాపిధానమసి । ఉత్తరాపోశనం సమర్పయామి । హస్తౌ ప్రక్షాళయామి । పాదౌ ప్రక్షాళయామి । శుద్ధాచమనీయం సమర్పయామి ।। (పరమశివుడికి ప్రీతికరమైన ఆహారం, పండ్లు లేదా ప్రసాదం సమర్పించాలి.) తాంబూలం ‐ (ఓం మనోన్మ॑నాయ నమః): తాంబూలం భవతాం దేవ అర్పయామ్యద్య శంకర। పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం।। ఓం శ్రీ ఉమా పార్థివేశ్వర (శివలింగేశ్వర) స్వామినే నమః తాంబూలం సమర్పయామి ।। తాంబూల చర్వణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి। (పరమశివుడికి రెండు తమలపాకులు తొనలు ఆకుల కొసలు ఉత్తరం వైపు ఉన్నట్లుగా పెట్టి అందులో వక్కలు వేసి దైవానికి సమర్పించాలి.) నీరాజనం: అఘోరేభ్యో అథఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః । సర్వేభ్యః సర్వశర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః ।। నీరాజనమిదం దేవ కర్పూరామోద సంయుతం। గృహాణ పరమానంద హేరంబ వరదాయక।। ఓం శ్రీ ఉమా పార్థివేశ్వర (శివలింగేశ్వర) స్వామినే నమః కర్పూర నీరాజనం సమర్పయామి।। (పరమశివుడికి కర్పూర హారతి ఇవ్వాలి.) మంత్రపుష్పం: ఓం తత్పురుషాయ వి॒ద్మహే మహాదే॒వాయ ధీమహి। తన్నో రుద్రః ప్రచో॒దయాత్।। ఓం సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః। భవే భవే నాతి భవే భవస్వ మామ్। భవోద్భవాయ నమః।। ఓం వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమథనాయ నమః సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః।। ఓం అఘోరేభ్యో థఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః। సర్వేభ్యస్సర్వ శర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః।। ఓం ఈశాన స్సర్వవిద్యానామీశ్వర స్సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్ బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మా శివో మే అస్తు సదాశివోమ్।। ఓం కా॒త్యా॒య॒నాయ॑ వి॒ద్మహే॑ కన్యకు॒మారి॑ ధీమహి। తన్నో॑ దుర్గిః ప్రచో॒దయాత్।। ఓం శ్రీ ఉమా పార్థివేశ్వర (శివలింగేశ్వర) స్వామినే నమః పాదారవిందయోః సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి। (పరమశివుడికి పుష్పాలను సమర్పించాలి.) ఆత్మప్రదక్షిణ నమస్కారం: (అక్షింతలు పుష్పాలు చేతిలో తీసుకొని తమ కుడివైపుకు 3 లేదా 5 మార్లు తిరుగుతూ ఆత్మప్రదక్షిణ చేయాలి. తదుపరి అక్షత పుష్పాలను సమర్పించాలి.) ఈశానః సర్వ॑విద్యా॒నా॒మీశ్వరః సర్వ॑భూతా॒నా॒o బ్రహ్మాధి॑పతి॒ర్బ్రహ్మ॒ణోఽధి॑పతి॒ర్బ్రహ్మా॑ శి॒వో మే॑ అస్తు సదాశి॒వోమ్।। పదే పదే సర్వతమో నికృన్తనం పదే పదే సర్వ శుభప్రదాయకమ్। ప్రక్షిణం భక్తియుతేన చేతసా కరోమి మృత్యుంజయ రక్ష రక్ష మామ్।। ఓం శ్రీ ఉమా పార్థివేశ్వర (శివలింగేశ్వర) స్వామినే నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి।। ప్రార్థన: నమో హిరణ్యబాహవే హిరణ్యవర్ణాయ హిరణ్యరూపాయ హిరణ్యపతయేఽంబికాపతయ ఉమాపతయే పశుపతయే నమో నమః।। (పరమశివుడికి నమస్కారం చేయాలి.) అథ తర్పణం: (పరమశివుడికి మధ్య, ఉంగరం వేళ్ళ ద్వారా ఈ మంత్రములను చదువుతూ నీటిని వదలాలి.) భవం దేవం తర్పయామి ‐ భవస్య దేవస్య పత్నీం తర్పయామి । శర్వం దేవం తర్పయామి ‐ శర్వస్య దేవస్య పత్నీం తర్పయామి । ఈశానం దేవం తర్పయామి ‐ ఈశానస్య దేవస్య పత్నీం తర్పయామి । పశుపతిం దేవం తర్పయామి ‐ పశుపతేర్దేవస్య పత్నీం తర్పయామి । రుద్రం దేవం తర్పయామి ‐ రుద్రస్య దేవస్య పత్నీం తర్పయామి । ఉగ్రం దేవం తర్పయామి ‐ ఉగ్రస్య దేవస్య పత్నీం తర్పయామి । భీమం దేవం తర్పయామి ‐ భీమస్య దేవస్య పత్నీం తర్పయామి । మహాంతం దేవం తర్పయామి ‐ మహతో దేవస్య పత్నీం తర్పయామి । ఇతి