గణపతి హోమం వశీకరణ, విఘ్న నివారణ, సర్వకార్య సిద్ధి, ధనప్రాప్తి కొరకు చేయాలి.
గమనిక: లఘు హోమ విధానాన్ని నిశితంగా పరిశీలించి ఈ హోమము చేయాలనీ పాఠకులకు మనవి చేస్తున్నాము.
ముందుగా లఘు హోమం పేజీ లో ఇచ్చిన పూర్వాంగ పూజ, గణపతి పూజ, పుణ్యాహవచనం, మండపారాధన లింక్స్ పై క్లిక్ చేసి ఆయా క్రియలు చేసి,
తరువాత ఈ క్రింద ఇచ్చిన విధముగా కలశ స్థాపన చేయాలి. అందులో గణపతిని ఆవాహనం చేయాలి.
>>>> తదుపరి <<<<
ఈ క్రింద ఇచ్చిన పట్టికలో (లిస్ట్ లో), లఘు హోమం పేజీ లోని ఒక్కో tab శీర్షిక (heading) మరియు అందులోని sub - tabs ని ఇవ్వడం జరిగింది. ఆ పేజీ లో ఈ క్రింద ఇవ్వబడిన tabs మరియు వాటికి సంబంధించిన క్రియలు ఉన్నాయి. వాటిని యధావిధిగా అనుసరించాలి.
అయితే "లఘు హోమ విధానం-ప్రధాన హవనం" tab లోని "ప్రధాన హోమం" అనే tab పై క్లిక్ చేసినపుడు మాత్రం గణపతి, లక్ష్మీగణపతి, నవగ్రహ, అష్టదిక్పాలక ఆహుతులను ఇచ్చిన తరువాత, మీరు చేసే ప్రధాన దేవతా హోమ మంత్రములతో ఆహుతులివ్వాలి. ఉదా: గణపతి హోమం చేస్తుంటే గణపతి మూల మంత్రముతో, గణపతి గాయత్రీ మంత్రముతో హోమం చేయాలి.
- గణపతి హోమ విధానం-ప్రారంభ క్రియ: ప్రారంభ క్రియ, అగ్ని సంస్కారం, పూర్వ పరిషేచన క్రియ, హోమ ప్రధాన ఆహుతి - పూర్వ క్రియ ఇవి యధావిధిగా లఘు హోమం పేజీ లో ఉన్నది ఉన్నట్లు అనుసరించాలి.
- గణపతి హోమ విధానం-ప్రధాన హవనం ప్రారంభ హోమం, ప్రధాన దేవతా హోమం (పైన వివరించినట్లుగా చేయాలి.), సర్వ దేవతా గాయిత్రీ హోమం, శాంతి ఆహుతులివ్వాలి. ఇవి యధావిధిగా లఘు హోమం పేజీ లో ఉన్నది ఉన్నట్లు అనుసరించాలి.
- గణపతి హోమ విధానం-జయాది హోమము, వ్యాహృతి హోమము, ఉత్తర పరిషేచనం: జయాది హోమము, వ్యాహృతి హోమము, ఉత్తర పరిషేచనం క్రియలు ఇవి యధావిధిగా లఘు హోమం పేజీ లో ఉన్నది ఉన్నట్లు అనుసరించాలి.
- గణపతి హోమ విధానం-పూర్ణాహుతి: పూర్ణాహుతి క్రియ యధావిధిగా అనుసరించాలి.
- గణపతి హోమ విధానం-ముగింపు క్రియ: ముగింపు క్రియ (చివరిగా అగ్నికి షోడశోపచార పూజ, కుశ్మాండ బలి, ఉద్వాసనమ్, హోమం రక్షా ధారణ మొదలగునవి చేయాలి).ఇవి యధావిధిగా లఘు హోమం పేజీ లో ఉన్నది ఉన్నట్లు అనుసరించాలి.
గణపతి హోమము - సామాగ్రి (click to expand)
లఘు హోమం పేజీ లో వివరముగా ఇచ్చిన సామగ్రితో పాటుగా ఈ సామాగ్రిని గణపతి హోమములో ఉపయోగించాలి. గణపతి హోమములో గరికతో పాటుగా ఈ ద్రవ్యాలు శ్రేష్ఠమైనవిగా శాస్త్రం చెపుతోంది. గరిక చివరిగా వాడతారు.
