పూజా సామాగ్రి em>తేర వేయాలి
మాంగళ్యధారణ
త్రిరాచమ్య
స్వామివారికి ఆచమనం ఇస్తున్నట్లుగా నీరు మూడుసార్లు చూపించి వదలవలెను
ఓం శివాయ స్వాహా
ఓం మహేశ్వరాయ స్వాహా
ఓం శంభవే స్వాహా
హస్తం ప్రక్షాల్య చేయి కడగండి
సంకల్పం
శ్రీసీతారామచంద్ర దేవతా ప్రీత్యర్థం లోక కళ్యాణార్థం సీతారాముల కళ్యాణోత్సవ సమయే - మాంగళ్య ధారణం కరిష్యే
తదంగ మాంగళ్య పూజాం కరిష్యే మాంగళ్యదేవతాభ్యోనమ: ధ్యాన ఆవావాహనాది షోడశోపచార పూజాం సమర్పయామి
మాంగళ్యధారణ శ్లోకం
మాంగళ్యమును సభ ప్రాంగణములో ఉన్నవారందరికి చూపించి స్వామివారి హస్తాలకు తాకించి అమ్మవారి మెడలో వేయించాలి)
మాంగళ్యం తంతునానేన లోకరక్షణ(భక్త జీవన) హేతునా ।
కంఠే భధ్నామి శుభగే సాజీవ శరదాంశతం ।।
మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తో అస్తు ।।
తలంబ్రాలు
కపిలాగ్ స్మారయస్తు! బహుధేయంచాస్తు పుణ్యం వర్ధతాగ్ శాంతిరస్తు ॥
పుష్ఠిరస్తు తుష్టిరస్తు వృద్ధిరస్తు అవిఘ్నమస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు స్వస్తిశివంకర్మాస్తు కర్మసమృద్ధిరస్తు
దంపత్యో స్పగ్రహే సనక్షేత్రే సహసోమేన క్రియేతాగ్ శాంతిరస్తు ।
ప్రజాపతి స్త్రీయాం యశ: ముష్కయో రదధాత్సపమ్ ।
కామస్య తృప్తిమానందం। తస్యాగ్నే భాజయేహమా ।
మోధః ప్రమోదానంద: ముష్కయోర్ని హితస్సప:
సృత్వేవ కామస్య తృప్యాణి దక్షిణానాం ప్రతిగ్రహే మనసశ్చిత్త మాకూతిం వాచసత్యమశీమహి
పశూనాం రూపమన్నస్య యశశ్రీ శ్రయతాం మయి ।
యధాహమస్య అతృపగ్గ్ ప్రియైపుమాన్ యథా
తృప్యతిపుంగ్ సి ప్రియేప్రియా ఏవం భగస్య తృప్యాణి యజ్ఞస్య కామ్య
ప్రియ: దదామీత్యగ్నిర్ వదతి తధేతి వాయురాహతత్ హంతేతి సత్యం
చంద్రమాః ।
ఆదిత్యస్సత్యమోమితి ఆపస్తథ్యత్య మాభరన్ యశోయజ్ఞస్య
దక్షిణాం - భక్తా ప్రజామేకామ స్సమృధ్యతామ్। పశవోమేకామ సమృధ్యతామ్। యజ్ఞోమే కామ సమృధ్యతామ్। శ్రియోమేకామ స్సమృధ్యతామ్।
తలంబ్రాల వేడుక చేయాలి
బ్రహ్మ ముడి
కంద మూల ఫలైర్యుక్తం క్రముకైః దక్షిణస్తదా ।
వధూవరేషు వర్ధ్యంతాం బ్రహ్మ గ్రంథిం శుభావహం ।।
బ్రహ్మగ్రంధి ముహూర్త సుముహూర్తాస్తు ।
బ్రహ్మముడి వేయాలి నల్లపూసలు - మెట్టెలు - వడిబియ్యము కార్యములు విధిగా నిర్వర్తించి కర్తలకు చదివింపులు చదివించాలి
అష్టోత్తర శతనామ పూజ
ఇప్పుడు << శ్రీ రామా అష్టోత్తర శతనామావళి >> << శ్రీ సీతాదేవి అష్టోత్తర శతనామావళి >> పుష్ప పూజ చేయాలి
శ్రీ రామచంద్రస్వామినే నమః । నానావిధ పరిమళ పత్ర పుష్ప అక్షతాన్ సమర్పయామి
శ్రీ సీతాదేవ్యై నమ: నానావిధ పరిమళ పత్ర పుష్ప అక్షతాన్ సమర్పయామి
ధూపం దీపం నైవేద్యం
శ్రీ రామచంద్రస్వామినే నమః । శ్రీ సీతాదేవ్యై నమ: । ధూపం దీపం నైవేద్యం తాంబూలం సమర్పయామి
ధూపం దీపం నైవేద్యం తాంబూలం సమర్పించాలినైవేద్యము (గాయత్రి మంత్రము చెప్పాలి) పానకము వడపప్పు నారికేళము
పాయసము నైవేద్యము పెట్టాలి
నీరాజనం
మంగళమ్ కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే
చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళమ్
శ్రీ రామచంద్రస్వామినే నమః । శ్రీ సీతాదేవ్యై నమ: ।
నీరాజనం దర్శయామి నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి రక్షామ్ధారయామి నమస్కరోమి
