శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము

శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము - పూజా సామాగ్రి (click to expand)
  1. పసుపు
  2. కుంకుమ
  3. బుక్కా గులాల్
  4. సత్యనారాయణ స్వామి పీట
  5. స్వామి ఫోటో (Photo)
  6. స్వామి విగ్రహం
  7. తెల్ల అంగవస్త్రం - 1
  8. బియ్యం - 1 1/4 kg
  9. తమలపాకులు - 25
  10. పోకలు - 25
  11. ఖర్జూర పండ్లు - 25
  12. రూపాయి నాణాలు - 21
  13. పసుపు కొమ్ములు - 21
  14. దారం బంతి - 1
  15. రాగి చెంబు - కలశానికి
  16. బ్లౌజ్ పీస్ (Blouse piece) - 1 (మెరూన్ కలర్)
  17. గంధం డబ్బా - 1
  18. పంచామృతాలు [పాలు-అర లీటర్, పెరుగు-అర లీటర్, నెయ్యి, తేనె, చక్కెర,
  19. అరటి పండ్లు - 1 డజన్
  20. 5 రకాల పండ్లు
  21. 5 రకాల పూలు
  22. కొబ్బరికాయలు - 9
  23. మంగళహారతి సెట్ - 1 (ఇంటిది అయినా పర్వాలేదు)
  24. పెద్ద కుందు / ప్రమిదలు - 4 లేదా 2
  25. వత్తులు, అగ్గిపెట్టె
  26. అగరుబత్తి - 1 ప్యాక్
  27. రవ్వ - 1 1/4 kg
  28. చక్కెర - 1 1/4 kg
  29. కిస్మిస్ (Kismis) - 50 గ్రాములు
  30. జీడిపప్పు - 50 గ్రాములు
  31. కర్పూరం - 1 ప్యాక్
  32. మల్లెపూల దండ - 1
  33. మామిడి ఆకులు
  34. అరటి మండలు - 4
  35. బంతిపూల దండ - 1
  36. సిరా - నైవేద్యం కొరకు
  37. దీపం నూనె - 1 బాటిల్
  38. ఆచమన పాత్ర {రెండింటిలోనూ నీళ్ళు నింపుకోండి}
  39. కలశానికి రాగి చెంబు {రెండింటిలోనూ నీళ్ళు నింపుకోండి}
  40. కూర్చోవడానికి ఆసనం
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం-సందేహాలు/సమాధానములు (click to expand)
  1. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఏ దైవానికి సంబంధించినది?

    శ్రీ సత్యనారాయణ వ్రతం సాక్షాత్ శ్రీమన్నారాయణుడికి సంబంధించిన వ్రతమని స్కాందపురాణ వచనం.

  2. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము గూర్చి ఏ గ్రంధములో చెప్పబడింది?

    శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము స్కాంద పురాణములోని రేవాఖండములో దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది. ఈ వ్రతము గూర్చి సూతమహర్షులవారు తన శిష్యులైన శౌనకాది మహామునులకు వివరించినట్లుగా స్కాంద పురాణం చెపుతోంది. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం సాక్షాత్ శ్రీమన్నారాయణుడికి సంబంధించిన వ్రతము అని చెపుతుంటారు.

  3. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఎప్పుడు చేయాలి ?

    శ్రీ సత్యనారాయణ వ్రతమును ఎప్పుడైనా చేయవచ్చును. ప్రతి మాసములో వచ్చే దశమి, ఏకాదశి లేదా పౌర్ణమి రోజులలో చేయవచ్చును. ముఖ్యముగా సంక్రాంతి, కార్తీకమాసము, దీపావళి, బుతానా గృహ ప్రవేశ సమయములో చేస్తే అత్యంత శ్రేష్టము. ఈ దినాల్లో చేయడము వలన విశేష ఫలము లభిస్తుంది.

  4. శ్రీ సత్యనారాయణ ఏ విధముగా చేయాలి?

    యజమాని అయన పరివారము ఉదయమునే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని, తలా స్నానము చేయాలి. ఇంటి ద్వారములను మామిడి తోరణములతో అలంకరించాలి. గడపలను ముగ్గులతో అలంకరించాలి. వ్రతము అయ్యేంత వరకు ఏమియూ తినరాదు. వ్రతము చేసే స్థలమును గో మూత్రముతో పవిత్రము చేసి, పసుపుతో ముగ్గు వేసి వ్రత పీఠమును దానిపై ఉంచి, బంతిపూలతో, అరటి మండలతో, మామిడాకులతో అలంకరించాలి. ఈ వ్రతమును ఉదయము చేయవచ్చును లేదా సంధ్యాసమయములో కూడా చేయవచ్చును.

  5. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత పీఠంలో దేవతలను ఎలా స్థాపించాలి?

    పీఠం లోపల ఒక తెల్ల అంగవస్త్రమును పరిచి, దానిపై 1.25 కిలో బియ్యం పోసి, ఆ బియ్యంపై తొమ్మిది దిక్కుల్లో నవగ్రహాలను పెట్టాలి (రెండు తమలపాకులు, 3 పోకలు, 1 ఖర్జురా, రూపాయి నాణెమును పెడితే ఒక నవగ్రహము అవుతుంది.) ఇలా తొమ్మిది నవగ్రహాలను పెట్టాలి. ఇలానే ఎనిమిది దిక్పాలకులను పెట్టవచ్చును. తదుపరి పీఠముపై కలశస్థాపన చేయాలి. కలశములో బియ్యం లేదా సుగంధద్రవ్యాలు పోసి, దానిపై కొబ్బరికాయను పెట్టి, ఎరుపు లేదా ముదురు ఎరుపు రంగు రవికను గోపురముల చేసి కొబ్బరికాయపై పెట్టాలి. ఆ కలశానికి కంకణమును కట్టాలి. పిదప స్వామివారి ఫోటోను పీఠములో కలశము వెనక అమర్చి ఒక పుష్పమాలతో అలంకరించాలి. అనంతరము ఒక ముదురు రంగు రవికను చిన్న గోపురముల చేసి కలశము ముందు పెట్టి, దానిపై రెండు తమలపాకులు, 3 పోకలు, ఒక ఖర్జురా, ఒక రూపాయి నాణెమును ఉంచి దానిపై ఒక కొబ్బరి కురిడి/కుడుక నుంచి, దీపం వెలిగించాక, పసుపు గణపతిని తయారు చేసి అందులో పెట్టాలి. పీఠం లోపల ఒక చిన్న దీపపు కుందును పెట్టి దానిలో ఆవునెయ్యి, వత్తులువేసి పెట్టాలి. పీఠం చుట్టూ పెద్ద కుందులను పెట్టి ఐదు వత్తులను వేసి, నూనె వేసి పెట్టాలి.

  6. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత పూజా విధానము ఏమిటి?

    ముందుగా దీపారాధన చేయాలి, పసుపు గణపతిని చేసి పీఠం లోపల కొబ్బరి కురిడీలో పెట్టాలి. తదుపరి పూర్వాంగ పూజ, పసుపు గణపతి పూజ చేయాలి. తరువాత స్వామి వారి అంగదేవతలైన మండపము పై స్థాపించిన నవగ్రహములను,అష్టదిక్పాలకులను పూజించాలి. పిదప ఈ దేవతలతో పాటుగా పంచలోకపాలకులను, కులదైవమును, సత్యనారాయణ స్వామి పరివారమును కలశమునందు ఆవాహనం చేయాలి. అనంతరము సత్యనారాయణ స్వామి ప్రతిమ (ప్రతిమ లేకపోతే ఫొటో ఉన్న సరిపోతుంది లేదా రూపాయి నాణెములో కూడా స్వామి వారిని ఆవాహనం చేయవచ్చును.) లో స్వామివారిని ఆవాహనం చేసి, పంచామృత స్నానం చేయించి, పీఠం లోపల, కలశాన్ని కుడివైపున ఉంచి, ఉపచారా పుజ చేయాలి. ఈ ప్రక్రియ పూర్తయిన పిదప శ్రద్దగా సత్యనారాయణ స్వామి వారి వ్రత కథలను శ్రద్ధతో శ్రవణము చేయాలి. ఇక చివరగా ధూప, దీప, నైవేద్యాదులు, మంగళహారతి ఇచ్చి, ప్రదక్షిణము చేసిన తరువాత తీర్థ ప్రసాదములు స్వీకరించి, ఉద్వాసన క్రియ చేయాలి.

  7. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత ఫలము ఏమిటి?

    శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతము చేయడము వలన సర్వము సిద్ధిస్తుంది. కోరిన కోరికలు తీరుతాయి. సంతానము కోరిన వారికి సంతానము కలుగుతుంది. ధనము లేనివారికి ధనము కలుగుతుంది. కోర్ట్ కేసు లున్నవారికి అనుకూలముగా తీర్పు లభిస్తుంది. ఈ వ్రతము చేస్తున్నంతవరకు కావలసింది భక్తి శ్రద్ధలు మాత్రమే.

శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం-ప్రారంభ పూజ (click to expand)

పూర్వాంగ పూజ

ఓం శివాయ గురవే నమః పరమగురవే నమః సద్గురవే నమః శ్రీ మహా గణాధిపతయే నమః శ్రీ మహా సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః హరిః ఓం । మీ ముఖానికి కుంకుమ పెట్టుకుని,నమస్కారం చేయండి శుచిః: అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం గతోఽపి వా । యః స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతరః శుచిః ।। (పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః) ప్రార్థన: శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం । ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ।। అగజానన పద్మార్కం గజాననమహర్నిశం । అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ।। సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి । విద్యారంభం కరిష్యామి సిద్ధిద్బవతుమే సదా ।। పద్మపత్ర విశాలాక్షీ పద్మ కేసరవర్ణినీ । నిత్యం పద్మాలయా దేవీ సా మాం పాతు సరస్వతీ ।। గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః । గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః ।। సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే । శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోఽస్తు తే ।। ఇప్పుడు ఎడమచేతిలో అక్షతలును తీసుకొని కుడి చేతితో మృగముద్రవేసి(బొటనవేలు,మధ్యవేలు, ఉంగరం వేలు కలిపితే అది మృగముద్ర అవుతుంది.) ఆ ఎడమ చేతిలోని అక్షతలును ఒక్కోనామం చదువుతూ గణనాథుడిపై వేస్తూ ఉండాలి. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః । ఉమామహేశ్వరాభ్యాం నమః । వాణీహిరణ్యగర్భాభ్యాం నమః । శచీపురందరాభ్యాం నమః । అరుంధతీవసిష్ఠాభ్యాం నమః । శ్రీసీతారామాభ్యాం నమః । మాతాపితృభ్యో నమః । సర్వేభ్యో మహాజనేభ్యో నమః । ఆచమ్య‐ప్రాణానాచమ్య‐నేత్రాచమ్య: ఇప్పుడు ఆచమన పాత్ర లోని నీటిని ఉంగరం వ్రేలితో కళ్ళకు అద్దుకొని, ఉద్ధరిణిలో తీసుకొని ఒక్కో నామం చెపుతూ మూడు మార్లు తాగవలెను. ఓం కేశవాయస్వాహా, ఓం నారాయణాయస్వాహా, ఓం మాధవాయస్వాహా । హస్తం ప్రక్షాల్యచేయి కడగండి ఓం గోవిందాయనమః। విష్ణవేనమః । మధుసూధనాయనమః । త్రివిక్రమాయనమః । వామనాయనమః । శ్రీధరాయనమః। హృషీకేశాయనమః । పద్మనాభాయనమః । దామోదరాయనమః । సంకర్ణణాయనమ: । వాసుదేవాయనమః । ప్రద్యుమ్నాయ నమః । అనిరుద్దాయనమః । పురుషోత్తమాయనమః అధోక్షజాయనమః । నారసింహాయనమః । అచ్యుతాయనమః । జనార్ధనాయనమః । ఉపేంద్రాయనమః । హరయే నమః । శ్రీకృష్ణాయనమః । దీపారాధనం: ఓం దీపస్త్వం బ్రహ్మ రూపోసి జ్యోతిషాం ప్రభురవ్యయః । సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్కామాంశ్చ దేహి మే ।।
దీపమూలే పుష్పాక్షతాన్ నిక్షిప్య, దీపము వద్ద పుష్పాక్షతలను ఉంచవలెను. ఘంట: ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రక్షసామ్ । కురుఘంటా రావం తత్ర దేవ తాహ్వాన లాంఛనమ్ ।। ఘంటానాదం కృత్వా । ఘంట మ్రోగించాలి భూతోచ్చాటనం: ఉత్తిష్ఠంతు భూతపిశాచాః య ఏతే భూమి భారకాః । ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే । అక్షతలు వాసనా చూసి మీ ధర్మపత్నికి ఎడమవైపున వేయండి. ఈ మంత్రం చదువుతూ ప్రాణాయామం చేయండి. ఓం భూః ।ఓం భువః ।ఓం సువః ।ఓం మహః । ఓం జనః ।ఓం తపః ।ఓం సత్యం । ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ । ఓమాపో జ్యోతీ రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్ । సంకల్పం:
మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణో రాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరాద్దే శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరత వర్షే భరత ఖండే మేరోర్ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయవ్య ప్రదేశే -- నద్యోః మధ్యదేశే శోభన గృహే/దేవాలాయే / స్వగృహే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురు చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణాం మధ్యే (జరుగుచున్న సంవత్సరము, ఆయనము, ఋతువు, నెల, పక్షము, తిథి, వారము చెప్పాలి.) -- సంవత్సరే ---అయనే -- ఋతౌ -- మాసే -- పక్ష -- తిథౌ -- వాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ ( గోత్రములను, పేర్లను చెప్పుకోవాలి. గ్రోతస్య నామధేయస్య - ధర్మపత్నీ సమేతస్య -- (అని పురుషులును మరియు స్త్రీలైనచో) శ్రీమతి -- గోత్రోద్భవాయాః -- నామధేయాయాః -- అని చెప్పుకోవాలి.) అస్మాకం సహకుటుంబానాం క్షేమస్థైర్య విజయ అభయ ఆయురారోగ్యమైశ్వర్యాది సిద్ధ్యర్థం, సమస్త మంగళావాప్యర్ధం సమస్త అభ్యుదయార్ధం ధర్మార్థకామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సర్వ కార్య సిద్ధ్యర్థం సర్వకామిత సిద్ధ్యర్థం మమ సర్వత్రా విజయ ప్రాప్త్యర్థం శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి దేవత ముద్దిశ్య రమా సహిత సత్యనారాయణ స్వామి దేవత ప్రీత్యర్థం రమా సహిత సత్యనారాయణ స్వామి ప్రసాదేన మమ గృహే స్థిరలక్ష్మీ ప్రాప్త్యర్థం యధాశక్తి మమ రమాసహిత శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత పూజాం చ కరిష్యే । మనస్తదంగత్వేన శ్రీ సత్యనారాయణ స్వామి అంగదేవతాం మహాగణాధిపతి, ఆదిత్యాది నవగ్రహ ఇంద్రాది అష్టదిక్పాలకపూజాం పంచలోకపాలకపూజాం చ కరిష్యే । ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం శ్రీ మహా గణాధిపతి పూజాం కరిష్యే. ఆదౌ వ్రతాంగ దేవతారాధనం కరిష్యే ।। తదంగ కలశారాధనం కరిష్యే। కలశారాధనం: ఒక రాగి (ఇత్తడి, స్టీల్, వెండి) చెంబులో నీరు తీసుకొని కలశ పూజ చేయాలి. ఈ నీటిని మనం పూజ అయ్యేంత వరకు పవిత్ర జలముగా వాడుకోవాలి. కలశే గంధ పుష్పాక్షతైరభ్యర్చ్య । కలశస్యోపరి హస్తం నిధాయ । కలశానికి బొట్టు పెట్టి, ఒక పువ్వు వేసి, అక్షతలు వేసి కలశం పై కుడి అరచేతిని ఉంచండి. కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రః సమాశ్రితః । మూలే త్వస్య స్థితో బ్రహ్మా । మధ్యే మాతృగణా స్మృతాః ।। కుక్షౌ తు సాగరాసర్వే । సప్తద్వీపా వసుంధరా । ఋగ్వేదోథ యజుర్వేద సామవేదో హ్యథర్వణః ।। అంగైశ్చ సహితాసర్వే కలశాంబు సమాశ్రితాః । ఓం ఆకలశేషు ధావతి పవిత్రే పరిషిచ్యతే । ఉక్థైర్యజ్ఞేషు వర్ధతే । ఆపో వా ఇదగ్ం సర్వం విశ్వా భూతాన్యాపః । ప్రాణా వా ఆపః పశవ ఆపోఽన్నమాపోఽమృతమాపః । సమ్రాడాపో విరాడాపః స్వరాడాపశ్ఛందాగ్స్యాపో । జ్యోతీగ్ష్యాపో యజూగ్ష్యాపః సత్యమాపః । సర్వా దేవతా ఆపో భూర్భువః సువరాప ఓమ్ ।। గంగే చ యమునే చైవ గోదావరీ సరస్వతీ । నర్మదే సింధు కావేరీ జలేఽస్మిన్ సన్నిధిం కురు ।। కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమీ । భాగీరథీతి విఖ్యాతాః పంచగంగాః ప్రకీర్తితాః ।। ఆయాంతు దేవ పూజార్థం మమ దురితక్షయకారకాః । ఇప్పుడు ఈ మంత్రం చదువుతూ పూజాద్రవ్యాలపై, ప్రతిమపై, మీపై, మీ పరివారంపై కలశం లోని పుష్యంతో నీరు చల్లాలి. ఆయాంతు శ్రీమహాగణపతి పూజార్థం దురితక్షయ కారకాః ఓం ఓం ఓం కలశోదకేన పూజా ద్రవ్యాణి సంప్రోక్ష్య ।।దేవమాత్మానంచసంప్రోక్ష్య ।। ఇక్కడ గణపతి పూజ చేయాలి. గణపతి పూజ కొరకు పుర్వాంగ పూజ ప్రక్కన ఉన్న tabని click చేసి చూడండి.