- అటుకులు - 250 గ్రాములు
- బెల్లం 250 - 250 గ్రాములు
- తెల్ల నువ్వులు - 100 గ్రాములు
- తెల్ల ఆవాలు - 100 గ్రాములు
- తేనె - 100 గ్రాములు
- 21 కుడుములు లేదా ఉండ్రాళ్ళు
- వరిపేలాలు - 250 గ్రాములు
- గరిక
గణపతి హోమము -(click to expand)
కలశ (రాగి లేదా ఇత్తడి లేదా వెండి) పాత్రకు పసుపు, కుంకుమ రాసి, కలశపాత్ర లో సుగంధ ద్రవ్యాలు, రోజ్ వాటర్, గంగాజలం వేసి, మామిడాకులతో కానీ, తమలపాకులతో కానీ అలంకరించాలి. దానిమీద ఒక పీచు తీయని కొబ్బరికాయను ఉంచి బ్లౌజ్ పీస్ ను టోపిగా అలంకరించి, కలశంలోకి ప్రధాన దేవతను ఆవాహన చేసి, షోడశోపచార పూజ, చేసి కొబ్బరికాయ కొట్టి నివేదన, మంగళహారతి లేదా కర్పూర హారతి ఇవ్వాలి. తదుపరి ప్రధాన దేవత హోమం ప్రారంభించాలి.
సంకల్పం:
ఇప్పుడు కుడిచేతిలో అక్షతలు తీసుకుని ,మీ కుడి కాలితొడపై ఎడమ అరచేతి నుంచి అక్షతలతో ఉన్న కుడిచేతిని పిడికిలిగా మూసి ఆ ఎడమ అరచేతిపైనుంచుతూ ఈ సంకల్పం చెప్పి పిడికిలిలో ఉన్నఅక్షతలను నీటితో అర్ఘ్యపాత్రలో వదలాలి.
పూర్వోక్త సంకల్పానుసారేన ఏవంగునా విశేషణ విశిష్టాయాం శుభతిథౌ మమ మనః సంకల్పిత కార్య దిగ్విజయ ప్రాప్త్యర్థం, మహాగణపతి అనుగ్రహ ద్వారా సర్వ విఘ్న నివారణార్థం, మహాగణపతి కలశే మూలపూజాం, తదనంతరం మహాగణపతి మూలమంత్ర, గణపతి గాయత్రీ మంత్ర హవనాఖ్యం కర్మ కరిష్యే ।।
ప్రధాన కలశ స్థాపన
ధ్యానం:
బీజాపుర గదేక్షుకార్ముక లసత్ చక్రాబ్జ పాశోత్పల
వ్రీహ్యగ్ర స్వవిషాణ రత్నకలశత్ ప్రోద్యత్కరాంభోరుహః ।
ధ్యేయో వల్లభయా సపద్మకరయా శ్లిష్టోజ్వలద్భూషయా
విశ్వోత్పత్తి విపత్తి సంస్థితకరో విఘ్నేశ ఇష్టార్థదః ।।
ఓం భూర్భువస్సువః కలశస్థ మూలే శ్రీ మహాగణపతిదేవతా మావాహయామి స్థాపయామి పూజయామి.
ఆవాహనం:
ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనంమే వశమానయ స్వాహా ।
ఓం భూర్భువస్సువః శ్రీ మహాగణాధిపతయే నమః ।
ఆవాహయామి।ఆవాహనం సమర్పయామి।
కలశములో గణనాథుడిని మనసారా ఆహ్వానించాలి.
ఆసనం:
ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనంమే వశమానయ స్వాహా ।
ఓం భూర్భువస్సువః శ్రీ మహాగణాధిపతయే నమః ।
నవరత్నఖచిత సింహాసనం సమర్పయామి.।
కలశానికి పుష్పాలను సమర్పించాలి.
పాద్యం:
ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనంమే వశమానయ స్వాహా ।
ఓం భూర్భువస్సువః శ్రీ మహాగణాధిపతయే నమః ।
పాదయోః పాద్యం సమర్పయామి।
గణనాథుడి పాదాలు కడగాలి.