కర్పూర (మంగళ) హారతి ఇవ్వాలి హారతి తీసుకోవాలి
మంత్రపుష్పము
ఓం దాశరధాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి ।
తన్నో రామచంద్ర ప్రచోదయాత్ ।।
ఓం జనక పుత్రీచ విద్మహే రామ పత్నీచ ధీమహి ।
తన్నో సీతా ప్రచోదయాత్ ।।
ఓం దాశరధాయ విద్మహే ఊర్మిళా ప్రియాయ ధీమహి ।
తన్నో లక్ష్మణ ప్రచోదయాత్ ।।
ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి ।
తన్నో హనుమాన్ ప్రచోదయాత్ ।।
పుష్పములు సమర్పించాలి
ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్
శ్రీ రామచంద్రస్వామినే నమః । శ్రీ సీతాదేవ్యై నమ: । ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి
ఉపచారపూజాః:
పునః పూజాం కరిష్యే । ఛత్రమాచ్ఛాదయామి ।
చామరైర్వీజయామి । నృత్యం దర్శయామి ।
గీతం శ్రావయామి । ఆందోళికానారోహయామి ।
అశ్వానారోహయామి । గజానారోహయామి ।
సమస్త రాజోపచార దేవోపచార భక్త్యుపచార శక్త్యుపచార మంత్రోపచార పూజాస్సమర్పయామి ।
శ్రీ సీతారామచంద్రస్వామికి అక్షతలు, పుష్పములు సమర్పించాలి
సాష్టాంగ నమస్కారం:
ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా।
పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగముచ్యతే।
శ్రీ రామచంద్రస్వామినే నమః । శ్రీ సీతాదేవ్యై నమ: । సాష్టాంగ నమస్కారాం సమర్పయామి ।
క్షమాప్రార్థనా:
అపరాధసహస్రాణి క్రియన్తేऽహర్నిశం మయా।
దాసోఽయమితి మాం మత్వా క్షమస్వ జనార్దనా।
శ్రీ సీతారామచంద్రస్వామికి నమస్కారం చేయాలి
సమర్పణం:
యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు ।
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యోవందే తమచ్యుతం ।
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దనా ।
యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు తే ।
అనయా ధ్యానావహనాది సద్యోజాత విధినా షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మకః
శ్రీ సీతారామచంద్రస్వామి సుప్రీతః సుప్రసన్నో వరదో భవతు।
ఏతత్ఫలం పరమేశ్వరార్పణమస్తు ।
అక్షింతలుపుష్పాలుజలం కుడిచేతిలో తీసుకొని రామచంద్రస్వామి పాదాల ముందు వదలాలి
సీతారామచంద్ర భగవాన్ కీ జై ।
తీర్థప్రసాద గ్రహణం:
అకాలమృత్యహరణం సర్వవ్యాధినివారణం।
సమస్తపాపక్షయకరం శ్రీ సీతారామచంద్రస్వామి పాదోదకం పావనం శుభమ్।
శ్రీ రామచంద్రస్వామినే నమః । శ్రీ సీతాదేవ్యై నమ: । ప్రసాదం శీరసా గృహ్ణామి।
ఉద్వాసనం:
ఓం యజ్ఞేన య॒జ్ఞమయజన్త దేవాః
తాని ధర్మాణి ప్రథమాన్యాసన్।
తే హ నాకo మహిమాన॑స్సచన్తే
యత్ర పూర్వే సాధ్యాస్సన్తి॑ దేవాః।।
శ్రీ రామచంద్రస్వామినే నమః । శ్రీ సీతాదేవ్యై నమ: । యథాస్థానం ఉద్వాసయామి।।
శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ।
స్వామి అమ్మవార్ల ప్రతిమలను ఉత్తరం దిశగా లేదా తూర్పు దిశగా కదిలించాలి
ఓం శాంతిః శాంతిః శాంతిః।
- పసుపు
- కుంకుమ
- బుక్కా
- గులాలు
- గంధం డబ్బా-1
- జీలకర్ర-50 గ్రా
- నువ్వుల నూనె-250 గ్రా
- కొబ్బరి గిన్నెలు-9
- పులా దండ - 2
- బెల్లం-1250 గ్రా
- పెసరబేడలు-1250 గ్రా
- బియ్యము - 11 కేజీలు
- పసుపు అక్షతలు
- ముత్యాలు (తలంబ్రాల కోసం),యథాశక్తి,విశేషం