తర్పయిత్వా అఘోరాదిభిస్త్రి భిర్మంత్రైః ఘోర తనూరుప తిష్ఠతే । (ఇప్పుడు శివుని యొక్క ఘోర రూపాన్ని (సంహారక శక్తిని) ధ్యానిస్తూ మంత్రమును చదువుతూ తూర్పు, దక్షిణ మరియు మధ్యమ దిక్కులకు నమస్కారం చేయాలి.) అఘోరేభ్యో అథఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః । సర్వేభ్యః సర్వశర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః ।। ఓం తత్పురుషాయ వి॒ద్మహే మహాదే॒వాయ ధీమహి। తన్నో రుద్రః ప్రచో॒దయాత్।। ఓం ఈశాన స్సర్వవిద్యానామీశ్వర స్సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్ బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మా శివో మే అస్తు సదాశివోమ్।। రుద్ర గాయత్రీ మంత్రం: ఇతి ధ్యాత్వా రుద్రగాయత్రీం యథా శక్తి జపేత్। ఓం తత్పురుషాయ వి॒ద్మహే మహాదే॒వాయ ధీమహి। తన్నో రుద్రః ప్రచో॒దయాత్।। రుద్ర గాయత్రీ మంత్రాన్ని 108 మార్లు జపించాలి. యజమాన ఆశీర్వచనం: ఇతి జపిత్వా అథైనమాశిషమాశాస్తే। ఆశాస్తేఽయం యజమానోఽసౌ । ఆయురాశాస్తే । సుప్రజాస్త్వమాశాస్తే । సజాతవనస్యామాశాస్తే । ఉత్తరాం దేవయజ్యామాశాస్తే । భూయో హవిష్కరణమాశాస్తే । దివ్యం ధామాశాస్తే । విశ్వం ప్రియమాశాస్తే । యదనేన హవిషాఽఽశాస్తే । తదస్యాత్తదృధ్యాత్ । తదస్మై దేవా రాసన్తామ్ । తదగ్నిర్దేవో దేవేభ్యో వనతే । వయమగ్నేర్మానుషాః । ఇష్టం చ వీతం చ । ఉభే చ నో ద్యావాపృథివీ అగ్ంహసః స్పాతామ్ । ఇహ గతిర్వామస్యేదం చ । నమో దేవేభ్యః ।। (పరమశివుడికి నమస్కారం చేయాలి.) ఉపచారపూజాః: పునః పూజాం కరిష్యే । ఛత్రమాచ్ఛాదయామి । చామరైర్వీజయామి । నృత్యం దర్శయామి । గీతం శ్రావయామి । ఆందోళికానారోహయామి । అశ్వానారోహయామి । గజానారోహయామి । సమస్త రాజోపచార దేవోపచార భక్త్యుపచార శక్త్యుపచార మంత్రోపచార పూజాస్సమర్పయామి ।। (పరమశివుడికి అక్షతలు, పుష్పములు సమర్పించాలి.) సాష్టాంగ నమస్కారం: ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా। పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగముచ్యతే।। ఓం శ్రీ ఉమా పార్థివేశ్వర (శివలింగేశ్వర) స్వామినే నమః సాష్టాంగ నమస్కారాం సమర్పయామి । క్షమాప్రార్థనా: అపరాధసహస్రాణి క్రియన్తేऽహర్నిశం మయా। దాసోఽయమితి మాం మత్వా క్షమస్వ పరమేశ్వర।। (పరమశివుడికి నమస్కారం చేయాలి.) సమర్పణం: యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు । న్యూనం సంపూర్ణతాం యాతి సద్యోవందే మహేశ్వరం ।। మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వర । యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు తే ।। అనయా ధ్యానావహనాది సద్యోజాత విధినా షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మకః శ్రీ ఉమా పార్థివేశ్వర (శివలింగేశ్వర) స్వామీ సుప్రీతః సుప్రసన్నో వరదో భవతు। ఏతత్ఫలం పరమేశ్వరార్పణమస్తు ।। (అక్షింతలు,పుష్పాలు,జలం కుడిచేతిలో తీసుకొని పరమశివుడి పాదాల ముందు వదలాలి.) హరనమః పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర।। హర హర హర।। ఓం నమః శివాయ।। ఓం నమః శివాయ।। ఓం నమః శివాయ।। భోళా శంకర భగవాన్ కీ జై ।। తీర్థప్రసాద గ్రహణం: అకాలమృత్యహరణం సర్వవ్యాధినివారణం।। సమస్తపాపక్షయకరం శ్రీ సాంబ సదాశివ పాదోదకం పావనం శుభమ్।। ఓం శ్రీ ఉమా పార్థివేశ్వర (శివలింగేశ్వర) స్వామినే నమః ప్రసాదం శీరసా గృహ్ణామి। ఇతి త్రివారం పీత్వా శివ నిర్మాల్య రూప బిల్వదళం వా దక్షిణే కర్ణే ధారయేత్ | (ఈ విధంగా (తీర్థాన్ని) మూడు సార్లు తాగిన తర్వాత, శివునిపై పూజించిన బిల్వ దళాన్ని (మారేడు ఆకును) కుడి చెవిపై ధరించాలి.) ఓం శాంతిః శాంతిః శాంతిః।।