- పసుపు
- కుంకుమ
- భస్మం
- గుమ్మడికాయ
- ఆయుధము (కత్తి)
- పసుపుతో కలిపిన అన్నము
కూష్మాండ బలి
'కూష్మాండం' అంటే గుమ్మడికాయ. ఇందులో ప్రాణశక్తి ఎక్కువగా ఉంటుంది. శాక్తేయ ఆగమ ప్రకారం, దుర్గా (దేవీ) నవరాత్రులలో జీవహింసకు బదులుగా గుమ్మడికాయను బలి ఇవ్వడం శ్రేష్ఠం. ఇది నకారాత్మక శక్తిని (Negative Energy), దిష్టి దోషాలను హరించి, లక్ష్మీ కటాక్షాన్ని కలిగిస్తుంది. ఆచమ్య‐ప్రాణానాచమ్య‐నేత్రాచమ్య: ఇప్పుడు ఆచమన పాత్ర లోని నీటిని ఉంగరం వ్రేలితో కళ్ళకు అద్దుకొని, ఉద్ధరిణిలో తీసుకొని ఒక్కో నామం చెపుతూ మూడు మార్లు తాగవలెను. ఓం ఐం ఆత్మతత్త్వం శోధయామి నమః స్వాహా । ఓం హ్రీం విద్యాతత్త్వం శోధయామి నమః స్వాహా । ఓం క్లీం శివతత్త్వం శోధయామి నమః స్వాహా । ఓం ఐం హ్రీం క్లీం సర్వతత్త్వం శోధయామి నమః స్వాహా । హస్తం ప్రక్షాల్య చేయి కడగండి సంకల్పము: ఇప్పుడు కుడిచేతిలోకి నీరు తీసుకుని ఈ మంత్రాన్ని పఠిస్తూ నీటిని పళ్లెంలో వదలాలి అర్ఘ్యపాత్రలో వదలాలి.పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ । అస్మాకం సకుటుంబానాం సర్వారిష్ట శాంతి ద్వారా । శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణీ నవరాత్రీ దేవతాభ్యో నమః । శ్రీ దుర్గా నవరాత్ర పూజా సాంగతా సిద్ధ్యర్థం । అష్టమ దివసే దుర్గాష్టమి/నవమ దివసే మహర్నవమి/దశమ దివసే విజయదశమి పూజానంతరం యథాశక్తి కూష్మాండ బలిప్రధానమహం కరిష్యే।। దేవీ పూజ&పీఠ స్థాపన: మీ గురువులు ఉపదేశించిన మంత్రముతో బాలి ప్రధానం చేయవచ్చును.గురు ఉపదేశం లేనివారు "ఓం దుం దుర్గాయై నమః" అను మంత్రమును చదువుతూ చేయవచ్చును. చండీ నావర్ణవ మూలమంత్రేణ పంచోపచారైః సంపూజ్య । దేవ్యాః పురతః - స్వయముదఙ్ముఖః ఉపవిశ్య । పీఠే రక్తవర్ణ వస్త్ర గుంఠితం కూష్మాండ బలిం నిధాయ ।। అమ్మవారి ఎదుట మీరు ఉత్తరాభి ముఖంగా కూర్చోని, ఒక పీఠంపై ఎర్రటి వస్త్రాన్ని పరచి, దానిపై కడిగి శుభ్రం చేసిన గుమ్మడికాయను ఉంచాలి.