- భాషింగాలు - 1 సెట్టు
- యజ్ఞోపవీతములు - 3
- ఆచమన పాత్ర {రెండింటిలోనూ నీళ్ళు నింపుకోండి}
- కలశానికి చిన్న చెంబు {రెండింటిలోనూ నీళ్ళు నింపుకోండి}
- తెల్ల ధోతి
- టవళ్లు (పెద్దవి),2
- స్వామి-అమ్మవారి పట్టు వస్త్రాలు,1 సెట్టు,బట్టలు
- విడిపూలు & 4 మూరల దండ
- కలశ స్థాపనకు రాగి చెంబు
- జాకెట్ బట్టలు - 3
- మామిడాకులు
- తమలపాకులు - 51
- పోకలు - 51
- ఖర్జురా-51
- పసుపు కొమ్ములు-250 గ్రా
- పండ్లు
- డీసులు (పళ్ళెములు) -3
- పాలు
- పెరుగు
- నెయ్యి
- తేనే
- శర్కర
- కొబ్బరికాయలు - 5
- అగరవత్తులు
- దీపానికి నూనె
- అఖండ దీపానికి మట్టి ప్రమిదలు
- దీపం ప్రమిదలు
- వత్తుల ప్యాకెట్ -1
- అఖండ దీపం వత్తుల ప్యాకెట్-1
- అగ్గిపెట్టె
- కర్పూరం
- మంగళ హారతి సెట్ - 1
- హారతి స్టాండ్ - 1
- ఘంటా - 1
- నైవేద్యం (పానకము వడపప్పు నారికేళముపాయసము)
- కూర్చోవడానికి ఆసనం
శ్రీ సీతారామ కల్యాణోత్సవం చూడటానికి క్లిక్ చేయండి (Click to expand)
శ్రీ సీతారామ కల్యాణోత్సవం
ఆచమ్య‐ప్రాణానాచమ్య‐నేత్రాచమ్య: ఇప్పుడు ఆచమన పాత్ర లోని నీటిని ఉంగరం వ్రేలితో కళ్ళకు అద్దుకొని ఉద్ధరిణిలో తీసుకొని ఒక్కో నామం చెపుతూ మూడు మార్లు తాగవలెను ఓం శివాయ స్వాహా ఓం మహేశ్వరాయ స్వాహా ఓం శంభవే స్వాహా హస్తం ప్రక్షాల్య చేయి కడగండి సంకల్పం: ఇప్పుడు కుడిచేతిలో అక్షతలు తీసుకుని మీ కుడి కాలితొడపై ఎడమ అరచేతి నుంచి అక్షతలతో ఉన్న కుడిచేతిని పిడికిలిగా మూసి ఆ ఎడమ అరచేతిపైనుంచుతూ ఈ సంకల్పం చెప్పి పిడికిలిలో ఉన్నఅక్షతలను నీటితో అర్ఘ్యపాత్రలో వదలాలి ఆచమ్య ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాంశుభతిథౌ శ్రీమాన్ గోత్ర: నామధేయ: శ్రీమతః గోత్రస్యనామధేయస్య ధర్మపత్నీ సమేతోహం సహకుటుంబస్య అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్యవీర్య విజయ అభయ ఆయురారోగైశ్వర్యాభి వృధ్యర్థం మమ(సర్వ)గృహే సకల కళ్యాణ శుభపరం పరాప్రాప్త్యర్థం సమస్త పాపక్షయార్థం ఆయుష్యాభి వృద్యర్థం అస్మిన్ గ్రామే క్షేమ-ఆడంబర దేశ-ఉపద్రవ మారీ-స్ఫోటక-ఆది సర్వ-ఉపద్రవ శాంత్యర్థం బ్రాహ్మణాది సర్వ వర్ణానాం సర్వధర్మానుష్టాన సిద్ధ్యర్థం అనావృష్టి దుర్ఛిక్ష వ్యాధిచోరరాజవీడ్యారాది సర్వోపద్రవ నివృత్యర్థ్యం శ్రీపర్జ్యన్య ప్రసాదేన స్వకాలే సస్యానుకూల సువృష్టిద్వారా సర్వ సస్య సంపూర్ణ సకల ఫల సిద్ధ్యర్థం శ్రీ భగవత: సిద్ధ్యర్థం శ్రీ మహాదేవదేవస్య అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య జగత్ కుటుంబినః శ్రీ రామచంద్ర నామధేయస్య జనకస్య పుత్రి సీత నామధేయావతిమ్ సకలలోక (గ్రామం పేరు) జనన్యాహ నామ ధ్యేయా: శ్రీ సీతా రామచంద్రదేవతా ప్రీత్యర్థ్యం లోకకళ్యాణార్ధం శ్రీసీతారామచంద్ర కళ్యాణమహోత్సవాఖ్యం శుభకర్మ కరిష్యే రక్షాబంధనము ఆదౌ రక్షార్థం రక్షాబంధన ధారణం కరిష్యే రక్షాబంధన దేవతాభ్యోనమః ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం సమర్పయామి ఈ మంత్రములు చెపుతూ రక్షాబంధనములు ముందుగా కర్తలకు అర్చకులకు కట్టాలి ఆ తరువాత దేవతామూర్తులకు కల్యాణ సభా ప్రాంగణంలో ఉన్నవారందరికీ చూపించి కట్టవలెను పురుషులకు కుడిచేతికి స్త్రీలకు ఎడమ చేతికి