గణపతి ఆరాధన

గణపతి స్థాపన మంత్రం: శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం । ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ।। శ్రీ మహాగణాధిపతిం సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్నీ పుత్ర పరివార సమేతం అస్మిన్ బింబే శ్రీ మహాగణాధిపతిమావాహయామి। స్థాపయామి పూజయామి। ప్రాణప్రతిష్ఠ: ఓం అసునీతే పునరస్మాసు చక్షుః పునః ప్రాణమిహ నో ధేహి భోగమ్। జ్యోక్పశ్యేమ సూర్యముచ్చరంత మనుమతే మృడయా నః స్వస్తి।। అమృతం వై ప్రాణా అమృతమాపః ప్రాణానేవ యథాస్థానముపహ్వయతే।।ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం। ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే।। శ్రీ మహాగణపతయే నమః। స్థిరో భవ వరదో భవ। సుముఖో భవ సుప్రసన్నో భవ। మమాభిముఖో భవ। మీ చేతులు దోసిలిలా పెట్టి మీ వైపు తిప్పుకోవాలి స్థిరాసనం కురు। రెండు తమపాకులు కుడి చేతితో తల్లక్రిందులుగా గణపతి శిరస్సుపై ఉంచుతూ ఈ మంత్రం చదవాలి. (హరిద్రా గణపతి అయితే పైదిశ లో పెట్టాలి). ధ్యానం: వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ। నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా।। శ్రీ మహాగణాధిపతయే నమః। ధ్యాయామి।ధ్యానం సమర్పయామి। గణనాథుడిని మనసులో ధ్యానించాలి. ఆవాహనం: శ్రీ మహాగణాధిపతయే నమః। ఆవాహయామి।స్థాపయామి పూజయామి। గణనాథుడిని మనసారా ఆహ్వానించాలి. ఆసనం: శ్రీ మహాగణాధిపతయే నమః। నవరత్నఖచిత సింహాసనం సమర్పయామి.। పుష్పాలను సమర్పించాలి. పాద్యం: శ్రీ మహాగణాధిపతయే నమః। పాదయోః పాద్యం సమర్పయామి। గణనాథుడి పాదాలు కడగాలి. అర్ఘ్యం: శ్రీ మహాగణాధిపతయే నమః। హస్తయోరర్ఘ్యం సమర్పయామి। కలశంలో ఉన్న పుష్పంతో కానీ లేదా ఉద్ధరణితో కానీ నీరు తీసుకొని చూపించి అర్ఘ్య పాత్రలో చల్లాలి/వదలాలి. ఆచమనం: శ్రీ మహాగణాధిపతయే నమః। ముఖే ఆచమనీయం సమర్పయామి। కలశంలో ఉన్న పుష్పంతో కానీ లేదా ఉద్ధరణితో కానీ నీరు తీసుకొని హరిద్రా గణపతికి చూపించి అర్ఘ్య పాత్రలో చల్లాలి/వదలాలి. శుద్ధోదకస్నానం: సర్వనదీ శుద్ధజల సంయుతం కలశేస్మిన్ సన్నిధౌ భవ। స్నానం కురుష్వ గణనాథా అగ్రపూజ్యాయా నమోఽస్తు తే ।। శ్రీ మహాగణాధిపతయే నమః। శుద్ధోదక స్నానం సమర్పయామి। స్నానానంతరం ముఖేశుద్దాచమనీయం సమర్పయామి। తమలపాకులతో జలమును చల్లాలి. వస్త్రం: శ్రీ మహాగణాధిపతయే నమః। వస్త్రయుగ్మం సమర్పయామి। వస్త్రార్ధం అక్షతాన్ సమర్పయామి। అక్షతలును సమర్పించాలి. యజ్ఞోపవీతం: శ్రీ మహాగణాధిపతయే నమః। యజ్ఞోపవీతం సమర్పయామి।। యజ్ఞోపవీతార్ధం అక్షతాన్ సమర్పయామి.।। అక్షతలును సమర్పించాలి. చందనం: శ్రీ మహాగణాధిపతయే నమః। శ్రీ గంధాన్ ధారయామి। గంధం మరియు కుంకుమ పెట్టాలి. అక్షతలు: శ్రీ మహాగణాధిపతయే నమః। అక్షతాన్ సమర్పయామి।। అక్షతలును సమర్పించాలి. హరిద్రాచూర్ణం (పసుపు): శ్రీ మహాగణాధిపతయే నమః। హరిద్రా చూర్ణం సమర్పయామి।। పసుపును సమర్పించాలి. కుంకుమ: శ్రీ మహాగణాధిపతయే నమః। కుంకుమ విలేపనం సమర్పయామి।। కుంకుమను సమర్పించాలి. సుగంధ పరిమళ ద్రవ్యము : శ్రీ మహాగణాధిపతయే నమః। సుగంధ పరిమళ ద్రవ్యాణిం సమర్పయామి ।। అక్షతలను సమర్పించాలి. పుష్పైః పూజయామి: ఒక్కో నామము చదువుతూ విడిపూలు (ఎర్రని రంగు పుష్పముులు ఉంటె మంచిది). గణనాథునిపై వేస్తూ ఉండాలి. ఓం సుముఖాయ నమః। ఓం ఏకదంతాయ నమః। ఓం కపిలాయనమః। ఓం గజకర్ణకాయ నమః। ఓం లంబోదరాయనమః। ఓం వికటాయ నమః। ఓం విఘ్నరాజాయ నమః। ఓం ధూమకేతవే నమః। ఓం గణాధిపాయనమః। ఓం గణాధ్యక్షాయ నమః। ఓం ఫాలచంద్రాయ నమః। ఓం గజాననాయ నమః। ఓం వక్రతుండాయ నమః। ఓం శూర్పకర్ణాయ నమః। ఓం హేరంబాయ నమః। ఓం స్కాందపూర్వజాయ నమః। ఓం సర్వసిద్ధిప్రదాయ నమః। శ్రీ మహాగణాధిపతయే నమః। నానావిధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి।। ధూపం: శ్రీ మహాగణాధిపతయే నమః।।ధూపమాఘ్రాపయామి।। అగరుబత్తులు వెలిగించి ఘంటా మోగిస్తూ చూపించాలి దీపం: శ్రీ మహాగణాధిపతయే నమః।ప్రత్యక్ష దీపం దర్శయామి।। ధుపా దీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి।। దీపానికి నమస్కారం చేయాలి నైవేద్యం: ఓం భూర్భువ॒స్సువ॑: । తత్స॑వి॒తుర్వరేణ్య॒o భర్గో॑ దే॒వస్య॑ ధీమహి । ధియో॒ యో న॑: ప్రచో॒దయాత్ ।। సత్యం త్వా ఋతేన పరిషించామి । సాయంకాలం ‐ ఋతం త్వా సత్యేన పరిషించామి అని చెప్పాలి. అమృతమస్తు । అమృ॒తో ప॒స్తర॑ణమసి । శ్రీ మహాగణాధిపతయే నమః అవసరార్థం మహానివేదనం సమర్పయామి । ఓం ప్రాణాయ స్వాహా । ఓం అపానాయ స్వాహా । ఓం వ్యా॒నాయ స్వాహా । ఓం ఉదానాయ స్వాహా । ఓం సమానాయ స్వాహా । మధ్యే మధ్యే పానీయం సమర్పయామి । అమృ॒తాపిధానమ॑సి । ఉత్తరాపోశనం సమర్పయామి । హస్తౌ ప్రక్షాళయామి । పాదౌ ప్రక్షాళయామి । శుద్ధ ఆచమనీయం సమర్పయామి । శ్రీ మహాగణాధిపతయే నమః। నైవేద్యం సమర్పయామి।। పండ్లు సమర్పించాలి. తాంబూలం: శ్రీ మహాగణాధిపతయే నమః। తాంబూలం సమర్పయామి ।। రెండు తమలపాకులు తొనలు ఆకుల కొసలు ఉత్తరం వైపు ఉన్నట్లుగా పెట్టి అందులో వక్కలు వేసి దైవానికి సమర్పించాలి. నీరాజనం: శ్రీ మహాగణాధిపతయే నమః। కర్పూరనీరాజనం సమర్పయామి।। కర్పూర హారతి ఇవ్వాలి. మంత్రపుష్పం: సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః । ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః వక్రతుండశ్శూర్పకర్ణో హేరంబస్స్కాందపూర్వజః । షోడశైతాని నామాని యః పఠేచ్ఛృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే । ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి। తన్నో దంతిః ప్రచోదయాత్।। శ్రీ మహాగణాధిపతయే నమః। పాదారవిందయోః సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి। అక్షతలు, పుష్పాలను సమర్పించాలి. ఆత్మప్రదక్షిణ నమస్కారం: అక్షతలును పుష్పాలు చేతిలో తీసుకొని తమ కుడివైపుకు 3 లేదా 5 మార్లు తిరుగుతూ ఆత్మప్రదక్షిణ చేయాలి. తదుపరి అక్షత పుష్పాలను సమర్పించాలి. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోఽహం పాపకర్మాఽహం పాపాత్మా పాపసంభవః త్రాహి మాం కృపయా సాయి శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్కారుణ్య భావేన రక్ష రక్ష శ్రీసాయినాథ ప్రభో ఓం మహాగణాధిపతయే నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి।। ఉపచార పూజా: సిద్ధి బుద్ధి సామెత శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః ఛత్రమాచ్ఛాదయామి । చామరైర్వీజయామి । నృత్యం దర్శయామి । గీతం శ్రావయామి । వాద్యం ఘోషయామి । ఆందోళికానారోహయామి । అశ్వానారోహయామి । గజానారోహయామి । సమస్త రాజోపచార దేవోపచార భక్త్యుపచార శక్త్యుపచార మంత్రోపచార పూజాన్ సమర్పయామి ।। అక్షతలు, పసుపు, కుంకుమ సమర్పిచాలి. సమర్పణం: యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు। న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే గజాననం।। మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప। యత్పూజితం మయా దేవా పరిపూర్ణం తదస్తు తే। ఓం వక్రతుండ మహాకాయ సూర్య కోటి సమప్రభ। నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా।। అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మకః శ్రీ మహాగణాధిపతి సుప్రీతో సుప్రసన్నో వరదో భవంతు।। ఉత్తరే శుభకర్మణ్యవిఘ్నమస్తు ఇతి భవంతో బ్రువంతు। ఉత్తరే శుభకర్మణి అవిఘ్నమస్తు।। ఏతత్ ఫలం, శ్రీ మహాగణాధిపతి చరణారవిందార్పణమస్తు। అక్షతలును కుడిచేతిలో తీసుకొని కలశములోని నీటితో క్రింద అర్ఘ్య పాత్రలో వదలాలి. పుష్ప ధారణ: సహస్రపరమా దేవీ శతమూలా శతాంకురా । సర్వం హరతు మే పాపం దూర్వా దుస్స్వప్ననాశినీ ।। పూజా సమయాన గణపతి వద్ద పుష్పముును ధరించడం కేవలం ఆచారం మాత్రమే కాదు, అది సాక్షాత్తు గణపతి అనుగ్రహాన్ని, ఆయురారోగ్యాలను పొందే ఒక పవిత్ర ప్రక్రియ. ధ్యానం: కంకణ ధారణ: బధ్నామి కంకణం పుణ్యం సర్వపాప వినాశనం । ధర్మకామార్థ సిద్ధ్యర్థం మమ సౌభాగ్య వర్ధనం ।। దంపతులు ఒకరినొకరు కంకణాలు కట్టుకోవాలి.
మండపదేవతా పూజ (click to expand) ఒక్కో గ్రహానికి ఆయా గ్రహ వర్ణ పుష్పముును ఉపయోగించాలి. పుష్పముు లభించకపోతే తెల్లని పుష్పముు గానీ, పసుపు వర్ణ పుష్పముు గానీ ఉపయోగించవచ్చును. అంగారకుడికి, సూర్యుడికి మాత్రం ఎరుపు వర్ణ పుష్పముులు వాడాలి. శని, రాహువు గ్రహములకు నీలము వర్ణ పుష్పముులు వాడితే మంచిది. శని గ్రహానికి ఎరుపు వర్ణ పుష్పము నిషిద్దము. భార్య ఒక పుష్పముూ, అక్షతలను భర్తకి ఇవ్వాలి. భర్త ఆయా నవగ్రహ దేవతలపై సమర్పించాలి. గ్రహ, నక్షత్ర శాంతి సమయములో మాత్రము శాంతి చేసుకొనేవారు సమర్పించాలి.

సూర్య గ్రహారాధన

భార్య ఎరుపు వర్ణ పుష్పము, అక్షతలను భర్తకి ఇవ్వాలి. భర్త సూర్యగ్రహముపై 'ఓం సూర్యాయ నమః' అని మనసులో సూర్యుడిని ధ్యానిస్తూ సమర్పించాలి. గ్రహ, నక్షత్ర శాంతి సమయములో మాత్రము శాంతి చేసుకొనేవారు సమర్పించాలి. శ్లోకం: ఋత్వికుడు ఈ శ్లోకమును యజమాని చేత చెప్పించాలి. సూర్యారిప్టే తు సంప్రాప్తే సూర్యపూజాం చ కారయేత్ । సూర్యధ్యానం ప్రవక్ష్యామి ఆత్మపీడోపశాంతయే ।। వినియోగం: (ఆ కృష్ణ నేత్రస్య మంత్రస్య హిరణ్య స్తూప ఋషిః । సవితా దేవతా ।। త్రిష్టుప్ ఛందః ) । (మమ) యజమానస్య । అధి దేవతా ప్రత్యధి దేవతా సహిత సూర్యగ్రహ ప్రసాద సిద్ధ్యర్థే సూర్యగ్రహారాధనే వినియోగ: ధ్యానం: పద్మాసనః పద్మ కరో ద్విబాహుః పద్మద్యుతి స్సప్తతురంగ వాహః । దివాకరో లోకగురుః కిరీటీమయి ప్రసాదం విదధాతు దేవః ।। వేద మంత్రం: ఆకృష్ణేన రజసా వర్తమానో నివేశయన్నమృతం మర్త్యంచ । హిరణ్యయేన సవితా రథేనా దేవో యాతి భువనాని పశ్యన్ ।। అధిదేవత (అగ్ని) అగ్నిందూతం వృణీమహే హోతారం విశ్వవేదసమ్ । అస్య యజ్ఞస్య సుక్రతుమ్ ।। ప్రత్యధి దేవత (రుద్రుడు) కద్రుద్రాయ ప్రచేతసే మీఢుష్టమాయ తవ్యసే । వోచేమ శంతమగ్ం హృదే ।। ఆవాహనం: ఓం భూర్భువస్సువః । సూర్యగ్రహే ఆగచ్ఛ। సూర్యగ్రహం, రక్త (ఎరుపు) వర్ణం రక్తగంధం రక్తపుష్పం రక్త మాల్యాం బరధరం రక్త చ్ఛత్ర ధ్వజ రథపతాకా దిశోభితం దివ్య రథ సమారూఢం మేరుం ప్రదక్షిణీ కుర్వాణం కిరీటినం సుఖాసీనం పత్నీపుత్ర పరివారసమేతం గ్రహమండలే ప్రవిష్ట మస్మిన్నధికరణే మధ్యే వర్తులా కారమండలే గోధుమ ధాన్యస్యోపరి భగవంతం, సూర్యగ్రహ మావాహయామి స్థాపయామి పూజయామి సూర్యగ్రహాధి దైవతం అగ్నిం సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్నీ పుత్ర పరివార సమేతం సూర్యగ్రహస్య దక్షిణతః అగ్నిమావాహయామి స్థాపయామి పూజయామి. సూర్యగ్రహప్రత్యధి దైవతం రుద్రం సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్నీపుత్ర పరివార సమేతం సూర్యగ్రహస్య ఉత్తరతః రుద్ర మావాహయామి స్థాపయామి పూజయామి । అధిదేవతా ప్రత్యధి దేవతా సహిత సూర్యగ్రహ ప్రసాద సిద్ధిరస్తు ।