పంచోపచార పూజా:
తతః లామిత్యాది పంచ పూజాం కుర్యాత్బలి ప్రార్థన:
మీరు ఇంతకు ముందు అనుకున్న మూలమంత్రాన్ని (ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే) లేదా బలి మంత్రాన్ని చదువుతూ ఆ నీటిని గుమ్మడికాయపై చల్లాలి బలిం అభిమంత్రయేత్ పశుస్త్వం బలిరూపేణ మమ భాగ్యాదుపస్థితః । ప్రణమామి తతస్త్వాం వై రూపకల్పిత ముత్తమమ్ ।। ఓ బలి స్వరూపమా! నా అదృష్టం కొద్దీ నీవు ఇక్కడ పశువు (బలి ద్రవ్యం) రూపంలో ఉన్నావు. ఉత్తమమైన రూపంతో కల్పించబడిన నీకు నేను నమస్కరిస్తున్నాను.. చండికా ప్రీతి మంత్రం: చండికా ప్రీతిదానేన దాతురాపద్వినాశనమ్ । చాముండా బలిరూపాయ బలే తుభ్యం నమోస్తుతే ।। చండికా దేవికి ప్రీతిని కలిగించే ఈ బలి దానం వల్ల, యజమాని, నవరాత్రీ దీక్ష తీసుకున్న వారి యొక్క ఆపదలు నశించాలి. చాముండా దేవి! బలి రూపంలో అర్పింపబడుతున్న నీకు నమస్కారం. బలి ఛేదన మంత్రం (కాయ వధకి ముందు): యజ్ఞార్థం బలయః సృష్టాః స్వయమేవ స్వయంభువా । అతస్త్వాం ఘాతయామ్యద్య తస్మాద్యజ్ఞే వధోఽవధః ।। పూజ కొరకు బలులను స్వయంభువుడైన బ్రహ్మదేవుడే సృష్టించాడు. కాబట్టి ఇప్పుడు అమ్మవారి అనుగ్రహము కోసం నిన్ను ఛేదిస్తున్నాను. పూజ కోసం చేసే వధ 'వధ' (హింస) కిందకు రాదు. శస్త్ర పూజ: ఐం హ్రీం క్లీం రసనా త్వం చండికాయాః సురలోక ప్రసాదినీ ।। హ్రాం హ్రీం ఖడ్గ ఆం హుం ఫట్ ।। ఇతి శస్త్రం గృహీత్వా ।। ఓం కాళి కాళి వజ్రేశ్వరి లోహదండాయై నమః ।। ఈ మంత్రం చదువుతూ బలి ఇచ్చే కత్తిని లేదా గంధం, కుంకుమ అద్ది, చేతిలోకి తీసుకోవాలి. బలి ఛేదనం: ఈ మంత్రం చదువుతూ గుమ్మడికాయను మూడు సార్లు అమ్మవారికి అనులోమ విలోమపాతముగా త్రిప్పికళ్ళు మూసుకొని కాయను చూడకుండా మూలమంత్రమును పఠిస్తూ ఒకే దెబ్బతో రెండుముక్కలుగా ఛేదించాలి. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే కూష్మాండ బలిం ఛినద్మి దిగ్బలి కూష్మాండ బలింద్వేధా పఠన్ చింద్యాత్ చేదనావసరే నవిలోకయేత్ కౌశిక రుధిరేణా ప్యాయతాం దేవ్యై అర్థం నివేదయేత్ పంచదా విభాగ బలి: అవశిష్టారం పంచదా విభజ్య పూతనాయై బలిభాగం నివేదయామి చర్యై బలిభాగం నివేదయామి విద్యాభ్యో బలిభాగం నివేదయామి పాపరాక్షస్యై బలిభాగం నివేదయామి ఓం హ్రీం స్ఫుర స్ఫుర । ఓం హ్రీం హుం ఫట్ । మర్ద మర్ద హుం । శేషం రక్ష రక్ష హుం ఫట్ స్వాహా ।। తదుపరి బలి ఇచ్చిన తర్వాత మిగిలిన భాగాన్ని పై మంత్రం చదువుతూ ముక్కలనూ, మరియు పసుపుతో చేసిన అన్నమునూ ఐదు భాగాలుగా చేసి మొదటి నాలుగు భాగాలను నాలుగు దిక్కులకు (తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ) కుంకుమ పసుపు వేసి నివేదించాలి. ఐదవ భాగం (శేషం) పై నీటిని చల్లుతూ, ఐదవ ఉగ్ర మంత్రాన్ని "ఓం హ్రీం స్ఫుర...రక్ష హుం ఫట్ స్వాహా " పఠించి రక్షణ కోరుకోవాలి.బలి ప్రార్థన