కట్టాలి రక్షాబంధన మంత్రం - పురుష: విశ్వేత్తాతే సవనేషు ప్రవాచ్చాయాచ కర్ధమఘవ న్నింద్ర । సున్వతే పారావతం యత్పురుసం భృదం వస్యపావృణో శ్శరభాయ ఋషిబంధవే ।। రక్షాబంధన మంత్రం - స్త్రీ: బృహత్సామ క్షత్రభృద్వృద్ధ వృష్ణియం త్రిషభౌజ శ్శభిత । ముగ్రవీరం ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యమిదంవాతేన సగరేణ రక్ష ।। యజ్ఞోపవీత ధారణ శ్రీ సీతా రామచంద్ర కళ్యాణమహోత్సవ అంగత్వేన యజ్ఞోపవీతంధారయిష్యే త్రిరాచమ్య స్వామివారికి ఆచమనం ఇస్తున్నట్లుగా నీరు మూడుసార్లు చూపించి వదలవలెను ఓం శివాయ స్వాహా ఓం మహేశ్వరాయ స్వాహా ఓం శంభవే స్వాహా హస్తం ప్రక్షాల్య చేయి కడగండి పిదప యజ్ఞోపవీతమును రజత యజ్ఞోపవీతము కూడా కల్యాణ సభా ప్రాంగణంలో ఉన్నవారందరికీ చూపించి స్వామివారికి వేయాలి యజ్ఞోపవీత దేవతాభ్యోనమ: యధాశక్తి ధ్యాన ఆవాహనాదిషోడశోపచార పూజాం సమర్పయామి । యజ్ఞోపవీతం పరమం పవితం ప్రజాపతే యత్సహజం పురస్తాత్ । ఆయుష్యమగ్యం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తుతేజ: ।। యజ్ఞోపవీతం ధారయిత్వా పునరాచమ్య: ఓం శివాయ స్వాహా ఓం మహేశ్వరాయ స్వాహా ఓం శంభవే స్వాహా హస్తం ప్రక్షాల్య చేయి కడగండి మళ్ళీ స్వామివారికి ఆచమనం ఇస్తున్నట్లుగా నీరు మూడుసార్లు చూపించి వదలవలెను యజ్ఞోపవీతధారణ మూహూర్త స్సుమూహూర్తమస్తు పాద ప్రక్షాళన/పాదాలు కడుగుట ఈ మంత్రములు చెపుతూ స్వామి వారి పాదముల మీద అర్చకులు కర్తల చేత నీళ్ళు చల్లించి పాదాలకు గంధము కుంకుమ పెట్టి అత్తరు లేదా పన్నీరు పాదాలపై చల్లాలి శ్రీరామచంద్ర వరస్య ఇదమావాహనం ఆసనం ఇదం పాద్యమర్ధ్యం నమోస్త్వనన్తాయ సహస్రమూర్తయే సహస్ర పాదాక్షిశిరోరు బాహవే । సహస్రనామ్నే పురుషాయశాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః ।। నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయచ । జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః ।। వస్త్రాలు లోక కళ్యాణార్ధం శ్రీ సీతారామచంద్ర కళ్యాణోత్సవ సమయే శ్రీరామచంద్ర స్వామివారికి శ్రీ సీతా అమ్మవారికి వస్త్రాలు చదివించాలి (ఎవరు వస్త్రాలు సమర్పిస్తున్నారో వాళ్ళనామములు చదువుతూ స్వామి వారికివస్త్రాలు చదివించాలికన్యాదానం - మహాసంకల్పం చూడటానికి క్లిక్ చేయండి (Click to expand)
కన్యాదానం - మహాసంకల్పం తంబాలములో కొబ్బరికాయ లేదా కొబ్బరి బొండము పెట్టి కర్తలతో అర్చకులు కన్యాదానం చేయించాలి ఒక చెంబులో నీరు తీసుకొని అందులో మామిడాకులు తల్లక్రిందులుగా వేసి ఆ కొబ్బరికయ లేదా కొబ్బరి బొండము పై నీరు ధారగా ఆకుల నుండి పోస్తూవుండాలి త్రిరాచమ్య స్వామివారికి ఆచమనం ఇస్తున్నట్లుగా నీరు మూడుసార్లు చూపించి వదలవలెను ఓం శివాయ స్వాహా ఓం మహేశ్వరాయ స్వాహా ఓం శంభవే స్వాహా హస్తం ప్రక్షాల్య చేయి కడగండి ఏవంప్రీత్యర్థం మమ ఆచంద్రార్కమనేక వైశేషిక సౌభాగ్య సౌమనస్య నిత్య నిరతిశయానంద బ్రహ్మలోకావాప్త్యర్థం సాలంకృత సహిరజ్యోదక కన్యాదాన మహం కరిష్యే కన్యాదాన సమయే మహాసంకల్ప మంత్రం పఠనం కరిష్యే అక్షతల నీళ్లు వదలాలి అస్యశ్రీమద్భగవతో మహాపురుషన్య శ్రీమదాది నారాయణన్య అచింత్యాపరిమిత శక్త్యా భ్రియ మాణస్య మహా జలౌఘస్యమధ్యే