చంద్ర గ్రహారాధన

భార్య తెలుపు వర్ణ పుష్పము, అక్షతలను భర్తకి ఇవ్వాలి. భర్త చంద్రగ్రహముపై 'ఓం చంద్రాయ నమః' అని మనసులో చంద్రుడిని ధ్యానిస్తూ సమర్పించాలి. గ్రహ, నక్షత్ర శాంతి సమయములో మాత్రము శాంతి చేసుకొనేవారు సమర్పించాలి. శ్లోకం: ఋత్వికుడు ఈ శ్లోకమును యజమాని చేత చెప్పించాలి. చంద్రారిష్టేతు సంప్రాప్తే చంద్ర పూజాం చకారయేత్ । చంద్రధ్యానం ప్రవక్ష్యామి మనః పీడోప శాంతయే ।। వినియోగం: (ఆప్యాయ స్వేత్యస్య మంత్రస్య గౌతమ ఋషిః । చంద్రో దేవతా గాయత్రీ ఛంధః) । (మమ) యజమానస్య । అధి దేవతా ప్రత్యధి దేవతా సహిత చంద్రగ్రహ ప్రసాద సిద్ధ్యర్థే చంద్ర గ్రహారాధనే వినియోగ: ధ్యానం: శ్వేతాంబర శ్వేత వపుః కిరీటీ శ్వేత ద్యుతిర్దండ ధరో ద్విబాహుః । చంద్రో అమృతాత్మా వరదః కిరీటీ శ్రేయాం సిమహ్యం విదధాతు దేవః ।। వేద మంత్రం: ఆప్యాయస్వ సమేతు తే విశ్వత సోమ వృష్టియమ్ । భవా వాజస్య సంగథే ।। అధిదేవత (అపః - జలం): అప్సుమే సోమో అబ్రవీదంతర్విశ్వాని భేషజా । అగ్నించ విశ్వశంభువ మాపశ్చ విశ్వభేషజీః ।। ప్రత్యధి దేవత (గౌరి): గౌరీ మిమాయ సలిలాని తక్షత్యేకపదీ ద్విపదీ సా చతుష్పదీ । అష్టాపదీ నవపదీ బభూవుషీ సహస్రాక్షరా పరమే వ్యోమన్ ।। ఆవాహనం: ఓం భూర్భువస్సువః చంద్రగ్రహే ఆగచ్ఛ । చంద్రగ్రహం, శ్వేత (తెలుపు) వర్ణం శ్వేత గంధం శ్వేత పుష్పం శ్వేత మాల్యాం బరధరం శ్వేత చ్ఛత్ర ధ్వజ రథపతాకా దిశోభితం దివ్య రథ సమారూఢం మేరుం ప్రదక్షిణీ కుర్వాణం కిరీటినం సుఖాసీనం పత్నీపుత్ర పరివారసమేతం సూర్యగ్రహస్య ఆగ్నేయ దిగ్భాగే సమచతురశ్ర మండలే తండుల (బియ్యం) ధాన్యస్యోపరి భగవంతం, చంద్రగ్రహ మావాహయామి స్థాపయామి పూజయామి. అంగారక గ్రహాధి దేవతాం అపః సాంగాః సాయుధాః సవాహనాః సశక్తి పతిపుత్ర పరివార సమేతాః చంద్రగ్రహస్య దక్షిణతః అపః ఆవాహయామి స్థాపయామి పూజయామి ।। చంద్రగ్రహప్రత్యధి దైవతం గౌరీం సాంగం సాయుధం సవాహనం సవాహనాం సశక్తి పతిపుత్ర పరివార సమేతాం చంద్రగ్రహస్య ఉత్తరతః గౌరీ మావాహయామి స్థాపయామి పూజయామి ।। అధిదేవతా ప్రత్యధి దేవతా సహిత చంద్రగ్రహ ప్రసాద సిద్ధిరస్తు ।

అంగార/కుజ గ్రహారాధన

భార్య ఎరుపు వర్ణ పుష్పము, అక్షతలను భర్తకి ఇవ్వాలి. భర్త అంగార/కుజ గ్రహముపై 'ఓం కుజాయ నమః' అని మనసులో అంగారకుడిని ధ్యానిస్తూ సమర్పించాలి. గ్రహ, నక్షత్ర శాంతి సమయములో మాత్రము శాంతి చేసుకొనేవారు సమర్పించాలి. శ్లోకం: ఋత్వికుడు ఈ శ్లోకమును యజమాని చేత చెప్పించాలి. కుజారిష్టేతు సంప్రాప్తే కుజ పూజాం చకారయేత్ । కుజధ్యానం ప్రవక్ష్యామి రోగ పీడోప శాంతయే ।। వినియోగం: (అగ్నిర్ముర్ధే త్యస్య మంత్రస్య । విరూప ఋషిః అంగారక గ్రహో దేవతా । గాయత్రీఛందః) (మమ) యజమానస్య । అధి దేవతా ప్రత్యధి దేవతా సహిత అంగారకగ్రహ ప్రసాద సిద్ధ్యర్థే అంగారక గ్రహారాధనే వినియోగ: ధ్యానం: రక్తాంబరో రక్త వపుః కిరీటి చతుర్భుజో మేషగమో గదాభృత్ । ధరాసుత శ్శక్తి ధరశ్చ శూలీసదా మమస్యాద్వరదః ప్రశాంతః ।। వేద మంత్రం: అగ్నిర్మూర్ధా దివః కకుత్పతిః పృథివ్యా అయమ్ । అపాగ్ రేతాగ్ం సి జిన్వతి ।। అధిదేవత (భూమి): స్యోనా పృథివి భవాన్ ఒకృక్షరా నివేశనీ । యచ్ఛానః శర్మ సప్రథాః ।। ప్రత్యధి దేవత (క్షేత్రపాలకుడు): క్షేత్రస్య పతినా వయగ్ం హితేనేవ జయామసి । గామశ్వం పోషయిత్న్వా స నో మృడాతీదృశే ।। ఆవాహనం: ఓం భూర్భువస్సువః అంగారకగ్రహే ఆగచ్ఛ । అంగారక గ్రహం, రక్తవర్ణం రక్తగంధం రక్తపుష్పం రక్త మాల్యాం బరధరం రక్త చ్ఛత్ర ధ్వజ రథపతాకా దిశోభితం దివ్య రథ సమారూఢం మేరుం ప్రదక్షిణీ కుర్వాణం కిరీటినం సుఖాసీనం పత్నీపుత్ర పరివారసమేతం సూర్యగ్రహస్య దక్షిణదిగ్భాగే త్రికోణాకారమండలే ఆధక (కందులు) ధాన్యస్యోపరి భగవంతం, అంగారక గ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. అంగారక గ్రహాధి దేవతాం పృథివీం సాంగాం సాయుధాం సవాహనాం సశక్తి పతిపుత్ర పరివార సమేతాం అంగారక గ్రహస్య దక్షిణతః పృథివీ మావాహయామి స్థాపయామి పూజయామి ।। అంగారక గ్రహప్రత్యధి దైవతం క్షేత్రపాలకం సాంగం సాయుధం సవాహనం సవాహనాం సశక్తి పత్నీపుత్ర పరివార సమేతం అంగారకగ్రహస్య ఉత్తరతః క్షేత్రపాలక మావాహయామి స్థాపయామి పూజయామి ।। అధిదేవతా ప్రత్యధి దేవతా సహిత అంగారకగ్రహ ప్రసాద సిద్ధిరస్తు ।

బుధ గ్రహారాధన

భార్య పసుపు వర్ణ (ఆకుపచ్చ గులాబీలు లభిస్తే వాడవచ్చును) పుష్పము, అక్షతలను భర్తకి ఇవ్వాలి. భర్త బుధగ్రహముపై 'ఓం బుధాయ నమః' అని మనసులో బుధుడిని ధ్యానిస్తూ సమర్పించాలి. గ్రహ, నక్షత్ర శాంతి సమయములో మాత్రము శాంతి చేసుకొనేవారు సమర్పించాలి. శ్లోకం: ఋత్వికుడు ఈ శ్లోకమును యజమాని చేత చెప్పించాలి. బుధారిష్టేతు సంప్రాప్తే బుధ పూజాం చకారయేత్ । బుధధ్యానం ప్రవక్ష్యామి బుద్ధి పీడోపశాంతయే ।। వినియోగం: (ఉద్భుద్య స్వేత్యస్య మంత్రస్య నారాయణ ఋషిః । బుధ గ్రహోదేవతా త్రిష్ణుప్ ఛందః ।) (మమ) యజమానస్య । అధి దేవతా ప్రత్యధి దేవతా సహిత బుధగ్రహ ప్రసాద సిద్ధ్యర్థే బుధ గ్రహారాధనే వినియోగ: ధ్యానం: పీతాంబరః పీతవపుః కిరీటీ చతుర్భుజో దండ ధరశ్చ సౌమ్యః । చర్మాసిధృత్సోమ సుతస్సు మేరు: సింహాధిరూఢో వరదో బుధశ్చ ।। వేద మంత్రం: ఉద్బుధ్యస్వాగ్నే ప్రతి జాగృహి త్వమిష్టాపూర్తే సగ్ం సృజేథామయం చ । పునఃకృ॒ణ్వగ్గ్స్త్వా పితరం యువానమన్వాతాగ్ం సీత్వయితంతు మేతమ్ ।। అధిదేవత (విష్ణువు): ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిదధే పదమ్ । సమూఢమస్యపాగ్ం సురే ।। ప్రత్యధి దేవత (నారాయణుడు): సహస్రశీర్షా పురుషః సహస్రాక్షః సహస్రపాత్ । స భూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ఠద్దశాంగులమ్ ।। ఆవాహనం: ఓం భూర్భువస్సువః బుధగ్రహే ఆగచ్ఛ । బుధగ్రహం, పీత (ఆకుపచ్చ) వర్ణం పీత గంధం పీత పుష్పం పీత మాల్యాం బరధరం పీత చ్ఛత్ర ధ్వజ రథపతాకా దిశోభితం దివ్య రథ సమారూఢం మేరుం ప్రదక్షిణీ కుర్వాణం కిరీటినం సుఖాసీనం పత్నీపుత్ర పరివారసమేతం గ్రహమండలే ప్రవిష్ట మస్మిన్నధికరణే సూర్యగ్రహస్య ఐశాన్య దిగ్భాగే బాణాకార మండలే ముద్గ (పెసలు) ధాన్యస్యోపరి భగవంతం బుధగ్రహ మావాహయామి స్థాపయామి పూజయామి । బుధగ్రహాధి దేవతాం విష్ణుం సాంగాం సాయుధాం సవాహనాం సశక్తి పత్నీపుత్ర పరివార సమేతం బుధగ్రహస్య దక్షిణతః విష్ణు మావాహయామి స్థాపయామి పూజయామి ।। బుధ గ్రహప్రత్యధి దైవతం నారాయణం సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్నీపుత్ర పరివార సమేతం బుధగ్రహస్య ఉత్తరతః క్షేత్రపాలక మావాహయామి స్థాపయామి పూజయామి ।। అధిదేవతా ప్రత్యధి దేవతా సహిత బుధగ్రహ ప్రసాద సిద్ధిరస్తు ।

గురు / బృహస్పతి గ్రహారాధన

భార్య పసుపు వర్ణ పుష్పము, అక్షతలను భర్తకి ఇవ్వాలి. భర్త గురుగ్రహముపై 'ఓం గురవే నమః' అని మనసులో గురువుని ధ్యానిస్తూ సమర్పించాలి. గ్రహ, నక్షత్ర శాంతి సమయములో మాత్రము శాంతి చేసుకొనేవారు సమర్పించాలి. శ్లోకం: ఋత్వికుడు ఈ శ్లోకమును యజమాని చేత చెప్పించాలి. గుర్వరిష్టేతు సంప్రాప్తే బుధ పూజాం చకారయేత్ । గురుధ్యానం ప్రవక్ష్యామి పుత్రపీడోపశాంతయే ।। వినియోగం: (బృహస్పతే అతి యదర్యేత్యస్య మంత్రస్య । గృత్స్న మదఋషిః । బృహస్పతి గ్రహో దేవతా త్రిష్ణుప్ ఛందః ।) (మమ) యజమానస్య । అధి దేవతా ప్రత్యధి దేవతా సహిత బృహస్పతిగ్రహ ప్రసాద సిద్ధ్యర్థే బృహస్పతి గ్రహారాధనే వినియోగ: ధ్యానం: స్వర్ణాంబరః స్వర్ణ వపుః కిరీటీ చతుర్భుజో దేవ గురుః ప్రశాంతః। తధాసి దండంచ కమండలుంచ తథాక్ష సూత్రాద్వరదోస్తు మహ్యమ్ ।। వేద మంత్రం: బృహస్పతే అతి యదర్యో అర్హాద్ద్యుమద్విభాతి క్రతుమజ్జనేషు । యద్దీదయచ్ఛవస సర్తప్రజాత తదస్మాసు ద్రవిణం ధేహి చిత్రమ్ ।। అధిదేవత (బ్రహ్మాణం): బ్రహ్మ జజ్ఞానం ప్రథమం పురస్తాద్వి సీమతస్సురుచో వేన ఆవః । స బుధ్నియా ఉపమా అస్య విష్ఠాస్సతశ్చ యోనిమసతశ్చ వివః ।। ప్రత్యధి దేవత (ఇంద్రుడు): ఇంద్రం వో విశ్వత స్పరిహవామహే జనేభ్యః । అస్మాక మస్తు కేవలః ।। ఆవాహనం: ఓం భూర్భువస్సువః బృహస్పతి గ్రహే ఆగచ్ఛ । బృహస్పతి గ్రహం, కనక (బంగారం / పసుపు) వర్ణం కనక గంధం కనక పుష్పం కనకమాల్యాం బరధరం కనక చ్ఛత్ర ధ్వజ రథపతాకా దిశోభితం దివ్య రథ సమారూఢం మేరుం ప్రదక్షిణీ కుర్వాణం కిరీటినం సుఖాసీనం పత్నీపుత్ర పరివారసమేతం గ్రహమండలే ప్రవిష్ట మస్మిన్నధికరణే సూర్యగ్రహస్య ఉత్తరదిగ్భాగే దీర్ఘచతురస్రాకారమండలే చనక (శనగలు) ధాన్యస్యోపరి భగవంతం బృహస్పతి గ్రహమావాహయామి స్థాపయామి పూజయామి । బృహస్పతిగ్రహాధి దేవతాం బ్రహ్మాణం సాంగాం సాయుధాం సవాహనాం సశక్తి పత్నీపుత్ర పరివార సమేతం బృహస్పతిగ్రహస్య దక్షిణతః బ్రహ్మాణ మావాహయామి స్థాపయామి పూజయామి ।। బృహస్పతి గ్రహప్రత్యధి దైవతం ఇంద్రం సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్నీపుత్ర పరివార సమేతం బృహస్పతిగ్రహస్య ఉత్తరతః ఇంద్రమావాహయామి స్థాపయామి పూజయామి ।। అధిదేవతా ప్రత్యధి దేవతా సహిత బృహస్పతిగ్రహ ప్రసాద సిద్ధిరస్తు ।

శుక్ర గ్రహారాధన

భార్య తెలుపు వర్ణ పుష్పము, అక్షతలను భర్తకి ఇవ్వాలి. భర్త శుక్రగ్రహముపై 'ఓం శుక్రాయ నమః' అని మనసులో శుక్రుడిని ధ్యానిస్తూ సమర్పించాలి. గ్రహ, నక్షత్ర శాంతి సమయములో మాత్రము శాంతి చేసుకొనేవారు సమర్పించాలి. శ్లోకం: ఋత్వికుడు ఈ శ్లోకమును యజమాని చేత చెప్పించాలి. శుక్రారిష్టేతు సంప్రాప్తే శుక్రపూజాంచ కారయేత్ । శుక్రధ్యానం ప్రవక్ష్యామి పత్నీపీడోప శాంతయే ।। వినియోగం: (శుక్రంతే అన్యదిత్యస్య మంత్రస్య భరద్వాజ ఋషిః శుక్రగ్రహో దేవతా త్రిష్ణుప్ ఛందః ।) (మమ) యజమానస్య । అధి దేవతా ప్రత్యధి దేవతా సహిత శుక్రగ్రహ ప్రసాద సిద్ధ్యర్థే శుక్రగ్రహారాధనే వినియోగ: ధ్యానం: శ్వేతాంబర శ్వేతవపుః కిరీటీ చతుర్భుజో దైత్య గురుః ప్రశాంతః । తధాసి దండంచ కమండలుంచ తథాక్ష సూత్రా ద్వరదోస్తు మహ్యమ్ ।। వేద మంత్రం: శుక్రం తే అన్యద్యజ తంతే అన్యద్విషురూపే అహనీ ద్యౌరి వాసి । విశ్వాహి మాయా అవసి స్వథావో భద్రా తే పూషన్నిహ రాతి రస్తు ।। అధిదేవత (ఇంద్రాణి): ఇంద్రాణీమాసు నారిషు సుపత్నీ మహమశ్రవమ్ । స హ్యస్యా అపరంచన జరసా మరతే పతిః ।। ప్రత్యధి దేవత (ఇంద్ర మరుత్వంతం): ఇంద్రమరుత్వ ఇహ పాహి సోమం యథా శార్యాతే అపిబః సుతస్య । తవ ప్రణీతీ తవ శూరశర్మన్నావివాసంతి కవయః సుయజ్ఞాః ।। ఆవాహనం: ఓం భూర్భువస్సువః శుక్రగ్రహే ఆగచ్ఛ । శుక్రగ్రహం, శ్వేత వర్ణం శ్వేత గంధం శ్వేత పుష్పం శ్వేత మాల్యాం బరధరం శ్వేత చ్ఛత్ర ధ్వజ రథపతాకా దిశోభితం దివ్య రథ సమారూఢం మేరుం ప్రదక్షిణీ కుర్వాణం కిరీటినం సుఖాసీనం పత్నీపుత్ర పరివారసమేతం గ్రహమండలే ప్రవిష్ట మస్మిన్నధికరణే సూర్యగ్రహస్య ప్రాగ్భాగే పంచకోణాకారమండలే నిష్పవ (బొబ్బర్లు) ధాన్యస్యోపరి భగవంతం శుక్రగ్రహ మావాహయామి స్థాపయామి పూజయామి । శుక్రగ్రహాధి దేవతాం ఇంద్రాణీం సాంగాం సాయుధాం సవాహనాం సశక్తి పతిపుత్ర పరివార సమేతాం శుక్రగ్రహస్య దక్షిణతః ఇంద్రాణీ మావాహయామి స్థాపయామి పూజయామి ।। శుక్ర గ్రహప్రత్యధి దైవతం ఇంద్ర మరుత్వంతం సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్నీపుత్ర పరివార సమేతం శుక్రగ్రహస్య ఉత్తరతః ఇంద్ర మరుత్వం తమావాహయామి స్థాపయామి పూజయామి ।। అధిదేవతా ప్రత్యధి దేవతా సహిత శుక్రగ్రహ ప్రసాద సిద్ధిరస్తు ।