అర్ఘ్యం:
ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనంమే వశమానయ స్వాహా ।
ఓం భూర్భువస్సువః శ్రీ మహాగణాధిపతయే నమః ।
హస్తయోరర్ఘ్యం సమర్పయామి।
కలశంలో ఉన్న పుష్పంతో కానీ లేదా ఉద్ధరణితో కానీ నీరు తీసుకొని కలశానికి చూపించి అర్ఘ్య పాత్రలో చల్లాలి/వదలాలి.
ఆచమనం:
ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనంమే వశమానయ స్వాహా ।
ఓం భూర్భువస్సువః శ్రీ మహాగణాధిపతయే నమః ।
ముఖే ఆచమనీయం సమర్పయామి।
కలశంలో ఉన్న పుష్పంతో కానీ లేదా ఉద్ధరణితో కానీ నీరు తీసుకొని కలశానికి చూపించి అర్ఘ్య పాత్రలో చల్లాలి/వదలాలి.
శుద్ధోదకస్నానం:
ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనంమే వశమానయ స్వాహా ।
ఓం భూర్భువస్సువః శ్రీ మహాగణాధిపతయే నమః ।
శుద్ధోదక స్నానం సమర్పయామి।
స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి।
శుద్ధజలంతో గణనాథుడిని అభిషేకించాలి.
వస్త్రం:
ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనంమే వశమానయ స్వాహా ।
ఓం భూర్భువస్సువః శ్రీ మహాగణాధిపతయే నమః । వస్త్రయుగ్మం సమర్పయామి। వస్త్రార్ధం అక్షతాన్ సమర్పయామి।
పవిత్రమైన వస్త్రాన్ని లేదా అక్షతలు సమర్పించాలి.
యజ్ఞోపవీతం:
ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనంమే వశమానయ స్వాహా ।
ఓం భూర్భువస్సువః శ్రీ మహాగణాధిపతయే నమః ।
యజ్ఞోపవీతం సమర్పయామి।। యజ్ఞోపవీతార్ధం అక్షతాన్ సమర్పయామి ।।
కలశానికి అక్షతలు సమర్పించాలి.
చందనం:
ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనంమే వశమానయ స్వాహా ।
ఓం భూర్భువస్సువః శ్రీ మహాగణాధిపతయే నమః । దివ్యశ్రీచందనం సమర్పయామి ।
కలశానిపై పుష్పముతో గంధం చల్లాలి.
అక్షతలు:
ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనంమే వశమానయ స్వాహా ।
ఓం భూర్భువస్సువః శ్రీ మహాగణాధిపతయే నమః । అక్షతాన్ సమర్పయామి।।
కలశానికి అక్షతలును సమర్పించాలి.
హరిద్రాచూర్ణం (పసుపు):
ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనంమే వశమానయ స్వాహా ।
ఓం భూర్భువస్సువః శ్రీ మహాగణాధిపతయే నమః । హరిద్రా చూర్ణం సమర్పయామి।।
కలశానికి పసుపును సమర్పించాలి.
కుంకుమ:
ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనంమే వశమానయ స్వాహా ।
ఓం భూర్భువస్సువః శ్రీ మహాగణాధిపతయే నమః । కుంకుమ విలేపనం సమర్పయామి।।
కలశానికి కుంకుమను సమర్పించాలి.
సుగంధ పరిమళ ద్రవ్యము :
ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనంమే వశమానయ స్వాహా ।
ఓం భూర్భువస్సువః శ్రీ మహాగణాధిపతయే నమః । సుగంధ పరిమళ ద్రవ్యాణిం సమర్పయామి ।।
కలశానికి అక్షతలను సమర్పించాలి.
పుష్పైః పూజయామి:
ఒక్కో నామము చదువుతూ విడిపూలు (ఎర్రని రంగు పుష్పములు ఉంటె మంచిది). గణనాథునిపై వేస్తూ ఉండాలి.
ఓం సుముఖాయ నమః। ఓం ఏకదంతాయ నమః।
ఓం కపిలాయనమః। ఓం గజకర్ణకాయ నమః।
ఓం లంబోదరాయనమః। ఓం వికటాయ నమః।
ఓం విఘ్నరాజాయ నమః। ఓం ధూమకేతవే నమః।
ఓం గణాధిపాయనమః। ఓం గణాధ్యక్షాయ నమః।
ఓం ఫాలచంద్రాయ నమః। ఓం గజాననాయ నమః।
ఓం వక్రతుండాయ నమః। ఓం శూర్పకర్ణాయ నమః।
ఓం హేరంబాయ నమః। ఓం స్కందపూర్వజాయ నమః।
ఓం సర్వసిద్ధిప్రదాయ నమః।
ఓం భూర్భువస్సువః శ్రీ మహాగణాధిపతయే నమః ।
నానావిధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి।।
కలశానికి అక్షతలు సమర్పించాలి.