పరిభ్రమ మాణానా మనేక కోటి బ్రహ్మాండానామేక తమే వ్యక్తావ్యక్త ప్రకృతి మహదహంకార పృథివ్యాపస్తేజో వాయురాకాశాద్యావరణై రావృతేస్మిన్ మహతి బ్రహ్మాండఖండయోర్మధ్యే సకలాధిష్ఠాన వరాహదంష్ట్రాంకుర మృణాళస్య జగన్మూల ఆధార శక్తి శ్రీ కూర్మ వరాహ ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకా ఖ్యాష్ట దిగ్గజోపరి ప్రతిష్ఠితస్య అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తపాతాళానాముపరి తలే భూలోక భువర్లోకసువర్లోక మహల్లోక జనోలోక తపోలోక సత్యలోకానా మధోభాగే చక్రవాళశైల మధ్యగత మహాసుమేరో సహస్ర శిఖరానువర్తిని మధ్యేవర్తిన్యాం మహానాళాయ మాణ ఫణిరాజ శేషస్య సహస్ర ఫణాఫణి మండల మండితే ఇంద్రాగ్ని యమ నిరృతి వరుణవాయు కుబే రేశాన్యాది అష్టదిక్పాలక పాలితే వలయాకార లవణేక్షు సురా సర్పిర ధిక్షీర జలార్థవైర్విరాజితేస్మిన్ జంబూప్లక్ష శాల్మలి కుశ క్రౌంచశాక పుష్కరాఖ్య సప్తభిర్ద్వీపై ర్టీపితే మహాసరోరుహాకార పంచశత్కోటి విస్తీర్ణ భూమండలమధ్యే మేరోర్దక్షిణపార్శ్వే మలయాదుత్తరే కర్మభూమౌ భారత కింపురుషేలావృత కురు భద్రాశ్మకరమణక మందహాస జిహ్వదాఖ్య ఇతి నవఖండమండితే ప్రత్యేకం నవ సహస్ర యోజన విస్తృతే దండక చంపక వింధ్యమిశ నైమిశ కదరిక బదరిక నహుష గుహ దేవదారు కారణ్యాది ఏకాదశారణ్యాయుతే అంగ వంగ కళింగ కాశ్మీర కాంభోజ సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధ మాళవ నేపాళ కేరళ చోళ పాంచాల గౌళ మళయాళ సింహళ ద్రవిడ ద్రావిడ కర్ణాట నాట పానాట పాండ్యపుళిందాంధ్ర కుక్కురు కురు గాంధార విదర్భ విదేహ బాహ్లిక బర్బర కేకయ కోసల కుంతల టెంకణ కొంకణ మగధ మద్రఘార్జర యవన జాలాంధక సాల్వచేది సింధువత్యాద్యనేక దేశ భాషా భూమి పాల విచిత్రితే సామ్యవంతి గంగా గోదావరీ భీమరథీ తుంగభద్రా కృష్ణవేణీ కావేరీ చంద్రభాగా పంపాయనా సరస్వతీ నర్మదా కుముద్వతీ రేణుకా వంజులాది మహానదీ విలసితే అయోధ్యా మధుర మాయ కాశీ కాంచీ అవంతికా పురీద్వారావత్యాది పుణ్యపురీవిరాజితే శ్రీశైలస్య వాయవ్య (ఐశాన్య) ప్రదేశే దేవ తిర్యఙమనుష్య సకల జగత్రష్టుః పరార్ధ ద్వైజీవినో బ్రహ్మణః ప్రథమ పరార్థే పంచాశదతీతే ద్వితీయ పరార్థే పంచాశద్దివ్య వర్షాత్మకే ప్రథమ మాసే ప్రథమ పక్షే అహని ద్వితీయ యామే తృతీయముహూర్తే త్రయోదశ ఘటికాయాం ద్విచత్వారింశ ద్విఘటికాసు గతాసు పార్థివకల్ప అనంతకల్ప కూర్మ కల్ప బ్రహ్మకల్ప వరాహకల్ప శ్వేతవరాహకల్ప ప్రళయకల్ప సావిత్రి కల్పానాం మధ్యేశ్వేత వరాహకల్పే స్వాయంభువ స్వారోచిషోత్తమ తామస రైవత చాక్షుష వైవస్వత సూర్యాగ్ని బ్రహ్మరుద్ర దక్షరౌచ్య భౌచ్య చతుర్దశమన్వంతరాణాం మధ్యే సప్తమే వైవస్వత మన్వంతరే ఇదానీం అష్టావింశన్మహాయుగే యుధిష్ఠిర విక్రమార్క శాలివాహన విజయాభినందన నాగార్జున షట్ఛకానాం మధ్యే తృతీయే శాలివాహన శకే అష్టావింశతి సహస్రాన్విత సప్తదశ లక్షాట్టే కృతయుగే యాతే షణ్ణవతి సహస్రాన్విత ద్వాదశలక్షాబ్ద త్రేతాయుగేయాతే చతుషష్టి సహస్రాన్విత అష్ట లక్షాభై ద్వాపర యుగే యాతే ద్వాత్రింశత్సహస్రాన్విత చతుర్లక్షా కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారత వర్షా భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయవ్య (ఈశాన్య) ప్రదేశే