శని గ్రహారాధన

భార్య నీలవర్ణ పుష్పము, అక్షతలను భర్తకి ఇవ్వాలి. భర్త శనిగ్రహముపై 'ఓం శనయే నమః' అని మనసులో శనైశ్చరుడిని ధ్యానిస్తూ సమర్పించాలి. గ్రహ, నక్షత్ర శాంతి సమయములో మాత్రము శాంతి చేసుకొనేవారు సమర్పించాలి. శ్లోకం: ఋత్వికుడు ఈ శ్లోకమును యజమాని చేత చెప్పించాలి. శన్యరిష్టేతు సంప్రాప్తే శని పూజాంచ కారయేత్ । శని ధ్యానం ప్రవక్ష్యామి ప్రాణ పీడోప శాంతయే ।। వినియోగం: (శమగ్నిరగ్నిభి రిత్యస్య మంత్రస్య । ఇళింమిళి ఋషిః । శనైశ్చ రగ్రహోదేవతా । ఉష్టిక్ ఛందః ।) (మమ) యజమానస్య । అధి దేవతా ప్రత్యధి దేవతా సహిత శనైశ్చరగ్రహ ప్రసాద సిద్ధ్యర్థే శనైశ్చరగ్రహారాధనే వినియోగ: ధ్యానం: నీలద్యుతిర్నీల వపుః కిరీటీ గృధ్రస్థితశ్చాప కరోధనుష్మాన్ । చతుర్భుజస్సూర్య సుతః ప్రశాంతా స్సచాస్తుమహ్యం వరమందగామీ ।। వేద మంత్రం: శమగ్నిరగ్నిభిస్కర శ్చన్నస్తపతు సూర్యః । శం వాతో వాత్యరపా అప స్రిధః ।। అధిదేవత (యముడు): యమాయ సోమగ్ం సునుత యమాయ జుహుతా హవిః । యమగ్ం హ యజ్ఞో గచ్ఛత్యగ్నిదూతో అరకృతః ।। ప్రత్యధి దేవత (ప్రజాపతి): ప్రజాపతే న త్వదేతాన్యో విశ్వా జాతాని పరితా బభూవ । యత్కామాస్తే జుహుమస్తన్నో అస్తు వయగ్ం స్యామ పతయో రయీణామ్ ।। ఆవాహనం: ఓం భూర్భువస్సువః శనైశ్చరగ్రహే ఆగచ్ఛ । శనైశ్చరగ్రహం, నీలవర్ణం నీల గంధం నీల పుష్పం నీలమాల్యాం బరధరం నీలచ్ఛత్ర ధ్వజ రథపతాకా దిశోభితం దివ్య రథ సమారూఢం మేరుం ప్రదక్షిణీ కుర్వాణం కిరీటినం సుఖాసీనం పత్నీపుత్ర పరివారసమేతం గ్రహమండలే ప్రవిష్ట మస్మిన్నధికరణే సూర్యగ్రహస్య పశ్చిమదిగ్భాగే ధనురాకార మండలే తిల (నువ్వులు) ధాన్యస్యోపరి భగవంతం శనైశ్చర గ్రహమావాహయామి స్థాపయామి పూజయామి। శనైశ్చరగ్రహాధి దైవతం యమం సాంగాం సాయుధాం సవాహనాం సశక్తి పత్నీపుత్ర పరివార సమేతం శనైశ్చరగ్రహస్య దక్షిణతః ఇంద్రాణీ మావాహయామి స్థాపయామి పూజయామి ।। శనైశ్చర గ్రహప్రత్యధి దైవతం ప్రజాపతిం సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్నీపుత్ర పరివార సమేతం శనైశ్చరగ్రహస్య ఉత్తరతః ప్రజాపతి మావాహయామి స్థాపయామి పూజయామి ।। అధిదేవతా ప్రత్యధి దేవతా సహిత శనైశ్చరగ్రహ ప్రసాద సిద్ధిరస్తు ।

రాహు గ్రహారాధన

భార్య నీలవర్ణ పుష్పము లేదా పొగవర్ణ పుష్పము, అక్షతలను భర్తకి ఇవ్వాలి. భర్త రాహుగ్రహముపై 'ఓం రాహవే నమః' అని మనసులో రాహువుని ధ్యానిస్తూ సమర్పించాలి. గ్రహ, నక్షత్ర శాంతి సమయములో మాత్రము శాంతి చేసుకొనేవారు సమర్పించాలి. శ్లోకం: ఋత్వికుడు ఈ శ్లోకమును యజమాని చేత చెప్పించాలి. రాహ్వరిష్టేతు సంప్రాప్తే రాహు పూజాంచ కారయేత్ । రాహు ధ్యానం ప్రవక్ష్యామి చక్షుః పీడోప శాంతయే ।। వినియోగం: (కయాన శ్చిత్రేత్యస్య మంత్రస్య వామదేవ ఋషిః రాహుగ్రహో దేవతా గాయత్రీ ఛందః ।) మమ అధిదేవతా ప్రత్యధి దేవతా సహిత రాహుగ్రహ ప్రసాద సిధ్యర్థే రాహుగ్రహారాధనే వినియోగః ।। ధ్యానం: నీలాంబరో నీలవపుః కిరీటీ కరాళ వక్త్రః కర వాలశూలీ । చతుర్భుజశ్చర్మధరశ్చ రాహుస్సింహాధి రూఢో వరదోస్తు మహ్యమ్ ।। వేద మంత్రం: కయా నశ్చిత్ర ఆభువదూతీ సదావృధః సఖా । కయా శచిష్ఠయా వృతా ।। అధిదేవత (అంగా): ఆయంగౌః పృశ్నిరక్రమీదసనన్ మాతరం పునః । పితరంచ ప్రయన్ త్సువః ।। ప్రత్యధి దేవత (సర్పము): నమో అస్తు సర్పేభ్యో యే కే చ పృథివీమను । యే అంతరిక్షే యే దివి తేభ్యః సర్పేభ్యో నమః ।। ఆవాహనం: ఓం భూర్భువస్సువః రాహుగ్రహే హాగచ్ఛరాహుగ్రహం, ధూమ్ర (బూడిద) వర్ణం ధూమ్రగంధం ధూమ్రపుష్పం ధూమ్రమాల్యాం బరధరం ధూమ్రచ్ఛత్ర ధ్వజ రథపతాకా దిశోభితం దివ్య రథ సమారూఢం మేరుం అప్రదక్షిణీ కుర్వాణం కిరీటినం సుఖాసీనం పత్నీపుత్ర పరివారసమేతం గ్రహమండలే ప్రవిష్ట మస్మిన్నధికరణే సూర్యగ్రహస్య నైఋతి దిగ్భాగే శూర్పాకారమండలే మాష (మినుములు) ధాన్యస్యోపరి భగవంతం రాహుగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి । రాహుగ్రహాధిదేవతాంగాం సాంగాం సాయుధాం సవాహనాం సశక్తి పతిపుత్ర పరివార సమేతాం రాహుగ్రహస్య దక్షిణతాంగామావాహయామి స్థాపయామి పూజయామి ।। రాహు గ్రహప్రత్యధి దైవతం సర్పం సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్నీపుత్ర పరివార సమేతం రాహుగ్రహస్య ఉత్తరతః ప్రజాపతి మావాహయామి స్థాపయామి పూజయామి ।। అధిదేవతా ప్రత్యధి దేవతా సహిత రాహుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు ।

కేతు గ్రహారాధన

భార్య పొగవర్ణ పుష్పము, అక్షతలను భర్తకి ఇవ్వాలి. భర్త కేతుగ్రహముపై 'ఓం కేతవే నమః' అని మనసులో కేతువుని ధ్యానిస్తూ సమర్పించాలి. గ్రహ, నక్షత్ర శాంతి సమయములో మాత్రము శాంతి చేసుకొనేవారు సమర్పించాలి. శ్లోకం: ఋత్వికుడు ఈ శ్లోకమును యజమాని చేత చెప్పించాలి. కేత్వరిష్టేతు సంప్రాప్తే కేతు పూజాంచకారయేత్ । కేతుధ్యానం ప్రవక్ష్యామి జ్ఞానపీడో పశాంతయే ।। వినియోగం: (కేతుం కృణ్వన్నిత్యస్య మంత్రస్య । మధుచ్ఛంద ఋషిః ।। కేతుగణో దేవతా । గాయత్రీచ్ఛందః ।) మమ అధిదేవతా ప్రత్యధి దేవతా సహిత కేతుగణ ప్రసాద సిధ్యర్థే కేతుగణ ఆరాధనే వినియోగః ।। ధ్యానం: ధూమ్రో ద్విబాహు ర్వరదో గదాభృద్భ ధాసనస్తో వికృతా ననశ్చ । కిరీట కేయూర విభూషి తాంగ సచాస్తుమే కేతు గణః ప్రశాంతః ।। వేద మంత్రం: కేతుం కృణ్వన్న కేతవే పేశో మర్యా అపేశసే । సముషద్భిరజాయథాః ।। అధిదేవత (చిత్రగుప్తుడు): సచిత్ర చిత్రమ్ చితయంతమస్మే చిత్రక్షత్ర చిత్రతమం వయోధామ్ । చంద్రం రయిం పురువీరం బృహంతం చంద్ర చంద్రాభిర్గృణతే యువస్వ ।। ప్రత్యధి దేవత (బ్రహ్మాణం): బ్రహ్మా దేవానాం పదవీః కవీనామృషిర్విప్రాణాం మహిషో మృగాణామ్ । శ్యేనో గృధ్రాణాగ్ స్వధితిర్వనానాగ్ సోమః పవిత్రమత్యేతి రేభన్ ।। ఆవాహనం: ఓం భూర్భువస్సువః కేతుగణేహాగచ్ఛ కేతుగణం, చిత్ర (బూడిద/వివిధ రంగులు) వర్ణం చిత్రగంధం చిత్రపుష్పం చిత్రమాల్యాం బరధరం చిత్రచ్ఛత్ర ధ్వజ రథపతాకా దిశోభితం దివ్య రథ సమారూఢం మేరుం అప్రదక్షిణీ కుర్వాణం కిరీటినం సుఖాసీనం పత్నీపుత్ర పరివారసమేతం గ్రహమండలే ప్రవిష్ట మస్మిన్నధికరణే సూర్యగ్రహస్య వాయువ్య దిగ్భాగే ధ్వజాకార మండలే కుళుత్థ ధాన్యస్యోపరి భగవంతం కేతుగణ మావాహయామి స్థాపయామి పూజయామి।। కేతుగణ ప్రత్యధి దైవతంచిత్రగుప్తంసాంగం సాయుధం సవాహనం సశక్తి పత్నీపుత్ర పరివార సమేతం కేతుగణస్య దక్షిణతః చిత్రగుప్తమావాహయామి స్థాపయామి పూజయామి ।। కేతుగణ ప్రత్యధి దైవతంబ్రహ్మాణంసాంగం సాయుధం సవాహనం సశక్తి పత్నీపుత్ర పరివార సమేతం కేతుగణస్యోత్తరతః బ్రహ్మాణమావాహయామి స్థాపయామి పూజయామి ।। అధిదేవతా ప్రత్యధి దేవతా సహిత రాహుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు ।

అష్టదిక్పాలక ఆరాధన

భార్య ఒక పుష్పముూ, అక్షతలను భర్తకి ఇవ్వాలి. భర్త ఒక్కో అష్టదిక్పాలకునిపై సమర్పించాలి. గ్రహ, నక్షత్ర శాంతి సమయములో మాత్రము శాంతి చేసుకొనేవారు సమర్పించాలి. ఇంద్రుడు: ఓం ఇంద్రంవో విశ్వతస్పరిహవా మహేజనేభ్యః అస్మాకమస్తు కేవలః।। ప్రాక్ దిగ్భాగే ఇంద్రం దిక్పాలక మావాహయామి స్థాపయామి పూజయామి భార్య ఒక పుష్పముూ, అక్షతలను భర్తకి ఇవ్వాలి. భర్త తూర్పు దిశలో ఇంద్రుడికి సమర్పిస్తూ ఆహ్వానించాలి. అగ్ని: ఓం అగ్నిందూతం వృణీమహే హోతారం విశ్వవేదసమ్ । అస్య యజ్ఞస్యసుక్రతుమ్ ।। ఆగ్నేయ దిగ్భాగే అగ్నిం దిక్పాలక మావాహయామి స్థాపయామి పూజయామి. భార్య ఒక పుష్పముూ, అక్షతలను భర్తకి ఇవ్వాలి. భర్త ఆగ్నేయ దిశలో అగ్నికి సమర్పిస్తూ ఆహ్వానించాలి. యముడు: ఓం యమాయ సోమ గ్ం సునుత యమాయ జుహుతాహవి: । యమగ్ంహ యజ్ఞోగచ్ఛత్యగ్నిదూతో అరంకృతః ।। దక్షిణ దిగ్భాగే యమం దిక్పాలక మావాహయామి స్థాపయామి పూజయామి. భార్య ఒక పుష్పముూ, అక్షతలను భర్తకి ఇవ్వాలి. భర్త దక్షిణ దిశలో యముడుకి సమర్పిస్తూ ఆహ్వానించాలి. నిరృతి: ఓం మూషుణ: పరా పరాని తిర్ ధృహణావధీత్ । పతీష్ట తృష్ణయాసహ ।। నిరృతి దిగ్భాగే నిరృతిం దిక్పాలక మావాహయామి స్థాపయామి పూజయామి. భార్య ఒక పుష్పముూ, అక్షతలను భర్తకి ఇవ్వాలి. భర్త నిరృతి దిశలో యముడుకి సమర్పిస్తూ ఆహ్వానించాలి. వరుణుడు: ఓం ఇమంమే వరుణ శ్రుధీహవ మద్యాచ మృడయ త్వాం అవస్యురాచకే ।। పశ్చిమ దిగ్భాగే వరుణం దిక్పాలక మావాహయామి స్థాపయామి పూజయామి. భార్య ఒక పుష్పముూ, అక్షతలను భర్తకి ఇవ్వాలి. భర్త పశ్చిమ దిశలో వరుణుడుకి సమర్పిస్తూ ఆహ్వానించాలి. వాయువు: ఓం తవవాయ వృతస్పతే త్వష్టుర్జామాతరద్భుత । ఆవాంస్యా వృణీమహే ।। వాయువ్య దిగ్భాగే వాయుం దిక్పాలక మావాహయామి స్థాపయామి పూజయామి. భార్య ఒక పుష్పముూ, అక్షతలను భర్తకి ఇవ్వాలి. భర్త వాయువ్య దిశలో వాయువుకి సమర్పిస్తూ ఆహ్వానించాలి. కుబేరుడు: ఓం సోమోధేనుగ్ం సోమో అర్వస్తమాశు గ్ం సోమో వీరం కర్మణ్యం దదాతు । సాదన్యం విదథ్య గ్ం సభేయం పితుశ్రవణం యోదదాశదస్మై ।। ఉత్తర దిగ్భాగే కుబేరం దిక్పాలక మావాహయామి స్థాపయామి పూజయామి. భార్య ఒక పుష్పముూ, అక్షతలను భర్తకి ఇవ్వాలి. భర్త ఉత్తర దిశలో కుబేరుడుకి సమర్పిస్తూ ఆహ్వానించాలి. ఈశానుడు: ఓం తమీశానం జగత స్తస్థుష స్పతిం ధియం జన్వ మవసే హూమహే వయం । పూషానోయథా వేదసా మసద్వృదే రక్షితాపాయురదబ్ధ స్స్వస్తయే ।। ఈశాన దిగ్భాగే ఈశానం దిక్పాలక మావాహయామి స్థాపయామి పూజయామి. భార్య ఒక పుష్పముూ, అక్షతలను భర్తకి ఇవ్వాలి. భర్త ఈశాన దిశలో ఈశానుడుకి సమర్పిస్తూ ఆహ్వానించాలి. ఊర్ధ్వ పురుషుడు: ఊర్ధ్వ ఊషుణ ఊతయే తిష్టా దేవోన సవితా ఉర్ధ్వో వాజస్య సవితాయ దంజిభి ర్వాఘద్భి ర్విహ్వయామహే ఊర్ధ్వ దిగ్భాగే ఊర్ధ్వ పురుష మావాహయామి స్థాపయామి పూజయామి. భార్య ఒక పుష్పముూ, అక్షతలను భర్తకి ఇవ్వాలి. భర్త ఈశాన దిశలో ఊర్ధ్వ పురుషుడుకి సమర్పిస్తూ ఆహ్వానించాలి. పృథివి: స్యోనా పృథివి భవానృక్షరాని వేశనీ । యచ్ఛాన శ్శర్మ స ప్రథాః ।। అథో దిగ్భాగే పృథివీ దేవతా మావాహయామి స్థాపయామి పూజయామి. భార్య ఒక పుష్పముూ, అక్షతలను భర్తకి ఇవ్వాలి. భర్త అథో దిశలో పృథివీ దేవతకి సమర్పిస్తూ ఆహ్వానించాలి.