బలిం గృహ్ణంతు మే దేవా ఆదిత్యా వసవస్తథా । మరుతశ్చాశ్వినౌ రుద్రాః సుపర్ణాః పన్నగా గ్రహాః ।। అసురా యాతుధానాశ్చ పిశాచోరగ రాక్షసాః । డాకిన్యో యక్షవేతాళా యోగిన్యః పూతనాశ్శివాః ।। జృంభకా సిద్ధగంధర్వాః సాధ్యా విద్యాధరా నగాః । దిక్పాలా లోకపాలాశ్చ యే చ విఘ్న వినాయకాః ।। జగతాం శాంతికర్తారో బ్రహ్మాద్యాశ్చ మహర్షయః । మా విఘ్నం మా చ మే పాపం మా సంతు పరిపంథినః ।। సౌమ్యా భవంతు తృప్తాశ్చ భూత్యాై స్యుః శుభావహాః । భూతాని యానిహ వసంతి తాని బలిం గృహీత్వా విధివత్ప్రయుక్తమ్ ।। ఇక్కడ నివసించే భూతగణాలన్నీ, శాస్త్రోక్తంగా నేను సమర్పించిన ఈ బలిని స్వీకరించి, వేరొక చోట నివాసాన్ని ఏర్పరచుకోవాలి. నన్ను రక్షించాలి, అని నమస్కారం చేయాలి. బహిర్దద్యాత్ (బలిని బయట ఉంచే విధి) - రక్షణ మంత్రం: భూతాని యానిహ వసంతి తాని బలిం గృహీత్వా విధివత్ప్రయుక్తమ్ । అన్యత్ర వాసం పరికల్పయంతు రక్షంతు మాం తాని నమశ్చ తైభ్యః ।। ఈ మంత్రం చదువుతూ బలిని బయట వేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయాలి. శుద్ధి తతః స్నాత్వా ఆహత వస్త్రం పరిధాయ కృత తిలకః । కాళ్లు, చేతులు కడుక్కుని, వీలైతే వెంటనే స్నానం చేయాలి. ఉతికిన మడి వస్త్రాలను (ఆహత వస్త్రం) ధరించి, నుదుటిన కుంకుమ పెట్టుకోవాలి. బలి అనంతర శాంతి విధి: ఆచమనం చేసి, అమ్మవారికి మళ్లీ పంచోపచార పూజ చేసి, పాయసం (పరమాన్నం) మరియు మాషచక్రం (గారెలు) నైవేద్యంగా పెట్టాలి. దేవీం పంచోపచారైః సంపూజ్య । పాయస-మాషచక్ర నివేదయేత్ । పంచోపచార పూజా: తతః లామిత్యాది పంచ పూజాం కుర్యాత్ అమ్మవారిని ఉద్దేశించి, కింది మంత్రములను పఠిస్తూ చిటికెన వేలు నుండి బొటన వేలు వరకు ఒక్కో వేలును తాకుతూ ఆయా ఉపచారాలను సమర్పించాలి.- గంధం: ఓం ఐం క్లీం సౌః । లం పృథివీ తత్వాత్మికాయై గంధతన్మాత్ర శ్రీ లలితా మహా త్రిపురసుందరీ మహాదేవ్యై గంధం పరికల్పయామి । సౌః క్లీం ఐం ఓం ।। అమ్మవారికి గంధం సమర్పించాలి.
- పుష్పం: ఓం ఐం క్లీం సౌః । హం ఆకాశ తత్వాత్మికాయై శబ్దతన్మాత్ర శ్రీ లలితా మహా త్రిపురసుందరీ మహాదేవ్యై పుష్పం పరికల్పయామి । సౌః క్లీం ఐం ఓం ।। అమ్మవారికి పుష్పములు సమర్పించాలి.
- ధూపం: ఓం ఐం క్లీం సౌః । యం వాయు తత్వాత్మికాయై స్పర్శతన్మాత్ర శ్రీ లలితా మహా త్రిపురసుందరీ మహాదేవ్యై ధూపం ఆఘ్రాపయామి ।సౌః క్లీం ఐం ఓం ।। అమ్మవారికి ధూపం చూపించాలి.
- దీపం: ఓం ఐం క్లీం సౌః । రం అగ్ని తత్వాత్మికాయై రూపతన్మాత్ర శ్రీ లలితా మహా త్రిపురసుందరీ మహాదేవ్యై దీపం దర్శయామి । సౌః క్లీం ఐం ఓం ।। అమ్మవారికి దీపం చూపించాలి
- నైవేద్యం: ఓం ఐం క్లీం సౌః । వం అమృత తత్వాత్మికాయై రసతన్మాత్ర శ్రీ లలితా మహా త్రిపురసుందరీ మహాదేవ్యై నైవేద్యం నివేదయామి । సౌః క్లీం ఐం ఓం ।। అమ్మవారికి పాయసం (పరమాన్నం) మరియు మాషచక్రం (గారెలు) నైవేద్యంగా పెట్టాలి.
- సర్వోపచారము: ఓం ఐం క్లీం సౌః । సం సర్వ తత్వాత్మికాయై సర్వతన్మాత్ర శ్రీ లలితా మహా త్రిపురసుందరీ మహాదేవ్యై తాంబూలాది సర్వోపచారాన్ సమర్పయామి । సౌః క్లీం ఐం ఓం ।। అమ్మవారికి అక్షతలు సమర్పించాలి.