కృష్ణాగోదావర్యోర్మధ్యదేశే కల్యాణమంటపే సమస్తదేవతా బ్రాహ్మణ హరిహర గురు చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన నామసంవత్సరే ఆయణే ఋతౌ మాసే క్లపక్షే తిధౌ వాసరే నక్షత్రే శుభయోగ శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టా యాం శుభతిధౌ అనాది అవిద్యావాసనయా అస్మిన్ సంసార చక్రే విచిత్రాభిః విచిత్రా సుయోనిషు పునః పునః అనే కధా జనిత్వా కేనవా కర్మవిశేషేణ ఇదానీం అస్మిన్ వంశే జాతస్య గోత్రస్య నామధేయస్య ధర్మపత్నీ సమేతస్య మమ జన్మాభ్యాసాత్ జన్మ ప్రభృతి ఏతక్షణ పర్యంతం మధ్యే వర్తిని కాలే సంభావితానాం పాపానాం వాక్పాణిపాద పాయూవస్థానాం పంచానాం కర్మేంద్రియాణాం త్వక్చక్షుశ్రోత్ర జిహ్వాఘ్రాణానాం పంచానాం జ్ఞానేంద్రియాణం ఏతేషాం ప్రేరకస్య అంతః కరణస్య గోచరస్య సంబంధే సతి సకల పాప నివృత్తిద్వారా పితృణాం శాశ్వత బ్రహ్మలోకే నిత్యనివాస సిధ్యర్థం తిలై స్పూర్యమండల పర్యంతం కృత రాశే ర్వర్ష సహస్రావసాన ఏకైక తిలాప కర్ష క్రమేణ సర్వరాశ్యప కర్షిత సమ్మితకాలే బ్రహ్మలోకే నిత్యనివాస సిధ్యర్థం యవైశ్చంద్రమండల పర్యంతం కృత రాశీర్వర్ష సహస్రావ సాన ఏకైక యవాపకర్ష క్రమేణ సర్వరాశ్యప కర్షిత సమ్మిత కాలే బ్రహ్మలోకే నిత్యనివాస సిధ్యర్థం మాషైర్ధృవ మండల పర్యంతం కృతరాశేర్వర్ష సహస్రావసాన ఏకైక మాషాపకర్ష క్రమేణ సర్వరాశ్యప కర్షిత సమ్మిత కాలే బ్రహ్మలోకే నిత్యనివాస సిధ్యర్థం గోలోమభిర్నక్షత్ర మండల పర్యంతం కృతరాశేర్వర్ష సహస్రావసాన ఏకైక లోమాపకర్ష క్రమేణ సర్వరాశ్యప కర్షిత సమ్మిత కాలే బ్రహ్మలోకే నిత్యనివాస సిధ్యర్థం గంగావాలుకాభి సప్తఋషి మండల పర్యంతం కృతరాశేర్వర్ష సహస్రావసాన ఏకైక వాలుకాపకర్షక్రమేణ సర్వరాశ్యప కర్షిత సమ్మిత కాలే బ్రహ్మలోకే నిత్యనివాస సిధ్యర్థం మయాసహ దశ పూర్వేషాం దశా పరేషాం మంద్వంశ్యానాం సర్వేషాం పితృణాం నరకా దుత్తీర్య శాశ్వత బ్రహ్మలోకే నిత్యనివాస సిధ్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోష్టమ అతిరాత్ర ఆప్తోర్యామ సాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాది శత క్రతు సంపూర్ణ సకలపుణ్యఫలావాప్యర్థం స్వగృహ్యాక్త ప్రకారేణ సాలంకృత సహిరజ్యోదక కన్యాదానం కరిష్యే మయాసహ దశపూర్వేషాం దశాపరేషాం మద్వంశానాం మాతృవంశానాం సర్వేషాం పితృణాం నరకాదుతీర్య శాశ్వత బ్రహ్మలోక నిత్యనివాస సిద్ధ్యర్థ్యం శ్రీసీతారామచంద్రదేవతా ప్రీత్యర్థ్యం లోకకళ్యాణార్ధం సాలంకృత సహిరజ్యోదక కన్యాదానం కరిష్యే స్వగృహ్యాక్త ప్రకారేణ సాలంకృత సహిరజ్యోదక కన్యాదానం కరిష్యే (మహాసంకల్పముచ్చార్య వరమభ్యర్య - మహాదానేషు యజ్ఞాదౌ ప్రాయశ్చిత్తేషు కర్మసు । కన్యాదానే నదీస్నానే మహా సంకల్ప మాచరేత్ ।। శ్లో కన్యాదానే నదీస్నానే తులాదానేషు వైద్విజః ప్రాయశ్చిత్తేషు యజ్ఞాదౌ వ్రతాదిషు విశేషతః ।। శాంత్యాదిషుచ సర్వత్ర మహాసంకల్ప మాదరాత్ ।। కృత్వా యత్కురుతేకర్మ తదానంతాయ కల్ప్యతే । విశ్వామిత్ర ఉపద్రష్టా సీతారామోత్సవే యథా కుర్యాత్) కన్యాం కనకసంపన్నాం కనకా భరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం । బ్రహ్మలోక జిగీషియా ।। కన్యమమాగ్రతో భూయా కన్యేమే దేవి పారయో: కన్యేను సర్వతో