పంచలోకపాలక ఆరాధన

భార్య ఒక పుష్పముూ, అక్షతలను భర్తకి ఇవ్వాలి. భర్త పంచలోకపాలక దేవతలపై సమర్పించాలి. గ్రహ, నక్షత్ర శాంతి సమయములో మాత్రము శాంతి చేసుకొనేవారు సమర్పించాలి. గణపతి: విఘ్న నివారకుడు. ఏ పూజకైనా ప్రప్రథముగా పూజించబడే దైవమైన ఆ గణపతిని ఆవాహనం చేయాలి. గణానాంత్వా గణపతిగ్ం హవామహే కవిం కవీనా ముపమశ్రవస్తమం । జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత అనశ్మృణ్వన్నూ తిభిస్సీద సాదనం ।। గణపతిం లోకపాలక మహావయామి స్థాపయామి పూజయామి. భార్య ఒక పుష్పముూ, అక్షతలను భర్తకి ఇవ్వాలి. భర్త గణపతికి సమర్పిస్తూ ఆహ్వానించాలి. దుర్గ: శక్తి స్వరూపిణీ, సర్వజగద్రక్షిణీ అయిన ఆ పరాశక్తిని ఆవాహనం చేయాలి. జాతవేదసే సునవామ సోమమరాతీ యతో నిదహా తివేదః । సనః పర్ షదతి దుర్గాణివిశ్వా నావేవసిన్థుమ్ దురితా త్యగ్నిః ।। దుర్గాం లోకపాలక మహావయామి స్థాపయామి పూజయామి. భార్య ఒక పుష్పముూ, అక్షతలను భర్తకి ఇవ్వాలి. భర్త దుర్గా దేవతకి సమర్పిస్తూ ఆహ్వానించాలి. క్షేత్రపాలకుడు : శివ స్వరూపుడూ, భైరవుడైన క్షేత్రపాలకుడిని మందపారక్షకునిగా ఆవాహనం చేయాలి. క్షేత్రస్య పతినా వయగ్ం హితేనేవ జయామసి । గామశ్వం పోషయిత్న్వా స నో మృడాతీదృశే ।। క్షేత్రపాలక మహావయామి స్థాపయామి పూజయామి. భార్య ఒక పుష్పముూ, అక్షతలను భర్తకి ఇవ్వాలి. భర్త క్షేత్రపాలకునికి సమర్పిస్తూ ఆహ్వానించాలి. అభయంకరుడు: భయాన్ని పారద్రోలి మనసులో ధైర్యాన్ని నింపే విష్ణు స్వరూప అభయంకరుడిని ఆవాహనం చేయాలి. ఓం యతఇంద్ర భయామహే తతోనో అభయం కృథి । మఘవన్ ఛగ్ధి తవతన్నఊతయే విద్విషో విమృతో జహి । స్వస్తిదా విశస్పతీర్వృత్రహా విమృధోవశీ । వృషేంద్రః పురఏతున స్స్వస్తిదా అభయంకరః ।। అభయంకర మావాహయామి స్థాపయామి పూజయామి. భార్య ఒక పుష్పముూ, అక్షతలను భర్తకి ఇవ్వాలి. భర్త అభయంకరునికి సమర్పిస్తూ ఆహ్వానించాలి. వాస్తు పురుషుడు: భూమికి అధిపతి. గృహానికి లేదా పూజా మండపానికి ఆధారమైన దైవము. విష్ణు స్వరూపుడైన వాస్తుపురుషుడిని ఆవాహనం చేయాలి. వాస్తోష్పతే ప్రతిజానీ హ్యస్మాన్ ధ్వా వేశో అనమీవోభవానః । యత్వేమహే ప్రతితన్నో జుషస్వ శంనఏధి ద్విపదే శంచతుష్పదే ।। భార్య ఒక పుష్పముూ, అక్షతలను భర్తకి ఇవ్వాలి. భర్త వాస్తుపురుషునికి సమర్పిస్తూ ఆహ్వానించాలి.

సపత్నీక త్రిమూర్తి దేవతారాధన

దంపతులిరువురూ ఒక పుష్పముూ, అక్షతలను త్రిమూర్తి దేవతలపై సమర్పించాలి. గ్రహ, నక్షత్ర శాంతి సమయములో మాత్రము శాంతి చేసుకొనేవారు సమర్పించాలి. సరస్వతీ/బ్రహ్మా: ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతీ । ధీనామవిత్ర్యవతు ।। బ్రహ్మా దేవానాం పదవీః కవీనామృషిర్విప్రాణాం మహిషో మృగాణామ్ । శ్యేనో గృధ్రాణాగ్ స్వధితిర్వనానాగ్ సోమః పవిత్రమత్యేతి రేభన్ ।। సరస్వతి సహిత బ్రహ్మమావాహయామి స్థాపయామి పూజయామి. లక్ష్మీ/విష్ణు: సక్తుమివ తితఉనా పునన్తో యత్రధీరా మనసా వాచ మక్రత । అత్రాసఖాయ స్సఖ్యాని జానతే భద్రైషాం లక్ష్మీర్నిహితాధివాచి ।। ఓం ఇదం విష్ణుర్వి చక్రమే త్రేధా నిదధే పదమ్ । సమూఢమస్య పాగ్ం సురే ।। లక్ష్మీ సహిత విష్ణుమావాహయామి స్థాపయామి పూజయామి గౌరీ/రుద్ర: గౌరీ మీమాయ సలిలాని తక్షత్యేక వది ద్విపదీ సా చతుష్పదీ । అష్టాపదీ నవపదీ బభూవుషీ సహస్రాక్షరా పరమే వ్యోమన్ ।। కద్రుద్రాయ ప్రచేతసే మీఢుష్టమాయ తవ్యసే । వోచేమ శంతమగ్ం హృదే ।। గౌరీ సహిత రుద్రమావాహయామి స్థాపయామి పూజయామి

పరివార దేవతారాధన

దంపతులిరువురూ ఒక పుష్పముూ, అక్షతలను దేవతలపై సమర్పించాలి. త్య్రంబకుడు: మృత్యు భయాన్ని పారద్రోలేవాడు, సంపూర్ణ ఆయురారోగ్యాలను ప్రసాదించేవాడు, సర్వ బంధనాల నుండి విముక్తిని కలిగించి మోక్షాన్ని కలిగించే దైవము, ముక్కంటి అయిన పరశివుడిని ఆవాహనం చేయాలి. త్య్రంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం ఉర్వారుక మివ బంధనా నృత్యో ర్ముక్షీయ మామృతాత్ మృత్యుంజయ దేవతామావాహయామి స్థాపయామి పూజయామి. అపమృత్యువు: అపమృత్యువుకి అధిదేవత, అకాల మరణ గండాలను తొలగించే దైవము. ఆకలి, దప్పుల బాధల నుండి విముక్తిని కలిగించేవాడు. రక్షణ కవచంలా నిలిచే దైవమైన పరమేశ్వరుడిని ఆవాహనం చేయాలి. అపమృత్యు మపక్షుధం, ఆపేతశ్శపధం జహి అధానో అగ్నఅవహ రాయస్పోషం సహశ్రిణం । ఏతే సహస్ర మయుతంపాశా: మృత్యో మర్వాయ హస్తవే । తాన్యజ్ఞస్య మాయయా సర్వానవ జామహే । మృత్యవే స్వాహా, మృత్యవే స్వాహా ।। అపమృత్యు దేవతామావాహయామి స్థాపయామి పూజయామి. మన్యు: శివుని ఉగ్ర స్వరూపమైన రుద్రుడే ఈ మాన్యువు. శత్రు సంహారక శక్తిని కలవాడు. శత్రువులపై ఉన్న భయాన్ని పారద్రోలి, శత్రుజయమూ, సంపదలు కలగడానికి ఈ దైవమును ఆవాహనం చేయాలి. సంసృష్టం ధన ముభయం సమాకృతమస్మభ్యం దత్తాం వరుణశ్చ మన్యు: । బియం దధానా హృదియేషు శత్రవః పరాజితాసో అపనిల యన్తాం ।। శత్రుఫలు మన్యుదేవతామావాహయామి స్థాపయామి పూజయామి. ధన్వంతరి: విష్ణు స్వరూపమూ, ఆయుర్వేదానికి అధిదేవత అయిన ఈ దేవతను శారీరక, మానసిక వ్యాధుల నుండి రక్షింపబడటానికి ఆవాహనం చేయాలి. ధన్వనాగా ధన్వనా జింజయేమ ధన్వనా తీవ్రాస్స మదోజయేమ । ధనుశ్శతోరపకామం కృణోతు ధన్వనా స్సర్వా: ప్రదిశోజయేమ ।। ధన్వంతరిమావాహయామి స్థాపయామి పూజయామి.
ప్రధాన కలశ పూజ(click to expand)

ప్రధాన కలశ పూజ

దంపతులిరువురూ అక్షతలను కలశముపై సమర్పించాలి. ఆవాహనం: అస్మిన్ కలశే ఓం భూర్భువస్సువః వరుణ మావాహయామి । ఓం భూర్భువస్సువః ఇంద్రాద్యష్టదిక్పాలక మావాహయామి । ఓం భూర్భువస్సువః ఆదిత్యాది నవగ్రహ దేవతా మావాహయామి మహా గణపతి మావాహయామి । ఓం భూర్భువస్సువః వాణీ హిరణ్య గర్భాభ్యాం మావాహయామి । ఓం భూర్భువస్సువః లక్ష్మీనారాయణమావాహయామి । ఓం భూర్భువస్సువః గౌరీశంకరమావాహయామి । ఓం భూర్భువస్సువః త్య్రంబకమావాహయామి । ఓం భూర్భువస్సువః అపమృత్యు దేవతా ఆవాహయామి । ఓం భూర్భువస్సువః మన్యు మావాహయామి । ఓం భూర్భువస్సువః ధన్వంతరి మావాహయామి । ఓం భూర్భువస్సువః వాస్తు పురుషమావాహయామి। ఓం భూర్భువస్సువః ఈశానమావాహయామి । ఓం భూర్భువస్సువః సర్వాన్ దేవానావాహయామిః । ఓం భూర్భువస్సువః కుల దేవతా ఆవాహయామి । ఓం భూర్భువస్సువః గ్రామా దేవత మావాహయామి । దర్భలు లేదా తమలపాకులు కలశముపై నుంచి ఈ క్రింది మంత్రం చెప్పాలి ఓం ఆకలశేషు ధావతి పవిత్రే పరిషిచ్యతే। ఉక్థైర్యజ్ఞేషు వర్ధతే। ఆపో వా ఇదగ్ం సర్వం విశ్వా భూతాన్యాపః। ప్రాణా వా ఆపః పశవ ఆపోఽన్నమాపోఽమృతమాపః। సమ్రాడాపో విరాడాపః స్వరాడాపశ్ఛందాగ్స్యాపో। జ్యోతీగ్ష్యాపో యజూగ్ష్యాపః సత్యమాపః। సర్వా దేవతా ఆపో భూర్భువః సువరాప ఓమ్।। గంగే చ యమునే చైవ గోదావరీ సరస్వతీ। నర్మదే సింధు కావేరీ జలేఽస్మిన్ సన్నిధిం కురు।। కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమీ। భాగీరథీతి విఖ్యాతాః పంచగంగాః ప్రకీర్తితాః।। 3 సార్లు ఓంకారమును ఉచ్చరించి దర్భలను కలశానికి కుడివైపుగానుంచాలి ఈ మంత్రం చదువుతూ సర్వదేవతలనూ ఆవాహనం చేసి షోడశోపచార పూజా చేయాలి హ్రీంకారాసన గర్భితానల శిఖాం సౌః క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రిణేత్రోజ్జ్వలామ్ । వందే పుస్తకపాశమంకుశ ధరాం స్రగ్భూషితాముజ్జ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పర కళాం శ్రీచక్రసంచారిణీమ్ ।। ఓం భూర్భువస్సువః ఆవాహితేభ్య సర్వేభ్యో దేవేభ్యః । ధ్యాయామి ధ్యానం సమర్పయామి। దేవతలను మనసులో ధ్యానించాలి ఆవాహయామి ఆవాహనం సమర్పయామి। దేవతలను కలశములోకి మనసారా ఆహ్వానించాలి రత్న సింహాసనార్డే అక్షతాన్ సమర్పయామి । కలశానికి అక్షతలు సమర్పించాలి పాద్యం సమర్పయామి ఆర్ఘ్యం సమర్పయామిః । పుష్పంతో కానీ లేదా ఉద్ధరణితో కానీ నీరు తీసుకొని కలశానికి చూపించి అర్ఘ్య పాత్రలో చల్లాలి/వదలాలి స్నానం సమర్పయామి । కలశంపై తమలపాకులతో జలమును చల్లాలి వస్త్రం యజ్ఞోపవీతార్థాన్ అక్షతాన్ సమర్పయామి । కలశంపై అక్షతలు సమర్పించాలి శ్రీగంధం ధారయామి । పుష్పంతో గంధం కలశానికి సమర్పించాలి కుంకుమం సమర్పయామి । కలశానికి కుంకుమ సమర్పించాలి పుష్పముాలాం సమర్పయామిః । కలశంపై పుష్పముాలా వేయాలి పరిమళ ద్రవ్యం సమర్పయామి। కలశంపై పన్నీరు చల్లాలి పుష్పైః పూజాయామి ఒక్కో నామము చదువుతూ విడిపూలు కలశముపై వేస్తూ ఉండాలి ఓం కేశవాయ నమః । ఓం నారాయణాయ నమః । ఓం మాధవాయ నమః । ఓం గోవిందాయ నమః । ఓం విష్ణవే నమః । ఓం మధుసూధనాయనమః। ఓం త్రివిక్రమాయ నమః । ఓం వామనాయ నమః । ఓం శ్రీధరాయ నమః । ఓం హృషీకేశాయ నమః । ఓం పద్మనాభాయ నమః । ఓం దామోదరాయ నమః । ఓం సంకర్ణణాయ నమ: । ఓం వాసుదేవాయ నమః। ఓం ప్రద్యుమ్నాయ నమః । ఓం అనిరుద్దాయ నమః । ఓం పురుషోత్తమాయ నమః ఓం అధోక్షజాయ నమః । ఓం నారసింహాయ నమః । ఓం అచ్యుతాయ నమః । ఓం జనార్ధనాయ నమః। ఓం ఉపేంద్రాయ నమః । ఓం హరయే నమః । ఓం శ్రీకృష్ణాయ నమః । ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః । ఆవాహితేభ్యస్సర్వేభ్యో దేవేభ్యః నానావిధ పరిమళ పుష్పాక్షతాంజలిం సమర్పయామి। కలశానికి అక్షతలు సమర్పించాలి ధూపమాఘ్రాపయామి । కలశానికి ధూపం సమర్పించాలి దీపం దర్శయామిః కలశానికి దీపం చూపించాలి ధూప దీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి । పుష్పముుతో నీటిని ధూపము దీపం చుట్టూ త్రిప్పాలి నైవేద్యం నివేదయామి । కలశానికి నైవేద్యం సమర్పించాలి నీరాజనమ్ దర్శయామి కలశానికి నీరాజనమ్ ఇవ్వాలి సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి । కలశానికి పుష్పం సమర్పించాలి కలశే ఆవాహితేభ్యస్సర్వేభ్యో దేవేభ్యో నమః । కలశానికి అక్షతలు సమర్పించాలి సర్వోపచార పూజాం సమర్పయామి కలశానికి నమస్కారం చేయాలి
శ్రీ సత్యనారాయణ స్వామి షోడశోపచార పూజ - Part-1 (click to expand)