ధూపం:
ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనంమే వశమానయ స్వాహా ।
ఓం భూర్భువస్సువః శ్రీ మహాగణాధిపతయే నమః ।। ధూపమాఘ్రాపయామి ।।
అగరుబత్తులు వెలిగించి ఘంటా మోగిస్తూ కలశానికి చూపించాలి
దీపం:
ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనంమే వశమానయ స్వాహా ।
శ్రీ మహాగణాధిపతయే నమః ప్రత్యక్ష దీపం దర్శయామి।।
ధుపా దీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి।।
దీపానికి నమస్కారం చేయాలి
ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనంమే వశమానయ స్వాహా ।
కొబ్బరికాయ
యాః ఫలినీర్యా అఫలా అపు॒ష్పాయాశ్చ పు॒ష్పిణీః ।
బృహస్పతి ప్రసూతాస్తానో॑ ముంచంత్వగ్ం హసః ।।
కొబ్బరికాయ కొట్టాలి.
నైవేద్యం:
ఓం భూర్భువ॒స్సువ॑: । తత్సవి॒తుర్వరేణ్య॒o భర్గో॑ దే॒వస్య ధీమహి ।
ధియో యో న: ప్రచోదయాత్ ।।
సత్యం త్వా ఋతేన పరిషించామి ।
సాయంకాలం ‐ ఋతం త్వా సత్యేన పరిషించామి అని చెప్పాలి.
అమృతమస్తు । అ॒మృ॒తో॒ ప॒స్తర॑ణమసి ।
శ్రీ మహాగణాధిపతయే నమః అవసరార్థం మహానివేదనం సమర్పయామి ।
ఓం ప్రాణాయ స్వాహా । ఓం అపానాయ స్వాహా ।
ఓం వ్యా॒నాయ స్వాహా । ఓం ఉదానాయ స్వాహా ।
ఓం సమానాయ స్వాహా ।
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి ।
అ॒మృ॒తాపిధానమ॑సి । ఉత్తరాపోశనం సమర్పయామి ।
హస్తౌ ప్రక్షాళయామి । పాదౌ ప్రక్షాళయామి ।
శుద్ధ ఆచమనీయం సమర్పయామి ।
ఓం భూర్భువస్సువః శ్రీ మహాగణాధిపతయే నమః నైవేద్యం సమర్పయామి।।
కలశానికి ప్రీతికరమైన ఆహారం, పండ్లు లేదా ప్రసాదం సమర్పించాలి.
తాంబూలం:
ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనంమే వశమానయ స్వాహా ।
శ్రీ మహాగణాధిపతయే నమః తాంబూలం సమర్పయామి ।।
కలశానికి రెండు తమలపాకులు తొనలు ఆకుల కొసలు ఉత్తరం వైపు ఉన్నట్లుగా పెట్టి అందులో వక్కలు వేసి దైవానికి సమర్పించాలి.
నీరాజనం:
ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనంమే వశమానయ స్వాహా ।
ఓం భూర్భువస్సువః శ్రీ మహాగణాధిపతయే నమః కర్పూరనీరాజనం సమర్పయామి।।
కలశానికి కర్పూర హారతి ఇవ్వాలి.
మంత్రపుష్పం:
సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ।
ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః
వక్రతుండశ్శూర్పకర్ణో హేరంబస్స్కందపూర్వజః ।
షోడశైతాని నామాని యః పఠేచ్ఛృణుయాదపి
విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా
సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే ।
ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి।
తన్నో దంతిః ప్రచోదయాత్।।
ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనంమే వశమానయ స్వాహా ।
ఓం భూర్భువస్సువః శ్రీ మహాగణాధిపతయే నమః పాదారవిందయోః సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి।
కలశానికి పుష్పాలను సమర్పించాలి.
ఆత్మప్రదక్షిణ నమస్కారం:
అక్షింతలు పుష్పాలు చేతిలో తీసుకొని తమ కుడివైపుకు 3 లేదా 5 మార్లు తిరుగుతూ ఆత్మప్రదక్షిణ చేయాలి. తదుపరి అక్షత పుష్పాలను సమర్పించాలి.
యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే
పాపోఽహం పాపకర్మాఽహం పాపాత్మా పాపసంభవః
త్రాహి మాం కృపయా సాయి శరణాగతవత్సల
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ
తస్మాత్కారుణ్య భావేన రక్ష రక్ష గణనాయక
ఓం మహాగణాధిపతయే నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి।।
సాష్టాంగ నమస్కారం:
ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా।
పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగముచ్యతే।।
శ్రీ మహాగణాధిపతయే నమః సాష్టాంగ నమస్కారాం సమర్పయామి ।
శ్రీ మహాగణాధిపతి ప్రార్థన:
నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే ।
నమస్తేఽస్తు లంబోదరాయ ఏకదంతాయ
విఘ్నవినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమః ।।
కలశానికి నమస్కారం చేయాలి.
ఉపచార పూజా:
ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనంమే వశమానయ స్వాహా
ఛత్రమాచ్ఛాదయామి । చామరైర్వీజయామి ।
నృత్యం దర్శయామి । గీతం శ్రావయామి ।
వాద్యం ఘోషయామి । ఆందోళికానారోహయామి ।
అశ్వానారోహయామి । గజానారోహయామి ।
సమస్త రాజోపచార దేవోపచార భక్త్యుపచార శక్త్యుపచార మంత్రోపచార పూజాః సమర్పయామి ।।
కలశానికి అక్షతలు, పసుపు, కుంకుమ సమర్పిచాలి.
సమర్పణం:
యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు।
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే గజాననం।।
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప।
యత్పూజితం మయా దేవా పరిపూర్ణం తదస్తు తే।
ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనంమే వశమానయ స్వాహా
అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మకః శ్రీ మహాగణాధిపతి సుప్రీతో సుప్రసన్నో వరదో భవంతు।।
ఉత్తరే శుభకర్మణ్యవిఘ్నమస్తు ఇతి భవంతో బ్రువంతు।
ఉత్తరే శుభకర్మణి అవిఘ్నమస్తు।।
ఏతత్ ఫలం, శ్రీ మహాగణాధిపతి చరణారవిందార్పణమస్తు
క్షమాప్రార్థనా:
అపరాధసహస్రాణి క్రియన్తేऽహర్నిశం మయా।
దాసోఽయమితి మాం మత్వా క్షమస్వ గణాధిప।।
ఆవాహనం న జానామి న జానామి విసర్జనమ్।
పూజాం చైవ న జానామి క్షమ్యతాం గణాధిప।।
కలశానికి నమస్కారం చేయాలి.
ఇప్పుడిక మండపారాధనపేజీలోని ప్రధాన కలశపూజ యధావిధిగా చేసి హోమం ప్రారంభించాలి.
గణపతి హోమము - మంత్రములు(click to expand)
వినియోగం:
అస్యశ్రీ మహాగణపతి మహామంత్రస్య, గణక ఋషిః, నిచృద్గాయత్రీ ఛందః,
శ్రీ మహాగణపతిర్దేవతా, గం బీజం, స్వాహా శక్తిః, గ్లౌం కీలకం ।
మహా గణపతి అనుగ్రహ ప్రాప్త్యర్థే శ్రీ మహాగణపతి హవనం కరిష్యే ।।
కలశము (కలశపూజ చేసిన కలశము కాదు పూజకు వాడే నీల చెంబు) లోని నీళ్లను మధ్య ఉంగరం వేళ్ళతో తాకాలి.).
న్యాస విధి::
తతః షడంగన్యాసం కుర్యాత్ ।।
కరన్యాసం
ఓం గ్లాం అంగుష్ఠాభ్యాం నమః రెండు బొటనవేళ్లను తాకాలి.
ఓం గ్లీం తర్జనీభ్యాం నమః చూపుడు వేళ్లను తాకాలి.
ఓం గ్లూం మధ్యమాభ్యాం నమః మధ్య వేళ్లను తాకాలి.
ఓం గ్లైం అనామికాభ్యాం నమః ఉంగరపు వేళ్లను తాకాలి.
ఓం గ్లౌం కనిష్ఠికాభ్యాం నమః చిటికెన వేళ్లను తాకాలి.
ఓం గ్లః కరతల కరపృష్ఠాభ్యాం నమః అరచేతుల వెనుక భాగం ఒకదానితో ఒకటి తాకాలి.