భూయా సద్ధానా మోక్షసూప్ను యాం ।। కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుధీమతే ప్రయతోహం ప్రయచ్చామి ధర్మకామర్ధసిద్ధయే ।। విశ్వంభరా స్పర్వభూతా స్పాక్షిణ్య సర్వదేవతా: ఇమాం కన్యాం ప్రదస్వామి । పితృణాం తారణాయవై ।। శ్రీరూ పైషామయ కన్యాతుభ్యం శ్రీధర రూపిణి సాలంకృత సహిరజ్యోదక కన్యాదానం శ్రీరామచంద్ర ప్రీత్యర్థ్యం తుభ్యమహం । సంప్రదదే నమమ।। ప్రవర: శ్రీ రామచంద్ర ప్రవర కర్తలతో ప్రవర చెప్పించాలి చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యశుభం భవతు వాసిష్ఠ మైత్రావరుణ కౌండిన్య త్రయా ఋషేయ ప్రవరాన్విత వశిష్ఠ గోత్రద్భవస్య నా భాగ మహారాజ వర్మణో నప్త్రే అజమహారాజ వర్మణః పౌత్రాయ । దశరథ మహారాజ వర్మణః పుత్రాయ వశిష్ఠ గోత్రోద్భవాయ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకాయ తత్వాతీతాయ సచ్చిదానందమూర్తయే సూర్యవంశపావనాయ శ్రీమదిక్ష్వాకు వంశ ఉద్భవాయ శ్రీమన్నారాయణ స్వరూపాయ శ్రీరామచంద్ర వర్మణే వరాయ సీతాదేవి ప్రవర చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు ఆంగీరస అయాస్య గౌతమ త్రయారుషేయ ప్రవరాన్విత గౌతమస గోత్రోద్భవస్య స్వర్ణరోమ మహారాజ వర్మణో నప్త్రీమ్ హ్రస్వరోమ మహారాజ వర్మణః పౌత్రీం శ్రీరధ్వజ జనక మహారాజవర్మణః పుత్రీం అఖిలాండకోటి బ్రహ్మాండనాయికాం తత్వా తీతాం సచ్చిదానంద రూపిణీం చంద్రవంశ ప్రదీపికాం శ్రీసీతాదేవీ నామ్నీం కన్యాం తుభ్యం లోకసంరక్షణ కర్మభ్యః ప్రతిపాదయామి కన్యాముదక పూర్వం స్వస్తిహి అర్చకస్వామి 'స్వస్తి' అని పలికి ఈ క్రింది మంత్రములను చెప్పాలి స్వస్తితి ప్రతివచనమ్।। వర:స్వస్తి । కన్యాదానే విశేష శ్లోకము సీతాదేవిని కన్యాదానము చేసిన పిమ్మట ఈ శ్లోకము దాతతో చెప్పించాలి ఇయం సీతా మమ సుతా సహధర్మ చరీతవ । ప్రతీచ్ఛచైనాం భద్రం తే పాణిం గృహ్ణీశ్వ పాణినా । పతివ్రతా మహాభాగా ఛాయేవ అనుగతా సదా । ఇత్యుక్త్వా ప్రాక్షిపద్రాజా మంత్రపూతం జలం తదా । కన్యాదానం తుభ్యమహం సంప్రదదే తదుపరి ఈ క్రింది వాక్యము పలికి కన్యాదాన సద్గుణాల కొరకు తనశక్త్యానుసారముగా స్వామివారికి దక్షిణను సమర్పించాలి కన్యాదాన సాద్గుణ్యార్థం దక్షిణాంతుభ్య మహం సంప్రదదేనమమ ఈ క్రింది వచనమును స్వామివారిని ఉద్దేశించి చెప్పాలి ధర్మేచ అర్ధేచ కామేచ త్వయైషా నాతిచరితవ్యా । స్వామివారి నిమిత్తం ఈ క్రింది ప్రతి వచనమును పలకాలి నాతిచరామికల్యాణ సుముహూర్తము చూడటానికి క్లిక్ చేయండి (Click to expand)
జిలకర - బెల్లం సుముహూర్తకాలే లగ్నాష్టక మంగళాష్టక చూర్ణికాంచ పఠిత్వా అర్చకులు జీలకర్ర బెల్లము తమ కుడిచేతులలో పట్టుకొని సుముహూర్తమునకు ముందుగా లగ్నాష్టక మంగళాష్టక చూర్థికలను శుభకరమైన వేదానువాకములను పఠించాలి చూర్ణిక- స్వస్త్యష్ణా శీతి సహస్రాణాం ద్విజగురుదైవత్యానాం
- సమస్త జగదాధార మహామండూక కూర్మయజ్ఞ వరాహ శేష పృథివీనాం
- పురందర పావక యమ నిర్ఋతి వరుణ వాయు కుబేర ఈశాన్యాది అష్టదిక్పాలకానాం
- జలధి భవహరిహర ముఖ్య దేవగణానాం
- నారద విశ్వామిత్ర పరాశరాత్రి వాల్మీకి గౌతమ భృగు వ్యాసాది మహర్షిణాం
- సీతా అరుందతీ అహల్య ద్రౌపదీ తారా మండోదరి పాంచాలి దమయంత్యాది మహాపతివ్రతానాం