శ్రీ సత్యనారాయణ స్వామి షోడశోపచార పూజ - Part-1

ఓం శివాయ గురవే నమః పరమగురవే నమః సద్గురవే నమః శ్రీ మహా గణాధిపతయే నమః శ్రీ మహా సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః హరిః ఓం । ధ్యానం ఓం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగమ్ । లక్ష్మీకాంతం కమలనయనం-యోఀగిహృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథమ్ ।। శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామినే నమః । ధ్యాయామి ధ్యానం సమర్పయామి। హృదయపూర్వకంగా శ్రీ సత్యనారాయణ స్వామివారికి నమస్కరించాలి. ఆవాహనం ఓం శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామినే నమః । ఆవాహయామి ఆవాహనం సమర్పయామి। శ్రీ సత్యనారాయణ స్వామివారికి పుష్పాక్షతలను సమర్పించి నమస్కరించాలి. ఆసనం ఓం శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామినే నమః । రత్న సింహాసనార్డే అక్షతాన్ సమర్పయామి । శ్రీ సత్యనారాయణ స్వామివారికి పుష్పాక్షతలను సమర్పించాలి. పాద్యం/ఆర్ఘ్యం/ఆచమనీయం ఓం శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామినే నమః । పాదయోః పాద్యం సమర్పయామి హస్తయోః ఆర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి । పుష్పంతో కానీ లేదా ఉద్ధరణితో కానీ నీరు తీసుకొని కలశానికి చూపించి అర్ఘ్య పాత్రలో చల్లాలి/వదలాలి పంచామృత స్నానం: ఓం శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామినే నమః । పంచామృత స్నానం త్వమంగీకురు | పంచామృత స్నాన విధానము - click here శుద్ధోదక స్నానం ఓం శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామినే నమః । శుద్ధోదక స్నానం సమర్పయామి । శ్రీ సత్యనారాయణ స్వామివారిపై తమలపాకులతో జలమును చల్లాలి. వస్త్రం/యజ్ఞోపవీతం ఓం శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామినే నమః । వస్త్రం యజ్ఞోపవీతార్థాన్ అక్షతాన్ సమర్పయామి । శ్రీ సత్యనారాయణ స్వామివారిపై అక్షతలు సమర్పించాలి. గంధం ఓం శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామినే నమః । శ్రీగంధం ధారయామి । పుష్పంతో గంధము శ్రీ సత్యనారాయణ స్వామివారిపై సమర్పించాలి. కుంకుమ ఓం శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామినే నమః । కుంకుమం సమర్పయామి । శ్రీ సత్యనారాయణ స్వామివారిపై కుంకుమ సమర్పించాలి. అథాంగ పూజా: [ఎడమచేతిలో అక్షింతలు తీసుకొని కుడి చేతితో మృగముద్రవేసి(బొటనవేలు,మధ్యవేలు, ఉంగరం వేలు కలిపితే అది మృగముద్ర అవుతుంది.) ఆ ఎడమ చేతిలోని అక్షింతలు ఒక్కోనామం చదువుతూ శ్రీ సత్యనారాయణ స్వామి వారిపై వేస్తూ ఉండాలి. ఓం కేశవాయ నమః ‐ పాదౌ పూజయామి। పాదాలపై సమర్పించాలి. ఓం గోవిందాయ నమః ‐ గుల్ఫౌ పూజయామి। మడిమలపై సమర్పించాలి. ఓం ఇందిరాపతయే నమః ‐ జంఘే పూజయామి। పిక్కలపై సమర్పించాలి. ఓం అనఘాయ నమః ‐ జానునీ పూజయామి। మోకాళ్లపై సమర్పించాలి. ఓం జనార్దనాయ నమః ‐ ఊరూ పూజయామి। తొడలపై సమర్పించాలి. ఓం విష్టరశ్రవసే నమః ‐ కటిం పూజయామి। నడుముపై సమర్పించాలి. ఓం కుక్షిస్థాఖిలభువనాయ నమః ‐ ఉదరం పూజయామి। కడుపుపై సమర్పించాలి. ఓం పద్మనాభాయ నమః ‐ నాభిం పూజయామి। నాభిపై సమర్పించాలి. ఓం లక్ష్మీవక్షస్స్థలాలయాయ నమః ‐ హృదయం పూజయామి। హృదయంపై సమర్పించాలి. ఓం శంఖచక్రగదాశార్ఙ్గపాణయే నమః ‐బాహూన్ పూజయామి। భుజాలపై సమర్పించాలి. ఓం కంబుకంఠాయ నమః ‐ కంఠం పూజయామి। కంఠంపై సమర్పించాలి. ఓం స్కందాగ్రజాయ నమః ‐స్కందౌ పూజయామి। భుజాలపై సమర్పించాలి. ఓం పూర్ణేందునిభవక్త్రాయ నమః ‐ వక్త్రం పూజయామి। ముఖముపై సమర్పించాలి. ఓం కుందకుట్మలదంతాయ నమః ‐ నాసికాం పూజయామి। ముక్కుపై సమర్పించాలి. ఓం సూర్యచంద్రాగ్నిధారిణే నమః ‐ నేత్రౌ పూజయామి। కళ్లపై సమర్పించాలి. ఓం రత్నకుండలాయ నమః ‐ కర్ణౌ పూజయామి। చెవులపై సమర్పించాలి. ఓం సులలాటాయ నమః ‐ లలాటం పూజయామి। నుదురుపై సమర్పించాలి. ఓం సహస్రశిరసే నమః ‐ శిరః పూజయామి। శిరస్సుపై సమర్పించాలి. శ్రీ రమాసహిత శ్రీ సత్యనారాయణ స్వామినే నమః ‐ సర్వాణ్యంగాని పూజయామి। ఎడమచేతిలో ఉన్న మిగిలిన అక్షింతలను శ్రీ సత్యనారాయణ స్వామి వారిపై సమర్పించాలి. పుష్పసమర్పణం ఓం శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామినే నమః । పుష్పైః పూజయామి। ఇప్పుడు శ్రీ సత్యనారాయణ స్వామి అష్టోత్తర శతనామములతో స్వామివారి ప్రతిమకు లేదా ఫోటోకు పుష్పార్చన చేయాలి. ఓం శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామినే నమః । అలంకరణార్ధే అక్షతాన్ సమర్పయామి । నానావిధ పరిమళ పుష్పాక్షతాంజలిం సమర్పయామి। శ్రీ సత్యనారాయణ స్వామివారిపై అక్షతలు వేయాలి. ధూపం: ఓం శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామినే నమః । ధూపమాఘ్రాపయామి । శ్రీ సత్యనారాయణ స్వామివారికి ధూపం సమర్పించాలి. దీపం: ఓం శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామినే నమః । దీపం దర్శయామిః శ్రీ సత్యనారాయణ స్వామివారికి దీపం చూపించాలి. ధూప దీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి । పుష్పముుతో నీటిని ధూపము దీపం చుట్టూ త్రిప్పాలి. నైవేద్యం: ఓం శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామినే నమః । యథాశక్తి (నారికేళ, కదళీ, ఖర్జూర, జంబూఫల, ద్రాక్ష, పనస, కపి, వివిధ ఫల శర్కరాన్) నైవేద్యం సమర్పయామి। మధ్యేమధ్యేపానీయం సమర్పయామి। ఉత్తరాపోశనం సమర్పయామిః హస్తా ప్రక్షాళయామి। పాదౌ ప్రక్షాళయామి। శుద్ధాచమనీయం సమర్పయామి। (మహా) మీ శక్తికొలది నైవేద్యం నివేదయామి ।। శ్రీ సత్యనారాయణ స్వామివారికి నైవేద్యం సమర్పించాలి తాంబూలం: ఓం శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామినే నమః । తాంబూలం సమర్పయామి। శ్రీ సత్యనారాయణ స్వామివారికి తాంబూలం సమర్పించాలి నీరాజనమ్: ఓం శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామినే నమః । నీరాజనమ్ దర్శయామి। నీరాజనానంతరం శుద్దాచమనీయం సమర్పయామి। శ్రీ సత్యనారాయణ స్వామివారికి హారతిని వెలిగించి చూపించాలి. పుష్పముుతో నీటిని హారతి చుట్టూ త్రిప్పాలి.తదుపరి హారతిని స్వీకరించాలి.
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతకథ (click to expand) ఇప్పుడు స్వామి వారి 5 కథలను భక్తితో శ్రవణం చేయాలి. ఒక పుష్పముూ, అక్షతలను చేతిలోకి తీసుకొని 'నారాయణ నారాయణ' అని స్మరిస్తూ కథా శ్రవణం చేయాలి. కథ పూర్తయిన తర్వాత చేతిలోని అక్షతలను సమర్పించాలి. పిదప కొబ్బరికాయ కొట్టి, అగర్బత్తీలు చూపించి, ఫలములు నివేదించి స్వామివారికి హారతి ఇవ్వాలి. ఇలా ప్రతికథకు చేయాలి.
తదంగ కథా ప్రారంభః ।

అథ ప్రథమోఽధ్యాయః

శ్లోకం: ఏకదా నైమిషారణ్యే ఋషయః శౌనకాదయః । పప్రచ్ఛుర్మునయః సర్వే సూతం పౌరాణికం ఖలు ।। శ్రీ సత్యనారాయణ వ్రతకథ - ప్రథమాధ్యాయము

పూర్వాకాలమందు నైమిషారణ్యంలో సూతమహాముని తన యొక్క శిష్యులైన శౌనకాది మహామునులకు అనేక ధర్మములను శాస్త్రములను బోధిస్తున్న సమయములో మునులందరూ పురాణ ప్రవక్త అయిన సూత మహర్షి వారిని, "మహామునీ! ఏ వ్రతం చేయడం వలన మానవులు తాము కోరుకున్న ఫలితాలను పొందగలరు? దయచేసి మాకు వివరించండి." అని అడిగారు. అప్పుడు సూత మహర్షి వారు అన్నారు. "పూర్వం నారదులవారు భగవన్నామస్మరణ చేస్తూ త్రిలోక సంచారం చేసుకుంటూ స్వర్గ లోకము నుండి మానవ లోకానికి వచ్చినారు. అప్పుడు మనుష్యులంతా నానా పాపములు చేస్తూ ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఉండడం చూసారు. అట్టి మానవులను చుడి నారదులవారికి విచారం కలిగింది. మానవ జన్మ రావడం మహా దుర్లభమని పంచమ జన్మ వచ్చినందుకు పుణ్యం సంపాదించి భగవదారాధన చేసి మోక్షము పొందాలి కానీ ఇలా ఎన్నో కష్టాలు అనుభవించడం ఏమిటి! అని ఆలోచించ సాగరు. దీనికి సమాధానం తనకు వైకుంఠములోనే లభించవచ్చునని తలచి వైకుంఠానికి బయలుదేరినాడు. అక్కడ శ్రీమన్నారాయణుడు శంఖ చక్ర గదా పద్మ ముఖుడై తులసి హారమును ధరించి లక్ష్మి సమేతుడై దేదీప్య మానముగా ప్రకాశిస్తున్నారు, ఆ నారాయణమూర్తిని చూసి నారదులవారు "మనస్సుకి, వాక్కుకి అందనట్టి రూపం కలవాడా! అనంత శక్తివంతుడా! ఆది, మధ్య, అంత్యములు లేనివాడా! నిర్గుణ నిరంజనా సచ్చిదానంద! భక్తుల కష్టాలను తీర్చే నీకు నా శతకోటి ప్రణామములు." అని స్తుతించాడు. ఆ స్తోత్రమునకు ప్రసన్నుడైన మహావిష్ణువు, "నారదా! నీ ముఖములో విచారము కనిపిస్తోంది. నీ రాకకు కారణమూ ఏమిటి?" అని అడిగాడు. అప్పుడు నారదులవారు "స్వామీ! భూలోకంలోని జనులు అనేక పాపకర్మల వల్ల నానా కష్టాలు అనుభవిస్తున్నారు, జనన-మరణమనే చక్రములో తిరుగుతూ ఉన్నారు. వారి దుఃఖములనును నివారించే సులభమైన ఉపాయాన్ని (లఘూపాయం) కృపతో వివరించండి." అని వేడుకున్నాడు." ఇది విన్న ఆ శ్రీహరి చిరునవ్వుతో "నారదా! నీవు నీకొరకు కాకుండా నిష్కామ బుద్ధితో లోకోపకారం కోసం మంచి ప్రశ్న అడిగావు. స్వర్గంలోనూ, భూలోకంలోనూ అత్యంత దుర్లభమైన, అనంత పుణ్యాన్ని కలిగించే ఒక వ్రతం ఉంది. అదే 'శ్రీ సత్యనారాయణ వ్రతము'. దీన్ని విధివిధానంగా ఆచరిస్తే మనిషి ఈ లోకంలో సుఖాలను అనుభవించి, పరలోకంలో మోక్షాన్ని పొందుతాడు. "అన్నారు. అప్పుడు నారదులవారు "దేవాదిదేవ ! ఈ వ్రత విధానమేమిటి? వ్రత ఫలం ఏమిటి? ఇదివరకు ఈ వ్రతాన్ని ఎవరు ఆచరించారు? దీనిని ఏ సమయంలో చేయాలి?" అని అడిగాడు. అప్పుడు ఆ మహావిష్ణువు ఇలా వివరించాడు: " నారదా! నీ మీద నాకున్న ప్రేమతో దాని విధి విధానాలను చెబుతున్నాను విను. ఈ వ్రతం దుఃఖాన్ని, శోకాన్ని తొలగించి మనశ్శాన్తిని ప్రసాదిస్తుంది. సర్వ కామితములను నెరవేరుస్తుంది. సంతానం కోరినవారికి సంతానం కలిగిస్తుంది. ధనధాన్యాలను వృద్ధి చేస్తుంది. సౌభాగ్యాన్ని, ప్రసాదిస్తుంది. సర్వ కార్యములలో విజయమును కలిగేలా చేస్తుంది. ఎవరు ఏది కోరితే అది సఫలమవుతుంది. ఈ వ్రతానికి కావలసింది భక్తి శ్రద్ధలు మాత్రమే. ఇక ఈ వ్రతమును ఏ రోజైనా సరే చేయవచ్చును. ఏకాదశి, పౌర్ణమి సంక్రమణ సమయములలో చేయవచ్చును. ఉదయమే లేచి తలస్నానం చేసి ఈ వ్రతమును ఆచరించాలి. ఉదయం, చేయలేని వారు సాయంకాలమున (ప్రదోష కాలం) చేయవచ్చును. బ్రాహ్మణులతో, బంధుమిత్రులతో కలిసి భక్తితో సత్యనారాయణ స్వామిని పూజించాలి. సత్యనారాయస్వామిని పీఠం పై నుంచి, కలశమును (రాగి, లేదా వెండి, లేదా ఇత్తడి) స్థాపించి, గణపతిని పూజించి స్వామి వారి అంగ దేవతలైన , నవగ్రహాలను, పంచలోకపాకులను, అష్టదిక్పాలకులు ఆవాహనం చేసి, స్వామివారికి పంచామృత స్నానం చేయించి షోడశీపచారా పూజ చేసి, కొబ్బరికాయలు అరటిపండ్లు, రవ్వ (లేదా గోధుమ పిండి).పంచదార వీటన్నింటిని కలిపి 'సపాదం' (అంటే ఒకటింపావు వంతు - ఉదాహరణకు 1 1/4 కిలో లేదా 1 1/4 కుంచం) పరిమాణంలో ప్రసాదాన్ని తయారుచేసి భగవంతునికి నైవేద్యంగా సమర్పించాలి. పూజానంతరం వ్రాత కథలను శ్రవణం చేసి, ప్రసాదాన్ని భక్తితో స్వీకరించి, బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాదులిచ్చి బంధువులతో కలిసి విందుభోజనం చేయాలి. భజనలతో స్వామిని స్మరిస్తూ రోజంతా గడపాలి. ఇలా చేస్తే మనుషుల కోరికలన్నీ తప్పక నెరవేరుతాయి. ముఖ్యంగా ఈ కలియుగంలో కష్టాల నుండి గట్టెక్కడానికి ఇది అత్యంత సులభమైన మార్గం." అని ఆ మహావిష్ణువు నారదులవారికి చెప్పినదాని సూతులవారు శౌనకాది మహామునులకు చెప్పినారు. ఇతి శ్రీస్కాందపురాణే రేవాఖండే శ్రీసత్యనారాయణ వ్రతకథాయాం ప్రథమోఽధ్యాయః ।।

అథ ద్వితీయోఽధ్యాయః

శ్లోకం: అథాన్యత్ సంప్రవక్ష్యామి కృతం-యేఀన పురా ద్విజాః । కశ్చిత్ కాశీపురే రమ్యే హ్యాసీద్విప్రోఽతినిర్ధనః ।। శ్రీ సత్యనారాయణ వ్రతకథ - ద్వితీయోధ్యాయము