అంగన్యాసం
శరీర భాగాలను తాకుతూ ఈ మంత్రాలు చదవాలి.
ఓం గ్లాం హృదయాయ నమః కుడి చేతితో హృదయాన్ని తాకాలి.
ఓం గ్లీం శిరసే స్వాహా శిరస్సును తాకాలి.
ఓం గ్లూం శిఖాయై వషట్ జుట్టు ముడి/శిఖ భాగాన్ని తాకాలి.
ఓం గ్లైం కవచాయ హుమ్ రెండు భుజాలను మార్చి మార్చి తాకాలి.
ఓం గ్లౌం నేత్రత్రయాయ వౌషట్ రెండు కళ్లు మరియు మధ్యలో మూడవ కన్ను ఉన్న చోట తాకాలి.
ఓం గ్లః అస్త్రాయ ఫట్ శిరస్సు చుట్టూ చిటికె వేస్తూ కుడిచేతి మధ్య వేలితో ఎడమ అరచేతిపై చప్పట్లు కొట్టాలి.
ఓం గం గణపతయే నమః భూర్భువస్సువరోం ఇతి దిగ్బంధః ఎడమ చేతి చూపుడు వేలును ఆకాశం వైపు నిలువుగా చుపిస్తూ కుడి చుపుడు వేలితో దిగ్బంధనం చేయాలి.
ధ్యానం:
బీజాపుర గదేక్షుకార్ముక లసత్ చక్రాబ్జ పాశోత్పల
వ్రీహ్యగ్ర స్వవిషాణ రత్నకలశత్ ప్రోద్యత్కరాంభోరుహః ।
ధ్యేయో వల్లభయా సపద్మకరయా శ్లిష్టోజ్వలద్భూషయా
విశ్వోత్పత్తి విపత్తి సంస్థితకరో విఘ్నేశ ఇష్టార్థదః ।।
గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః ।
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ।।
ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనంమే వశమానయ స్వాహా
శ్రీ మహాగణపతి దేవతా ప్రార్థయమి నమస్కరోమి అంటూ మీముందున్న హోమ కుండం ఇటుక పై అక్షతలు ఉంచాలి.
గణపతి గాయత్రి మంత్రం:
తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి ।
తన్నోదంతి ప్రచోదయాత్ స్వాహా ।।
త్యాగము
శ్రీ మహాగణపతయ ఇదం నమమ।
9 సార్లు ఆహుతులివ్వాలి.
గణపతి వేద మంత్రం:
ఓం గణానాం త్వా గణపతిగ్ం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం ।
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆ నః శృణ్వన్నూతిభిః సీద సాదనం స్వాహా ।।
త్యాగము
శ్రీ మహాగణపతయ ఇదం నమమ।
108 సార్లు ఆహుతులివ్వాలి.
గణపతి మూల మంత్రం :
ఇప్పుడిక ఈ మంత్రములతో ఆహుతులివ్వాలి
ఓం స్వాహా ।
ఓం శ్రీం స్వాహా ।
ఓం శ్రీం హ్రీం స్వాహా ।
ఓం శ్రీం హ్రీం క్లీం స్వాహా ।
ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం స్వాహా ।
ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం స్వాహా ।
ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద స్వాహా ।
ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనమ్మే వశమానయ స్వాహా ।
ఇప్పుడిక ఈ మూల మంత్రముతో 324 మార్లు ఆహుతులివ్వాలి.
ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా స్వాహా ।।
త్యాగము
శ్రీ లక్ష్మీ గణపతయ ఇదం నమమ ।
గణపతి హోమము - కలశ ఉద్వాసనం:(click to expand)
ఉద్వాసనం:
హోమము తరువాత కలశమునకు ఉద్వాసనము చేయాలి.
ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనంమే వశమానయ స్వాహా
ఓం యజ్ఞేన యజ్ఞమ॑యజన్త దేవాః
తాని ధర్మాణి ప్రథమాన్యాసన్।
తే హ నాక॑o మహిమానస్సచన్తే
యత్ర పూర్వే సాధ్యాస్సన్తి దేవాః।।
శ్రీ మహాగణాధిపతయే నమః యథాస్థానం ఉద్వాసయామి।।
శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ।
ఓం శాంతిః శాంతిః శాంతిః।।