- హరిశ్చంద్ర నల కార్తవీర్య విక్రమార్క భోజరాజాది పుణ్యపురుషాణం
- గంగా నర్మదా తుంగభద్రా మలాపహారిణీ శ్రీకృష్ణవేణి గోదావరి భీమరధ్యాది మహానదీనాం
- జంబూనింభ కదంబ చూత క్రముక నారికేళ ఖర్జూర దాత్రీ దాడిమ్యాది ఫలవృక్షాణాం
- పున్నాగ జాజి వకుళ కేతకీ చంపక మల్లికా మాధవీ మాలత్యాది వివిధ కుసుమానాం
- కస్తూరి కుంకుమ అగరు గోరోచనాది సుగంధానాం
- అపరిమిత కనక కలశ కన్యక గృహమేధిక విశ్వవీణాధి వాద్య మేఘ ధ్వనీనాం
- అయోధ్యా కాశీపురుషోత్తమ రామేశ్వరాది పుణ్యనగరీణాం
- శ్రీశైల వింద్య హేమాచల గోవర్ధన కైలాసాది మహాశైలానాం
- తర్కమీమాంస న్యాయ వైశేషిక భాట్ట ప్రాభాకర వ్యాకరణాది షట్ శాస్త్రాణాం
- ఋగ్యజు స్సామాధర్వణ వేదానాం
- లగ్న హెూరా ద్రేక్కాణ నవాంశ ద్వాదశాంశ త్రిశాంశ త్రింశదంశకానాం
- లక్ష్మీశో భువన త్రయే నివసతో దేవాన్ మనుష్యో రగాన్ । సంస్థాతుం కరుణానిధిః కరుణయా మార్తాండ వంశేయయౌ ।। కౌసల్యా నిజగర్భ సంభవ భృతే జన్మన్య సాధారణే । జాతే శ్రీ రఘు నాయకస్య జననం దేయా దిదం మంగళం ।। సావధాన - సుముహూర్తా - సావధాన - శుభలగ్నే సావధాన శ్రీ లక్ష్మీనారాయణాభ్యాన్న సావధాన
- వైదేహీ వదనాభి లాషణ యుతం కామం సకామం కృతం । విఖ్యాతం భువన త్రయం హర ధనుర్బగ్నీ కృతంలీలయా ।। విశ్వామిత్ర పరాశరాది మునిభిస్తత్సన్నిధానాంచితం । సీతారాఘవయోర్వివాహ సమయేదేయా దిదం మంగళం ।। సావధాన - సుముహూర్తా - సావధాన - శుభలగ్నే సావధాన శ్రీ లక్ష్మీనారాయణాభ్యాన్న సావధాన
- ఉత్పల్లా మలనీలవారి జదళశ్యా మోన్నతం కోమలం । పార్వత్యాచ మహేశ్వరేణచ శిర శ్లాఘీ కృతం సర్వదా ।। శాపా ర్వర గౌతమస్య వనితా శైలా సుశీలాకృతా । దంపత్యోరిహ వామభాగ జనితం దేయాదిదం మంగళం ।। సావధాన - సుముహూర్తా - సావధాన - శుభలగ్నే సావధాన శ్రీ లక్ష్మీనారాయణాభ్యాన్న సావధాన
- శ్రీరామం జనకాత్మ జాసురగురుం ప్రత్యఙ్ముఖం ప్రాఙ్ముఖం । దోర్భ్యామం జలి మంచితైశ్చ వనితా మా పూర్య ముక్తా ఫలైః । నానారత్న విరాజ మాన కలశై రానీయతం సాగరాత్ ।। సీతారాఘవయో ర్వివాహ సమయే యాదిదం మంగళం ।। సావధాన - సుముహూర్తా - సావధాన - శుభలగ్నే సావధాన శ్రీ లక్ష్మీనారాయణాభ్యాన్న సావధాన
- కల్యాణం కమనీయ కోమల కరై రార్ద్రక్షతారోపణం కన్యాదాన పురస్పరం సురగురో ర్విప్రాశిషానుగ్రహం ।। బాహ్వాః కంకణ బంధనం దశగుణం మాంగళ్యసూత్రాన్వితం । సీతారాఘవ యోర్వివాహ సమయే దేయాదిదం మంగళమ్ ।। సావధాన - సుముహూర్తా - సావధాన - శుభలగ్నే సావధాన శ్రీ లక్ష్మీనారాయణాభ్యాన్న సావధాన
- జానక్యాః కమలామలాం జలిపుటేయాఃపద్మ రాగాయితాః । వ్యస్తా రాఘవ మస్తకేచవిలసత్కుం దప్రసూనాయితాః ।। స్రస్తాశ్యామలకాయకాంతి కలితా యా ఇంద్ర నీలాయితాః । ముక్తాస్తా శ్ముభదా భవంతు భవతాం శ్రీరామవైవాహికాః ।। సావధాన - సుముహూర్తా - సావధాన - శుభలగ్నే సావధాన శ్రీ లక్ష్మీనారాయణాభ్యాన్న సావధాన
- తదేవ లగ్నం సుదినంతదేవ తారాబలం చంద్రబలంతదేవ । విద్యాబలం దైవ బలంతదేవ లక్ష్మీపతే తేంఘ్రియుగంస్మరామి ।।
- శ్రీరామ పత్నీ జనకస్య పుత్రీ సీతాంగనా సుందర కోమలాంగీ । శ్రీ విష్ణుపత్నీభువ నైకమా తా వధూ వరాభ్యాం వరదా భవంతు ।। సావధాన - సుముహూర్తా - సావధాన - శుభలగ్నే సావధాన శ్రీ లక్ష్మీనారాయణాభ్యాన్న సావధాన