సూత మహర్షి వారు శౌనకాది మహా మునులతో ఇలా అన్నారు: "ఓ మునులారా! పూర్వం ఈ వ్రతాన్ని ఎవరు ఆచరించి తరించారో వివరిస్తాను వినండి. పూర్వాకాలమందు కాశీ పట్టణంలో శతానందుడనే పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి నలుగురు కుమారులు నలుగురు కుమార్తెలు. రోజు భిక్షాటనకై తిరుగుతూ భార్యా పిల్లలను పోషించలేక తీవ్ర దుఃఖమును అనుభవిస్తుండేవాడు తీవ్రమైన ఆకలి దప్పులతో అలమటిస్తూ, ప్రతిరోజూ భిక్షాటన చేస్తూ తిరిగేవాడు.అతని బాధను చుసిన శ్రీ మహావిష్ణువు జాలిపడి, ఒక ముసలి బ్రాహ్మణుడి రూపముగా ప్రత్యక్షమై, "బ్రాహ్మణుడా! నీవు ఎందుకు దుఃఖిస్తున్నావు. నీ దుఃఖానికి కారణమేమిటి?" అని అడిగాడు. అప్పుడు ఆ పేద బ్రాహ్మణుడు "స్వామీ! నేను చాలా పేదవాడిని, దారిద్రముతో బాధపడుతున్నాను. ఈ దరిద్రము పోయే మార్గమే లేదా!" అని వేడుకున్నాడు. అప్పుడు వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఉన్న విష్ణువు "సర్వ కమితులను నెరవేర్చే సత్యనారాయణ స్వామి వ్రతము ఉన్నది. నీవు దానిని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే నీ దరిద్రము పోయి అష్టైశ్వరాయం కలుగుతుంది. నువ్వు ఆ స్వామి వ్రతాన్ని ఆచరించు." అని వ్రత విధానాన్ని వివరించి, మహావిష్ణువు అక్కడికక్కడే అంతర్థానమయ్యాడు. ఆ మాటలు విన్న శతానందుడు రాత్రంతా నిద్రించకుండా దాని గురించే ఆలోచిస్తూ ఉదయాన్నే భిక్షాటనకు బయలుదేరాడు. ఆశ్చర్యముగా రోజు కన్నా ఎక్కువ ద్రవ్యం లభించింది. ఆ ధనంతో అతను తన బంధువులను పిలిచి భక్తితో వ్రతం ఆచరించాడు. ఆ వ్రత ప్రభావంతో అతను దరిద్రం నుండి విముక్తుడై, సకల సంపదలను పొందాడు. అప్పటి నుండి ఆ బ్రాహ్మణుడు ప్రతి నెల ఈ వ్రతాన్ని చేయడం ప్రారంభించాడు. చివరికి అతను అన్ని పాపాల నుండి విముక్తుడై మోక్షాన్ని పొందాడు. దుర్లభమైనటువంటి ఈ వ్రతం ఈ భూమిపై ఎవరు చేసినా వారి దుఃఖాలన్నీ నశిస్తాయి. అంటూ సూత మహర్షి వారు, "ఓ మునులారా! శ్రీహరి నారదుడికి చెప్పిన ఈ వ్రత విశేషాలను మీకు వివరించాను. ఇంకా ఏమి వినాలనుకుంటున్నారు?" అని అడిగారు. మునులు "ఆ బ్రాహ్మణుడి ద్వారా ఈ వ్రతం భూమిపై ఇంకా ఎవరికి తెలిసింది?" అని అడగగా సూత మహర్షి ఇలా చెప్పారు: "ఒకరోజు ఆ బ్రాహ్మణుడు తన బంధువులతో కలిసి వ్రతం చేస్తుండగా, ఒక కట్టెలమ్మే వ్యక్తి అక్కడికి వచ్చాడు. దాహంతో ఉన్న అతను కట్టెల మోపును బయట పెట్టి, బ్రాహ్మణుని ఇంటిలోకి వెళ్లి వ్రతాన్ని చూశాడు. బ్రాహ్మణునికి నమస్కరించి "స్వామీ! ఇది ఏమి వ్రతము? ఎందుకు చేస్తున్నారు? ఈ వ్రత ఫలమేమిటి?" అని అడిగాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, "ఇది సత్యనారాయణ స్వామి వ్రతం. ఈ వ్రతము చేస్తే కోరిన కోరికలన్నీ తీరుతాయి. ఈ స్వామి అనుగ్రహం వలననే నాకు ఈ ధనధాన్యాలన్నీ లభించాయి." అన్నాడు. అది విని కట్టెలమ్మే వ్యక్తి ఎంతో సంతోషించి, "నేను కూడా పేదవాడిని, నా దగ్గర కూడా ధనం లేదు. ఈ కట్టెలమ్మితే ఎంత ధనం లభిస్తుందో అంత ద్రవ్యం పెట్టి ఈ వ్రతం చేస్తానని సంకల్పించి సత్యదేవునికి నమస్కారం చేసి, ప్రసాదాన్ని స్వీకరించి సంతకు బయలుదేరినాడు. అప్పుడు ఆ సత్యదేవుడు కరుణించి అతని కట్టెలను గంధపు చెక్కలుగా మార్చినాడు. ఆ గంధపు చెక్కల సువాసనకు వీధిలోని జనమంతా అక్కడికి చేరుకొని అయన దగ్గర కట్టెలు కొన్నారు. అనుకున్న దానికంటే రెట్టింపు ధనం లభించింది. ఇదంతా ఆ సత్యనారాయణ స్వామి లీలా విలాసమని మనసులో ఆ దైవాన్ని తలచుకొని సంతోషముతో అరటిపండ్లు, పంచదార, నెయ్యి, పాలు, గోధుమపిండి కొనుగోలు చేసి, ఇంటికి చేరి, బంధువులను పిలిచి విధివిధానంగా వ్రతం ఆచరించాడు. ఆ వ్రత ప్రభావంతో అతను కూడా ధనవంతుడై, పుత్రులను పొంది, ఇహలోకంలో సుఖాలను అనుభవించి అంత్యమందు సత్యనారాయణపురం చేరినాడని సూతులవారు శౌనకాది మహామునులకు చెప్పినారు. కథ సారాంశం:ఈ రెండో అధ్యాయం ద్వారా మనకు తెలిసేది ఏమిటంటే, భక్తితోమనం ఏదైనా సంకల్పిస్తే భగవంతుడే మనకు మార్గదర్శకుడౌతాడు. ఇందుకు ఉదాహరణ, ఈ కథలోని పేద బ్రాహ్మణుడు మరియు కట్టెలమ్మే వ్యక్తి యొక్క వృత్తాంతములు. ఇతి శ్రీస్కాందపురాణే రేవాఖండే శ్రీసత్యనారాయణ వ్రతకథాయాం ద్వితీయోఽధ్యాయః ।।

అథ తృతీయోఽధ్యాయః

శ్లోకం: పునరగ్రే ప్రవక్ష్యామి శ‍ఋణుధ్వం ముని సత్తమాః । పురా చోల్కాముఖో నామ నృపశ్చాసీన్మహామతిః ।। శ్రీ సత్యనారాయణ వ్రతకథ - తృతీయోధ్యాయము

సూతమహర్షి వారు ఇంకా చెబుతున్నారు. పూర్వాకాలమందు ఉల్కాముఖుడనే రాజు ఉండేవాడు. ఆటను మహాధర్మాత్ముడు. ఎన్నో దానాలు దేవతలా పూజలు చేస్తుండేవాడు. కానీ అతనికి సంతానం కలగలేదు. ఆయన ఒక దినమున తన భార్యతో కలిసి భద్రశీల నదీతీరంలో సంతానం గురించి సత్యనారాయణ స్వామి వ్రతమును ఆచరిస్తుండగా, అక్కడికి సాధు అనే వర్తకుడు పడవ నిండా ధనముతో, వజ్రవైడూర్యములతో తన పడవ లో వ్యాపార నిమిత్తం వెళుతూ అక్కడ రాజుగారు ఏదో పూజ చేస్తుండడము చూసి ఆగాడు. ఆ వర్తకుడు రాజును చూసి, "రాజా! మీరు భక్తితో చేస్తున్న ఈ వ్రతం ఏమిటి?" అని అడిగాడు. అప్పుడు ఆ రాజుగారు, "ఇది సత్యనారాయణ స్వామి వ్రతము. నాకు సంతాన ప్రాప్తి కలగాలని ఈ వ్రతము చేస్తున్నాని చెప్పారు. అది విన్న వర్తకుడు, "నాకు కూడా సంతానం లేదు, నాకు సంతానం కలిగితే ఈ వ్రతం చేస్తాను" అని మొక్కుకొని, ఆ రోజు ఇంకా వ్యాపారానికి స్వస్తి చెప్పి, ఇంటికి వెళ్లి తన భార్య లీలావతికి ఈ విషయం చెప్పాడు. భార్య కూడా సంతోషముగా స్వామి వారికి మొక్కుకున్నది. సత్యదేవుని అనుగ్రహంతో లీలావతి గర్భం దాల్చి ఒక ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఆమెకు 'కళావతి ' అని నామకరణము చేసారు. ఒకరోజు లీలావతి వ్రతం గురించి తన భర్తకు గుర్తు చేయగా, ఆ వర్తకుడు "మొగపిల్లవాడు పుట్టలేదు కదా! ఆడపిల్ల పుట్టిందికాదా అనే ఆలోచనతో అమ్మాయి పెళ్ళి సమయంలో చేస్తానులే" అని చెప్పి వ్యాపారానికి వెళ్ళిపోయాడు. కళావతికి పెళ్లి వయసుకోచ్చింది. ఇల్లరికం ఉండే అల్లుడి కొరకు వెతుకుతూ కంచిమహాపురములో ఒక మంచి అబ్బాయి ఉన్నాడని తెలిసి, ఆ అబ్బాయి గుణగణాలు తెలుసుకొని, ఒక మంచి ముహూర్తము చూసి, తన కూతురిని ఇచ్చి వివాహము జరిపించాడు. వివాహ సమయములో భార్య భర్తలిద్దరూ సత్యనారాయణ స్వామి వ్రతమును పూర్తిగా మరిచిపోయినారు. కొన్నాళ్లకు వర్తకుడు తన అల్లుడితో కలిసి వ్యాపార నిమిత్తము చంద్రకేతు మహారాజు పరిపాలించే రత్నసానుపురానికి బయలుదేరాడు. నా వ్రతము సంతానము కలగగానే చేస్తానన్నాడు, అప్పుడూ చేయలేదు. వివాహమప్పుడు చేస్తానన్నాడు అప్పుడూ చేయలేదు. ఇలా రెండు మార్లు అబద్దమాడి, చేసిన ప్రతిజ్ఞను ఉల్లగించినందుకు వీడికి పెద్ద దుఃఖము కలగాలని సత్యనారాయణ స్వామి శపించాడు. ఆ శాప వశాన ఒకరోజు రాజుగారి ఇంట్లో దొంగలుపడి సొమ్మంతా అపహరించినారు. అది చుసిన రాజు గారి భటులు దొంగలను వెంబడించారు. ఆ దొంగలు, రాజభటులు వస్తున్నారని భయపడి, దొంగిలించిన ధనాన్ని ఈ వర్తకులు ఉన్న చోట పడేసి పారిపోయారు. రాజభటులు వచ్చి ధనాన్ని చూసి, ఈ వర్తకులే దొంగతనము చేసారని భావించి వారిని బంధించి రాజుగారి ముందు ప్రవేశపెట్టారు. రాజుగారు విచారణ చేయకుండానే వారిని కారాగారంలో పడేశాడు. వారి వద్ద ఉన్న ధనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నాడు. సత్యదేవుని మాయ వల్ల ఎవరు మామాఅల్లుడి మాట ఎవరూ వినలేదు. ఇక్కడ వీరు కారాగారంలో కష్టపడుతుంటే అక్కడ వర్తకుడి ఇంట్లో దొంగలు పడి సొమ్మంతా దోచుకొని పోయినారు. తినడానికి ఆహారము లేక తల్లి బిడ్డలు రోజు వీధిలో భిక్షాటనకై తిరుగుతున్నారు. ఒకరోజు కళావతి ఒకరింట్లో సత్యనారాయణ స్వామి వ్రతము జరుగుతుంటే వ్రతము అయినంతవరకూ ఉంది తీర్థప్రసాదము స్వీకరించి, తల్లికి కూడా తీర్థ ప్రసాదమును తీసుకొని ఇంటికి వచ్చేసరికి జామురాత్రి అయినది. కళావతి చెప్పేది వినకుండా ఆలస్యముగా వచ్చినందుకు నానా మాటలు అనింది లీలావతి. అప్పుడు ఆ కళావతి, " అమ్మా! నేను ఒకరింట్లో సత్యనారాయణ స్వామి వ్రతము జరుగుతుంటే చూసి తీర్థ ప్రసాదము తీసుకొని నీకు కూడా తీర్థ ప్రసాదము తీసుకొని వచ్చాను." అని తల్లికి కూడా తీర్థ ప్రసాదము ఇచ్చింది. అప్పుడు ఆ తల్లికి గుర్తుకు వచ్చింది. “నా భర్త స్వామి వారి వ్రతము చేస్తానని చెప్పి మరిచినందుకు మాకు ఇంత దుఃఖము కలిగినట్లున్నది” అని మనసులో తన భర్తను క్షమించమని, తన భర్త అల్లుడు క్షేమముగా తిరిగివస్తే నీ వ్రతము చేస్తానని సంకల్పించి తీర్థ ప్రసాదమును స్వీకరించింది. లీలావతి సంకల్పానికి కరిగిన సత్యదేవుడు అదే రాత్రి చంద్రకేతు మహారాజు స్వప్నములో కనిపించి,"ఆ వర్తకులు దొంగలు కారు, వారిని వెంటనే విడిచిపెట్టు. వారి వద్ద నీవు తీసుకున్న ధనం కన్నా రెట్టింపు దానం ఇచ్చి వారిని గౌరవంగా పంపించు. లేదంటే నీ రాజ్యం అంతా నాశనం చేస్తాను. " అని హెచ్చరించాడు. మరుసటి రోజు ఉదయం రాజుగారు సభలో వర్తకులను పిలిపించాడు. తన స్వప్న వృత్తాంతమంతా చెప్పి, వారికి క్షౌరకర్మలు చేయించి, కొత్త వస్త్రాలు, ఆభరణాలు ఇచ్చి గౌరవించాడు. వారు కోల్పోయిన ధనానికి రెట్టింపు ధనాన్ని ఇచ్చి, సగౌరవంగా వారిని ఊరికి సాగనంపినాడు. వర్తకులు రాజుగారిచ్చిన ధనమును తీసుకొని సంతోషముగా ఇంటికి ప్రయాణమయ్యారని సూతులవారు శౌనకాది మునులకు చెప్పినారు. కథ సారాంశం:భగవంతుడికి మొక్కుకుని మరిచిపోవడం (ప్రతిజ్ఞా భంగం) కష్టాలకు దారి తీస్తుంది. కానీ పశ్చాత్తాపంతో తిరిగి భక్తితో ప్రార్థిస్తే స్వామి కరుణిస్తాడని ఈ అధ్యాయం బోధిస్తుంది. ఇతి శ్రీస్కాంద పురాణే రేవాఖండే శ్రీసత్యనారాయణ వ్రతకథాయాం తృతీయోఽధ్యాయః ।।

అథ చతుర్థోఽధ్యాయః

శ్లోకం: యాత్రాం తు కృతవాన్ సాధుర్మంగలాయనపూర్వికామ్ । బ్రాహ్మణేభ్యో ధనం దత్త్వా తదా తు నగరం-యఀయౌ ।। శ్రీ సత్యనారాయణ వ్రతకథ - చతుర్థోఽధ్యాయము

పూర్వాకాలమందు ఇదే షావుకార్లు రాజుగారి ఆజ్ఞ తీసుకొని, రాజుగారిచ్చిన ధనము కన్నా రెట్టింపు ధనము తీసుకొని పడవలో తిరుగుప్రయాణము అయ్యారు. వేళ్ళు ఇప్పటికైనా నన్ను తేలుస్తారా లేదా అని సత్యనారాయణ స్వామి పరీక్షించదలచి ఒక సన్యాసి రూపములో వాళ్ళముందు ప్రత్యక్షమై "ఓ వర్తకుడా! మీ పడవలో ఏముంది?" అని అడిగాడు. అప్పుడు ఆ వర్తకుడు వెకిలినవ్వు నవ్వి , "ఓ సన్యాసి! మా పడవలో ఏముంటే నీకెందుకు? మా ధనాన్ని దొంగిలించాలనుకుంటున్నావా? ఇందులో ఏమీ లేదు, కేవలం ఆకులు, అలములు మాత్రమే ఉన్నాయి" అని అబద్ధం చెప్పాడు. అప్పుడు స్వామి "తధాస్తు" అని చెప్పి అక్కడి నుండి అంతర్ధానమయ్యాడు. కాసేపటికి సన్యాసి వెళ్ళిపోయాక, పడవంతా తెలీకవ్వడంతో వర్తకుడు పడవలోకి వెళ్లి చూడగా అందులో ఆకులు, అలములు తప్ప ఏమి లేకపోవడముతో ఆ షౌకారికి స్పృహతప్పినంత పని అయ్యింది. అప్పుడు అతని అల్లుడు "మామ! ఇది ఆ సన్యాసి శాపం వల్లనే జరిగింది. అయన మహాత్ముడు. మనం ఆయనతో అబ్బడం ఆడినందుకు ఈ విధముగా జరిగింది. మహాత్ములకు చాల దయ ఉంటుంది. ఇప్పుడు మనం వెళ్లి ఆయనను శరణు వెడితే మన ధనం మనకిస్తాడు." అని అన్నాడు. మామ అల్లుళ్లిరువురూ వెంటనే ఆ సన్యాసిని వెతుకుతూ దూరముగా ఒక మర్రి చెట్టు క్రింద సన్యాసి ఉండడం చూసి, అయన దగ్గరకు వెళ్లి, ఆయన పాదాలపై పడి "స్వామీ! మేము చేసిన అపరాదాన్ని క్షమించండి" అని వేడుకున్నాడు. అప్పటివరకు సన్యాసి వేషములో ఉన్న స్వామి, తన స్వస్వరూపాన్ని ధరించి షౌకారితో "నువ్వు నా వ్రతాన్ని నిర్లక్ష్యం చేశావు, అబద్ధం చెప్పావు. అందుకే నీకు ఈ విధముగా దుఃఖమును కలిగించును" అని అన్నాడు. అప్పుడు ఆ వర్తకుడు స్వామిని "దేవదేవా! ఒక్కోసారి బ్రహ్మాది దేవతలే మిమ్ములను సంపూర్ణముగా గ్రహించలేక మాయ మోహితలవుతారు. అల్పుడనైనన నేను ఎంతా? అని నానా విధాలుగా స్తుతించి, ఇప్పుడే ఇక్కడే భక్తితో నీ వ్రతం చేస్తాను" అని మొక్కుకున్నాడు. ఈ మాటలు విన్న సత్యదేవుడు కరుణించి, తిరిగి ఆ పడవను ధనంతో నింపాడు. మామా అల్లుళ్లిద్దరూ సంతోషంగా తమ నగరానికి ప్రయాణమయ్యారు . తాము పట్టణానికి చేరువలో ఉండగా తన బంటుని ఇంటికి పంపాడు. ఆ సమయంలో లీలావతి, కళావతి ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేస్తున్నారు. భర్త, అల్లుడు వచ్చారన్న వార్త వినగానే లీలావతి ఎంతో సంతోషించి, పూజ పూర్తి చేసి తీర్థ ప్రసాదం తీసుకొని త్వరగా రమ్మని తన కూతురు కళావతితో చెప్పి నదితీరానికి పరిగెత్తింది. కళావతి తీర్థప్రసాదం తినకుండానే తన తండ్రిని, భర్తను చూడాలనే ఆత్రుతతో నదితీరానికి ప్రయాణమైంది. దీనివలన సత్యనారాయణ స్వామికి కోపం వచ్చి, ఆమె భర్త ఉన్న పడవను ధనంతో సహా నీటిలో మునిగేలా చేసాడు. పడవ కనిపించకపోవడంతో షావుకారు, లీలావతి కంగారు పడ్డారు. కళావతి తన భర్త కనిపించకపోయేసరికి దుఃఖంతో తీవ్రముగా శోకించింది. తన అల్లుడు మునిగిపోవడం చూసి షావుకారు "ఇదంతా స్వామి మాయ" అని గ్రహించి తిరిగి ప్రార్థించాడు. అప్పుడు స్వామి అశరీరవాణిగా, "ఇంట్లో నీ భార్య, కూతురు భక్తిశ్రద్ధలతో వ్రతము చేసారు. నీ భార్య లీలావతి తీర్థప్రసాదము తిని నదితీరానికి వచ్చింది. కళావతి తీర్థ ప్రసాదము తినకుండానే వచ్చినందుకు ఆమెకు ఇలా జరిగింది. ఇప్పుడు ఆమె వెళ్లి ప్రసాదము స్వీకరించి వస్తే ఆమె భర్త, పడవతో క్షేమంగా తిరిగి వస్తాడు." అని పలికాడు. ఈ విషయం షావుకారు తన కూతురితో చెప్పగానే కళావతి వెంటనే ఇంటికి వెళ్లి, భక్తితో ప్రసాదాన్ని స్వీకరించి తిరిగి వచ్చింది. అప్పుడు అందరు ఆశ్చర్యపడేలా ఆమె భర్త, ఓడ క్షేమంగా నీటి పైకి తేలింది. నదితీరానికి వచ్చింది. షావుకారు చాల సంతోషించి అప్పటికప్పుడే, అక్కడిక్కడే, సత్యనారాయణ స్వామి వ్రతము చేసి తమ ఇంటికి చేరుకొని మరునాడు ఉదయమే భక్తిశ్రద్ధలతో వ్రతము చేసాడు. ఇలా ప్రతి నెలా పౌర్ణమికొకసారి, సంక్రాంతి రోజున భక్తిశ్రద్దలతో సత్యనారాయణ వ్రతాన్ని ఆచరిస్తూ సకలైశ్వర్యాలతో సుఖంగా జీవించి, ఇహమందు సుఖము, అంత్యమందు సత్యనారాయణపురం చేరినారని సూతులవారు శౌనకాది మహామునులకు చెప్పినారు. కథ సారాంశం:భగవంతుడి ప్రసాదం అనేది సాక్షాత్తు దైవ స్వరూపం. దానిని నిర్లక్ష్యం చేయకూడదని, అలాగే కష్టాల్లో ఉన్నప్పుడు పశ్చాత్తాపంతో దేవుడిని ప్రార్థిస్తే ఫలితం ఉంటుందని ఈ అధ్యాయం వివరిస్తుంది. ఇతి శ్రీస్కాందపురాణే రేవాఖండే శ్రీసత్యనారాయణ వ్రతకథాయాం చతుర్థోఽధ్యాయః ।।

తదంగ కథా ప్రారంభః ।

అథ పంచమోఽధ్యాయః

శ్లోకం: అథాన్యచ్చ ప్రవక్ష్యామి శ్రుణుధ్వం మునిసత్తమాః । ఆసీత్ తుంగధ్వజో రాజా ప్రజాపాలనతత్పరః ।। శ్రీ సత్యనారాయణస్వామి వ్రతము - పంచమోధ్యాయము

సూత మహర్షి ఇలా చెప్పారు: "ఓ మునులారా! మరొక కథ వినండి. పూర్వాకాలమందు తుంగధ్వజుడనే రాజు ఉండేవాడు. అతనికి నూరుగురు కుమారులు. ప్రజలను తన కన్న బిడ్డల్లాగా చూసుకుంటూ రాజ్యపాలన చేసేవాడు.ఒకరోజు ఆ రాజుగారు వేట కొరకు అడవికి వెళ్లి, అలసిపోయి ఒక మర్రిచెట్టు కింద కూర్చున్నాడు. అక్కడ కొందరు గొల్లవాళ్ళు (గోపకులు) భక్తితో సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నారు. రాజుగారు అది చూసి కూడా, అహంకారంతో వారి దగ్గరకు వెళ్లలేదు, కనీసం నమస్కారం కూడా చేయలేదు." రాజుగారిని చుసిన ఆ గొల్లవాళ్ళు పూజ ముగిశాక, ఎంతో భక్తితో రాజుగారి వద్దకు వచ్చి తీర్థప్రసాదము ఇచ్చారు. రాజు ఛీ! ఈ గొల్లవాళ్ళు ఇచ్చే ప్రసాదం తీసుకుంటానా! అని అహంకారంతో ఆ ప్రసాదాన్ని కూడా స్వీకరించకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. దీనితో సత్యనారాయణ స్వామి కోపించి ఒక చమత్కారం చేసాడు. దాని వల్ల అకస్మాత్తుగా అతనికున్న వందమంది పుత్రులు చనిపోయారు, రాజ్యమంతా శత్రువుల వశమైంది, సంపదంతా నశించింది. అప్పుడు రాజుగారు, "ఇప్పుడే కదా నేను వేటకు వచ్చింది అప్పుడే ఇలా ఎలా జరిగింది?" అని ఆలోచించసాగాడు. అప్పుడు అతనికి జ్ఞాపకం వచ్చింది. ఇందాక తానూ గొల్లవాళ్ళు ఇచ్చిన ప్రసాదము తినకుండానే వచ్చినందుకు ఇలా జరిగింది అని గ్రహించి, వెంటనే ఆ గొల్లవాళ్ళ దగ్గరకు వెళ్లి, వారితో, "గొల్లవాళ్ళరా! ఇందాక మీరు చేసిన వ్రతము నాటో చేయించండి. వ్రతమునకు అయ్యే ఖర్చు నేనే ఇస్తా" అని, గొల్లవాళ్ళ మధ్యలో రాజుగారు కూర్చొని, గొల్లవాళ్ళు చెప్పినట్లుగా వ్రతము చేసి, గొల్లవాళ్ళ చేతిలో తీర్థప్రసాదము తీసుకొని తిరిగి రాజ్యానికి బయలుదేరినాడు. “అప్పుడు సత్యదేవుడు! యథాప్రకారముగా రాజ్యము కలుగుగాక!” అని ఆశీర్వదించాడు. దీనితో తన నూరుగురు కుమారులు తిరిగి బ్రతికినారని కబురు వచ్చింది. రాజ్యం, సంపద తిరిగి సంపాదించారనే వార్త కూడా వచ్చింది. దీనితో రాజుగారు ఇదంతా ఆ సత్యదేవుని మాయాలీలా విలాసమని అనుకోని, మరునాడు ఉదయమే తన పరివారముతో రాజ్యప్రజలతో కలిసి సత్యనారాయణ స్వామి వ్రతమును ఆచరించాడు. ఈ విధముగా ప్రతి పౌర్ణమికి ఈ వ్రతము ఆచరిస్తూ ఇహమందు సుఖము అంత్యమున సత్యనారాయణపురమును చేరినాడు. మునులారా! ఎవరైతే ఈ పరమ పవిత్రమైన సత్యనారాయణ వ్రతాన్ని ఆచరిస్తారో లేదా ఈ కథను భక్తితో శ్రవణము చేస్తారో, వారికి సత్యదేవుని కృపతో కోరిన కోరికలు తీరుతాయి. దరిద్రులకు ఐశ్వర్యం లభిస్తుంది. సంతానము కోరినవారికి సంతానము లభిస్తుంది. ఎవరు ఏది కోరితే అది సఫలమౌతుంది. ఇలా సుఖ సంతోషముతో వారు బ్రతికున్నంతకాలం జీవించి అంత్యమందు సత్యనారాయణ పురానికి చేరుకుంటారు. విశేషించి కలియుగంలో ఈ సత్యనారాయణ స్వామి వ్రతము అత్యంత ఫలప్రదమైనది. ఆ దేవదేవుడిని సత్యేశుడు అని, సత్యదేవుడు అని, సత్యనారాయణుడు అని వివిధ నామాలతో పిలిచినప్పటికీ, ఆ స్వామి నానారూపాలు ధరించి భక్తుల కోరికలను తీరుస్తుంటాడు. ఈ కథను నిత్యం పఠించినా, విన్నా సకల పాపాలు నశిస్తాయి.

  1. ఆ పేద బ్రాహ్మణుడు (శతానందుడు) మరుజన్మలో సుదాముడు (కుచేలుడు) గా పుట్టి, శ్రీకృష్ణుని ధ్యానించి మోక్షం పొందాడు.
  2. కట్టెలమ్మే వ్యక్తి మరుజన్మలో గుహుడు (నిషాద రాజు) గా పుట్టి, శ్రీరాముని సేవించి మోక్షం పొందాడు.
  3. ఉల్కాముఖ చక్రవర్తి మరుజన్మలో దశరథ మహారాజుగా పుట్టి, శ్రీరంగనాథుని పూజించి వైకుంఠం చేరాడు.
  4. సాధు వర్తకుడు మరుజన్మలో మయూరధ్వజ (మోరధ్వజ) రాజుగా పుట్టి, తన దేహాన్ని దానం చేసి మోక్షం పొందాడు.
  5. తుంగధ్వజ రాజు మరుజన్మలో స్వాయంభువ మనువుగా పుట్టి, భగవంతుని సేవించి పరమపదాన్ని పొందాడు.
  6. పూజ చేసిన గొల్లవారందరూ మరుజన్మలో నందగోపాలాది యాదవులుగా పుట్టి, కృష్ణుని లీలల్లో పాల్గొని గోలోకానికి చేరుకున్నారు.
అయిదు అధ్యాయాల ఈ సత్యనారాయణ వ్రతకథ భక్తిని, సత్య జీవనమును, వినయ విధేయతలను మరియు భగవంతుని పట్ల పూర్ణ విశ్వాసం కలిగి ఉండాలని బోధిస్తుంది. ఇతి శ్రీస్కాందపురాణే రేవాఖండే శ్రీసత్యనారాయణ వ్రతకథాయాం పంచమోఽధ్యాయః ।।

శ్రీ సత్యనారాయణ స్వామి షోడశోపచార పూజ - Part - 2

షోడశోపచార పూజ - Part - 2

మహానైవేద్యం: ఓం శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామినే నమః । యథాశక్తి మహానైవేద్యం సమర్పయామి। మధ్యేమధ్యేపానీయం సమర్పయామి। ఉత్తరాపోశనం సమర్పయామిః హస్తా ప్రక్షాళయామి। పాదౌ ప్రక్షాళయామి। శుద్ధాచమనీయం సమర్పయామి। (మహా) మీ శక్తికొలది నైవేద్యం నివేదయామి ।। శ్రీ సత్యనారాయణ స్వామివారికి మహానైవేద్యం: రవ్వ శర్కర కలిపిన ప్రసాదం లేదా గోధుమ పిండి శర్కర కలిపిన ప్రసాదము మరియు రవ్వకేసరి, ఫలాలు సమర్పించాలిసమర్పించాలి తాంబూలం: ఓం శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామినే నమః । తాంబూలం సమర్పయామి। శ్రీ సత్యనారాయణ స్వామివారికి తాంబూలం సమర్పించాలి మంగళ నీరాజనమ్: ఓం శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామినే నమః । నీరాజనమ్ దర్శయామి। నీరాజనానంతరం శుద్దాచమనీయం సమర్పయామి। శ్రీ సత్యనారాయణ స్వామివారికి మంగళ నీరాజనమ్, హారతిని వెలిగించి చూపించాలి. పుష్పముుతో నీటిని హారతి చుట్టూ త్రిప్పాలి.తదుపరి హారతిని స్వీకరించాలి. మంత్రపుష్పం: ఒక్కో మంత్రం చదువుతూ ఆయా శ్రీ సత్యనారాయణ స్వామివారికి పుష్పమును సమర్పించాలి. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి । తన్నో విష్ణుః ప్రచోదయాత్ ।। ఓం మహాలక్ష్మ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి । తన్నో లక్ష్మీః ప్రచోదయాత్ ।। ఓం శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామినే నమః । సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి । ఆత్మప్రదక్షిణ నమస్కారం: యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే । పాపోఽహం పాపకర్మాఽహం పాపాత్మా పాపసంభవః త్రాహి మాం కృపయా సాయి శరణాగతవత్సల । అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ । తస్మాత్కారుణ్య భావేన రక్ష రక్ష గ్రహనాయక ।। ఓం శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామినే నమః । ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి । శ్రీ సత్యనారాయణ స్వామివారికి అక్షతలు సమర్పించాలి. ఉపచార పూజ: ఓం శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామినే నమః । ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి । ఛత్రమాచ్ఛాదయామి । చామరైర్వీజయామి । నృత్యం దర్శయామి । గీతం శ్రావయామి । వాద్యం ఘోషయామి । ఆందోళికానారోహయామి । అశ్వానారోహయామి । గజానారోహయామి । సమస్త రాజోపచార దేవోపచార భక్త్యుపచార శక్త్యుపచార మంత్రోపచార పూజాః సమర్పయామి ।। శ్రీ సత్యనారాయణ స్వామివారికి అక్షతలు సమర్పించాలి. సమర్పణం: యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు। న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతం।। మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం శ్రీ సత్యదేవా। యత్పూజితం మయా దేవా పరిపూర్ణం తదస్తు తే। అనయా శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి పూజయా వ్రత కథా శ్రవణేన భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి సుప్రీతాః సప్రసన్నాః వరదో భవంతు ।। ఉత్తరే శుభకర్మణ్యవిఘ్నమస్తు ఇతి భవంతో బ్రువంతు। ఉత్తరే శుభకర్మణి అవిఘ్నమస్తు।। ఏతత్ ఫలం, శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి చరణారవిందార్పణమస్తు అక్షింతలు,పుష్పాలు,జలం కుడిచేతిలో తీసుకొని పాత్రలో వదలాలి. తీర్థప్రసాద గ్రహణం: అకాలమృత్యహరణం సర్వవ్యాధినివారణం।। సమస్తపాపక్షయకరం శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి దేవతా పాదోదకం పావనం శుభమ్।। శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః ప్రసాదం శీరసా గృహ్ణామి। ఉద్వాసనం: ఓం యజ్ఞేన యజ్ఞమయజన్త దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్। తే హ నాకo మహిమాన॑స్సచన్త యత్ర పూర్వే సాధ్యాస్సన్తి దేవాః।। శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః యథాస్థానం ఉద్వాసయామి।। శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ। మండపములోని కలశమును, శ్రీ సత్యనారాయణ స్వామివారికి 'ఓం ఓం ఓం' ఉద్వాసనము చేయాలి. సమస్త సన్మంగళాని భవంతు ।। సర్వేజనాః సుఖినో భవంతు ।। ఓం శాంతిః శాంతిః శాంతిః ।